Jump to content

జాతీయములు - ప, ఫ

Wikibooks నుండి
భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు[మార్చు]

పంచాగ్ని మధ్యంలో ఉన్నట్టు[మార్చు]

తీవ్రమైన కష్టాలు చుట్టిముట్టిన స్థితి.నాలుగు దిక్కులతో పాటు నడినెత్తిన అగ్నిసెగ

పంట పండింది[మార్చు]

ఎవరికైనా అనుకోకుండా అధిక సంపద చేకూరితే.... వారిని గురించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఉదా: వాని పంట పండింది అని. ఇక్కడ పంట చేలు పండడము కాదు అర్థము.

పంచ పాండవులు ఎంత మంది అంటే .......[మార్చు]

" పంచ పాండవులు ఎంత మంది అంటే ....... మంచం కోళ్లలాగ ముచ్చటగా ఇద్దరు అని ఒక వేలు చూపించాడట".ఈ జాతీయాన్ని ఏమాత్రం తెలివి లేని వ్యక్తి అని చెప్పటానికి ఈ సామెతను వాడతారు.

పండుగయ్యాక అల్లుడొచ్చినట్టు[మార్చు]

సమయానికి తగినట్లుగా ప్రవర్తించకపోవటం, డబ్బులన్నీ అయిపోయి ఏమీ చేయలేని పరిస్థితి.

పంచబంగారం[మార్చు]

ఏమీలేదు అంతా హుళక్కే అని.

పంచెగ్గట్టాడు[మార్చు]

ఉదా: వాడు కొట్లాటకు పంచెగ్గట్టాడు.

పంట పండింది[మార్చు]

ఉదా: వాని పంట పండింది. వానికి అన్ని లాబాలె.

పంటికింద రాయి లాగ[మార్చు]

అవరోదము: పానకం లో పుడక లాగ అలాంటిదే ఈ జాతీయం కూడా. ఉదా:

పందిని నందిని, నందిని పందిని చేసేవాడు[మార్చు]

ఎంతో సమర్థుడు, ఎలాంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొని విజయాన్ని సాధించేవాడు దీనినే నిందా వాచకంగా కూడా వాడుతారు; అర్థం: మోసగాడు: ఉదా: వాడు పందిని నందిగా, నందిని పందిగా మార్చగల సమర్థుడు.

పంది ఎంత బలిసినా నంది కానేరదు[మార్చు]

ఎన్ని పుంగునూరులైతే కూడా ఒక బెంగుళూరు కానేరదు అనే సామెత లాంటిదే ఇది కూడాను.

పంది లాగ తిని ..[మార్చు]

ఉదా: పంది లాగ తిని పని పాట లేకుండా కూర్చున్నావు.

పక్కలో బల్లెం[మార్చు]

పొరుగునే ఉన్న శత్రువు: ఉదా: వానితో జాగ్రత్త; వాడు పక్కలో బల్లెం లాంటి వాడు. ఇలాంటిదే మరో జాతీయము: దిండు కింది పాము లాగ

పక్కదారి పట్టించాడు[మార్చు]

దారి తప్పించాడు: ఉదా: వాడు నన్ను పక్కదారి పట్టించాడు.

పగటి కలలు కంటున్నాడు[మార్చు]

ఊహల్లో విహరిస్తున్నాడు: ఉదా: వాడు పగటికలలు కంటున్నాడు.

పగలు చుక్కలు పొడిపించటం[మార్చు]

ప్రకృతిని కూడా శాసించేలా విర్రవీగటం, తన ప్రతాపాన్ని భీకరంగా ప్రదర్శించటం, అతి దుర్మార్గంగా వ్యవహరించటం

పగ్గం వేయటం[మార్చు]

అదుపు చేయటం, ముందుకు వెళ్ళనివ్వకపోవటం. ఒక సినీ గీతంలో: పరుగులు తీసె నీ మనసునకు పగ్గం వేసెను నావయసు. ..

పగ్గాలు వదలటం[మార్చు]

అదుపు చెయ్యకపోవటం . స్వేచ్ఛనివ్వడ: ఉదా:.... పశువుల పండగ నాడు ఎద్దులకు ముకుతాడు, పగ్గాలు తీసేసి స్వేచ్ఛగా వదిలేస్తారు.

పచ్చగా ఉండడం[మార్చు]

అందంగా, ఆరోగ్యంగా ఏ బాధలూ లేకుండా ఉండడం; ఉ: మీకాపురం చల్లగా.... పచ్చగా కలకాలం వుండాలని అశీర్వదిస్తారు.

పచ్చని కాపురం:[మార్చు]

చీకు చింత లేని కాపురం: ఒద్దికైన కాపురం; ......

పచ్చికచ్చిన గోస[మార్చు]

పక్షికి వచ్చిన కష్టం, బాధ, ఆపద. రావణుడిని జటాయువు ఎదిరించి చావు దెబ్బలు తింది.

పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనటం[మార్చు]

విభేదాలు, వైషమ్యాలు, విరోధాలు తీవ్రస్థాయిలో ఉండటం.

పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు[మార్చు]

పచ్చి వెలక్కాయ చాల వగరు. తింటే గొంతు పట్టేస్తుంది. అనగా మాట పెగలదు. ఏదైనా చెప్పాలను కున్నప్పుడు మాట పెగలక అవస్త పడు తుంటే ఈ మాటను ఉపయోగిస్తారు. వివరణ: అతనికి నిజం తెలుసు. కాని చెప్పలేడు. చెప్పితే చాల గొడవలౌతాయని చెప్పలేక పోతున్నప్పుడు ఈ మాట అంటారు

పట్ట పగ్గాల్లేవు[మార్చు]

విర్ర వీగు తున్నాడు: ఉదా: వాడు పట్ట పగ్గాల్లేకుండా విర్ర వీగు తున్నాడు.

పట్టిందల్లా బంగారమే[మార్చు]

అన్ని పనులు సక్రమంగా జరిగి అన్నింట్లో లాభం వస్తుంటే ఇలా అంటారు. ఉదా: వానికేం? వాడు పట్టిందల్ల బంగారమె.

పట్టు దొరికింది[మార్చు]

ఉదా: ఇప్పటికి ఈ పనిలో పట్టు దొరికింది.

పట్టు సాదించాడు[మార్చు]

ఉదా: ఎలాగైనా దీనిలో పట్టు సాధించాలి.

పట్టు విడుపు వుండాలి (దేనికైనా)[మార్చు]

ఉదా: దేనికైనా పట్టు విడుపు వుండాలి. ఇద్దరి మధ్య వాదనలు జరిగే టప్పుడు ఇద్దరు ఎవరికి వారు మొండి పట్టుదలతో వాదిస్తుంటే వ్యవహారం తెగదు. ఇద్దరిలోను కొంత సడలింపు వుండాలి. ఆ సందర్భంగా చెప్పేదే ఈ జాతీయం. ఇదే అర్థంతో మరొక జాతీయం ఉంది. అది. తెగిందాక లాగకు

పట్టు వదలని విక్రమార్కుడు[మార్చు]

గట్టి పట్టుదల కలవాడు: ఉదా: వాడు పట్టు వదలని విక్రమార్కుడు: ఏపనినైనా పట్టుకున్నాడంటే దాని అంతు చూడంది వదలడు.

పట్టుమని పదేండ్లు లేవు....[మార్చు]

ఉదా: వానికి పట్టుమని పదేండ్లు లేవు వాని మాటలు చాల దూరం పోతున్నాయి.

పడకేయటం[మార్చు]

నష్టపోవటం ఎలాంటి అభివృద్ధి లేకుండా స్తబ్దంగా ఉండిపోవటం

పడి కొట్టుకుపోవటం[మార్చు]

పూర్తిగా నిమగ్నం కావటం, ఒక విషయాన్ని గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉండటం, ఒకరి ప్రభావంలో పూర్తిగా ఉండిపోవటం

పడుగాపులు[మార్చు]

అధికంగా ఎదురు చూపులు చూడటం.

పడీపడీ[మార్చు]

మరీ మరీ . అంత దూరాన్నుంచి నీకోసం పడీ పడీ వచ్చాను. నువ్వంటే పడీ పడీ చస్తాలే, పడీపడీ నవ్వకు లాంటి ప్రయోగాలు.

పధిక సర్ప మారణం[మార్చు]

తనకే మాత్రం కష్టనష్టాలు కలగకుండా ఎదుటివారి చేత పని చేయించుకోవటం, ఆ కష్టనష్టాలేవో ఎదుటి వ్యక్తులు పడతారని, తాను మాత్రం హాయిగా ఉండవచ్చని అనుకోవటం .

పదిమందిలో పలచనై పోవడం[మార్చు]

సమాజంలో చులకనై పోవడం.

పనిగల బంటు[మార్చు]

నేర్పరితనం ఉన్న పనివాడు

పనిపట్టడం[మార్చు]

ఎవరైనా దుర్మార్గంగానీ, అన్యాయంగానో ప్రవర్థిస్తుంటే వారిని అదుపులో పెట్టాలనే ఉద్దేశంతో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఈసారి ఎలాగైనా వాడి పని పట్టాలి? అని. అనగా వాడిని అదుపులో పెట్టాలని అర్థము.

పప్పులు ఉడకవు[మార్చు]

నీమాట ఇక్కడ చెల్లుబాటు కాదు అని చెప్పటం: ఉదా: నీపప్పులు ఇక్కడ వుడకవు

పప్పులో కాలేశాడు[మార్చు]

తప్పు చేశాడు: ఏదైనా తప్పు చేస్తే పప్పులో కాలేశావు అని అంటారు.

పబ్బం గడుపుకున్నాడు[మార్చు]

పని జరిపించు కున్నాడు: ఉదా: వాడు ఎలాగోలా పబ్బం గడుపు కున్నాడు.

పయోముఖ విషకుంభం[మార్చు]

విషం నింపిన కుండ (కుంభం) విషకుంభం. దాని ముఖంలో (పైభాగాన) పయస్సు (పాలు) పోసి ఉంచితే అది పయోముఖమవుతుంది. మనసులో విషం పెట్టుకుని పైకి తియ్యని మాటలు మాట్లాడేవాళ్లని పయోముఖ విషకుంభము అంటారు.

పరంధామయ్య[మార్చు]

పరపర[మార్చు]

చింపివేయటం . పరపర అనేది వస్త్రం, కాగితం లాంటివి చింపేశారు అని చెప్పటానికి అలా పరపరా చింపేస్తే ఆ వస్త్రం ఇంక దేనికీ పనికి రాదు అని

పరశురామ ప్రీతి అయింది[మార్చు]

అంతా కాలి పోయింది అని అర్థం: ఉదా: వాని ఇల్లు పరశురామ ప్రీతి అయ్యింది.

పరమానందయ్య శిష్యులు[మార్చు]

చెప్పిన పని చెప్పినట్లుగా చేయని అవివేకులు

పరశురామప్రీతి[మార్చు]

ఏదైనా అగ్నికి ఆహుతి ఐతే ఈ సామెతను వాడుతారు

పరశురామక్షేత్రం[మార్చు]

పరమానందయ్య శిష్యులు[మార్చు]

అమాయకమైన వారినుద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు. (పరమానందయ్య శిష్యులు అమాయకులు గనుక)

పరాచికాలాడొద్దు[మార్చు]

ఉదా: ఇది పరాచికాలకు సమయం కాదు.

పరాన్న జీవి[మార్చు]

ఇతరుల మీద ఆధార పడి బతికే వాడు.

పరికించి చూస్తున్నాడు[మార్చు]

జాగ్రత్తగా గమనిస్తున్నాడని అర్థం: ఉదా:... వాడు పరికించి చూస్తున్నాడు.

పరిగిలేరుతున్నారు-[మార్చు]

నిజార్థంలో... పరిగిలేరడం" అంటే? ... ... వరి పైరు కోసిన తర్వాత ఆ పొలంలో విరిగి రాలి పోయిన వరి కంకులను ఏరుకోడానికి కొంత మంది బీద వారు వస్తారు. దానిని పరిగెలేరడం అని అంటారు. అదేదో ఆ పూటకు కూడా గడవని బీద వారు చేసే పని. అన్ని ఉం డి కూడా ఇతరులను యాచించే వాడిపై ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

పరుగులు తీయటం=[మార్చు]

వేగంగా అభివృద్ధి చెందటం, కంగారుపడటం

పరుగులు తీస్తున్నారు[మార్చు]

వెంపర్లాడు తున్నారు: ఉదా: ఈ రోజుల్లో ప్రజలు అన్నింటికి పరుగులు తీస్తున్నారు.

పరుగులుతీసె వయసు[మార్చు]

యుక్త వయస్సు అని అర్థం. ఒక పాటలో పద ప్రయోగము: పరుగులు తీసె నీవయసునకు పగ్గం వేసెను నామనసు.

పలచబడటం[మార్చు]

సాంద్రత కోల్పోవటాన్ని పలచబడటం అంటారు. పాలు లాంటి పదార్థాలు చిక్కగా ఉన్నప్పుడు మంచివన్నది భావన. నీళ్ళు కలిసి పాలు, మజ్జిగ లాంటివి పలచగా మారినప్పుడు వీటి విలువ కూడా తగ్గుతుంటుంది.మనిషిలోని శక్తి, పరపతి, పరువు పోయినప్పుడు చేయకూడని పనిచేసినపుడు పదిమందిలో పలచన ఔతాడు.

పల్లవి మార్చటం[మార్చు]

మాట మార్చటం బాణీ మార్చటం . ఒకసారి ఈ పనిచేస్తాను అని చెప్పిన మాటను మర్చిపోయి లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించి చేయకుండా అవకాశవాదంగా వ్యవహరించటం.

పల్లెటూరి గొర్రె[మార్చు]

అమాయకుడు అని అర్థము. అమాయకుల గురించి ఈ సామెతను వాడుతారు.

పల్లెత్తు మాట కూడ అనడు[మార్చు]

ఏమి అనడు: మంచి వాడు.

పళ్ళు నూరటం[మార్చు]

విపరీతంగా ఉక్రోషం, క్రోథం, కోపాన్ని ప్రదర్శించటం .

పళ్ళు పటపటలాడించటం[మార్చు]

విపరీతమైన కక్ష కలిగి ఉండటం

పశిడి పలుకులు[మార్చు]

మంచి మాటలు.

పసరిక పాము లాంటి వాడు[మార్చు]

చాల అమాయకుడని అర్థం.

పసి గట్టేశాడు[మార్చు]

కనిపెట్టేశాడని అర్థం. ఉదా: ఎంత రహస్యంగా చేసినా వాడు పసి గట్టేశాడు.

పసూరం[మార్చు]

ప్రచారం

ప్రసూతి వైరాగ్యం[మార్చు]

పండిన చెట్టు మీదనే... బండలు పడేది[మార్చు]

కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు. చెట్టుమీద పండ్లు వుంటే.... దారిన పోయే పిల్లలు పండ్ల కొరకు రాళ్ళను విసురుతారు.. పండ్లు లేని చెట్టుపైకి ఎవరూ రాళ్ళు విసరరు.

పంతెడాయిందం కాలాల[మార్చు]

పంతెడు అంటే ప్రమిదెడు . ఆయిందం అంటే ఆముదం .ప్రమిదలోని ఆముదం తరిగిపోవటానికి, వత్తి కాలిపోవటానికి చాలా సమయమే పడుతుంది. చాలా సేపు అనే కాలసూచిక.వాణ్ణి ఒప్పించాలంటే పంతెడాయిందం కాలాల' అంటారు.

పాకాల దున్న[మార్చు]

పాచిక[మార్చు]

కుట్రకు సాధనం, కష్టకారణ

పాచిక పారింది[మార్చు]

వేచిన పధకం ఫలించిందని అర్తం. ఈ విషయంలో వాని పాచిక పారింది.

పాడికుండ[మార్చు]

ఎప్పుడూ ఎంతో కొంతైనా ఉండేది. తరగని సంపద, ఎప్పుడైనా, ఏ కాలంలోనైనా అందుబాటులో ఉండే భాగ్యాలు . ఏ సమయంలో కావాలన్నా కొద్దోగొప్పో తీసుకొని వాడుకోవటానికి అవకాశం ఉండేది.

పాండవ బీడు[మార్చు]

పాడూరి సంత[మార్చు]

పాతాళప్రశ్న[మార్చు]

పాతుకొని పోవటం[మార్చు]

బాగా స్థిరపడటం . ఉదా: వాడు ఒట్టిచేతులతో వచ్చాడు; ఇప్పుడు బాగా పాతుక పోయాడు.

పానకాల రాయుడు[మార్చు]

విపరీతమైన తాగుబోతు. వాస్తవానికి ఇది ఎంతో పవిత్రంగా భావించుకొనే మంగళగిరి నరసింహస్వామిని సూచించే నామం. ఆ స్వామికి ఎంత పానకం పోసినా కడుపు నిండదు. ఎంత తాగినా తనివి తీరని తాగుబోతుల్ని సూచించే పదంగా మారిపోయింది.

పాము కాళ్ళు[మార్చు]

లేకపోయినా ఉందన్నట్టు చెప్పటం. పాముకు ఇతర జంతువుల లాగా కాళ్ళు ఉండవు. అది పొట్ట సాయంతో ముందుకు పోతూ ఉంటుంది. పాము ముందుకు పోతోందంటే దీనికీ కాళ్ళు ఉండే ఉంటాయి అనుకోవటం పాముకాళ్ళ వ్యవహారంలాంటిది.

పాముచెవులవాడు[మార్చు]

వాడు పాముచెవులవాడు... అనగా వాడు మనసులోని మాటను కూడా పసిగట్టగలడని అర్థం.

పాము నడక[మార్చు]

ఒక పద్ధతి ప్రకారం కాక వంకర టింకరగా అడ్డదిడ్డంగా నడిచే తీరు, వక్రత

పాము పొట్ట[మార్చు]

పామునడకలోడు[మార్చు]

కాసేపు ఇటు, కాసేపు అటు ఉంటూ సరిగా న్యాయం చెప్పని వాడు

పారజూడటం[మార్చు]

చివరిగట్టుదాకా పూర్తిగా చూడటం: నిశితంగా చూడడము: ఉదా: వాడు తేరి పార జూస్తున్నాడు

పాల కోసం రాయి మోసినట్టు[మార్చు]

పనికిరాని వారిని సయితం గౌరవించాల్సి రావటం. కావడిలో ఒక వైపే బరువుంటే మోయడం కుదరదు. సమతూకం కోసం ఓవైపు బండరాయిని పెట్టుకోటం.

పాలి భారతం - ఆలి రామాయణం[మార్చు]

పాలున్ననాడు పాశం[మార్చు]

డబ్బులున్నప్పుడు మాత్రమే భోగాలనుభవించటం.దాపుడుగుడ్డలు కట్టుకోవటం, విత్తనాలగింజలు వండుకుతినడం లాగా.పాశాన్ని వండటానికి పాలు కావాలి. పాలు కూడా కొనలేని స్థితిలో ఉన్నవారికి పాశం వండుకోవటం అంటే కచ్చితంగా భోగమే.

పాలు పొంగినట్టు[మార్చు]

శుభ సూచికం.పాలు చాలా వేగంగా పొంగుతాయి. పాలు పొంగినంత త్వరగా ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందాలన్న ఆకాంక్షతో గృహ ప్రవేశ సమయాల్లో పాలను పొంగిస్తారు.

పాలెపు వెంకన్న పెంపకం[మార్చు]

ప్రాణాలు తోడేయటం[మార్చు]

విపరీతంగా పీడించటం, బాధించటం == ఉదా: వీరు పిల్లలు గారు పిడుగులు: నాప్రాణాలు తోడేస్తున్నారు.

ప్రాణాలు తీస్తున్నాడు[మార్చు]

చాల బాధ పెడుతున్నాడని అర్థం

ప్రాణంమీదకు తెచ్చుకున్నాడు[మార్చు]

కష్టాలు తెచ్చుకున్నాడని అర్థం: వాడు చేయరాని పనిచేసి ప్రాణంమీదకు తెచ్చుకున్నాడు.

పింగళా జపం[మార్చు]

ఓ వేశ్య అదే పనిగా ఎదురు చూస్తూ ఉండేదట. ఆ వేశ్య పేరే పింగళ.

పిడిగంట (భీమ) లింగయ్య[మార్చు]

పిండి పిప్పిచెయ్యడం[మార్చు]

అధికంగా బాధించడం బాగా పిండి రసమంతా తీసేసి పిప్పిచేయటం

పిందెలో పండిన పండు[మార్చు]

చిన్నవయసులోనే ఎక్కువ విజ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను సంపాదించుకొన్న వాడు.

పిచ్చిమాలోకం[మార్చు]

సంస్కారం లేనివాడు, అమాయకుడు పది మందిలోనూ కలిసిమెలిసి తిరిగే అర్హత లేని వాడనే భావం ఉదా: వాడొట్టి పిచ్చి మాలోకం: వాడిని పట్టించు కోకు.

పిచ్చివాడి చేతిలో రాయి[మార్చు]

ఓ గమ్యం కానీ, లక్ష్యం కానీ ఏదీ లేకుండా కొన్నిసార్లు ప్రమాదాలను కూడా తెచ్చిపెట్టే విషయం. మతి స్థిమితం లేని వ్యక్తికి స్థిర లక్ష్యం ఉండదు. అతడి చేతిలోని రాయి ఎదురుగా ఉన్న మరిదేనికైనా తగిలి నష్టం కలగొచ్చు.

పిట్టలదొర మాటలు[మార్చు]

అన్నీ ప్రగల్భాలే .విన్నవారికి పనులు చేయటం సాధ్యం కాదని తెలిసిపోతూనే ఉంటుంది. పిట్టలదొర .... ఇది తెలుగునాట జానపద వేషము. పిట్టలదొర ఉట్టొట్టి ప్రగల్పాలు చెప్పి పొట్టపోసుకుంటుంటాడు. ఆ విధంగా పుట్టినది ఈ సామెత.

పిడుగుపాటు[మార్చు]

వూహించని విధంగా క్షణాల్లో నష్టం సంభవించటం. ఉ: ఈ వార్థ వానికి పిడుగు పాటుతో సమానం:

పిపీలికం[మార్చు]

చీమ.అల్పం, స్వల్పం, చిన్నది, చాలా అల్పమైనది .

పిపీలికా మార్గం[మార్చు]

పిప్పి చేయటం[మార్చు]

పూర్తిగా నాశనం చేయటం. చెరకు గడను గానుగలో పెట్టి ఆడించినా దాని సారాన్నంతా పీల్చినమిలేసినా పిప్పే మిగిలేది.

పిలక తోకలు సహా[మార్చు]

సంపూర్ణంగా .

పిల్లామేక[మార్చు]

ఇంట్లో ఉన్న వారంతా, ఇంటిల్లిపాదీ, కుటుంబ సభ్యులంతా .పూర్వం మేకలు, కోళ్ళు, గేదెలులాంటి వాటిని పెంచుతూ వాటిని కూడా ముద్దు ముద్దు పేర్లతో ఇంట్లో మనుషులలాగానే ప్రేమతో పిలుస్తుండేవారు. ఒక వేళ వాటిని విడిచిపెట్టి రాలేక పోతే వాటితో సహా రావచ్చు . 'పిల్లా మేకతో సహా రండి, ఏం అభ్యంతరం లేదు అనేవారు.

పిలిచి పీట వేయటం[మార్చు]

ప్రత్యేక స్థానం కల్పించటం పెద్దపీట వేయటం, అగ్ర తాంబూలం ఇవ్వటం ఎంతో గౌరవాన్నిచ్చి ఆహ్వానిస్తున్నట్టు లెక్క.

పిల్లి- ఎలుక[మార్చు]

ఆగర్భ శత్రుత్వం, సహజ శత్రుత్వం . పిల్లి కంటబడ్డ ఎలుక ఎంత మంచిదైనా, ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నా పిల్లి దాన్ని చంపి తీరుతుంది. ఎలుక తననేమీ చేసినా, చేయకపోయినా పిల్లి ఎలుక ప్రాణాన్ని తీస్తుంది.

పిల్లికి ఎలుక సాక్ష్యం[మార్చు]

తగని సాక్ష్యం, సముచితంగా లేని సాక్ష్యం. పిల్లి, ఎలుక రెండూ పుట్టుకతోనే వైరం ఉన్న జంతువులు, అటువంటప్పుడు పిల్లిని సమర్థిస్తూ ఎలుక వచ్చి సాక్ష్యం చెప్పిందంటే అది ఎంత వరకూ సమంజసమో ఎవరైనా వూహించవచ్చు

పిల్లినడక[మార్చు]

పిల్లి నడిచేటప్పుడు చప్పుడు రాదు. ఆ విధంగా చప్పుడు కాకుండా వచ్చేవారినుద్దేశించి ఈ సామెతను వాడుతారు.

పిల్లికి బిచ్చం పెట్టనివాడు[మార్చు]

మహాపిసినారి ఎవరినీ ఏ ఒక్క రోజున కూడా పిలిచి బిచ్చం పెట్టలేదట. అలా పిలిచి బిచ్చం పెట్టకపోవటమే పిల్లికి బిచ్చం పెట్టనివాడు అనే రూపంగా మారింది.

పిల్లికూనలాగా[మార్చు]

భయం భయంగా ఒదిగి ఉండటం.

పిల్లి పిల్లల్ని తిప్పినట్టు[మార్చు]

మార్జాల కిశోర న్యాయం అంటారు. పిల్లి తన పిల్లలను నోట కరచుకొని తాను ఎక్కడికి వెళితే అక్కడికల్లా వాటిని జాగ్రత్తగా తీసుకువెళ్ళి రక్షిస్తూ పెంచుతుంటుంది.

పిల్లిశీలం[మార్చు]

పిల్లి సంసారం[మార్చు]

పిల్లి పిల్లలను పెట్టిన తర్వాత వాటిని చాలా చోట్లకు మారుస్తుంటుంది. అలాగే ఒకచోట స్థిరంగా ఉండక ఎప్పుడూ ఇళ్ళు మారుతుండే వారిని పిల్లి సంసారంలా ఎప్పుడూ ఇళ్ళు మారుతుంటారు అంటారు.

పిసపిస[మార్చు]

మానసిక స్థిమితం లేని పరిస్థితి.అస్థిరత

పిష్టపేషణం[మార్చు]

పీకల దాకా మునగటం[మార్చు]

పూర్తిగా మునిగిపోవటం. నష్టపోవటం, కష్టాల పాలు కావటం . గొంతుదాకా మునిగిన వాడు ఇక పూర్తిగా మునిగిపోవటం జరుగుతుందన్నది భావన.

పీకల్లోతు కష్టాలో మునిగి పోయాడు[మార్చు]

చాల కష్టాలలో వున్నాడని అర్థం: ఉదా: వాడు పీకల్లోతు కష్టాలలో మునిగి ఉన్నాడు.

పీకి పందిరేశాడు[మార్చు]

ఉదా: వానికి ఒక చిన్న పని చెప్పాను. దానికి వాడు పీకి పందిరేశాడు.

పీక్కొని తింటున్నారు[మార్చు]

ఉదా: ఎందుకురా వాన్ని అలా పీక్కొని తుంటావు వదెలెయ్. వాడి పాపాన వాడే పోతాడు. చాల బాధించడమని అర్థము.

పీట ముడు పడింది[మార్చు]

అడ్డంకులు కలిగాయి అని అర్థం: ఉదా: వాడు చేస్తున్న పనికి పీట ముడు పడింది.

పీనుగమీది పీతిరిగడ్డ[మార్చు]

పుంగనూరు సంస్థానం[మార్చు]

అంతా తెలివిలేని పనికిమాలినవాళ్ళే చేరిన కార్యాలయం

పుంగునూరుజవాను[మార్చు]

పుండుమీద కారం చల్లడం[మార్చు]

కష్టాలలో ఉన్నవారిని మరింత కష్టాలపాలు చేయడం. పుండు మీద కారం చల్లితే ఇంకాస్త మంటెక్కువైతుంది.

పుక్కిటపట్టటం[మార్చు]

కంఠతాపట్టటం, గడగడా చెప్పేయటం/ ఉ: వాడు పాటాలన్ని పుక్కిట పట్టేశాడు.

పుక్కిటి పురాణాలు[మార్చు]

లేని విషయాలు ఉన్నట్టు చెప్పటం. ఉదా: నీ పుక్కిటి పురాణాలు ఇక్కడ వినేవారెవ్వరు లేరు.

పుక్కిళించడం[మార్చు]

నోటిలో నీళ్ళు పోసుకొని గళగళ తిప్పడం

పుచ్చలెగిరి పోతాయి[మార్చు]

కొడతానని బెదిరించడము.

పుట్టపగిలినట్టు[మార్చు]

వర్షాకాలంలో ఊసుళ్ళు పుట్టలోనుండి ఏకదాటిగా వస్తుంటాయి. ఆ విధంగా జనము ఎక్కువగా వస్తుంటే.... పుట్ట పగిలినట్టు ఒకే జనం వస్తున్నారు.. అని ఈ జాతీయాన్ని వాడుతారు.

పుట్టి మునిగింది[మార్చు]

వాని పని అయిపోయింది: ఉదా: వాని పుట్టి మునిగింది. పాప వాని పని అయి పోయింది.

పుటుక్కున[మార్చు]

తెంచటం, తుంచటం. టుపుక్కున, చంపటం. శిశువులను, పురిటిలోనే పుటుక్కుమనిపించే దుర్మార్గం చంపటం.

పుట్టుచెవుడు[మార్చు]

అసలు ఏమీ వినిపించని స్థితి .పుట్టుకతోనే వచ్చిన చెవుడు, ఏ వైద్యానికి చికిత్సలకు నయం కాని చెవుడు.ఎంతగా అభ్యర్థిస్తున్నా విన్నవించుకొంటున్నా బాధలను, రోదనలను వినిపించుకోని వారిని పుట్టు చెవుటోడి తీరు అంటారు.

పుట్టుపూర్వోత్తరాలు....[మార్చు]

నీ పుట్టు పూర్వోత్తరాలు నాకు బాగా తెలుసు... అని అంటుంటారు. అనగా నీ జాతకమంతా.... నీవ్వవహారమంతా నాకు బాగా తెలుసు అని అర్థము. అ సందర్భంగా ఈ జాతీయాన్ని వాడుతారు.

పుట్టెడప్పు పట్టె మంచం[మార్చు]

అప్పుచేసి పప్పుకూడు అప్పుతో భోగభాగ్యాల్ని అనుభవించటం

పుట్టెడు బుద్దులు గల వాడు[మార్చు]

చాల తెలివైన వాడని అర్థం. ఉదా: వాడు పొట్టోడైనా వానికి పుట్టెడు బుద్ధులున్నాయి.

పుట్టెడు దుఖాన్ని దిగమింగాడు[మార్చు]

అన్ని కష్టాలను తట్టు కున్నాడు: ఉదా: పాపం వాడు పుట్టెడు దుఖాన్ని దిగమింగి ఉన్నాడు.

పుట్లో వేలు పెట్టాడు[మార్చు]

కోరి కష్టాలు తెచ్చు కున్నాడని అర్థం: ఉదా: .... వాడు ఊరుకోకుండా పుట్లో వేలు పెట్టాడు. కష్టాల్లో ఇరుక్కున్నాడు.

పునాదులు కదులుతున్నాయి[మార్చు]

అసలు విషయం బయట పడు తున్నది: ఉదా: ... వారి పునాదులు కదులుతున్నాయి. అసలు విషయం ఇప్పుడు బయట పడుతుంది. చూస్తూ వుండండి.

పురాణ వైరాగ్యం[మార్చు]

పురి గొల్పుతున్నాడు[మార్చు]

ఉసి గొల్పడం: ఉదా:>.. ఎందుకు రా వాన్ని అలా పురి గొల్పుతావు వాడి మీదకు?

పురిటి వాసన పోలేదు[మార్చు]

పాత బుద్ధులు పోలేదని అర్థం>

పురిటిలోనే సంది కొట్టడం[మార్చు]

సంధి అనేది ఒక వ్యాధి. ఇది ఇచ్చినవారు, బ్రతకరు. ఈ వ్యాధి వృద్ధాప్యంలో వస్తుంది. 'సంధి' అనగా మతి చెలించడం. ఈ వ్యాధి పురిటి బిడ్డకు (అప్పుడే పుట్టిన బిడ్డకు) వస్తే కష్టం. పని ప్రారంభించగానే , ఆ పనికి విఘ్నం కలిగి ఆగిపోయే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

పురెక్కించటం[మార్చు]

కార్యోన్ముఖుల్ని చేయటం, బాగా ప్రోత్సహించటం .గట్టిగా పేనటాన్నే పురిపెట్టడం అంటారు.

పుర్రెకో బుద్ది... జివ్హకో రుచి[మార్చు]

ఒక్కో మనిషి బుద్ధి ఒక్కొ విధంగా వుంటుందని అర్థం.

పులకలుప్పొంగటం[మార్చు]

అధికంగా సంతోషం కలగటం, ఆనందం అతిశయించటం, గగుర్పాటు చెందటం, శరీరం మీద వెండ్రుకలు నిక్కపొడుచుకోటం

పులికాపు[మార్చు]

పులితో చెలగాటం[మార్చు]

ఉదా: జాగ్రత్త.... వానితో తలపడటమంటే పులితో చెలగాట మాడటమె.

పులినాకినవాడు[మార్చు]

పులినోటి కండ[మార్చు]

పులి నోట్లో తల దూర్చావు[మార్చు]

చాల ప్రమాదకరమైన పనిచేస్తున్నావని అర్థం. ఎవరయినా ప్రమాధకరమైన ప్రని చేస్తుంటే హెచ్చరికగా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.

పులి మీద పుట్ర[మార్చు]

చాల చిన్న విషయము:

పులిబిడ్డ[మార్చు]

చాల దైర్యవంతుడని అర్థము.

పులి బోనులోకి వచ్చావు[మార్చు]

చాల పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నావని అర్థం.

పులి మీద స్వారి చేస్తున్నాడు[మార్చు]

చాల ప్రమాదంలో ఉన్నాడు అని అర్తం. ఉదా:> వాడు పులిమీద స్వారి చేస్తున్నాడు. దిగనంత వరకు వాడు చాల గొప్ప వాడు. దిగితే పులి వాడిని తినేస్తుంది. దిగ కుండా వుండ లేడు.

పుల్ల పెట్టెడు నీళ్ళకు పెట్టు[మార్చు]

చిన్నవాడు పెద్దవాడిని నిరోధించగలిగాడు అని. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ అని .నీటి ప్రవాహం ఒక్కసారి చిన్నపుల్ల అడ్డుపడ్డా ముందుకు వెళ్ళక ఆగిపోతుంది. కనుక అధిక ప్రమాణంలో ఉన్న నీరు అల్ప ప్రమాణంలో ఉన్న పుల్ల అడ్డు తగిలి ఆగిందని అర్థం

పుల్లవిరుపు మాటలు[మార్చు]

ఎదుటి వారికి బాధ కలిగించే తీరులో మాట్లాడటం . పెడసరంగా మాట్లాడటం లేక ప్రవర్తించటం . పుల్ల విరిచినప్పుడు ఫెళ్ళుమని శబ్దం వస్తుంది. విరిగిన పుల్ల అతుక్కోదు.పుల్ల విరిగిన శబ్దం వినటానికి ఇంపుగా ఉండదు.

పుల్ల విరచటం[మార్చు]

తగాదా రావటం . గంగిరెద్దుల వాళ్ళలో తీర్పు కోసం ముందుగా ఒక వ్యక్తి కులపెద్ద దగ్గర కొచ్చి తనకు ఏ వ్యక్తితో తగాదా వచ్చిందో చెప్పి కులపెద్దకు ఒక పుల్లను విరిచి ఇస్తాడు. కులపెద్ద అవతల వ్యక్తిని రమ్మని కబురు పెడతాడు. ఆ వ్యక్తి కూడా తగాదామాట వాస్తవమేనని ఒక పుల్లను విరిచి ఇస్తాడు. అలా ఇద్దరూ పుల్లలు విరిచి ఇచ్చాక కులపెద్ద న్యాయ విచారణ చేస్తాడు.

పుల్లలను ఎగదోశాడు[మార్చు]

కొట్లాటకు ఉసి గొల్పడం: ఉదా:.... వాడు పుల్లలను ఎగదోసి వారి కొట్లాటను మరింత పెద్దది చేసి తమాష చూస్తున్నాడు.

పుల్లాకు మీద పడ్డట్టు[మార్చు]

అతి జాగ్రత్తలకుపోయి తప్పులో కాలెయ్యటం.తప్పులు చేయకూడదను కొంటూనే తప్పులు చేయటం.పులి విస్తరి, పుల్లాకు అంటే ఎంగిలాకు.ఒకడు ఎంతో జాగ్రత్తగా నడుచుకొంటూ ఏమీ తొక్కకుండా వెళ్ళాలని అనుకుంటూ మట్టికుప్ప మీద నుంచి ఎగిరి అవతలికి దూకి ఆ పక్కనే ఉన్న పుల్లాకుల మీద పడ్డాడట.

పుల్ల సిల పుట్టటం[మార్చు]

అభద్రతా భావం పెరగటం, విభేదాలు కలగటం . ఇరుసు నుంచి చక్రం విడిపోకుండా ఇనుప సీల ఒకటి ఉంటుంది. అయితే ఈ సీల ఒక్కోసారి అనుకోకుండా ఊడిపోయి బండి, చక్రం విడిపోయి ప్రమాదం సంభవిస్తుంది. అప్పుడు విరిగిపోయి ఊడి పోయిన ఆ సీల ప్రదేశంలో తాత్కాలికంగా ఏదో ఒక పచ్చి పుల్లను పెట్టి బండి నడుపుతుంటారు. అయితే ఇనుప సీల ఉన్నప్పటిలా పుల్ల ఉన్నప్పుడు బండిని వేగంగా తోలరు. పుల్ల విరిగి పోతుందన్న అభద్రతా భావంతో నిదానంగా నడుపుతుంటారు. ఇలా సీల స్థానంలో పుల్ల వచ్చిన స్థితే పుల్లసీల పుట్టటం. సీల సిలగా అయింది.

పులిగొంతును గొర్రె కరిచినట్టు[మార్చు]

అసంభవం, సాహసోపేతం, ఆశ్చర్యకరం. అసాద్యమైన పని అని అర్థము. పులిని గొర్రె కరవడము అసాధ్యము. అలా అసాధ్యమైన దానిని పోలికగా చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.

పులినాకినోడు[మార్చు]

మృత్యుంజయుడు, అదృష్టవంతుడు, అసాధ్యుడు

పులి పిక్కను గొర్రె కరచినట్టు[మార్చు]

ఏనాటికీ జరగని పని, అసంభవం

పులి మీద స్వారీ చేయటం[మార్చు]

సాహసోపేతమైన చర్య, అదుపు తప్పితే అపాయం కలిగేపని. వివరణ: పులి మీద స్వారి చేస్తుంటె చాల గర్వంగా వుంటుంది ఎందుకంటే అది ఎవరూ చేయలేని పని. కాని పులి మీద అలా స్వారి చేస్తూనె వుండాలి. దిగాఢంటే పులి వాడిని తినేస్తుంది. అలాగని వాడు దిగ కుండా ఎంతకాలమని పులి మీద ఉండగలడు?.

పులి మీసాలతో ఉయ్యాలాట[మార్చు]

అత్యంత ప్రమాద భరితమైన చర్య . పులి నోట్లో తల పెట్టటం లాంటిదే ఇది కూడా.

పులుసులో కలవటం[మార్చు]

ప్రత్యేకమైన గుర్తింపు లేకుండా పోవటం .పులుసులోకి అనేక రకాల కూర ముక్కలను తరిగి వేస్తే ఆ ముక్కలన్నీ పులుసులో ఉడకక ముందు విడివిడిగా గుర్తించటానికి అవకాశం ఉంటుంది. ఉడికాక వాటికి గుర్తింపు అంతగా ఉండదు. అన్నిటినీ కలిసి పులుసే అంటారు. కొన్నిపనులు కోసం విడిగా ప్రత్యేకంగా దాచిన డబ్బు లెక్కలు సరిగా రాసుకోకుండా ఖర్చు చేస్తే ఆ సొమ్ము ఏది ఎక్కడ నుంచి ఎంత తీసి ఖర్చు చేసిందీ అంతు పట్డదు. అలాంటి సందర్భాల్లో సొమ్మంతా పులుసులో కలిసినట్టయింది. ఆ ఖర్చుకు ఈ ఖర్చుకు అంతా అయిపోయింది'.. అంటారు

పుండు మీద కారం చల్లి నట్లు[మార్చు]

ఉదా:... వాని మాటలు వింటుంటే నాకు పుండు మీద కారం చల్లి నట్లుంది. పుండు మీద కారం చల్లితే బాధ మరికొంత ఎక్కువవుతుంది. అలా బాధ పడేవారిని మరికొంత బాధకు గురిచేస్తే ఈ మాటను వాడుతారు.

పూచిక పుల్ల[మార్చు]

అతి స్వల్పమైనది: ఉదా:... వాడు పూచికపుల్లంత పని కూడా చేయడు.

పూచిక పుల్ల కూడ ఇవ్వను[మార్చు]

ఏమి ఇవ్వను: ఉదా: నీకు పూచిక పుల్ల కూడా ఇవ్వను: ఏం చేసుకుంటావో చేసుకో....

పూచిన తంగేడు[మార్చు]

సంపన్నత. తంగేడు మొక్క పూలు ఆ మొక్క నిండా ఒక్క ఆకు కూడా కనిపించని తీరులో విరగ పూస్తాయి. కలవారి ఇంటి ఇల్లాలు ఒంటినిండా నగలు అలంకరించుకొని మితి మీరిన భోగభాగ్యాలతో ధన ధాన్యాలతో విలసిల్లటం. సిరి సంపదలతో తుల తూగు తున్న సంసారాన్ని పూచిన తంగేడు అనిఅంటారు

పూజకు పనికిరాని పువ్వు[మార్చు]

నిరుపయోగమైనదని అర్థం.

పూటకో మాట చెప్పేవాడు[మార్చు]

మాట మీద నిలకడ లేని వాడు: ఉదా:::> వాడు పూటకో మాట చెప్పి పబ్బం గడుపు కుంటున్నాడు.

పూడ్చుకోవటం[మార్చు]

సరిదిద్దుకోవటం .గుంతలు, పల్లాలు ఉన్న మార్గంలో లోతుల్ని పూడ్చి దోవంతా సరిదిద్ది ప్రయాణం సుగమంచేయటం.లోటు పూడ్చుకోవటం

పూత కన్నా రాతమేలు[మార్చు]

పూత అంటే మాట . మాటలు చెప్పిన దానికన్నా లిఖిత పూర్వకంగా ఇచ్చిందే ఏనాటికైనా మేలు అని అని అర్తం. నోటి మాటలు ఎప్పుడైనా, ఎన్నైనా చెప్పొచ్చు. ఇప్పుడని మరికాసేపటికి నేనలేదని తప్పించుకోవచ్చు. కానీ కాగితం మీద రాసి ఉంటే మాత్రం దాని తర్వాత ఎప్పుడైనా రుజువుగా చూపించవచ్చు. ఏ విషయంలోనైనా రుజువులు, సాక్ష్యాలు కావాలన్నప్పుడు నోటి మాటకాదూ ఏదైనా రాసిన కాగితాలుంటే తీసుకురా అని పూత కన్నా రాత మేలు అంటారు.

పూర్వ జన్మ సుకృతం[మార్చు]

అదృష్టం ./ ఉదా:... వానికి అంతా కలిసి వచ్చింది> అదంతా వాని పూర్వ జన్మ సుకృతం.

పూలపాన్పు[మార్చు]

సుఖప్రథమైనది: ఉదా: వాని జీవితమే ఒక పూల పానుపు. చాల సుఖంగా ఉన్నాడు.

పూల వాన కురిసింది[మార్చు]

అన్ని పనులు సక్రమంగా జరిగితే ఈ మాట వాడతారు.

పూల రంగడు[మార్చు]

ఎప్పుడు టింగు రంగా అంటూ సరదాగా తిరిగేవాడని అర్థము

పూస గుచ్చినట్టు[మార్చు]

ఒక వరుసక్రమంలో చెప్పటం . పూసలను దండగా గుచ్చేటప్పుడు ఏ పూస పక్కన ఏది బాగుంటుందో చూసి ఓ పద్ధతి ప్రకారం గుచ్చుతుంటారు. విషయాన్నంతా చక్కగా పూస గుచ్చినట్టు వివరించి చెప్పటం ఉదా: వానికి పూస గుచ్చి నట్లు చెప్పాను వానితో తగువులకు వెళ్లొద్దని. ఇప్పుడు చూడు ఏమయ్యిందో?

పూసుక తిరుగు తున్నారు[మార్చు]

ఉదా: వారిద్దరు రాసుక పూసుక తిరుగు తున్నారు. ( కలిసి మెలిసి వుండడము)

పెట్టినమ్మకే పెద్ద తిప్పలు[మార్చు]

గొప్పగా భోజనాలు పెట్టినా ఇంతేనా అని నసగటం. మేలు చేసినవారు మేలు పొందిన వారి నుంచి మాట పడటం.

పెట్టు శాస్త్రి, పుట్టు శాస్త్రి[మార్చు]

పెడ చెవిన పెట్టాడు[మార్చు]

చెప్పిన మాట వినలేదని అర్థం: ఉదా:>.. వాడు నామాటను పెడ చెవిన పెట్టాడు. ఇప్పుడు చూడు ఏమైందో?

పెడ త్రోవ పట్టించాడు[మార్చు]

వక్ర మార్గం పట్టించాడు: ఉదా: వాడు నన్ను పెడ త్రోవ పట్టించాడు. లేకుంటే ఈ పని ఎప్పుడో అయిపోయేది.

పెడితే పెళ్ళి.. పెట్టకపోతే తద్దినం[మార్చు]

తన స్వార్థం కోసం సమయానుకూలంగా ప్రవర్తిస్తూ ఎదుటి వారిని స్తుతించటం లేదా నిందించటం.

పెదవి దాటటం[మార్చు]

మనసులోని మాట బహిర్గతం కావటం . అంతర్గత ఆలోచనలు బయటకు రావటాన్ని పెదవి దాటటం అంటారు

పెదాలవలపాటి బేరం[మార్చు]

పెద్దగొడ్డలి నొక్కు పోయినట్టు[మార్చు]

నాయకుడు లేదా అధినేత కష్టాలపాలై అతడి అనుచరులు ముందుకు సాగలేని స్థితి. పెద్దగొడ్డలితో ముందు చెట్టుకు గాటుపెట్టి ఆ తర్వాత చిన్నగొడ్డళ్ళతో ఆ గాటును పెద్దది చేస్తూ చెట్టు నరకుతారు. పెద్దగొడ్డలినొక్కు పడిపోయి నిరుపయోగమైతే చిన్న గొడ్డళ్ళున్నా పెద్దగొడ్డలి చేసే పనిని అవి చేయలేవు.

పెద్ద చెప్పొచ్చాడు.....[మార్చు]

ఉదా: పనంతా అయి పోయాక ఇప్పుడు పెద్ద చెప్పొచ్చాడు?

పెదగంగ ఉదకం[మార్చు]

పెద గంగోదకం[మార్చు]

ఉన్నది అని చెప్పటమేగానీ ఎప్పుడూ ఎవరూ చూడనిది, ఎవరి అనుభవంలోనికి రానిది. పెదగంగ అంటే ఆకాశగంగ అని అర్థం. అది స్వర్గలోకంలో ఉంటుంది అని చెబుతారు. భూమ్మీద మరణించి స్వర్గానికి వెళ్ళిన పుణ్యాత్ములు, దేవతలు ఆ ఆకాశగంగలో స్నానం చేస్తారట. ఆ నదిలో బంగారం తామర పువ్వులు ఉంటాయని కూడా అంటారు. ఆకాశంలో కనిపించే పాలపుంతే ఆ పెదగంగ, లేదా ఆకాశగంగ అని కూడా చెబుతుంటారు. నిజంగా ఆ ఆకాశగంగలో నీళ్ళున్నాయా? బంగారు పద్మాలున్నాయా? అని తేల్చి చెప్పిన వారు, నిరూపించిన వారు ఎవరూ లేరు. ఏదైనా ఓ విషయం జరిగింది అని చెప్పటానికి రుజువులు, సాక్ష్యాలు ఏవీ లేకపోయినా, అది జరిగింది అని చెప్పటం, అదేదో ఉంది అని అనటం అవును కాదు అని నిగ్గు తేల్చటం ఎవరి వల్లా కాదు.

పెద్ద తలకాయ[మార్చు]

జ్ఞానంలో పెద్దవారు . పెద్దమనిషి, పెద్

పెద్దన్నయ్య పోకడ[మార్చు]

చిన్నవారిని తరచూ విసుక్కోవటం, లెక్క చేయకపోవటం. కుటుంబంలో సంతానంలో పెద్దవాడైన వ్యక్తి తన తర్వాత పుట్టిన తమ్ముళ్ళు, చెల్లెళ్ళలాంటి వారిని అదుపు చేయటానికి ప్రయత్నిస్తుంటాడు. చిన్నవారేదైనా చెప్ప బోతుంటే వారికేమీ తెలియదని, తనకే అంతా తెలుసునని వాదించి కూర్చోబెడుతుంటారు. కొందరు అధికారులు తమ కిందిస్థాయి ఉద్యోగులు ఏది చెప్పబోతున్నా వినిపించుకోకుండా, లెక్క చేయకుండా కూర్చోమంటుంటారు. అలాంటి వారిది పెద్దన్నయ్య పోకడ అంటారు.

పెద్దన్న పాత్ర[మార్చు]

పెద్దరికం . తండ్రి తరువాత పెద్ద కుమారుడు (పెద్దన్న) కు మళ్ళీ అంతటి స్థానం . ప్రముఖమైన పాత్ర అని అర్థం: ఉ: .. ఇతడు ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు.

పెద్దపులి చూపు[మార్చు]

పెద్దపులి కేవలం తన కంటికెదురుగా ఉండే వాటిని మాత్రమే చూడగలదు. అటు పక్క, ఇటు పక్క ఏం జరుగుతున్నా అది గమనించలేదు. అదే తీరులో కొంతమంది తమ కళ్ళెదుట జరుగుతున్న విషయాల్ని తప్ప, వాటికి సంబంధించిన ఇతర విషయాల్ని గ్రహించే స్థితిలో ఉండరు.

పెదబావగారి లెక్క[మార్చు]

పెదరావూరు ఖాతా[మార్చు]

పెద్దపీట[మార్చు]

ప్రముఖ స్థానం అగ్రాసనం, అగ్రతాంబూలం

పెద్దపులి చూపు[మార్చు]

పెద్దపులి పాలు[మార్చు]

అసాద్యమైన విషయమని అర్థము. పెద్ద పులి పాలు తేవడం అసాద్యం గనుక. అసాద్యమైన ప గురించి చెప్పాలంటే ఈ సామెతను ఉపయోగిస్తారు.

పెడదారి పట్టించడం[మార్చు]

దురవగాహన కలిగించడం; ఉదా: వాడొచ్చి ఈ విషయాన్ని పెడదారి పట్టించాడు./

పేగు మెలిక[మార్చు]

పెన్నేరుగడ్డ[మార్చు]

శక్తి మంతమైంది, శక్తినిచ్చేది, శ్రేష్ఠమైనది.పెన్నేరు అంటే అశ్వగంధం. దీన్ని ఒంట్లో బలం చేకూరేందుకు చూర్ణంగా వాడతారు.

పెళ్ళి నడకలు[మార్చు]

పెళ్ళి వారు చాల నిదానంగా నడుస్తారు. అలా నడిచే వారినుద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు.

పేనుకు పెత్తన మిచ్చినట్టుంది[మార్చు]

వివరణ:... "పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగి పెట్టిందట. ఇది ఒక సామెత. అల్పునకు అధికారం ఇవ్వకూడదు అనే సందేశం ఇందులో వున్నది. (కొన్ని సామెతలలో సగ భాగాన్ని మాత్రమే వాడు తుంటారు. అలాంటివి జాతీయాలు " . ఈ ప్రయోగం అన్ని సందర్భాలలో కుదరదు. అరుదుగా కొన్ని సామెతలలో కొంత భాగం జాతీయాలుగా వాడ బడు తుంటాయి)

పెయిల బుగులు ఇంటెనుకిద్దరు[మార్చు]

పైకి భయం నటిస్తూ ఎదుటివారిని మోసం చేసి తమ పని తాము చేసుకువెళ్ళే మోసకారితనం. పెయి అంటే శరీరం . గుబులు లేదా బుగులు అంటే భయం అని అర్థం. శరీరం అంతా భయకంపితమవుతున్న స్థితిని పెయిబుగులు అని అంటారు. ఓ రంకులాడి తన భర్తను చూసి విపరీతంగా భయం నటిస్తూ ఉండేదట. ఆ భర్త అంటే ఆమెకు అమ్మో ఎంత భయమోనని అందరూ అనుకుంటూ ఉండేవారట. అలా భయపడుతున్నట్టు నటిస్తూ ఇద్దరు మగవారిని ఇంటి వెనుకకు రమ్మని సైగ చేస్తూ వారితో ఆనందించేదట.

పెరుగుకన్నా గురిగి ముద్దు[మార్చు]

ఎంతో ఆత్మీయత, అనుబంధం ఉంది. పెరుగు వ్యాపారం చేసేవారి దగ్గర పెరుగును కొలిచి అమ్మేందుకు కొలమానంగా ఒక గురిగి (మట్టిపాత్ర) ఉండేది. పెరుగు వ్యాపారం చేసే సందర్భాలలో ఒక్కోసారి అజాగ్రత్తగానో, మరొకలాగానో పెరుగుతో నిండిన గురిగి కిందపడి పగలటం జరుగుతుండేది. అలా పగిలినప్పుడు పెరుగు పోయినందుకు కాదు కానీ, ఎంతోకాలంగా అలవాటై తనది అనుకున్న గురిగి పగిలిపోయినందుకు పెరుగు అమ్మేవారు బాధ పడుతుండేవారు. ఆ గురిగి చాలా కాలం నుండి తన దగ్గరే ఉన్నందువల్ల, వ్యాపారానికి ఉపకరించినందు వల్ల దానిమీద ఒక మమకారం ఏర్పడి ఉంటుంది. దాంతో గురిగి పగిలిపోయినందుకు ఎంతగానో మనసులో బాధ కలుగుతుంది.

పెరుగులో రాయిలా[మార్చు]

ఏ విషయాన్నైనా చక్కగా అస్వాదిస్తున్నప్పుడు మధ్యలో కలిగే అవాంతరం.పని సక్రమంగా జరుగుతున్నప్పుడు మధ్యలో ఎవరైనా వచ్చి ఆ పనిని చెడగొట్టడం.చాలా రుచిగా ఉన్న పెరుగును ఇష్టపడి తింటున్నప్పుడు దానిలో ఓ రాయితగిలితే ఎలా ఉంటుందో అలా.

ఇష్టం లేదని/ అబద్దమని అర్థం: అన్నంలోనో కూరల్లోనొ వచ్చినట్లు పెరుగులో రాళ్లు రావు. అలా అన్నాడంటే వడ్డించే వారిమీద ఇష్టంలేదని లేదా అబద్ధం చెపుతున్నడని అర్థం.

పేకమేడలు[మార్చు]

అత్యంత అస్థిరాలు ఏమాత్రం కొద్దిపాటి గాలి వీచినా అది కూలిపోయే స్థిరంగా లేని విషయాలు

పేగు[మార్చు]

సంతతి, సంతానం. పేగుబంధం = సంతానం అనుబంధం రక్తసంబంధ అని అర్తం.

పేగులు మెలి వేసినట్లుంది[మార్చు]

చాల బాధగా వున్నదని అర్థం.. ఉదా: వాని మాటలు వింటుంటే నాకు పేగులు మెలివేసి నట్లుంది. అని అంటుంటారు.

పేగు చుట్టం[మార్చు]

రక్తసంబంధం పేగుబంధం అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు లాంటి అత్యంత సన్నిహిత బంధువులు .దూరపు చుట్టాలైతే మనస్పర్థలు వస్తే చాలా సందర్భాలలో మళ్ళీ కలవటం అనేది ఉండదు. కానీ సోదరులైతే ఓసారి తగాదా పడ్డా మళ్ళీ ఏదో ఓ సందర్భంలో కలిసిపోతూ ఉంటారని.

పేగుబంధం[మార్చు]

సంతానం అనుబంధం రక్తసంబంధం, పేగు సంబంధం

పేడు ముదరటం[మార్చు]

పటుత్వాన్ని సంతరించుకోవటం, యౌవన దశకు రావటం

పేదరాశి పెద్దమ్మ[మార్చు]

పేనుకుక్కిన పాటి[మార్చు]

తలలో వున్న పెనును తీసి రెండు బొటన వ్రేళ్ళ గోరుల మధ్యన వుంచి నొక్కుతారు. అలా చేయడాన్ని కుక్కడం .... పేను కుక్కడము అని అంటారు. దానికి పట్టే సమయం అతి స్వల్పము. అలా అతి స్వల్పమైన కాలాన్ని చెప్పడానికి ఈ జాతీయాన్ని వాడుతారు. ఇదే అర్థంలో మరొక జాతీయం ఉంది. వక్కకొరికినంతలో. అనగా వక్క కొరకడానికి అతి స్వల్ప సమయము పడుతుంది. ఉదా: వక్కకొరికినంతలో వచ్చేస్తా... అని అంటారు. ఈ జాతీయము రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ వాడుకలో ఉంది. ఇలా అతి తక్కువ సమయాన్ని సూచించడానికి ఈ జాతీయాన్ని వాడుతారు.

పేల పిండి వడియాలు[మార్చు]

చాలా తేలికైన విషయాలు అసలు లెక్క చేయాల్సిన అవసరమేలేని విషయాలు

ప్రేత కళ వచ్చేసింది[మార్చు]

చావుకు దగ్గరలో వున్నాడు అని అర్థం: ఉదా:>.. అతని ముఖంలో ప్రేత కళ వచ్చేసింది.... ఇక లాభం లేదు. బంధువులకు కబురు పంపండి.

పేరిగాడిరాజ్యం[మార్చు]

పేరిగాడిసంగీతం[మార్చు]

పైఎత్తున[మార్చు]

ఒకరు చేసే పనికి వూతంగా ఉంటూ ప్రోత్సాహాన్నిస్తూ ఉండటం. పర్యవేక్షణ, పరిశీలన, దిశానిర్దేశం . జ్ఞానంలోనూ, అనుభవంలోనూ అధికులైన వారు జరగాల్సిన పనిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉండటమే పైఎత్తున ఉండటం

పైచేయి[మార్చు]

ఆధిక్యం ఉదా: ఆటలో ఈ జట్టు పై చేయి సాధించింది.

పైన పటారం, లోన లొటారం[మార్చు]

లోన విషయం ఏమి లేకున్నా పైకి డాంబికంగా కనబడటానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. వారిని ఉద్దేసించి ఈ జాతీయాన్ని వాడుతారు.

పై ప్రాణాలు పైనే పోయాయి[మార్చు]

చాల భయమేసిందని అర్థం: ఉదా: జూ పార్కులో పులి బోను వద్ద నిలబడ్డాను. ఉన్నట్టుండి పులి గాండ్రించింది. నాకు పైప్రాణాలు పైనే పోయి నంత పనైంది.

పైలా పచ్చీసులా తిరుగు తున్నాడు[మార్చు]

ఉదా: వాడు పని పాట లేకుండా పైలా పచ్చీసు లాగ తిరుగు తున్నాడు.

పైవాడు పిలిచాడు[మార్చు]

చావుకు దగ్గరలో వున్నాడని అర్థం:

ప్రసవవేదన[మార్చు]

అత్యంత కష్టసాధ్యమైన పని. ఉ: వీడు ఈ చిన్న పని చేయడానికి ప్రసవ వేధన పడు తున్నాడు.

పైలా పచ్చీస్[మార్చు]

పైలా అనేది పెహ్లో అనే ఉర్దూ పదం. పెహ్లా నుంచి పైలాగా మారిన పదానికి అర్థం మొదటిది, ముందుగా ఉన్నది అని.పచ్చీస్ అంటే ఇరవై అయిదు అని అర్థం. అంటే పాతికేళ్ళ నిండు యౌవన వయస్సు అనే అర్థం

పొగచూరడం[మార్చు]

నాణ్యత తగ్గడం, స్థాయి దిగజారడం

పొగడ్త అగడ్తే[మార్చు]

పొగుడుతున్నారు కదా ఇక మనమేమీ చేయకపోయినా ఫర్వాలేదని, గర్విస్తే జీవితంలో వృద్ధి చెందలేరు.అగడ్తలో పడితే బతికేపని ఉండదు. పొగడ్తలు కూడా అగడ్తలతో సమానమైనవని హెచ్చరిక

పొట్టకు..బట్టకు[మార్చు]

ఎదుగుదల లేని జీవితం, అభివృద్ధిలేని బతుకు .ఏ మాత్రం కొద్దిగా కూడా పొదుపు చేసుకోవటానికి వీలు లేకుండా ఆ పూటకు తినటానికి, ఆ రోజుకు కట్టుకోవటానికి కావాల్సినంత తిండి, బట్ట మాత్రమే దొరికే వారిని గురించి ఈ జాతీయం

పొట్ట కోస్తే అక్షరం ముక్క లేదు[మార్చు]

అస్సలు చదువు రాదు అనే ప్రయోగంలో ఉపయోగిస్తారు.

పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వాడు[మార్చు]

చాల ఎక్కువగా నవ్వాడు: ఉదా:... ఏందిరా సంగతి, పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వు తుండావు?

పొట్ట చేత్తో పట్టుకొని వచ్చారు[మార్చు]

బ్రతుకు తెరువుకొరకు వచ్చారు అని అర్థం: ఉదా: వీరు వూరుకాని వూరికి పొట్ట చేత్తో పట్టుకొని పని కోసం వచ్చారు. ఏదైనా పని కల్పిద్దాం వారికి.

పొట్టలు నింపుకోవటం[మార్చు]

ఎవరి స్వార్ధం వారు చూసుకోవటం..ఈ నాయకులు వారి పొట్టలు నింపుకోవటం తప్ప ప్రజల కోసం ఆలోచించటం లేదు అంటారు.

పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు[మార్చు]

చదువు రాని వాడని అర్థం: ఉదా: వానికి పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు. ఎలా బతుకుతాడో ఏమో ?

పొడుచుకు రావటం[మార్చు]

వెలువడటం, బహిర్గతం కావటం. అంతర్గతంగా ఉన్నది బహిర్గతమై స్పష్టంగా ఎదుటివారికి కనిపించటం.'వాడిని అంటే నీకెందుకు అంత పొడుచుకొచ్చింది' అంటారు.

పొత్తుల పని[మార్చు]

పరిష్కారానికి వీలున్నా ఎవరూ పట్టించుకోని సమస్యలు.ఉమ్మడి మీద చేయాల్సిన పని. ఒకరి మీద ఒకరు వంతులేసుకుంటూ మీరు చేయండి మేమెందుకు చేయాలి.. అని అనుకొంటూ చిన్న పనైనా దాన్ని చక్కదిద్దకుండా కాలక్షేపం చేస్తూంటారు

పొత్తులపని సుఖం[మార్చు]

పొత్తుల పని అని అంటే వేరొకరితో కలిసి ఏదైనా పనిని సాధించేందుకు సిద్ధం కావటం. ఒకరే ఏ పనినైనా చేయాలంటే కార్యభారం ఎక్కువై ఇబ్బంది కలగవచ్చు. అదే పనిని పది మందితో పొత్తు పెట్టుకొని చేస్తే సుఖంగా ఉంటుంది.అందుకే 'పొత్తుల పని సుఖం, ఒంటిగా తిండి సుఖం అంటారు

పొదుగుడు కోడి[మార్చు]

ఎప్పుడూ నిద్రలో జోగుతూ బద్ధకంగా ఉన్నట్టు కనిపించటం

పొద్దునదాకా దోచినట్టు[మార్చు]

తెలివి తక్కువతనం, అత్యాశ, ఉదయాన అందరూ మేల్కొనే దాకా దొంగతనం చేస్తూ పట్టుబడటం, అత్యాశకుపోయి అవస్థల పాలవటం

పొద్దు పోవడం కష్టంగా వున్నది[మార్చు]

బ్రతుకు భారంగా వున్నదని అర్థం: ఉదా: ఈ చాలి చాలని సంపాదనతో నాకు పొద్దు పోవడము కష్టంగా ఉంది.

పొన్నుంచి పొడు దాకా[మార్చు]

పొన్ను అంటే రోకలి పొన్ను, పొడు అంటే పొన్ను దగ్గరి నుంచి పైకి ఉండే పొడవాటి కర్ర భాగం .ఆది నుంచి అంతం దాకా అని.

పొయిలుప్పు పోసుకున్నట్టు[మార్చు]

పొయ్యిలో ఉప్పు పోసుకున్నట్లు, మండుతున్న పొయ్యిలో ఉప్పు వేస్తే వచ్చే చిటపటలు. బహిర్గత కోపాతాపాలకు, పోట్లాటలకు, తగాదాలకు ఎదురుపడి పెద్ద పెద్దగా తిట్టుకోవటం, అరుచుకోవటం

పొయ్యి వూదేపని[మార్చు]

చిచ్చురేపే ప్రయత్నం

పొయ్యి రాజుకోవటం[మార్చు]

పొయ్యి రాజేసి వూది మంట చేయటం

పొయ్యిలో పిల్లి లేవలేదు[మార్చు]

వంట చేయ లేదు అని అర్థం: వివరణ: పల్లెల్లో కట్టెల పొయ్యితో వంట చేసుకునే వారు. రాత్రులందు పొయ్యి చల్లారిన తర్వాత, వెచ్చగా వుంటుందని ఆ ఇంటి వారి పిల్లి పొయ్యిలో దూరి ఆ బూడిదలో నిద్ర పోతుండేది. అలా పొయ్యిలో పిల్లి లేవలేదంటే ఆ రోజువంట చేయ లేదని అర్థం.

పొరుగూరి వ్యవసాయం[మార్చు]

ఉండేదొకచోట, ఉద్యోగం మరోచోట చెయ్యటం, చాలా కష్టమైన పని.సమయం అంతా రాకపోకలకే సరిపోతుంటుంది.

పొల్లు కట్ట దంచటం[మార్చు]

పసలేని మాట చెప్పటం . ధాన్యాన్ని నూర్చిన తర్వాత మిగిలే కట్టలే పొల్లు కట్టలు. ఆ పొల్లు కట్టలను కొట్టడం, దంచటం లేదా నూర్చటం లాంటివి ఏం చేసినా ధాన్యం రాలటం జరగదు.

పొల్లు దంచి బియ్యం చేసినట్టు[మార్చు]

అసాధ్యమైన పని . పొల్లును ఎంత దంచినా బియ్యపు గింజలు రావు. వూకదంపుడు

పొలోమని వచ్చారు[మార్చు]

అంతా ఒక్కసారిగా వచ్చారని అర్థం: ఉదా:... చెరువు కొళ్ల బోయిందని తెలవగానె ఊరి వారందరూ పొలోమని వచ్చారు.

పోకిరి మనుషులు/ పోకిరి పనులు[మార్చు]

చిల్లర మల్లర గాళ్లు, దుండగులు....

పోగొట్టుకున్న చోటనే వెదకాలి[మార్చు]

అనగా ఏ పనిలో నష్టపోయామో ఆ పనిలోనె సంపాదించాలని అర్థం. ఆ విషయం మనకు తెలిసిన విద్య. తెలియని కొత్త విద్యలో ప్రారంబిస్తే అంత అనుకూలంగా వుండదు గాన పాత విద్యలోనె ప్రయత్నం చేయడం సులభం గాన అందులోనె ప్రయత్నం చేయమని సలహా.. ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.

పోటు మీద ఉండటం[మార్చు]

బాగా ఉత్సాహంగా ఉండటం, బాగా అభివృద్థిలో ఉండటం . పౌర్ణమి లాంటి రోజుల్లో సముద్రం బాగా పొంగుతుంటుంది. అలలు ఉవ్వెత్తున లేస్తుంటాయి. ఈ పొంగునే పోటు అంటారు.

పోతె కొడవలి ఉంటే లిక్కి[మార్చు]

వివరణ: లిక్కి అనగా .... ఒక కొడవలి దాని కక్కు అరిగి పోతున్న కొద్ది కొత్త కక్కు వేయిస్తుంటారు. కొంత కాలానికి అది చిన్న కొడవలిగా తయారవు తుంది. ఆ చిన్న కొడవలిని లిక్కి అంటారు. ఇజ రైతు తన లిక్కిని ఇంకొకనికి బదులిచ్చాడు. తీసుకున్న వాడు దాన్నెక్కడో పడేశాడు. ఇచ్చిన రైతు నేనిచ్చింది కొడవలి దాన్నె ఇమ్మంటాడు. ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు.

పోయింది పొల్లు ఉన్నది గట్టి[మార్చు]

మన చేతి నుంచి దాటిపోయిన ఆస్తులు కానీ, అనుభవించాల్సినవి కానీ పొల్లు లాంటివి, మన దగ్గర మిగిలిందే గట్టి విత్తనాలతో సమానం. పోయిన పొల్లు కోసం ఎలా బాధపడమో అలాగే మనం అనుభవించకుండా పోయినవాటి గురించి కూడా

పోయినాక పొద గొట్టినట్టు[మార్చు]

వృథా ప్రయాస, దండగమారి పని .పొదలో కుందేలు ఉన్నప్పుడు వెతికితే లాభం ఉంటుంది కానీ, అది పోయిన తర్వాత పొదను వెతకటమంటే వృథా ప్రయాసే. నక్కపోయినాక బొక్క కొట్టుకున్నట్లు.

పోరాని చోటుకు పోతే రారాని నిందలు[మార్చు]

ఆలోచించకుండా ముందుకు వెళితే లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి

[మార్చు]