మంచి మనిషి
స్వరూపం
4: మంచి మనిషి
పరుల కష్టాలలో
పాలు పంచుకొనేవాడే
మంచి మనిషి
ఆపదలలో ఆదుకొంటు
అపకారికి ఉపకారం
చేయగలవారే
మంచి మనిషి
స్నేహానికి ద్రోహం చేయక
స్వార్థానికి ఇతరులను బలిపెట్టక
సాయం అందించేవాడు
మంచి మనిషి
దయకలిగిన హృదయముండి
పేదసాదలనుఆదుకునేవాడు
మంచి మనిషి
న్యాయాన్ని రక్షించేవాడు
అన్యాయాన్ని అనగద్రొక్కేవాడే
మంచి మనిషి
తాను మోసగింపబడినా
పరులను మోసగించడం తెలియని వాడే
మంచి మనిషి
అధికారం కోసం అడ్డదారులు తొక్కక
నిజాయితీ గా నిలిచేవాడే
మంచి మనిషి
పదవుల కోసం కాక ప్రజల కోసం
పనిచేసేవాడే
మంచి మనిషి
అడుగడుగున అవినీతికి
అడ్డు తగిలేవాడే
మంచి మనిషి
మంచిని పెంచుదాం
మంచి మనిషినీ కాపాడుకుందాం .