Jump to content

జాతీయములు - గ

Wikibooks నుండి
(జాతీయములు - గ, ఘ నుండి మళ్ళించబడింది)
భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు



గంగి గోవు

[మార్చు]

చాల మంచి వాడని అర్థం.

గం.భా.స.

[మార్చు]

గంగాభాగీరధీ సమానురాలైన.వితంతువులకు గౌరవపూర్వకంగా సూచించేందుకు వాడుతుండేవారు. భర్త మరణించిన స్త్రీ కదా అని చులకనగా చూడకుండా గంగ అంతటి పవిత్రురాలుగా భావించేవారు.[గంగాభాగీరథీ సమానురాలు ]

గంట వాయించు

[మార్చు]

గంటవాయించు అనే జాతీయాన్ని మరిచిపోయాడు, లేదా మోసగించాడు అనే సందర్భాలలో వాడతారు. దేవుడికి గంటవాయిస్తూ నైవేద్యం పెడతారు. ఆయన ఎటూ ఆరగించడు. పేరుకు భగవంతుడికి నైవేద్యమే కానీ ఆరగించేవారు భక్తులే.అనవసర ఆర్భాటం చేసి అసత్య ప్రమాణాలు చేసేవారిని గంటవాయించడం అనే జాతీయంతో పోల్చుతారు.

గండం గడిచింది

[మార్చు]

కష్టాలు తొలిగాయాయని అర్థం. ఆ సందర్భంలో ఈ మాటను వాడతారు

గండగత్తెర (పని)

[మార్చు]

గండభేరుండం

[మార్చు]

గండి పడింది

[మార్చు]

ఉదా: వాని రాబడికి గండి పడింది. ఆదాయం తగ్గితే ఈ మాట వాడతారు . కాలవకు గండి పడితే అందులోని నీరంతా పక్కదారి పట్టి వృధాగా పోతుందు. అదేవిధగా ఒకరి సంపాదన అంతా వృధాగా పోతుంటే ఈ జాతీయాన్ని వాడుతారు.

గంపశ్రాద్ధం

[మార్చు]

గంపెడంత ఆశతో వచ్చారు

[మార్చు]

ఎంతో ఆశ పెట్టుకొని వచ్చారు: ఉదా: వారు నీమీద గంపెడంత ఆశతో వచ్చారు.

గంతకు తగ్గ బొంత

[మార్చు]

ఎవరికి తగ్గది వారికి: ఉదా: గంతకు తగ్గ బొంత ఎక్కడో ఒక చోట రాసి పెట్టే వుంటుంది. (సంబందాల గురించి)

గగన కుసుమం

[మార్చు]

ఆకాశ కుసుమం, అది ఉండదు.అలభ్య వస్తువు, అవసరానికి పనికిరాని విషయం, దాన్ని తేవటం మన వల్లకాదు

గగనమగు

[మార్చు]

క్షీణించిపోవు ( ఈ రోజుల్లో నిజాయితి పరులు గగనమై పోయారు.) ఏదైనా అరుదుగా వుంటే ఈ మాటను వాడతారు.

గచ్చపొద

[మార్చు]

గజకచ్ఛపాలు

[మార్చు]

గజగర్భం - గాంధారిగర్భం

[మార్చు]

గజ స్నానము

[మార్చు]

ఏనుగులు స్నానం చేయడమనేది ఒక దీర్ఘ కాలిక క్రీడ. అవి మడుగు జొచ్చి గంటల తరబడి స్నానం చేస్తాయి. అలా ఎవరైనా ఎక్కువ సేపు స్నానం చేస్తే గజ స్నానం అంటారు.

గజ దంత పరీక్ష

[మార్చు]

అందరికీ తెలిసిందే తెలుసుకోవటం.అనవసరమైన పని . ఏనుగుకు ఉండే దంతాలేవో పైకి కనిపిస్తూనే ఉంటాయి. అయినా పనిగట్టుకొని మరీ దగ్గరకు కూడా వెళ్ళి ఎన్ని దంతాలున్నాయని పరీక్షించటం అనవసరమైన పని .

గజదాహం

[మార్చు]

ఏనుగుకు దాహం వేస్తే అది పెద్ద జంతువు కనుక చాలా ఎక్కువ నీళ్ళు తాగుతుందన్న భావన.అత్యాశ, దురాశ, కొద్దివాటితో తృప్తి పడడు

గజరుగజరులు పోవు

[మార్చు]

పిండి పిండి యగు

గజ్జెలగుర్రం

[మార్చు]

గణపతి పూజ

[మార్చు]

ముందుగా జరిపేది గణపతి పూజ. ప్రమద గణాలకు అధిపతి కనుక వినాయకుడిని గణపతి అని అన్నారు.

గణానాం త్వా చేయు

[మార్చు]

గణికా శ్రాద్ధం

[మార్చు]

గట గటా

[మార్చు]

వారు గట గటా నీరు త్రాగు తున్నారు.

గట్టెక్కాడు

[మార్చు]

దీనికి అర్థం: కష్టాలు తొలగి పోయాయని అని అర్థం; హమ్మయ్య అతని కష్టాలు నేటితో గట్టెకాయి అని అంటుంటారు.

గడ కర్రలా పెరిగాడు

[మార్చు]

ఉదా: వాడు గడ కర్రలా పెరిగాడు ఏం లాభం?. ఒక మనిషి ఒడ్డూ పొడువు బాగా వుండి ఏ పనీ చేత కాక పోతే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

గట్టి కొమ్మ

[మార్చు]

బాగా ఆదుకునే మనిషి . ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు దూకే ప్రయత్నం చేసేటప్పుడు ఆధారంగా గట్టి కొమ్మ దొరికితే క్షేమంగా అవతల వైపునకు చేరవచ్చు. అదే వోటి కొమ్మ అయితే మధ్యలోనే విరిగి ప్రమాదం సంభవించవచ్చు.

గట్టివాడే.....

[మార్చు]

చాల తెలివైన వాడిని గురించి ఈ మాట వాడతారు. ఉదా: వాడు గట్టివాడె.... పరీక్షల్లో మంచి మార్కులే తెచ్చుకున్నాడు.

గడ్డం దువ్వటం

[మార్చు]

విజయ గర్వాన్ని ప్రకటించటం, సంతోషాన్ని వ్యక్త పరచటం. మీసం మెలేయటం, గడ్డం దువ్వటం

గడ్డి తింటున్నాడు

[మార్చు]

లంచం మేయటం, అవినీతికి పాల్పడటం. వాడు నానా గడ్డి తింటున్నాడు. (గడ్డి మేస్తున్నాడు)

గడ్డి పీకుతున్నారా ఇంత సేపు

[మార్చు]

ఏమిచేస్తున్నావు ఇంత సేపు అని అడగడానికి కోపంగా అనండము. ఉదా: గడ్డి పీకు తున్నారా ఇంత సేపు?,,,

గడ్డి పోసకు కూడ సరి పోలరు

[మార్చు]

అత్యల్పమైనది అర్థం.

గడ్డి వామి దగ్గర కుక్క కాపల

[మార్చు]

(తను తినదు, ఆవులను తిననీయదు.) వాడు తినడు వేరెవరిని తిననీయడు. అటువంటి సందర్భంలో ఈ మాట వాడతారు

గడ్డీగాదం

[మార్చు]

నానా చెత్త .గాదం అంటే ఆకు, కసవు . చిందరవందరగా పడిన గడ్డి, ఆకులు, కసవు .అంతగా విలువలేని పదార్థాలు

గడ్డపార మింగుదామన్నట్టు

[మార్చు]

తెలివితక్కువ తనం, ప్రాణహాని

గడ్లెఏసుడు

[మార్చు]

ప్రాణం పోయే ముందు గడ్డిపైన పడుకో బెట్టడం (ఇది ఓ ఆచారం)

గతజల సేతుబంధం

[మార్చు]

గతుక్కు మన్నాడు

[మార్చు]

అంతా చెప్పాక నాలిక్కరుచుకున్నాడు. గతుక్కమన్నాడు. చెప్పకూడనిదేదో పొరబాటున చెప్పేస్తే అప్పుడు అతని మనస్సులో జరిగే ఘర్షణకు ముఖంలో కనబడే ఆందోళనను ఈ జాతీయం ద్వారా చెప్తారు.

గన్నిలాయి

[మార్చు]

గప్పగప్ప

[మార్చు]

ఘుమఘుమ సువాసనలు ఘుమఘుమలాడటం, పరిమళాలు వ్యాపించటం

గప్పాలు కొడుతున్నాడు

[మార్చు]

తన గురించి గొప్పలు చెప్పు కుంటున్నాడు.

గబ్బిలాయి

[మార్చు]

గబ్బిలాయి ......ని అపశకునపు పక్షిగాను, అందవికారమైనది గాను, దురదృష్ణమునకు మారు పేరుగాను దారిద్ర్యానికి కారణంగాను ఉటంకిస్తుంటారు. నిజానికి గబ్బిలము అందవికారముగాను, అది పూర్తి స్థాయి జంతువుగాను కాకుండా.... ఒక పక్షిగాను కాకుండ వుంటుండి. అది కనబడిన వెంటనే దానిని వెంబడించి తరుముతారు. అది ప్రవేశించిన ఇంటిలో దరిద్రము తాండవిస్తుందని నమ్ముతారు ప్రజలు. ఆవిధంగా నిందా వాచకముగా ఇతరులను నించించే టప్పుడు..... గబ్బిలాయి మొఖం, అని. తెలివి లేనివాడనే అర్థంలోను ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.

గర గర

[మార్చు]

అసూయ పడటం . కళ్ళలో దుమ్ము, ధూళి పడ్డప్పుడు లేదా కంటికేవైనా అంటువ్యాధుల్లాంటివి సోకినప్పుడు గరగరలాడుతున్నాయంటారు. ఎదురుగా ఉన్న దాన్ని అలాంటి స్థితిలో ఎవరూ చూడలేరు. ఎంతో బాధగా ఉంటుంది. ఎదుటివారి అభివృద్ధి చూడలేని, ఓర్వలేని అసూయాగుణం ఉన్న స్థితి.

గరంగరంగా ఉన్నాడు

[మార్చు]

కోపంగా ఉన్నాడు. ఎవరైనా కోపంగా వున్నారంటే.... వాడు గరంగరంగా వున్నాడు జాగ్రత్త అని ముందుగానే హెచ్చరిస్తారు. ఆ సందర్భంగా ఈ మాటను వాడుతారు.

గ్రహణం పట్టినట్టు

[మార్చు]

అభివృద్ధి క్షీణించటం, ఎలాంటి ఎదుగుదల లేకపోవటం తేజోవిహీనమై ఉండటం. ఉదా: వానికి గ్రహణం పట్టినట్లుంది. వాని చేసే పనులన్నీ విఫలమౌతున్నాయి. అని అంటుంటారు.

గయ్యాళి గంప

[మార్చు]

ఉదా: సూర్య కాంతం గయ్యాళి గంప పాత్రకు పెట్టింది పేరు. ఎక్కువగా నోరు చేసుకునే స్త్రీనిగురించి ఈ మాట వాడతారు సూర్యకాంతం పేరు ఎంత అందమైనదో...... ప్రతి ఒక్కరికి తెలుసు. కాని ఆ పేరును తమ పిల్లలకు పెట్టుకునేందుకు జనం జంకుతారు. కారణం? సూర్య కాంతం గారు గయ్యాళి పాత్రలో జీవించిన విధానం. ఆమె నటనా కౌశల్యానికి ఎన్ని బిరుదులిచ్చినా ..... అవన్ని దీనికంటే పెద్దవి కావు. అవునా? కాదా ? అది ఎవరో పనిగట్టుకొని ఇచ్చిన బిరుదు కాదు. జనబాహుళ్యంలో అనుకోకుండా ఆమెకు సహజంగా అమరిన బిరుదు.

గ్రంథసాంగుడు

[మార్చు]

గల్లంతయ్యాడు

[మార్చు]

కనబడకుండా పోయాడు. ఉదా: ఆ వరదల్లో ఇద్దరు మరణించగా మరొకడు గల్లంతయ్యాడు.

గ్రహణం వీడింది

[మార్చు]

కష్టాలు తొలిగి పోయాయని అర్థం: ఉదా: ఈ దెబ్బతో వాని గ్రహణం వీడింది అని అటుంటారు.అటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

గాలి వాన వెలిసి నట్టుంది

[మార్చు]

రణ గొణ శబ్దం తర్వాత ప్రశాంతత ఏర్పడితే ఈ మాట వాడతారు

గాట్లో పెట్టాలి

[మార్చు]

ఉదా: వాని నడత సరిగా లేదు: వాడిని గాట్లో పెట్టాలి. చక్కదిద్దాలి అని అర్థము.

గాడిద కొడకా

[మార్చు]

ఊత పదం .... నిందా వాచకం. ఒక తిట్టు. గాడిద అంటే నీచమైనదని. దానితో పోల్చి తిడితారు.

గాడిద గత్తర

[మార్చు]

క్రమశిక్షణ రాహిత్యంతో గోలగోల.మూర్ఖ పద్ధతిలో ఎవరెన్ని చెప్పినా వినకుండా గోల చేయటం

గాడిద గుడ్డు

[మార్చు]

ఇది విరివిగా వాడె ఊత పదం.

గాడిదగుడ్డు కంకరపీచు

[మార్చు]

సృష్టిలో లేనివి . గాడిద పిల్లలను పెడుతుందే కానీ గుడ్లను పెట్టదు. కంకరరాయిని పగలగొడితే ముక్కలవుతుంది కానీ ఆ ముక్కలకు పీచు ఉండదు. ఇలా అసలక్కడ ఏమీ లేదు అని చెప్పటం.అది ఉత్తుత్తి సంగతి. అందులో ఏమీ పస లేదుఅని.

గాడిదపిల్ల కోమలం

[మార్చు]

గాడిద పొర్లినట్లు

[మార్చు]

గాడిద బూడిదలో, మట్టిలో పొర్లుతుంటుంది. దున్నపోతులు, పందులు బురదలో పొర్లుతుంటాయి. అలా పొర్లటం వాటికి అసహ్యం అనిపించదు. పైగా ఆనందాన్నీ అనుభవిస్తుంటాయి. ఎక్కడపడితే అక్కడ పొర్లి మర్యాదను పాడుచేసుకోవటం.

గాడిలో పడింది

[మార్చు]

దారిలో పడింది. ఉదా: వాడి నడవడిక ఇప్పుడు గాడిలో పడింది.

గాజుల మల్లారం

[మార్చు]

గాజులు తొడుక్కుని కూర్చోవటం

[మార్చు]

అసమర్థత. స్త్రీ అబల అనే భావన.అసమర్థులుగా ఉండిపోవటం

గాదంలో దోస

[మార్చు]

నివురుకప్పిన నిప్పు .దోస తీగకు పిందెలొచ్చి ఓ మోస్తరు కాయలయ్యేదాకా దట్టమైన ఆకుల మధ్యనే ఉండి ఎవరికీ కనిపించవు. అప్పటివరకు ఏమీ లేదనుకున్న వాడికి గొప్ప సంపదలున్నాయని తెలియటం

గానుగెద్దు

[మార్చు]

గాంధీ లెక్కలో రాసెయ్

[మార్చు]

డబ్బు విషయంలో లెక్కలు వ్రాసెటప్పుడు..... ఎటూ తేలని పద్దులను గాంధీ లెక్కలో రాసెయ్ అని అంటుటారు. అనగా.... అది అంత ప్రధానమైనది కాకపోవడమో..... లేక దొంగ లెక్కలు వ్రాయడానికి అవకాశము కల్పించేదో అయి వుంటుందని అర్థం. ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.

గాయి గాయి

[మార్చు]

అల్లరి, లోల్లి, సందడి .విపరీతంగా అల్లరి చేయటం.

గాలం వేశాడు

[మార్చు]

ఏదో పన్నాగం పన్నాడు: ఉదా: వాడు ఆ అమ్మాయికి గాలం వేశాడు.

గాలికెగిరిపోవటం

[మార్చు]

ఆచరణలోకి రాకపోవటం ఎవరూ పట్టించుకోకపోవటం

గాలి పాట

[మార్చు]

ఎవరూ పట్టించుకోనిది, ఉపయోగములేనిది అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతారు.

గాలి మాట

[మార్చు]

పుకారు: ఆధారం లేని మాట. కల్పితం/

గాలి మేడలు

[మార్చు]

ఊహాలోకంలో విహరిస్తున్నాడు

గాలి వాటం మనిషి

[మార్చు]

ఒక పద్ధతి లేకుండా ఎటు పడితె అటు పోయేవాడు. ఆ అర్థంలో ఈ మాటను వాడుతారు

గాలికి ధూళికి

[మార్చు]

పని పాట లేకుండా..... బేవార్సుగా తిరిగే వాళ్ళ గురించి ఈ జాతీయాన్ని వాడుతారు.

గాల్లో తేలి యాడు తున్నాడు

[మార్చు]

ఉదా: వాడు గాల్లో తేలి యాడు తున్నాడు.... ఊహల్లో విహరిస్తున్నాడని అర్థం.,

గిరిగీసుకొని కూర్చున్నాడు

[మార్చు]

ఎవారిమాట వినకుండా తన దారినే తాను నడచే వాడిని గురించి ఈ మాట వాడతారు.

గిల్లికజ్జాలు పెట్టుకోకు

[మార్చు]

అనవసరపు తగాదాలు తెచ్చుకోకు... అని అర్థం.

గీచి గీచి ఖర్చు పెడుతున్నాడు

[మార్చు]

వాడు పొదుపుగా ఖర్చు పెడు తున్నాడు. అని ఈ జాతీయానికి అర్థం.

గీచిన గీత దాటడు

[మార్చు]

చెప్పిన మాట వింటాడు. ఉదా: వాడు నేను గీచిన గీత దాటడు.

గుక్క తిప్పుకోనీడు

[మార్చు]

ఊపిరి ఆడనివ్వడు: ఉదా: వాడు వచ్చాడంటే ఊపిరాడ నివ్వడు.

గుగ్గిళ్ళ వ్యాపారం

[మార్చు]

గుటకలు మింగు తున్నాడు

[మార్చు]

ఏదో చెప్పడానికొచ్చి సందేహిస్తున్నాడు: ఉదా: ఏరా గుటకలు మింగు తున్నావు. ధైర్యంగా చెప్పు.

గుడ్లగూబ

[మార్చు]

గుడ్డి గుర్రం

[మార్చు]

గుంట ఓనమాలు

[మార్చు]

గుంటపూలు పూయటం

[మార్చు]

క్షీణ దశకు చేరుకోవటం, క్షీణించి పోవటం .గుంటలో పెట్టడం అంటే సమాధి చేయటం

గుంట బెట్టు

[మార్చు]

గుండం కావటం

[మార్చు]

సర్వం నశించటం. అగ్ని గుండంలో ఏ వస్తువైనా పడితే నిప్పుల సెగకు అది నామరూపాల్లేకుండా పోతుంది. ఆ సందర్భంలో ఈ మాటను వాడతారు.

గుండె రాయి చేసుకొను

[మార్చు]

దుఖాన్ని దిగమింగు కొని, (అందరు నన్ను మోసం చేసినా గుండె రాయి చేసుకుని బతుకుతున్నాను.)

గుండెలు తీసిన బంటు

[మార్చు]

అన్నింటికి తెగించిన వాడని .... ఎలాంటి పనైనా చేయగల సమర్థుడని అర్థం. అలాంటి వారినుద్దేశించి ఈ మాటను వాడతారు.

గుండె దిటవు చేసుకో

[మార్చు]

నిబ్బరించుకో: ఉదా: కష్టాలు మనుషులకు కాక మానులకొస్తాయా? గుండె దిటవు చేసుకో? కష్టాలలో వున్న వారిని ఓదార్చడానికి ఈ మాటను వాడతారు.

గుండె లోతుల్లోనుండి రావాలి

[మార్చు]

ఉదా: అసలు విషయం చెప్పు. గుండె లోతుల్లోనుండి రావాలి.

గుండె మండు తున్నది

[మార్చు]

మనసులో బాధగా ఉంది. ఉదా: వాని మాటలు వింటుంటే గుండె మండుతున్నది.

గుండెల్లో రాయి పడింది

[మార్చు]

ఉదా: వాడు చేసిన పని వింటుంటే నా గుండెల్లో రాయి పడింది. (భయమేసింది)

గుండ్రాయిలాగా ఉండటం

[మార్చు]

బొద్దుగా, బలంగా ఉండటం ... ఏ పని చేయకుండా బెల్లం కొట్టిన రాయిలాగ ఒకేచోట కూర్చొని వుండటం.

గుంత ఓనమాలు

[మార్చు]

చదువు తొలిమెట్టు.. గతంలో పిల్లలకు చదువు నేర్పేటప్పుడు వారిని ఇసుకలో అక్షరాలు రాయించే వారు. వాటినే గుంత ఓనమాలు అనేవారు.

గుటకలు మ్రింగు

[మార్చు]

నిజం దాచి అబద్దాలు చెపుతుంటే కలిగే పరిస్థితి. అసలు విషయం చెప్పమంటే గుటకలు మింగు తున్నావు అంటుంటారు.

గుట్టు మట్టు

[మార్చు]

రహస్యం: వాని గుట్టు మట్లు అన్ని నాకు తెలిసాయి.

గుట్టుచప్పుడుకాకుండా

[మార్చు]

రహస్యంగా వచ్చాడని అర్థం.

గుడిసెకు చాందినీ అన్నట్టు

[మార్చు]

అసంబద్ధమైన వ్యవహారం, అనవసరమైన అలంకారం .చిన్న గుడిసె ముందు అందమైన చాందినీని వేస్తే నిరర్థకంగా అనిపిస్తుంది.

గుడ్లప్పగించటం

[మార్చు]

తదేక దృష్టితో చూడటం అలాగే చూస్తూ ఉండిపోవటం.

గుడ్లుపేలిపోవడం

[మార్చు]

బెడిసికొట్టడం, ప్రాణం కటకటలాడడం గుళ్లో ఇలాటి మాటలాడకురా, గుడ్లుపేలిపోతాయి. మధ్నాన్నం రెండున్నరకి పెళ్ళిభోజనం, గుడ్లు పేలిపోయాయి నీ గుడ్లు పేలిపోను! (తిట్టు)

గుదికొయ్య

[మార్చు]

స్వేచ్ఛకు అడ్డు తగిలేది. దొంగ గొడ్డుకి ఒక కొయ్యను మెదకు కడతారు. దాంతో అది ఇష్టం వచ్చినట్టు పరుగులెత్తకుండ అన్ని పశువులతోటి నడుస్తుంది. అడ్డు అదుపు లేకుండా తిరిగే వారిని అదుపులో పెట్టేందుకు ఈ మాట వాడతారు.

గుర్రం చెవులు కడగటం

[మార్చు]

గురువుకు తిరుమంత్రం చెప్పినట్లు

[మార్చు]

తామే గొప్ప అని భావించుకొనే వారు తమకంటే గొప్పవారి దగ్గర అల్పమైన తమ గొప్పతనాలను ప్రకటించుకోవటం.మంత్రజపం, సాధన చేయటంలో గురువు ఎప్పుడూ ముందడుగులోనే ఉంటాడు. కానీ ఓ శిష్యుడు తాను గురువును మించిన వాడినని భావించుకొంటూ ఆ గురువుకే మంత్రోపదేశం చేయబోయాడట.

గురువింద చందాన

[మార్చు]

తన తప్పులు తెలుకోకుండా ఇతరుల తప్పులు వెతికేవారి గురించి ఈ మట వాడతారు

గుర్రపు తోకకు కళ్ళెం పెట్టినట్టు

[మార్చు]

నిరుపయోగమైన అసంబద్ధమైన, నిరర్ధకమైనపని .

గుర్రమెక్కాడు

[మార్చు]

బాగ తాగి వచ్చిన వాడిని గురించి ఈ మాట వాడతారు

గువ్వకుత్తుక

[మార్చు]

గువ్వసొచ్చిన ఇల్లు

[మార్చు]

గువ్వ అంటే గుడ్లగూబ . గుడ్లగూబ ఏదైనా ఇంట్లోకి ప్రవేశిస్తే అశుభం అని భావించి పాడు పెట్టిన కళావిహీనంగా, అపరిశుభ్రంగా ఉన్న ఇల్లు.

గూడు పుఠాణి చేస్తున్నాడు

[మార్చు]

రహస్య కార్యక్రమం చేస్తున్నాడు. ఉదా: వారు ఏదో గూడు పుఠాణి చేస్తున్నారు.

గూబ గుయ్యి మంటుంది

[మార్చు]

కొడ్తానని బెదిరించడం. ఉదా: పిల్లలూ అరవకండి. అరిస్తే గూబ గుయ్యి మంటుంది. ఇలాంటిదే మరొక్క మాట కూడా ఉంది. అది. వీపు విమానం మోత మోగుతుందీ'

గుండెలు తీసిన బంటు

[మార్చు]

అన్నింటికి తెగించిన వాడని .... ఎలాంటి పనైనా చేయగల సమర్థుడని అర్థం. అలాంటి వారినుద్దేశించి ఈ మాటను వాడతారు.

గొడ్డుచాకిరి

[మార్చు]

అమితమైన శ్రమ . ఎంత ఎక్కువ పని అప్ప చెప్పినా గొడ్డు లాగా శ్రమిస్తూ పని చేయటం అదే విదంగా తగినంత ఫలితం లేని శ్రమ చేస్తే కూడా .... గొడ్డు చాకిరి అంటారు.

గొర్రె కసాయివాడిని నమ్మినట్టు

[మార్చు]

నమ్మించి మోసం చేయడం.

గొర్రెలకు తోడేలు కాపరి అన్నట్టు

[మార్చు]

సంరక్షణ బాధ్యతలను శత్రువులకు అప్పగించటం .

గొంతు కోశాడు

[మార్చు]

ఉదా: వాడు మాగొంతు కోశారు.. మోసం చేసారని అర్థం.

గొంతెమ్మ కోరికలు

[మార్చు]

తీర్చలేని కోరికలు: ఉదా: వారివన్ని గొంతెమ్మ కోరికలు.

గొంతు పట్టేసి నట్టుంది

[మార్చు]

మాట పెగలడం లేదు. ఉదా: వాడన్న మాటలకు మాకు గొంతు పట్టేసి నట్టుంది.

గొంతు ఎండి పోయింది

[మార్చు]

దాహంగా వున్నదని అర్థం. బాగా దాహంగా వుంటే ఈ మాటను వాడతారు.

గొంతు తడుపుకున్నారు

[మార్చు]

నీళ్లు తాగారని అర్థం. దాహం తీర్చుకున్నారని అర్థం.

గొడ్డుపోవటం

[మార్చు]

గొడ్డు, గొడ్డుమోతుతనం. వంధ్యత్వం: బిడ్డలు పుట్టక పోవడం: ( ఆమె గొడ్రాలు.) పద ప్రయోగం: దేశం గొడ్డు పోలేదు... ఈ మాత్రం పని ఎక్కడైనా చేసుకొని బ్రతగ్గలను......

గోడకు కొట్టిన సున్నం

[మార్చు]

ఎన్నటికి తిరిగి రానిది... ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఉదా: వాడికి డబ్బు ఇచ్చామంటే.... అది గోడకు కొట్టిన సున్నమె.

గోడకు చెప్పినట్టు

[మార్చు]

నిరర్థక కార్యం, వృధాశ్రమ, ప్రయోజన శూన్యం, స్పందించనితనం ఉదా: నీకు చెప్పినా ఒకటే.... ఆగోడకు చెప్పినా ఒకటే..

గోడకు చెవులుంటాయి

[మార్చు]

ఎవరైనా రహస్యంగా వింటుంటారని అర్థం

గోడ మీద పిల్లి వాటం

[మార్చు]

గోడ మీదున్న పిల్లి ఎటు వైపు దూకు తుందో ఇదిమిద్దంగా చెప్పలేం. అలా స్పస్టత లేని విషయం చెప్పినప్పుడు ఈ మాటను వాడతారు.

గొడారి బేరం

[మార్చు]

గొడ్రాలు, గొడ్డుమోతు

[మార్చు]

గొప్పోళ్లగోత్రాలు

[మార్చు]

పైపై మెరుగులని అర్థం.

గొంతులో (పచ్చి) వెలక్కాయ

[మార్చు]

గొంతుసన్నం గోవిందరాజులు

[మార్చు]

గొంతెమ్మ కోరిక

[మార్చు]

గొర్రెకు బెత్తెడే తోక

[మార్చు]

ఎంత సంపాదించినా మిగలదు

గొర్రె దాటు వ్వవహారం

[మార్చు]

వారిది గొర్రె దాటు వ్యవహారం అంటుంటారు. అనగా స్వంత అభిప్రాయం లేకుండా ఎవరో చెప్పిన దాని ప్రకారము నడుచుకునే వారిని గురించి ఈ మాట వాడతారు. వివరణ. గొర్రెల గుంపులో ఒక్క పొట్టేలు వుంటుంది. అది ఆ గొర్రెల గుంపుకు నాయకత్వం వహిస్తుంటుంది. అది ముందు నడుస్తుంటే మిగతా గొర్రెలు తల వంచుకొని దాని వెంబడే నడుస్తుంటాయి.. దారి మద్యలో ఏదేని చిన్న కాలువ గాని, చిన్న కంచె గాని అడ్డువస్తే గొర్రెలన్ని సందేహిస్తాయి దానిని దాటడానికి పొట్టెలతో సహా. కాని ఆ గొర్రెల కాపరి ఆ పొట్టేలుని దాన్ని దాటిస్తే మిగా గొర్రెలన్ని దాన్ని అనుసరించి వాటంతట అవే దాన్ని దాటేస్తాయి. దాన్ని అనుసరించి ఈ జాతీయం పుట్టింది.

గోచీలు ఎగ్గట్టారు

[మార్చు]

పోట్లాటకు సిద్ధపడ్డారని అర్థం: ఉదా:....వారిపై పోట్లాటకు వీరు గోచీలు ఎగ్గట్టారు.

గోడచేర్పు

[మార్చు]

గోతికాడ నక్కలాగ కూర్చున్నాడు

[మార్చు]

అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడని అర్థం. (చెడుపనికి)

గోతిలో పడ్డాడు

[మార్చు]

కష్టాలలో పడ్డాడని అర్థం. ఉదా: వాడు ఎంతో ఆలోసించి పనిచేసినా చివరకు గోతిలో పడ్డాడు.

గోముఖ వ్యాఘ్రం

[మార్చు]

గోరోజనం

[మార్చు]

గోవత్సం

[మార్చు]

గోవింద కొట్టటం

[మార్చు]

గోదావరిలో కలుపు

[మార్చు]

వృధా చేయడం: గోదాట్లో కలిపెయ్. ఏదైనా వృధా అయిందంటే..... గోదాట్లో కలిసిపోయిందని అంటుంటారు.

గోజారు తున్నాడు

[మార్చు]

గీచి గీచి బేర మాడుతున్నాడని అర్థం.

గోడకు చెవులుంటాయి

[మార్చు]

ఈ రహస్యాన్ని మరొకరు వింటున్నారని అర్థం.

గోడమీద పిల్లి

[మార్చు]

గోడ మీద పిల్లి ఎటువైపు దూకుతుందో తెలియదు. అలా సందేహాస్పదంగా వున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు.

గోతులు త్రవ్వుతున్నాడు

[మార్చు]

ఎవరికో కష్టాలు కలిగించే పనిచేస్తున్నాడని అర్థం... ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఉదా: వాడు వెనక గోతులు త్రవ్వుతునాడు.

గోరంత

[మార్చు]

స్వల్ప పరిమాణంలో ఉన్నది, చాలాకొద్దిగా, చిన్నది. కొండంత అంటే ఎంతో పెద్దది అని గోరంత దీపం కొండంత వెలుగు" ఒక సామెతలో ఈ పద ప్రయోగము

గోరంతను కొండంత చేయటం

[మార్చు]

అతి చిన్న విషయాన్ని ఎంతో పెద్దదిగా చెయ్యటం

గోరోజనం

[మార్చు]

గోవు పిత్తాశయం నుంచి వెలువడే పదార్థమిది. వైద్యంలో దీనికి గొప్ప విలువే ఉంది. అహంకారం, తల బిరుసు తనం లాంటి అర్థాల్లో వాడికి గోరోజనం ఎక్కువే లేండి' అంటారు.

గోళ్లు గిల్లు కుంటున్నాడు

[మార్చు]

పని పాట లేకుండా వూరికె కాల యాపన చేసె వారిని ఇలా అంటారు.

గోవత్సంగాడు

[మార్చు]

విలువలేని వాడు .గోవత్సం అంటే ఆవుదూడ.ఆవు పక్కనున్న దూడలాగా పెద్దల పక్కనుంటూ సొంత వ్యక్తిత్వం లేకుండా ఆ పెద్దల ననుసరించే వాడు.

గోవింద.... గోవింద

[మార్చు]

అంతా అయి పోయిందని అర్థం: ఉదా: వాని పని అయి పోయింది.... గోవింద గోవింద.

గౌతముడి గోవు

[మార్చు]

గౌరీ కల్యాణం

[మార్చు]

ఘటశ్రాద్ధం

[మార్చు]

ఘటకుటీ ప్రభాతం

[మార్చు]

అనుకున్న పని జరగకపోవటం, ఎంత తప్పించుకుందామనుకున్నా దొరకకూడదనుకొన్న వారికి దొరికి పోవటం .ఘట్టం పన్నులు వసూలు చేసే ప్రదేశం, కుటీ అంటే గుడిసె, ప్రభాతం అంటే ఉదయం .ఓ వ్యాపారి సరుకు అమ్ముకొని వచ్చేటప్పుడు కాపలా వాళ్ల నుంచి తప్పించుకొని కోటలోకి వెళ్ళటానికి ఏవేవో పక్కదారుల్లో ఆ రాత్రంతా తిరిగాడట. ఎటు తిరిగినా మళ్ళా కోటసింహం ద్వారం దగ్గరకు చేరాడు. అయితే అక్కడికి చేరేసరికి ప్రభాతం (సూర్యోదయం) అయింది. కాపలావాళ్ళు అతడిని చూడనే చూశారు. రాత్రంతా ఎంత శ్రమపడ్డా ఫలించకపోగా పన్ను కట్టాల్సి వచ్చిందట.

ఘుణాక్షరం

[మార్చు]

ఘోటక బ్రహ్మచర్యం

[మార్చు]

ఘటకుటీ ప్రభాతం

[మార్చు]

ఘుణాక్షరం

[మార్చు]

ఘోటక బ్రహ్మచర్యం

[మార్చు]