కల చెదిరింది
స్వరూపం
22. కల చెదిరింది
[మార్చు]నా జీవితం
వడ్డించిన విస్తరి కాదు
నడిచింది ముళ్ళబాట
చేసుకోవాలనుకున్నాను పూలబాట
నడచి వెళ్ళాను కాలేజీకి ఆనాడు
నడిచింది నేను కాదు నడిపించింది నీవు
విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చావు
పట్టభద్రుడ్ను చేశావు
పరోపకారిగా మిగిల్చావు
నన్నో మనిషిగా చేశావు
సమాజంలో నాకో స్థానం కల్పించావు
నా ఉన్నతిని చూసి ఆనందించావు
నీ సహచర్యం కోరితే
సరేనన్నావు , సంబరపడ్డాను
అంబరం అందినంత ఆనందించాను
విధివిచిత్రమో తలరాతో
మరదలితో మనువు చేశారు
మనసు చంపుకొని జీవిస్తున్నా
మనిషిగా బ్రతకలేకున్నా
ఈ తనువు నీది
ఈ హోదా నీది
నీవు పెట్టిన బిక్షే ఈ జీవితం
నీ మదిలో ఆరని జ్వాలలు రగిల్చి
తీరని వ్యదని మిగిల్చి
జీవించలేకున్నా .
నా ద్రోహం మరపురానిదైనా
నీ స్నేహం వెలకట్టలేనిది .
నీ జ్ఞాపకాలు నన్ను దహింప చేస్తున్నాయి
నా కలల సౌదాలను కూల్చివేస్తున్నాయి .