నాడు నేడు

Wikibooks నుండి

నాడు నేడు

నాడు స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారు

నేడు అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు

నాడు ప్రజలకోసం పదవులు త్యాగంచేశారు

నేడు పదవులకోసం పార్టీలు మారుతున్నారు

నాడు ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించారు

నేడు పదవే పరమావధిగా జీవిస్తున్నారు

నాడు తెల్లవారు నల్లవారు అని కొట్టుకున్నారు

నేడు కులం మతం అని కొట్టుకుంటున్నారు

నాడు స్వరాజ్యం కోసం ఉద్యమాలు చేశారు

నేడు ఉద్యమాల పేరుతో ప్రజాధనం లూటీ చేస్తున్నారు

నాడు నాయకులు ప్రజా శ్రేయస్సు కాంక్షించారు

నేడు స్వలాభాపేక్ష కోసం పనిచేస్తున్నారు

నాడు పదవులకు వన్నె తెచ్చినారు

నేడు పదవుల కోసం ప్రాణాలను బలి పెడుతున్నారు

నాడు మంచి చెప్పేవాడిని మిత్రుడన్నారు

నేడు నీ మంచి మాటలు ఎవరికి కావాలంటున్నారు

నాటికీ నేటికీ ఎంతతేడా?

"https://te.wikibooks.org/w/index.php?title=నాడు_నేడు&oldid=34474" నుండి వెలికితీశారు