జాతీయములు - ఇ

Wikibooks నుండి

- అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి.

భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆంగ్లభాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్థం - తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా స్థిరపడిపోయిన పదరూపాలే జాతీయాలు. భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును. వేటూరి ప్రభాకర శాస్త్రి, నేదునూరి గంగాధరం, బూదరాజు రాధాకృష్ణ వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు.

ఇక సాల్ తీ[మార్చు]

ఇదొక ఊత పధం: చెప్పింది చాలు అని వ్యంగ్యంగా అనడం.

ఇచ్చేవాడుంటే చచ్చేదాకా తిన్నట్టు[మార్చు]

పరాధీనంగా బతికేవారు.కొంత మంది నిరంతరం ఎదుటివారినడిగి తమకు కావలసినవన్నీ సమకూర్చుకుంటుంటారు. అంతే కానీ తమకు తాముగా సంపాదించటం, ఖర్చు పెట్టడం అనేవి చేయరు.అన్నీ ఉచితంగా కావాలనుకునే వారి గురించి ఈ జాతీయాన్ని వాడు తుంటారు.

ఇడిచేసింది ఈ దికి పెద్ద.... వుంచుకున్నది ఊరికే పెద్ద[మార్చు]

ఇల్లడ పెట్టడం[మార్చు]

పూర్వం ఎవరైనా, తీర్థయాత్రలకు పోతూ తిరిగి వచ్చే దాకా తమ దగ్గరున్న విలువైన వస్తువులను, ధనాన్ని తెలిసిన వారి వద్ద భద్రంగా ఉంచమని చెప్పి వెళుతుండేవారు. ఇలా తమ సొమ్ము తాత్కాలికంగా భద్రతను కల్పించుకోవడాన్నే ఇల్లడ పెట్టడం అంటారు.

ఇల్లు-ఇరవాటు[మార్చు]

ఇంటిలోకి కావలసిన వన్నీ మంచిగానే ఉన్నాయి అని

ఇల్లు ఇరకాటం ఆలి మరకటం[మార్చు]

ఇల్లు ఇరుకుగా ఉంటే చుట్టాలెవరూ రారు... ఒక వేళ వచ్చినా పొద్దు పోకముందే వెళ్ళిపోతారు. అలా వుంటే రాత్రి పడుకోడానికి స్థలం వుండదు. ఎక్కువకాలం ఆ ఇంట్లో ఉండలేరు. దాంతో వారికి వండిపెట్టే ఖర్చు, శ్రమ తగ్గుతాయి. ఆలి మరకటం అంటే భార్యరూపం కోతి రూపంలాగా వికృతంగా ఉంటే ఆమె వంక ఎవరూ చూడకపోతే ఆ భర్తకు మనశ్శాంతిగా ఉంటుంది. ఈ అర్థంతో ఈ జాతీయాన్ని వాడుతారు.

ఇల్లు అలకంగానే పండుగ కాదు[మార్చు]

కేవలం ఇల్లు ఒక్కటి అలికి కూర్చుంటే పండుగ ఎలా పూర్తికాదో అలానే ఏదో ఒక చిన్నపని చేసి ఇక అంతా అయిపోయిందిలే అనుకోవటం కూడా సమంజసంకాదని

ఇల్లు కాలుతుంటే వాసాలు దూసుకున్నట్టు[మార్చు]

స్వార్థపరులు.ఎదుటివారు ఎంతగా కష్టనష్టాలకు గురౌతున్నాపట్టించుకోక పీడించి తెచ్చుకోవటం.

ఇల్లు పీకి పందిరేయటం[మార్చు]

అడ్డూ, అదుపూ లేకుండా అవగాహనా రాహిత్యంతో అల్లరి చేయటం

ఇల్లు వల్లు గుల్లయింది[మార్చు]

ఇల్లు.. ఆరోగ్యము రెండు పాడయాయని అర్థం. దుర్వ్యసనాలకు బానిసలయిన వారి ఇళ్ళు, ఒళ్ళు గుల్లవడం ఖాయం అనే అర్ధంలో ఈ జాతీయాన్ని వాడుతారు.

ఇల్లో నారాయణమ్మ[మార్చు]

ఇసక తక్కెడ, పేడ తక్కెడ[మార్చు]

ఇక్ష్వాకుల బారసాల[మార్చు]

ఇత్యపులు[మార్చు]

ఇసక పాతర[మార్చు]

ఇనుపకచ్చడాలు[మార్చు]

వారే. కుటుంబంలో స్త్రీకి వున్న ప్రాముఖ్యాన్ని తెలుపుతుంది ఈ జాతీయము.

ఇల్లు పీకి పందిరేయడం[మార్చు]

అతి చిన్న విషయానికి నానా రబస చేయడము: అలాంటి వారినుద్దేసించి ఈ జాతీయాన్ని వాడుతారు. ఉదా: వాడు చిన్న విషయానికి ఇల్లు పీతకి పందిరి వేశాడు.

ఇల్లు వల్లకాడైంది[మార్చు]

ఇల్లు నాసనమైనదని అర్థం.

ఇల్లు గుల్లయింది[మార్చు]

చాల కష్టమొచ్చింది.: ఉదా: ఈ వరదలతో మా ఇల్లు గుల్లయింది.

ఇడిసేసింది ఈదికి పెద్ద[మార్చు]

అన్ని విడిచేసిన ఆడది అందరికి పెద్ద. అనగా ఆమెకు ఎవరు ఎదురు మాట్లాడ సాహసించరు. అందుచేత ఆ వీధివారందరు ఆమె నోటి దురుసుకి భయపడి వూరుకుంటారు. దాంతో ఆమె తనెంతో గొప్పదాన్నని గర్వపడుతుంటుంది. ఇక్కడ ఇడిసేసింది అనగా భర్తను వదిలేసినదని అర్థం.

ఇదిగోగుర్రం ఇదిగో మైదానం[మార్చు]

స్వయంగా పరీక్షించి తెలుసుకోవచ్చు అనే అర్థం.గుర్రం నీ ఎదురుగానే ఉంది. మైదానం కూడా ఎదురుగానే ఉంది, ఎక్కి స్వారీ చేసి పరీక్షించి నువ్వే తెలుసుకో

ఇనుప గజ్జెల తల్లి[మార్చు]

దరిద్రదేవతకు ఇది మారు పేరు. ఆ ఇంట్లో ఇనుపగజ్జెల తల్లి నాట్యమాడుతున్నది. అని అంటారు. అనగా ఆఇంట్లో దారిద్ర్యం ఉన్నదని అర్థం.

ఇనుప గుగ్గిళ్ళు నమలటం[మార్చు]

అత్యంత కష్టమైన పని చేయటం ఎంతగా ఉడికించినా అవి ఉడికేదీ లేదు, మెత్తపడేదీ లేదు. వాటిని ముందు పెట్టి తినమన్నప్పుడు ఎంత కష్టమైన పనో

ఇప్ప పూల వాసన[మార్చు]

వెతకనక్కరలేదు.ప్రతిభావంతుడికి పరీక్షలు పెట్టడం అనవసరం.ఇప్ప పూలకు వాసన వెదకాలా అన్నట్టు

ఇరుగు పొరుగు[మార్చు]

ఇంటి చుట్టు పక్కల వారు అని అర్థం. ఇరుగు పొరుకు వారితో అన్యోన్యంగా వుండాలని ఈ జాతీయం యొక్క గూఢార్థం.

ఇల్లు గుల్ల చేయు[మార్చు]

ఇంటిలో ఉన్న ఆస్తి మొత్తం నాశనం చేయుట అని అర్థము. ఉదా: వాని వల్ల ఇల్లు గుల్ల అయింది అని అంటుంటారు.

ఇసుక తక్కెడ, పేడ తక్కెడ[మార్చు]

ఒకరికి తెలియకుండా మరొకరు మోసపుచ్చుకోవడం.

ఇసుక చల్లినా రాలని జనం[మార్చు]

విపరీతమైన జనం వచ్చారని అర్థం.

ఇసక పాతర[మార్చు]

శ్రమ ఎక్కువగా ఉండే పని, విసుగు, చిరాకు కలిగించేపని. పూర్వం వస్తువులను దాచుకోవటం కోసం నేలను తవ్వి ఆ గుంతలో దాస్తుండేవారు. దీనినే పాతర అని అంటారు. ఇసక నేలలో గొయ్యి తీసేటప్పుడు పైనుంచి ఇసక జారి మళ్ళీ ఆ గోతిలో పడుతుంటుంది. పని ముందుకు సాగనివ్వక అడ్డుపడే వ్యవహారం. అటువంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతారు.

ఇక్ష్వాకుల బారసాల[మార్చు]

ఎంతో పురాతనమైనది. కృతయుగం నాటిది. ప్రాచీనమైనది

ఇంగువ కట్టిన గుడ్డ[మార్చు]

ఇంగువ అయిపోయినా కూడా అది కట్టిన గుడ్డలో ఇంగువ ఉన్నట్లుగానే అనిపించేలా చాలాకాలంపాటు వాసన వస్తుంటుంది.

ఇంద్రుడు, చంద్రుడు[మార్చు]

విపరీతంగా పొగడడం . భోగాలను అనుభవించడంలో ఇంద్రుడికి, అందంగా ఉండడంలో చంద్రుడికి ఎవరూ సాటి లేరు.

ఇంచుమించు[మార్చు]

సుమారుగా అని అర్థము: ఉదా: ఇంచుమించుగా వారిద్దరు ఒకటే..... అని అంటుంటారు.

ఇంపు సొంపులు[మార్చు]

ఇంటి గుట్టు[మార్చు]

ఇంటి సంగతులు: ఉదా: ఇంటి గుట్టు రట్టు చేయ కూడదు. అనగా ఇంతి విషయాలు బయటికి తెలియకూడదు అని అర్తంలో ఈ జాతీయాను వాడుతారు.

ఇంటాబయటా[మార్చు]

అయినవారి దగ్గర, కాని వారి దగ్గర, స్వదేశంలోనూ, విదేశంలోనూ .తన వారి దగ్గర, బయట వారి దగ్గర కూడా .'ఇంట గెలిచి రచ్చ గెలవటం లాగా

ఇంగువ కట్టిన గుడ్డ[మార్చు]

ఇంటికి జ్యేష్ఠాదేవి పొరుగుకు లక్ష్మీదేవి[మార్చు]

పని చేసిన వ్యక్తికి నష్టం, పొరుగువారికి లాభం. కొందరు ఇంట్లోని విషయాలను పట్టించుకోకుండా.... పొరుగు వారికి ఉపయోగించే పనులు చేస్తుంతారు వారి గురించి ఈ జాతీయాన్ని వాడుతుంటరు.

ఇంటికి తలుపు లేదు[మార్చు]

ఆ ఇంటికి తలుపు లేదు ఈ ఇంటికి గడియ లేదు అన్నట్టు .ఒకదానికంటే మరొకటి మరీ నాసి రకమైనది అని.

ఇంటిదొంగ[మార్చు]

ఇంటిదొంగ కన్నుండగానే... గుడ్డుమాయం చేస్తాడని కూడా అంటారు. అంటే అన్ని విషయాలు బాగా తెల్సిన సొంతవ్యక్తే నమ్మకద్రోహాన్ని తలపెట్టిన పరిస్థితుల్లో ఇలా అంటారు.అవినీతి పరుడు, అవినీతి అధికారి . ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అని సామెత. అతడు లోపలి వ్యక్తే కదా. అతడికి అలా చెయ్యాల్సిన అవసరం ఉండదు అనే నమ్మకం

ఇంటికి దీపం ఇల్లాలు[మార్చు]

ఇల్లాలు .ఇంటికి దీపం ఇల్లాలు .ఇల్లు మొత్తానికి దీపం లాగా కాంతినిచ్చేది కీర్తిప్రతిష్ఠలు కలిగించేది . ఇంటికి కీర్తిని తెచ్చిపెట్టే పని ఎవరు చేసినా వారంతా దీపాల్లాంటి

ఇంటిని సవరించారు[మార్చు]

ఇంట్లో దొంగలు పడి దోచుక పోయారని అర్థం.

ఇంటిల్లపాది[మార్చు]

ఇంటిలోని అందరూ

ఇంటి నారాయణుడు[మార్చు]

భర్త .ఇంటికి యజమానే దైవమన్నభావన.

ఇంటిని సవరించటం[మార్చు]

సవరించటమంటే చక్కదిద్దటమని అర్థం. అయితే జాతీయంగా దీని అర్థం ఇంటిని సవరించటం అన్నప్పుడు దొంగలు దోచుకుపోయారు అని. అంద చందాలు.