Jump to content

జాతీయములు - న

Wikibooks నుండి
భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు



నంగనాచి తుంగబుర్ర

[మార్చు]

నందిని పందిని చేయగల వాడు

[మార్చు]

మహా మాయ గాడని అర్థం: ఉదా: వాడు నందిని పందిని చేయగల సామర్థుడు.

నకరాలు పోవడం

[మార్చు]

నక్కపోయినాక బొక్క కొట్టుకున్నట్లు

[మార్చు]

వృథా ప్రయాస, దండగమారి పని .బొక్కలో నక్క ఉన్నప్పుడు వెతికితే లాభం ఉంటుంది కానీ, అది పోయిన తర్వాత పొదను వెతకటమంటే వృథా ప్రయాసే. పోయినాక పొద గొట్టినట్టు

నక్కజిత్తుల వాడు

[మార్చు]

మహా మోసగాడు: ఉదా: వాడిని నమ్మకండి వాడు నక్క జిత్తుల వాడు.

నక్క తోక తొక్కి వచ్చాడు

[మార్చు]

అదృష్ట వంతుడు: ఉదా: బలే బహుమానం కొట్టేశావురా.... నక్కతోక తొక్కివచ్చావులె.

నక్క వినయం చూపు తున్నాడు

[మార్చు]

అతి వినయం చూపడం; ఉదా: వాడు బలె నక్క వినయం చూపు తున్నాడే.

నక్కను తొక్కటం

[మార్చు]

నకార ప్రయోగం

[మార్చు]

నక్కి నక్కి చూస్తున్నాడు

[మార్చు]

దొంగ తనంగా చూస్తున్నాడు. ఉదా: అటు చూడు వాడు నక్కి నక్కి చూస్తున్నాడు.

నట్టేట ముంచటం

[మార్చు]

నమ్మించి మోసం చేయటం: ఉ;.... వాడు నన్ను నట్టేట ముంచాడు.

నడిచే ఎద్దును పొడిచినట్టు

[మార్చు]

పని సక్రమంగా జరుగుతున్నప్పుడు ఇంకా ఇంకా బాగా జరగాలని తమ ఇష్టం వచ్చినట్టు అధికారం చలాయిస్తూ పని చేసేవారిని ఇబ్బంది పెట్టటం.ఒకటికి పదిసార్లు హెచ్చరిస్తు అసలు పనిచేయటమే మానేసేలా చేయటం.

నడ్డి విరగ్గొట్టడం

[మార్చు]

విపరీతంగా నష్టం కలిగించటం, కోలుకోలేని స్థితికి తీసుకెళ్ళటం

నడి మంత్రపు సిరి

[మార్చు]

మధ్యలో అబ్బిన సంపద అనుకోకుండా వచ్చిన సంపదతో : ఉదా: నడి మంత్రపు సిరితో వాడు విర్ర వీగు తున్నాడు.

నడుమొంగనోడు

[మార్చు]

సోమరిపోతు. వారిని గురించి పుట్టినది ఈ మాట.

నమశ్శమనాయ రకం

[మార్చు]

ఎవరేమనుకున్నా సరే తన పని అయి తీరటమే ముఖ్యం అనుకొనే వ్యక్తి.ఏదో ఓ రకంగా ప్రలోభపెట్టి తమకు కావాల్సిన ఆ పనిని సాధించుకోవటం, యాచించైనా సరే తమ పనిని తాము పూర్తి చేసుకోటం, మరీ దిగజారిపోయి ప్రవర్తించటం. శమనుడు అంటే యముడు . మరణించాక నరకానికి వెళితే యముడు శిక్షిస్తాడు కదా అందుకని బతికి ఉండగా ఇతర దేవుళ్ళకు లాగానే యముడికి కూడా నమస్కారాలు పెట్టే రకం. అభిమానాన్ని చంపుకొని, కాళ్ళు పట్టుకొని అయినా సరే తనకు కావాల్సిన దాన్ని సాధించుకొనే వాడిని 'వాడొట్టి నమశ్శమనాయ రకం. అడిగిన డబ్బులిచ్చే దాకా నిన్నొదిలి పెట్టడు' అంటారు

నమ శ్శమనాయ

[మార్చు]

నరసింహం

[మార్చు]

ఆగ్రహోదగ్రుడు, మహావీరుడు

నరికి పోగులు పెట్టడం

[మార్చు]

విపరీతంగా హింసించటం . వధించిన జంతువు మాంసాన్ని పోగులు పెట్టినట్లు

నలక చుట్ట తాగినట్టు

[మార్చు]

పేదరికం.పొగాకు తోటలో ముందు వరుసలో ఉండే పొగాకులు పెద్దవిగా సారవంతంగా ఉంటాయి. అవి ధర ఎక్కువ పలుకుతుంటాయి. ఆ తర్వాత పంట చివరలో చిన్న చిన్న ఆకులు కూడా వస్తుంటాయి. అయితే అవి అంత నాణ్యంగా ఉండవు. వాటినే నలక ఆకులు, కవుటు పొగాకు అంటారు.చుట్ట తాగే పేద వారు నలక ఆకులతోనే సరిపెట్టుకుంటుంటారు.ఏదో నలక పొగాకు తాగినట్టు డబ్బు లేక నామమాత్రంగా కార్యాలను జరుపుతారు

నలభీమపాకం

[మార్చు]

నలభైకావటం

[మార్చు]

పరాభవం కలగటం . ప్రభవ ... విభవ మొదలగు తెలుగు సంవత్సస్రాలలో నలభయ్యో సంవత్సరం పేరు పరాభవ . పరాబవం అనగా అవమానము అని అర్థము: గుప్తంగా పరాభవము జరిగినది అని చెప్పడానికి ఈ జాతీయాన్ని వాడుతారు.

నల్ల రేగడిలో చల్లినా తెల్ల జొన్నలే పండతాయి

[మార్చు]

నల్లమేక తప్పు

[మార్చు]

నలుగురితో నారాయణ

[మార్చు]

సమాజంలో అందరూ నడుచుకొన్నట్టే మనమూ నడుచుకోవాలని, భిన్నంగా ప్రవర్తించకూడదని అనటం.తనకు నచ్చినా, నచ్చకపోయినా చుట్టూ ఉండే వారి కోసమైనా కొన్ని కొన్ని పనులు చేయాల్సి రావటం.ఆ కాసేపూ నలుగురితో నారాయణ కులంతోపాటు గోవింద మనకెందుకొచ్చిన గొడవ అనుకోవటం నా చేతి మాత్ర వైకుంట యాత్ర: ఇది హాస్వాస్పదంగా చెప్పే మాట. ఆ వైద్యుడు రోగానికి మాత్ర ఇస్తే ఇక అంతె సంగతులు. ఆ రోగి చావడమే ఖాయం: ఆ అర్థంలో ఈ మాట ఉపయోగిస్తారు.

నలుగురు నడిచే దారిలోనె నడవాలి

[మార్చు]

అందరు నడిచే దారినే మనము నడవాలి: పదిమందిని వ్వతిరేకించడం మంచిది కాదని దీనర్థం.

నలుగురింటే నాలుగు లోకాలిన్నట్టు

[మార్చు]

నలుగురు ఒక విషయాన్ని వింటే నాలుగు లోకాలు విన్నట్లే అని అర్థం.

నలుపు నారాయణుడు మెచ్చు ఎరుపు ఎరిముండ మెచ్చు

[మార్చు]

నల్లగా వుండే మనుషులను మెచ్చని వారికి చెప్పె సామెత ఇది. శరీరం రంగు నల్లగా వుండే వారు కొంత న్యూన్యతకు లోనై లోలోన కొంత వరకు బాధపడుతుంటారు. అలాంటి వారిని ఊరడించ దానికి నలుపును నారాయణుడు అనగా శ్రీమన్నారాయణుడు (దేవుడు) మెచ్చునని వూరడింపుగా చెప్పుతూ ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

నల్లేరు మీద నడక

[మార్చు]

అతి సులబమైన పని అని అర్థం: వివరణ:..... బండి నడిచే దారిలో నల్లేరు అడ్డంగా వుంటే బండి నడకకు అడ్డమేమి కాదు. దాన్ని తొక్కు కుంటూ అతి సులభంగా బండి పెళ్ళి పోతుంది.

నల్లేరుపై బండి

[మార్చు]

నవ్వులే నువ్వులవుతాయి

[మార్చు]

సమయం, సందర్భం లేకుండా నవ్వటం ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది.నవ్వు నాలుగు విధాలా చేటు.సమమం, సందర్భం చూసుకోకుండా నవ్వే నవ్వులు ఒక్కోసారి అపార్థాల్ని కలిగిస్తాయి. మొదట నువ్వు హేళన చేశావంటే నువ్వు హేళన చేశావు అని పోట్లాడుకునే వరకు వస్తాయి.

నస పెడుతున్నాడు

[మార్చు]

తన మాటలతో విసిగిస్తున్నాడని అర్థం: ఉదా: వాడు నస పెడుతున్నాడు.

నసీవ నారాయణ

[మార్చు]

నసీవ, నసీబు అంటే అదృష్టం అని అర్ధం.భగవంతుడి మీద భారాన్ని వేసి అదృష్టాన్ని వెతుక్కోవటం.నసీవ నారాయణ అనుకొని ఈ వ్యాపారం మొదలెట్టినా. ఎట్త్లెతే అట్లయితది అంటారు.

నక్షత్రకుడు

[మార్చు]

వదలకుండా వెంటపడి పీడించి ఏడిపించేవాడు .అప్పులవాడు ఉదా: నక్షత్రకుడిలా నావెంట పడ్డావేందిరా?

నాకు ముగ్గురైతే... నీకు ఆరుగురు కదా అన్నట్టు

[మార్చు]

ఒకరి దోషాల్ని మరొకరు ఎత్తిచూపే సందర్భం: ఒకరిమీద మరొకరు నిందలు వేసుకొని తిట్టు కోవడము. నిందా వాచకంగా ఈ జాతీయాన్ని వాడుతారు.

నాగవల్లి నిష్టూరం

[మార్చు]

ఎంత బాగా పనిచేసినా బాగా చేయలేదని అనటం.పెళ్లిలో నాలుగో రోజున జరిగే కార్యక్రమమే నాగవల్లి. మగ పెళ్ళివారు ఆడపెళ్లి వారిని ఆడే నిష్టూరాలు.

నాగులేటు నీళ్ళు

[మార్చు]

నాచు పెట్టటం

[మార్చు]

అప్పు ఎగవేయడము (డబ్బు అప్పుతీసుకొని తిరిగి ఇవ్వక పోతే ఇలా అంటారు)

నాతో పెట్టుకోకు

[మార్చు]

బెదిరించడం: ఉదా: నాతో పెట్టుకోకు అసలే నేను మంచి వాణ్ని గాను/

నాపసాని

[మార్చు]

నాదారి రహదారి

[మార్చు]

ఇది ఒక సినిమా డైలాగ్: "నేను నిఖార్సయిన మనిషినని" చెప్పడం. పొంచి ఉండటం, పొంచేసుకొని కూర్చోవటం. ఎలుకను పట్టడం కోసం పిల్లి, చేపను పట్టడం కోసం కొంగ, జంతువును వేటాడటం కోసం వేటగాడు నాచు పెట్టుకుని కూర్చున్నట్లు

నా మెదడు తినకురా

[మార్చు]

మాటలతొ ఎక్కువగ విసిగిస్తుంటే ఈ మాటంటారు: ఉదా: ఇక వెళ్లరా... నామెదడు తినకురా....

నాయకుడు లేని నాటకం

[మార్చు]

అసంబద్ధంగా, అసంపూర్ణంగా జరిగిన పని వెలితి.

నారాయణ నారాయణ

[మార్చు]

నారదుని వలె మాటలు చెప్పి తప్పించుకొనేవారు.

నారు పోసిన వాడు నీరు పోయడా...

[మార్చు]

దైవాను గ్రహంతో ఎలాగైనా బ్రతక వచ్చు అనే అర్థంతో ఈ మాటను చెప్తారు. దేవుడు తమను పుట్టించాడు..... బ్రతకడం కూడా తనే చూసు కుంటాడు. అని అర్థం.

నాలుకకోస్తా

[మార్చు]

ఇది ఒకనిందా వాచకము: తిట్టు.

నాలుక కరుచుకున్నాడు

[మార్చు]

పొరబాటు గ్రహించాడని అర్థం.

నాలుగాకులు

[మార్చు]

నాలుగు రాళ్లు వెనక వేసుకోవడం

[మార్చు]

ఎంత సంపాదించినా కొంతైనా ధనాన్ని దాచుకోవాలని చెప్పడం. ఇక్కడ నాలుగు రాళ్లు అంటే కొంత ధనం అని అర్థం:

నాలుగు కాయలు

[మార్చు]

నాలుక మడత

[మార్చు]

లేనిపోనివి కల్పించి మాట్లాడటం, అబద్దాలు ఆడటం, మాట మార్చటం

నాలుకల మీద ఆడటం

[మార్చు]

విస్తృత ప్రచారంలో ఉండటం .

నాలుక పొడవు

[మార్చు]

అధికంగా మాట్లాడటం, దూషించటం: ఉదా: వాడి నాలుక చాల పొడవు. చాల ఎక్కువ మాట్లాడ తాడు.

నాంచుడు బేరం

[మార్చు]

తొందరగా ఒక నిర్ణయం తీసుకొలేని వాడు. ఉదా: వాడొట్టి నాంచుడుబేరంగాడు. ఒక పట్టాన ఏవిషయం తేల్చడు.

నామం పెట్టాడు

[మార్చు]

ఎగ్గొట్టాడు: ఉదా: వాడు నేనిచ్చిన అప్పుకు ఎగ నామం పెట్టాడు.

నాలుగు పొద్దుల అంగడి

[మార్చు]

ఇదంతా సర్వసాధారణంగా జరిగేదే అని.అంగడి పగలంతా వచ్చీ పోయేవారితో సందడి సందడిగా ఉంటుంది. రాత్రి అయిన తర్వాత మూతపడి ఆ అంగడి సద్దుమణిగి ఉంటుంది. మళ్ళీ తెల్లవారాక మామూలే. ఈ జీవితం కూడా అంతే. అంగడికి వచ్చే వాళ్ళు వస్తూ పోయేవాళ్ళు పోతూ ఎలా ఉంటారో, మరణించేవారు మరణిస్తుంటే పుట్టి జీవించేవారు జీవిస్తుంటారు. మళ్ళీ వారూ మరణిస్తుంటారు.పోయినోళ్ళకోసం అంతగా బాధపడాల్సిన పనిలేదు.

నాలుగ్గోడల మధ్య

[మార్చు]

పరిమిత ప్రదేశంలో, ఇంటిలో, రహస్యంగా.

నింగినంటడం

[మార్చు]

ఆకాశాన్ని అంటుకోవటమంటే అది అయ్యే పనికాదు. అతిశయోక్తి .ఎంత ఎత్తున కట్టిన భవనమైనా ఆకాశాన్ని తాకటమనేది అతిశయోక్తే అవుతుంది. నింగినంటిన ధరలు అంటే ఆకాశాన్ని ఎవరూ అందుకోలేనట్టే పెరిగిన ఆ ధరలను కూడా ఎవరు అందుకోలేక పోతున్నారని.

నిండుకున్నవి

[మార్చు]

ఏమి మిగల్లేదు

నిజం నిప్పు లాంటిది

[మార్చు]

వివరణ; నిజం అన్నది నిప్పు లాంటిది. అది ఏ నాటికైనా దహించక మానదు. ఆ నిజం తెలుసుకొని ప్రవర్తించాలి .... అనే సందేశం ఇందులో ఉంది.

నిండు చెరువు

[మార్చు]

సమృద్ధిగా ఉండటం, సమయానికి ఆదుకునే శక్తి ఉందన్న నమ్మకం కలిగి ఉండటం . వూళ్ళో చెరువు నిండుగా ఉంటే ఆ చెరువు కింద చాలా పొలం సాగవుతుంది. దాంతో ఆ వూరి జనానికి కరవు భయం ఉండదు.

నిక్కి నీలిగి వచ్చాడు

[మార్చు]

చాల నింపాదిగా వచ్చాడు.

నిజాన్ని సమాధి చేశారు

[మార్చు]

నిజం చెపితే నిష్టూరం

[మార్చు]

నిజం నిప్పు లాంటిది

[మార్చు]

నిజం ఏనాటికైనా బయట పడుతుంది. అది తెలియక ప్రస్తుతానికి దాన్ని దాచి పెడితే ఆ తర్వాత అసలు విషయం బయట పడి ప్రమాదాన్ని సృష్టిస్తుంది. ఆ సందర్భంలో ఈ మాటను ఉపయోగిస్తారు.

నిట్టనిలువునాముంచాడు

[మార్చు]

మోసం చేశాడని అర్థం: ఉదా: వాడు నన్ను నిట్ట నిలువునా ముంచాడు.

నిట్టాడి కూలినట్టు

[మార్చు]

ప్రధానమైన వ్యక్తి మరణించటం. గుడిసెల నట్టనడుమ ఉండే నిలువు స్తంభాన్ని నిట్టాడి నిట్టాడు, నిట్రాడి అంటారు.నిట్టాడి కూలితే మొత్తం గుడిసె కుప్పకూలిపోతుంది.ప్రధానమైన వ్యక్తి మరణిస్తే అతడిని ఆధారంగా చేసుకొని ఉన్న వారంతా అథోగతి పాలై కోలుకోలేని స్థితిలో కుమిలిపోతారు

నిత్య కళ్యాణం పచ్చ తోరణం

[మార్చు]

సంసారంలో సకల కార్యాలు సక్రమంగా జరిగి పోతుంటే ఈ మాట వాడతారు: ఉదా: వాడికేం వాని సంసారం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ఉంది.

నిద్రపుచ్చటం

[మార్చు]

ఏదైనా విషయాన్ని అమలు జరుగకుండా చూడటం, స్తబ్ధంగా ఉంచటం, మాయమాటలు చెప్పి అభివృద్ధిని ఆపేయటం అచేతనావస్థకు తీసుకెళ్ళటం. బబ్బోపెట్టడం

నిద్రపోయినోడి కాళ్లకు మొక్కినట్టు

[మార్చు]

ప్రయోజనం లేని పని. వచ్చిన వాడు తన కాళ్లకు మొక్కాడా లేదా.... తన తప్పును తెలుసుకున్నాడా ఇవేమి గ్రహించని మొక్కి ప్రయోజనమేమి?

నిద్ర లేవటం

[మార్చు]

చైతన్యం పొందటం, ఉద్యుక్తులు కావటం ఉ:.... నిద్ర లేచింది మహిళా లోకం.... (సినీ గేయం.)

నిద్రలేపటం

[మార్చు]

బద్దకంగా పడుకున్నవారిని పనికి లేపటం. (పడుకున్న వారిని నిద్రలేపడం... అనేది సాధారణ అర్థం. కాని జాతీయాలకు మరొక అర్థంవుంటుంది. ఇక్కడ నిద్ర పోతున్న వాడిని నిద్ర లేపడం కాదు. ఒకడికి మంచి సలహా ఇచ్చి కాగల కార్యానికి ఉసి గొల్పడం.)

నిద్రాహారాలు లేకుండా

[మార్చు]

నిద్రకు, తిండికి దూరం కావటం, మనశ్శాంతి లేకుండాపోవటం. నిర్విరామంగా అనే అర్థంలో కూడా ఈ మాటను వాడు తారు: ఉ: వారు నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నారు.

నిపురుకప్పిననిప్పు లాగ

[మార్చు]

పైకి తెలియని, లోలోన మండుతున్న. ఉదా: వాడు తనలో వున్న పగను బయటకు తెలియనీయడు. నిపురు గప్పిన నిప్పు లాంటి వాడు.

నివురు కప్పిన నిప్పు

[మార్చు]

పైకి కనపడని ప్రతీకారం, క్రోధం, పగ . క్రోధాన్నిలోపల దాచుకొని పైకి శాంతంగా కనబడేవారు.. నిప్పు పైబాగాన బూడిద పొర వున్న లోన నిప్పు వుంటుంది. అది గమనించని వారు నిప్పు లేదని అనుకుంటే అది పొరబాటే అవుతుంది. ఆ సందర్భంలో చెప్పినదే ఈ మాట.

నిపురు గప్పిన నిప్పులాగ

[మార్చు]

లోలోన రగులుతున్న కోపం గలవారిని గురించి ఈ మాట అంటారు. (అది ఏనాటికైనా ప్రమాధకరమనే భావన)

నిప్పు కణికలు విసరటం

[మార్చు]

తీవ్రంగా బాధించటం

నిప్పుల కంకర పరచినట్టు

[మార్చు]

కష్టాలతో కూడిన పరిస్థితులు.మేలు చేస్తున్నట్లు కన్పిస్తూ కీడు తలపెట్టటం.నిప్పులకంకర నడక.

నిప్పులతో చెలగాట మాడుతున్నాడు

[మార్చు]

ప్రమాధకరమైన పనిచేస్తున్నాడని అర్థం. పులినోట్లో తల పెట్టాడు. లాంటిదే ఇది కూడాను.

నిప్పులు విసరడం

[మార్చు]

ఎదుటివారి మీద తీవ్రమైన ఆగ్రహాన్ని చూపించటం, నిప్పుకలు విసరమంటే నిప్పుకణికలు విసరటం

నిప్పులు చెరుగు తున్నాడు

[మార్చు]

చాల కోపంగా వున్నాడు అని అర్థం: ఉదా : వాడు నాపై నిప్పులు చెరుగు తున్నాడు. చాల వేడిగా వున్నదని అర్థం: ఉదా: సూర్యుడు ఈ రోజు నిప్పులు చెరుగు తున్నాడు

నిప్పుల కొలిమి

[మార్చు]

అతి వేడి: ఉదా: ఈ ప్రాంతం ఎండలకి నిప్పుల కొలిమిని తలపిస్తుంది.

నిప్పులాంటి వాడు

[మార్చు]

నీతి, నిజాయితీ, న్యాయంగా నిక్కచ్చిగా వ్యవహరించటం, ధర్మాన్ని అనుసరించే పవిత్రులు. ఉదా: వాడు నిప్పులాంతి మనిషి

నిప్పులు కురిపించటం

[మార్చు]

తీవ్రమైన విమర్శలు చేయడం, కోపించటం

నిమ్మకాయ వాటం

[మార్చు]

ఏ పనైనా సులభంగా చేయగలగటం .చేతిలో ఇమిడి పోయేంత నిమ్మకాయను ఎటువైపు కావాలంటే అటు వైపు, ఎలా కావాలనుకుంటే అలా ఎంచక్కా విసిరేయొచ్చు.

నిమ్మకు నీరెత్తినట్టు

[మార్చు]

సావధానంగా: ఉదా: వాడు నిమ్మకు నీరెత్తి నట్టు వస్తున్నాడు.

నిమ్మగడ్డ భానుమూర్తి

[మార్చు]

నిర్ధూమధామం

[మార్చు]

నిలబడటం

[మార్చు]

అండగా ఉండటం సమర్థిస్తూ సంపూర్ణ సహకారాన్ని అందించటం

నిలకడ లేని మనిషి

[మార్చు]

ఓర్పు లేని మనిషి అని అర్థం.

నిలువ నీడ లేదు

[మార్చు]

ఉండడానికి ఇల్లు లేదు: ఉదా: వానికి నిలువ నీడ లేదు. అనాథ అని అర్థం

నిశాచరుడు

[మార్చు]

రాత్రిపూటే మేల్కొని ఉంటూ తిరుగుతుండేవాడు నిండా మునిగి పోయాడు. ఉదా: వాడు అప్పుల్లో నిండా మునిగి పోయాడు./

నిక్షేపరాయడు

[మార్చు]

నీటిమూట

[మార్చు]

నీటిమీద రాత

[మార్చు]

నీడలా వెంటాడుతా

[మార్చు]

ఎల్లప్పుడూ నీవెంటనే వుంటానని చెప్పడం.. ఉదా: నిన్ను నీడలా వెంటాడుతునే వుంటాను.

నీతాడు తెగ

[మార్చు]

నిందా వాచకం; ఒక తిట్టు. ఒక స్రీని తన భర్తను చావమని తిట్టడము

నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

[మార్చు]

నీరులేని పైరు నూనె లేని జట్టు

[మార్చు]

పైరు ఏపుగా పెరిగి పంట పండాలంటే నీరు ఉండాలి. నెత్తిమీది జుట్టు ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే దానికి నూనె రాస్తుండాలి.

నీలిబేరం

[మార్చు]

నీళ్ల కుండ నెత్తిన పెట్టుకుని వున్నది

[మార్చు]

ఏడవ డానికి ఎల్లప్పుడు సిద్దంగా వుంటుందని అర్థం: ఉదా: ఆమె నీళ్ల కుండని నెత్తిన పెట్టుకుని వుంటుంది.

నీళ్ళలాగా

[మార్చు]

అధికంగా, అనాయాసంగా ధనాన్ని ఖర్చు చేయటం. ఉదా:: వాడు డబ్బుని నీళ్లలాగ ఖర్చు చేస్తున్నాడు అని అర్థం.

నీళ్ళు చల్లటము

[మార్చు]

నిరుత్సాహ పర్చ డాన్ని ఈజాతీయం ద్వారా వెల్లడిస్తారు. ఉత్సాహంగా పనిచేస్తున్న వారిపై నీళ్ళు చల్లారు... అని అంటుంటారు. నిజంగా నీళ్ళు చల్లారని కాదు.... వారు ఉత్సాహాన్ని నీరు గార్చారని అర్థం.

నీళ్ళల్ల పంటో నిద్రొచ్చినట్టు

[మార్చు]

సంపూర్ణ సుఖమయ జీవితం. నిద్ర సుఖం ఎరగదు.. ఆకలి రుచి ఎరగదు లాంటిది ఇది. ఏ చీకూచింతా లేకపోతే ఎక్కడ పడుకున్నా నీళ్ళల్లో పడుకున్నా సరే మంచి నిద్ర పడుతుంది అని.

నీళ్ళు నమలటం

[మార్చు]

ఉన్నదేదో చెప్పలేకపోవటం.భావ వ్యక్తీకరణ సరిగా లేకపోవటం, అసమర్థంగా మాట్లాడటం. (అసలు విషయాన్ని చెప్పడానికి సందేహిస్తు మాట్లాడటాన్ని ఇలా అంటారు.)

నీళ్ళు ఒంట పట్టటం

[మార్చు]

స్థానికంగా ఉన్న కొన్ని ప్రత్యేకతలు అలవాటు కావటం. ఆయా ప్రాంతాల్లో లభించే నీరు తాగినందువల్లనే అలాంటి ప్రత్యేక లక్షణాలు అలవడ్డాయన్న భావన. (పైన చెప్పిన అర్థం ఆజాతీయానికి నిజార్థం. కాని జాతీయాలకు నిజార్థం వుండదు. మరొక అర్థం వుంటుంది. అలా వాడక పోతె అది జాతీయం కాదు. సాధారణమే. దీనర్థం.... కొత్తగా ఒక ప్రాంతానికి వచ్చి అతి తెలివి ప్రదర్శిస్తుంటే ఈ మాటను వాడతారు.)

నీ తలకాయ

[మార్చు]

ఇదొక ఊత పదం: కొంత మంది ప్రతి దానికి 'నీతలకాయ ' అని అంటుంటారు.

నీరుగార్చారు

[మార్చు]

అనగా నిరుత్సాహ పర్చారని అర్థము. వారి ఉత్సాహాన్ని నీరు గార్చారు.... అని అంటుంటారు.

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష

[మార్చు]

నువ్వులు, బెల్లం తినటం

[మార్చు]

పొరపొచ్చాలు, విభేదాలు అన్నీ మరిచిపోయి హాయిగా కలిసి పోవటం, భేద భావాలు పోగొట్టుకొని మనస్పర్ధలు మానుకొని అంతా హాయిగా కలసి ఉండటం

నూకలు చెల్లాయి

[మార్చు]

చనిపోయాడని అర్థం: ఉదా:... వాని ఈ భూమి మీద నూకలు చెల్లాయి. చనిపోయాడని అర్థం

నూకితే నూరు జాగల్ల పడ్డట్టు

[మార్చు]

శ్రీనాధుడి రచనల్లో శివుడు మాయ బ్రహ్మచారి రూపంలో వచ్చి ఏవేవో ప్రశ్నలు వేస్తున్నప్పుడు తపోదీక్షలో ఉన్న పార్వతి తన ఆశ్రమంలోని చెలికత్తెలతో ఇతడిని మెడ పట్టి బయటకు నెట్టండి అనే అర్థంలో మెడపెట్టి నూకండన్నది.ఒక్కదెబ్బ కొడితే చాలు నూరు యోజనాలు దూరం పోయి పడతావు అంటారు.

నూజివీడు జమీందారీ

[మార్చు]

నూటికి కోటికి ఒక్కడు

[మార్చు]

చాలా అరుదుగా ఎక్కడో ఎప్పుడో ఎన్నటీకో ఒకటి అన్నట్లు

నూటికి సర్దారు

[మార్చు]

నూతిలో పడ్డ గొర్రె గుంపు

[మార్చు]

వినసొంపుగా లేని హీనస్వరం, హృదయ విదారకంగా వినిపించే గొంతు, బాధాతప్తంగా ఉన్న వారి ఆర్తనాదం.గొర్రె బావిలో పడి ప్రాణభయంతో అరుస్తుంటే హృదయ విదారకంగా ఉంటుంది.

నూలుపోగు

[మార్చు]

వస్త్రం: వాని ఒంటి మీద నూలు పోగు కూడా లేదు.

నెత్తికి ఎక్కించుకోవటం

[మార్చు]

అనవసరంగా ఎవరికైనా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఆ తర్వాత వారి వల్లనే చులకన అయితే అనవసరంగా నెత్తికి ఎక్కించుకున్నవు అంటారు.

నెత్తి నెక్కటం

[మార్చు]

ఒక వ్యక్తిని పూర్తిగా అధీనంలోకి తీసుకోవటం, అదుపులో పెట్టడం, తన ఇష్టం వచ్చినట్టు ఆ వ్యక్తి చేత చేయించటం

నెత్తి మీద నాట్యమాడటం

[మార్చు]

ఒక వ్యక్తి మీద పూర్తిగా ఆధిపత్యాన్ని సాధించటం, నెత్తినెక్కాడు, ఎక్కేశాడు, ఎక్కాడు అనికూడా అంటారు.

నెత్తి మీదకు చేతులు వచ్చాయి

[మార్చు]

అన్ని పోగొట్టు కున్నాడని అర్థం: ఉదా: వానికి నెత్తి మీదకు చేతులు వచ్చాయి.

నెత్తుటి కూడు

[మార్చు]

హత్యలు, దుర్మార్గాల వల్ల లభించే ధనం దానితో ఉపాధి ఉపాది పొందడము. లంచగొండి

నెరజాణ

[మార్చు]

విశేషమైన నేర్పరితనం, సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండటం.

నెల్లూరి నెరజాణ

[మార్చు]

నేతి కుండపై ఎలుక లాగా

[మార్చు]

చాల సంక్లిష్టమైన పరిస్థితి, పగ తీర్చుకోవటానికి వీలుకాని పరిస్థితి.ఏమీ చేయకుండా కోపాన్ని దిగమింగుకొని ఉండిపోవాలి.కొట్టబోతే గర్భవతి, తిట్టబోతే అక్కకూతురు అన్నట్లు.

నేతి బీరకాయ

[మార్చు]

పేరుకు మాత్రమే గొప్ప: నేతి బీరకాలో నెయ్యి వుండదు. ఆ విధంగా పేరుకు మాత్రమే గొప్ప అసలు విషయం ఏమి లేదని అర్థం>.

నేల చూపులు చూస్తున్నాడు

[మార్చు]

సందేహిస్తున్నాడు: ఉదా: ఏదో చెప్పడానికి వచ్చి నేల చూపులు చూస్తున్నావేంది? చెప్పు.

నేర్చినమ్మ ఏడ్చినట్లు

[మార్చు]

అనుభవజ్ఞులు, పెద్దలు తప్పులు చేసినా ఒప్పులేనని సమర్థించుకున్నట్లు. చక్కనమ్మ చిక్కినా అందమే.కరణం పాతరలో పడి కూడా మషాకత్తు చేస్తున్నాను అన్నట్లు

నేల గీతలు గీయటం

[మార్చు]

నేల చూపులు చూడటం.

[మార్చు]

అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తటపటాయిస్తూ ఉండటం, కాలి వేలితో నేల మీద గీతలు గీస్తుండటం

నోచి పుట్టడం

[మార్చు]

గతజన్మలో నోములు నోచినందువల్లనే ఈ జన్మలో మంచి ఐశ్వర్యం సుఖాలు, సౌభాగ్యాలు లభించాయని నమ్మకం.

నోటికి చేతికి సందు లేదు

[మార్చు]

నిర్విరామంగా తినటం. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉండటం.

నోటికి తాళం వేయాలి

[మార్చు]

అతని నొరు మూయించాలని అర్థం. అనవసరంగా ఎక్కువగా మాట్లాడుతున్న వారిని గురించి ఈ మాట వాడతారు.

నోటిమాట

[మార్చు]

రాతపూర్వకంగా లేనిది, అంతగా విలువలేనిది ఎంతవరకు నమ్మకం?

నోటిమాటేగా

[మార్చు]

అంటే ఏం పోతుంది?

నోటిమీద ఉండటం

[మార్చు]

బాగా జ్ఞాపకం ఉండటం నాలుక మీద ఆడటం, నోట్లో ఉండటం

నోటి దురుద తీరిందా

[మార్చు]

ఇది ఒక నిందా వాచకము.

నోటికి చేతికి అలుపే లేదు

[మార్చు]

ఎల్లప్పుడు ఏదో ఒకటి తింటు వుండే వారిని గురించి ఈ మాట పుట్టింది.

నోటి ముత్యాలు రాలి పోతాయా?

[మార్చు]

ఎక్కువగా మాట్లాడని వారిని గూర్చి ఈ మాట అంటారు.

నోట్లో శని వుంది

[మార్చు]

కొంత మందికి అన్ని సక్రమంగా అమరి వున్నా వాటిని అనుభవించే అవకాసమత్రము వుండదు. అటు వంటి వారిని గురించి ఈ జాతీయాన్ని వాడుతారు. తెలుగు నాట దీనికి సమాంతరమైన ఒక సామెత ఉంది. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని వుంది....అని.

నోట్లో ఇప్పకాయ ఉన్నట్లు

[మార్చు]

బాగా అల్లరి అల్లరిగా, వదరు బోతుతనంగా ఎవరైనా మాట్లాడటం ఇప్ప కాయను నోట్లో వేసుకొని నమిలేటప్పుడు ఎక్కువగా చప్పుడు అవుతూ ఉంటుంది. ఇప్పకాయ తింటున్న వ్యక్తికి నోరు తీయగా బాగానే ఉన్నా ఆ చప్పుడు మాత్రం ఎదుటివారికి వినడానికి కటువుగా ఉంటుంది. అలాగే కొంతమంది గోలగోలగా తెగ మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడేవారికి తాము మాట్లాడుతున్నది బాగానే ఉన్నా ఎదుటివారికి మాత్రం వినసొంపుగా ఉండదు.

నోట్లో నాలుక లేని వాడు

[మార్చు]

అమాయకుడు అనిఅర్థం.

నోట్లో పెట్టి నీరు పోయటం

[మార్చు]

ఎంతో ప్రేమగా జాగ్రత్తగా అవసరాలన్నీ సమకూర్చటం. చిన్న పిల్లలకు తల్లి నోట్లో పెట్టిన ఆహారం సులభంగా లోపలికి వెళ్ళేందుకు నీరు కూడా తాగిస్తుంది.

నోట్లో మట్టి కొట్టారు

[మార్చు]

మోసం చేశారు.

నోట్లో మాట నోట్లోనె వుండి పోయిందేం?

[మార్చు]

చెప్పడానికి ఏమి సమాధనము లేదని అర్థం.

నోట్లో వేలేసుకొన్నట్టు

[మార్చు]

అమాయకంగా ఉండటం

నోట్లో వేలు పెట్టినా కొరకడు

[మార్చు]

ఒట్టి అమాయకుడని అర్థం: ఉదా: వాడు నోట్లో వేలు పెట్టినా కొరకడు.

దూషించటం, కోపంగా మాట్లాడటం

నోరారగ పిలుస్తున్నారు

[మార్చు]

ప్రేమగా పిలుస్తున్నారని అర్థం.

నోరుచేసుకోవటం

[మార్చు]

నోరు లేస్తున్నదే

[మార్చు]

అడిగిన దానికి సమాదానము చెప్పబోతే పెద్ద వారు చిన్న వారిని ఇలా అంటుంటారు. అనగా నోరు మూసుకో అని అర్థము.

నోరున్న వాడిదే రాజ్యం

[మార్చు]

ఎదుటివారిని భయపెట్టేది గానో, బెదిరించేదిగానో, వశీకరించుకొనే లాగా వాక్‌శక్తి ఉన్న వాడే సమాజాన్ని శాసించగలడని

నోరుపడిపోను

[మార్చు]

మాట్లాడే శక్తి నశించాలని శపించటం

నోరు పారేసుకోవటం

[మార్చు]

అనవసరంగా దూషించటం. ఉ: అనవసరంగా నోరు పారేసు కోవద్దు.

నోరు బెల్లంగాళ్ళు

[మార్చు]

మాటలు తియ్యతియ్యగా చెబుతూ తమ పనులను మాత్రం చేసుకెళ్ళే మాయగాళ్ళు.ఎదుటి వ్యక్తులకు బాగా ఆశలు కల్పించి వారికి కావాల్సిన పనులు చేసి పెడతామన్న భ్రమ కల్పించి నమ్మకం కుదిరేలా మాట్లాడి వారి పని అయిపోయాక మళ్ళీ కనిపించనివారు.

నోరు మూసుకోమనడం

[మార్చు]

మాట్లాడొద్దని హెచ్చరించడం నోరు "ముయ్యి." అనటం

నోరూరించె మాటలు

[మార్చు]

మంచి మాటలను ఇలా అంటారు.

నోరెళ్ళ బెట్టడం

[మార్చు]

సంభ్రమాశ్చర్యాలకు గురికావటం, చేష్టలుడగటం