Jump to content

జాతీయములు - ర

Wikibooks నుండి

- అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి.

భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి.

ఆంగ్ల భాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్ధం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్ధం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్ధం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్ధం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని.

జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్ధం - తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా స్థిరపడిపోయిన పదరూపాలే జాతీయాలు. భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.

తెలుగు భాషకు అలంకారలనదగిన పదాలనేకం. అవి లేకుండా తెలుగు భాషలో పట్టు మని పది నిముషాలు కూడా మాట్లాడ లేరు. ముఖ్యంగా పల్లె ప్రజలు... నిరక్ష రాసులు మరీను. ఇటువటి వదాలు ప్రస్తావించకుండా అసలు మాట్లాడ లేరు. ఇటు వంటి పదాలను పండితులు "జాతీయాలు" అని అన్నారు. శ్రీమాన్ బూదరాజు రాధాకృష్ణ గారు ఇలాంటి అనేకమైన పదాల పుట్టు పూర్వోత్తరాలను విశదీకరించారు. అవి ఎక్కువగా పండితులకు, పరిశోధకులకు విద్యార్థులకు మాత్రమే ఉపయోగ కరం. అందు చేత అటు వంటివి కాకుండా సాధారణంగా సామాన్య ప్రజలు సైతం అలవోకగా ఉపయోగించే పదాలను మాత్ర్రమే కూర్చడం జరిగింది. జాతీయాలనబడే ఈ పదాలను ఎవరో పనిగట్టు కొని కనిపెట్టలేదు. సాదారణ ప్రజల నోళ్లలో తమ వాడుకలో అసంకల్పితంగా పుట్టు కొచ్చినవే. కాని భాషపైవాటి ప్రభావం చాల ఎక్కువ. అటు వంటి పదాలున్న వాఖ్యల అర్థం మరింత భలంగా వుంటుంది. ఆ పదాలకున్న అసలైన అర్థం ఇక్కడ కనబడదు. వేరె అర్థం లోనె వుంటాయి. వాటి అర్థాలు ఇవీ అని కూడా చెప్పలేము. ఇలాంటి పదాలకు/వాఖ్యలకు అర్థం విడమరిచే వివరణ కూడా చాల వరకు అవసరం లేదు. కాన సందర్భాన్నిబట్టి చిన్నవివరణ ఇచ్చుకోవచ్చు. జాతీయాలంటే??? ఒక పదానికి .... దనికున్న నిఘంటువు లోని అర్థంలో కాకుండా అనగా నిజార్థం కాకుండా....విభిన్న అర్థంతో అదే భావాన్ని మరి కొంత ప్రస్పుటంగా అర్థం అయి, వినడానికి కూడా మరికొంత సొంపుగా వుండేవే జాతీయాలు. జాతీయాలు లేని కొన్ని వాఖ్యలు పరిపూర్ణ అర్థం కలిగి వుంటాయి. కాని జాతీయం కలిసిన వాఖ్యం అర్థం మరింత అందంగా, అర్థం మరింత ప్రస్పుటంగా వుంటుంది. కొన్ని సందర్భాలలో జాతీయమనదగిన పదం వాడకుంటే అర్థం పూర్తిగా అవగాహన కాదు. ఉదాహరణకు:.... వాడు నాచెంతన వుంటే కొండంత అండ. ఈ వాఖ్యంలో.... కొండంత అనెది జాతీయ పదం. పూర్తి పదం కొండంత అండ ... జాతీయం లేకుండా..... వాడు నా చెంత వుంటే నాకు పెద్ద అండ అనొచ్చు. జాతీయంతో కలిస్తే...... వాడు నా చెంతన వుంటే నాకు కొండంత అండ దీని అర్థంలో భలమెంతో ప్రస్పుటంగా కనబడుతుంది. అండ అనే దాన్ని కొండంతో..... గోరంతో.... పది కిలోలో,,, మరెంతో.... అలా కొలవరు. అందుకే అది జాతీయం అయింది. ఇలా చెప్పుకుంటూ పోతె భాషలో జాతీయాలకున్న భలమెంతో చాల చెప్పవలసి వస్తుంది. అంతా ప్రధానమె. మరొక్క ఉదాహరణ మాత్రం చూడండి. వాడు నాకు చుక్కలు చూపించాడు ఈ వాఖ్యంలోని అర్థం పండిత, పామరులకందరికీ సులబ గ్రహ్యమే. దీని అర్థం వాడు నన్ను చాల కష్ట పెట్టాడు అని చెప్పుకోవచ్చు. ఆ మాటలో వున్న బలమెంత?. ఇక్కడ వున్న జాతీయం చుక్కలు చూపించాడు అని. చుక్కలను ఎవరు చూపించరు.... అవసరం లేదు కూడా...... ఆ జాతీయ నిజార్థం ఇక్కడ అసమంజసం,.... అనవసరం కూడా..... చుక్కలు చూపించడం అనె అర్థం సోది లోకి కూడా రాదు. కాని ఆ పూర్తి వాఖ్యంలోని అర్థం ఎంత భలీయంగా వున్నది గ్రహించ వచ్చు. అదే జాతీయాలకున్న గొప్ప తనము. కొన్ని సామెతలను కూడా జాతీయాలుగా ఉన్నదున్నట్టు ఉన్నాయి. కొన్ని సామెతల లోని సగ భాగాన్ని జాతీయంగా చూపారు. ఇది కొంత వరకు సమంజసమె కాని అన్ని సందర్భాలలో కాదు.. ఇంకొన్ని పదాలున్నాయి. అవి కూడా జాతీయాలె. అవి జంట పదాలు. జంట పదాలు చాల వుంటాయి ఆ జంట పదాలలోఒక పదానికి అసలు అర్థం వుండదు. కాని ఆ రెండు కలిస్తేనె సరైన అర్థం వస్తుంది. ఉదాహరణకు ---- వంటా వార్పు/ చీకు చింత / చెట్టు చేమ/ కొంప గోడు / మాట మంతి/గొడ్డు గోదం / పిల్ల పిసురు / ఇలాంటి వి చాల వుంటాయి. ఈ జంట పదాలలో ఒక్క పదానికి అది పూర్వ పదమైనా ఉత్తరపదమైనా ఒక దానికి అర్థం వుండక పోవడాన్ని గమనించ వచ్చు. ఇవి జాతీయల కోవలోకి రావనిపిస్తుంది. ఇంకో విషయంఏ మంటే... జాతీయాలు అని ఆ పదాలలు చూపెడుతున్నప్పుడు వాటిని యదాతదంగా అనగా:..... పుట్టెడు బుద్ధులు/ కాలు కాలిన పిల్లి / అలక పాన్పు/ సొంత డబ్బా కొట్టుట / తెగిందాక లాగుట/ కొంప కొల్లేరు / ఇలా ఉదహరించారు. ఇది కొంత అసమగ్రం. అలా కాకుండా వాటికి తోక పదాలు తగిలించి సంపూర్ణ అర్థం వచ్చేలా చెప్పితేనే దానికి పరిపూర్ణత వస్తుంది . ఎలా గంటే.............పుట్టెడు బుద్ధులు గలవాడు / కాలు కాలిన పిల్లి లాగ / అలక పాన్పు ఎక్కాడు/ సొంత డబ్బా కొట్టు తున్నాడు/ తెగిందాక లాగకు/ కొంపకొల్లేరయింది.... ఆ విధంగా ......... వుంటే బాగుంటుందని పిస్తుంది. ఈ జాతీయాలు చాల వరకు స్వయంభోదకాలె అయినా కొన్నింటికి ఒక ఉదాహరణగా ఒక చిన్నవాఖ్యాన్ని చేర్చితె అది చాల సమగ్రంగా వుంటుంది. ఎక్కడో అరుదుగా తప్ప జాతీయాలకు ఎక్కువ వివరణ అవసరము వుండదు. ఇలాంటి వ్యాఖ్యానాలు అన్నింటికి వ్రాసుకుంటు పోతె అది ఒక పెద్ద దొంతరగా తయారు కాగలదు. ఒక జాతీయాన్ని ఎన్నో విధాలుగా వాడు తారు. కాని స్థూలంగా అర్థం ఒక్కటే. ఉదహరించే టప్పుడు ఒక చిన్న మాటను వాడితె సరి పోతుందని. ఆ విధంగా జాతీయాలు భాషకు భలాన్ని, అందాన్ని, ఆతిశయోక్తి కాకపోతె ప్రాణాన్ని కూడా పోస్తున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు.

రంకలాడి

[మార్చు]

కలహాల మారి స్త్రీకి పర్యాయ పదమే రంక లాడి.

రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా?

[మార్చు]

రంకులాడికి నిష్ఠలు మెండు

[మార్చు]

రంకు సాగితే పెళ్ళెందుకు?

[మార్చు]

రంగడికీ లింగడికీ స్నేహం - రొట్టెకాడ గిజగిజలు

[మార్చు]

రంగు తేలిపోవడం

[మార్చు]

ప్రతిష్ఠ కోల్పోవడం. ఇంత కాలం రహస్యంగా సాగిన వ్యవహారం బయట పడి అసలు విషయం తెలిసి పోవడం 5 రంధ్రాన్వేషణం లోపాలను వెతకటం/ ఇతరులు చేసిన పనిలో తప్పులను వెతకడం

రంగు పులమడము

[మార్చు]

లేనిపోని ఆరోపణలు చేయడం

రంగు బయట పడింది

[మార్చు]

అసలు విషయము తెలిసి పోయిందని అర్థము: కొంత కాలంగా దాచిపెట్టిన విషయము బయట పడితే ఈ మాటను వాడుతారు.

రంపపు కోత

[మార్చు]

తీవ్రమైన బాధ . రంపంతో దుంగలను కోసేటప్పుడు ఒక్కసారిగా దుంగ తెగి పడక చాలాసేపు పదునైన రంపపు పళ్లు కోతకు గురవుతుంటాయి. ఆ స్థితి మానవ శరీరానికి మనసుకూ కలిగితే ఆ బాధ వర్ణనాతీతం. శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎవరైనా మరొకరిని తీవ్రంగా బాధించటం. ఆ సందర్భంలో ఈ మాటను వాడుతారు.

రంభగూడు

[మార్చు]

రంభ గూడు అంటే స్వర్గం.రంభను కూడడం అంటే రంభను చేరడం. రంభ ఉండేది స్వర్గలోకంలో కనుక అక్కడికి వెళ్ళాడు అంటే స్వర్గస్తుడయ్యాడు, మరణించాడు అని.

రంధ్రాన్వేషణం

[మార్చు]

లోపాలను వెతకటం/ ఇతరులు చేసిన పనిలో తప్పులను వెతకడం.

రక్తం తాగడం

[మార్చు]

దోచుకుతినడం . నిజంగా మనిషి శరీరంలోని రక్తాన్ని బయటకు తీసి తాగకపోయినా అలా హింసిస్తే ఎంతటి బాధ కలుగుతుందో == ఉదా: వాడొట్టి రక్తం తాగె రాక్షసుడు. ఎవరినైనా ఎక్కువగా బాదిస్తుంటే ఈ జాతీయాన్ని వాడుతారు.

రగరగ

[మార్చు]

రచ్చకెక్కిన తర్వాత రాయబారమెందుకు?

[మార్చు]

రతిలో సిగ్గు - రణములో భీతి కొరగావు

[మార్చు]

మెరవటం తళతళ, మిలమిల

రవందాళి

[మార్చు]

రాందాళి .రామరావణ యుద్ధంలో రామదండు, వానరసేన చేసిన దాడి.తగాదా, కొట్లాటలు .అందరూ వచ్చి ఒక్కసారి మీద పడి దాడిచేయటం.

రసాభాసం

[మార్చు]

నాటకం సవ్యంగా సాగితే రససిద్ధి కలిగి ప్రేక్షకులు ఆనందిస్తారు. ప్రదర్శనలో అపశ్రుతులు ఎదురైతే ప్రేక్షకులు నవ్వుతారు. దీన్నే రసాభాసం అంటారు. ఆటంకం కలిగి కార్యం చెడిపోవటం అన్నదానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

రయ్‌మని వెళ్ళటం

[మార్చు]

అమిత వేగంగా వెళ్ళటం, అభివృద్ధి బాగా జరగటం, దూసుకువెళ్ళటం

రాగాలు పెట్టడం

[మార్చు]

ఏడవడం (రాగాలు పెట్టిఏడవడము)

రాచమర్యాదలు

[మార్చు]

ఎక్కువగా గౌరవ, ఆదరాలను రాజుగారికి జరిగినంత గొప్పగా చూపటం = ఉదా: వానికి రాచమర్యాదలు బాగా జరిగాయి.

రాచి రంపాన పెడుతున్నారు

[మార్చు]

చాల కష్టపెడుతున్నారని అర్థం: ఉదా: ఆ అత్తగారు కోడలిని రాచి రంపాన పెడుతున్నది.

రాజును రండకొడుకన్నట్టు

[మార్చు]

లోకం తీరు.పెద్ద పెద్ద వాళ్లను, నీతీనిజాయితీపరులను వాస్తవాలు ఏవీ లేకుండానే పరోక్షంగా నిందించటం.చక్కగా పరిపాలించే రాజును కూడా అసూయాపరులు పరోక్షంగా ఆయన వ్యక్తిగత విషయాలనూ, ఆయన తల్లి, భార్య లాంటి వారి ప్రవర్తననూ విమర్శిస్తుంటారు.చాటున ఎన్నైనా అంటుంటారు. వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు

రాళ్లు రువ్వడం

[మార్చు]

నిందారోపణలు చేయడం

రాజు కుంటుంన్నది

[మార్చు]

తిరిగి గొడవ మొదలౌతున్నదని హెచ్చరిక

రామగోస

[మార్చు]

మంచికిపోతే చెడు ఎదురైందన్న భావన . గోస అంటే కష్టం . శ్రీరామచంద్రుడు చాలా మంచివాడే. ఆయన తన తండ్రిమాట వినాలనుకుని మంచికిపోయి వనవాసం, భార్యావిరహం లాంటి కష్టాలను పొందాడు. ఇదంతా మంచికోసం పోయినందువల్లనే జరిగింది.

రామచక్కని

[మార్చు]

చక్కని సంసారానికి, చక్కని జంటకు, చక్కని సంసారానికి, అందానికి సీతా రాములతో పోల్చడము జనవాడుక. అలాగే మరేదైనా అన్ని విధాల చాల చక్కగా అమరి వుంటే దానిని ఈ జాతీయంతో పోల్చి చెప్పడం ఆనవాయితీ అయిపోయింది. ఈ నాటికి ఈ జాతీయము చక్కని వాడుకలో ఉంది.

రామదండు

[మార్చు]

రాముడికి సహకరించిన వానరసేన లేక కోతిమూక . అయితే ఇది సామాన్యమైన కోతి మూక కాదు. ఆంజనేయ, సుగ్రీవ, జాంబవంతాది మహా బలవంతులున్న కోతి మూక. ఎవరికైనా అండదండగా అధికసంఖ్యలో సహాయకులు కానీ, సమర్థించే వారు కానీ ఉన్నప్పుడు అలాంటి వారిని రామదండు అంటారు.

రామ రాజ్యం

[మార్చు]

అంతా సుభిక్షమైన పాలన అని అర్థం.

రామదండు రామబాణం

[మార్చు]

రామలింగడి పిల్లి

[మార్చు]

రామరావణ యుద్ధం

[మార్చు]

పెద్దగొడవ, సుదీర్ఘకాలంపాటు జరిగే పోట్లాట

రామాయ స్వస్తి

[మార్చు]

రాయిపడటం

[మార్చు]

రావణ సంతతివాళ్లు

[మార్చు]

రావణుడి సంతతి కూడా దుర్మార్గాలకే పాల్పడుతుంది అని.

రావణ దాడి

[మార్చు]

రావణుడిలాగా అధర్మంగా, అడ్డ దోవల్లో అనైతికంగా ప్రవర్తించటం. విచ్చలవిడిగా తిరగటం.

రావణ కాష్టం లాగ

[మార్చు]

ఎడతెరపి లేకుండా సదా రగులుతూనె వుందని అర్థ; ఉదా: ఆ వ్యవహారం రావణ కాష్టంలాగ ఎంత కాలమైనా రగులుతూనె ఉంది. తెలగాణ సమస్య రావణ కాష్టంలాగ ఇంకా రగులుతూనె ఉంది."

రావాకు కొనకొచ్చినట్టు

[మార్చు]

క్షీణించిన బుద్ధికి, నైతిక విలువల పతనానికి పోలిక.రావి ఆకు వెడల్పుగా ఉన్నా కొన చాలా సన్నగా ఉంటుంది. విమర్శకు గురికావటం

రాయి విసరటం

[మార్చు]

ప్రయత్నం చేయటం == ఉదా: ఉద్వోగానికి అన్ని పరీక్షలు రాయి. ఏదో ఒకటి తగలక పోదు. ఒక రాయి విసిరి నందున నష్టం లేదు కదా......

రాలిపోవటం

[మార్చు]

మరణించటం

రాళ్లు వేయడం

[మార్చు]

విమర్శించడం ఉదా: అందరు వాని నెత్తిన రాళ్లు వేస్తున్నారు.

రాసుకొని పూసుకొని

[మార్చు]

మితి మీరిన అనుబంధం కలిగి ఉండటం ఎంతో స్నేహపూర్వకంగా ఆప్యాయత అనురాగాలు అవధులు లేకుండా ఉండటం వంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

రాహుస్పర్శ

[మార్చు]

అవాంతరాలు, అడ్డంకులు కలగటం, అభివృద్ధికి ఆటంకం ఏర్పడటం

రాక్షసుడు

[మార్చు]

దుర్మార్గుడు. ఎవరైనా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే ఈ జాతీయాన్ని వాడుతారు.

రాక్షసానందం

[మార్చు]

ఎదుటివారు భయంతో బాధపడుతుంటే చూసి ఆనందించే నీచ స్వభావం

రుత్త రుత్త

[మార్చు]

దేనికీ పనికి రాకుండా పోవటం.

రుద్రాక్షపిల్లి

[మార్చు]

రుబ్బేయటం

[మార్చు]

పూర్తిగా అవగాహన చేసుకోవటం, దానిమీద సాధికారత సంపాదించటం, ఎప్పుడు అడిగితే అప్పుడు ఆ విషయాన్ని చెప్పగలగటం.

రెండావుల దూడ

[మార్చు]

రెండు విధాలుగా ప్రయోజనం పొందటం. ఏదైనా ఒక ఆవు దూడ మరణిస్తే మరొక దూడను ఆ ఆవు "చేపు" కొఱకు వినియోగిస్తారు. అంటే రెండావుల దూడకు తన తల్లి ఆవు పాలూ, మరొక ఆవు పాలూ కూడా లభిస్తుంటాయి.

రెక్కలు విరచటం

[మార్చు]

అణచివేయటం, అభివృద్ధి జరగకుండా నిరుత్సాహ పరచటం, ఎదుగుదలకు ఉపకరించే వాటిని, అభివృద్ధికి అవసరమయ్యే వాటిని అందుబాటులో లేకుండా అడ్డుకొనే స్థితి

రెట్టమతం

[మార్చు]

రెంటికీ చెడ్డ రేవడు

[మార్చు]

రెండు నాలుకలు

[మార్చు]

రేచుక్క పగటిచుక్క

[మార్చు]

రేవతి వర్షం

[మార్చు]

రేయింబవళ్లు కష్టపడి.....

[మార్చు]

చాల ఎక్కువ కస్టపడి .... అని ఈ జాతీయానికి అర్థం>

రొట్టెలోడి కంటే ముక్కలోడి పని హాయి అన్నట్లు

[మార్చు]

పెద్దపెద్ద పనులు చేసి కొద్దిగా సంపాదించే వారికన్నా చిన్న చిన్న పనులు చేసి ఎక్కువగా సంపాదించేవారే నయం అని. ఓ చోట రొట్టెల దానం జరుగుతోందట. ముందొచ్చిన వారందరికీ పూర్తి రొట్టె ఒక్కొక్కటి లభించింది. చివరికొచ్చేసరికి ఒకడికి ఒక్క రొట్టె కూడా మిగలకుండా పోయిందట. దాంతో అందరూ అతడికి తమ రొట్టెలోని ఒక్కొక్క ముక్క తీసి ఇచ్చారట.

రోకటిపాట

[మార్చు]

పనిని బట్టి పాట. కోతలు కోసేకాలంలో ఆడ కూలీలు శ్రమని మరచి పోయేందుకు పాడినట్లు.అలాగే రోట్లోవేసి దంచేదప్పుడు పాడే పాట. సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా,, సువ్వీ కావేటిరంగా, ఆటలలో, పాటలలో ఆయాసం మరచిపోయి ఆనందం పొందగలుగు ధన్యజీవులు.

రోటి దగ్గర కోడి

[మార్చు]

ధాన్యం రోట్లో వేసి రోకళ్ళతో దంచుతూ ఉండే సమయంలో కొన్ని ధాన్యపు గింజలు ఎగిరి రోలున్న పరిసర ప్రాంతాల్లో పడుతూ ఉంటాయి. అక్కడికొచ్చిన కోళ్ళకు శ్రమ పడకుండానే ఆహారం లభిస్తుంది. శ్రమ లేకుండా సుఖభోగాలు, సంపదలు వూరకనే లభించటం. అలాంటి వారి గురించి ఈ మాట పుట్టింది.

రోట్లో తలదూర్చటం

[మార్చు]

ప్రమాదంలో ఇరుక్కోవటం . రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరవటమేమిటి? అనే సామెత ఉంది. రోట్లో తలదూరిస్తే వూపిరాడక పోవటం సహజం. ఆ తలను బయటకు తీయాలన్నా శ్రమతో కూడిన పనే. ఎటు చూసినా అలా కష్టాలే. అలాంటి కష్టాల్లో ఇరుక్కోవటం