జాతీయములు - బ, భ
భాషా సింగారం |
---|
సామెతలు |
అ ఆ ఇ ఈ ఉ ఊ-ఋ |
ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ-ఘ |
చ-ఛ జ ఝ |
ట ఠ డ-ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ-ష స-హ |
ళ క్ష ఱ |
జాతీయములు |
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ |
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ |
ట, ఠ డ, ఢ ణ |
త, థ ద, ధ న |
ప, ఫ బ, భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
ఆశ్చర్యార్థకాలు |
నీతివాక్యాలు |
పొడుపు కథలు |
==భుజాలు తడుము కోవడం==
బ
[మార్చు]బంగారపు గీతలు
[మార్చు]అదృష్టవంతులను అభినందించే భావన.
బంగాళాఖాతమంత
[మార్చు]సువిశాలమైనది, సుదీర్ఘమైనది
బకాసురుడు
[మార్చు]విపరీతంగా తింటూ కూర్చునే వాడు
బంగనపల్లి నవాబు
[మార్చు]బంగారక్క
[మార్చు]గతంలో తోలుబొమ్మలాటలు అధిక ప్రచారంలో వున్నప్పుడు.... ఆ ఆటలో బంగారక్క.... కేతిగాడు అనే రెండు పాత్రలుండేవి. ఆ పాత్రలు... ప్రేక్షకులను విపరీతంగా నవ్వించేవి. హాస్య రసాన్ని పలికించడానికి మారు పేరుగా ఆ పాత్రలు ప్రజల మనస్సులో స్థిర స్థానం సంపాదించాయి. ఆవిదంగా సమాజంలో హాస్య రసాన్ని వ్వక్త పరిచే స్త్రీలను ఆ పాత్ర పేరుతో అనగా ... బంగారక్క... అని పిలవడము పరిపాటైనది. ఇది ఈ జాతీయానికి వున్న వెనకటి కథ.
బంగారు కాళ్ళయ్య
[మార్చు]బంగు తిన్న కోతి
[మార్చు]మత్తులో పిచ్చిగా ప్రవర్తిస్తుంటే ఈమాటను వాడతారు
బండ కష్టం
[మార్చు]మితిమీరిన కష్టం, భరించరాని కష్టం
బండబండగా
[మార్చు]మూర్ఖంగా, మొరటుగా, అనాగరికంగా .శిల్పంగా మారకముందు బండ అందం, ఆకారం లేకుండా మొరటుగా ఎలా ఉందో అలాంటి మొరటు మనిషి .బండగాడు, బండబండగా రాయటం అంటారు.
బండబారటం
[మార్చు]శిలాసదృశంగా అవటం, రాయిలాగా స్పందన లేకుండా పోవటం.ఎంత కొట్టినా కదలక మెదలక ఉండటం.కళ్ళముందు ఏం జరిగినా స్పందించకుండా ఉండటం
బండ మీద రాత
[మార్చు]కచ్చితంగా అమలయ్యేది, చెరిపితే పోదు : వీటినే శిలా శాసనాలు అంటారు.
బండిసెలగుండు
[మార్చు]బండిసెల అనగా వడిసెల అని కూడా అంటారు. రెండు దారాల మద్యలో చిన్న వలలాగ వుండి అందులో ఒక రాయి పెట్టి రెండు దారాలను ఒకటిగా పట్టుకొని గిరగిరా తిప్పి ఒకదారాన్ని వదిలితే అందులో పెట్టిన రాయి అతి వేగంగా వెళ్ళి దూరాన పడుతుంది. పొలాల్లో పిట్టలను బెదరగొట్టడానిని ఈ సాధనాన్ని రైతులు వాడుతారు. బండిసెల లోని రాయి అతి వేగంగా పోతుంది. అలా ఎవరైనా వేగంగా పరుగెడుతుంటే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
బండిరిగితే ఎడ్లుకాయచ్చన్నట్టు
[మార్చు]బండి విరిగి పోయినప్పుడు ఎద్దులను మాత్రమే కాచుకొని రావచ్చుఅని. పని చేయకుండా ఏదో ఒక వంకన తప్పించుకొనే పని దొంగ గురించి
బంతాట ఆడటం
[మార్చు]ఊపిరి సలపకుండా కష్టాలలో ఉండటం, వరుసగా బాధలను, ఇబ్బందులను అనుభవించటం,
బంతిలో వలపక్షం
[మార్చు]బందెలదొడ్డి
[మార్చు]క్రమశిక్షణ రాహిత్యంతో అడ్డదిడ్డంగా ప్రవర్తించే వారితో ఉన్న ప్రదేశం
బకబంధనం
[మార్చు]బక్క జనం
[మార్చు]పేద ప్రజలు
భగీరథ ప్రయత్నం
[మార్చు]భగీరథ ప్రయత్నం అనగీ అతి పెద్ద ప్రయత్నం అని అర్థము. భగీరథుడు స్వర్గంలో ఉన్న గంగను భూలోకానికి తేవడానికి చాల ప్రయత్నము చేసి సాధించాడు. అలాంటి పెద్దప్రయత్నాన్ని భగీరథ ప్రయత్నం అని అంటారు.
భజన చేస్తున్నారు
[మార్చు]వేరొకరు చెప్పిన దానికి వంత పాడడం: ఉదా: వాడు చెప్పిందానికి వీడు భజన చేస్తున్నాడు.
బజారు కీడ్చాడు
[మార్చు]పరువు తీశాడు అని అర్థం: ఉదా: వాడు నన్ను చిన్న విషయానికి బజారు కీడ్చాడు.
బట్టతలమ్మ పాపిట తీయమన్నదట
[మార్చు]బడబడ
[మార్చు]లోడలోడ వూరక సందర్భ శుద్ధి లేకుండా వాగటం
బడాయి పోతున్నాడు
[మార్చు]గొప్పలు పోతున్నాడు అని అర్థం: ఉదా: ఏంరో..... పెద్ద బడాయి పోతున్నావు, పిలిస్తే పలకడం లేదు.
బతికి పోయాను
[మార్చు]ఉదా:>..హమ్మయ్య గండం నుంచి గట్టెక్కాను: బతికి పోయాను. ===బతుకు బజారు పాలైంది=== (బతుకు బస్టాండైంది) పరువు పోయిందని అర్థం: ఉదా: వాడి బతుకు బజారు పాలైంది.
బతుకు బారమైంది
[మార్చు]బతక లేక పోవడం: ఉదా: వారికి సరైన ఆదాయం లేక బతురు బారమైంది
బతుకు తెల్లారింది
[మార్చు]బతుకు భారము కావడమని అర్థం: వాని బతుకు తెల్లారింది అంటుంటారు.
బదనిక తీగ
[మార్చు]శత్రువులను లోబర్చుకొనే శక్తి ఉన్న వ్యక్తి. బదనిక తీగ వాసన తగిలిన సర్పం తలవంచి తీరుతుందట.
బయట పడ్డాడు
[మార్చు]కష్టాల నుండి బయట పడ్డాడని అర్థం: ఉదా: ఇప్పటికి నాకష్టాలన్ని తీరాయి. బయట పడ్డాను.
బ్రహ్మకాయ
[మార్చు]బ్రహ్మచెముడు
[మార్చు]బ్రహ్మబంధువు
[మార్చు]బ్రహ్మముడి
[మార్చు]బ్రహ్మరథం
[మార్చు]వాడికి బ్రహ్మరధం పట్టారు అని అంటారు.
బ్రహ్మరాత
[మార్చు]తిరుగు లేనిది, మార్చడానికి వీలు పడనిదాని బ్రహ్మ రాత అని అంటారు.
బ్రహ్మవిద్య
[మార్చు]అత్యంత ప్రయాసతో కాని వంట బట్టని విద్యను బ్రహ్మ విద్య అని అంటారు.
బ్రహ్మహత్య
[మార్చు]బ్రహ్మాండం
[మార్చు]అతి పెద్దది అనే అర్థములో వాడుతారు.
బరతం పట్టాలి
[మార్చు]వాని పని పట్టాలి: ఉదా: వానికి పొగరెక్కువయింది వాని భరతం పట్టాలి.
బరితెగించాడు
[మార్చు]ఉదా: వాడితో పెట్టుకోకు, వాడి అన్నింటికి బరితెగించాడు.
బరిలోకి దింపటం
[మార్చు]పనిలోకి దింపటం, కష్టాలలోకి ప్రవేశం. రంగస్థలం (బరి) మీద నటుల నటనను చూసిన ప్రేక్షకులు బాగుందంటూ ఎంత మెచ్చుకొనేవారో, బాగోలేకపోతే అంత తీవ్రంగా విమర్శించే వారు. తన ప్రదర్శన ప్రేక్షకులకు నచ్చితీరాలి. లేకపోతే వారి చీవాట్లు తప్పవు,
బర్రెకు బాంచ
[మార్చు]పాలు కావాలంటే (గేదె) కు కూడా బానిసలాగా సేవ చేస్తేనే ఆ బర్రె పాలిచ్చేది.
బర్రెను కొన్నాక చల్ల పొయ్యననటం
[మార్చు]భవిష్యత్తులో సహాయం చెయ్యనని చెప్పి ప్రస్తుతానికి ఎదుటివారిని ప్రలోభపెట్టి లేదా బెదిరించి తమ పని చేయించుకోవటం. బలిపశువును చేశారు:: అనవసరంగా ఒకడిని ఇరికించి అన్ని నిందలను అతనికిపైకి తోసెయ్యడం అని అర్థం.
బ్రహ్మరథం
[మార్చు]గొప్ప గౌరవం .సన్యాసులు మరణించినప్పుడు వారి భౌతికకాయాన్ని తీసుకువెళ్ళే వాహనాన్ని బ్రహ్మరథం అంటారు.
బ్రహ్మ రహస్యం
[మార్చు]ఎవరికీ తెలియనిది
బ్రహ్మరాత
[మార్చు]ఆ రాత ఎవరికీ అర్థంకాదు. విశ్వాసం ఆధారంగా అవతరించిన జాతీయాల్లో ఇదొకటి. మనిషిని సృష్టించేటప్పుడు బ్రహ్మదేవుడు నుదుటి మీద ఆ మనిషికి సంబంధించిన జీవితం ఎలా సాగాలనే విషయాలను రాస్తాడని, పుర్రె మీద ముందు భాగంలో కనిపించే గీతలే ఆ రాతలని కొందరి విశ్వాసం. అయితే ఆ రాత ఎవరికీ అర్థంకాదు. ఈ అర్థంకాక పోవటం అనే దాని ఆధారంగానే బ్రహ్మరాత అనే జాతీయం ప్రయోగంలోకొచ్చింది. కొంతమంది చేతిరాతలు ఎవరికీ అర్థం కావు. అలాంటి రాతలను చూసి వ్యంగ్యధోరణిలో 'ఇదెక్కడి బ్రహ్మరాతరా బాబూ' అని అనటం కనిపిస్తుంది.
బ్రహ్మాండంగా
[మార్చు]చాలా గొప్పగా, ఎంతో పెద్దగా, అన్నిటికంటే ఉత్తమంగా .
బ్రహ్మాండం బద్దలు కొట్టటం
[మార్చు]ఎవరికీ సాధ్యం కాని పనిని చేసి ఘన విజయం సాధించటం
బాంబు పేల్చటం
[మార్చు]ఓ విషయాన్ని ప్రకటించటం వల్ల ఉన్నట్టుండి కలిగిన మార్పు ఎంతో కాలంగా రహస్యంగా దాచి వుంచిన పెద్ద విషయాన్ని ఉన్నట్టుండి బయట పెట్టడం.
బాజా వాయించటం
[మార్చు]చేసిందేమీ లేకపోయినా గొప్పగా ప్రచారం చేయటం, ఉన్నదాని కన్నా పెచ్చుగా చెప్పుకోవటం డప్పు కొట్టుకోవటం, డప్పు కొట్టటం
బాట వేయడం
[మార్చు]అనుకూల పరిస్థితులు ఏర్పరచడం
బాతాల పోశెట్టి
[మార్చు]తుపాకీ రాముడు, పిట్టలదొర, గొప్పలు చెప్పే వారు
బాదర బందీ
[మార్చు]బాదరాయణ సంబంధం
[మార్చు]బాదరాయణుడు
[మార్చు]బాల జోస్యం
[మార్చు]నిర్మలమైన మనస్సుతో, నిష్కల్మషమైన బుద్ధితో చెప్పే మాటలు
బాలింతపులి
[మార్చు]అత్యంత స్వార్థముగా ప్రవర్థించే వారిని గురించి ఈ మాటను వాడుతారు. పులి ఈనినప్పుడు చాల ఆకలితో వుంటుండి. ఆకలికి తాళలేక తన పిల్లలనే తాను తింటుంది. ఇది అత్యంత స్వార్థపూరితమైన పని. ఆ విధంగా ప్రవర్థించే వారిని గురించి ఈ జాతీయాన్ని వాడుతారు.
బిచ్చపు కూటికి శని అడ్డుపడ్డట్టు
[మార్చు]కాలం కలిసిరాక పోవటం, కష్ట కాలంలో మరిన్ని కష్టాలు సంక్రమించటం . బిచ్చపు కూడు కూడా తిననివ్వకుండా శని అడ్డుపడటం
బిచ్చపు కూటికి పేదరికమేంటి?
[మార్చు]బిచ్చమెత్తుకొని తినటం కంటే పేదరికం ఏముంటుంది?గోచి కన్నా దరిద్రం లేదు .
బిడ్డనుకొంటే గడ్త్డెనట్టు
[మార్చు]ఆశాభంగం .అనుకొన్న దానికి భిన్నంగా జరగటం.అనుకోని విధంగా వూహలు, అంచనాలు తారుమారవటం.గర్భవతి కడుపులో పెరుగుతున్నది బిడ్డ కాదని, గడ్డ అని తెలిసి బాధపడ్డట్టు
బిల్వ ఖల్వాటం
[మార్చు]మూలిగే నక్కమీద తాటిపండు పడటం. ఒక కష్టం నుండి తప్పించుకోబోతూ మరో కష్టానికి గురవటం. బిల్వం అంటే మారేడు, ఖల్వాటం అంటే బట్టతల . బట్టతల వ్యక్తి మండుటెండలో నడుస్తూ నెత్తిమాడుతూ ఉంటే ఓ మారేడు చెట్టు కింద నీడలోకి చేరాడు. అంతలోనే ఓ మారేడు కాయ బట్టతల ఉన్నవాడి నెత్తిన పడిందట. అటు ఎండదెబ్బ, ఇటు మారేడు కాయ దెబ్బ .
బీదవాడు భిక్షగాడికీ లోకువే
[మార్చు]యాచకులు ధనహీనుల్ని లెక్కచేయరు. భిక్షను భారీగా ఇచ్చే వారినే బిచ్చగాళ్ళు లెక్క చేస్తుంటారు.
బుట్టి మేత
[మార్చు]వివరణ: పశువులకు ప్రత్యేకమైన ఆహారంగా వేరు శనగ పిండి, రుబ్బిన ఉలవ పిండి, బెల్లం కలిపి బుట్టిలోవేసి పెడ్తారు. దానిని బుట్టి మేత అంటారు. దానినే మనుషులకు ఆపాదించి ఎవరికైనా మంచి ఆహారం అందు తుంటే వాని గురించి ఈమాటను వాడతారు: ఉదా: వానికి బుట్టి మేత బాగా అందు తున్నట్టుంది కొంచెం వళ్లు చేసింది.
బుడబుడ కావటం
[మార్చు]ఏదైనా రహస్యం మెల్లగా బహిర్గతం కావటం
బుడుబుంగ
[మార్చు]బుడుబుంగ నల్లటి రంగులో ఉండే పక్షి. నీళ్ళలోని చేపలను పట్టుకొని తింటూ బతుకుతుంటుంది ఇది. దీని ప్రత్యేకత ఏమిటంటే నీళ్ళ లోపలికి మునిగి చేపలను పట్టుకొని మళ్ళీ కొంత దూరంలో పైకి తేలుతుంటుంది. ఇలా ఆహారం కోసం నీళ్ళల్లోకి మునగటం, మళ్ళీ మరో చోట పైకి తేలటం. కొంతమంది పొద్దున లేచింది మొదలు ఇల్లిల్లూ పట్టుకు తిరుగుతుంటారు. తమకు కావలసినవన్నీ ఆ ఇళ్ళలోనే గడుపుకొని పోతుంటారు. ఏ గృహంలో ఉన్నాడో అని తెలుసుకొని వెళ్ళే లోపు మరో ఇంటికి వెళుతుంటాడు. అలాంటి వాడిని బుడుబుంగ లాంటివాడు అంటారు.
బురదలో కాలేయటం
[మార్చు]తప్పు చేయటం, పొరబడటం .అడుసు తొక్కనేల కాలు కడుగ నేల ?
బురద చల్లటం
[మార్చు]దోషాలను అంటకట్టటం;;;; ఎదుటివాడిపై నిందలు వేయటం:
బురద పడటం
[మార్చు]దోషులవ్వటం
బురద
[మార్చు]తప్పు, పొరపాటు నీతిమాలిన పని అనే వాటికి సూచిక
బురద చల్లట
[మార్చు]లేని నిందలను ఇతరులపై మోపడమని అర్థం: ఉదా:/. ... ప్రతి పక్షాలు మాపై బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు. అని అంటారు.
బురదలో పాతిన గుంజ
[మార్చు]స్థిరంగా నిలవదు. చివరిదాకా నిలబడని వాడు, మధ్యలోనే తప్పించుకొని పోయి పని చేయకుండా మోసం చేసేవాడు
బుర్ర గోక్కుంటున్నాడు
[మార్చు]బుస కొడుతున్నాడు
[మార్చు]కోపంగా వున్నాడని అర్థం: ఉదా: వాడు ఈ చిన్న మాటకే బుస కొడుతున్నాడు.
బుసలు కొట్టడం
[మార్చు]కోపాన్ని ప్రదర్శించడం
బూజు పట్టటం
[మార్చు]ప్రస్తుత కాలానికి అనుగుణంగా లేని విషయాలు, కాలదోషం పట్టిన ప్రమాద హేతువులు
బూడిదలో పోసిన చందాన
[మార్చు]వృధా ప్రయాస అని అర్థం.
బూడిదలో చేసిన హోమం
[మార్చు]ప్రయోజనం లేని పని.బూడిదలో పోసిన పన్నీరు
బూతు పడ్డా బుట్టలో ఇత్తు పడాల
[మార్చు]వ్రతం చెడ్డా ఫలితం దక్కాలి. అడ్డంకులు, అవాంతరాలు, అవమానాలు లెక్కచేయకుండా కావాల్సిన దాన్ని సాధించుకోటం ఇలాంటిదె మరోమాట;కులం చెడ్డా.... సుఖం దక్కింది.
బెల్లమేయకుండా బూరెలు చేసినట్టు
[మార్చు]అరచేతిలో వైకుంఠం చూపినట్టు, ఏమీ లేకపోయినా అంతా ఉన్నది అని ధ్వనింపచేసేలా ప్రవర్తించే తీరు
బెల్లంకొట్టిన గుండ్రాయి లాగ
[మార్చు]కదలకుండా..... మెదలకుండా. ఉదా: ఏరా బెల్లంకొట్టిన గుండ్రాయిలా అలా వుండిపోయావేం?
బెంబేలెత్తించాడు
[మార్చు]కంగారు పెట్టించాడు. ఉదా: ఈ కాస్త దానికే అలా బెంబేలు పడితే ఎలా?
బొక్కటం
[మార్చు]అన్యాయంగా ఆర్జించటం, ఆహారాన్ని ఓ క్రమపద్ధతి ప్రకారం తినకుండా ఎక్కువెక్కువ తీసుకొని అందరికంటే ముందే అంతా తినెయ్యాలన్న ఆత్రంతో తినటం, అందరిలా సక్రమంగా కాక అక్రమంగా అంతా ఆర్జించాలనుకోవటం
బొక్క బోర్ల పడ్డాడు
[మార్చు]జీవితం తారు మారైంది: ఉదా: వాడు వ్యాపారంలో బొక్క బోర్ల పడ్డాడు.
బొగ్గుల్లో రామచిలుక
[మార్చు]దుర్మార్గుల మధ్య సజ్జనుడు, అందవిహీనుల మధ్య అందగాడు
బొచ్చు బోద కసువు
[మార్చు]ఇదొక ఊత పదం:
బొటనవేలికింద ఉంచటం
[మార్చు]బొటన వేలి కింద పెట్టుకోవటం, అధీనంలో ఉంచుకోవటం
బొటబొట
[మార్చు]బాగా కన్నీరు పెట్టడం, దుఃఖం పెల్లుబుకి కన్నీరు బొట్లుబొట్లుగా రాల్చటం
బొట్టూ కాటుక పెట్టి పిలవడం
[మార్చు]ప్రత్యేకంగా పిలవడం గౌరవంగా ఆహ్వానించడం
బొడ్డూడని వాడు
[మార్చు]లోకజ్ఞానం లేనివాడు, అమాయకుడు, లోకం పోకడ తెలియనివాడు
బొత్తిగా
[మార్చు]సంపూర్ణంగా, అధికంగా, బాగా . ఒకేచోట చేరి ఉండటాన్నిబొత్తుగా, బొత్తిగా ఉండటం అంటారు. పూర్తిగా అని అర్తం: ఉదా:.... వాడు ఈ మధ్యన బొత్తిగా ఏ పని చేయడం లేదు అంటారు.
బొబ్బబొబ్బ కావటం
[మార్చు]బయటకు పొక్కటం అందరికీ తెలిసిపోవటం
బొమ్మలకొలువు తీర్చటం
[మార్చు]చూడముచ్చటగా తీర్చిదిద్దటం. 2.26 బొమ్మలాట రామాయణం అవాస్తవం, ఆధారం లేనిది, నమ్మశక్యం కానిది . ప్రామాణికతలేని విషయాలు
బొమ్మలాట రామాయణం
[మార్చు]బోకెల కొట్లాట
[మార్చు]దరిద్ర స్థితి. లోపల ఏమీ లేకుండా ఖాళీగా ఉన్న మట్టి వంటపాత్రను బోకె అంటారు. కేవలం ఖాళీ మట్టి పాత్రల కోసమే కొట్లాట' అని ఏమాత్రం ఉపయోగంలేని వాటిగురించి పెద్ద పోట్లాటకు సిద్దమైతే ఈ మాటను వాడతారు.
బొడ్లో వరాలు పోసుకొని పుట్టడం
[మార్చు]పుట్టుకతోనే ధనవంతులు. బాగా ధనవంతుల ఇంట్లో పుట్టిన బిడ్డ
బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్టు
[మార్చు]అసలు సాధ్యం కాని పని . బోడిగుండు మీద, మోకాలి మీద కేశాలు ఉండవు. ఆ రెండిటికీ ముడివేయాలని చేసే ప్రయత్నం ఫలించదు.
బోడిగుండు మీద రాళ్ళ వానలాగా
[మార్చు]కష్టాల మీద కష్టాలు
బోడిలింగం
[మార్చు]అనామకుడు 'శతకోటి లింగాల్లో ఓ బోడిలింగం. శివలింగాలు నునుపుగా ఒకేలా ఉంటాయి. వాటికి ఒక్కో దానికి ప్రత్యేకమైన గుర్తులేమి ఉండవు. ఓ చోట ఉన్న ఎన్నెన్నో శివలింగాల్లో ఒక శివలింగాన్ని ఎవరైనా తీసుకెళ్ళినా పెద్దగా నష్టం ఏమీ ఉండదు.
బోళా శంకరుడు
[మార్చు]ఎలాంటి వారినైనా కాచి కాపాడుతూ ఎవరడిగినా కాదనని వాడు
భ
[మార్చు]భగీరథ ప్రయత్నం
[మార్చు]సాధ్యమైన దానిని కూడా ప్రయత్నం పూర్వకంగా సాధించడం అంటే ఎంత కష్టమైన పనినైనా పట్టువిడవకుండా సాధించడం
భజన
[మార్చు]పొగడ్త ఏదో ఒక స్వార్ధాన్ని దృష్టిలో ఉంచుకొని విపరీతంగా పొగడటం. ఆ సందర్భంలో ఈ మాటను ఉపయోగిస్తారు.
భరతం పట్టటం
[మార్చు]విపరీతంగా వేధించటం, బాధించటం .
భరతపట్టం
[మార్చు]పర్యవేక్షణ సరిగా లేనిపాలన .నామ మాత్రపు రాజు పాలన వల్ల సరైన పర్యవేక్షణ ఉండదనే భావం. ఆపద్ధర్మ పరిపాలన
భరతం పట్టాలి
[మార్చు]సాధించాలి/ అంతు చూడాలి అనే అర్థంలో కూడా వాడతారు.: ఉదా:... ఎలాగైనా వాని భరతం పట్టాలి" అని అంటారు.
భరద్వాజ విందు
[మార్చు]అపూర్వమైన, రుచికరమైన, ఆనందకరమైన విందు
భ్రమరకీటం
[మార్చు]భల్లూకపు పట్టు
[మార్చు]భల్లూకము అంటే ఎలుగుబంటి. ఎలుగుబంటి ఏదైనా పట్టుకుంటే నిలువుగా నిలిచి గట్టిగా కౌగలించుకుని చంపటానికి ప్రయత్నిస్తుంది. అలాగే ఎవరేం చెప్పినా వినకుండా తన పట్టుదల వదలని వ్యక్తి పట్టుదలను భల్లూకపు పట్టు అంటారు.
భస్మాసురులు
[మార్చు]తమంతా తాముగా నష్టపోయేవారు.ఎవరినో నష్ట పరచాలనుకొని తమను తామే నష్టపరచుకొనే వారు,. ఆసందర్భంలో ఈ మాటను వాడుతారు.
భస్మాసుర హస్తం
[మార్చు]తనను తానే నష్టపరచుకొనే చెయ్యి
బాదరాయణ సంబంధం
[మార్చు]అవసరం కోసం, స్వార్ధం కోసం సంబంధాన్ని కలుపుకోవటం
బాణాలు సంధించటం
[మార్చు]ఆరోపణలు చేయటం
భగ్గున మండడం
[మార్చు]అధికంగా ఆగ్రహించడం, విపరీతంగా కోపగించుకోవడం
బిభీషికలు
[మార్చు]భయపెట్టే మాటలు
బీరకాయ పీచు
[మార్చు]బుజాలమీద చేతులు వేయటం
[మార్చు]చనువుతో ప్రవర్తించటం
బూచి(గాడు)
[మార్చు]బుజాలు తడుముకోవడం
[మార్చు]గుమ్మడి కాయల దొంగెవరో....? అంటే తన భుజంపై గుమ్మడి కాయ వున్నదేమోనని భుజాలు తడుముకున్నాడట
2.11 భగ్గున మండడం
[మార్చు]అధికంగా ఆగ్రహించడం, విపరీతంగా కోపగించుకోవడం
బేగీరావు టపా
[మార్చు]బేవార్సు
[మార్చు]బొబ్బిలి చిల్లపెంకులు
[మార్చు]భళ్లున తెల్లారింది
[మార్చు]భుజానికెత్తుకోవడం
[మార్చు]బాధ్యతలు స్వీకరించడం
భరతం పట్టటం
[మార్చు]భుజాలు చరుచుకోవటం
[మార్చు]తనకు తానుగా గొప్పలు చెప్పుకోవటం గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నాడట. ఈసామెతను తలపిస్తుంది ఈ మాట. సామాన్యంగ సామెతలను చెప్పేటప్పుడు పూర్తి సామెతను చెప్పకుండా సగం సామెతను మాత్రమే చెప్పి వూరకుంటారు. మిగతాది అందరికి తెలిసిందే.... మిగతా సామెతను ఊహించుకోవలసినదే. ఆ విధంగా చెప్పడంతో...... పూర్తి సామెత చెప్పినదానికంటే ఎక్కువ భావన కలుగుతుంది. ఆ సగం సామెత జతీయం లాగ వుంటుంది. ఇక్కడ చెప్పిన జాతీయం అలాంటిదె. తన భుజాన దొంగలించిన గుమ్మడి కాయ వున్నదేమోనని భుజాలు చరుచు కోవడండం. పైన చెప్పిన వివరణ అనగా..... తనకు తానుగా గొప్పలు చెప్పుకోవటం... అనే అర్థం రావాలంటే..... జబ్బలు చరుచు కోవడం... అని అంటే బాగా సరిపోతుంది.
భుజాన వేసుకోవడం
[మార్చు]సమర్థించడం జాగ్రత్తగా కాపాడుతూ ముందుకు తీసుకు వెళ్ళడం
భుజస్కంధాలపై వేసుకోవడం
[మార్చు]పూర్తి బాధ్యత వహించడం
భుజాల మీద మోపటం
[మార్చు]బరువు, బాధ్యతల్ని అప్పగించటం
భుజాలు బూడా (బజ్జీ) లైనట్టు
[మార్చు]శౌర్యాన్ని ప్రదర్శించకపోవటం, ప్రతాపాన్ని తగ్గించుకొని బతకటం, మెత్తమెత్తగా ఉండటం ===భూతద్దంలో చూడటం== చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహించటం
భుజాల మీద ఎక్కించుకోవటం
[మార్చు]బాగా గౌరవించటం
భూమికి భారం
[మార్చు]నిరుపయోగమైన మనిషి: ఉదా: వాడి పుట్టుకే భూమికి భారం. ఉపయోగం లేని వాడు
భూమి పుట్టిన కాడికి
[మార్చు]అంతులేని దూరం, ఎంత దూరమో
భయము భక్తి లేని వాడు
[మార్చు]ఎవరిని లెక్క చేయని వాడు: ఉదా: వానికి పెద్దల యడ భయము భక్తి లేవు. ఎవరిని లెక్క చేయడు.
భే ఖాతరు చేశాడు
[మార్చు]చెప్పిన పని చేయని వాడు, మాట వినని వాడు.. ఉదా: వాడు నామాటను భే ఖాతరు చేశాడు.