ప్రేమ పందెం
స్వరూపం
51: ప్రేమ పందెం
[మార్చు]నేను ప్రేమించలేదని తెలిసి
నన్ను ప్రేమించావు
భయపెట్టి భంగపడి
ప్రేమించేలా బాదించేవు
పందెం కాచి గెలిచాననీ
సంబరపడ్డావు
జీవితం అంటే ఆట కాదని
పెళ్లంటే నూరేళ్ల పంట అని
తెలుసుకోలేకున్నావు
సంసారం అంటే సాగరమని
ఈదడం అంత తేలిక కాదని
తెలుసుకోక పందెం కాశావు
ప్రేమ బంధానికి
పెళ్లి అనుబంధానికి
భార్యాభర్తల బంధం కు
అర్దం లేకుండా విడాకు నోటీస్ పంపావు .
ఇప్పటికైనా తెలుసుకో
నీ మనసు మార్చుకో
నోటీస్ వాపస్ తీసుకో
ఆడపిల్ల జీవితం అరిటాకు లాంటిది
ముల్లు పోయి ఆకును తగిలినా
ఆకు వచ్చి ముల్లుపై పడినా
జరిగే నష్టం అతివకే .
నేను ప్రేమించి మోసం చేసినా
నువ్వు ప్రేమించి విడాకులు కోరినా
జరిగే నష్టం మనిద్దరికీ కాదు
నీకే అని తెలుసుకో
పందెం గెలిచావని అనుకోకు
జీవితంలో ఒడినట్లే లెక్క తెలుసుకో.