జాతీయములు - డ, ఢ
| భాషా సింగారం |
|---|
| సామెతలు |
| అ ఆ ఇ ఈ ఉ ఊ-ఋ |
| ఎ ఏ ఒ ఓ అం అః |
| క ఖ గ-ఘ |
| చ-ఛ జ ఝ |
| ట ఠ డ-ఢ ణ |
| త థ ద ధ న |
| ప ఫ బ భ మ |
| య ర ల వ |
| శ-ష స-హ |
| ళ క్ష ఱ |
| జాతీయములు |
| అ ఆ ఇ ఈ ఉ ఊ |
| ఋ ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ |
| క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ |
| ట, ఠ డ, ఢ ణ |
| త, థ ద, ధ న |
| ప, ఫ బ, భ మ |
| య ర ల వ |
| శ ష స హ |
| ళ క్ష ఱ |
| ఆశ్చర్యార్థకాలు |
| నీతివాక్యాలు |
| పొడుపు కథలు |
డ
[మార్చు]డక్కా మొక్కీలు తిన్నాడు
[మార్చు]జీవితంలో చాల దెబ్బలు తిన్నాడు: ఉదా: వాడు చాల డక్కా మొక్కీలు తిన్నాడు.
డప్పుకొట్టుకోవడం
[మార్చు]తన గురించి తాను గొప్పలు ప్రచారం చేసుకోవడం
డబల్ ధమాఖా
[మార్చు]మంచి లాభం: వ్వాపార ప్రకటన.
డబ్బా మోత
[మార్చు]ఆచరణ శూన్య ప్రచారం .పనికొచ్చేది ఏమీ ఉండదు
డబ్బా కొట్టుకోవటం
[మార్చు]ప్రగల్భాలు పలకటం, ఆచరణకు పనికిరాని మాటలు మాట్లాడటం
డబ్బురాని విద్య
[మార్చు]దరిద్రపు చదువు
డాగుపడిన పండు
[మార్చు]బాగాలేదంటారు
డాబుసరి
[మార్చు]బడాయికోరు
డ్రామాలేస్తున్నాడు
[మార్చు]నాటకాలేస్తున్నాడు: ఉదా: వాడి మాటలు నమ్మకు, వాడు డ్రామాలేస్తున్నాడు.
డీ అంటే డీ అంటున్నారు
[మార్చు]పోట్లాటకు సిద్దం అంటున్నారు: ఉదా: వారు కొట్టు కోడానికి డీ అంటే డీ అంటున్నారు.
డుమ్మాకొట్టాడు
[మార్చు]బడి పిల్లలు బడికి రాక పోతె "డుమ్మా కొట్టాడు" అని అంటారు.
డూడూ బసవన్న
[మార్చు]గంగిరెద్దులా తలూపేవాడు
డేగ చూపు
[మార్చు]సునిశిత పరిశీలనా జ్ఞానం, సూక్ష్మ దృష్టి, జాగ్రత్తగా గమనిస్తూ ఉండటం
డేగకన్ను
[మార్చు]డేరా ఎత్తేశారు
[మార్చు]మోసగించి పారి పోయారు: ఉదా: వారు రాత్రికి రాత్రే డేరా ఎత్తేశారు.
డొంకలో దాక్కొన్నట్లు
[మార్చు]తప్పించుకోజూడటం
డొల్లకబుర్లు
[మార్చు]పసలేని మాటలు, కాలక్షేపానికి చెప్పే మాటలు .డొల్ల కావటమంటే లోపల ఏమీ లేకుండా ఖాళీగా ఉండటం. చెప్పే కబుర్లలో కూడా పనికొచ్చే విషయాలు ఏవీ లేనప్పుడు వాటిని డొల్లకబుర్లు అంటారు.
డొంక తిరుగుడు సమాధానం చెప్పుతున్నాడు
[మార్చు]సరైన సమాధానం చెప్పడం లేదని అర్థం: ఉదా: వాన్ని నమ్మడానికి వీల్లేదు: వానివి అన్ని డొంక తిరుగుడు సమాదానాలె.