స్వార్థం పెరిగింది
స్వరూపం
34. స్వార్థం పెరిగింది
[మార్చు]స్వాతంత్య్రం మనజన్మ హక్కని
పోరాటం ఊపిరిగా
స్వాతంత్రము సాధించారు
మన పూర్వీకులు .
తుద ముట్టించారు పరాయి పాలన
ఎగురవేశారు విజయకేతనం .
స్వాతంత్య్రం వచ్చింది
స్వార్థం పెరిగింది
పేదరికం పెరిగింది
కుటుంబ పాలనలో
అక్రమాలు పెరిగాయి
అవినీతి తాండవించిది .
విభేదాలతో పార్టీల సంఖ్య పెరిగాయి
నాయకుల ఆస్తులు పెరిగాయి
స్వాతంత్య్రం వచ్చింది
స్వార్థం పెంచింది .