Jump to content

సామెతలు - ఈ

Wikibooks నుండి
భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "ఆ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

ఈ ఇంట ఆచారమా మా గ్రహచారమా?[మార్చు]

ఈ ఊరు ఆవూరికెంత దూరమో ఆవూరు ఈ వూరికి అంతే దూరం[మార్చు]

అంతా సమానమే నని అర్థం.

ఈ ఊపుడుక్కాదు ఆ ఊపుడుకు తట్టుకోవాలన్నాడట[మార్చు]

ఈ ఊళ్ళో పెద్దలెవరంటే తాళ్ళు - దాతలెవరంటే చాకళ్ళు[మార్చు]

ఈగ వ్రణం కోరు - నక్క పీనుగ కోరు[మార్చు]

ఈగను కప్ప మ్రింగితే - కప్పను పాము మ్రింగుతుంది[మార్చు]

ఈ చీరెట్లా వుందంటే, చీరే లేకుంటే నువ్వు మరీ బాగుంటావన్నాడట[మార్చు]

ఈ చేత చేస్తారు - ఆ చేత అనుభవిస్తారు[మార్చు]

ఈటె పోటు మానుతుంది గానీ మాట పోటు మానదు[మార్చు]

ఈడుగానిది యింటికిరాదు[మార్చు]

ఈడు చూసి పిల్లని యివ్వాలి - పిడి చూసి కొడవలి కొనాలి[మార్చు]

ఈడ్పు కాళ్ళు, ఈడ్పు చేతుల ఇతడేనమ్మా యిల్లరికపుటల్లుడు[మార్చు]

ఈతకు మించిన లోతు లేదు[మార్చు]

ఈతచెట్టు ఇల్లు కాదు - తాడిచెట్టు తల్లి కాదు[మార్చు]

ఈతచెట్టు క్రింద పాలు త్రాగినా కల్లే అంటారు[మార్చు]

ఈత నేర్చిన వాడికే నీటి చావు[మార్చు]

ఈత వచ్చినపుడు లోతనిపిస్తుందా?[మార్చు]

ఈదబోతే త్రాగ నీళ్ళు లేవు[మార్చు]

ఈనగాచి నక్కల పాలు చేసినట్లు[మార్చు]

ఈ దెబ్బెలా వుందని అడిగితే నిన్నటి దెబ్బే బాగుందన్నదట[మార్చు]

ఈనాడు ఇంటిలో - రేపు వీధిలో[మార్చు]

ఈ నొక్కుళ్ళకన్నా ఆ దెబ్బలే బాగున్నాయందట[మార్చు]

ఈ సంబడానికేనా ఇంత ఆర్భాటం?[మార్చు]

ఈ జొన్న కూటికా ఈ స్తోత్ర పాఠమన్నట్టు[మార్చు]

కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కకపోతే, ఎంతో ఎక్కువ ఆశించినా కొద్దిగా మాత్రమే దక్కితే. అటువంటి సందర్భాలలో ఈ సామెత వాడతారు.

ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగేవాడు[మార్చు]

కొంత ఇచ్చి ఎక్కువ మొత్తం లాగే వాడని అర్థం.

ఈనగాచి నక్కల పాలు చేసినట్లు[మార్చు]

ఈనగాయటం అంటే పశువును దూడను కనేంత వరకు పోషించి రక్షించటం అని అర్థం. ఆవు దూడను కనేంత వరకు రక్షించి తన పని అయిపోయిందనుకొని వెళ్ళి పోతే నక్కలు వచ్చి ఆదూడను తినేస్తాయి.. అలాకాక ఎల్లప్పుడు రక్షణా వుండాలని ఈ సామెత అర్థము.

పండించిన పంటను పరులపాలు సేయుట. == "ఈనగాచి పొలమును నక్కలకుఁ బెట్టినట్లు బాహుబలాధిక్యంబు పేరిమిని గష్టపడి రణంబునం గెలుచుకొన్న రాజ్యంబును ఫలకాలంబున నొరుల పాలు సేయనేల." (నీతిచంద్రిక - సంధి.) - ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953

ఈతకు మించిన లోతూ గోచికి మించిన దారిద్ర్యం లేవు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం

వనరులు[మార్చు]

  • లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (సుమారు 3400 సామెతలు) - సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  • సాటి సామెతలు (తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సమానార్ధకాళున్న 420 సామెతలు) - సంకలనం : నిడదవోలు వెంకటరావు, ఎమ్. మరియప్ప భట్, డాక్టర్ ఆర్.పి. సేతుపిళ్ళై, డా. ఎస్.కె. నాయర్ ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
"https://te.wikibooks.org/w/index.php?title=సామెతలు_-_ఈ&oldid=12898" నుండి వెలికితీశారు