Jump to content

జాతీయములు - ట, ఠ

Wikibooks నుండి


ట ఠ అక్షరాలతో మొదలయ్యే జాతీయాలు:

టక్కు టమార విద్యలు నేర్చిన వాడు

[మార్చు]

చాల జిత్తుల మారి అని అర్థం. ఉదా: వాడు చాల టక్కు టమార విద్యలు నేర్చిన వాడు. వానితో జాగ్రత్త.

టక్కరి దొంగ

[మార్చు]

టక్కు టమార విద్యలు

[మార్చు]

మోసపు బుద్ధులని అర్థం.

టక్కులాడి

[మార్చు]

మోస గత్తె: ఉదా: ఆమె బలే టక్కులాడి.

టక్కరి దొంగ

[మార్చు]

మోసగాడు.

టప టప

[మార్చు]

వెంటవెంటనే, వేగంగా . టపటప రాలిపోయారు టపటప చినుకులు పడ్డాయి కాయలన్నీటపటప రాల్చేశారు అని అంటుంటారు.

టంగుటూరి మిరియాలు తాటికాయంత

[మార్చు]

అపోహలు.వాస్తవ దూరంగా అసహజంగా ఉండే మాటలు, అబద్ధాలు అతిశయోక్తులు

టంకం లాగా

[మార్చు]

అతుక్కుపోవటం: విడదీయ లేనంతగా అతుక్కు పోవడము.

టర్కీ టోపీ

[మార్చు]

భిక్ష పాత్ర, అడ్డుకుతినే బొచ్చ

టపా కట్టేసాడు

[మార్చు]

అనగా చనిపోయాడని అర్థం: ఉదా: వాడు టపా కట్టేశాడు:

టాపు లేచి పోవుద్ది

[మార్చు]

కొడతానని బెదిరించడం కొడతానని బెదిరించడము.

టికాణ లేని వాడు

[మార్చు]

ఏవరు లేని వాడు

టిప్పు టాపుగా తయారయ్యాడు

[మార్చు]

==టిప్పు టాపుగా తయారయ్యాడు==. ఉదా:

టింగు రంగ అంటు తిరుగుతున్నాడు

[మార్చు]

ఏపని పట్టించు కోకుండా జల్సాగా తిరుగు తున్నాడని అర్థం; : ఉదా: వాడు ఇంటి పనులు పట్టించు కోకుండా టింగు రంగ అంటు తిరుగు తున్నాడు. చాల జాలీగా తిరుగు తున్నాడు. టి ప్పు టాపుగా తిరుగుతున్నాడు .

టెంకాయ చెట్టుకు మడిగుడ్డ కట్టినట్లు

[మార్చు]

దొంగలకేమీ అడ్డంకాదు: మడి గుడ్డను ఎవ్వరు తాకరు. ఒక అమాయకురాలు టెంకాయ చెట్టును దొంగలు ఎక్కకుండ వుండాలని దానికి మడి గుడ్డ కట్టిండట

టోపి పెట్టాడు

[మార్చు]

మోసం చేశాడు

ఠికాణ లేని వాడు

[మార్చు]

ఎవరూ ఆధారం లేని వాడు: ఉదా: వాడు ఠికాణ లేని వాడు.

ఠారెత్తించాడు....గాబరా పెట్టాడు

[మార్చు]

గాబరా పెట్టాడని అర్థం.