Jump to content

జాతీయములు - క, ఖ

Wikibooks నుండి
(జాతీయములు - క్ష నుండి మళ్ళించబడింది)
భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


మూస:వికీకరణ క, ఖ అక్షరాలతో మొదలయ్యే జాతీయాలు.

కక్కుర్తి వెధవ

[మార్చు]

అన్నింటిని ఆశించేవాడు. అలాంటి వారిని గురించి ఈ మాటను వాడతారు. ఆబగా అన్నం తినే వారిని ఉద్దేశించి కూడా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కచ్చా పచ్చాగ

[మార్చు]

ముక్కలు ముక్కలుగా ఉదా: ఈ చింత కాయలను కచ్చా పచ్చాగా దంచి తీసుక రా...

కచ్చాగోలీలాట

[మార్చు]

పనికిరాని పని, వృధాశ్రమ, ప్రయోజనం లేని పనులు.పచ్చిమట్టితో గోలీలాట ఆడితే ఆ మట్టి ఉండలు విచ్చిపోతాయే తప్ప ఆట సాగదు.

కటకటాలు లెక్కపెట్టడము

[మార్చు]

దీనికి జైలు కెళ్ళాడని అర్థము. జైలులో కటకటాలు తప్ప ఇంకేమి కనిపించవు. వాటిని లెక్కబెట్టడము తప్ప వేరే పని వుండదని దీనర్థం. జైలు కెళ్ళిన వాళ్ళగురించి వాడినదీ ఈ జాతీయము.

కట్టు తప్పు

[మార్చు]

నీతిని తప్పు. ప్రతి ఊరికి కొన్ని కట్టు బాట్లుంటాయి. అక్కడ నివసించే వారు ఆ వూరి కట్టు బాట్లకు అనుకూలంగా నడుచుకోవలసి వుంటుండి. అలా కాకుండా.... ఆ కట్టు బాట్లకు విరుద్ధంగా ప్రవర్తించెతే వారిని కట్టు తప్పాడు అని అంటారు. దానికి తగు పరిహారము చేయ వలసి వుంటుంది.

కట్టుబానిస

[మార్చు]

బాసనం అంటే వంట. గెలిచిన తండావారు ఓడిన తండా వారి చేత వంట చేయించుకొని తింటూ ఉండేవారు.బానిస అంటే అణిగిమణిగి చాకిరీ చేసే వ్యక్తి

కట్టెకట్టోలె కావటం

[మార్చు]

బాగా బలహీనంగా ఉండటం

కట్టె, కొట్టె, తెచ్చె

[మార్చు]

క్లుప్తత.రాముడు వారధి కట్టి, రావణుడిని కొట్టి, సీతమ్మను తెచ్చాడు అని . రామాయణ మహా కావ్యాన్ని మూడు ముక్కల్లో చెప్పినట్లే..... ఏదైన ఒక పెద్ద విషయాన్ని చాల క్లుప్తంగా చెపితే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు...

కట్టె విరుపు మాటలు

[మార్చు]

ఫెళఫెళమని కటువుగా ఉండే మాటలు.

కట్టు బట్టలతో వచ్చాడు

[మార్చు]

ఏమి లేకుండా వచ్చాడు అని అర్థం. చేతిలో చిల్లి గవ్వ లేకుండా వచ్చిన వారినుద్దేశించి ఈ జాతీయాన్ని ఉపయొగిస్తారు.

కట్ట కట్టుకొని వచ్చారేందిరా

[మార్చు]

అందరు ఒక్కసారె రావడం. ఏదైనా ఒక చిన్న విషయాన్ని చర్చించడానికి చాల మంది వస్తే ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కట్టకు పుట్టచేటు

[మార్చు]

స్థిరంగా ఉండాల్సిపని పాడుచేశాడని అర్థం అంతా ఒక్కసారి వస్తే ఇలా అంటారు.

కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నారు

[మార్చు]

తీరని కష్టాలు అనుభవిస్తున్నారు.

కట్టు తప్పాడు

[మార్చు]

పద్ధతిని అతిక్రమించాడని అర్థం. ఉదా: వారు కట్టు తప్పారు. ఇక్కడ కట్టు అనగా వూరికొరకు ఏర్పాటు చేసుకొన్న పద్ధతి అని అర్థము

కట్టు బానిస

[మార్చు]

జీతభత్యాలు లేకుండా వెట్టిచాకిరీ చేసే సందర్భంలో ఈ జాతీయం వాడతాం.

కత్తిమీద సాము

[మార్చు]

అతి కష్టంతో కూడిన పనిని ధైర్యంతో చేసేటపుడు ఈ జాతీయం ఉపయోగిస్తాం.

కత్తుల బోను

[మార్చు]

కట్టె విరుపు మాటలు

[మార్చు]

తెగేసి నట్లు మాట్లాడడం.. ఉదా: వానివి కట్టె విరుపు మాటలు.

కడతేర్చాడు

[మార్చు]

కడవల కొద్దీ

[మార్చు]

అధికంగా. చంపేశాడని అర్థం.

కడిగిన ముత్యంలా వున్నాడు

[మార్చు]

చాల స్వచ్ఛంగా ఉన్నాడు. ఉదా: ఈ వ్యవహారంలో వాడు కడిగిన ముత్యంలా ఉన్నాడు. ఏ మరకా అంట లేదు. స్వశ్చతకు ముత్యాన్ని పోలుస్తుంటారు మాటల్లో. అనగా చాల స్వచ్ఛంగా వున్నదని అర్థం. అలా పుట్టినదే ఈ జాతీయము.

కడిగిన ముత్యంలాగ వున్నాడు

[మార్చు]

అతి పవిత్రంగా వున్నాడని అర్థం. చాల శుభ్రంగా వున్నాడని కూడా అర్థం. ముత్యం శ్వచ్చతకు చిహ్నం.

కడిగేశారు

[మార్చు]

బాగా చీవాట్లు పెట్టారు; ఉదా: శాసనసభలో ప్రతి పక్షాలు అధికార పక్షాన్ని కడిగేశారు. దేన్నైనా కడిగే దానిలోని మలినమంతా పోయి శుభ్రంగా వుంటుండి. అలాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.. ఇదే అర్థంలో మరి కొన్ని జాతీయాలున్నాయి...... ఉతికి ఆరేశారు.... అనేది మరొక జాతీయము.

కడుపు ఉబ్బరంగా వుందా?

[మార్చు]

అసూయగా వుందా.... ఉదా: నన్ను చూస్తే వానికి బలే కడుపు ఉబ్బరం. ఇతరుల ఉన్నతిని చూచి ఓర్చు కోలేని వారిని గురించి ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

కడుపులో కాలటం

[మార్చు]

విపరీతంగా కోపం రావటం ఆకలి ఎక్కువై కడుపులో కాలటం

కడుపుమంట

[మార్చు]

అర్థ:ఓరువలేనితనము, ఈర్ష్య. అసూయ పడటం: ఉదా: వానికి నామీద బలే కడుపు మంట. ఒకరిని చూసి ఓర్వలేకున్న వానినుద్దేశించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కడుపులో కాళ్లు పెట్టుకొని పడుకున్నాడు

[మార్చు]

తిండి లేక వున్నాడు అని అర్థం. సాధారణంగా తిండి లేక ఎక్కువ ఆకలిగా వున్నపుడు నీరసంగా వుంటుంది. ఆ కారణంగా వారు నిలబడలేరు, కూర్చోనూ లేరు. పడుకొని వుంటారు. ఆ పడుకోవడం కూడా కాళ్ళు ముడుచుకొని వుంటారు. ఆ సందర్భాన్ని బట్టి ఈ సామెత పుట్టింది.

కడుపులో చల్ల కదలకుండా వున్నాడు

[మార్చు]

సుఖంగా వున్నాడని అర్థం. ఉదా: వానికేం? కడుపులో చల్ల కదలకుండా ఉన్నాడు. ఎటువంటి శారీరిక కష్టం చేయ నక్కర లేకుండా జీవితం సుఖంగా నడిచిపోతుండే వారినుద్దేశించి ఈ జతీయాన్నుపయోగిస్తారు.

కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి.

[మార్చు]

చాల ఆకలిగా వున్నదని అర్థం. ఉదా: నాకు కడుపులో ఎలకలు పరుగెడుతున్నాయి. త్వరగా అన్నంపెట్టు.

కడుపులో రైళ్లు పరుగెడుతున్నాయి

[మార్చు]

చాల ఆకలిగా వున్నదని అర్థం. నాకడుపులో రైళ్లు పరిగెడుతున్నాయి.. ఏదైనా తినాలి ' చాల ఆకలిగా వున్నవారు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. దీనికి సమానర్థంలో మరొక జాతీయం కూడా ఉంది. అది. [కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి]

కడుపు నిండిన బేరం.

[మార్చు]

బేరం బాగా జరిగిందని అర్థం. అన్ని కార్యాలు సక్రమంగా జరిగి నిచ్చింతగా వున్న వారిని గురించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కడుపు కక్కుర్తి

[మార్చు]

వాడు తన కడుపు కక్కుర్తికి ఈ నీచపు పనిచేసాడు. అత్యాశ గల వారినుద్దేశించి ఈ మాటను వాడుతారు.

కడుపుబ్బు

[మార్చు]

ఏ రహస్యాన్ని దాచుకోలేక పోవు స్థితి।

కడుపు చల్లగా

[మార్చు]

హాయిగా సంతోషంగా వుండటం. మంచి మాట చెప్పావు. ఇప్పుడు నాకడుపు చల్లగా వుంది నాయనా.... అని అంటుంటారు.

కడుపులో చల్ల కదలకుండా

[మార్చు]

నిమ్మళంగా వున్నాడని అర్థం:

కడుపు కుటకుట

[మార్చు]

ఈర్ష్య, ఓర్వలేనితనం

కడుపుపండటం

[మార్చు]

కడుపు పండటము అనగా స్త్రీ గర్భము దాల్చి పిల్లలు కలగడమని ర్థము. ఉదా: ఇంత కాలానికి ఆమె కడుపు పండింది. అని అంటుంటారు.

కడుపులో ఎలుకలు పరుగెత్తడం

[మార్చు]

ఎక్కువగా ఆకలి కావడం ... నాకడుపులో ఎలుకలు పరుగెడుతున్నవి. నేను ముందుగా అన్నం తినాలి. దీనితో సమానర్థంలో మరొక జాతీయం ఉంది. [కడుపులో రైళ్ళు పరుగెడుతున్నాయి]

కడుపులొ దాచుకొ

[మార్చు]

అతి రహస్యం: ఎవరికి చెప్పొద్దు. ఎవరైనా ఒక రహస్యాన్ని చెప్పి దాన్ని ఎవరికి చెప్పొద్దని చెప్పుతూ ఈ రహస్యాన్ని నీ కడుపులో దాచుకో అని చెపుతుంటారు. అంటే దాన్ని మరెవ్వరికి చెప్పవద్దని హెచ్చరిక. ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కడుపున పడటం

[మార్చు]

కడుపుతో ఉండటం, గర్భం దాల్చటం.. ఉదాహరణ: కాసింత నలుసు నాకడుపున పడితె దేవుని తలనీలాలిస్తానని మొక్కు కున్నాను.

కడుపు పంట

[మార్చు]

సంతానం కలగటం/ ఇన్నాళ్లకు ఆమె కడుపు పండింది. ===కడుపు పండింది=== ఆమె తల్లి అయింది. === కడుపులో దాచుకొ=== ఎవ్వరికి చెప్పొద్దు/ రహస్యం

కడుపే కైలాసం

[మార్చు]

ఇంట్లో ఉండటం వైకుంఠంలో ఉన్నంత సుఖం గాను, కడుపునిండితేనే కైలాసంలో ఉన్నంత సంతోషంగా ఉండటం.తృప్తిగా ఉండటం.

కడుపులో చేయి పెట్టి కెలికి నట్టుంది

[మార్చు]

మిక్కిలి కష్టపెట్టు. (నీమాటలు వింటుంటే నాకు కడుపులో చేయి పెట్టి కెలికి నట్టుంది.) అతి ఘోరమైన విషయాన్ని విన్నప్పుడు కలిగే మానసిక పరిస్థితిని తెలియ జేయడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కడుపునిండిన బేరము

[మార్చు]

అక్కరలేని బేరము... వాడికేమిలే..... వాడిది కడుపు నిండిన బేరం. అని అంటుంటారు.

కడుపు వుబ్బరంగా వుందా

[మార్చు]

అసూయగా వున్నదా అని అర్థము.

కతపత్రము

[మార్చు]

ప్రమాణ పత్రము

కత్తినూరు తున్నాడు

[మార్చు]

కోపంగా వున్నాడు: ఉదా: వాడు నాపై కత్తి నూరు తున్నాడు.

కత్తివేటు

[మార్చు]

నిరోధించటం, అభివృద్ధికి భంగం కలిగించటం, చంపటం

కత్తులబోను

[మార్చు]

భరించరాని పరిస్థితులు. వాడిప్పుడు కత్తుల బోనులో ఇరుక్కున్నాడు. చాల ప్రమాదములో ఇరుక్కున్న వారి నుద్దేశించి ఈ మాటను వాడుతారు.

కత్తులు నూరటం

[మార్చు]

కక్షతో బలాబలాలను ప్రదర్శించుకోవటం. వాడు నీపై కత్తి నూరు తున్నాడు/

కత్తిమీది సాము

[మార్చు]

ప్రాణం మీదకు వచ్చే పని

కత్తుల వంతెన

[మార్చు]

పైకి బాగా కనిపించినా కష్టాలు తెచ్చిపెట్టే మోసపూరిత వ్యవహారాలు..పైకి మంచిగా లోపల చెడుగా ప్రవర్తించే వ్యక్తులు === కత్తులు దూశారు=== పోరాటానికి సిద్దం అన్న అర్థం;

కత్తులు దూయడం

[మార్చు]

గొడవ పడడం.

కత్తులు దూశారు

[మార్చు]

పోట్లాడుకున్నారు అని అర్థం: ఉదా: పలాన విషయంలో వారిద్దరు కత్తులు దూసు కున్నారు. పోట్లాటలో నిజానికి కత్తులు దూసక పోయినా.... ఆ పోట్లాటను చెప్పేటప్పుడు వారు కత్తులు దూసుకుంటున్నారు అని అంటుంటారు.

కథ కంచికి చేరింది

[మార్చు]

పని అయిపోయింది. ఉదా: ఆ కథ ఎప్పుడో కంచికి చేరింది. దాని సంగతి ఇప్పుడెందుకు.

కథలు చెప్పొద్దు

[మార్చు]

అనవసరమైన మాటలు చెప్పొద్దు.. ఉదా: కథలు చెప్పొద్దు. అవి వినడానికి ఇక్కడెవ్వరు లేరు. లేని పోని విషయాలు చెప్పుతున్నా... అబదాలు చెపుతున్నా.. ఎదుటి వాడికి అసలు విషయం తెలిసి పోయిన తర్వాత వారి నుద్దేశించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.

కథల కామరాజు

[మార్చు]

కల్లబొల్లి కబుర్లు చెప్పేవాడని అర్థం. లేని పోని విషయాలను బహు సమర్థంగా అల్లి వినటానికి ఇంపుగా చెప్పే వారి నుద్దేశించి ఈ జాతీయాన్ని వాడుతారు.

కదిపితే కందిరీగల తుట్టె

[మార్చు]

చుట్టూ తిరిగినా, కుట్టినా భరించటం కష్టం. కదిపామంటే పెనుప్రమాదమే.క్రోథ స్వభావులు, వూరకనే కయ్యానికి కాలు దువ్వే వారిని కదిలించకుండా పక్కకు తప్పుకొని పోవటమే మేలు

కను గానక

[మార్చు]

అహంకారంతో కన్నులు కనిపించ క అని అర్థము.

కన్నాకు

[మార్చు]

తొట్టతొలిగా వచ్చిన ఆకు, ప్రధాన పాత్ర

కన్నాన పోయి కన్నాన రావటం

[మార్చు]

ఎలాంటి శబ్దమూ, అలికిడి తెలియకుండా చౌర్యాలకు పాల్పడే నేర్పరితనం

కన్నీటి వరద అయ్యింది

[మార్చు]

ఎక్కువగా ఏడ్చారు అని అర్థం: ఉదా: వారి తండ్రి చావును చూసి వారు కన్నీటి వరద పర్యంత అయ్యారు. కన్నీళ్ళతొ వరద రాదు. కానీ ఎక్కువగా ఏడుస్తుంటే ఈ జతీయాన్ని వాడుతారు.

కన్నీరు మున్నీరుగా

[మార్చు]

ఎక్కువగా ఏడ్చారు. వారు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు అని అంటుంటారు. ఉదా:

కన్నీళ్ళు తుడుచు

[మార్చు]

తాత్కాలికముగా శాంతపరచు

కన్నీరు మున్నీరై పారు

[మార్చు]

మిక్కిలి విలపించు

కన్నీటి వరద

[మార్చు]

ఎక్కువగా ఎడ్ఛేరు అని అర్థం:

కన్నీళ్లు కట్టలు తెంచు కున్నాయి

[మార్చు]

ఎక్కువగా ఏడ్చారు అని అర్థం. అతిగా ఏడ్చారని అర్థము.

కన్ను కుట్టింది

[మార్చు]

అసూయ పడ్డాడు. ఉదా:వీరి అభివృద్ధి చూసి వానికి కన్ను కుట్టింది.

కనుబొమలు ముడిబడ్డాయి

[మార్చు]

సందేహంగా ఉంది. అనుమానంగా వున్నదని అర్థం: ఎవరికైనా ఏవిషయంలోనైనా సందేహం కలిగితే మనకు తెలియకుండానే కనుబొమలు దగ్గరవుతాయి. ఆ విధంగా పుట్టినది ఈ జాతీయము.

కనుసన్నల మెలగు

[మార్చు]

విదేయతగా వుండడం: చెప్పిన మాట వినడం: వారితని కను సన్నలలో మెలుగు తుంటారు అని అంటుంటారు. అలాంటి వారిని గురించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు కళ్ళలో నిప్పులు పోసుకోవడం===అసూయ పడడం.

కన్నులలో నిప్పులు పోసుకుంటున్నారు

[మార్చు]

అధికంగా అసూయ పడుతున్నారని అర్థం. ఎక్కువగా ఈర్ష్య పడే వాళ్ళనుద్దేశించి ఈ మాటలనుపయోగిస్తుంటారు. ఉదా: ;;వారు పచ్చగా బచుతు తుంటే వీళ్ళు కళ్ళలో నిప్పులు పోసు కుంటారు;; అని అంటుంటారు.

కన్నుల పండుగ

[మార్చు]

అంతులేని ఆనందం. అక్కడ తిరుణాల్లు కన్నుల పండుగగా జరిగాయి.

కన్ను పెద్ద కడుపు చిన్న

[మార్చు]

చూసిందంతా కావాలనుకున్నా ప్రాప్తించేది కొద్దిగా మాత్రమే ఎంత ఆశపడ్డా మనకు ఎంతవరకు దక్కాలో అంతవరకే దక్కుతుంది. ఆశపోతులనుద్దేశించి ఈ మాటను ఉపయోగిస్తారు.

కన్ను వేయు

[మార్చు]

ఎలాగైన స్వంతం చేసుకోవాలని ఆశపడటం. ఉదా: వాడు దానిమీద కన్నేశాడు.... అని అంటుంటారు

కన్ను మిన్ను కానడం లేదు

[మార్చు]

పొగరెక్కువయింది: ఉదా: నాలుగు రూకలు చేతికొచ్చేసరికి వానికి కన్ను మిన్ను కానడం లేదు

కన్ను పడింది

[మార్చు]

కన్ను కుట్టు

[మార్చు]

అసూయ పడటం. ఒక పాటలో పద ప్రయోగము. మన జంట అందరికి కన్ను కుట్టు కావాలి, ఇక ఒంటరిగా వున్న వారు జంటలై పోవాలి.......

కన్నులు కాయలు కాచు

[మార్చు]

నీకొరకు ఎదురు చూసి చూసి నాకన్నులు కాయలు కాచాయి.

కన్నులు గప్పి తప్పించుకున్నారు

[మార్చు]

ఎదుటి వాని కన్నులుమూసి తప్పించు కున్నారని అర్థం గాదు. చాల తెలివిగా తప్పించుకున్నారని అర్థం. ఉదా: ఆ దొంగ మాకన్నులు గప్పి ఇంట్లోకి చొరబడి అంతా దోచుకున్నాడు. అని అంటుంటారు.

కన్నులు వాచు

[మార్చు]

కన్ను మిన్ను కానడంలేదా...

[మార్చు]

పొగరెక్కువయిందా అని అడగడము

కన్నులు నెత్తిమీదికి వచ్చాయి

[మార్చు]

చాల పొగరెక్కిందని అర్థం. ఉదా: నడిమంత్రపు సిరి తో వానికి కన్నులు నెత్తి మీదికి వచ్చాయి... అని అంటుంటారు.

కన్నులు పైకి వచ్చు

[మార్చు]

పొగరెక్కువగా గలవాడిని ఇలా అంటారు: వాడికి కన్నులు నెత్తికి వచ్చాయి. ===కళ్లు నెత్తిమీదికి వచ్చాయా=== పొగరు ఎక్కువయందా అని అర్థం దానిమీద ఆశ పడుతున్నాడని అర్థం: ఉదా: వాడికి దాని మీద కన్ను పడింది.సామాన్యంగా దొంగ బుద్ధి గల వారిని గురించి ఈ మాట అంటుంటారు.

కన్నూ మిన్నూ కానక

[మార్చు]

హద్దులులేని అహంకారం. వానికి అహంకారంతో కన్ను మిన్ను కాన రావడంలేదు. మిన్ను అనగా ఆకాశము అని అర్థము. ఎవరైనా అతి గర్వంగా ప్రవర్తిస్తుంటే వారిని ఉద్దేశించి ఈ జాతీయాన్ని వాడుతారు. కన్నెర్ర తనం.అసూయ,ఎదుటివారి అభివృద్ధి చూసి ఓర్వలేనివారు క్రోధంతోనో, అసూయ ద్వేషాలతోనో రగిలి పోతుంటారు. అలాంటి సమయాలలో కళ్ళు ఎర్రబడతాయని. కోపం వచ్చిందని అర్థం: ఉదా: వాడు నామీద కన్నెర్ర చేశాడు.

కన్నేయటం

[మార్చు]

ఆశించటం, గమనించటం . ఓ వస్తువును చూసి ఎలాగైనా దాన్ని తన సొంతం చేసుకోవాలని ఎవరైనా అనుకొంటున్నప్పుడు వాడు దాని మీద కన్నేశాడు, వాడి కన్ను పడింది అంటారు. అలాగే ఏదైనా విషయాన్ని జాగ్రత్తగా గమనించటం అనే అర్థంలో ఓ కన్నేసి ఉంచు అంటారు.

కన్నెర్రజేయు

[మార్చు]

కన్నెర్ర తనం.అసూయ,ఎదుటివారి అభివృద్ధి చూసి ఓర్వలేనివారు క్రోధంతోనో, అసూయ ద్వేషాలతోనో రగిలి పోతుంటారు. అలాంటి సమయాలలో కళ్ళు ఎర్రబడతాయని. కోపం వచ్చిందని అర్థం: ఉదా: వాడు నామీద కన్నెర్ర చేశాడు. ఎవరికైనా కోపం వస్తే వారి కన్నులు ఎరుపెక్కుతాయి. దాన్ని బట్టి వారికి కోపం వచ్చిందని అర్థము. ఆవిధంగా ఈ జాతీయము పుట్టుంది. వాడు నామీద కన్నెర్ర జేశాడు అని అంటుంటారు.

కప్పదాటు వైఖరి

[మార్చు]

సమస్య నుంచి తప్పించుకు తిరగడం.... (వాని మాటలు వినకు.. వాడిదంతా కప్పదాటు వ్వవహారం.)

కప్పను మింగిన పాము లాగ వున్నాడు

[మార్చు]

అతి బద్దకంగా వున్నాడని అర్థం

కప్పదాటులు వేయుట

[మార్చు]

ఒక చోట కుదురుగా వుండక అవకాశమున్న చోటుకు గెంతేసే వారి గురించి ఈ సామెత వాడతారు. రాజకీయ నాయకులు ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి వెళ్ళడాన్ని కప్ప దాటులు వేయడము అని అంటుంటారు.

కప్పల తక్కెడ

[మార్చు]

కప్పల తక్కెడ స్థిరంగా వుండదు. కప్పలను తక్కెడలో (త్రాసులో) వేచి తూచడము అసాద్యం. అవి ఎగిరి పోతుంటాయి. అలా స్థిరంగా లేని వ్వక్తుల గురించి ఇలా అంటరు.

కప్పను మింగిన పాములాగ వున్నాడు

[మార్చు]

బద్దకంగా వున్నాడని అర్థం: ఉదా: వాడు కప్పను మింగిన పాములా బద్దంకంగా వున్నాడు. కప్పను తిన్న పాము రెండు మూడు రోజులు బద్దకంగా పడుంటుంది.

కప్పను తిన్న పాము

[మార్చు]

అచేతనత్వానికి, బద్దకానికి, నిద్రాణ స్థితికి గుర్తు.

కప్ప దాటు వైఖరి వాడు

[మార్చు]

ఒక పద్దతి ప్రకారం నడవని వాడు

కబంధ హస్తాలు

[మార్చు]

నిర్ధయుడైన వ్యక్తి ఆధీనంలోకి వెళ్ళి అనేకానేక ఇబ్బందులు పడుతుండటం

కమ్మటం

[మార్చు]

కమ్మేయటం, కమ్ముకుపోవటం, కమ్ముకురావటం , పూర్తిగా ఆవరించటం

కయ్యానికి కాలు దువ్వుతున్నాడు

[మార్చు]

పోట్లాటకు పిలుస్తున్నాడు: ఉదా: వాడు కయ్యానికి కాలు దువ్వుతున్నాడు.

కరాళ నృత్యం చేస్తున్నాడు

[మార్చు]

కోపంగా ఊగి పోతున్నాడని అర్థం:

కరణం దస్త్రం

[మార్చు]

కనీసం భార్యతో మాట్లాడే తీరిక కూడా లేకుండా పోయేంత పని,

కర్త కర్మ క్రియ

[మార్చు]

సర్వస్వం, అంతా తానే . చేసేవాడు, చేయించేవాడు, చేసేది అంతా ఒకడే అని

కరటక దమనకులు

[మార్చు]

తోడుదొంగలు, మోసగాళ్ళు . ఎదుటి వారిని మోసం చేయటానికి ఒకరు ఆ ఎదుటి వ్యక్తికి విరోధిగానూ, మరొకరు మిత్రుడిగానూ నటిస్తుంటారు. విరోధిగా నటించే వాడైనా, మిత్రుడిగా నటించే వాడైనా ఆ ఇద్దరిదీ ఎదుటి వ్యక్తిని మోసం చేసి లాభపడాలన్నదే ఆలోచన.

కరణం దస్త్రం

[మార్చు]

కరతలామలకము

[మార్చు]

స్పష్టంగా,కళ్ళకెదురుగా గుప్పిట తెరిచిన స్థితిలో,అరచేతిలో ఉన్న ఉసిరికాయలాగా. అతి సులభంగా అని అర్థం. ఆ విద్యార్ధికి పాటలన్ని కరతలామలకములే.

కరదీపిక

[మార్చు]

మార్గదర్శకం. కరదీపిక అనగా చేతిలోని దీపం అని అర్థము. చీకట్లో వెళుతున్నప్పుడు చేతిలో దీపం వుంటే గమనము సులభ మౌతుండి. అలాగే ఏదైన వస్తువు మనకు ఉపయోగ కరంగా వుంటే ఆ సందర్భాన్ని బట్టి ఈ జాతీయాన్ను వాడు తుంటారు.

కర్ర లేనివాడు

[మార్చు]

కర్ర లేని వాణ్ని గొర్రె అయినా కరుస్తుంది అనేది ఒక సామెత..ఏ అధికారమూ, ఆదరణా, ఆధారమూ లేనివారి గురించి ఈ మాటను వాడతారు.

కర్ణాకర్ణిగా

[మార్చు]

ఆనోటా ఈనోటా వినటం. ఈ విషయం కర్ణాకర్ణిగా విన్న మాటె.

కర్కటి గర్భం

[మార్చు]

కర్కటి గర్భం, వృశ్చికి గర్భం. ఎండ్రకాయ, తేలు గర్భం ధరించి పిల్లలు పుట్టేడప్పుడు ఆ తల్లులు పొట్టలు చీలి మరణిస్తాయి. ఎవరైనా పుట్టగానె తల్లి మరణిస్తే వారి నుద్దేశించి ఈ జాతీయాన్ని వాడుతారు.

కర్ణా కర్ణిగ విన్నాను

[మార్చు]

ఆనోట ఈనోటా విన్నాను: ఉదా: ఆ విషయం కర్ణా కర్ణిగా విన్నాను.

కరి మింగిన వెలగపండు

[మార్చు]

ఖర్చుపెట్టేవాడికి తెలియకకుండా హరించుకుపోయే సంపద:

కర్ణుడు లేని భారతము

[మార్చు]

రుచీపచీ లేని కూరలాగా. కర్ణుడు లేకుండా భారతాన్నె ఊహించ లేము. అది అతి ముఖ్యమైన పాత్ర. అది లేకుంటే

కరెళ్ళ కామక్క

[మార్చు]

కలగూర గంప

[మార్చు]

కలహారి మారి

[మార్చు]

కలహాలను పెట్టేవాడని అర్థం: ఉదా: వాడొట్టి కలహాల మారి. వాని మాటలను నమ్మొద్దు.

కలసిమెలసి

[మార్చు]

ఐఖ్యంగా,కలసి కట్టుగా

కలలోని మాట

[మార్చు]

జరుగుతుందో లేదో తెలియదు.నమ్మకంలేదు.కలలోని కాన్పు అబద్ధం అని అర్థం: ఉదా: వాడు ఇక్కడకు వస్తాడనేది కలలోని మాట.

కల్ప తరువు లాంటి వాడు

[మార్చు]

చాల దాన గుణం కలవాడు: కల్పతరువు అనగా కోరిన కోరికలన్నీ తీర్చేదేవతా వృక్షం. అదే విధంగా ఎవరైన్నా ప్రతి వారికి సహాయాన్ని కాదనకుండా చేసే వారినుద్దేశించి ఈ జాతీయాన్ని వాడు తుంటారు. ఉదా:

కల్పతరువు

[మార్చు]

కల్పవల్లి, కల్పవృక్షం. ఎవరైనా అడగంగానే కావాల్సినవన్నీఇచ్చేది.కల్పతరువు అనగా కోరిన కోరికలన్నీ తీర్చేదేవతా వృక్షం. అదే విధంగా ఎవరైన్నా ప్రతి వారికి సహాయాన్ని కాదనకుండా చేసే వారినుద్దేశించి ఈ జాతీయాన్ని వాడు తుంటారు.

కల్ల పసిడి

[మార్చు]

కలిసొచ్చిన కాలం

[మార్చు]

ఒక సామెతలో కలిసొచ్చిన కాలానికి నడిసొచ్చే పిల్లలు పుడుతారు. అని అంటారు. ఆ విధంగా ఎవరికైన అన్ని కలిసొచ్చి సంపద చేకూరితే ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

కలి కాలం:

[మార్చు]

ధర్మం తప్పిన కాలంగా ఈ మాటను వాడతారు. కలికాలంలో ధర్మము ఒంటికాలిమీద నడుస్తుందని నానుడి. అధర్మ ప్రవర్థనను చూచినప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కలిసొచ్చిన కాలం

[మార్చు]

ఊహించని సంపద కలిసి రావడము/ దీనికి సంబందించిన ఒక సామెత కూడ ఒకటున్నది. కలిసొచ్చిన కాలనికి నడిసొచ్చే కొడుకు పుడుతారట.

కలిమే బలిమి

[మార్చు]

కలిమి సంపద కలిగి ఉన్న వాడికి తలచుకొన్న పనులన్నీ వెంటనే నెరవేరుతుంటాయి.కలిమి లేనివాడు నిస్సత్తువ ఆవరించి ఆ మనిషి ఏపనీ చేయలేక దిగాలు పడి కూర్చుంటాడు. మళ్ళీ కాస్త ధనం చేకూరగానే ఓపిక వచ్చినట్త్టె పదిమందిలోకి వచ్చి కనిపిస్తుంటాడు. అన్ని సక్రమంగా జరుగు తున్నాయని అర్థం అదృష్టంకలిసివచ్చిందని ఆర్థం. (కలిసొచ్చిన కాలానికి నడిసొచ్చే కొడుకు పుట్టాడట... అనేది సామెత)

కలుపుగోలు కల్లు

[మార్చు]

ఇరువర్గాలవారు విభేదాలను మరిచి స్నేహంగా కలిసిన సందర్భంలో ఇచ్చే విందు మాయ బంగారం,నకిలీ,పైపై ఆకర్షణ,మోసపు పనులు

కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు

[మార్చు]

అసూయ గల వారు; ఉదా: వారు వీరి అభివృద్దిని చూసు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అని అంటుంటారు.

కలోగంజో...

[మార్చు]

బ్రతకడానికి ఏదో ఒకటి తినాలి అని అర్థం.

కళ్లు అప్పగించి చూస్తున్నాడు

[మార్చు]

తదేకంగా చూస్తున్నాడు అని అర్థం. ఉదా: అక్కడ కోడెలు పోట్లాడుకుంటే ఆపిల్లలు కళ్ళప్పగించి చూస్తున్నారు. అని అంటుంటారు.

కళ్ళకు కట్టినట్లు

[మార్చు]

చాల స్పష్టంగా అని అర్థం.. ఉదా: వాడు ఏమి చెప్పినా కళ్ళకు కట్టి నట్లుంటుంది. ఉదా: ఆ తెలుగు పండితుడు పాటాలు చెప్పుతుంటే కళ్ళకు కట్టి నట్లుంటుంది అని అంటుంటారు.

కళ్ళల్లో వత్తులేసుకుని చూడటం

[మార్చు]

అదేపనిగా ఎదురుచూడటం పడిగాపులుపడటం

కళ్లల్లో కారం కొట్టి తప్పించుకున్నారు

[మార్చు]

మోసం చేసి తప్పించు కున్నారు

కళ్లనీళ్లు తుడవడం

[మార్చు]

ఓదార్చడం

కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు

[మార్చు]

అతి అసూయ పడుతున్నారని అర్థం.

కళ్లున్న కభోధి

[మార్చు]

పొగరెక్కువయిన వారిని గురించి చెప్పే మాట./ కళ్ళున్నా చూడలేని వాడని అర్థం. గర్వం ఎక్కువయి కళ్ళముందున్నది కూడా కాన లేక పోవడము అని అర్థము

కళ్ళమీద తెల్లారటం

[మార్చు]

నిద్రపోవటం

కళ్లు కాయలు కాసాయి

[మార్చు]

ఎదురు చూసి. ఉదా: నీకోసం ఎదురు చూసి కళ్లు కాయలు కాసాయి.

కళ్లు చమర్చాయి

[మార్చు]

ఏడుపొస్తున్నది: ఉదా: వారి బాధ చూస్తుంటే కళ్లు చెమర్చాయి అని అంటుంటారు.

కళ్లుచెదిరే అందం

[మార్చు]

చాల అందమైనదని అర్థం: ఉదా: ఆ అమ్మాయిది కళ్లు చెదిరె అందం.

కళ్లు నెత్తికెక్కాయా

[మార్చు]

పొగరెక్కిందా... ఉదా: ఏరా.... కళ్లు నెత్తికెక్కాయా పిలిస్తె పలకవు.

కళ్లు పెద్దవి కడుపు చిన్నది

[మార్చు]

ఎక్కువ ఆశ గలవాడు: ఉదా: వానికి కళ్లు పెద్దవి కడుపు చిన్నది.

కళ్లు మసక బారాయా>

[మార్చు]

పొగరెక్కిందా..... ఉదా: ఏరా... కళ్లు మసక బారాయా, చూసి చూడనట్టు పోతున్నావు.

కళ్లు తెరిపించాడు

[మార్చు]

అసలు విషయం చెప్పాడు. ఉదా: వాడు అసలు విషయం చెప్పి నాకళ్లు తెరిపించాడు. అసలు విషయం తెలియక సదిగ్దంలో కొట్టు మిట్టాడుతుంటే..... ఆ సందర్భంలో మంచి సలహా ఇచ్చి సహాయ పడితే అటు వంటి సందర్భంలో ఈ జతీయాన్ని ఉపయోగిస్తారు.

కళ్లు ఎర్ర బడ్డాయి

[మార్చు]

కోపం వచ్చిందని అర్థం

కళ్లు నెత్తికెక్కాయి

[మార్చు]

పొగరు ఎక్కువని అర్థం

కళ్ళు నెత్తికెక్కు

[మార్చు]

పొగరు కనబరచు. ఎన్ని సార్లు పిలిచినా రావడంలేదు. కళ్లు నెత్తికెక్కాయా?

కళ్లు కాయలు కాచాయి

[మార్చు]

ఎదురు చూడడము. ఉదా: వాడికొరకు ఎదురు చూసి కళ్లు కాయలు కాచాయి.

కళ్లెం వేయాలి

[మార్చు]

అదుపులో పెట్టాలని అర్థం. ఉదా: వాని దూకుడుకు కళ్లెం వేయాలి.

కళ్లెర్ర చెసాడు

[మార్చు]

కోపం వచ్చింది.

కళ్లెం వేయాలి

[మార్చు]

అదుపులో పెట్టాలి: ఉదా: వాడు చెప్పిన మాట వినడం లేదు వానికి కళ్లెం వేయాలి.

కవలవాడి తలనొప్పి

[మార్చు]

కవకవ

[మార్చు]

కవలవాడి తలనొప్పి

[మార్చు]

కష్టే ఫలి

[మార్చు]

కష్టం చేస్తేనె ఏదైనా ఫలితముంటుంది.

కశ్శన్న

[మార్చు]

కసాపిస

[మార్చు]

నమలటం, తొక్కటం

కసమస

[మార్చు]

ఒకరు పడుతున్న బాధను మరొకరు కూడా పడటం

కసాయి కత్తులు

[మార్చు]

నిర్దాక్షిణ్యమైనవి, నిర్దాక్షిణ్య వైఖరిని అవలంబించేవారు

కహ కహ నవ్వు

[మార్చు]

కంకణం కట్టు కున్నాడు

[మార్చు]

పంతం పట్టాడు. ఉదా: వాడు ఆ పని ఇంత లోపల పూర్తి చేయాలని కంకణం కట్టు కున్నాడు.

కంచి గరుడ సేవ

[మార్చు]

ఉపయోగం లేని పని: ఉదా: ఆ పని వట్టి కంచి గరుడ సేవ.

కంచి గరుడ సేవ

[మార్చు]

కష్టమైనా ఉపయోగం లేకపోయినా తప్పనిసరై చేసే పని. కంచిలో గరుడ విగ్రహము చాలా పెద్దది, ఒక రథము అంత ఉంటుంది దానిని సేవకు తరలించుట కొద్దిగ కష్టం. గరుడుడు విష్ణువుకు వాహనం. ముందుగా గరుడునికి దండం పెట్టాకే విష్ణువు దగ్గరకెళ్ళాలి. అతనికి నమస్కారం చెయ్యకుండా యజమాని దగ్గరకు నేరుగా వెళితే ఏమి కోపం పెట్టుకుంటాడో. ఒకవేళ నమస్కరించినా పెద్దగా ఒరిగేదీ లేదు. ఒక నమస్కారం పెడితే పోలా, ఎందుకొచ్చిన బాధలెమ్మని చేసే సేవ.

కంచి మేక

[మార్చు]

త్యాగబుద్ధి లేని ధనవంతుడు.ఇతర ప్రాంతాలలోని మేకల కన్నా కంచి ప్రాంతంలో ఉండే మేకలకు పొదుగు బాగా పెద్దదిగా ఉంటుందట. ఇతర మేకల కన్నా అవి పాలు బాగా ఇస్తాయి. వచ్చిన చిక్కల్లా ఏమంటే గేదె పాలు, ఆవు పాలు తాగినట్టు మేకపాలను ఎక్కువ మంది తాగరు. అందుకని కంచి మేక ఇచ్చే ఎక్కువ పాలు దాని పిల్లలకే తప్ప ఇతరులకు పనికిరావు. ఎవరికీ పనికిరాని సంపదలున్న వారిని కంచి మేకలు అంటారు.

కంచుకాగడా వేసినను దొరకడు

[మార్చు]

ఎంత వెతకినా దొరకడు అని అర్థం.

కంచు కోట

[మార్చు]

ఎవరికైన ఒక ప్రాంతంలో వారిమాటకు ఎదురులేకుంటే, వారి మాట చెల్లుబాటు అవుతుంటే ఆ ప్రాంతాన్ని వారి కంచు కోటగా అంటుంటారు. ఉదా: ఈ నియోజిక వర్గము కాంగ్రెసు వారికి కంచు కోట

కంచం దగ్గర పిల్లి లాగ

[మార్చు]

అవకాశం కొరకు ఆశగా ఎదురు చూడటము.

కంటిచూపుతో చంపేస్తా

[మార్చు]

ఇది ఒక సినిమా డైలాగ్

కంటి మీద కునుకు లేదు

[మార్చు]

తీరికే లేదు అని అర్థం.

కంటికి రెప్పవోలె

[మార్చు]

కాపాడుకోవటం...... పిల్లి తన పిల్లల్ల్ని కంటికి రెప్ప లాగ కాపాడు కుంటుంది.

కంటికి రెప్ప భార మగు

[మార్చు]

తేలికైనదే బరువవటం.తల్లికి పిల్లలు, భూమికి కొండలు, కొండలకు చెట్లు, చెట్లకు కాయలు భారం కావు అంటారు.

కంటి చూపుతో చంపేస్తా

[మార్చు]

ఇదొక సినిమా డైలాగ్.

కంటిలో నలుసు పడ్డట్టు

[మార్చు]

సున్నితమైన ప్రాంతంలో సలుపు పెట్టే బాధ.తీయటానికి రాదు బాధపోదు.కాలిలోని ముల్లు చెవిలోని జోరీగ ఇంటిలోని పోరు చెప్పుకోలేని బాధ. వేమన పద్యం " చెప్పులోన రాయి, చెవిలోన జోరీగ, కంటి లోన నలుసు, కాలి ముల్లు, ఇంటి లోన పోరు ఇంతింత కాదయా , విశ్వ దాభిరామ వినుర వేమ."

కంటి మీద కునుకు లేదు

[మార్చు]

విరామమే లేదు.కాస్త కూడా తీరిక లేనంత పనివుంటే ఈ మాటను ఉపయోగిస్తారు.

కంట్లో కారం కొట్టాడు:

[మార్చు]

మోసం చేసాడని అర్థం: ఉదా: వాడు నాకంట్లో కారం కొట్టి తప్పించు కున్నాడు.

కంట్లో నలుసు బడ్డట్టు

[మార్చు]

చీకాకు కలిగించే విషయం: ఉదా: వాడు చెప్పింది వింటే కంట్లో నలుసు పడ్డట్టుంది. ఆ సందర్భంగా ఈ జాతీయాన్ని వాడుతారు.

కండ కావరం

[మార్చు]

పొగరు ఎక్కువ: ఉదా;

కంపు కంపు చేశాడు

[మార్చు]

గజిబిజి చేశాడు అని అర్థం>

కండ కావరం ఎక్కువయింది

[మార్చు]

పొగరెక్కువయింది: ఉదా: ఏరా? కండ కావరం ఎక్కువయిందా... పిలిస్తే పలకవు?

కంద విత్తు

[మార్చు]

కందకు విత్తులుండవు: అనగా చెపుతున్నది అబద్ధం అన్న మాట.

కందాలరాజు

[మార్చు]

కంభం చెరువు

[మార్చు]

చాల పెద్ద చెరువని అర్థం.

కందాల రాజు

[మార్చు]

కంపలో కాసిన కాయ

[మార్చు]

ఉండి కూడా ఉపయోగించుకోలేనిది.ముళ్ళ కంప మధ్యలో అందుబాటులో లేకుండా కాసిన కాయ. దాన్ని కోయడానికి వీలుపడదు. అందుబాటులో లేని సంపద ఉద్దేశించి ఈ మాటను వాడుతారు.

కంపలో బడిన కాకి

[మార్చు]

అటు ఇటు కాని స్థితి ... కష్టాలు చుట్టు ముట్టాయి. కంపలో పడ్డ కాకి తప్పించుకునే ప్రయత్నంలో మరి కొన్ని ముళ్ళు గ్రుచ్చు కుంటాయి. ఆలా ఎక్కువ కష్టాలు చుట్టుముట్టితే ఈ జాతీయాన్ని వాడుతారు.

కంపు చేయటం

[మార్చు]

పని పాడుచేయటం ... నీకేదయినా పని ఇస్తే దాన్ని కంపు కంపు చేసిపెడతావు. న విషయాల్లో ఏమాత్రం లోటు పనికిరాదని హెచ్చరిక.

కంబళ పురోరీషం

[మార్చు]

కబంధ హస్తాలలో చిక్కడం

[మార్చు]

తప్పించుకోలేని విషమ పరిస్థితులు ఏర్పడడం. కబందుడు రామాయణంలో ఒక రాక్షసుడు. అతని చేతికి చిక్కితే ఇక తప్పించు కోవడానికి వీలు పడదు. పురాణాల లోనుండి జన బాహుళ్యంలోనికి వచ్చిన జాతీయ మిది. తప్పించుకోలేని చిక్కుల్లో పడిన వారినుద్దేశించి ఈ జాతీయాన్ని వాడుతారు. ఉపయోగం లేని పని, మొక్కుబడిగా చేసిన పని . కాకి స్నానమైతే చేస్తుంది కానీ ఆ చేసే స్నానం దాని శరీరాన్ని శుభ్రపరచదు.రెక్కల చివరను కొద్దిగా తడిపి ఆ తర్వాత విదిలించుకొని వెళ్ళిపోతుంది.

కాకః కాకః పికః పికః

[మార్చు]

పికము అంటే కోకిల. కాకి కాకే, కోకిల కోకిలే ఆరెంటికి పోలిక లేదు - అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కాకలు తీరటం

[మార్చు]

అనుభవం.కాకలు అంటే కష్టాలు, నష్టాలు, తాపాలు.

కాకత పరిక్ష

[మార్చు]

కాకతాళీయంగా

[మార్చు]

అనుకోకుందా జరిగిన సంఘటనను ఇలా అంటారు. దీనికి సంబంధించిన కథ: తాటి చెట్టుపైన ఒక తాటి పండు మాగి పోయి పడిపోవడానికి సిద్దంగా ఉంది. అదే సమయానికి ఒక కాకి దానిపై వాలింది. వెంటనే ఆ తాటి పండు రాలి కింద పడి పోయింది. ఆ విధంగా అనుకోకుండా జరిగిన దానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కాకమ్మ కథలు చెప్పకు

[మార్చు]

లేని పోని విషయాలు; కల్పితాలు చెప్పేవారిని ఇలా అంటారు.

కాకమ్మ కథలు చెప్పకు

[మార్చు]

ఉపయోగంలేని మాటలు మాట్లాడొద్దు. అని అర్థం.

కాకస్నానం

[మార్చు]

కాకతాళీయం

[మార్చు]

కాకదంత పరీక్ష

[మార్చు]

కాకదంత పరీక్ష

[మార్చు]

కాకవంధ్య

[మార్చు]

కాకతాళీయం

[మార్చు]

ఇది ఒక సంస్కృత న్యాయం. కాకి ఒకటి వచ్చి తాటిచెట్టుమీద వాలింది. తాటిపండు నేలరాలింది రెండూ ఒకేసారి జరిగినంత మాత్రనా కాకి వచ్చి వాలినందుకే తాటిపండు రాలిందని అనుకోకూడదు అది కేవలం అనుకోకుండా జరిగిన సంఘటనల కలయిక అని చెప్పడం ఈ న్యాయం ఉద్దేశం. అలా యాధృచ్ఛికంగా జరిగిన సంఘటనను కాకతాళీయం అంటారు.

కాకావికలు

[మార్చు]

చెల్లాచెదరు బిడ్డలు పదే పదే పుడుతూ చనిపోతూ ఉన్న తల్లి.కాకి తన గూట్లో ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా కోయిలో, మరో పక్షో, చెట్ల మీదకు పాకే పాముల వల్లనో ఆ గుడ్లన్నీ నశించి పోతుంటాయి

కాకి గోల

[మార్చు]

పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తుంటే ఈ మాట వాడతారు.

కాకిగోల

[మార్చు]

కాకులు గుంపులుగా చేరి గోల గోలగా అరుస్తుంటాయి. ఆ విధంగా క్రమశిక్షణా రాహిత్యం, అసందర్భ ప్రేలాపన చేస్తున్న వారినుద్దేశించి ఈ జాతీయాన్ని వాడుతారు.

కాకి ముక్కుకు దొండ పండు

[మార్చు]

నల్లని కాకిముక్కుకు ఎర్రని దొండ పండు పొంతన కుదరదు. పొంతన లేని వాని గురించి దీన్ని వాడుతారు. ఎక్కువగా సరి జోడి లేని దంపతులనుద్దేశించి ఈ జాతీయాన్ని వాడుతారు.

కాకిని నమ్మకుండా

[మార్చు]

ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి సొమ్ము కూడబెట్టి దాచటం . చేపలను, మాంసాన్ని కోసేటప్పుడు పసిగట్టిన కాకులు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కోసిన ముక్కల్ని ఎగరేసుకుపోతాయి.అలాంటి కాకులకు ఏ పరిస్థితుల్లోనూ అందకుండా జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకెళ్ళటం.సంపాదన ఇతరుల చేతికి దక్కకుండా జాగ్రత్త చేయటం

కాకి బలగం

[మార్చు]

సామూహిక ఐకమత్యానికి ప్రతీక.కాకుల్లో ఏ ఒక్క కాకికి దెబ్బ తగిలినా మిగతా కాకులన్నీ వచ్చి దాని చుట్టూ చేరి తమ ఐక్యతను ప్రకటిస్తాయి. అలాగే ఒక కాకికి ఏ మాంసం ముక్కో ఆహారంగా దొరికితే అది మిగిలిన కాకులను కూడా పిలిచి వాటితో పంచుకొని తింటుంది.

కాకులను కొట్టి, గ్రద్దలకు వేయు

[మార్చు]

కాకులు దూరని కారడవి

[మార్చు]

చాల దట్టమైన అడవి అని అర్థం.

కాగడావేసి వెతకడం

[మార్చు]

సునిశితంగా పరిశీలించడం వెతకటం. ఉదా: ఈ రోజుల్లో నీతిమంతులు కాగడా వేసి వెతికినా కనిపించరు.

కాగితం మీది కందిపప్పు

[మార్చు]

దొంగ లెక్కలు.

కాగితం పడవ

[మార్చు]

చూపులకు మాత్రమే ఆకారంతో ఉండి దేనికీ పనికిరానిది. పేరుకు మాత్రమే పలుకుబడి ఉన్న వాళ్ళలాగా, సహాయం చేసే వాళ్ళలాగా కనిపిస్తూ సమయానికి ఆదుకోలేని వారు

కాచి వడబోసారు

[మార్చు]

జాగ్రత్తగా పరిశీలించారు: ఉదా: ఆ పార్టీవారు అభ్యర్థుల ఎంపికలో కాచి వడబోసి నిర్ణయించారు.

ఉదా: పెద్దలు వారి అనుభవాల నుండి కాచి వడపోసి మంచి విషయాలను పిల్లలకు చెప్తారు.

ఒకే పనిని పదే పదే చేయడం ద్వారా ఆ పనిని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడాన్ని కూడా కాచి వడబోయటం అనవచ్చు. ఉదా: ఇరవై ఏళ్ళుగా పిల్లలకు పాఠాలు చెప్తున్న ఆవిడ పిల్లల మనస్తత్వాలన్ని కాచి వడపోసింది.

కాచి వడబోయడం

[మార్చు]

పూర్తిగా సారాన్ని గ్రహించడం, అవగాహన చేసుకోవడం. విద్యార్థులందరు పాఠాలను కాచి వడబోచారు.

కాట్లకుక్క

[మార్చు]

జగడాల మారి: ఉదా: వాడొట్టి కాట్ల కుక్క

కాటికాపరి యేడ్పు

[మార్చు]

కాటికి కాళ్ళు చాపు

[మార్చు]

చావడానికి సిద్దంగా వున్నాడని అర్థం;

కాటికి మొక్కటం

[మార్చు]

మంచి వ్యక్తిని బతికున్నప్పుడు బాగా గౌరవించి నమస్కరించిన వారు ఆయన పోయాక కూడా ఆయనను దహనం చేసిన ప్రదేశానికి సైతం మొక్కటం. మరణానంతరం కూడా ఓ మంచి వ్యక్తి చేసిన మేలును సంస్మరించుకోవటం, కృతజ్ఞతలు తెలుపుకోవటం

కాటికి కాళ్లు చాపి కూర్చున్నాడు

[మార్చు]

చావుకు దగ్గరగా ఉన్నాడు.

కానాకష్టంచేశారు

[మార్చు]

చాల కష్టం చేశారు. అతి కష్టమ్మీద ఉదా: రాఘవ ను అతని తల్లి దండ్రులు కానా కష్టం చేసి చదివించారు.

కామారపు జీడి

[మార్చు]

కారాలు మిరియాలు నూరడం

[మార్చు]

కోపంగా వున్నాడని అర్థము: ఉదా: వాడు నీమీద కారాలు మిరియాలు నూరు తున్నాడు అని అంటారు. అనగా వాడు నీమీద చాల కోపంగా వున్నాడని అర్థము.

కారు కూతలు కూస్తున్నాడు

[మార్చు]

ఉదా: వాడు కారు కూతలు కూస్తున్నాడు. తిడుతున్నాడని అర్థం.

కార్తె ముందర ఉరమటం

[మార్చు]

కార్యం ముందు వదరటం.రోహిణి కార్తెకు ముందు ఉరిమినా, వర్షం పడ్డా కార్తెలో వర్షాలు పడక ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటుంటారు.

కాలుదువ్వడం

[మార్చు]

ఘర్షణకు సిద్ధపడడం/ పోట్లాటకు పిలవడము: పశువులు పోట్లాటకు సిద్దమవు తున్నప్పుడు కాలు దువ్వుతాయి. వాటిని బట్టి ఈ మాట పుట్టినది.

కాలు పెట్టడం

[మార్చు]

పాల్గొనటం, లెగ్గు పెట్టడం, పాదం మోపటం, కాలు మోపడమే వ్యతిరేక, వ్యంగ్యార్థంలో కనిపిస్తుంటుంది. వాడు ఇక్కడ కాలు పెట్టాడు .... ఆ పని అంతా పాడై పోయింది.

కామారపు జీడి

[మార్చు]

కాయా పండా

[మార్చు]

జయమా అపజయమా? ఉదా: పని మీద వెళ్ళావు గదా: కాయా పండా? ఆ సందర్భంగా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కారాలు మిరియాలు నూరు తున్నాడు

[మార్చు]

కోపంగా వున్నాడు: ఉదా: వాడు నామీద కారాలు మిరియాలు నూరు తున్నాడు.

కాలరాయటం

[మార్చు]

అణిచివేయటం.కాలితో తన్నటం అవమానం. ఉదా: నేను చెప్పిన సలహాలన్నీ కాలరాచాడు./ అనగా ఏ మాత్రం పాటించ లేదని అర్థం.

కాలమె సమాదానము చెప్తుంది

[మార్చు]

అసలు విషయం నిదానంగా తెలుస్తుందని అర్థం. ఏదేని సమస్యకు అప్పటికప్పుడు సమాదానము దొరక్కపోతే.... ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.

కాలం కరిగి పోయింది

[మార్చు]

సమయం వృధా అయ్యింది.

కాలనేమి జపం

[మార్చు]

కాలికి బలపం కట్టుకొని తిరుగు తున్నాడు

[మార్చు]

చాల చోట్ల తిరిగాడు: ఉదా: అతను తన కూతురి పెళ్ళి సంబంధం గురించి కాలికి బలపం కట్టుకొని తిరుగు తున్నాడు.

కాలికేస్తే వేలికేస్తాడు

[మార్చు]

తంటాలు పెట్టి తప్పించుకునే రకం. (ఇదే అర్థంతో సమెత కూడా ఉంది. అది. కాలికేస్తే వేలికేస్తాడు, వేలికేస్తే కాలికేస్తాడు.

కాలి గోటికి సరిపోలడు

[మార్చు]

ఉదా: వాడు నా కాలిగోటికి సరి పోలడు. అల్పుడు అని అర్థం.

కాలుగాలిన పిల్లి

[మార్చు]

కాలు జారింది

[మార్చు]

మాట జారింది: తప్పు జరిగింది: తప్పు చేశాడని అర్థము.

కాలు కింద పెట్టడు

[మార్చు]

ఏ పని చేయడని అర్థం. అన్ని సక్రమంగా జరిగి పోతుంటే/ కావలసినపనులన్నీ జరిగి పోతుంటే చేయ వలసిన పనులేవి లేకుంటే/ఐశ్వర్య వంతుల గురించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఉదా: వాడికేం ? కాలుకింద పెట్టకుందా జరిగి పోతున్నది అని అంటుంటారు.

కాల్మొక్తా.... నీ బాంచన్

[మార్చు]

ఇది తెలంగాణా ప్రాంతంలో వాడె ఒక ఊత పదం. ఎక్కువగా దళితులు ఈ పదాన్ని వాడతారు.

కాలం కాటేసింది

[మార్చు]

కష్టాలెక్కువయ్యాయి.

కాలం వెళ్ల దీస్తున్నాడు

[మార్చు]

కష్టంగా బతుకీడుస్తున్నాడు. ఉదా: ఎదో ఇలా కాలం వెళ్ల దీస్తున్నాను. చావలేక బ్రతుకుతున్నాడని అర్థము.

కాలం కలిసి రాలేదు

[మార్చు]

కాలం కరిగి పోయింది

[మార్చు]

సమయం వృధాఅయిందని అర్థం; సమయం అనుకూలంగా లేదు: ఉదా: వానికి కాలం కలసి రాలేదు.

కాళ్లకు బందం వేశాడు

[మార్చు]

అడ్డు కున్నాడు. ఉదా: వాడు నాకాళ్లకు బందం వేశాడు.

కాళ్లకు బుద్ది చెపాడు

[మార్చు]

పారి పోయాడు అని అర్థం: కాళ్లకు పని చెప్పాడు అని కూడా అంటారు.

కాళ్లరిగేలా తిరిగాడు

[మార్చు]

చాల ఎక్కువగా తిరిగాడు.

కాళ్ల బేరానికొచ్చాడు

[మార్చు]

దిగి వచ్చాడు. క్షమించమని కోరాడు. ఉదా: వాడు ఇన్ని మాటలని ఇప్పుడు కాళ్ల బేరానికొచ్చాడు.

కాళ్లీడ్చుకుంటూ వచ్చాడు

[మార్చు]

చాల కష్టపడి వచ్చాడు. చాల దూరంనుండి అధిక ప్రయాసతో వచ్చాడని అర్థము.

కావాలంటే రాసిస్తా

[మార్చు]

ఇది ఒక సినిమా డైలాగు.

కావేరిగుర్రం

[మార్చు]

కాసులు కురుస్తున్నాయా ఇక్కడ?

[మార్చు]

పిల్లలు పలుమార్లు డబ్బులడిగితే వారిని విసుక్కుంటూ అనే మాట.

కాందారి మాందారి ప్రొద్దు

[మార్చు]

అర్దరాత్రి

కాయగసరులు

[మార్చు]

కూరగాయలు.

కాయ గాచు

[మార్చు]

ఓ బిడ్డను కను. ఉదా: ఇన్నాళ్లకు ఆమె కడుపున ఒక కాయ కాసింది. పిల్ల పుట్టడాన్ని ఈ జాతీయంతో పోల్చి చెప్పడము రివాజు.

కాయో పండో

[మార్చు]

అవునో కాదో, పని అయితే పండు అని, పని కాకపోతె కాయ అని అంటారు. ఒక పని మీద వెళ్ళివచ్చిన వాడిని ఏమయ్యింది ? అని అడిగే బదులు... కాయా .... పండా.... ? అని అడుగుతారు.

కారాలు మిరియాలు నూరు

[మార్చు]

కోపగించు అని అర్థము. వారు వీనిమీద కారాలు మిరియాలు నూరుతున్నారు అని అంటుంటారు

కారు కూతలు కూస్తున్నాడు

[మార్చు]

తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని అర్థం:

కాలనేమి జపము

[మార్చు]

కాలం కరిగి పోయింది

[మార్చు]

సమయం అయి పోయింది అని అర్థం

కాలికి బలపం కట్టుకొని

[మార్చు]

ఎక్కువగా తిరిగే వారిని గురించి ఇలా అంటారు.

కాలికేస్తే వేలికి వేలికేస్తే కాలికి

[మార్చు]

జిత్తుల మారి పనులు చేసె వారిని ఇలా అంటారు

కాలిగోటితో సమానం

[మార్చు]

చాల స్వల్పమని అర్థం. వాడెంత వాడి బ్రతుకెంత వాడు నా కాలి గోటితో సమానము అని ఇతరులను నిందిస్తుంటారు.

కాలికి ముల్లు గ్రుచ్చుకొనదు

[మార్చు]

కాలికి వేసిన వేలికి, వేలికి వేసిన కాలికి

[మార్చు]

తగవును ఏదో విధంగా మెలికబెట్టి పరిష్కారం కానీయకుండా చేసే నేర్పును వాడు కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి వేసె రకం

కాలికి బుద్ది చెప్పుట

[మార్చు]

పారిపోవటం............... పరుగెత్తాడు

కాలు పెట్టాడు

[మార్చు]

కాలు ద్రువ్వు

[మార్చు]

పోట్లాటకు పిలవడం "వాడు నామీదికి కాలు దువ్వుతున్నాడు

కాలు కాలిన పిల్లి

[మార్చు]

అసహనంగా తిరగటం. ఒక చోట నిలకడగా వుండక, అసహనంగా అటు ఇటూ తిరుగు తుంటే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఉదా: వాడిక్కడ కాలు పెట్టాడు... సర్వ నాశనమైపోయింది.

కాళ్లకు బుద్ది చెప్పాడు

[మార్చు]

పారి పోయాడని అర్థం.

కాళ్ల బేరానికొచ్చాడు

[మార్చు]

క్షమించమని కోరు తున్నాడు

కాలం వెళ్ల దీస్తున్నాడు

[మార్చు]

బారంగా బ్రతుకీడుస్తున్నాడని అర్థం:

కాలం కాటేసింది

[మార్చు]

అధిక కష్టాలు ఆవరించాయని అర్థం. అనుకోకుండా ఎవరికైనా అనేక కష్టాలు వస్తుంటే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కాటికి కాళ్లు చాపి కూర్చున్నాడు

[మార్చు]

మరణానికి దగ్గర్లో వున్నాడని అర్థం.

కానా కష్టం చేశాడు

[మార్చు]

చాల ఎక్కువ శ్రమించాడని అర్థం;

కాలు జారింది

[మార్చు]

తప్పటడుగు వేశాడని అర్థం:

కాల్చుకు తింటున్నాడు

[మార్చు]

చాల బాదిస్తున్నాడని అర్థం: ఉదా: వాడు నన్ను కాల్చుకు తింటున్నాడు/ ఎవరైనా ఒకరిని ఎక్కువగా బాదిస్తుంటే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.

కాలం కలిసి రాలేదు

[మార్చు]

కాళ్ళు పట్టుకు లాగటం

[మార్చు]

కుతంత్రంతో ఎదుటివారిని అపజయం పాలుచేయటం .కాళ్ళు పట్టుకోవటం అంటే ప్రాధేయపడటం . కానీ కాళ్లు పట్టుకొని లాగటం అంటే ఓ వ్యక్తి జీవనాధార వనరులను చెడగొట్టి నష్టం కలిగించటం.

కాళ్లకు చక్రాలు

[మార్చు]

అదేపనిగా ఎప్పుడూ తిరుగుతూ ఉండడం సరైన సమయం రాలేదని అర్థం; ఏ పని చేపట్టినా సక్రమముగా జరగ అన్ని అవాంతరాలు వస్తుంటే.... నాకు కాలం కలిసి రాలేదంటూ ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కాళ్ళకట్టకు పడుకోవటం

[మార్చు]

సక్రమంగా వ్యవహరించక పోవటం, రసజ్ఞత లేకపోవటం . కాళ్ళకట్టవైపు తలపెట్టుకుని పడుకున్నాడంటే వాడికి ఏమీ తెలియదని అర్థం. అడ్డదిడ్డంగా ప్రవర్తించటం

కాళ్లరిగేలా తిరిగాడు

[మార్చు]

ఎక్కువగా తిరిగుట: ఉదా: అతను తన కొడుకు పెళ్లి సంబంధం కొరకు కాళ్లు అరిగేలా తిరిగాడు

కాళ్లీడ్చుకుంటు వచ్చాడు

[మార్చు]

చాల ప్రయాస పడి వచ్చాడని అర్థం:

కారు చీకట

[మార్చు]

చాల ఎక్కువ చీకటి అని అర్థం.

కారు కూతలు కూయ వద్దు

[మార్చు]

తప్పుడు మాటలు మాట్లాడొద్దు

కారు మబ్బులు కమ్ము కున్నాయి

[మార్చు]

బాగా చీకటి పడింది అని అర్థం: జీవితంలో కష్టాలు ఎక్కువగా చుట్టు ముట్టితే ఈ జాతీయాన్ని వాడుతారు.

కాసులు కురుస్తునాయా?

[మార్చు]

కాస్కో

[మార్చు]

కావేరీ గుర్రాలు

[మార్చు]

బాగా వేగంగా పరుగెత్తటం. పరుగు లంకించుకోవటం

కిందాకు రాలె మీదాకు నవ్వే

[మార్చు]

కిందఉన్న ఆకు ముందుగానే ముదిరి రాలిపోతుంది. దానిపై ఇంకో చిగురుటాకు పుట్టుకొచ్చి నవనవలాడుతూ నవ్వుతున్నట్టు కనిపిస్తుంది.కొంత కాలానికి ఆ ఆకు కూడ ముదిరి రాలి పోవలసినదే. అదే విధంగా వృద్ధులను చూసి యువకులు నవ్వుతుంటారు. అయితే ఆ యువకులు తాము కూడా మరికొద్ది కాలానికి వృద్ధులవుతామని అనుకోరు. అటు వంటి సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.

కాలం కరిగి పోయింది

[మార్చు]

సమయం వృధాఅయిందని అర్థం;

కిమ్మను

[మార్చు]

ఏమి చేయకుండా వుండడం. నేనిన్ని మాట్లాడుతున్నా కిమ్మనకున్నావు.

కిరికిరి

[మార్చు]

తగాదా, లంపటం, గొడవ ,మాయచేయటం ఉదా: వాడొట్టి కిరి కిరి గాడు " తగాదాలు పెట్టుకునే వాడు.

కిసుక్కున నవ్వాడు

[మార్చు]

ఉన్నట్టుండి నవ్వడం.

కిమ్మనలేదు

[మార్చు]

ఏమి అనలేదు: ఉదా: ఇన్ని మాటలంటున్నా వాడు కిమ్మనలేదు.

కిలాడి మాటలు

[మార్చు]

మోసపూరిత మాటలు: ఉదా: వాడి మాటలు అన్నీ కిలాడి మాటలు.

కిందాకు రాలె మీదాకు నవ్వే

[మార్చు]

కిందఉన్న ఆకు ముందుగానే ముదిరి రాలిపోతుంది. దానిపై ఇంకో చిగురుటాకు పుట్టుకొచ్చి నవనవలాడుతూ నవ్వుతున్నట్టు కనిపిస్తుంది.వృద్ధులను చూసి యువకులు నవ్వుతుంటారు. అయితే ఆ యువకులు తాము కూడా మరికొద్ది కాలానికి వృద్ధులవుతామని అనుకోరు.

కీచులాడు కుంటున్నారు

[మార్చు]

పోట్లాడు కుంటున్నారు: ఉదా: ఆభార్యా భర్తలిద్దరు ఎప్పుడు కీచులాడు కుంటున్నారు.

కీలెరిగి వాత పెట్టు

[మార్చు]

వీలుచూసుకొని దెబ్బగొట్టడం

కీలుబొమ్మ

[మార్చు]

సొంత వ్యక్తిత్వం లేకుండా ఇతరుల మీద ఆధారపడి వారెలా చెప్తే అలా చేసే వాడు , ఒకరు ఆడించినట్టే ఆడేవాడు. ఉదా:.... "వాడు వీని చేతిలో కీలు బొమ్మ"

కీలెరిగి వాత పెట్టాలి

[మార్చు]

సమయం చూసి దెబ్బతీయాలి. ఉదా: వానికి కీలెరిగి వాత పెట్టాలి

కుక్కను కదిలిస్తే కయ్

[మార్చు]

పడుకుని ఉన్న కుక్కను చూసినప్పుడు పక్కకు తప్పుకొని పోవటమే మేలు. అలాకాక కాకినో, పిట్టనో తోలినట్టు దాన్ని కూడా తోలితే లేదా కదిలించే ప్రయత్నం చేస్తే అది కయ్ కయ్‌మని అరిచి మీద పడి కరిచే ప్రమాదం జరగవచ్చు.

కుక్కకు పావుశేరు

[మార్చు]

దేశం సుభిక్షంగా ఉందని తెలియజెప్పటం.పంటలు బాగా పండుతున్నప్పుడు రైతులు, అసాములు తమ దగ్గరున్న పని వాళ్ళకు జీతంలో కోత లేవీ లేకుండా అడిగినంత ధాన్యమో, ధనమో ఇస్తూ ఉంటారు. యాచకులకు ఎంతో కొంత ఇచ్చి పంపుతుంటారు.పావుశేరు బియ్యాన్ని ఇంటి ముందు కాపలాగా ఉండే కుక్క కోసం కూడా తీసి పక్కన పెడతారు.

కుక్క చావు

[మార్చు]

కుక్క చావు చచ్చాడు

[మార్చు]

నీచమైన చావు చచ్చాడని అర్థం: కుక్క చస్తే దానికి ఎవరు విచారించరు. కంపు కొడుతుందని దూరంగా పారేస్తారు. అలా అందరితో చీత్కారము పొంది చనిపోతే ఈ జాతీయాన్ని వాడుతారు.

కుక్క బలుపు

[మార్చు]

ఉన్నట్టుండి స్థితి మారిపోవటం.కుక్కలు ఆహారం లేక ముందు సన్నగా కనిపించి తిన్న వెంటనే ఇంతలావైనట్లు అనిపిస్తాయి. ఆ లావు కావటమే బలుపు. ఇటీవలి దాకా దరిద్రంతో బాధపడుతూ ఉన్నట్టుండి సంపదలొచ్చిపడ్డ కొందరు కుక్క బలుపు తీరులో కనిపిస్తారు.

కుక్కల దొడ్డి

[మార్చు]

చిందరవందరగా, అపరిశుభ్రంగా ఉండే ప్రాంతం

కుక్క తోక

[మార్చు]

ఎన్నిసార్లు క్రమశిక్షణలో ఉంచాలని ప్రయత్నం చేసినా ఆ కాసేపు మాత్రమే చక్కగా ఉండి తర్వాత తనదైన సహజ పద్ధతిలో వ్యవహరించేది

కుక్క మురికి

[మార్చు]

కుప్పల, మండెల దగ్గర ఏవైనా ఎత్త్తెన వస్తువులు లాంటివి కన్పించిన చోట కుక్క కాలెత్తి మూత్ర విసర్జన చేస్తుంటుంది. కూరగాయలు విపరీతంగా పండిన సమయంలో అంగళ్ళ ముందు కుప్పలు కుప్పలు పోసి వాటి ధర బాగా పడిపోతే అలా కుప్పలు పోసిన వాటి మీద కుక్క మూత్ర విసర్జన చేసిందట.కూరగాయలలాంటివి అంగట్లో బాగా అతి తక్కువధరకు దొరికితే కుక్క మురికిగా దొరుకుతున్నాయంటారు.

కుక్క మొరిగినట్లు

[మార్చు]

ప్రతిదానికీ అనవసరంగా మాట్లాడడం, పెద్దాచిన్నా భేదం చూసుకోకుండా వాడెంత, వీడెంత అని ఎగతాళి చేయడం

కుక్క ముట్టిన కుండ

[మార్చు]

కుక్క రోలునాకినట్టు

[మార్చు]

సంతృప్తిని ఇవ్వని పని

కుక్కవచ్చె ఉట్టితెగె

[మార్చు]

కాకతాళీయం కాలం కలిసి రావటం.ఏ ప్రయత్నం చెయ్యకుండానే సులభంగా పని జరగటం.ఓ కుక్క ఆహారం కోసం ఓ ఇంట్లో జొరబడిందట. కచ్చితంగా అదే సమయానికి ఉట్టి తాడును ఎలుక కొరకటంతో ఉట్టి తెగి కిందపడిందట. ఉట్టిలోని గిన్నెల్లో ఉన్న పదార్థాలన్నీ కుక్క తినటానికి సులువుగా దొరికాయట.

కుక్క రాగానే ఉట్టి తెగినట్టు

[మార్చు]

కాలం కలిసి రావటం. అనుకోకుండా జరిగిన సంఘటనతో మంచి ఫలితముంటే ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కుక్కిన పేను లాగ

[మార్చు]

చెప్పిన మాట వింటు పడి వుండడం: ఉదా: వాడు కుక్కిన పేను లాగ పడి ఉన్నాడు.

కుక్కిన పేను

[మార్చు]

అదుపాజ్ఞలకు భయపడి కదలక మెదలక చేష్టలుడిగి పడి ఉండటం. వాడిప్పుడు కుక్కిన పేనల్లె పడి ఉన్నాడు.

కుచ్చుల టోపి పెట్టాడు

[మార్చు]

మోసం చేశాడని అర్థం: ఉదా: వాడు కుచ్చుల టోపి పెట్టాడు.

మోసం చేశాడు: ఉదా: వాడు అప్పు తీసుకొని కుచ్చుల టోపి పెట్టాడు.

కుప్ప తగులబెట్టి పేలాలు వేయించటం

[మార్చు]

తెలివి తెక్కువ పని .పేలాలు కావాలంటే కాసిని జొన్నలు తీసుకొని కావలసినన్ని పేలాలను చేసుకొని తినవచ్చు. అలాకాక జొన్న కుప్పకు నిప్పుపెట్టి ఆ నిప్పుతో కాలిన గింజలన్నీ పేలాల్లాగా వస్తాయి తిందామనుకోవటం.

కుప్ప కూలి పోయాడు

[మార్చు]

పూర్తిగా ఓడి పోయాడు. ఉదా: ఈ ఎన్నిల్లో ప్రత్యర్తులు కుప్ప కూలి పోయారు.

కుచేలుడు

[మార్చు]

కుటుంబరావు

[మార్చు]

కుడి ఎడమ

[మార్చు]

ఆపక్క ఈపక్క ఎలపట దాపట. (పెద్ద తేడాలేదని అర్థం... ఉదా: వారిద్దరు చదువులో కుడి ఎడమగా ఉన్నారు.)

కుడుమిచ్చినమ్మకు సగమైనా ఇవ్వాల

[మార్చు]

ఎప్పుడూ ఎవరి దగ్గరైనా తీసుకోవటమే కాదు అలా ఇచ్చిన వారికి తీసుకున్నవారు ఎంతో కొంత తిరిగి ఇస్తూనే ఉండాలని.

కుదురు లేని కుండ

[మార్చు]

కుదురు లేని కుండ కుదురుగా నిలబడి వుండడు. అలా నిలకడగా వుండని మనిషిని ఇలా అంటారు.

కుప్పి గంతులు వేయడం

[మార్చు]

సంతోషంతో ఎగిరి గంతేయడం:

కుమ్మేశాడు

[మార్చు]

దీన్ని చాల సందర్భాలలో వాడుతారు. బాగా కొట్టాడు అనె అర్థంలో వాడు అందర్నీ కుమ్మేశాడు అని అంటారు. తిండి బాగా తిన్నాడనే అర్థంలో కూడా వాడు బాగ కుమ్మేశాడూ అని కూడా అంటారు.

కులగజ్జిగల వాడు

[మార్చు]

కులాభిమాన ఎక్కువ గల వాడు.

కులుకు మంది పందిట్లోనే

[మార్చు]

సొంతఇళ్ళలో పిసినారి తనం ప్రదర్శిస్తూ పొరుగిళ్లకు వెళ్ళినప్పుడు పుట్టుభోగుల్లా వ్యవహరించటం. సొంత ఇళ్ళలో ఏమాత్రం ఖర్చు పెట్టకుండా బయటకు వెళ్ళి మాకు అవి కావాలి... ఇవి కావాలి... అంటూ అన్నీ తెప్పించుకొనే వారిని గురించి

కుండమార్పిడి

[మార్చు]

ఒక కుటుంబంలోని సోదరీ సోదరులను మరో కుటుంబంలోని సోదరీ సోదరులు వివాహం చేసుకోవటం.పెళ్ళి ఖర్చులు తగ్గుతాయి.

కుడితిలో పడ్డ ఎలుక లాగ

[మార్చు]

తప్పించుకోను వీలు గాకుండా దొరికి పోయాడు. ఉదా: వాడు కుడితిలో పడ్డ ఎలక లాగ బలే దొరిగి పోయాడు. తప్పించుకోలేని విధంగా దొరికిపోతే ఈ సామెతను వాడుతారు.

కులంచెడ్డా సుఖం దక్కింది

[మార్చు]

ఒక నష్టం జరిగినా మరొక లాభం కలిగింది. ఈ మాటను సామెత లాగ కూడా వాడవచ్చు.

కుండలో నీళ్ళు కుండలో ఇంకినట్లు

[మార్చు]

కష్టాలను దిగమింగుతూ లోలోపల మధన పడటం

కుంటి సాకులు చెప్పొద్దు

[మార్చు]

పని ఎగ్గొట్ట డానికి ఎవేవో సాకులు చెప్పి తప్పించుకో జూడడం: ఉదా: తప్పించు కోవడానికి కుంటి సాకులు చెప్పొద్దు.

కుండ మార్పిడి

[మార్చు]

ఇద్దరు అక్క చెల్లలను మరో ఇద్దరు అన్న తమ్ములు పెళ్ళి చేసు కుంటే దాన్ని కుండ మార్పిడి సంబంధం అంటారు.

కుండల్లో గుర్రాలు

[మార్చు]

కుండోదరుడు

[మార్చు]

కుందనపు బొమ్మ

[మార్చు]

అందమైన అని అర్థం: ఉదా: ఆ అమ్మాయి కుందనపు బొమ్మలాగ వున్నది:

కుంభకోణం

[మార్చు]

కుమ్మేశాడు

[మార్చు]

బాగా కొట్టాడు అని అర్థం: ఉదా: వాణ్ని బాగా కుమ్మేశారు.

కుబుసం వీడిన పాములాగ

[మార్చు]

నూతనోచ్చాహంగా వున్నాడని అర్థం. ఆ సందర్భంలో వాడెదె ఈసామెత.

కుబుసం విడిచిన పాము

[మార్చు]

చైతన్యం కలిగిన స్థితి. పాము శరీరం మీద కుబుసం ఉన్నంతసేపూ నిస్తేజంగా ఉంటుంది. ఆ కుబుసం విడిచి పెట్టగానే దానికి గొప్ప చైతన్యం కలిగి హుషారుగా ఉంటుంది. మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఉన్న వ్యధలు తొలగిన తర్వాత హుషారుగా పనిచేసినట్లు.

కుమ్మేశాడు:

[మార్చు]

బాగా కొట్టారు.: ఉదా: వాణ్ణి బాగా కుమ్మేశారు.

కుయ్యో మొర్రో

[మార్చు]

అయ్యోబాబో

కుంచం తప్పదు

[మార్చు]

కంచాల పోసింది తప్పుతుంది గానీ, కుంచాల పోసింది ఎవరినైనా పిలిచి కంచం పెట్టి అందులో అన్నం పెట్టి తినమన్నప్పుడు ఆ అన్నానికి ఖరీదు కట్టడం కానీ, మరెలాంటి వ్యాపార సంబంధమైన విషయాలుకానీ మిత్ర బంధువర్గాల్లో ఉండనే ఉండవు. కంచంలో ఎంత పెట్టినా తిరిగి తనకు ఇవ్వమని ఎవరూ అడగరు. కానీ కుంచంలో ఆహారపదార్థాలను ఓ కొలతగా కొలిచి వేరొక వ్యక్తికి ఇవ్వడమంటే దాన్ని మళ్లీ తిరిగి ఎప్పుడో ఒకప్పుడు ఇవ్వాల్సిందేనని అర్థం.

కుంచెములతో మంచు కొలుచు

[మార్చు]

కుంచెడు మానెడు

[మార్చు]

ఎంతో కొంత అనే అర్థంతో ఈ మాటను వాడతారు. గతంలో కుంచె, మానిక, ఫలము ..... ఇవి కొలతలకు వాడే వారు.

కుంజివ్వటం

[మార్చు]

కీ ఇవ్వటం.బాగా ప్రోత్సహించటం, ఉసిగొలపటం . కుంజి అంటే తాళపు చెవి .ఆ తాళపు చెవితో బాగా మెలితిప్పి వదిలితే ఆట బొమ్మ ఆడుతుంది.

కుదిపేయటం

[మార్చు]

ఆందోళన కలిగించటం

కుండల్లో గుర్రాలు తోలటం

[మార్చు]

ఏ పనీ చేయుకుండా బయటకు వెళ్ళి పైసా సంపాదించుకు రాకుండా బద్ధకంగా వంటింట్లోనే కూర్చొని తింటూ, వంటవాళ్ళతో కబుర్లాడుతూ కాలక్షేపం చేయటం.

కుండలో నీళ్లు కుండలోనే ఇంకినట్లు

[మార్చు]

గుడ్లలో నీరు గుడ్లలోనే కుక్కుకోవటం, బాధను బయటపడనివ్వకుండా లోలోపలే కుమిలిపోవటం.

కుడితిలో పడ్డ ఎలుక

[మార్చు]

సుఖం అనుకొని వెళ్ళి కష్టాలపాలు కావటం

కుదురులేని కుండ

[మార్చు]

స్థిరబుద్ధి లేనివాడు.విడిగా కుండను నేల మీద ఉంచితే దొర్లి పోతుంది.

కుప్పకూలటం

[మార్చు]

ఉన్నట్టుండి ఒక్కసారిగా కింద పడిపోవటం, క్షీణించటం, మరణించటం, పతనం కావటం, విలువ పడిపోవటం అ ప్రభుత్వం ఒక్కసారిగ కుప్పకూలిపోయింది.

కుదేసిన గుమ్మడికాయలాగా

[మార్చు]

నిమ్మకు నీరెత్తినట్లు, దేనికీ స్పందించకపోవటం

కుప్పి గంతులు వేశాడు

[మార్చు]

సంతోషం వెలిబుచ్చడం: ఉదా: వాడు ఆనందం పట్టలేక కుప్పి గంతులేశాడు.

కుబుసం వీడిన పాములాగ

[మార్చు]

కొత్త ఉత్సాహంతో: కొత్త భలంతో: ఉదా:

కుంపట్లు

[మార్చు]

విభేదాలు అసహనం, భేదాభిప్రాయాలు

కుండబద్దలు కొట్టాడు

[మార్చు]

అసలు నిజము బయట పెట్టినప్పుడు ఈ మాటను వాడతారు.

కుండమీదికి

[మార్చు]

వంట సరుకులు

కుండమార్పు

[మార్చు]

ఒక ఇంటి అన్నదమ్ములు వేరొక ఇంటి అక్కా చెల్లెలని పెండ్లాడటము.

కుందనపు బొమ్మ

[మార్చు]

అందమైన అమ్మాయి: ఉదా: ఆ పెళ్ళి కూతురు కుందనపు బొమ్మలాగుంది.

కుందేటికొమ్ము

[మార్చు]

కుందేలుకు కొమ్ము లుండవు. అసాద్యమైన పని అని అర్థం. ఇది ఒక నీతి పద్యం లోని భాగం. కవి తన పద్యంలో తివిరి ఇసుమున తైలమ్ము తీయ వచ్చు.... తిరిగి కుందేటి కొమ్ము సాధించ వచ్చు .... ఎరికి మూర్కుల మనసుల రంజింప లేరు... ఎంతటి అసాద్యమైన పనిని కూడా సాధించ వచ్చును కానీ...... మూర్కుల మనసును మాత్రం మార్చ లేము.... అనే అర్థం.

కుందేలు మసక

[మార్చు]

పొద్దు కుంకుతున్న వేళ. బారెడు పొద్దెక్కింది, మిట్ట మధ్యాహ్నం, పట్టపగలు లాంటి కాలసూచిక .కుందేళ్ళు సాయంసంధ్య వేళ చీకటి ఆవరిస్తున్న సమయంలో ఆహారాన్వేషణకు బయలు దేరతాయి.

కుంభకర్ణ నిద్ర

[మార్చు]

గాఢనిద్ర

కుంభము మీది పొట్టేలు వలె

[మార్చు]

కూడబలుక్కోవటం

[మార్చు]

అంతా కలిసికట్టుగా ఉండి ఒకే అభిప్రాయానికి రావటం

కూడ బలుక్కొని వచ్చారు

[మార్చు]

అంతా ఒక్కసారిగా జనం వచ్చినప్పుడు ఈ మాటను ఉపయోగిస్తారు.

కూలికి ఏడ్చినట్టుంది

[మార్చు]

ఏడ లేక ఎడవడం: ఎమరేమన్న అనుకుంటారేమోనని లేని ఏడుపును తెచ్చుకొని ఏడ్వటము. ఆ సందర్భంలో ఈ సామెత వాడుతారు.

కూత వేటు దూరంలో

[మార్చు]

దగ్గరలో. పోలీసు స్టేషనుకు కూత వేటు దూరంలోనె ఈ హత్య జరిగింది.

కూనలమ్మ కీర్తనలు

[మార్చు]

లల్లాయి పదాలు

కూపస్థమండూకం

[మార్చు]

కూరగాయ కవిత్వము

[మార్చు]

ఎప్పటివో సుద్దులు

కృత్యాద్యవస్థ

[మార్చు]

ఏం చేయాలో తోచని స్థితి, చేయాల్సిన పని చాలా కష్టంగా ఉండటం .కృతి, ఆది, అవస్థ .కృతి అటే కావ్యం లేదా గ్రంథం. ఆది అంటే ప్రారంభం. అవస్థ అంటే పరిస్థితి. కావ్యాన్ని లేదా గ్రంథాన్ని ప్రారంభించబోయే ముందు ఆ కవి లేదా రచయిత ఎలా ప్రారంభించాలా అని చాలా అవస్థ (కష్టం) పడుతూ ఉంటాడు.

కెరటాల కరణం

[మార్చు]

కేతిగాడు

[మార్చు]

ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ, హాస్యాలాడుతూ కనిపించే విదూషకుడు హాస్యగాడు. తిండిపోతు, సోమరిపోతు అసమర్థుడు

కొంగకు మడుగన్నట్టు

[మార్చు]

ఉపాధినీ, ఆనందాన్నీ, ఆహారాన్ని సమకూర్చిపెట్టే స్థానం.

కొంగ జపం

[మార్చు]

మోసపూరితంగా ప్రవర్తించటం . కొంగ నీళ్ళలో ఒంటికాలి మీద నిశ్చలంగా నిలుచొని తనకు కావాల్సిన చేప దగ్గరకు వచ్చదాకా కాపుకాసి దాన్ని పట్టుకొని తింటుంది.మంచి వారుగా ప్రవర్తిస్తూ అమాయకులను మోసం చేయటం.

కొంగుపరచు

[మార్చు]

రతికి తయారవ్వు

కొంగు బంగారు

[మార్చు]

అవసరానికి అందుబాటులో వున్న సంపద అని అర్థం.

కొంగుముడి

[మార్చు]

కొంచెపుతనం

[మార్చు]

తక్కువ స్థాయి మనస్తత్వం కలిగి ఉండటం, నీచంగా ప్రవర్తించటం

కొంటే కొంగుకు రాని కాలం

[మార్చు]

ధరలు పెరగటం. కొంగున ముడి వేసుకొన్న డబ్బంతా ఇచ్చినా కూరలు, వస్తువులు మళ్ళీ ఆ కొంగులో ముడి వేసుకోవటానికి సరిపోయినన్ని కూడా రాలేదని, ఎంతో డబ్బిస్తే కాసిని మాత్రమే వస్తువులు వచ్చాయని.

కొండను తవ్వి ఎలుకను పట్టు

[మార్చు]

అతి ప్రయాస కోర్చి చేసిన పని వలన అతి స్వల్ప ప్రయోజనం కూరితె కొండను త్రవ్వి ఎలుకను పట్టి నట్లు అంటారు.

కొండను అద్దంలో పట్టినట్టు

[మార్చు]

కొండ తిమ్మిరి

[మార్చు]

కొండలు పిండి చేయు

[మార్చు]

చాల కష్టమైన పని అని అర్థం: ఉదా: వాడు చాల బలవంతుడు: కొండలను సైతం పిండి చేయగలడు.

కొండంత దేవరకు కొండంత పత్రి

[మార్చు]

ఎంత చెట్టుకు అంత గాలి అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు.

కొండంత ఆశ

[మార్చు]

పాపం నీవు ఏదైనా సాయం చేస్తావని కొండంత ఆశతో వచ్చాడు.

కొండవీటి చేంతాడు

[మార్చు]

కొండెక్కటం

[మార్చు]

శ్రమతో కూడినది, దీపం ఆరిపోవటం, ప్రాణం పోవటం

కొండకు వెంట్రుక వేసి లాగు తున్నాడు

[మార్చు]

వివరణ: చిన్న శ్రమతో పెద్ద ఫలితాన్ని ఆసిస్తున్నాడు. వేసింది వెంట్రుక.... లాగింది కొండను..... వస్తే కొండ వస్తుంది.... పెద్ద నిధి.... పోతే వెంట్రుకెగా పోతే పోయింది..... ఇలాంటి వారి గురించి ఈ సామెత చెప్తారు.

కొండుభట్లు / పెద్దిభట్లు

[మార్చు]

కొంచెపు పని

[మార్చు]

నీతి బాహ్యమైన పని, నీచమైన, అసాంఘికమైన పని .'కొంచెపు దాని కొంగుపడితే మంచోని మానంబాయే' అనే ఓ సామెత కూడా ఉంది.

కొంప తీసి

[మార్చు]

కొంప దీసి వాడు వీడు కాదు గదా...... (ఇది ఊత పదం)

కొంప కూల్చు

[మార్చు]

మోసగించాడు: నా కొంప కూల్చాడు..

కొంప మునిగింది

[మార్చు]

ఏదో ఘోరం జరిగి పోయింది అని అర్థం: ఉదా== "అయ్యా...... కొంప మునిగిందయ్యా.... వాడు ఊరు విడిచి పారి పోయాడు" "కొంప ముంచావు గదయ్యా.... ఎదుటి వారికి ఏమి సమాదానము చెప్పను."

కొట్టిన పిండి

[మార్చు]

తెలిసిన విద్య అని అర్థం. ఉదా: ఈ పని వానికి కొట్టిన పిండి

కొట్టు మిట్టాడు తున్నారు

[మార్చు]

సందేహిస్తున్నాడు. ఉదా: వాడు ఏదో చెప్పడానికి కొట్టు మిట్టాడు తున్నాడు/.

కొన ఊపిరితో వచ్చాడు

[మార్చు]

చాల అవస్తలు పడి వచ్చాడు.

కొరడా దెబ్బ

[మార్చు]

పెద్ద దెబ్బ: ఉదా: వానికి ఈ సంఘటన కొరడా దెబ్బ లాంటిది.

కొన గోటికి సరి రాడు

[మార్చు]

అత్యల్పము: ఉదా: వాడు నాకొన గోటికి సరి రాడు

కొమ్ములు మొలిచాయా

[మార్చు]

పొగరెక్కువయిందా: ఉదా: వాడికేమైనా కొమ్ములు మొలిచాయా?

కొట్టు మిట్టాడు

[మార్చు]

కష్టాల్లో ఇరుక్కొని దారి కానక దిక్కుతోచని స్థితి. వాడు కష్టాల్లో ఇరుక్కొని కొట్టు మిట్టాడు తున్నాడు.

కొట్టొచ్చి నట్టుంది

[మార్చు]

చాల స్పస్టంగా వున్నదని అర్థం: ఉదా: .... వాని మొఖంలో ద్వేషబావం కొట్టొచ్చినట్టు కనబడుతున్నది చూడు.

కొత్త కుండలో ఈగ లాగ

[మార్చు]

ఏ పనీ దొరక్కుండా ఖాళీగా ఉండటం, ఏమీ తోచకుండా ఉండటం

కొత్తల్లుడు

[మార్చు]

ఎక్కువగా మర్యాదలు, అధిక గౌరవం పొందుతున్న వ్యక్తి. అన్నీ చక్కగా అమరుతున్నవాడు.

కొనుక్కున్న కయ్యం

[మార్చు]

ఆర్థికంగా నష్టపోయి తగాదాల పాలవ్వటం

కొనుక్కొచ్చుకున్నట్టు

[మార్చు]

ఏదైనా ఓ వస్తువును కొనుక్కున్నప్పుడు వాటి వల్ల అపకారం కలిగితే అయ్యో డబ్బు పోయింది... కష్టాలొచ్చాయి అని బాధ కలుగుతుంది.

కొన్న వాడే తిన్న వాడు

[మార్చు]

కష్టపడకుండా ఎవరికీ ఏదీ దక్కదు.అడుక్కొని బతకడం మంచిది కాదు.

కొమ్ముకాస్తున్నారు

[మార్చు]

అనగా సహాయంగా.... అండగా వున్నారని అర్థము: ఉదా: వానికి చాల మంది కొమ్ము కాస్తున్నారు.

కొమ్ములు తిరిగిన వాడు

[మార్చు]

మహా భలవంతుడు అని అర్థం.

కొమ్ములు మొలిచాయా

[మార్చు]

ఉదా: వాడికేమన్నా కొమ్ములు మొలిచాయా... (పొగరెక్కిందా అని అర్థం)

కొయ్యబారటం

[మార్చు]

నిశ్చేష్టుడై పోవటం, చేష్టలుడిగి పోవటం.. పాపం వాడు ఆ చావు కబురు వినగానె కొయ్యబారి పోయాడు. ఏదైనా భయంకరమైన దృశ్యం చేస్తే శరీరం చలనం లేకుండా కొయ్యబారి పోయిందంటుంటారు. అలా పుట్టిందే ఈ సామెత.

కొయ్య బొమ్మలా నిల్చున్నావెందిరా

[మార్చు]

మౌనంగా వుండటం: ఉదా: ఇందరు ఇన్ని మాట్లాడుతున్నా కొయ్య బొమ్మలా నిల్చున్నావేందిరా?

కొరకరాని కొయ్య

[మార్చు]

ఏపని చెప్పినా చెయ్యకుండా.... మాట వినకుండా తిరిగే వాడిని కొరకరాని కొయ్య అంటారు.

కొవ్వు తలకెక్కింది

[మార్చు]

పొగరెక్కిందని అర్థం. ఉదా: ఏరా కొవ్వు తలకెక్కిందా.... బాగా పొగరుగా వుండే వారిని ఉద్దేశించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కొమ్ములను చూసి బర్రెను బేరమాడినట్లు

[మార్చు]

వివరణ: ఒక బర్రె చెరువులో మునిగి వున్నది దాని కొమ్ములు పెద్దవి అవి మాత్రమే కనిపిస్తున్నాయి. కొమ్ములను బట్టి బర్రె ఎంత పెద్దదోనని బేరం చేయడమన్న మాట. ఏది కొనబోయినా ఒక్క విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటే నష్టపోతారు అనిచెప్పేసామెత ఇది.

కొరకరాని కొయ్య

[మార్చు]

ఒక పట్టాన మాట విననివాడు. వాడొట్టి కొరకరాని కొయ్యి. కొయ్యను కొరికితే అది ముక్కలు కాదు. అది ఏమాత్రము వీలు పడని పని. అదే విధంగా ఎవరైనా చెప్పిన మాట వినకుంటే వారినుద్దేశించి..... వాడొట్టి కొరక రాని కొయ్య అని అంటారు. అనగా వాడు ఎవరి మాట వినడు అని అర్థము. ఆ విధంగ పుట్టినదే ఈ జాతీయము.

కొలికికి వచ్చు

[మార్చు]

ముగింపు.... ఉదా: ఆ పని ఒక కొలిక్కి వచ్చింది. ఏదైనా ఒక క్లిష్టమైన పనిచేస్తుంటే...... దాని క్లిష్టత వలన..... ఆ పని అంత తొందరగా పూర్తి కాదు.... ఆపనిలోని లోపాలను కనిపెట్టితే ఆపని చేయడము సులబ మవుతుంది. అలా దానిలోని లోపాలను కనిపెట్టి నప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగించి..... ఈ పని ఒక కొలిక్కి వచ్చింది. అని అంటుంటారు. అనగా ఇక త్వరలో ఈ పని పూర్తవుతందని అర్థం.

కొళ్ల బోయింది

[మార్చు]

దీనికి కొంత వివరణ కావాలి: అదేమంటే...... గతంలో /..... ఇప్పుడు కూడ/ చెరువులు, కుంటలు మొదలగు నీటి వనరులలో చేపల పెంపకం సాగించే వారు. బెస్త వారు గాని మిగతా వారు గాని ఆ చెరువును వేలం పాటలో పాడుకొని అందులోని చేపలను పట్టుకొని అమ్ముకొని తమ పెట్టు బడిని రాబట్టు కునే వారు. ఆ చెరువులో నీరు తగ్గి ఇక చేపల పెంపకానికి వీలు పడదని తెలిసినప్పుడు వున్న పెద్ద చేపల్ని పట్టేసుకుని చెరువు కొళ్ల బోయిందని ప్రకటిస్తారు. దాంతో ఆ చుట్టు పక్కల పల్లె వాసులు ఆ చెరువులో మిగిలిన చిన్న చిన్న చేపలను ఉచితంగా పట్టు కొనుటకు అనుమతి లభించి నట్లే. ఆ విధంగా చెరువు కొళ్ల బోగా వూరి జనాలు చేపలు పట్టాడానికి చెరువుకు వెళ్లతారు. ఇదీ చెరువు కొళ్ల బోవడం అంటారు.

కోటికి పడగెత్తటం

[మార్చు]

కొరివితో తల గోక్కోవడం

[మార్చు]

కొరివితో తల గోక్కుంటే జుట్టు కాలి పోతుంది. అనవసరంగా సలహా చెప్పి పని చెడగొడు తుంటే ..... ఇలా అంటారు. చేతిలో ఏ వస్తువైనా వుంటే ఆ సమయంలో తలలో దురద పెడితే..... తన చేతిలో వున్న వస్తువుతో తల గోక్కోవడం మానవ నైజం. ఏ పెన్సిలో అలాంటీ వాటితో తల గోక్కోవడం సాధారణమే.... కాని ఏదేని సందర్భంలో తన చేతిలో ఒక కొరివి వుంటే.... అదే సందర్భంలో తలలో దురద పెడితే..... ఆ కొరివితో తలగోక్కొని జుట్టు కాల్చుకుంటే..... అది అతి తెలివి తక్కువ పని అవుతుంది. అలా అతి తెలివి తక్కువ పనులు చేసి నష్ట పడే వారిని గురించి ఈ సామెత పుట్టింది.

కొంప లార్పే రకం

[మార్చు]

మోసగాడని అర్థం: ఎవరైనా మోసంతో ఇతరులకు నష్టం వాటిల్ల జేస్తే... అలాంటి వాని నుద్దేశించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. వాడొట్టి కొంప లార్పే రకం..... అని.

కొవ్వెక్కింది

[మార్చు]

పొగరెక్కువయింది. పొగరుగా వుండే వారిని ఉద్దేశించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కొంప మునిగింది

[మార్చు]

పెద్ద ఘోరం జరిగి పోయిందని అర్థం. వరదల్లో కొంపలు మునిగి పోతాయి. అలా కొంపలు (ఇండ్లు) మునిగి పోతో సర్వం కోల్పోయినట్టే..... సర్వం అనగా..... డబ్బులు... ఆహార దాన్యాలు, వస్త్రాలు.... ఒక్కొక్క సారి కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకోవలసి వస్తుంది. అలాంటి వారి కేవలం కట్టు బట్టలతోనే మిగిలి వుంటారు. అలా సర్వం పోగొట్టుకుంటే ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కొంగు ముడేయడం

[మార్చు]

వివాహం జరిపించడం. ఒక పాటలో ఈ జాతీయ ప్రయోగము: అహో ఆంధ్ర భోజా..... శ్రీ కృష్ణ దేవరాయా.... ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా.... అనే పాటలో..... కొంగు ముడి వేసుకుని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలనీ కోరు తున్నారనీ........

కొంగున ముడి వేసుకున్నది

[మార్చు]

ఉదా: ఆమె తన మొగుడిని కొంగున ముడి వేసుకున్నది. (తన అదుపులో ఉంచుకున్నదని అర్థం

కొంప లంటుకున్నాయి

[మార్చు]

కొయ్య బొమ్మలా నిలుచున్నాడు

[మార్చు]

ఏమి మాట్లాడ కుండా మిన్న కున్నాడని అర్థం.

కొస మెరుపు

[మార్చు]

కొంగు బంగారం

[మార్చు]

కొంగున బంగారం వుంటే అవసరానికి సిద్దంగా వున్న ధనం లాంటిదె అన్న అర్థం:

కొండెక్కింది

[మార్చు]

(దీపం) దీపం ఆరి నప్పుడు దీపం ఆరి పోయింది అనరు అది నిందా వాచకం అవుతుంది. కనుక దాని దీపం కొండెక్కింది అంటారు.

కొండెక్కి కూర్చున్నాడు

[మార్చు]

అలిగాడు. బెట్టు చేస్తున్నాడని అర్థం:

కొండవీటి చాంతాడంత

[మార్చు]

చాల పొడవైన అని అర్థం: అక్కడ లైను (క్యూ) కొండవీటి చాంతాడంత ఉంది.

కొండతో ఢీ కొడుతున్నాడు

[మార్చు]

పెద్ద సాహసం చేస్తున్నాడని అర్థం.

కొంప దీసి...............

[మార్చు]

ఉదా: కొంప దీసి వాడు వీడు కాదు గదా...

కొంప కూల్చాడు

[మార్చు]

పెద్ద మోసం చేశాడు: ఉదా: వాడు మా కొంప కూల్చాడు.

కొంప కొల్లేరయింది

[మార్చు]

సర్వ నాశనమైందని అర్థ: ఉదా: వాడి కొంప కొల్లేరయింది.

కొంప నిలబెట్టాడు

[మార్చు]

చాల పెద్ద సహాయం చేశాడు అని అర్థం:

కొంప లార్పేరకం

[మార్చు]

మోస గాడు: ఉదా: వాడు కొంఫలార్పే రకం.

కో అంటే .... కోటిమంది వున్నారు

[మార్చు]

లెక్కలేనంత మంది ఉన్నారని అర్థం. ఉదా: నాకు కో.... అంటే కోటి మంది ఉన్నారు.....

కోటలో పాగా వేశారు

[మార్చు]

పెద్ద విజయ సాధించారు అని అర్థమ్.

కోటి దండాలు

[మార్చు]

కోట్లకు పడగెత్తాడు

[మార్చు]

ధనం బాగా సంపాదించాడు.

కోట్లు కుమ్మరించినా ?

[మార్చు]

ఎంత ప్రయత్నించినా సరే.... ఉదా: కోట్లు కుమ్మరించినా నీ లాంటి వాడు దొరకడు.

కోటేరు లాంటి ముక్క

[మార్చు]

కోతల రాయుడ

[మార్చు]

ప్రగల్బాలు పలికే వాడు అని అర్థం.

కోతికి కొబ్బరి కాయ చిక్కింది

[మార్చు]

పనికి రాని పని..... ఉపయోగంలేని పని అని అర్థం.

కోతులాడుతున్నాయా

[మార్చు]

ఉదా: నామొఖంలో కోతులాడు తున్నాయా అలా చూస్తున్నారు.

కోరలు తీసిన పాము లాగా

[మార్చు]

గర్వం అణచ బడిన వ్వక్తిని ఇలా అంటారు: ఉదా: వాడిప్పుడు కోరలు తీసిన పాములాగ పడి ఉన్నాడు.

కోపం నసాళానికెక్కింది

[మార్చు]

ఎక్కువ కోపం వచ్చింది: ఉదా: వాడి కోపం నసాళానికెక్కింది.

కొండవీటి చాంతాడంత

[మార్చు]

చాల పొడవైన అని అర్థం: అక్కడ లైను (క్యూ) కొండవీటి చాంతాడంత ఉంది.

కోక కట్టుకొని ఉండటం

[మార్చు]

పురుషాహంకారం.స్త్రీలు అసమర్థులు అబలలు శక్తిహీనులని.గాజులుతొడుక్కోటం అనికూడా అంటారు. నేనేమి కోక కట్టుకొని గాజులు తొడుక్కొని కూర్చోలె. నాకు పౌరుషం వుంది అని తన గొప్పను చెప్పుకునే సందర్భంగా ఈ సామెతను వాడతారు.

కోడికూసినదాక

[మార్చు]

తెల్లవారు జాము వరకు ఉదా: కోడి కూసె జాము దాక తోడు రార చందురూడా..... (ఒక పాట)

కోడిగుడ్డు మీద వెండ్రుకలు మొలిపించటం

[మార్చు]

వృధాప్రయాస, అసంభవం, కోడిగుడ్డు మీద వెండ్రుకలు వెతకటం, కోడిగుడ్డు మీద వెండ్రుకలు పీకటం, ప్రయోజన శూన్యమైన పని, వృధా ప్రయత్నం [వాడు కోడి గుడ్డుపైన ఈకలు మొలిపించ గలడు .... అని అంటారు. అనగా వాడు ఏ పనైనా చేయగలడని అర్థం. వ్వతిరేకార్థంలో...... వాడు తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయ గల సామర్థుడు అని అర్థం. ఆ సందర్భంలో ఈ సామెతను వాడుతారు. వాడెంతటి పనైనా చేయగల సామర్థం కల వాడు..... వానితో జాగ్రత్త అని హెచ్చరిక ఈ సామెతలో ఉంది.]

కోడిగుడ్డు తంటసం

[మార్చు]

కోడి గుడ్డు మీద ఈకలు పీకే రకం

[మార్చు]

లేనివి ఉన్నట్టు, వున్నవి లేనట్టు చూపే వాడు, అని అర్థం.

కోతలు కోయటం

[మార్చు]

ప్రగల్బాలు పలకటం. వాడి మాటలన్ని ఒట్టి కోతలె.

కోతికి కొబ్బరికాయ దొరికినట్టు

[మార్చు]

అవసరంలేని వీలు కాని వస్తువును వదలకపోవటం. (కోతికి కొబ్బరికాయ దొరికితే అది దాన్ని పెద్ద సంపదగా భావిస్తుందే తప్ప దాన్ని పగల గొట్టి తినలేదు. అనగా ఉపయోగంలేని సంపద.. అలాంటి సందర్భంలో ఈ సామెత వాడతారు)

కోతి చేతి పూలదండ

[మార్చు]

విలువైన వస్తువు అనర్హుడి చేతికి చేరటం. (కోతికి పూలదండ ప్రదాన్యత, దాని ఉపయోగము తెలియవు. అలా ఒక వస్తువును దాని వుపయోగం.... ప్రదాన్యత తెలియని వానికిస్తే ఈసామెత వాడతారు.)

కోతికి జల్తారు కుల్లాయి పెట్టినట్టు

[మార్చు]

అసంబద్ధమైన, అనవసరమైన పని (కోతికి ఎన్ని అలంకారాలు చేసినా అది దాన్ని చూసుకొని మురిసి పోదు... పైగా తీసి పడేస్తుంది.... ఆపని అనవసరమైన పని ... ఉపయోగం లేని పనిచేస్తున్న వారిని గురించి ఈ సామెత వాడతారు.)

కోరలు తీసిన పాము

[మార్చు]

పాముకు కోరలున్నప్పుడు దాన్ని సమీపించటం కానీ, దానికి ఎదురు నిలిచి ఉండటం కానీ ప్రాణాంతకమవుతుంది. అదే కోరలు తీసినప్పుడు అంత ప్రమాదం కాదు. 'అధికారం పోవటంతో కోరలు తీసిన పామయ్యాడు' అంటారు

కోరలు పీకటం

[మార్చు]

అధికారాలను, ప్రభావాన్ని, పౌరుషాన్ని, గర్వాన్ని తగ్గించటం . అతనికి పదవి పోగానె కోరలు పీకినట్టయింది.

క్షణం ఒక యుగం

[మార్చు]

కాలం అతి భారంగా గడవడం.

క్షణ చిత్తం క్షణం మాయ

[మార్చు]

ఖయ్యిమనడం

[మార్చు]

కోపంతో అరవడం ఉ: వాడిని ఒక్కమాట అన్నానొ లేదో.... ఖయ్యిమని నామీది లేశాడు.

  1. సంఖ్యా జాబితా అంశం