జాతీయములు - ఊ
ఊ - అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి.
భాషా సింగారం |
---|
సామెతలు |
అ ఆ ఇ ఈ ఉ ఊ-ఋ |
ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ-ఘ |
చ-ఛ జ ఝ |
ట ఠ డ-ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ-ష స-హ |
ళ క్ష ఱ |
జాతీయములు |
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ |
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ |
ట, ఠ డ, ఢ ణ |
త, థ ద, ధ న |
ప, ఫ బ, భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
ఆశ్చర్యార్థకాలు |
నీతివాక్యాలు |
పొడుపు కథలు |
"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి.
ఆంగ్లభాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. అది నిజార్థం. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" ఇది అసాధ్యం. కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. ఇది గూడార్థం. ఇదే అందరికి అర్థమవుతుంది. ఆ అర్థంలోనే ఈ మాటను ఉపయోగిస్తారు. సామెతల కన్నా ఎక్కువగా జన బాహుళ్యంలో విరివిగా ఉపయోగములో వున్నవి జాతీయాలే.
సామెతల వలెనే జాతీయములు కూడా ఎవరో పని గట్టుకొని సృష్టించినవి కావు. జనాల మాటలలో, వారి సామాజిక వ్వవస్థ నుండి పుట్టినవే. కొన్ని సామెతలు జాతీయములుగా కూడా చలామణిలో ఉన్నాయి. వాటిని ఇట్టే గుర్తించ వచ్చు.
జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్థం - తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా స్థిరపడిపోయిన పదరూపాలే జాతీయాలు. భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.
ఊకదంపుడు
[మార్చు]ఊక అనగా వడ్లగింజపైనుండే పొట్టు. వడ్లను దంచితే పైపొట్టు పోయి బియ్యం బయడ పడతాయి. అందుకే వడ్లను దంచుతారు. కానీ ఊకను దంచితే ఏమి ఫలితముండడు. ఆ అర్థంలో అనవసరంగా వ్వర్థ ప్రసంగం చేసేవారిని ఉద్దేశించి ఈ జాతీయాన్ని ఉటంకిస్తారు. వ్వర్థం అనే అర్థంలో.
ఊడలమర్రి
[మార్చు]నిర్మూలించడానికి వీలులేని విధంగా విస్తరించినది అని
ఊడలు పాకటం
[మార్చు]అధికంగా వ్యాపించటం వూడలు దిగటం
ఊ అన్నా... ఆ అన్నా... తప్పే
[మార్చు]మాటమాటకీ, తరచుగా అనే అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ప్రత్యేకించి ఏ భావమూ వ్యక్తపరచకపోయినా ఏమాత్రం మాట్లాడినా ఆ మాటలకు కొంతమంది పెడార్థాలను చెప్పుకున్నప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. "వాడితో అసలు మాట్లాడలేము. వూ అన్నా.. కోపమే, ఆ అన్నా.. కోపమే, ఆ ఇంట్లోవాళ్ళు ఎలా భరిస్తున్నారో మరి" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
ఊపునివ్వడం
[మార్చు]ప్రోత్సాహమివ్వడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. స్తబ్ధంగా ఉన్నప్పుడు ఒకచోట పడిఉండడం తప్ప మరేవిధమైన పని జరగడానికి వీలుండదు. అదే కదలికలో ఉన్నప్పుడు, అది కూడా మంచి వూపుతో ఉన్నప్పుడు కార్యసాధనకు వీలు కలుగుతుంది. ఈ చలనాత్మక దశలో ఉన్న శక్తిని సూచించే విధంగా వూపునివ్వడం అనేది కార్యసాధనకు ఉద్యమించేలా చేయడం, కదలికను తెప్పించడం, ప్రోత్సాహాన్ని కలిగించడం అనేలాంటి అర్థాలలో ప్రయోగంలోకి వచ్చింది. 'ఆ నాయకుడి ప్రసంగం అందరికీ మంచి ఊపునిచ్చింది' అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.
ఊపుమీద ఉన్నాడు
[మార్చు]ఊర్మిళ నిద్ర
[మార్చు]కుంభకర్ణుడు లాగానే లక్ష్మణుడి భార్య వూర్మిళ కూడా ఎక్కువగా నిద్రపోయేది.అలా ఎక్కువ సేపు నిద్ర పోయే ఆడవారిది ఊర్మిళనిద్ర అంటారు
ఊళ్ళోబిచ్చం, గుళ్ళోనిద్ర
[మార్చు]పేదరికంతో ఉన్న కొందరికి రోషం ఉంటుంది. భిక్షాటన చెయ్యటమంటే తప్పని వారు భావించి ఎలాగోలా ఒళ్ళొంచి పనిచేసి తమ జీవనభృతిని సంపాదించుకొంటారు. కానీ కొంతమంది కన్ను, కాలు అన్నీబాగున్నా బద్దకంతో ప్రవర్తిస్తూ భిక్షాటనకు దిగుతారు. అలాగే ఏ మఠంలోనో, గుళ్ళోనో తలదాచుకుంటారు. ఇదంతా వారి సోమరితనానికి గుర్తేతప్ప మరొకటికాదు. ఇలా ఎవరైనా అన్నీ బాగుండి కూడా సోమరితనంతో ప్రవర్తిస్తున్నప్పుడు "వాడికేంలే వూళ్ళోబిచ్చం, గుళ్ళోనిద్ర. ఇల్లూవాకిలి పట్టకుండా తిరుగుతుంటాడు. వాడితో నీకెందుకు" అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.
ఊదర గొడుతున్నాడు
[మార్చు]అనవసరమైన మాటలు అతిగా వాగుతున్నాడు అని అర్థం.
ఊరికి మొనగాడు
[మార్చు]గొప్పవాడని అర్థం: దీన్ని నిందా వాచకంగా కూడా వాడతారు.
ఊచ కోత కోశారు'
[మార్చు]చాల మందిని చంపేశారని అర్థం>
ఊపిరి సలపనివ్వడు
[మార్చు]కొంతసేపు కూడా విరామమివ్వడని అర్థం.
ఊపు మీదున్నాడు
[మార్చు]చాల సంతోషంగా వున్నాడని అర్థం>
ఊబిలో దిగాడు
[మార్చు]కష్టాలు చుట్టు ముట్టాయని అర్థం.
ఊపిరితీసుకోనివ్వడు
[మార్చు]ఏమాత్రం విరామమివ్వడని అర్థం.
ఊపిరి ఆడడం లేదు
[మార్చు]ఊపిరి సలపడం లేదు
[మార్చు]ఊపిరి పోశాడు
[మార్చు]రక్షించాడని అర్థం.