కొప్పర్తి జనార్ధన్

Wikibooks నుండి

కొప్పర్తి జనార్ధన్ కవితలు

1: రిపబ్లిక్ డే

2: దినచర్య

3: నాడు నేడు

4: మంచి మనిషి

5: అమ్మ

6: రైతు

7: నేటి ఇల్లాలు .

8: పోరాటం.

9: సమస్యలు

10: చెప్పాలనుంది.

11: ముద్దుబిడ్డలం

12: శాంతి వర్ధిల్లాలి

13: పొదుపు

14: నీకోసం

15: యువత ఉద్యమించాలి

16: ప్రేమ

17: నాహృదయం

18: స్త్రీమూర్తి

19:నాయకులు

20: లోకంతీరు .

21: గాయపడిన మనసు

22: కల చెదిరింది

23: ఓటు

24:పాలకులు

25:నాన్న

26:అక్కినేని

27: జీవితం

28: బంద్

29: మనిషి

30: ఆకలి

31: విద్య

32: భార్య

33: జర్నలిస్టులు

34: స్వార్దంపెరిగింది

35: తప్పుకాదా !

36: నాటాలి మొక్కలు

37: తెలుసుకో

38: ఎన్టీఆర్

39: ఎన్నికలు

40: కాపాడుస్వామీ.

41: దేశాన్ని కాపాడాలి

42: నిరుద్యోగి

43: ఉత్తరo

44: ప్రేమ శాశ్వతం

45: ఎడబాటు

46: అక్షరాలు నేర్చుకో

47: నగ్న సత్యం

48: ఓటే ఆయుధం

49: తెలుగు నేల

50: అభ్యసిస్తున్నా.

51: ప్రేమపందెం

52: అక్షరాస్యత పెంచుతున్నారు.

1: రిపబ్లిక్ డే[మార్చు]

ఎందరో మహానుభావుల త్యాగం

మరెందరో మహాత్ముల త్యాగపలం

బ్రిటిష్ వాని తుపాకీ గుండును ఎదురొడ్డి

స్వాతంత్య్రమే మా జన్మహక్కని

వందేమాతరమంటు

దేశంకోసం ప్రాణాలర్పించిన

అమరవీరులకు జోహార్లు.

ఈనాడు మనం జరుపుకుంటున్న

రిపబ్లిక్ ఉత్సవాలు .

ప్రజా శ్రేయస్సు ధ్యేయంగా

పదవికాంక్షలేక

దేశంకోసం పనిచేసిన

అమరవీరులకు జోహార్లు

వారి త్యాగం మరువం

వారి స్పూర్తి విడవం.


2: దినచర్య[మార్చు]

ప్రభాత సమయాన

లేస్తాను నిద్ర

అప్పుడే మొదలవుతుంది

దేవుని మీద శ్రద్ద

కలలెన్నో కంటాను

అనునిత్యం

కలలు కల్లలుగా

మిగిలిపోకూడదని

కార్యరూపం దాల్చలనీ

వేడుకొంటాను

నా మొర ఆలకిస్తాడని

నిరాశను నిద్రపుచ్చి

ఆశతో రేపటి కోసం

ఎదురుచూస్తుంటాను

నేను

ఆశావాదని కనుక .

3. నాడు నేడు[మార్చు]

నాడు స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారు

నేడు అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు

నాడు ప్రజలకోసం పదవులు త్యాగంచేశారు

నేడు పదవులకోసం పార్టీలు మారుతున్నారు

నాడు ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించారు

నేడు పదవే పరమావధిగా జీవిస్తున్నారు

నాడు తెల్లవారు నల్లవారు అని కొట్టుకున్నారు

నేడు కులం మతం అని కొట్టుకుంటున్నారు

నాడు స్వరాజ్యం కోసం ఉద్యమాలు చేశారు

నేడు ఉద్యమాల పేరుతో ప్రజాధనం లూటీ చేస్తున్నారు

నాడు నాయకులు ప్రజా శ్రేయస్సు కాంక్షించారు

నేడు స్వలాభాపేక్ష కోసం పనిచేస్తున్నారు

నాడు పదవులకు వన్నె తెచ్చినారు

నేడు పదవుల కోసం ప్రాణాలను బలి పెడుతున్నారు

నాడు మంచి చెప్పేవాడిని మిత్రుడన్నారు

నేడు నీ మంచి మాటలు ఎవరికి కావాలంటున్నారు

నాటికీ నేటికీ ఎంతతేడా?

4. మంచి మనిషి[మార్చు]

5. అమ్మ[మార్చు]

మనకు జన్మ నిచ్చేది అమ్మ

అంగడిలో దొరకనిది అమ్మ

ఆప్యాయతను పంచేది అమ్మ

అనురాగాన్ని పంచేది అమ్మ

మొదటి గురువు అమ్మ

తాను పస్తులున్నా బిడ్డ కడుపునింపేది అమ్మ

ప్రేమతో దండించేది అమ్మ

మమతానురాగాలను పెంచేది అమ్మ

తనప్రాణం కన్నా మిన్నగా కాపాడేది అమ్మ

పరిచర్యలెన్నో చేసేది అమ్మ

ప్రయోజకులను చేసేది అమ్మ

తప్పటడుగులు , తప్పొప్పులు సరిదిద్దేది అమ్మ

జీవితకాలం మనక్షేమం కోరుకునేది అమ్మ

అవనిలోన దైవం అమ్మ

అవనికంతటికి వెలుగు మా అమ్మ.

6. రైతు[మార్చు]

దేశానికి వెన్నెముక రైతన్న

ప్రజల ఆకలి తీర్చేది నీవన్న

రేయి పగలు కష్టం నీదన్న

ఎండా వాన నీకు అడ్డురాదన్న

ధాన్యానికి గిట్టుబాటు ధర లేద్దన్న

నీ శ్రమను దళారీలు దొచేరన్న

ప్రకృతి బీబత్సం నీకు శాపామన్న

నకిలీ విత్తనాలు , నిన్ను నాశనం చేస్తాయన్న

ఎరువుల ధరలు నడ్డి విరస్తాయన్న

రెక్కలు ముక్కలు చేసుకొన్నా

నీ జీవితానికేది వెలుగన్న

అన్నదాతలను ఆదుకొనేదేవరన్న .

7: నేటి ఇల్లాలు[మార్చు]

పెళ్లంటే నూరేళ్ల పంటనీ

వివాహం జీవితానికి వరం అని

కన్నతల్లిదండ్రుల నొదలి

అన్నదమ్ముల అనురాగానోదలి

అక్కచెల్లెళ్ళ ఆప్యాయతను వదలి

చిన్ననాటి స్నేహితులనొదలి

అత్తింట అడుగుపెట్టిన

ఇంటిపేరు మార్చుకున్న

శ్రీమతి నేటి ఇల్లాలు .

భర్తను ప్రత్యక్ష దైవంగా భావించినా

అత్తమామలను తల్లిదండ్రులుగా భావించినా

చాలినంత కట్నం తెలేదనో

మగబిడ్డను కనలేదనో

అత్తింటిఆరళ్ళు భరించలేక

చీటికి మాటికి చీదరింపులు

పుట్టింటి వారికి చెప్పుకోలేక

చావలేక బ్రతకలేక

జీవచ్ఛవంలా బ్రతుకుతున్న

నేటి ఇల్లాలు.

8. పోరాటం[మార్చు]

పోరాటం

9: సమస్యలు[మార్చు]

గ్రామాలలో నీటి సమస్య

నిరుద్యోగులకు ఉపాధి సమస్య

పేదవారికి పట్టెడన్నం సమస్య

పట్టణాలలో భూ ఆక్రమణల సమస్య

ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి సమస్య

రైతుకు గిట్టుబాటు ధరలేక సమస్య

ఎక్కడ చూసినా సమస్య

సమస్యలు పరిష్కరిస్తామని పాలకుల మాట

అది ఎప్పటికీ అమలు కాని మాట .

అధికారం కోసం అసత్యాలు

అందలం ఎక్కడానికి చెప్పరు సత్యాలు .

పదవిలోకొచ్చకా ప్రజలను దోచుకోవడం

దేశం సుభిక్షం అని ప్రకటనలు

ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వం ఎందుకు?

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యo చేసేందుకా.

10. చెప్పాలనుంది[మార్చు]

స్నేహానికి విలువ లేదని

స్నేహితుడికి ద్రోహం చేస్తున్నారని

ధనంకోసం దగా చేస్తున్నారని

ధర్మంగా బ్రతకడం లేదని

అధర్మానికి పట్టంకడుతున్నారనీ

నీతికి నిలువ నీడలేదని

అవినీతికి ఆశ్రయమిస్తున్నారని

న్యాయాన్ని కాలరాస్తున్నారనీ

అన్యాయాన్ని ఆదరిస్తున్నారని

రక్షణనిలయం లో లాకప్ డెత్ లని

ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని

పదవుల కోసం బంద్ నిర్వహిస్తున్నారని

ప్రజల ఆస్తులు దోచుకుంటున్నారని

పేదలకు న్యాయం జరగడం లేదని

చెప్పాలనుంది వేదికనెక్కి చెప్పాలనుంది.

11: ముద్దుబిడ్డలం[మార్చు]

చేయీ చేయీ కలుపుదాం

చైతన్యంతో ముందడుగువేద్దాం

బానిస బ్రతుకును ఎదిరిద్దాం

సమస్యల కొరకు పోరాడుదాం

జాతి మతాలను వీడుదాo

జన్మభూమికి పేరుతెద్దాం

పేద ధనిక బేదాలు వీడుదాo

కుల వ్యవస్థను కూలగొడదాం

నవసమాజాన్ని నెలకొల్పుతాo

విభేదాలు విడనాడదాం

శాంతి కొరకు శ్రమిద్దాం

విద్రోహ శక్తులను తరిమికొడదాం

విజయాలను సాదిద్దాం

భారతదేశాన్ని బంగారు దేశంగా నిలుపుదాo

ప్రపంచం దేశాలలో పేరు తెద్దాం

భరతమాత ముద్దుబిడ్డలం అని గర్విద్దాం .

12. శాంతి వర్ధిల్లాలి[మార్చు]

ఏ దేశమైనా కోరాలి ప్రజల సౌక్యం

ప్రజలు లేనిదే ప్రభుత్వాలు లేవు

ఎందుకోసం ఈ యుద్ధం

ఎవరికొరకు ఈ రక్తపాతం

ఏమిటీ దారుణ మారణ హోమం

యుద్ధం మిగిల్చేది ప్రాణనష్టం

చరిత్రలో కాకూడదు అది ఘాతుకం

సంపద సర్వం హరించక ముందే

ధన, ప్రాణ, నష్టం జరగక ముందే

మెల్కోనాలి ఏ దేశమైనా .

అభివృద్ధికి ఆటంకం యుద్ధం

జగతికి వినాశనం యుద్దం

సమైక్యత దేశానికీ ఆవస్యం

శాంతిబాట దేశాల ప్రగతికి పూలబాట

శాంతినీ కాంక్షిద్దాం

శాంతికొరకు పాటుపడుదాం.

13. పొదుపు[మార్చు]

ప్రతి మనిషి సంపాదిస్తాడు డబ్బు

రేపటి భవిష్యత్ కోసం చేయాలి పొదుపు

పొదుపు ఖర్చులను చేస్తుంది అదుపు

అదుపులేని జీవితం అనర్ధకం

వడ్డీకిస్తే అసలుకే మోసం

మన జీవితానికి అదే పెద్ద శాపం

భద్రత, సౌలభ్యం కోసం బ్యాంకులో చేద్దాం పొదుపు

పిల్లల చదువు కోసం

పెళ్ళి సంబందాల కోసం

జీవిత రక్షణ కోసం

చేయాలి పొదుపు

పోస్ట్ఆఫిస్ లో చేయాలి పొదుపు .

14. నీ కోసం[మార్చు]

నీతో కలసి ఏడడుగులు నడవాలనుకొన్నా

నీతో కలసి జీవితంపంచుకోవాలనుకొన్నా

నీకోసం అయినవారి నెందరినో కాదనుకొంటున్నా

నీకోసం నా జీవితలక్ష్యం మార్చుకుంటున్నా

నీప్రేమకై పరితపిస్తున్నా

నీవెంట పిచ్చిపట్టి తిరుగుతున్నా

నీ ప్రేమ పూజారినీ .

నీవెప్పుడు కరునిస్తావో

నీ మనసులో నాకు ఎప్పుడు చోటిస్తావో

నీ నిర్ణయం కోసం వేచి చూస్తా

నీతో వివాహంకాకుంటే బ్రహ్మచారి గానే గడిపేస్తా.

15. యువత ఉద్యమించాలి[మార్చు]

నేటి సమాజంలో

దోపిడీలు, దొంగతనాలు ,

హత్యలు,ఆత్మహత్యలు

లూటీలు , దహనకాండలు

హింస, లంచగొండితనం

మతకలహాలు, మారణహోమాలు

పెచ్చుమీరి పోతున్నాయి నానాటికీ.

మంచితనం , మానవత్వం

నీతి,నిజాయితీ

అహింస, శాంతి

దయ, పరోపకారం

తరిగుపోతున్నాయీ నానాటికి .

ఇంగ్లీష్ చదువుల మోజులో

మాతృభాష కు మంగళం

విద్య కొనగలిగిన వారికే సొంతం

గుట్కా, గంజాయి వీధి వీధిలోదర్శనం

చీటింగ్ , బెట్టింగ్ నిత్యకృత్యం

సమాజ శ్రేయస్సుకై ఉద్యమించాలి

యువత మేల్కొనాలి .

16. ప్రేమ[మార్చు]

కర్తవ్యం నను మేల్కొలిపితే

ఆదర్శం ఊపిరి చేసుకొని

ప్రేమించి పెళ్లిచేసుకున్నా

చేసుకున్నాక తెలిసింది

కులరక్కసులెందరో

మన ప్రేమకు అడ్డుగొడలనీ .

ప్రశ్నిస్తే సంఘ బహిష్కరణ

ఆదర్శం అనే సంఘ సంస్కర్తలు ఎక్కడ?

వారు కంటికి కనపడరే ?

వారి మాటలు వినపడవే ?

మైకులకే పరిమితమా

ఈ సమాజం వెలివేయడమేమిటి ?

మనమే ఈ సమాజాన్ని బహిష్కరిద్దాo

కులమతాలు లేని

పేద, ధనిక తేడాలు లేని

నవసమాజం నిర్మిద్దాం .

17. నా హృదయం[మార్చు]

విద్యార్ది దశలో పరీక్ష తప్పితే

తట్టుకొంది నా హృదయం .

జీవితంలో వచ్చే సమస్యలను

ఎదుర్కొంది నా హృదయం .

ఒక్కరోజు వయోపరిమితి దాటిందని

ఉద్యోగం కోల్పోతే

తట్టుకొంది నా హృదయం.

యవ్వన దశలో బలవంతపు

వివాహాన్ని తట్టుకొంది నా హృదయం .

ప్రకృతి బీభత్సoతో సర్వం

కోల్పోయినా తట్టుకుంది నా హృదయం .

చిన్నతనంలో చేసిన చెలిమి

వదలి వెళ్లిపోతే తట్టుకోలేక

పోతుంది నా హృదయం .

స్నేహమంటే ప్రాణం

స్నేహముoటే ఆరో ప్రాణం.

18. స్త్రీమూర్తి[మార్చు]

నాడు కన్యాశుల్కం

నేడు వరకట్నం

నాడు సతీసహగమనం

నేడు బలవంతపు పెళ్ళిళ్ళు

దురాచారాలు దహించుకు పోలేదు

స్త్రీమూర్తి పై అఘాయిత్యాలు

స్త్రీలపై హత్యాచారాలు

స్త్రీలపై లైంగిక వేదింపులు

ఆరళ్ళు , అవహేళనలు

అమానుషం .

ఆడదీ అంటే అబల కాదు

ఆడదీ ఆక్రోసిస్తే సబల .

ఆడదే ఆధారం

ఆడదే ఆనందం .

19. నాయకులు[మార్చు]

ఎన్నికలోస్తున్నాయి

నాయకులు వస్తారు

సహపంక్తి భోజనాలు చేస్తారు

ఓటరు తో ఓపికగా మాట్లాడతారు .

అవినీతి లేని సమాజం కావాలన్న

నిరుద్యోగులకు ఉపాధి కావాలన్నా

కల్తీ మద్యం ఆపాలన్నా

కష్టాలు తీరాలన్నా

ధాన్యానికి గిట్టుబాటు ధర కావాలన్నా

నీతిమంతుడిని ఎన్నుకో

నిర్భయంగా ఓటేసుకో

నోటుకు ఓటు తెస్తుంది చేటు .

20. లోకంతీరు[మార్చు]

విద్యాధికుడై

మంచివాడై

పరోపకారిఐ

ప్రజాసేవకుడై

పరిపాలనా దక్షుడై

న్యాయానికి బద్దుడైన వానిని

గుర్తెంచదీ లోకం.

అవినీతి పరులను

అక్రమార్జన పరులను

దగాకోరులను

లంచగొండులను

గుర్తిస్తుంది లోకం.

ప్రతిభకు పట్టం కట్టండి

ప్రశాంతంగా జీవించండి.

ప్రజాక్షేమం కోరే వారిని ఎన్నుకోండి.

21. గాయపడిన మనసు[మార్చు]

మనిషికి గాయమైతే మందులున్నయి

కుట్ల్లు వేసైనా సర్జరీ చేసైనా

గాయం మాన్పగలరు డాక్టర్లు

విద్యార్థి పరీక్ష తప్పితే

మార్చి, సెప్టెంబర్,అవకాశాలున్నాయి

డబ్బు లేకుంటే సంపాదించుకోవచ్చు

అప్పులు తెచ్చి అవసరాలు గడపోచ్చు

నిరుద్యోగినీ ఉద్యోగిని చేయొచ్చు

వ్యాపారంలో నష్టం వస్తే ముగించొచ్చు

కొత్తవ్యాపారాన్ని తిరిగి ప్రారంభించ వచ్చు

కానీ

మనసుకు తగిలిన గాయం మానదు

గాయపడిన మనసుకు మందులే లేవు .

22. కల చెదిరింది[మార్చు]

నా జీవితం

వడ్డించిన విస్తరి కాదు

నడిచింది ముళ్ళబాట

చేసుకోవాలనుకున్నాను పూలబాట

నడచి వెళ్ళాను కాలేజీకి ఆనాడు

నడిచింది నేను కాదు నడిపించింది నీవు

విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చావు

పట్టభద్రుడ్ను చేశావు

పరోపకారిగా మిగిల్చావు

నన్నో మనిషిగా చేశావు

సమాజంలో నాకో స్థానం కల్పించావు

నా ఉన్నతిని చూసి ఆనందించావు

నీ సహచర్యం కోరితే

సరేనన్నావు , సంబరపడ్డాను

అంబరం అందినంత ఆనందించాను

విధివిచిత్రమో తలరాతో

మరదలితో మనువు చేశారు

మనసు చంపుకొని జీవిస్తున్నా

మనిషిగా బ్రతకలేకున్నా

ఈ తనువు నీది

ఈ హోదా నీది

నీవు పెట్టిన బిక్షే ఈ జీవితం

నీ మదిలో ఆరని జ్వాలలు రగిల్చి

తీరని వ్యదని మిగిల్చి

జీవించలేకున్నా .

నా ద్రోహం మరపురానిదైనా

నీ స్నేహం వెలకట్టలేనిది .

నీ జ్ఞాపకాలు నన్ను దహింప చేస్తున్నాయి

నా కలల సౌదాలను కూల్చివేస్తున్నాయి .

23. ఓటు.[మార్చు]

పనిచేసే వారికి వేయాలి ఓటు

ప్రగతి నిరోధకులకు ఇవ్వరాదు చోటు

చెప్పింది చేసేవారికి వేయాలి ఓటు

కోతలరాయుల్లకివ్వకు చోటు

సమర్డుడికి అధికారం ఇవ్వు

అభివృద్ధి కి అగ్రస్థానం ఇవ్వు

ప్రజాహితం కొరేవారికి వేయాలి ఓటు

పార్టీలను చూసి వేయకు ఓటు

కులం, మతం చూసి వేయకు ఓటు

24. పాలకులు[మార్చు]

పాలకులు చేశారు మన రాష్ట్రాన్ని పేలికలు

పదవుల కాంక్షతో వేశారు పాచికలు

విభజన వద్దని మొత్తుకున్నా

భజన చేసేవారు ముద్దు అని హత్తుకున్నా

తెలుగు నేలను చీల్చారు

తెలుగు తల్లిని విభజించారు

అన్నదమ్ముల మధ్య ఆక్రోశం పెంచారు

తెలుగుతల్లి బిడ్డలను అనాధలను చేశారు

ఓట్ల కోసం ప్రజల పాట్లు మరచారు

సీట్ల కోసం రాష్ట్రాన్ని వేరుచేశారు

సుపరిపాలన అందించలేక

స్వపరిపాలన పెంచుకోన్నారు

పదవుల కోసమే ప్రభుత్వాలా!

ప్రజల కోసం పాటుపడవా!

ప్రజాస్తేయస్సు కోరని ప్రభుత్వాలు

ప్రజాగ్రహానికి గురియవుతాయి .

25. నాన్న[మార్చు]

వేలు పట్టుకుని నడిపించింది నాన్న

విద్యాబోధన చేసింది నాన్న

భవిష్యత్తు అందంగా తీర్చింది నాన్న

మంచి చెడు బోధించింది నాన్న

మంచిదారిలో నడిపించింది నాన్న

మానవత్వం నేర్పింది నాన్న

పగటి కలలు మాని , ప్రతిభావంతుడు గా తీర్చింది నాన్న

ఉన్నత శిఖరాలు చేర్చింది నాన్న

ఉత్తమ విలువలు నేర్పింది నాన్న

కనిపించే దేవుడే నాన్న

కని పెంచే దేవుడే నాన్న

నా భవిష్యత్ కు మార్గదర్శి మా నాన్న .

26. అక్కినేని.[మార్చు]

"రైతు కుటుంబం" నుంచి వచ్చిన "అన్నదాత"

"బీదలపాట్ల్లు" తెలిసిన" శ్రీమంతుడు "

"కన్నతల్లి"పున్నమ్మ"కన్నకొడుకు"

"ధర్మపత్ని" నీ "సుమంగళి"గా చూసిన

"బుద్దిమంతుడు" "ధర్మదాత"

"డాక్టరు చక్రవర్తి " ఈ "దసరా బుల్లోడు"

"అందాల రాముడు" ,"మంచివాడు", ఈ "దొరబాబు"

"ఆత్మీయుడు" , "ఆదర్శ వంతుడు" ఈ "యువరాజు"

"చక్రపాణి" గా కనిపించినా

"దేవదాసు" గా మెప్పించినా


"పిల్ల జమిందార్" గా నటించాడు ఈ

"చుక్కల్లో చంద్రుడు".

"విప్రనారాయణ" గా "చక్రధారి" గా

భక్తి చిత్రాలలో" జయభేరి" మ్రోగించాడు .

"ప్రేమ"తో "సంసారం" సాగించినా

"సంతానం"కోసం "సిరిసంపదలు"

కూడబెట్టిన "జమిందార్"

"సుపుత్రుడు" ను తెరకు

పరిచయం చేసిన"బంగారు బాబు"

"పల్లెటూరి పిల్ల "కాకపోయినా

"స్వప్నసుందరి"

"పరదేశి"అమ్మాయీ నీ కొడుకు ప్రేమిస్తే

"కొడుకు కోడలు" పై "అభిమానం"

పెంచుకొని "ఆలుమగలు"ను చేసి

"భార్యాభర్తల బంధం" ను

"పవిత్ర బంధం" గా మార్చిన

"మరపురాని మనిషి"

"ప్రేమనగర్" లాంటి స్టూడియో కట్టించినా

"ప్రేమమందిరం" లాంటి "ఏడంతస్తుల మేడ"లో

నివసించిన "కోటీశ్వరుడు"

"వెలుగు నీడలు"చవిచూసిన ,

"మంచి మనసులు" కు" మంచిరోజులు వచ్చాయి"

అనే"నమ్మినబంటు"ఈ"మురళీ కృష్ణ"

"ప్రాణదాత" కాకున్నా విద్యాదాత

ఈ"కాలేజ్ బుల్లోడు"

"మనం"కళామతల్లి ముద్దుబిడ్డలం అనే

చెప్పే అక్కినేని తెరపై కనిపిస్తే ప్రేక్షకులకు "పండగ"

చిత్రసీమలో ఎన్నో విజయాలు సొంతం

ఈ "బహుదూరపు బాటసారి "కి .

27: జీవితం[మార్చు]

నీ జీవితం

వడ్డించిన విస్తరైనా

పూలబాట అయినా

ముళ్లబాట అయినా

నడవాలి ధర్మంగా

బ్రతకాలి మంచిగా

పోరాడాలి న్యాయం కోసం

పరులకు ఆదర్శంగా

రూపుమాపాలి దురాచారాలను

అరికట్టాలి సంఘ విద్రోహులను

ప్రోత్సహించాలి ప్రతిభను

గౌరవించాలి మన చట్టాలను

కాపాడాలి దేశ సంపదను

త్యాగాలు చెయాలి దేశంకోసం

ప్రతిన పూనాలి ఆశయాల కొరకు

అప్పుడే నీ జీవితం సుఖమయం.

కన్నవారి జీవితం సార్ధకం.

28. బంద్[మార్చు]

చీటికి మాటికి పిలుపులు

పార్టీల బలాలను నిరూపించుకోవడానికి

వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి

బందుల పేరుతో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికి

ప్రజల సొత్తు లూటీ చేయడానికి

నిర్వహిస్తున్నారు బందులు

రెక్కాడితే కానీ డొక్కాడని పేదలను

పస్తుల పాలు చేస్తున్నారు

అప్పుల ఊబిలోకి నెడుతున్నారు

అవస్తలపాలు చేస్తున్నారు

పేదవారినీ నిరుపేదలను చేస్తున్నారు

సమస్యకు పరిష్కారం సామరస్యం

ప్రజలలో రావాలి చైతన్యం

అప్పుడే బంద్ లు బంద్ .

29. మనిషి[మార్చు]

ఆశయాల కోసం జీవించాలి మనిషి

ఆశల కోసం జీవించనీ వాడే మనిషి

ఉన్నదానితో సంతృప్తి పడే వాడే మనిషి


ఎదుటివారి సుఖం కొరేవాడే మనిషి

తన స్వార్థం త్యాగం చేసేవాడే మనిషి

పరుల క్షేమం కాంక్షించేవాడే మనిషి

సద్గుణాలు కలవాడే మనిషి

సద్బోదనలు చేసేవాడే మనిషి

అహం చూపని వాడే మనిషి

అహోరాత్రులు శ్రమించేవాడే మనిషి

అపకారికీ ఉపకారం చేసేవాడే మనిషి

ఆపదలో నేనున్నాననేవాడే మనిషి

ఎదుటివారి కష్టనష్టాల లో పాలు పంచుకోనేవాడే మనిషి

సంపదను కొంత పంచేవాడే మనిషి

మంచిపనిలో చేయూతనిచ్చేవాడే మనిషి

పదిమందిలో ప్రత్యేకత కోరుకోనివాడే మంచి మనిషి

సమాజహితం కోరేవాడే మనిషి

మంచిమనిషి .

30. ఆకలి[మార్చు]

మంచిరోజులు వచ్చాయా?

స్వాతంత్య్రం వచ్చింది

రోజులు మారాయి

తెల్లదొరలు పోయారు

నల్లదొరలు వచ్చారు

నాయకులయ్యారు

ప్రభుత్వాలు మారాయి

పట్టెడన్నం కరువైంది

ఆకలి భాధలు తాళలేక ఆత్మహత్యలే శరణ్యo

నిన్న ప్రత్తి రైతులు ,చేనేత కార్మికులు

నేడు వ్యవసాయ కూలీలు

ప్రభుత్వాలు ఆకలి కేకలు అరికడతామంటారు

పేదరికం రూపుమాపడానికి పధకాలంటారు

ఆత్మహత్యలను లెక్కిస్తున్నారు

నాయకులు అక్రమార్జన పెంచేస్తున్నారు

అవినీతికి ఆశ్రయ మిస్తున్నారు

పేదవాడి బ్రతుకులో మార్పు శూన్యం

ఆకలి కేకలు అనంతం.

ఈ పరిస్థితి మారెది ఎప్పుడో?

31: విద్య[మార్చు]

విద్య లేని వారు వింత పశువు అన్నారు

విజ్ఞానం కన్న ఏది మిన్న

చదువు నందు ఉన్నది గొప్పదనమన్న

విద్య వినయమును పెంచునన్న

వినయం జీవితానికి బాటరోరన్న

క్రమశిక్షణ మనిషికి ముఖ్యమన్న

విద్యలేనీదే క్రమశిక్షణ రాదన్న

ఏ దేశమందున్నా కావాలి విద్యయన్న

జ్ఞానం జీవిత కాలం రక్షణ రొరన్న

చదువుకొనుట ఒక వరం

చదువు సకల సంపదలకు మూలం.

చదువు శాశ్వతం

చదువు నిత్యం

చదువే వెలుగు .

32: భార్య[మార్చు]

కష్టాలలో , కన్నీళ్లలో

సుఖ దుఃఖాలలో

తోడుగా, నీడగా

వెన్నంటి ఉండేదే భార్య .

దాసిగా సేవలు చేసేది

మిత్రునిగా సలహాలిచ్చేది భార్య

అపజయాలకు వెన్నుతట్టి దైర్యం చెప్పేది భార్య

ఆనందం పెంచేది భార్య

ఆనందం పంచేది భార్య

విజయాలకు దారి చూపేది భార్య

వ్యసనాలను రూపుమాపేది భార్య

విమర్శకుడిగా తప్పొప్పులు చూపేది భార్య

అమ్మ నాన్నను ఆదరించేది భార్య

అక్కాచెల్లెళ్లను అక్కున చేర్చుకొనేది భార్య

అన్నదమ్ములతో సఖ్యత పెంచేది భార్య

పిల్లల కోసం పరితపించేది భార్య

తనకంటే ముందు మరణం కోరుకునేది భార్య

సుమంగళిగా జీవించాలని కోరుకునేది భార్య.

33: జర్నలిస్టులు [మార్చు]

నిజాన్ని నిర్భయంగా

వ్రాయగలిగిన వారే జర్నలిస్టులు .

ఉన్నదిఉన్నట్టుగా

చూసింది చూసినట్టుగా

జరిగింది జరిగినట్టుగా

విన్నది విన్నట్టుగా

కళ్లకు కట్టినట్టు చూపేవారు

అసలైన జర్నలిస్టులు .

ప్రజాసమస్యలు పరిష్కారం కోసం

ప్రభుత్వ పనితీరుని ఎండగట్టడానికి

ఎవరి బెదిరింపులకు లొంగక

ఎవరి ప్రాపకంకోసం ప్రాకులాడక

నిజాయితీకి నిలువుటద్దంగా

న్యాయానికి వారసులుగా

జీవనం గడిపేవారే జర్నలిస్టులు .

వార్తల సేకరణ కోసంతిరుగుతూ

అందరికీ న్యాయం జరిగేలా

ప్రయత్నం చేసే వారే జర్నలిస్టులు

విజ్ఞానం , వినోదం అందించేవారు

జర్నలిస్టులు .

34. స్వార్థం పెరిగింది[మార్చు]

స్వాతంత్య్రం మనజన్మ హక్కని

పోరాటం ఊపిరిగా

స్వాతంత్రము సాధించారు

మన పూర్వీకులు .

తుద ముట్టించారు పరాయి పాలన

ఎగురవేశారు విజయకేతనం .

స్వాతంత్య్రం వచ్చింది

స్వార్థం పెరిగింది

పేదరికం పెరిగింది

కుటుంబ పాలనలో

అక్రమాలు పెరిగాయి

అవినీతి తాండవించిది .

విభేదాలతో పార్టీల సంఖ్య పెరిగాయి

నాయకుల ఆస్తులు పెరిగాయి

స్వాతంత్య్రం వచ్చింది

స్వార్థం పెంచింది .

35. తప్పుకాదా![మార్చు]

కటిక పేదవాడు

కడుపు మంట తాళలేక

ఆకలి దప్పులు తీరక

పట్టెడన్నం కరువై

దొంగతనం చేస్తే

కరిన శిక్షలేసి

కనికరం చూపక

కసాయితనం ప్రదర్శించి

కటకటాలలో వేస్తారు .

కోట్లకు పడగలేత్తిన కుబేరులు

కుంభకోణాలు చేసినా

పేదల భూములు ఆక్రమించినా

కోట్లలో పన్ను ఎగవేసినా

పెద్దవారిని కాపాడుతుంది.

పేదకో న్యాయం

పెత్తందారులకో న్యాయం .

చట్టాలనేవి తప్పు చేసినవారిని శిక్షించడానికే కదా!

పెద్దలను రక్షించి , పేదలను శిక్షించడానికా!

మారాలి ఈ తీరు .

చట్టం ముందు అందరూ సమానులే

తప్పు ఎవరు చేసినా తప్పే.

36. నాటాలి మొక్కలు[మార్చు]

ఇంటింటా నాటాలి మొక్కలు

పెరిగితే అవుతాయి వృక్షాలు

పచ్చదనానికి అవి ప్రతీకలు

కాలుష్యానికి అవి నిరోదకలు

నీడ నిచ్చును, సేద తీర్చును

రంగు రంగుల పూలనిచ్చును

ఆక్సిజన్ అందించును

ఆరోగ్యానికి సహకరించును

పచ్చదనం పరిఢవిల్లితే

ప్రకృతి పులకరించును

నాటాలి ప్రతి ఒక్కరు మొక్క

కావాలి అది జగతికి రక్ష.

37: తెలుసుకో[మార్చు]

విలువలు లేని జీవితం

వలువలు లేని జీవనం వృధా

అన్యాయాన్ని అణగదొక్కని జీవితం

న్యాయానికి అండగా నిలవని జీవితం వృథా

కోట్లు సంపాదించినా

దానగుణం లేని జీవితం వృధా

కన్నవారి కడుపు నింపనివాడు

కాశీలో అన్నదానం చేసినా వృథా

కల్తీ సరుకులు అమ్మి కూడబెట్టినా

కనికరం లేని జీవితం వృధా

అధికారం కోసం అడ్డదారులు తొక్కినా

అవినీతి సొమ్ముతో పదవి పొందడం వృథా

నిరుద్యోగి వైనా నీతి మానకు

చిరుద్యోగివైనా చిరునవ్వు మరువకు

శ్రమను నమ్ముకో

శ్రమించడం మానకు

మానవత్వం పెంపొందించు

మంచి మనిషిగా జీవించు .

38: ఎన్టీఆర్.[మార్చు]

"మనదేశం" తో చిత్రరంగ ప్రవేశం

"పల్లెటూరు "నుండి వచ్చిన "పల్లెటూరి చిన్నోడు"

"సొంతవూరు"లో "కాడెద్దులు ఎకరం నేల "

సాగుచేసుకోక

"అప్పుచేసి పప్పు కూడు "తినక

"ఉమ్మడి కుటుంబం" లో "తల్లి ప్రేమ"కు దూరంగా

మా "రాము" చేయక "విజయం మనదే"అని

విచిత్ర సీమలో అడుగుపెట్టిన "రైతుబిడ్డ".

"మగాడు" "బంగారు మనిషి" "సాహసవంతుడు "

"సింహబలుడు""నిప్పులాంటి మనిషి"

"సంకల్పం"కు"దైవబలం" తోడై

"వద్దంటే డబ్బు"సంపాదించిన "టాక్సీరాముడు"

"సర్కస్ రాముడు" "సరదా రాముడు"

"శభాష్ రాముడు"గా మన్ననలను పొందిన

"లక్షాధికారి"

"మంచిచెడూ"తెలిసిన "మంచిమనిషి"

"పల్లెటూరిపిల్ల"తో" వివాహ బంధం" ఏర్పరుచుకున్న

"కధానాయకుడు" ఈ "మేజర్ చంద్రకాంత్"

"ఇంటిగుట్టు" "కులగౌరవం" "పరువు ప్రతిష్ట"

కాపాడేది ," ఇంటికి దీపం ఇల్లాలే" అని

"ఆడబ్రతుకు" "మంగళసూత్రం" కోరుకొనే

*దేవత" అని అంటాడీ "మహాపురుషుడు".

"అన్నాతమ్ముడు " కలసి చిత్ర నిర్మాణం చేపట్టి

"వరకట్నం" "చండశాసనుడు " "బ్రంహర్షి విశ్వామిత్ర"

"దాన వీర శూర కర్ణ" తీసిన "ఎదురులేని మనిషి"

పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరుగా

"భుకైలాశ్" "శ్రీ వేంకటేశ్వర మహత్యము"

"సీతారామ కళ్యాణం" "శ్రీకృష్ణార్జున యుద్దం"

"లవకుశ"లలో దైవత్వం ఉట్టి పడే పాత్రలలో

"విశ్వరూపం" చూపిన "యుగపురుషుడు"

కృష్ణుడైనా, రాముడైనా,ఆదిదేవుడైనా

"మాదైవం" నీవే అని కీర్తీ నొందినాడు

"బడిపంతులు" "ఆటగాడు" "వేటగాడు"

"సర్దార్ పాపారాయుడు" "జస్టిస్ చౌదరి"

"వేములవాడ భీమకవి" "శ్రీనాథ కవిసార్వభౌముడు" గా

తనకు తానే సాటి.లేరేవరు పోటీ .

"వారసత్వం" ను తెరకు పరిచయంచేస్తూ

"తల్లా పెళ్ళామా" తాతమ్మ కల" తీసిన "డాక్టర్ ఆనంద్"

"ఆప్త మిత్రులు" " ఇరుగు పొరుగు" "ఆప్తబంధువులు" కు

సేవ చేయడానికి "నాదేశం" అంటూ"బొబ్బిలి పులి"లా

గాండ్రిస్తూ రాజకీయ ఆరంగేట్రం చేసిన "అదృష్ట జాతకుడు"

"పెత్తందార్లు" పాలనకు చరమగీతం పాడి

ప్రత్యర్థుల "కంచుకోట" ను బ్రద్దలు కొట్టిన

"తిరుగులేని మనిషి"

"నిన్నే పెళ్తాడతా" అని "ఇద్దరు పెళ్ళాలు" తో

"సంసారం" సాగించిన "పిచ్చి పుల్లయ్య"

"రక్తసంబంధం" కాకపోయినా ఆంధ్రుల అభిమాన అన్న

ఎన్టీఆర్ .

"మంచి మనసుకు మంచిరోజులు" ఎప్పుడూ..

"మనుషులంతా ఒక్కటే" అని "సంతోషం"తో

"జయం మనదే" అంటూ ... తెలుగు వారి

"మేలుకొలుపు"కోరుతూ సాగిపోయాడు ఎన్టీఆర్ .

39: ఎన్నికలు.[మార్చు]

వచ్చేశాయి ఎన్నికలు

నెరవేరాలి ఎన్నోకలలు

సుపరిపాలన ఓటరు కల

రామరాజ్యం వస్తుందని ఓటరు కల

తను, తమపార్టీ గెలవాలని కొందరి కల

ప్రత్యర్థి గెలవకూడదని మరి కొందరి కల

అధికారం అందాలని కొందరి కల

అధికారం శాశ్వతం కావాలని స్వపక్షం కల

ఎవరికల నెరవేరుతుందో చూడాలి

ఎవరి కలలు తారుమారు అవుతాయో తెలియాలి

ఏ అభ్యర్థి గెలిచినా ఓటరుకు ఓటమి తప్పదు.

40: కాపాడు స్వామి[మార్చు]

నీ రూపము చూసి తరించడానికి "కళ్లు" ఇచ్చావు

నీ లీలలు చెప్పడానికి "స్వర"మిచ్చావు

నీ మహిమలు రాయడానికి "కరము"లిచ్చావు

నీ కొండకు నడచి రావడానికి "కాళ్లు" ఇచ్చావు

నీ కీర్తనలు వినడానికి "చెవు"లిచ్చావు

నీ ముందు" శిరస్సు"వంచడానికి "తల"నిచ్చావు

నీకు సమర్పించడానికి "తలనీలాలు"ఇచ్చావు

నీ భజన చేయడానికి "చేతులు"ఇచ్చావు

నీకు సాష్టాంగ నమస్కారం చేయడానికి "దేహం"ఇచ్చావు

నిను చూసే సంకల్పo ఇవ్వు

నీ దర్శనభాగ్యం కల్పించి కాపాడుస్వామీ.

41: దేశాన్ని కాపాడాలి[మార్చు]

కులం మతం

ప్రాంతీయ తత్వం

భాషా భేదం

సృష్టించి

మతకలహాలు

రెచ్చగొట్టి

అల్లర్లు సృష్టించి

దేశాన్ని విచ్చినకరం

చేయాలని శత్రుదేశాలు

పొంచి ఉన్నాయి

అల్లర్లు అదుపుచేయడానికి

ఆర్మీ జవాన్లు

అనుక్షణం పహారా కాస్తూ

రక్షణ కల్పిస్తున్నారు.

మీ వెంట మేమున్నాం

విచ్ఛిన్నకర శక్తులపై విజృంభిద్దాం

ప్రాణత్యాగానికి సిద్ధమై నిలుద్దాo

దేశరక్షణలో మేము సైతం

అని నినదిద్దాo .

మన సంఘీభావం తెలుపుదాం .

42: నిరుద్యోగి[మార్చు]

విద్యార్ది దశలో

వినోదాలు మాని

రాత్రనక పగలనక

చదివి ర్యాంకులు సాధిస్తే

డిగ్రీ చేతికొచ్చి

ఉద్యోగ వేటలో పడ్డాను .

అప్లయ్ చేశాను

అర్హతగల ఉద్యోగాలకు

నిరాశ మిగిలింది


రేకమండేషన్ లేనిదే

లంచమివ్వనిదే

ఉద్యోగం రాదని తెలిసి

చిరుఉద్యోగం సంపాదించలేక

తిరుగుతున్నాను రోడ్లవెంట .

ప్రతిభకు లేదు ప్రాధాన్యత

పచ్చనొట్ల కు కలదు విలువ ప్రపంచమంతా .

43: ఉత్తరం[మార్చు]

ఒంటరి మనిషికి

తోడుగా నీడగా

హృదయ వేదనను తీర్చి ,

క్షేమ సమాచారాలు

తెలియచేస్తూ వారి అభిమానాన్ని

తెలుపుతూ

ఆత్మీయులుకు అండగా

ప్రేమికులకు పల్లకీగా

మనసులోని వ్యధను

నిరాశలోనీ నిట్టూర్పును

బహిర్గతం చేసేది ఉత్తరo.

గడచిన రోజులలో ఉత్తరం తేచ్చే

సందేశం కోసం రోజుల తరబడి నిరీక్షణ.


ఉత్తరం వస్తే ఉద్యోగం వస్తుంది

ఉత్తరం వస్తే సంతోషం వస్తుంది

ఉత్తరం వస్తే నిరీక్షణ ఫలిస్తుంది .

44: ప్రేమ శాశ్వతం .[మార్చు]

పవిత్రమైనది తల్లి ప్రేమ

ఎల్లలులేనిది అమ్మ ప్రేమ

నిస్వార్థమైనది అమ్మ ప్రేమ

కలకాలం నిలిచేది

చిరకాలం తరగనిది

మరపురానిది

మధురమైనది

వెల కట్టలేనిది

అమ్మ ప్రేమ

అమ్మ ప్రేమ అనంతం

అమ్మ ప్రేమ నిరంతరం

అమ్మ ప్రేమ శాశ్వతం

అమ్మ ప్రేమ నిత్యం

అమ్మ ప్రేమ సత్యం

అమ్మ ప్రత్యక్ష దైవం.

45: ఎడబాటు .[మార్చు]

చేసుకున్నాం బాసలెన్నో

చెప్పుకున్నాం ఊసులెన్నో

చెట్టా పట్టా లేసుకు తిరిగాం

చింతలు లేక బ్రతకాలనుకున్నాం

ఒకరికొకరు కావాలనుకున్నాo

ఒకరిని వదలి ఒకరు ఉండలేమనుకున్నాo

మనసులు కలిశాయి

మనువులు మిగిలాయి

జీవితం గురించి ఎన్నో కలలు కన్నాo

కలలు కన్న కళ్ళకు కన్నీరు మిగిల్చి

చేసుకొన్న బాసలు మరచి

ఎడబాటును శాశ్వతం చేసి

వ్యధను రగిల్చి

మన ప్రేమకథకు మంగళంపల్కి

మరో పెళ్లికి సిద్ధమయ్యారు మీరు

ప్రేమంటే నాకు ప్రాణం

పెళ్లంటే నీకు ప్రాణం.

46: అక్షరాలు నేర్చుకో[మార్చు]

పలకా బలపం పట్టుకో

పండితుడిని కలుసుకో

అక్షరాలు నేర్చుకో

అజ్ఞానం తొలగించుకో

విద్య విలువ తెలుసుకో

విజ్ఞానం పెంచుకో

వేలిముద్ర మానుకో

సంతకం నేర్చుకో

అంధకారం తరిమేసుకో

పత్రికలు చదువుకో

ప్రభుత్వ పథకాలు తెలుసుకో

పొదుపు చేయడం నేర్చుకో

ప్రగతి దిశగా అడుగులేసుకో

అక్షరాసుడిగా ఆనందo పెంచుకో.

47: నగ్నసత్యం.[మార్చు]

సాగరమైనా ఈదవచ్చు

సంసారం మాత్రం ఈదలేము

పెళ్లి లేకుండా సంతోషంగా జీవించగలం

పెళ్లి చేసుకుని సుఖంగా జీవించలేం

తల్లిలా ఎవరైనా ఆదరించగలరు

కన్నతల్లిలా ప్రేమను పంచలేరు

ఒక తల్లి నలుగురు బిడ్డలను పెంచగలదు

నలుగురు బిడ్డలు కలిసి తల్లిని పెంచలేరు .

ఎంత సంపాదించినా బంగారం తిని బ్రతకలేము

అర్హులకు అవకాశం ఇవ్వరు

అబద్ధాలకు కొలమానం లేదు

కోటి విద్యలు కోట్ల కొరకే

వేల కోట్లు ఉన్నా నూరేళ్ళు బ్రతుకలేము .

48: ఓటే ఆయుధం .[మార్చు]

రాజ్యాంగం కల్పించిన హక్కుఓటు

పవిత్రమైన ఓటు


కాసులకు కక్కుర్తిపడి వేయరాదు ఓటు

కులం మతం చూసి వేయరాదు ఓటు

ప్రాంతం , పరిచయం , చూసి వేయరాదు ఓటు

మద్యంకు బానిసై వేయరాదు ఓటు

నోటు తీసుకొని వేయరాదు ఓటు

తాయిలాలకు తలఊపి వేయరాదు ఓటు

ప్రయోజనాలు ఆశించి వేయరాదు ఓటు

ప్రజాశ్రేయస్సూ కోరి వేయాలి ఓటు

నిస్వార్థంగా వేయాలి ఓటు

న్యాయబద్దంగా వేయాలి ఓటు

మనం వేసే ఓటు దేశ ప్రగతికి రూటు

మనం వేసే ఓటు అవినీతిపరుల పాలిట వేటు

49: తెలుగు నేల[మార్చు]

తెలుగు తల్లి బిడ్డలం

తెలుగు మాట్లాడే అన్నదమ్ములం

తెలుగంటే వెలుగు

తెలుగు భాష తేనె కన్నా తియ్యన

తెలుగు వారి మాట అమృతంకంటే తియ్యన

తెలుగు సంసృతి అంటే వేదాలకు పుట్టిల్లు

తెలుగు వారు అంటే తెలివికలవారు

తెలుగు అంటే విజ్ఞానం

తెలుగు అంటే వివేకం

తెలుగు అంటే మమతానురాగాo

తెలుగు అంటే వ్యాకరణం

తెలుగు అంటే కవిత్వం

తెలుగు అంటే పద్యం

తెలుగు అంటే భాషలలో తలమానికం .

50: అభ్యసిస్తున్నా.[మార్చు]

ఆడే పాడే వయసులో

బడి కెళ్ళక

బాధ్యత తెలియక

చదువును నిర్లక్ష్యం చేసి

అల్లరి చిల్లరగా తిరిగీ

బడి మానుకోన్నా .

బంగారు లాంటి జీవితాన్ని

ముళ్లబాట చేసుకొని

బ్రతుకుదెరువు కోసం

భాగస్వామ్యం వ్యాపారంలో చేరితే

వేలిముద్ర గాడినని

విద్యలేని వింత పశువునని

తూలనాడి

అంకెల గారడీతో

వ్యాపారంలో నష్టం చూపించి

వెన్నుపోటు పొడిచారు .

విధిరాత , తలరాత కాదని

చదువులేక, చేతిరాత రాక

అని గ్రహించి

మూడు పదుల వయసు లో

విద్యనభ్యసించడానికి

అక్షరాలు నేర్వడానికి

వయోజన విద్యా కేంద్రాలకు

వెడుతున్నా.

దీక్ష పట్టి చదువుతున్నా

చదువుల తల్లినీ మా ఇంటికి ఆహ్వానిస్తున్నా

సగర్వంగా విద్యను అభ్యసిస్తున్నా.

51: ప్రేమ పందెం[మార్చు]

నేను ప్రేమించలేదని తెలిసి

నన్ను ప్రేమించావు

భయపెట్టి భంగపడి

ప్రేమించేలా బాదించేవు

పందెం కాచి గెలిచాననీ

సంబరపడ్డావు

జీవితం అంటే ఆట కాదని

పెళ్లంటే నూరేళ్ల పంట అని

తెలుసుకోలేకున్నావు

సంసారం అంటే సాగరమని

ఈదడం అంత తేలిక కాదని

తెలుసుకోక పందెం కాశావు

ప్రేమ బంధానికి

పెళ్లి అనుబంధానికి

భార్యాభర్తల బంధం కు

అర్దం లేకుండా విడాకు నోటీస్ పంపావు .

ఇప్పటికైనా తెలుసుకో

నీ మనసు మార్చుకో

నోటీస్ వాపస్ తీసుకో

ఆడపిల్ల జీవితం అరిటాకు లాంటిది

ముల్లు పోయి ఆకును తగిలినా

ఆకు వచ్చి ముల్లుపై పడినా

జరిగే నష్టం అతివకే .

నేను ప్రేమించి మోసం చేసినా

నువ్వు ప్రేమించి విడాకులు కోరినా

జరిగే నష్టం మనిద్దరికీ కాదు

నీకే అని తెలుసుకో

పందెం గెలిచావని అనుకోకు

జీవితంలో ఒడినట్లే లెక్క తెలుసుకో

52: అక్షరాస్యత పెంచుతున్నారు[మార్చు]

ప్రతి ఒక్కరినీ విద్యావంతులున్ని చేయాలని

ప్రతి ఇంటిని సరస్వతి నిలయం చేయాలని

ప్రభుత్వం సంకల్పించింది

విద్య ప్రయోజనం వివరించింది

రాత్రి పాఠశాలలు ప్రారంభించింది

పగలు పనీపాట చేసుకొన్నా

రాత్రి పాఠశాలలో చదువుకోవచ్చు

అక్షరాలు నేర్పాలని

అంధకారం తొలగించాలని

ప్రయోజకులను చేయాలని

ప్రభుత్వం పాటుపడుతుంది

చదువుకుందాం

విజ్ఞానం పెంచుకొందాం

మన గ్రామాన్ని చదువులమయం చేద్దాం

ప్రపంచ దేశాలలో పేరు తెద్దాం .

























.