కాపాడు స్వామి
స్వరూపం
40: కాపాడు స్వామి
[మార్చు]నీ రూపము చూసి తరించడానికి "కళ్లు" ఇచ్చావు
నీ లీలలు చెప్పడానికి "స్వర"మిచ్చావు
నీ మహిమలు రాయడానికి "కరము"లిచ్చావు
నీ కొండకు నడచి రావడానికి "కాళ్లు" ఇచ్చావు
నీ కీర్తనలు వినడానికి "చెవు"లిచ్చావు
నీ ముందు" శిరస్సు"వంచడానికి "తల"నిచ్చావు
నీకు సమర్పించడానికి "తలనీలాలు"ఇచ్చావు
నీ భజన చేయడానికి "చేతులు"ఇచ్చావు
నీకు సాష్టాంగ నమస్కారం చేయడానికి "దేహం"ఇచ్చావు
నిను చూసే సంకల్పo ఇవ్వు
నీ దర్శనభాగ్యం కల్పించి కాపాడుస్వామీ.