సామెతలు - ప

Wikibooks నుండి
భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "ప" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

పంచదార పలుకులు - విషపు చూపులు[మార్చు]

మనసులో చెడు ఆలోచనలు పెట్టుకని పైకి పంచదార లాంటి తియ్యని మాటలు మాట్లాడేవారి సంర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.

పంచదార పలుకులు - విషపు చూపులు మనసులో చెడు ఆలోచనలు పెట్టుకని పైకి పంచదార లాంటి తియ్యని మాటలు మాట్లాడేవారి సంర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.

పంచాంగం పటపట - విస్తరాకు లొటలొట[మార్చు]

పంచాంగం పోగానే తిథీ వారాలూ పోతాయా?[మార్చు]

పంచాగ్ని మధ్య ఉన్నట్లు[మార్చు]

పంటకు పెంట - వంట మంట[మార్చు]

పెంట అనగా ఎరువు అని..... మంట అనగా నిప్పు అని అర్థము. పంటకు ఎరువు అవసరం అలాగే వంట చేయడానికి మంట అవసరము అని దీని అర్థము

పండగ నాడు కూడా పాత మొగుడేనా?[మార్చు]

సామెతను మార్చేసి పలుకుతున్నారు. పండగ పూట పాత "మడుగేనా" అన్నది అసలైన సామెత. మడుగు అంటే వస్త్రం అని అర్థం. పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం మన ఆనవాయితీ. ఆ అర్థంలో పుట్టిన సామెత పండగ పూట పాత బట్టలు కాదు కొత్త బట్టలు కట్టుకోవాలి అని.

ఇకపై ఈ సామెతకు తప్పుడు ప్రచారం మనం చేయకూడదు. సరైన రీతిలో నే పలుకుదాం, పలికిద్దాం.


వివరణ: గతంలో రవికల పండుగ అని ఒక ఉత్సవం జరిగేది. భార్య భర్తలు ఒక నది ఒడ్డు చేరుకొని నది ఎగువన భార్యలు తమ రవికలు తీసి నదిలో వేసేవారు. కొంత దూరంలో వున్న భర్తలు నదిలో కొట్టుకొని వస్తున్న రవికలను ఒక్కొక్కదాన్ని ఒకడు చేత చిక్కించు కోవాలి. అలా ఎవరి రైక ఎవరికి దొరుకుతుందో ఆ రవిక స్వంత స్త్రీ రవిక దొరికించు కొన్న పురుషునితో ఆ రాత్రి సంబోగంలో పాల్గొనాలి. అదీ ఆ పండగ తీరు. అలా ఒక పురుషునికి ఒక రైకి దొరికింది. ఆ రవికకి సంబంధించిన స్త్రీ ఆ పురుషుని వద్దకు వచ్చింది. తీరా చూస్తే ఆ పురుషుడు తన సొంత మొగుడే.. ఆ విధంగా పుట్టినదే ఈ సామెత. (దీనికి మూల: పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు... రచన... తాపీ ధర్మారావు)

పండుగ - పైన దండుగ[మార్చు]

పండని ఏడు పాటు ఎక్కువ[మార్చు]

పండాకును చూచి పసరాకు నవ్వినట్లు[మార్చు]

పండాకు రాలుతుంటే పసరాకు నల్లబడుతుంది[మార్చు]

పండిత పుత్ర పరమ శుంఠ[మార్చు]

పండితుని కొడుకు పరమ మూర్కుడవుతాడని ఈ సామెతకు అర్థం. ఇది ప్రాస కొరకు మాత్రమే పుట్టిన సామెత.

పండితపుత్రుడు... కానీ పండితుడే...[మార్చు]

ఈ సామెతకు వ్వతిరేఖార్థంలో ఒక సామెత ఉంది. అది పండిత పుత్ర శుంఠః దానికి వ్వతిరేకార్థంలో కల్పించిన సామెత ఇది.

పండిన రోజే పండుగ[మార్చు]

పండినా ఎండినా పని తప్పదు[మార్చు]

పండు వలిచి చేతిలో పెట్టినట్లు[మార్చు]

పండే పంట పైరులోనే తెలుస్తుంది[మార్చు]

పంది ఎంత బలిసినా నంది కాదు[మార్చు]

పందికేం తెలుసు పన్నీరు వాసన[మార్చు]

ఎప్పుడూ బురదలో దొర్లుతూ మురికి వాసనలో జీవించే పందికి పన్నీరు సువాసన తెలియదు. అలానే విలువ తెలీని మూర్ఖులకు విలువైన బోధలు చేసినా లేదా విలువైన వస్తువులను ఇచ్చినా వారికి వాటి విలువ తెలియక దుర్వినియోగం చేస్తారు.

పందిని పొడిచే వాడే బంటు[మార్చు]

పందిని వేటాడ్డం అంత సులభం కాదు. దాని శరీరానికి ఎంత దెబ్బ తగిలినా సులభంగా చావదు. క్రింద పడిపోడు. అలాగే పారిపోగలదు లేదా మీదికి దాడి చేయగలదు. అందుచేతనే పందిని పొడిచే వాడే బంటు అని సామెత పుట్టింది.

పంది పన్నీరు మెచ్చునా?[మార్చు]

పంది బురద మెచ్చు[మార్చు]

పందిలా తిన్నా పరకడుపే[మార్చు]

పంపకాలు మాకు - లొట్టలు మీకు[మార్చు]

పకపకా నవ్వేవారూ, గబగబా అరిచేవారూ కపటమెరుగరు[మార్చు]

పక్కమీద పూలు నలిగినట్లు నీవూ నలిగితే ఎట్లా అన్నాడట[మార్చు]

పక్కలో బల్లెంలాగా[మార్చు]

పక్కింటి పోరు పండగంత వేడుక[మార్చు]

పొరుగు వారు పోట్లాడుకుంటుంటే ఇరుగు పొరుగు వారికి అదొక వేడుక. ఇది మానవ సహజం. ఆ విధంగా పుట్టినదే ఈ సామెత/

పగ గలిగి బ్రతకటం - పామున్న యింట్లో బ్రతకటం ఒక్కటే[మార్చు]

పగటి నిద్ర పనికి చేటు[మార్చు]

పగటి ముచ్చట పని చేటు[మార్చు]

అనవసరమైన కబుర్లతో కాలక్షేపం చేయటమని అర్థం. ఇలాంటి కాలక్షేపాల మాటలు పగటిపూట పెట్టుకుంటే తాను చేసే పనితోపాటు ఇతరుల పనిని కూడా చెడగొట్టినట్టవుతుంది.

పగ బట్టిన త్రాచులాగ[మార్చు]

త్రాసు పాము పగ బట్టితే ఎప్పటికి మరచిపోక తన పగ తీర్చు కోవడానికి వేచి చూస్తుంటుందని ప్రజల మూడ విశ్వాసము. ఆ విధంగా ఈ సామెత పుట్టింది. పాములు పగపట్టడం ఒక మూడ నమ్మిక మాత్రమే

పగలు చెయ్యి లాగితే రానిది, రాత్రి కన్నుగీటితే వస్తుందా?[మార్చు]

పగలు చూస్తే రాత్రికి కలలోకి వస్తుంది అన్నట్లు[మార్చు]

చాల వికారంగా/ అనాకారిగా వున్నదని ఈ సామెతకు అర్థం.

పగలూ, వగలూ నిప్పులాంటివి[మార్చు]

పగలెల్లా బారెడు నేశాను - దీపం తేరా దిగనేస్తాను అన్నాడట[మార్చు]

పగవాడిని పంచాంగం అడిగితే మధ్యాహ్నమే మరణం అన్నాడట[మార్చు]

పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది[మార్చు]

మంచి వానికి అందరు మంచి వారుగానె... చెడు వానికి అందరు చెడ్డగానే కనబడతారని దీని అర్థం.

పచ్చగా వుంటే పదిమంది చుట్టాలు[మార్చు]

పచ్చి వెలగకాయ గొంతుకడ్డం పడ్డట్లు[మార్చు]

పట్టణే పాదమాచారం[మార్చు]

పట్టిందల్లా బంగారమె[మార్చు]

ప్రారంభంచిన అన్ని పనులు సక్రమంగా జరుగు తుంటే వారి గురించి ఈ సామెత వాడతారు.

పట్టినదంతా బంగారం - ముట్టినవల్లా ముత్యాలు అన్నట్లు[మార్చు]

ప్రారంభంచిన అన్ని పనులు సక్రమంగా జరుగు తుంటే వారి గురించి ఈ సామెత వాడతారు.

పట్టుకొన్నవాడు మట్టగుడిశ అంటే పైనున్నవాడు జెల్ల అన్నాడట[మార్చు]

పట్టుకొమ్మను నరుక్కున్నట్లు[మార్చు]

పట్టు చీర అరువిచ్చి పీట పట్టుకొని వెనకాలె తిరిగినట్టుంది[మార్చు]

మొగ మోటానికి పోయి ఒకామె మరొకామెకు పట్టు చీర అరువిచ్చిందట. ఆమె ఎక్కడన్నా కూర్చుంటే తన చీరకు మట్టి అంటుతుందని ఒక పీట తీసుకొని ఆమె ఎక్కడ కూర్చుంటుందో అక్కడ పీట వేసేదట. మొగమాటానికి పోయి కష్టాలు తెచ్చుకునే వారి గురించి ఈ సామెత పుట్టింది.

పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు[మార్చు]

పట్టెడు పెడితే పుట్టెడు పుడుతుంది[మార్చు]

పట్టెడు బొట్టుంటే పది లక్షలు స్త్రీకి[మార్చు]

పడతి పరువాలు పంచదార గుళికలు[మార్చు]

పడమట కొర్రువేస్తే పందిళ్ళమీద రాజనాలు పండుతాయి[మార్చు]

పడమట కొర్రువేస్తే పాడి ఆవు రంకె వేస్తుంది[మార్చు]

పడ్డ గోడలు పడ్డట్టుండవు - చెడిన కాపురం చెడినట్లుండదు[మార్చు]

పడ్డవారు చెడ్డవారు కారు[మార్చు]

పడిసం పదిరోగాల పెట్టు[మార్చు]

పడిశం అనగా జలుబు .. పడిశం పట్టితే పది రోగాలు పట్టుకున్నంత బాధ అని ఈ సామెతకు అర్థం.

పడుగూ పేకలాగా[మార్చు]

పడుచుపిల్ల కౌగిలి సుఖాల లోగిలి[మార్చు]

పడుచుపిల్ల పరువాలు రసరాజ్య సోపానాలు[మార్చు]

పడుచుపిల్ల కనుగీటు యువహృదయపు తడబాటు[మార్చు]

పడుచుల కాపురం - చితుకుల మంట[మార్చు]

పడుచులతో సయ్యాట - పాములతో చెలగాటం ఒకటే[మార్చు]

పడుపడు అన్న నాసవితే గాని పడ్డ నాసవితి లేదు[మార్చు]

అందరూ సలహాలిచ్చి వారేగాని ఆచరించేవారులేరు - అని సామెత అర్థము

పడమట పిసరంత మబ్బు నడిస్తే పాతాళందాకా వాన[మార్చు]

పడమట మెరిసిన పది ఘడియలకు వాన[మార్చు]

పడమట మెరిస్తే పంది కూడా నీళ్ళలో దిగదు[మార్చు]

పణత పడే జాగాకే కాళ్ళు ఈడ్చుకుపోతాయి[మార్చు]

పత్రి దేవుని మీద - భక్తి చెప్పులమీద[మార్చు]

పదవులు మావి - బాధలు మీవి[మార్చు]

పద్మాసనం వేసుకుని కూర్చుంటే పరమాన్నం వడ్డిస్తారా?[మార్చు]

పదిమంది కళ్ళ పడ్డ పాము చావక బ్రతుకుతుందా?[మార్చు]

పదిమంది చేరితే పనిపాడు[మార్చు]

పదిమంది నడిచిందే బాట[మార్చు]

పది మందిలో పడ్డ పాము తప్పించు కుంటుంది[మార్చు]

పది మందిలో పడ్డ పాము తలో మాట చెపుతూ అలజడి సృష్టిస్తారు. ఇంతలో ఆ పాము తప్పించు కుంటుంది. ఒక నాయకత్వంపై ఏదైనా పని చేయాలని ఈ సామెత అర్థం.

పది రాళ్ళు వేస్తే ఒక రాయైనా తగులుతుంది[మార్చు]

పది వూళ్ళ పాపరాజులాగా[మార్చు]

పదుగురు నడిచిన దారిన పులు మొలవదు[మార్చు]

పులు అనగా గడ్డి అని అర్థం. పలువురు నడిచే దారిలో గడ్డి మొలవదు అనిఅర్థం. అనగా పదిమందిలో చెడుగా ముద్ర పడివ వాదు అభివృద్ధిలోకి రాడని అర్థం.

పదుగురాడు మాట పాటిపై ధర చెల్లు[మార్చు]

పది మంది చెప్పిన మాటే చల్లు తుంది. ఇది ఒక పద్య పాటము: పదుగురాడు మాట పాటియై ధరచెల్లు, ఒక్కడాడు మాట ఎక్కదెందు. ఒక్కడే ఎంత మొత్తుకున్నా వాని మాట చెల్లదని అర్థం.

పనికి పంగనామం పెట్టి గంపజాతర నెత్తికెత్తుకున్నట్లు[మార్చు]

పనికి పరాకు - తిండికి హుషారు[మార్చు]

పని చేయడానికి మొండికేసి......... తిండికి మాత్రం ముందుండే వారి గురించి ఈ సామెత ఉపయోగిస్తారు

పనికి పాతిక నష్టం - పరక లాభం[మార్చు]

పనికి పీనుగ - తిండికి ఏనుగు[మార్చు]

పనికి వచ్చి సరదా తీర్చమన్నట్లు[మార్చు]

పనిగలవాడు పందిరేస్తే పిచ్చుకలు వ్రాలగానే పడిపోయిందట[మార్చు]

పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది[మార్చు]

పనిగల మేస్త్రి పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిపోయింది. (ఇది సామెతకు అసలు అర్థం) ఒక పనిలో ఎంతో ఆరి తేరిన వాడనని చెప్పుకునే వానిని నమ్మి పనిచెపితే... ఆ పని తర్వాత ఆపనిలోని డొల్లతనం తెలిసి పోతుంది. ఆ సందర్భంలో ఈ సామెత వాడతారు.

పనిచేయనివాడు ఇంటికి చేటు[మార్చు]

పని తక్కువ - ప్రాకులాట ఎక్కువ[మార్చు]

పని లేని మంగలి పిలిచి తల గొరిగినట్లు[మార్చు]

సాధారణంగా బజారులో అన్ని దుకాణందారులు తమ అంగడికి రమ్మని పిలుస్తూ ఉంటారు ఒక్క మంగలి తప్ప. జుత్తు పెరిగితే మనమే మంగలి దగ్గరికి వెళ్ళలి


పనిలేని మంగలి పిల్లి తల గొరిగినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏ పనీ లేనివారు ప్రజల మెప్పుకోసం ఎవరికీ ఉపయోగపడని పనిచేస్తుంటే వారిని ఉద్దేశించి ఆ సామెత ప్రయోగిస్తాం. నిర్వ్యాపారాంబష్టన్యాయము

పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది[మార్చు]

పనిగల మేస్త్రి పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిపోయింది. (ఇది సామెతకు అసలు అర్థం) ఒక పనిలో ఎంతో ఆరి తేరిన వాడనని చెప్పుకునే వానిని నమ్మి పనిచెపితే... ఆ పని తర్వాత ఆపనిలోని డొల్లతనం తెలిసి పోతుంది. ఆ సందర్భంలో ఈ సామెత వాడతారు.

పనీ పాటూలేదు పదం పాడతానన్నట్లు[మార్చు]

పనిముందా? తిండి ముందా?[మార్చు]

పని ముద్దా? పాటు ముద్దా?[మార్చు]

పని లేని పాపరాజులాగా[మార్చు]

పన్నెండామడల మధ్య బ్రాహ్మణుడు లేకపోతే యజ్ఞం చేయిస్తానన్నాడట[మార్చు]

పప్పుకూటికి ముందు - చాకిరీకి వెనుక వుండాలి[మార్చు]

పప్పు దాటినాక నందైతేనేమి పందైతేనేమి[మార్చు]

పప్పులేని పెళ్ళి - ఉప్పులేని కూర[మార్చు]

పప్పులో ఉప్పు వేసేటప్పుడు చెప్పెయ్యవే కోడలా అంటే, పప్పులో చెప్పువేసి, అత్త కంచంలో అంచున పెట్టిందట[మార్చు]

పరుగెత్తి పాలుతాగే కంటే,నిలబడి నీళ్ళు తాగటం మేలు[మార్చు]

అపసోపలు పడి అధికంగా సంపాదించ డానికన్నా కొంచెమైనా నిదానంగా సంపాదించడం మేలని దీని అర్థం.

పరువం మీద వున్నపుడు పంది కూడా అందంగా ఉంటుంది[మార్చు]

16 ఏళ్ల వయసులో గాడిద కూడా గంధర్వ కన్య లాగ ఉంటుంది

పల్లాన పండింది; మెరకన ఎండింది; వాడికుప్ప కాలింది; వాడి అప్పుతీరింది. అయితే ఎవరు వాడు?[మార్చు]

(ఇది పొడుపు కథ దీనిని ఆ వర్గంలో చేర్చ వచ్చు)

పళ్లూడగొట్టుకోడానికి ఏ రాయైతేనేమి?[మార్చు]

నోట్లో ఉన్న పళ్ళు ఊడగొట్టుకోదలచినప్పుడు ప్రత్యేకమైన రాయి అవసరంలేదు. అందుకు ఏ రాయైనా సరిపోతుంది. అదే విధంగా తనకు తాను స్వయంగా నష్టం కలిగించుకుంటున్నప్పుడు అది ఏ పధ్ధతిలో జరిగినా ఒకటేనని చెప్పటానికి ఈ సామెతను వాడుతారు.

పయోముఖ విషకుంభము[మార్చు]

పైకి చూడ్డానికి చాల అమాయకంగా కనిపిస్తూ లోన దుర్భుద్దులున్న వారినుద్దేశించి ఈ సామెత వాడుతారు

పరకాంత పొందు తాచుపాము పడగ[మార్చు]

పరకాంత లెందరయినా కులకాంతకు సాటిరారు[మార్చు]

పరనింద గృహక్షయం - యతినింద కులక్షయం[మార్చు]

పరమానందయ్యగారి శిష్యులలాగా[మార్చు]

అత్యంత అమాయకుల గురించి ఈ సామెత ఉపయోగిస్తారు. పరమానందయ్య శిష్యులు చాల అమాయకులు

పరికిణీ, పావడాలు పరువాల ఆవడలు[మార్చు]

పరుగెత్తి పాలు త్రాగేకన్నా, నిలబడి నీళ్ళు త్రాగటం మేలు[మార్చు]

పరులసొమ్ము పాపిష్టిది[మార్చు]

పరుల సొమ్ము పామువంటిది[మార్చు]

పరుల సొమ్ము పేలపిండి[మార్చు]

పరువాల జాతరలో పెదవి ఎంగిలా?[మార్చు]

పరువాల పల్లవింత - పాన్పు త్రుళ్ళింత[మార్చు]

పరువాల పొందుకు పరదాలు అడ్డెందుకు?[మార్చు]

పరువాల పోరు మధువుల పుంత అన్నట్లు[మార్చు]

పరువిచ్చి పరువు తెచ్చుకో[మార్చు]

పరువుకీ, కరువుకీ డబ్బు[మార్చు]

పరువు లేని బ్రతుకు పరమ రోత[మార్చు]

పళ్ళూడకొట్టుకోవటానికి ఏ రాయైనా ఒక్కటే[మార్చు]

పసిపిల్లలు దేవుడితో సమానం[మార్చు]

పసిపిల్లలు, తాగుబోతులు నిజం చెబుతారు[మార్చు]

పసుపు, కుంకుమల కోసం పది క్రోసులయినా వెళ్ళాలి[మార్చు]

పరోపకారం ఇదం శరీరం[మార్చు]

ప్రదక్షిణాలు చేస్తూ కడుపు చూచుకున్నదట[మార్చు]

దేవునికి ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారని ఎవరో చెప్పితే ....... ఒక ఇల్లాలు దేవునికి ప్రదక్షిణాలు చేస్తూ..... చుట్టు చుట్టుకూ కడుపు చూసుకున్నదట కడుపు వచ్చిందస లేదాయని. అనగా అమాయకురాలని అర్థము.

ప్రమిదలో వత్తేసి కళ్ళలో దీపాలు వెలిగించు అందిట[మార్చు]

ప్రయాణం అబద్ధం - ప్రసాదం నిబద్ధం[మార్చు]

ప్రసూతి వైరాగ్యం పురిటి పచ్చి ఆరేదాకానే[మార్చు]

పశువుల పాలు మేపును బట్టి[మార్చు]

పశువులు తమకు వేసిన మేతను బట్టి పాలిస్తాయని అర్థము

పశువుల విరివి - పంటకు తేట[మార్చు]

పాచిన కూరలు బాపనికన్నట్లు[మార్చు]

పాచిపండ్లవాడు కూడబెడితే, బంగారు పండ్లవాడు అనుభవించాడట[మార్చు]

పాటకు పది ఫణుతులు[మార్చు]

పాటిమీద గంగానమ్మకు కూటిమీదే ధ్యాస[మార్చు]

పాటు చేతకానివాడు మాటల మోసగాడు[మార్చు]

పాటుకలిగితే కూటికి కొదువా?[మార్చు]

పాటు పడితేనే భాగ్యం[మార్చు]

పాటులెల్ల పొట్టకూటికే[మార్చు]

ఏపని చేసినా పొట్ట కూటికే అనే అర్థం ఈ సామెకు వున్నది

పావలా కోడికి ముప్పావలా దిష్టి[మార్చు]

అసలు కన్నా కొసరు ఎక్కువని దీనర్థం.

పావల కోడికి ముప్పావలా మసాల[మార్చు]

అసలు కన్నా కొసరు ఎక్కువ అని ఈ సామెతకు అర్థం.

పాడికి పంట తమ్ముడు[మార్చు]

పాడికుండలు పగులకొట్టినట్లు[మార్చు]

పాడి గుట్టు - పంట రట్టు[మార్చు]

పాడిని దాచాలి - పంటను పొగడాలి[మార్చు]

పాడి పసరము, పసిబిడ్డ ఒకటే[మార్చు]

రైతు ఇంట్లో వున్న పిల్లలను\పశువులను సమానంగా చూస్తాడని/ఆదరిస్తాడని అర్థము

పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరీ![మార్చు]

చెప్పిన విషయాన్నే పదే పదే అదే పనిగా చెబుతూ ఉంటే వినే వారికి విసుగొస్తుంది. ఈ సందర్భాన్ని ఈ సామెతతో చెబుతాం.

పాడువూరికి నక్క తలారి[మార్చు]

పాడే నోటికి పాట పండుగ[మార్చు]

పాత చింతకాయ పచ్చడి[మార్చు]

పాత చుట్టం - పాత చింతకాయపచ్చడి[మార్చు]

పాతది పనికి రాదు - కొత్తది కొరగాదు[మార్చు]

పాత రోత - కొత్త రుచి[మార్చు]

పాత్ర యెరిగి దానం యివ్వాలి - వంశ మెరిగి బిడ్డను తెచ్చుకోవాలి[మార్చు]

పానకంలో పుడకలాగా[మార్చు]

పానుపు అలవాలిగానీ తనువులు గాదన్నట్లు[మార్చు]

పాపమని పాత చీర ఇస్తే ఇంటి వెనక్కు వెళ్ళి మూరేసుకుందట[మార్చు]

దానమిచ్చిన వస్తువుయొక్క మంచి చెడులు బేరీజు వేయడం.

పాపమని పాలు పోస్తే, ఒద్దని ఒలకపోశాడట[మార్చు]

పాపమని భోజనం పెడితే పక్కలోకి రమ్మన్నాడట[మార్చు]

పాపాల భైరవుడు[మార్చు]

పాపి చిరాయువు[మార్చు]

పాపిట వంకరయితే బ్రతుకంత వంకరే[మార్చు]

పాపి సముద్రానికి పోతే అరికాలు తేమ కాలేదుట[మార్చు]

పాపిసొమ్ము పరులపాలు - ద్రోహిసొమ్ము దొంగలపాలు[మార్చు]

పాముకాళ్ళు పాముకే ఎరుక[మార్చు]

పాముకు పళ్ళలో విషం - జ్ఞాతికి కండ్లలో విషం[మార్చు]

పాముకు పాలు పోసి పెంచి నట్టు[మార్చు]

దుర్మార్గులను చేరదీస్తే ఏనాటికైనా ప్రమాదమనిసూసించే సామెత ఇది.

పాము చావరాదు - బడిత విరగరాదు[మార్చు]

పాము చుట్టము - పడగ పగ[మార్చు]

పాము పడగ నీడను కప్ప చందాన[మార్చు]

అత్యంత ప్రమాద పరిస్థితిలో వున్నాడని ఈ సామెతకు అర్థము.

ప్రాణముంటే శివం - ప్రాణం పోతే శవం[మార్చు]

ప్రాణం పోయినా మానం పోరాదు[మార్చు]

ప్రాణం కన్నా పరువు గొప్పదని ఈ సామెతకు అర్థము

ప్రాణం వున్నప్పుడే పంతాలు నెరవేరుతాయి[మార్చు]

ప్రాస కోసమేడ్చానే కూసుముండా అన్నట్లు[మార్చు]

పారే ఏటికి నీరు పండుగ[మార్చు]

పాలకొండ లోయల్లో బంతులాట అన్నట్లు[మార్చు]

పాలకోసం పొదుగు కోసినట్లు[మార్చు]

పాల పొంగు - పడుచు పొంగు[మార్చు]

పాలు, నీళ్ళలా కలిసిపోయారు[మార్చు]

చాల కలగోలుపుగా వున్నారని అర్థం.

పాలు తాగి రొమ్ము గుద్దినట్టు[మార్చు]

తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లు.... అనే సామెత లాంటిదే ఇది కూడ

పాలు పొంగటం పొయ్యిపాలుకే[మార్చు]

పాండవుల సంపాదన దుర్యోధనుల వారి పిండాకూళ్ళకు సరి[మార్చు]

పిట్ట కొంచెం కూత గనం[మార్చు]

చిన్నవయసులో పెద్ద ఘనత సాధించిన వారిగురించి ఈ సామెత వాడతారు

పిట్టపోరూ పిట్టపోరూ పిల్లి తీర్చినట్లు[మార్చు]

పిండి కొద్దీ రొట్టె[మార్చు]

ఎన్ని రొట్టెలు కావాలో వాటికి సరిపడా పిండిని కలుపు కోవాలి. తక్కువ పిండి కలిపి ఎక్కువ రొట్టెలు కావాలంటే అది అసాద్యం. అలాగే కొంచెం పిండి కలిపి పెద్ద రొట్టె చేయాలంటే కూడా కుదరదు.

పిండికొద్దీ రొట్టె - తిండికొద్దీ పసరం[మార్చు]

పిండి ఎంత ఎక్కువ వుంటే అన్ని రొట్టెలు చేసుకో వచ్చు...... అలాగే ఆవుకు ఎంత తిండి పెడితే అన్ని పాలిస్తుందని ఈ సామెతకు అర్థము.

పిండి బొమ్మ చేసి ఆడబిడ్డంటే, ఆడబిడ్డ తనాన అదిరదిరి పడిందిట[మార్చు]

పిండేవాడు పిండితే పిటుకురాయైనా పాలిస్తుంది[మార్చు]

పిండార బోసినట్లు వెన్నెల[మార్చు]

పిండీ, బెల్లమూ ఇచ్చి పిన్నమ్మా నీ ప్రసాదం అన్నట్టు[మార్చు]

సొమ్మంతా ఒకరి చేతికిచ్చి ఖర్చులకు వారిని అడగాల్సిన దుస్థితి, తెలివితక్కువ వ్యవహారం.బుద్ధిలేనితనం.

పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం[మార్చు]

చిన్న విషయానికి, పెద్ద విషయానికి ఒకే పనితనము పనికిరాదని చెప్పేదే ఈ సామెత.

పిడుగుకు గొడుగడ్డమా?[మార్చు]

పితికే బర్రెను యిచ్చి పొడిచే దున్నను తెచ్చుకున్నట్లు[మార్చు]

పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు[మార్చు]

ఎటు వంటి పరిష్కారం దొరకని సమస్య వచ్చినప్పుడు ఈ సామెత వాడతారు.

పిచ్చి తగ్గింది నీకంటే, తలకు రోకలి చుట్టమన్నాడట[మార్చు]

అనగా వానికి ఇంకా పిచ్చి తగ్గ లేదని అర్థం.

పిచ్చి వాని చేతిలో రాయి[మార్చు]

పిచ్చి వాడు తన చేతిలోని రాయిని ఎవరి మీదకు విసురుతాడో తెలియదు.

పిచ్చి పలురకాలు వెర్రి వేయి రకాలు[మార్చు]

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు[మార్చు]

గోటితో పొయ్యేదానికి గొడ్డలి ఎందుకు? అనే సామెత లాంటిదే ఇదీను./ కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు

పిచ్చెమ్మ తెలివి వెర్రెమ్మ మెచ్చుకోవాలి[మార్చు]

పిచ్చోడి చేతిలో రాయి[మార్చు]

పిచ్చోడు రాయితో ఎవరిని గురి పెట్టి కొట్టడు. ఎవరిని కొట్టాలో అతనికే తెలియదు. అతడు విసిరిన రాయి ఎవరికైనా తగలవచ్చు. అందరు జాగ్రత్తగా వుందాలని దీని అర్థం..

పిచ్చోడికి పింగే లోకం[మార్చు]

ప్రియం మహాలక్ష్మి - చౌక శనేశ్వరం[మార్చు]

పిలవని పేరంటానికి వెళ్ళినట్లు[మార్చు]

పిల్ల ఓపిక శోభనంలో తెలుస్తుందన్నట్లు[మార్చు]

పిల్ల గలవాడు పిల్లకేడిస్తే - కాటివాడు కాసుకేడ్చినట్లు[మార్చు]

పిల్ల చచ్చినా పురుటి కంపు పోలేదు[మార్చు]

పిల్ల చచ్చినా పురుటి కంపు పోలేదు[మార్చు]

పిల్ల పిడికెడు - గూనె గంపెడు[మార్చు]

పిలిచి పిల్లనిస్తానంటే వంక పెట్టినట్లు[మార్చు]

పిలిచేవారుంటే బిగిసేవారికి కొదువలేదు[మార్చు]

పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ[మార్చు]

పిల్లనిచ్చినవాడు ఈగ - పుచ్చుకున్నవాడు పులి[మార్చు]

పిల్లను సంకలో పెట్టుకొని ఊరంతా వెతికినట్టు[మార్చు]

అతిగా మతిమరుపు గలవారిగురించి ఈ సామెత చెప్పతారు

పిల్లా అని పిలిస్తే పెళ్ళి చేసుకుంటావా అని అడిగిందట[మార్చు]

పిల్లి ఎదురైతె తల్లి గూడా శత్రువవుతుంది[మార్చు]

ప్రయాణమై వెళుతుంటే పిల్లి ఎదురు రాకూడదని ప్రజల్లో ఉన్న మూడ నమ్మకానికి ఈ సామెత పుట్టింది

పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగుతూ ఎవరూ చూడటం లేదనుకుంటుందట. S[మార్చు]

పిల్లికి ఎలుక సాక్షి[మార్చు]

పిల్లికి కూడా భిక్షం పెట్టనట్లు[మార్చు]

మహా పిసినారి గురించి ఈ సామెత పుట్టింది

పిల్లికి చెలగాటం - ఎలుకకు ప్రాణసంకటం[మార్చు]

పిల్లికి రొయ్యల మొలత్రాడు కట్టినట్లు[మార్చు]

పిల్లి గుడ్డిదయితే ఎలుక వెక్కిరించిందట[మార్చు]

ఒకప్పుడు బాగా బతికిన కాలంలో ఎవరికైనా కీడు చేసి వుంటే... అతడు బలహీనుడవగానే అతని శత్రువులు అతని పనిపడతారు. అది ఈ సామెత అర్థము

పిల్లి గ్రుడ్డిదయితే ఎలుక ముడ్డి చూపిస్తుంది[మార్చు]

పిల్లి పిల్లలను త్రిప్పినట్లు[మార్చు]

పిల్లి తాను పెట్టిన పిల్లలను కుదురుగా ఒక చోట వుండనియ్యదు. పిల్లల బద్రత కొరకు తన పిల్లలను మూడు రోజులకొకసారి స్థానాన్ని మారుస్తుంది. ఆవిధంగా తమ స్థానాన్ని మార్చు వారినుద్దేశించి ఈ సామెతను ఉటంకిస్తారు

పిల్లిమెడలో గంట కట్టేదెవరు?[మార్చు]

వివరణ: ఎలుకలని చంపుతున్న పిల్లి బాధ పడలేక ఎలుకలన్నీ ఒక సమావేశము ఏర్పాటు చేసి ఒక నిర్ణయానికొచ్చాయి. అదేమంటే.... ఎవరైనా పిల్లి మెడలో గంట కడితే అది మనమీద దాడి చేసేందుకువచ్చేటప్పుడు గంట శబ్దం విని మనం దాక్కో వచ్చు అని వాటి అభిప్రాయము. కాని అలా పిల్లి మెడలో గంట కట్టేదెవరు? ఇది అసాద్యం. అసాద్యమైన పని గురించి చెప్పే సామెత ఇది.

పిల్లిని చంకలో పెట్టుకుని పెళ్ళికి వెళ్ళినట్లు[మార్చు]

పిల్లిని చంపిన పాపం గుడి కట్టించినా పోదు[మార్చు]

పిల్లిని చంపకూడదని ప్రజల్లో వున్న నమ్మకాన్ని బట్టి ఈ సామెత పుట్టింది

పిల్లిని సంకలో పెట్టుకొని రామేశ్వరం పోయినట్లుంది[మార్చు]

పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా?[మార్చు]

వివరణ: ఉట్టి మీదున్న పాల కుండను చూసి పిల్లి ఈ ఉట్టి తెగిపోవు గాక" అని శాపంపెట్టి అది తెగి పాల కుండ పగిలి పోతే పాలు తాగ వచ్చునని దాని ఆశ. అలా స్వార్థానికి పెట్టే శాపాలు,. తిట్లు పని చేయవని ఈ మాటకు అర్థం

పిలిచి పిల్లనిస్తానంటే కులమేమి గోత్రమేమని అడిగాడట[మార్చు]

పెళ్ళి చేసుకోవడానికి పిల్ల దొరకడమే గగనంగా వున్న రోజుల్లో ... ఒకడు పిలిచి పిల్లనిస్తానంటే..... వారి కులగోత్రాలు ప్రశ్నించాడట ఒకడు.

ప్రీతితో పెట్టింది పట్టెడయినా చాలు[మార్చు]

భక్తి కలిగిన కూడు పట్టెడైన చాలు అనే నానుడి లాంటిదే ఈ సామెత కూడాను

పుండుకు పుల్ల మొగుడు[మార్చు]

పుండున్నచోటే పుల్ల తగుల్తుంది[మార్చు]

పుండు మానినా మచ్చమానదు[మార్చు]

పుండు మీద కారం చల్లి నట్లు[మార్చు]

కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతుంటే ఈ సామెతను వాడతారు

పుక్కిట పురాణం[మార్చు]

పుట్టని బిడ్డకు పూసల దండ అల్లినట్టు[మార్చు]

ఏమీ జరగకుండానే ఏదో జరిగిపోయినట్టు తెగ హడావుడి .బిడ్డ పుట్టడని తెలిసినా బిడ్డ కోసం పూసలదండ అల్లుతూ కూర్చోవటమంటే లేనిపోని హడావుడి చేయటమే

పుట్టంగ పురుడు - పెరగంగ పెళ్ళి[మార్చు]

పుట్టనివాడు, గిట్టినవాడు పుణ్యాత్ములు[మార్చు]

ప్రతి ఒక్కరు పాపం చేసిన వారే అని ఈ సామెతకు అర్థము

పుట్టమన్ను వేస్తే పుట్లకొద్దీ పంట[మార్చు]

పుట్టమీద తేలుకుడితే నాగుపాము కరచినట్లే[మార్చు]

పుట్టి చచ్చినా కొడుకే మేలు[మార్చు]

పుట్టినవాడు గిట్టక మానడు[మార్చు]

పుట్టి మునిగినట్లు[మార్చు]

పుట్టెడు నువ్వుల్లోపడి దొర్లినా అంటేగింజే అంటుతుందిగానీ అంటనిది అంటదు[మార్చు]

పుచ్చుకున్నప్పుడు కొడుకుపుట్టినంత సంతోషం, యిచ్చేటప్పుడు మనిషిపోయినంత బాధ[మార్చు]

పుట్టుకతో వచ్చిన బుద్ది, పుడకలతో గానీ పోదు[మార్చు]

ఎవరికైనా చిన్ననాటి నుండి వచ్చిన అలవాట్లు అంత సులభంగా పోవని ఈసామెత అర్థం.

పుడుతూ పుత్రులు పెరుగుతూ శత్రువులు[మార్చు]

తండ్రి కొడుకులు ఆస్తి పంపకాలు కోడళ్ళు ప్రేమ వివాహాలు మొదలైన విషయాల్లో మనస్ఫర్ధలకు లోనవుతారు. ఆ మనస్ఫర్ధలే ఇద్దరినీ శత్రువులుగా మార్చేస్తాయి. చిన్నప్పుడు ముద్దు మురిపాలు పంచుకున్న ఆ ఇద్దరే ఒకరి ఊసంటే ఒకిరికి పడక బద్ధ శత్రువుల్లాగా మారిపోతుంటారనే వైరాగ్య భావనతో ఈ సామెత

పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు[మార్చు]

పుణ్య కార్యాలు చేసె వారికి జీవితం సుఖమయమౌతుందని చెప్పే సామెత ఇది.

పుణ్యంకొద్దీ పురుషుడు - విత్తంకొద్దీ వైభవం[మార్చు]

పుణ్యం పుట్టెడు - పురుగులు తట్టెడు[మార్చు]

పుణ్యానికి పిలిచి కొలిస్తే పిచ్చికుంచమని పారపోశాడట[మార్చు]

పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్లు[మార్చు]

పువ్వులమ్మిన చోటే కట్టెలమ్మినట్లు[మార్చు]

పువ్వులా విచ్చుకుంటా తుమ్మెదలా దోచుకో అందట[మార్చు]

పుబ్బ ఉబ్బిబ్బి కురిసినా చెట్టు క్రింద గడ్డనానదు[మార్చు]

పుబ్బ కార్తెలో వర్షాలు కురవవు అనడానికి ఈ సామెత వాడుతారు.

పుబ్బ రేగినా బూతురేగినా నిలువవు[మార్చు]

పుబ్బలో చల్లినా, బూడిదలో చల్లినా ఒక్కటే[మార్చు]

ఇది వ్యవసాయ సంబంధిత సామెత. పుబ్బ కార్తెలో విత్తనాలు చల్లితే పంట రాదని దీనర్థము

పుబ్బలో చల్లేదానికంటే దిబ్బలో చల్లేది మేలు[మార్చు]

పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లు[మార్చు]

పురిటిలోనే సంధి కొట్టినట్టు[మార్చు]

పురుషుల భాగ్యం - పడతుల సౌఖ్యం[మార్చు]

పురుషులందు పుణ్య పురుషులు వేరయా![మార్చు]

ఇది ఒక వేమన పద్య భాగము.

పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి[మార్చు]

మనుషులు అందరు ఒక్కటి కాదు. ఎవరి బుద్దులు వారివి అనే అర్థం లో ఈసామెత వాడుతారు.

పుర్రెకొక తెగులు[మార్చు]

పుల్లయ్య వేమారం వెళ్ళి వచ్చినట్లు[మార్చు]

పుంగనూరు జవాను లాగా అనే సామెత లాంటిదే ఇదీను. వివరణ: ఒక రైతు తన పాలేరుని రేపు ఏదో పనిమీద వేమారం గ్రామానికి పంపదామని తన బార్య తో అంటుండగా ఆ మాట పుల్లయ్య విన్నాడు. అతి నమ్మకస్తుడైన పుల్లయ్య ఎలాగు వేమారం వెళ్ళమంటాడని పెందలకడనే బయలు దేరి వేమారం వెళ్ళి వచ్చాడు పుల్లయ్య. తెల్లవారి పుల్లయ్యను వేమారం పంపుదామని చూస్తుంటే పుల్లయ్య కనిపించలేదు. కొంత సేపటికి రానే వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావని అడిగితే..... తమరు నన్ను వేమారం పంపుదామని అనుకుంటే విన్నాను.... అందుకని వేమారం వెళ్ళి వచ్చేశాను అన్నాడు. అమాయకుడని అర్థము

పులి కడుపున పిల్లులు పుడతాయా?[మార్చు]

పులిమీద పుట్రలాగా[మార్చు]

పులిమీద స్వారి[మార్చు]

వివరణ. పులిమీద స్వారి చాల ప్రమాదకరము.పులి మీద ఎక్కినవాడు అలా స్వారి చేస్తూనే వుండాలి. దిగాడంటే పులి వాడిని తినేస్తుంది.మిక్కిలి ప్రమాదకరమైన పని చేస్తున్న వారినుద్దేశించి చెప్పేసామెత ఇది.

పులి మీసాలతో ఉయ్యాల ఊగినట్లు[మార్చు]

ప్రమాదకరమైన పనిచేస్తున్నాడని అర్థము

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు[మార్చు]

పులిచారలను పోలిన విధంగా వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి కాజాలదు. గొప్పవారిని అనుకరించినంత మాత్రాన సామాన్యులు గొప్పవారు కాలేరని చెప్పడానికి ఈ సామెతను వాడుతారు.

పుల్లయ్య వేమారం(వేమవరం) వెళ్ళొచ్చినట్లు[మార్చు]

'పుల్లాయావారం చేసావ్.' ఇది మాట వాడుక. సరిగా జరగని లేదా ప్రయోజనము లేక జరిగిన పనిని గురించి వాడబడు పదం. ఆచంట షావుకారు తన పనివాడు పుల్లయ్యకు చెప్పాడు ఇలా "ఒరే పుల్లయ్యా రేప్పొద్దున్నే ఓసారి వేమారం వెళ్ళిరావాల్రా పెందలకడనే లేచి". అప్పుడు పుల్లయ్య "సరేనండయ్యా" అని పుల్లయ్య ఇంటికెళ్ళి పడుకొని మరునాటి ఉదయమే లేచి వేమవరం వెళ్ళి వచ్చేసాడు.తాపీగా మధ్యాహ్నానానికి వచ్చిన పుల్లయ్యను చూసి "ఏరా పుల్లయ్యా ఎక్కడికి పోయావ్ పొద్దున్నే వేమవరం వెళ్ళాలన్నానుగా " అన్నాడు షావుకారు. అప్పుడు పుల్లయ్య "అయ్య నేను పొద్దున్నే లేచి ఎల్లొచ్చేసేనయ్యా ఏమారం" అన్నాడు మన పిచ్చి పుల్లయ్య . "నేను పనేంటో చెప్పకుండా ఎలా వెళ్ళావు. ఎందుకెళ్ళావు ?ఎందుకొచ్చావు? నీకు చెప్పడం నా తప్పు " అని వాపోయాడు షావుకారు.

పై కథనం మీదుగా ఈ సామెత పుట్టిందని ఒక వాదన.

పుష్యమాసంలో పూసలు గ్రుచ్చ పొద్దుండదు[మార్చు]

పుష్యమాసానికి పూసంత వేసంగి[మార్చు]

పుష్యమి కురిస్తే పిట్టకూడా తడవదు[మార్చు]

పూచిన పువ్వంతా కాయలైతే చెట్టు మనునా?[మార్చు]

పూచింది పుడమంత - కాచింది గంపంత[మార్చు]

పూజకన్నా బుద్ధి - మాటకన్నా మనసు ప్రధానం[మార్చు]

పూటకూళ్ళమ్మకు పుణ్యంతో పని లేదు[మార్చు]

పూటకూళ్ళింటి తిండిలాగా[మార్చు]

పూట గడుస్తుందిగానీ మాట నిలచిపోతుంది[మార్చు]

పూనినకర్మ పొరుగూరు పోయినా తప్పదు[మార్చు]

పూరిగుడిసెకు పందిరి మంచమా అన్నట్టు[మార్చు]

స్థాయిమరచి వ్యవహరించటం, స్తోమతకు మించి ఆలోచించటం కూడదని ఈ సామెతకు అర్థం.

పూర్ణం లేని బూరె - వీరణంలేని పెళ్ళి[మార్చు]

పూవు పుట్టగానే పరిమళిస్తుంది[మార్చు]

పూవు పుట్టగానే తెలుస్తుంది కళ[మార్చు]

పూబోడీ అంటే, ఎవర్రా బోడి? నీ అమ్మబోడి, నీ అక్కబోడి అందట[మార్చు]

పెదవులతో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించటం[మార్చు]

మనసులో కల్మషం పెట్టుకొని పైకి బాగా మాట్లాడే వారిని గురించి ఈ సామెత చెప్తారు.

పెద్దలమాట చద్దిమూట[మార్చు]

పెద్దలు లేని యిల్లు - సిద్ధులు లేని మఠము[మార్చు]

పెట్టే వాడు మన వాడైతే ఎక్కడ కూర్ఛున్నా ఫర్వాలేదు[మార్చు]

భోజనాల బంతిలో మొదట కూర్చోవాలనేది ఒక సూక్తి. ఎందుకంటే..... చివర్లో కూర్చుంటే వడ్డించే ఆహార పదార్థాలు తనదాక వస్తాయే లేక మధ్యలోనే అయిపోతాయేమోనని సందేహం. కాని వడ్డించే వాడు మనవాడైతె.. పదార్థాలు సరిపడక పోయినా.... మిగిల్చుకొని తనదాక వస్తాడస్ని ఈ సామెత అర్థం.

పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు[మార్చు]

పొయ్యిమీద ఉన్న పెనం కన్నా పొయ్యిలోని మంట ఇంకా చాలా వేడిగా ఉంటుంది. ఏదైనా వస్తువు పెనం మీదినుండి పొయ్యిలో పడితే ఇంకా ఎక్కువ కాలుతుంది. ఈ విధంగా ఎవరైనా ఉన్న బాధల కంటే ఎక్కువ బాధలలోకి దిగజారితే వారి పరిస్థితిని వివరిస్తూ ఈ సామెతను వాడుతారు.

పెరుగుట విరుగుట కొరకే[మార్చు]

ఏదైనా మితంగా వుండాలి. అతిగా పోతే నష్టపడక తప్పదని చెప్పెదే ఈ సామెత.

పెళ్ళి అయిన యింటిలో ఆరునెలలు కరువు[మార్చు]

పెళ్ళి చేసి చూడు..... ఇల్లు కట్టి చూడు అనే నానుడి లాంటిదే ఈ సామెత. పెళ్ళికి, ఇంటికి చాల ధనము ఖర్చు అవుతుంది... ఆ దెబ్బ నుండి కోలుకోవాలంటే చాల కాలం పడుతుందని ఈ సామెతకు అర్థం.

పెళ్ళి ఒకరితో శోభనం మరొకరితో అన్నట్లు[మార్చు]

పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా పెళ్ళికూతుర్లేనా?[మార్చు]

పెళ్ళికి వచ్చినవారే చేస్తారు పెళ్ళి పనులు, పెళ్ళామా! నీ ఒళ్ళు అలిపించుకోకు అన్నాడట[మార్చు]

పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన వేసుకెళ్ళినట్టు[మార్చు]

బయటకు వెళ్లేటప్పుడు పిల్లి ఎదురైతే శుభశకునం కాదన్నది ఒక మూఢనమ్మకం. పిల్లి ఎదురైనప్పుడు బయలుదేరవలసిన వాళ్లు ఆగిపోవటం జరుగుతుంటుంది. అలాంటిది పిల్లిని చంకనపెట్టుకుని పెళ్ళికి వెళితే పిల్లితోపాటు ఆ పిల్లిని ఎత్తుకుని వస్తున్న వ్యక్తిని కూడా తిడతారు.అసలు సంగతి పిల్లిలాగా అపశకునకారిలాగా ఉండే వ్యక్తిని పక్కనపెట్టుకుని బయలుదేరితే ఆ వ్యక్తితోపాటు తీసుకెళ్ళిన మంచి వ్యక్తి కూడా మాటపడవలసి వస్తుంది. కనుక ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు, కలిసి తిరిగేటప్పుడు సమాజం వాళ్లు చేసే పనులను హర్షిస్తుందా? నిరసిస్తుందా? అనే విషయాలను గమనించుకుని స్నేహం చేయాలి. ఒకవేళ సమాజం వ్యతిరేకించే వ్యక్తులు గనుక అయితే వారిని వెంటపెట్టుకుని నడవటం మంచిదికాదన్నది ఈ సామెత చెప్పే సత్యం. ==పెళ్ళికొడుకు కుడికాలు చూచి అత్త ఏడుస్తుంటే, ఏడ్పులో ఏడ్పు ఎడమకాలూ చూడమన్నాడట తోడపెండ్లికొడుకు ==

పెళ్ళికొడుకు మావాడేగానీ, చెవి పోగులు మాత్రం మావిగావు అన్నట్లు[మార్చు]

పెళ్ళినాటి పప్పుకూడు రోజూ దొరుకుతుందా?[మార్చు]

పెళ్ళినాడే పరగడుపన్నట్లు[మార్చు]

పెళ్ళిని చూస్తూ ఒకడుంటే, పెళ్ళాన్ని చూస్తూ ఒకడున్నాడట[మార్చు]

పెళ్ళిలో పుస్తె కట్టడం మరచిపోయినట్లు[మార్చు]

పెళ్ళీ - పెటాకులు[మార్చు]

పెళ్ళాం పోతే పురుషుడు మళ్ళీ పెండ్లికొడుకు[మార్చు]

పెదవి దాటితె పృధివి దాటు తుంది[మార్చు]

ఏదైన రహస్యాన్ని మనసులోనే దాచుకోవాలి. దాన్ని ఎవరికైన చెప్పామొ తప్పక అది బహిర్గతం అవుతుందని అర్థం.

పెళ్ళికి బొట్టుపెట్టి పిలిస్తే వెళ్ళక, పెంకుపట్టుకుని వెనుకదారిన పులుసు కోసం వెళ్ళిందట[మార్చు]

పెళ్లికి పందిరి వెయ్యమంటే చావుకి పాడి కట్టినట్టు[మార్చు]

ప్రతి పని చాల ఆలస్యంగా చేసే వారిని గురించి ఈ సామెతను వాడతారు.

పెంటకొద్దీ పంట[మార్చు]

పెట్టకపోయినా పెట్టే యిల్లు చూపమన్నారు[మార్చు]

పెట్టనమ్మ పెట్టనే పెట్టదు పెట్టే ముండ కేమొచ్చింది రోగం అన్నాడట[మార్చు]

పెట్టగతులు లేకున్న పుట్టగతులు వుండవు[మార్చు]

పెట్టి దెప్పితివో - పెద్దల తిడితివో[మార్చు]

పెట్టినదే తనది - కూడ బెట్టినది యితరులది[మార్చు]

పెట్టినమ్మ పుణ్యాన - పెట్టనమ్మ పాపాన[మార్చు]

పెట్టినమ్మకు పెట్టినంత[మార్చు]

నాదత్త ముపతిష్ఠతి సంస్కృత న్యాయములు లాగ

పెట్టినమ్మకు పెట్టినంత[మార్చు]

ఈయనిది రాదు. "పెట్టి పుట్టలేదు", నాదత్త ముపతిష్ఠతి సంస్కృత న్యాయములు లాగ

పెట్టి పొయ్యనమ్మ కొట్టవచ్చిందిట[మార్చు]

పెట్టు చుట్టం - తిట్టు పగ[మార్చు]

పెట్టుబడిలేని సేద్యం - చద్దిలేని పయనం[మార్చు]

పెడతానంటే ఆశ - కొడతానంటే భయం[మార్చు]

పెడితే తింటారుగానీ తిడితే పడతారా?[మార్చు]

పెడితే పెళ్ళి పెట్టకపోతే పెటాకులు[మార్చు]

పెత్తనానికి పోతే దుత్త చేతికొస్తుంది[మార్చు]

పెదవి దాటితే పృథ్వి దాటుతుంది[మార్చు]

పెదవీ పెదవి కలిస్తే మధువులు - ఒంపూ సొంపూ దక్కితే శోభనం[మార్చు]

పెదవుల పరిచయం ఎదలకు పరిణయం అన్నట్లు[మార్చు]

పెదవుల మధువులు, కౌగిలి విందులు మల్లెల జాతరలో అందట[మార్చు]

పెదవుల రుచి పెదవులకే తెలుసన్నట్లు[మార్చు]

పెద్ద యింటి గోత్రాలు దేవుడి కెరుక[మార్చు]

పెద్ద యింటి రంకు, పెద్ద చెరువు కంపు తెలియవు[మార్చు]

పెద్ద యింటి భాగోతం[మార్చు]

పెద్దలమాట చద్దిమూట[మార్చు]

పెద్దలు లేని యిల్లు - సిద్ధులు లేని మఠము[మార్చు]

పెదాలమ్మ వేటలో అలుపుండదన్నట్లు[మార్చు]

పెనము మీదనుంచీ పొయ్యిలో పడ్డట్లు[మార్చు]

పెరటిచెట్టు మందుకు పనికిరాదు[మార్చు]

పెరుగుతూ పెరుగుతూ పెదబావ కోతి అయినట్లు[మార్చు]

పెరుగుట విరుగుట కొరకే[మార్చు]

ఇదొక సుమతీ శతక పద్య భావము.,,,,,పెరుగుట విరుగుట కొరకే, ధర తగ్గుట హెచ్చు కొరకే తద్యము సుమతీ .

పెళ్ళంటే నూరేళ్ళ పంట[మార్చు]

పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే[మార్చు]

డబ్బుతో ముడిపడిన ఏ వ్యవహారం లోనైనా నిక్కచ్చిగా వుండాలని అర్థం. బందుత్వాలను కూడా చూడొద్దని ఈ మాటకు అర్థం.

పేడ తక్కెడ ఇసుక తక్కెడ వాటం[మార్చు]

అంతా మోసమేనని దీనర్థం. వివరణ: ఒకడు పేడను మూట కట్టుకొని వెళ్లుతూ ఒక మర్రి చెట్టుక్రిండ విశ్రమిస్తాడు. అక్కడికే మరొకడు ఒక ఇసుక మూటను తెచ్చి పక్కన పెట్టుకొని విశ్రమిస్తాడు. ఎవరికి వారు ... ఎదుటి వాని మూటలో ఏదో గొప్ప వస్తువులున్నాయని.... దాన్ని ఎలాగైనా దొంగిలించాలని పన్నాగం పన్ని నిద్ర నటిస్తున్నారు. ఒక మెల్లగా లేచి ఎదుటి వాని మూటను తీసుకొని పారి పోతాడు. ఇది గమనిస్తున్న రెండో వాడు నిద్ర నటిస్తూ వుంటాడు. వాడటు వెళ్లగానే, అక్కడ మిగిలిన మూటను పట్టుకొని వేగంగా పారిపోతాడు. చాల దూరం వెళ్లి మూటలు విప్పి చూసి ఎవరికి వారు తెల్లమొఖం వేస్తారు. ఇది ఈ సామెత వివారణ.

పేదకు పెన్నిధి దొరికినట్లు[మార్చు]

పేదవాడి పెళ్ళాం వాడకెల్లా వదిన[మార్చు]

పేదవాణ్ణి చూస్తే పేలాలు త్రుళ్ళుతాయి[మార్చు]

పేనుకు పెత్తనమిస్తే తలంతా తెగ గొరిగిందట[మార్చు]

పేద వాని కోపం పెదవికి చేటు[మార్చు]

పేదవానికొచ్చిన కోపం వలన అతనికే నష్టం. కోపంతో తన పెదవి కొరుక్కొని గాయం చేసుకుంటాడు తప్ప ఫలితముండదని అర్థం.

పేదవాణ్ణి చూస్తే పేలాలు త్రుళ్ళుతాయి[మార్చు]

పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట[మార్చు]

అర్హత లేని వారికి అధికారము ఇవ్వరాదని దీని అర్థం. అలాఇస్తే వ్వహరామంతా.... నష్టమొస్తుందని అర్థం.

పేరు ఒకరిది - నోరు ఒకరిది[మార్చు]

పేరు ఒకరిది - పెత్తనమొకరిది[మార్చు]

పేరు ఒకరిది - సౌఖ్యమొకరిది[మార్చు]

పేరుకే పెద్దరికం - బానిస బ్రతుకు[మార్చు]

పేరు గొప్ప - ఊరు దిబ్బ[మార్చు]

పేరు పల్లకీ మీద - కాలు నేల మీద[మార్చు]

పేరు పెండ్లివారిది - తిండి యింటివారిది[మార్చు]

పేరులేని వ్యాధికి పెన్నేరు మందన్నట్లు[మార్చు]

పేరు పల్లకీ మీద - కాలు నేల మీద[మార్చు]

పేరు పెండ్లివారిది - తిండి యింటివారిది[మార్చు]

ప్రేమలేని మాట పెదవి పైనే[మార్చు]

ప్రేమలో పడ్డవారు ఎంతకైనా తెగిస్తారు[మార్చు]

పైన పటారం, లోన లొటారం[మార్చు]

తాము ఏమీ చేయలేమని తెలిసి కూడా కొంతమంది అధికులమని గొప్పలు ఛెప్పుకుంటారు. తీరా అవసరం వచ్చేసరికి మెల్లగా జారుకుంటారు. అలాంటి వారిని ఉద్ధేసించి ఈ సామెతను ఉపయోగిస్తూ ఉంటారు. మెరిసే దంతా బంగారం కాదు అనే సామెత లాంటిదే ఈ సామెత

పైనబడ్డా నేనే గెలిచానన్నట్లు[మార్చు]

పైన (అదనంగా) మనిషుంటే పగలే తల నెప్పి వస్తుంది[మార్చు]

వ్వవ సాయం పనులలో అందరికి పని వుంటుంది. పైగా ఒకడు వుంటే అబ్బ నాకు తలనెప్పిగా వున్నదీ అని వెళ్లి చెట్టుకింద పడుకుంటాడు. పైగా మనిషున్నాడు గదా... పని ఎలాగు జరుగుతుందని అతని భావన. పైగా మనిషి లేకుంటే అతను తల నెప్పి సాకు చెప్పి తప్పించు కోడు. ఆ సందర్భంగా పుట్టింది ఈ సామెత.

పైపనీ, క్రింద పనీ నేను చూచుకుంటా సహకరించు అన్నాడట[మార్చు]

పైపై పనేనా అసలు పనేమైనా వుందా అని అందిట[మార్చు]

పైరుగాలి తగిలితే పంటకు ఏపు[మార్చు]

పైరుకు ముదురు - పసరానికి లేత[మార్చు]

పైసాకూ, ప్రాణానికి లంకె[మార్చు]

పైసాలో పరమాత్ముడు[మార్చు]

పొగచుట్టకు, పడతి యోనికి ఎంగిలి లేదు[మార్చు]

పొగాకు కొనుక్కోవాలి అందలం బయటపెట్టరా అన్నాడట[మార్చు]

పొట్టకిచ్చినా, బట్టకిచ్చినా భూమాతే యివ్వాలి[మార్చు]

పొట్టకోస్తే అక్షరం ముక్క లేదన్నట్లు[మార్చు]

నిరక్షరాస్యులను గురించి ఈ సామెతను వాడుతారి/

పొట్లచెట్టుకు పొరుగు గిట్టదు[మార్చు]

పొట్టోడికి పుట్టెడు బుద్దులు[మార్చు]

పొట్టిగా వున్న వారిని సమాజం చిన్న చూపు చూస్తుంది. వారికి ఓదార్పుగా ఈ సామెత వాడతారు.

పొట్టోడు గుట్టెక్కలేదు[మార్చు]

ఇది ప్రాస కొరకు వాడిన మాటేగాని అర్థంలేదు

పొత్తుల మగడు పుచ్చిచస్తాడు[మార్చు]

పొదుగు కోసి పాలు త్రాగినట్లు[మార్చు]

పొదుగులేని ఆవు పాలిస్తే నాలుకలేని పిల్లి నాకి పోయిందట[మార్చు]

పొద్దు గడిచిపోతుంది మాట నిలిచిపోతుంది[మార్చు]

పొద్దున్నే వచ్చిన వాన - ప్రొద్దుగూకి వచ్చిన చుట్టం పోరు[మార్చు]

పొద్దెప్పుడు కుంకుతుందా ముద్ద ఎప్పుడు మింగుతానా అన్నట్టు[మార్చు]

పనిదొంగలు, తిండిపోతుల వ్యవహార శైలి. వారి గురించి ఈ సామెత పుట్టింది.

పొద్దు తిరుగుడు - డొంక తిరుగుడు[మార్చు]

పొయ్యి ఊదిందంటే బంధువుల రాక[మార్చు]

పొయ్యిలో పిల్లి లేవలేదు[మార్చు]

వంట చేయలేదని ఈ సామెతకు అర్థం. అనగా కడు బీద వారినుద్దేశించి ఈ సామెత పుట్టింది

పొమ్మనలేక పొగపెట్టినట్లు[మార్చు]

ఇష్టం లేకుండా పనిచేస్తుంటే వారిని గురించి ఈ మాట పుట్టింది. ఇష్టం లేని చుట్టాలు ఇంటికొస్తే వారిని పొమ్మలేరు. అందుచేత పొగబెడితే.... అనగా వంట చేస్తున్నట్టు నటిస్తూ పొగ ఎక్కువ పెట్టితే ఆ పొగకు వారు భరించలేక వారే వెళ్ళి పోతారని అర్థం.

పొయ్యి దగ్గర పోలీసు[మార్చు]

అగ్గిపుల్ల అగ్గిపెట్టెకు రాచగానే ఒక్కసారి భగ్గుమంటుంది.పోలీసుల్లో చాలామంది భేషజంతో అలా పలకరించి, పలకరించకముందే మండిపడుతూ ఉండేవారు.అగ్గిపుల్ల అగ్రభాగాన నల్లటి గుండులాగా ఉండే మందు పోలీసు నెత్తిన పెట్టుకునే టోపీ.అగ్గిపుల్లను అలా గీసే గీయకముందే భగ్గున మండటం వల్ల పొయ్యి వెలిగించటానికి సిద్ధంగా పెట్టుకొనే అగ్గిపుల్లను పొయ్యి దగ్గర పోలీసు అన్నారు.

పొయ్యి ప్రక్కన వెన్న ముద్ద పెట్టినట్లు[మార్చు]

పొయ్యి ప్రక్కన వెన్నముద్ద పెడితే అది కరిగి పోతుంది. అలాంటి తెలివి తక్కువ దద్దమ్మల గురించి చెప్పినదే ఈ సామెత.

పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదు అన్నాడట[మార్చు]

పొరుగమ్మ సరిపెట్టుకుంటే - ఇరుగమ్మ ఉరిపెట్టుకుంది[మార్చు]

పొరుగింట చూడరా నా పెద్ద చెయ్యి[మార్చు]

పొరుగింటి పుల్లకూర రుచి[మార్చు]

చాలామందికి ఇంట్లో వండే వంటలకంటే పొరుగింటి వంటలు రుచిగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే ఎవరికైనా తమ స్వంతవారు చేసిన వస్తువులూ, విషయాలకంటే పొరుగువారివి మిన్నగా తోచినపుడు వారిని నిందిస్తూ ఈ సామెతను వాడుతారు.

పొరుగింటి కలహం వినవేడుక[మార్చు]

పొరుగింటి జగడం చూడవేడుక[మార్చు]

పొరుగింటి పొయ్యి మండితే తన పొయ్యిలో నీళ్ళు పోసుకున్నట్లు[మార్చు]

పరమ అసూయ పరుల గురించి ఈ సామెత వాడుతారు.

పొరుగూరి వ్యవసాయం - ఇద్దరు భార్యల సంసారం ఒక్కటే[మార్చు]

పొంకణాల పోతురెడ్డికి ముప్పై మూడు దొడ్లు - మూడు ఎడ్లు[మార్చు]

పొంగినదంతా పొయ్యిపాలే[మార్చు]

పొంగే పాలను వూదరాదు - వెలిగే దీపాన్ని ఆర్పరాదు[మార్చు]

పొంగే యౌవ్వనం కౌగిళ్ళపాలు అన్నట్లు[మార్చు]

పోకముడి విప్పుతూ కోక వెల అడిగినట్లు[మార్చు]

పోతే రాయి వస్తే పండు[మార్చు]

పోతే వెంట్రుక వస్తే కొండ సామెత లాంటిదే ఇదీను.వివరణ.ఒకడు కొండకు వెంటుక వేసి లాగుతున్నాడట. అదేంటని మరొకడడగగా.... దానికి సమాదానంగా.... పోతే వెంట్రుక వస్తే కొండ వస్తుంది అన్నాడట.

పోనీలెనని పాత చీర ఇస్తే ఇంటెనకాలకెళ్లి మూరేసిందట[మార్చు]

దానమిచ్చిన వస్తువుకు కూడా వంకలు బెట్టే వారికి చెప్పే సామెత ఇది.

పోనున్నది పోకమానదు[మార్చు]

పోయిన నీటికి కట్ట కట్టినట్లు[మార్చు]

గత జల సేతు బందనము అన్న సంస్కృత సామెతకు అనువాదము ఇది.

పోయిన మగడు పోయినా పొన్నకాయలాంటి గుండు దొరికిందన్నదట[మార్చు]

పోయే కాలానికి కాని బుద్ధి[మార్చు]

పోరాని చోట్లకు పోతే రారాని నిందలు వచ్చినట్లు[మార్చు]

పోరిన పొరుగు - దాచిన కుండలు మనవు[మార్చు]

పోరుకు సిద్ధమయితే పోటుకు సిద్ధం అన్నాడట[మార్చు]

పోరు నష్టం -పొందులాభం[మార్చు]

విరోధము నష్టాన్ని, స్నేహం లాబాన్ని కలిగిస్తుందని దీనర్థం.

పోలీ! పోలీ! నీ భోగమెన్నాళ్ళే అంటే మాఅత్త మాలవాడనుండి వచ్చేదాకా అన్నదట[మార్చు]

  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
"https://te.wikibooks.org/w/index.php?title=సామెతలు_-_ప&oldid=20552" నుండి వెలికితీశారు