చెప్పాలనుంది
స్వరూపం
10. చెప్పాలనుంది
[మార్చు]స్నేహానికి విలువ లేదని
స్నేహితుడికి ద్రోహం చేస్తున్నారని
ధనంకోసం దగా చేస్తున్నారని
ధర్మంగా బ్రతకడం లేదని
అధర్మానికి పట్టంకడుతున్నారనీ
నీతికి నిలువ నీడలేదని
అవినీతికి ఆశ్రయమిస్తున్నారని
న్యాయాన్ని కాలరాస్తున్నారనీ
అన్యాయాన్ని ఆదరిస్తున్నారని
రక్షణనిలయం లో లాకప్ డెత్ లని
ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని
పదవుల కోసం బంద్ నిర్వహిస్తున్నారని
ప్రజల ఆస్తులు దోచుకుంటున్నారని
పేదలకు న్యాయం జరగడం లేదని
చెప్పాలనుంది వేదికనెక్కి చెప్పాలనుంది.