ప్రేమ
స్వరూపం
కర్తవ్యం నను మేల్కొలిపితే
ఆదర్శం ఊపిరి చేసుకొని
ప్రేమించి పెళ్లిచేసుకున్నా
చేసుకున్నాక తెలిసింది
కులరక్కసులెందరో
మన ప్రేమకు అడ్డుగొడలనీ .
ప్రశ్నిస్తే సంఘ బహిష్కరణ
ఆదర్శం అనే సంఘ సంస్కర్తలు ఎక్కడ?
వారు కంటికి కనపడరే ?
వారి మాటలు వినపడవే ?
మైకులకే పరిమితమా
ఈ సమాజం వెలివేయడమేమిటి ?
మనమే ఈ సమాజాన్ని బహిష్కరిద్దాo
కులమతాలు లేని
పేద, ధనిక తేడాలు లేని
నవసమాజం నిర్మిద్దాం .