Jump to content

జాతీయములు - ఉ

Wikibooks నుండి

- అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి.ఈ అక్షరానికి సంబంధించిన జాతీయాలు కొన్ని వు అక్షరజాబితాలో కూడా కనిపిస్తాయి.

భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆంగ్లభాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్థం - తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా స్థిరపడిపోయిన పదరూపాలే జాతీయాలు. భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును. వేటూరి ప్రభాకర శాస్త్రి, నేదునూరి గంగాధరం, బూదరాజు రాధాకృష్ణ వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు.

ఉంగరాలచేయి

[మార్చు]

ఉట్టిలోగుమ్మడికాయ

[మార్చు]

ఉంటే లిక్కి పోతే కొడవలి

[మార్చు]

రాతకోత లేవీ లేకుండా, మరేసాక్ష్యాలు లేకుండా ఇచ్చిపుచ్చుకోవటాలు.తక్కువ ఇచ్చి ఎక్కువ మొత్తాన్ని దబాయించి తీసుకోటం.కొడవలి అరిగి చిన్నదైనప్పుడు లిక్కి అంటారు. ఓ వ్యక్తి ఓ సారి తన లిక్కిని ఎదుటివారు అడిగినప్పుడు ఇచ్చాడట. ఆ తీసుకొన్న వారు ఆ లిక్కిని ఎక్కడో పారేశారట. అప్పుడు లిక్కి ఇచ్చిన వ్యక్తి ఆ విషయాన్ని తెలుసుకొని తన కొడవలిని తనకు ఇమ్మన్నాడట. అదేమిటయ్యా నువ్విచ్చింది లిక్కి కదా, కొడవలిని అడుగుతావేమిటి అనంటే నేనిచ్చింది కొడవలే అని తగాదాకు దిగితే తీసుకొన్న వ్యక్తి లిక్కి పోయింది కనుక వాస్తవమేమిటో రుజువు చెయ్యలేక కొత్త కొడవలి కొనిచ్చాడట.

ఉడతలు పట్టేవాడు

[మార్చు]

ఉండనా ఊడనా అన్నట్లు

[మార్చు]

ఎప్పుడు రాలిపోతుందో తెలియని బలహీన పరిస్థితి

ఉండనీడనిస్తే పండ మంచం అడిగినట్లు

[మార్చు]

కొద్దిగా సహాయం చేస్తే ఇంకా ఇంకా సహాయం చేయమని వెంబడి పడటం.కష్టాల్లో నుంచి బయటపడ్డ తర్వాత కూడా ఇంకా ఆ చేరదీసిన వారి దగ్గరే ఉంటూ వారికి ఇబ్బందులు కలుగచేయటం. అలాంటి వరినుద్దేశించి ఈ మాటను వాడుతారు.

ఉక్కు పిడికిలి

[మార్చు]

కయ్యానికి సిద్దం.. = గట్టి పట్టుదల గల వాడు.

ఉక్కుపాదం

[మార్చు]

ఉక్కుపాదం మోపడం, తీవ్రంగా అణచివేయటం == పోలీసులు తీవ్రవాదంపై ఉక్కు పాదం మోపారు.

ఉక్కుమనిషి

[మార్చు]

దృఢచిత్తుడు గట్టి పట్టుదలతో ఉండేవాడు

ఉగ్గ బట్టుకొని వున్నాడు

[మార్చు]

అతి బలవంతం మీద కోపం ఆపు కొని వున్నాడు: ఉదా: వానికి కోపం వచ్చింది... కాని ఉగ్గబట్టుకొని ఉన్నాడు.

ఉగ్గుపాల వయసు

[మార్చు]

పసితనం ....చిన్నప్పుడు... అని అర్థం.

ఉచ్చగుంటలో చేపలు పట్టే రకం

[మార్చు]

పరమ నీచుడుడు: ఉదా: వాడు ఉచ్చగుంటలో చేపలు పట్టే రకం.

ఉచ్చ నీచములు

[మార్చు]

గౌరవ, అగౌరవములు == ఉచ్చనీచములు ఎరిగి సరైన వారితో స్నేహం చేయాలి. ఆసందర్భంలో ఈ మాటను వాడుతారు.

ఉచ్చు బిగిస్తున్నది

[మార్చు]

ప్రమాధంలో పడుతున్నాడని అర్థం:

ఉచ్చులోకిలాగటం

[మార్చు]

మోసంచేయాలని చూడటం = పాపం అమాయకుడు. వాడినికూడ ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. అలాంటి వారినుద్దేశించి ఈ మాటను వాడతారు.

ఉట్టిలో పెట్టిన గుమ్మడిలా

[మార్చు]

కదలక, మెదలక పొంకముగా కూర్చొనుట

ఉడకేసుకొని తిని...తడికేసుకొని పడుకున్నట్టు

[మార్చు]

పని ఒత్తిడేమీ లేకుండా సాఫీగా కాలం సాగిపోవటం హాయిగా కావాల్సింది వండుకుని తినటం, చక్కగా నిద్రపోవటం

ఉడ్డకు ముగ్గురు తక్కువ

[మార్చు]

ఉడ్డ అనగా నాలుగు అని అర్థం: లెదా నలుగురు అని అర్థం: కూలీలు ఎంత మంది వచ్చార్రా అని అడిగితే ఉడ్డకు ముగ్గురు తక్కువ" అని జవాబుచెప్పాడు. అనగా ఒకడే వచ్చాడని అర్థం. హాస్యంగా చెప్పడం.

ఉడాయించాడు

[మార్చు]

పారి పోయాడు అని అర్థం.

ఉడుతలు పట్టేవాడు

[మార్చు]

ఏ పనీ చెయ్యనివాడు, సోమరిపోతు అని అర్థం. దీనిని నిందా వాచకంగా కూడ వాడుతారు. అనగా ఎందుకు పనికి రాని వాడని అర్థంలో కూడ వాడతారు.

ఉడుత భక్తి

[మార్చు]

చేతనైన సాయం చేయటం.సేవాభావంతో చేసే చాల చిన్ని సహాయాన్ని ఉడుతాభక్తి అంటారు.

ఉడుము పట్టు

[మార్చు]

పట్టిన పట్టు వదలకపోవటం,మొండిపట్టు ==ఉదా:.. ఈ విషయంలో వాడిది ఉడుము పట్టు. గట్టి పట్టుదల గల వారి గురించి ఈ మాట వాడతారు.

ఉత్తరాషాఢ పూర్వాషాఢ

[మార్చు]

ఉత్తడుఙ్ఙలు

[మార్చు]

ఉతికి ఆరేశారు

[మార్చు]

బాగా చీవాట్లు పెట్టారు; ఉదా: అసెంబ్లీలో ప్రతి పక్షాలు ఎదుటి వారిని ఉతికి ఆరేశారు.

ఉత్సవవిగ్రహం

[మార్చు]

ఉద్దరించిది చాలు

[మార్చు]

చేసినది చాలు ఇక వెళ్లు అని అర్థం>

ఉద్యోగ రాఘవుడు

[మార్చు]

ఉన్నపళంగా వచ్చేయ్

[మార్చు]

వెంటనే వచ్చేయమని అర్థం.

ఉప్పుతో తొమ్మిది

[మార్చు]

ఉప్పు నిప్పు లాగ

[మార్చు]

ఉదా: వారిద్దరు కలిస్తే ఉప్పు నిప్పే: శతృత్వం, చిట పట లాడ తారు. ఆ సందర్భంలొ ఈ మాటను వాడుతారు.

ఉప్పు పిరికి

[మార్చు]

ఉప్పు రాతికి కొరగాడు

[మార్చు]

పూర్తిగా నిరుపయోమైన వాడని అర్థం. ఉదా: వాడు ఉప్పు రాతికికూడ కొరగాడు. అలాంటి వారిని గురించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

ఉప్పు రాతి పని లేదు

[మార్చు]

పనేమి లేదని అర్థం ; ఉదాహరణకు ఒక సామెత వున్నది. ఉప్పురాతి పనిలేదు అరగడి తీరిక లేదు... ఇది ఒక సామెత.

ఉప్పు పాతర వేయిస్తా

[మార్చు]

పెద్ద శిక్ష వేస్తానని బెదిరించడం.

ఉమ్మయ జగ్గాయలు

[మార్చు]

ఉవాచ

[మార్చు]

ఉసి గొల్పడం

[మార్చు]

ఉదా: నిన్ను వానిపైకి ఉసి గొల్పుతున్నారు జాగ్రత్త.

ఉండ బట్టలేని వాడు

[మార్చు]

ఊరికే వుండకుండా ఏదో ఒక పని చేసి చిన్న చిన్న కష్టాలను కొని తెచ్చుకొనే వారిని గురించి ఈ మాటను వడతారు.

ఉడుము వచ్చినట్లు

[మార్చు]

ఉడుము గుడ్లగూబ ఇంట్లోకి వస్తే అశుభం అని మూఢనమ్మకం. ఆసూయపరులు, దుర్మార్గులు ఇళ్ళలోకి రావటం అసలు అశుభం

ఉత్తర కుమారుడు

[మార్చు]

గొప్పలు చెప్పేవారు.బడాయిపోయేవారు.ప్రేయసీ ప్రియుల నడుమ ఉత్తరాలందిస్తూ వారి ప్రేమ పెరగటానికి సహకరించేవాడు ఉత్తరాన్ని రహస్యంగా తీసుకెళ్ళి ఇచ్చేవాడు

ఉత్తరకుమారుని ప్రజ్ఞలు

[మార్చు]

పిరికివాని ప్రగల్భాలు. == వాని మాటలు వట్టి ఉత్తరకుమార ప్రగల్బాలు.

ఉత్సవ విగ్రహాలు

[మార్చు]

ఉత్తుత్తి విగ్రహాలు.అసలు విగ్రహాలు వేరే.బ్రహ్మోత్సవాల్లో గర్భగుడిలోని మూలవిరాట్టుకు బదులుగా వూరేగింపునకు వచ్చిన విగ్రహాలు. ఉదా:వాడొట్టి ఉత్సవ విగ్రహం.... ఉత్సవ విగ్రహాన్ని కేవలం ఊరేగింపుకు మాత్రమె వాడతారు. పూజాదులకు మాత్రం. గర్బగుడిలోని మూల విగ్రహానికె.

ఉన్నది గట్టి పోయింది పొట్టు

[మార్చు]

ధాన్యాన్ని చెరిగితే పొట్టు, పొల్లు ఎగిరిపోయి గట్టి గింజలు మాత్రం మిగులుతాయి. పోయిన వస్తువులు పొట్టుతో సమానమని అనుకోవాలి.

ఉన్న బలిమి

[మార్చు]

సంపదతో బలవంతులు,ధనవంతులు.

ఉప్పు పత్రి

[మార్చు]

అడ్డు అదుపు లేని నోరు గురించి దీనిని వాడతారు

ఉప్పుడు పెట్టడం

[మార్చు]

లోలోపల మధన పడేలా బాధపెట్టడం

ఉప్పు తిను

[మార్చు]

"మీ ఉప్పు తిన్న విశ్వాసం" అంటరు చూడండి ఆ సందర్భంలో ఈ మాటను వాడతారు.

ఉబ్బేయటం

[మార్చు]

పొగిడి సంతోషపెట్టటం,ఉబకెయ్యటం,విపరీతంగా పొగడటం == వాడు నిన్ను బాక ఉబ్బేస్తున్నాడు.

ఉమ్మాయ్‌ జగ్గాయ్‌

[మార్చు]

ఇద్దరు మిత్రులు.అనుకొన్న పని చేయటానికి కలిసికట్టుగా తిరుగుతారు,పని అయిపోయాక ఎవరి దారి వారిదే.ఉమామహేశ్వరుడు, జగన్నాథుడు అనే పదాల నుంచి ఉమ్మాయ్‌ జగ్గాయ్‌ అనే పదాలొచ్చాయి. శివుడు, విష్ణువు రాక్షసుల నుంచి ఒకరినొకరు రక్షించుకోవటానికి ఒకటౌతారు ఆ తర్వాత ఎవరి తీరున వారు ఉండిపోతారు.

ఉయ్యాలో జంపాలో

[మార్చు]

చిన్న పిల్లలను ఆడిస్తూ పాటపాడుతూ ఉయ్యాలలో ఊపుతూ నిద్రపుచ్చటం

ఉరమటం

[మార్చు]

కోపంతో గట్టిగా అరవటం == వాడు నీమీదెందుకు అలా ఉరుముతున్నాడు.?

ఉరి పెట్టడం

[మార్చు]

బాధ పెట్టడం ఉరి తీసినా, తీయక పోయినా అంతటి బాధను అనుభవించి కుమిలి పోయేలా చేయటం

ఉరుకులు పరుగుల మీద

[మార్చు]

అత్యంత శీఘ్రంగా వేగంగా == వారంతా ఉరుకులు పరుగులు మీద వచ్చారు.

ఉల్లము పల్లవించు

[మార్చు]

హృదయము పల్లవించు ,హృదయము చిగురించు

ఉవాచ

[మార్చు]

చెప్పాడు, చెప్పింది, ఒకరు చెప్పిన మాట, ఒకరి మాటల్లోని భావం: భగవద్గీతలో శ్రీ కృష్ణ ఉవాచ.... " అనే మాటను ఇక్కడ ఉపయోగిస్తారు.

ఉసూరుమను

[మార్చు]

నిరాశ చెందటం. == ఉదా: వారు వెళ్లిన పని కాక పోయె సరికి 'ఉసూరు మంటు' తిరిగి వచ్చారు. వెళ్లిన పని కాకుండ తిరిగి వచ్చిన వారి గురించి ఈ మాటను వాడతారు.

ఉస్సురను

[మార్చు]

బాగా పనిచేసి అలసినవారు బడలిక తీర్చుకోటానికి చేసే నిట్టూర్పు