అభ్యసిస్తున్నా
స్వరూపం
50: అభ్యసిస్తున్నా.
[మార్చు]ఆడే పాడే వయసులో
బడి కెళ్ళక
బాధ్యత తెలియక
చదువును నిర్లక్ష్యం చేసి
అల్లరి చిల్లరగా తిరిగీ
బడి మానుకోన్నా .
బంగారు లాంటి జీవితాన్ని
ముళ్లబాట చేసుకొని
బ్రతుకుదెరువు కోసం
భాగస్వామ్యం వ్యాపారంలో చేరితే
వేలిముద్ర గాడినని
విద్యలేని వింత పశువునని
తూలనాడి
అంకెల గారడీతో
వ్యాపారంలో నష్టం చూపించి
వెన్నుపోటు పొడిచారు .
విధిరాత , తలరాత కాదని
చదువులేక, చేతిరాత రాక
అని గ్రహించి
మూడు పదుల వయసు లో
విద్యనభ్యసించడానికి
అక్షరాలు నేర్వడానికి
వయోజన విద్యా కేంద్రాలకు
వెడుతున్నా.
దీక్ష పట్టి చదువుతున్నా
చదువుల తల్లినీ మా ఇంటికి ఆహ్వానిస్తున్నా
సగర్వంగా విద్యను అభ్యసిస్తున్నా.