జాతీయములు - ఒ, ఓ, ఔ

Wikibooks నుండి


ఒ, ఓ, ఔ - అక్షరాలతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి.

భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆంగ్లభాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని.

జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్థం - తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా స్థిరపడిపోయిన పదరూపాలే జాతీయాలు. భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.

[మార్చు]

ఒంటి చేత్తో సిగముడవటం[మార్చు]

అసంభవం, ఎటువంటి పరిస్థితులలోనూ జరగటానికి వీలు లేదు వాస్తవదూరం

ఒంటి మీద ఒకటి బండ మీద ఒకటన్నట్టు[మార్చు]

పేదరికానికి ప్రతీక.కనీసం కట్టుబట్టలు లేని స్థితి.ఒంటి మీద ఒక వస్త్రం ఆచ్ఛాదనగా ఉంటే మరొకటి మాత్రమే ఉతకటానికి సిద్ధంగా ఉండటం.

ఒంటు పక్కన సున్నా[మార్చు]

స్వతహాగా కాకుండా ఎవరి సహాయం తోనైనా విలువను పెంచుకొనే వ్యక్తి.ఒంటు అంటే అంకె.అంకెకు ఎడమవైపున ఎన్ని సున్నాలు పెట్టినా విలువ ఉండదు.ఒంటుకు కుడివైపున ఏ ఒక్క అంకె వేసినా, లేదంటే ఒక్క సున్నా పెట్టినా దాని విలువ అధికమౌతుంటుంది.

ఒంటెత్తు పోకడ[మార్చు]

ఎవరితోనూ సంబంధం లేకుండా ప్రవర్తించే తీరు తానొక్కడే ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఒంటెద్దు పోకడ

ఒంటెద్దు పోకడ[మార్చు]

ఎవరి మాట వినని వాడని అర్థం: ...ఉదా: వానిది అంతా ఒటెద్దు పోకడ: ఎవరి మాట వినడు.

ఒంటి కాలిమీద నిలబడ్డాడు[మార్చు]

వెళ్లి పోవడానికి చాల తొందర పడుతున్నాడు: ఉదా: వాడు ఒంటి కాలు మీద నిలబడ్డాడు ఎప్పుడు వెళ్లి పోదామా అని.

ఒంటికంటి రామలింగం[మార్చు]

ఒంటుపక్క సున్న[మార్చు]

ఒంటెద్దు పోకడ[మార్చు]

ఒక అంకం ముగిసింది[మార్చు]

ఒక పని అయింది. ఉదా: ఆ పనిలి ఇప్పటికి ఒక అంకం ముగుసింది. అనిశ్చిత స్థితి, సరిగా లేని సహాయం, క్షణానికో రకంగా ప్రవర్తించటం.ఒకసారి అనుకూలంగానూ, ఒకసారి ప్రతికూలంగానూ వ్యవహరించట

ఒక కొలిక్కి వచ్చింది[మార్చు]

పని చివరి దశకు వచ్చిందని అర్థం.

ఒకనాడు విందు,ఒకనాడు మందు[మార్చు]

ఒక పంటి కిందికి రావు[మార్చు]

ఏమాత్రం చాలవు, చాలా కొద్దిగా ఉన్నాయి.

ఒకటికి ఐదారు కల్పించు[మార్చు]

ఒక గుడ్డు పోయిననేమి?[మార్చు]

ఒక కుత్తుకయగు[మార్చు]

ఒక కోడికూయు ఊరు[మార్చు]

అతి తక్కువ ఇళ్లున్న వూరు.

ఒజ్జల పుచ్చకాయ[మార్చు]

ఒడిలోకొచ్చి పడడం[మార్చు]

దక్కడం, లభించడం

ఒళ్లు మండడం[మార్చు]

అయిష్టం, కోపం రావడం == వీడంటే వాడికి బలే ఒళ్లు మంట ===ఒరగటం=== (వాడొచ్చి ఒరగ బెట్టిందేమి లేదు) సమకూరటం, ప్రాప్తించటం, పరిస్థితులు సానుకూలంగా మారటం, లాభం రావటం ఈ ప్రభుత్యం వచ్చి మాకు ఒరగ బెట్టినదేమి లేదు.

ఒళ్ళో పెట్టటం[మార్చు]

స్వాధీన పరచటం చేతుల్లో పెట్టటం

ఒళ్లు మండు తున్నది.[మార్చు]

చాల కోపంగా వున్నదని అర్థం: ఉదా: వాన్ని చూస్తుంటే నాకు వళ్లు మందు తున్నది.

[మార్చు]

ఓడలు బండ్లగు[మార్చు]

దిగజారిన పరిస్థితి.

ఒడలు చిదిమిన పాలు వచ్చు[మార్చు]

మిక్కిలి సుకుమారమైన.

ఒడినిండటం[మార్చు]

సంతాన భాగ్యం కలగటం, గోద్ భరనా

ఓమను[మార్చు]

ఓనమాలు తెలియనివాడు[మార్చు]

అనుభవం లేనివాడు

ఓమనుగాయలు[మార్చు]

ఒక ఆట

ఓహరిసాహరి[మార్చు]

తండోపతండంబులు

ఓ అనిన వ రాదు అన్నట్టు[మార్చు]

[మార్చు]

ఔరౌరా....[మార్చు]

ఆచ్యర్య పడటము. / మెచ్చుకోవడం కూడ.