సామెతలు - త
తంగేడు పూచినట్లు
[మార్చు]తంగేడు చెట్టు విపరీతంగా పూస్తుంది. ఎవరికైన అధిక సంపద చేకూరితే ఈ సామెతను ఉపయోగిస్తారు.
తంటల మారి గుఱ్ఱముకు తాటిపట్టె గొరపం
[మార్చు]తండ్రి ఓర్వని బిడ్డను తల్లి ఓరుస్తుంది
[మార్చు]తండ్రి చస్తే పెత్తనం తెలుస్తుంది - తల్లి చస్తే కాపురం తెలుస్తుంది
[మార్చు]తండ్రి త్రవ్విన నుయ్యి అని అందులో పడి చావవచ్చునా
[మార్చు]తండ్రి వంకవారు దాయాదివారు
[మార్చు]తంతే బూరెల బుట్టలో పడ్డట్టు
[మార్చు]అనుకోని అదృస్జ్టము కలిగిన వారి నుద్దేశించి ఈ సామెతను వాడుతారు.
తంబళ అనుమానము
[మార్చు]అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చిన వారునుద్దేసించి ఈ సామెత చెప్తారు.
తంబళి తన లొటలొటే గాని, యెదటి లొటలొట యెరగడు
[మార్చు]తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలము రమ్మంటే వచ్చునా
[మార్చు]తక్కువ వానికి నిక్కులు లావు
[మార్చు]తగినట్టే కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ
[మార్చు]తగిలించుకొనటం తేలిక - వదిలించుకోవటం కష్టం
[మార్చు]తగిలిన కాలే తగులుతుంది
[మార్చు]తగు దాసరికీ మెడ పూసలకూ, అమ్మకన్న కాన్పుకూ అయ్య ఇచ్చిన మనుముకూ
[మార్చు]తగులమారి తంపి - పుల్లింగాల పిల్లి
[మార్చు]తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట
[మార్చు]తన ప్రశ్నలోనే జవాబున్నది. నర్మగర్బంగా చెప్పిన సమాదనమిది.
తగులుకున్న మొగుడినీ, తాడిచెట్టు నీడనూ నమ్ముకోరాదు
[మార్చు]తట్టలో కాపురం బుట్టలోకి వచ్చినట్లు
[మార్చు]తడిక కుక్కకు అడ్డంగానీ, మనిషికి అడ్డమా?
[మార్చు]తడిక తోసిన వాడిది తప్పు అన్నట్లు
[మార్చు]తడిక లేని ఇంట్లో కుక్క దూరినట్లు
[మార్చు]తడిగుడ్డలతో గొంతులు తెగకోస్తాడు
[మార్చు]తడి గుడ్డతో గొంతు కోయడం అసాద్యం: అలాంటి దుర్మార్గపు పనులను గుట్టు చప్పుడు కాకుండా చేసేసి ఏమి ఎరనట్టు వుండె వారిని గురించి ఈ సామెత పుట్టింది. వీడు తడి గుడ్డతో గొంతు కోసె రకం అని అంటారు.
తడిశిగాని గుడిశె కట్టడు, తాకిగానీ మొగ్గడు
[మార్చు]దెబ్బ తగిలితే గాని జాగ్రత్త పడని వారి గురించి ఈ సామెత పుట్టింది.
తడిశిన కుక్కి బిగిశినట్టు
[మార్చు]ఏదైనా దారం కట్లు తడిసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువగా బిగుసుకుంటాయి.
తడిశి ముప్పందుం మోశినట్టు
[మార్చు]- ఒక గాడిద ఉప్పు బస్తా మోస్తూ ఒక చిన్న నదిని దాటేటప్పు పొరబాటున నీళ్ళలో పడి పోయింది. తిరిగి లేచే టప్పటికి అందులోని ఉప్పు సగం కరిగి పోయి బరువు తగ్గి పోయించి. ఇదేదో బాగుందని అనుకున్న గాడిద ప్రతి సారి అలాగే కావాలని నీళ్ళలో పడేది. ఒక సారి దానిమీద మాసిన బట్టలు వేశాడు చాకలి. యదా ప్రకారము అది కాలువను దాటుతూ కావాలని కాలవ నీళ్ళలో పడింది. చాకలి వాడు దానిని లేపి నిలబెట్టి ఆ తడిసిన బట్టలను కూడా గాడిదమీద వేశాడు. ఆ తడిసిన బట్టలు బరువు రెండింతలు అయ్యింది.
తడిసిన వానికి చలేమిటి?
[మార్చు]ఇలాంటి సామెతే మరొకటి. నిండా మినిగిన వాడికి చలేమిటి?
తణుకుకు పోయి మాచవరం వెళ్ళినట్లు
[మార్చు]అమాయకుల గురించి ఈ సామెతె పుట్టింది
తద్దినము కొని తెచ్చుకొన్నట్టు
[మార్చు]కోరి కష్టాలను కొని తెచ్చుకునే వారి గురించి ఈ సామెత పుట్టింది.
తద్దినం పెట్టేవానికి తమ్ముడేగా!
[మార్చు]తద్దినపు భోజనానికి పిలిస్తే, రోజూ మీ ఇంట ఇట్లాగే జరగాలని దీవించాడట
[మార్చు]తద్దినానికి తక్కువ - మాసికానికి ఎక్కువ
[మార్చు]తనకంపు తనకింపు, పరులకంపు తనకు వొకిలింపు
[మార్చు]తన కంట్లో దూలాలు పెట్టుకుని, పరుల కంట్లో నలుసులు ఎంచినట్లు
[మార్చు]తన కంపు తన కింపు
[మార్చు]తన కడుపు పండితే పక్కింటాయన తలనీలాలు సమర్పిస్తానని మొక్కుకుందిట
[మార్చు]తన కలిమి ఇంద్రభోగం, తన లేమి లోకదారిద్ర్యం అనుకున్నట్లు
[మార్చు]తన కాళ్లకు బంధాలు తానే తెచ్చుకొన్నట్టు
[మార్చు]ఏరి కోరి కష్టాలను తెచ్చుకొని నెత్తిన వేసుకునే వారి గురించి ఈ సామెత పుట్టింది.
తన కాళ్ళకు తానే మొక్కుకున్నట్లు
[మార్చు]తనకు అని తవ్వెడు తవుడు వుంటే, ఆకటి వేళకు ఆరగించవచ్చును
[మార్చు]తనకు కానిది గూడులంజ
[మార్చు]అందని ద్రాక్ష పండ్లు పుల్లన అన్న సామెత లంటిదే ఇదీను.
తనకు కానిది ఎట్లా పోతేనేం?
[మార్చు]తనకు కాని రాజ్యం పండితేనేం? పండక పోతేనేం?
[మార్చు]తనకు మాలినధర్మము - మొదలు చెడ్డ బేరము లేవు
[మార్చు]తనకు రొట్టె - యితరులకు ముక్క
[మార్చు]తనకు లేదనేడిస్తే ఒకకన్ను పోయింది - ఎదుటివానికున్నదని ఏడిస్తే యింకోకన్ను పోయింది
[మార్చు]తన కొంగున కట్టిన రూక..... తనకు పుట్టిన బిడ్డ
[మార్చు]తన కోపమే తన శత్రువు
[మార్చు]ఇది సుమతి శతక పద్య భాగము. తన కోపమె తన శతృవు, తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమె స్వర్గము........... తద్యము సుమతీ..
తన గుణం మంచిదయితే, సానివాడలో కూడా కాపురం చేయవచ్చు
[మార్చు]తన చావు జగత్ప్రళయం అనుకున్నట్లు
[మార్చు]తన తప్పు తప్పు కాదు - తన బిడ్డ దుడుకూ కాదు
[మార్చు]తనదాకా వస్తేగానీ తెలియదు
[మార్చు]తనది తాటాకు - యితరులది ఈతాకు
[మార్చు]తనది కానిది గూడు లంజ
[మార్చు]తనదీపమని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలు కాలాయట
[మార్చు]తన బలముకన్నా స్థాన బలము మిన్న
[మార్చు]ఇది వేమన శతక పద్య సారాంశము. నీటి లోన ముసలి నిగిడి ఏనుగును బట్టు, బయట కుక్క చేత బంగపడును, స్థాన భలము గాని తన బలము కాదయ విశ్వదాభిరామ వినుర వేమ.
తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరము
[మార్చు]తన నీడని తానే త్రొక్కుకున్నట్లు
[మార్చు]తన నోటికి తవుడు లేదు - లంజ నోటికి పంచదారట
[మార్చు]తన ముడ్డి కాకుంటే కాశీదాకా దేకమన్నట్లు
[మార్చు]తన ముడ్డి కాకపోతే తాటి మట్టకి ఎదురు దేకమన్నట్లు
[మార్చు]తన యింటితలుపు ఎదురింటికిపెట్టి, తెల్లవార్లూ తనింట్లో కుక్కలు తోలుతూ కూర్చున్నట్లు
[మార్చు]తనయుల పుట్టుక తల్లి కెరుక
[మార్చు]తనవారి కెంత వున్నా తన భాగ్యమే తనది
[మార్చు]ఇది సుమతి శతక పద్య సారాంశము: ధనపతి సఖుడై వుండిన, యనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్,, తనవారికెంత గలిగిన తన భాగ్యము తనకు గాక తద్యము సుమతీ....
తన సొమ్ము అల్లం - పరుల సొమ్ము బెల్లం
[మార్చు]తనువుకు తనువే అర్పణం అన్నట్లు
[మార్చు]తనువుల తహతహ తీరేది కాదన్నట్లు
[మార్చు]తనువుల దాహాలు పెదవులకే తెలుసునన్నట్లు
[మార్చు]తనువుల పాలపుంత సొగసుల తాంబూలం అన్నట్లు
[మార్చు]తనువుల యుద్ధం తనివి తీరదు
[మార్చు]తనువులు దగ్గరైతే పరువాల పోరు తగ్గుతుందన్నట్లు
[మార్చు]తనువు వెళ్ళినా దినము వెళ్ళదు
[మార్చు]తన్నే కాలికి రోలు అడ్డమా?
[మార్చు]తప్పు చేసినవానికీ - అప్పుచేసిన వానికీ ముఖం చెల్లవు
[మార్చు]తప్పులు చేయనివారు అవనిలో లేరు
[మార్చు]తప్పు లెన్ను వారు తండోపతండాలు
[మార్చు]ఇది వేమన శతక పద్యము: తప్పులెన్ను వారు తండోప తండంబు, లుర్వి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పు లెరుగరు విశ్వదాభి రామ వినుర వేమ.
తప్పు, ఒప్పు దైవ మెరుగును
[మార్చు]తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రువులగును
[మార్చు]ఇది సుమతి శతక పద్య భాగము: కమలములు నీట బాసిన కమలాత్ముని రశ్మి సోకి కమిలిన భంగిన్, తమ తేమ నెలవులు దప్పిన తమ మిత్రులె శత్రులగుదురు తద్యము సమతీ.
తమలపాకులో సున్నమంతటివాడు - తక్కువయినా ఒకటే ఎక్కువయినా ఒకటే
[మార్చు]తమలపాకుతో తానిట్లంటే, తలుపుచెక్కతో నేనిట్లంటి
[మార్చు]తమాం లేదంటే రవికైనా తప్పించమన్నాడట
[మార్చు]==తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగా చెప్పాలి అర్ధం :-మనిషి మనవాడు అయిన ధర్మం తపితే సహించ కూడదు ==
తరతరాల ఆస్తే నిలిచివున్న ప్రశస్తి అన్నట్లు
[మార్చు]తలకడిగి బాసచేసినా వెలయాలిని నమ్మరాదు
[మార్చు]ఇది సుమతి శతక పద్య భాగము.
తల క్రింద కొరివిలాగా
[మార్చు]తల కోసి మొలేసినట్లు
[మార్చు]తలగడ క్రింద త్రాచుపామువలె
[మార్చు]దీనికి సమానర్థంలో మరో సామెత ఉంది.; అది. పక్కలో బల్లెం లాగా.
తల గొరిగించు కొన్నాక తిథి, వార, నక్షత్రాలు చూచినట్లు
[మార్చు]తలచినప్పుడే తాత పెళ్ళి
[మార్చు]తల చుట్టం, తోక పగ
[మార్చు]తలచుకొన్నప్పుడే తలంబ్రాలంటే ఎలా?
[మార్చు]తలలు బోడులైన తలపులు బోడులా
[మార్చు]చింత చచ్చినా పులుపు చావది లాంటిదే ఈ సామెత కూడాను.
తల లేదు కానీ చేతులున్నాయి... కాళ్లు లేవు కానీ కాయం ఉంది?
[మార్చు]తల ప్రాణం తోకకి వచ్చినట్లు
[మార్చు]ఎవరైనా ఏదైనా పనిని అతి కష్టం మీద సాధించినప్పుడు తమ పరిస్థితిని వివరిస్తూ ఈ సామెతను వాడుతారు.
తల పాగ చుట్టడం రాక తల వంకర అన్నాడట
[మార్చు]పని చేతగాక ఎదుటి వారిపై నిందలు వేసె వారిని బట్టి ఈ సామెత వాడతారు.
తలనుంచి పొగలు చిమ్ముచుండు భూతము కాదు, కనులెర్రగనుండు రాకాసి కాదు, పాకిపోవుచుండు పాముకాదు
[మార్చు]తలంబ్రాలకూ, తద్దినాలకూ ఒకే మంత్రమా?
[మార్చు]తలమాసిన వాడెవడంటే ఆలి చచ్చినవాడే అన్నట్లు
[మార్చు]ఆలి చచ్చిన వాడు అందరికీ అలుసే....... అన్నట్టు
తలలు బోడులయినా తలపులు బోడులా?
[మార్చు]చింత చచ్చినా పులుపు చావదు అనే సామెత లాంటిదే ఇదీను.
తలవ్రాత తప్పించుకోలేనిది
[మార్చు]తలలో నాలుకలాగా
[మార్చు]పంచాయతీ కార్యదర్శులు తలలో నాలుక లాగా ప్రగతి లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
తలారి పగ తలతో తీరుతుంది
[మార్చు]తల్లి కడుపు చూస్తే పెళ్ళాం జేబు చూస్తుంది
[మార్చు]తల్లికి కూడు పెట్టడుగానీ, పిలిచి పినతల్లికి చీరపెడ్తాడట
[మార్చు]తండ్రికి తిండి లేక తవుడు తింటుంటే కొడుకొచ్చి కోవాబిళ్ళ కావాలన్నాడట
[మార్చు]తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా
[మార్చు]==తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా==మొగుడు పెళ్ళాల మధ్య సరసం, గిల్లికజ్జాలు సర్వసాధారణం. మాటకు మాట అనుకుంటారు. కానీ, గడుసుదైన పెళ్ళాం మాత్రం ఒకటికి రెండు అంటుంది. సమతుల్యం కాని షరతులున్నప్పుడు ఈ సామెతను వాడతారు.
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే
[మార్చు]జూదం ఆడేటప్పుడు ప్రత్యర్థులు తమ్ములైనా, బంధుమిత్రులైనా వారు ఓడితే పందెంగా ఒడ్డిన సొమ్ములను వదులుకోవాల్సిందే అని చెప్పడానికి ఈ సామెతను వాడుతారు.
తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది
[మార్చు]కన్న తల్లి తన బిడ్డ చిన్న వాడైనా పెద్ద వాడైనా ఇంటి కొచ్చిన వెంటనే తిన్నావా? అని అడుగుతుంది. కాని అతని భార్య మాత్రం భర్త జేబు చూస్తుంది. ఎందుకంటే?..... డబ్బులేమైనా సంపాదించి తెచ్చాడా? అని ఆ సందంర్బంగా పుట్టిన సామెత ఇది.
తల్లికి కూడు పెట్టని వాడు తగవు చెప్పేవాడా?
[మార్చు]తల్లికి తగిన బిడ్డ
[మార్చు]తల్లిగలప్పుడే పుట్టిల్లు - పాలుగలప్పుడే పాయసం
[మార్చు]తల్లి గుణం కూతురే బయట పెడుతుంది
[మార్చు]తల్లి గూని అయితె పిల్లలు గూని అవుతారా
[మార్చు]తల్లి చచ్చినా మేనమాముంటే చాలు
[మార్చు]తల్లికి తిండి పెట్టలేనివా పినతల్లికి చీర పెడతానన్నాడట
[మార్చు]తల్లి చనిపోతే తండ్రి పినతండ్రితో సమానం
[మార్చు]తల్లి చస్తే నాలుక చచ్చినట్లు - తండ్రి చస్తే కళ్ళు పోయినట్లు
[మార్చు]తల్లి చాటు పిల్ల
[మార్చు]తల్లి చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?
[మార్చు]తల్లి తండ్రి అల్లము.... పెళ్లామంటే బెల్లము
[మార్చు]పెళ్లాం పై ప్రేమతో తల్లి దండ్రులను నిరాదరించే వారికి ఈ సామెత వాడతారు.
తల్లితండ్రులు తిట్టుకుంటూ లేస్తే - పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు
[మార్చు]తల్లిదే వలపక్షం - ధరణిదే వలపక్షం
[మార్చు]తల్లి దైవము - తండ్రి ధనం
[మార్చు]తల్లినన్నా చూపెట్టు - తద్దినమన్నా పెట్టు
[మార్చు]తల్లిని చూచి పిల్లను - తరిని చూచి బర్రెను ఎంచుకోవాలి
[మార్చు]తల్లిని నమ్మినవాడూ, ధరణిని నమ్మిన వాడూ చెడడు
[మార్చు]తల్లి పిత్తి పిల్ల మీద పెట్టినట్లు
[మార్చు]తల్లి పుట్టిల్లు మేనమామ కెరుకే !
[మార్చు]తన తల్లి ఆమె పుట్టింటిలో వివాహం వరకే ఉంటుంది. మేనమామలు జీవితాంతం ఉంటారు. అటువంటి మేనమామలకు తన తల్లి పుట్టింటిను గురించి చెప్పవలెనా. తెలిసిన వారికి ఏదో కొత్తగా చెప్పబోయే ప్రయత్నం అని భావం.
తల్లి పుట్టిల్లు మేనమామ దగ్గర పొగడినట్లు
[మార్చు]తల్లి పెంచాలి - ధరణి పెంచాలి - అంతేగానీ బయటివారు పెంచుతారా?
[మార్చు]తల్లి మాటలు - పినతల్లి పెట్టు
[మార్చు]తల్లి ముఖం చూడని బిడ్డ - వాన ముఖం చూడని పైరు
[మార్చు]తల్లి ముక్కు కోసిన వానికి మేనత్త ముక్కు బెండపువ్వు
[మార్చు]తల్లి రోసిన బిడ్డను దాది రోయదా?
[మార్చు]తల్లి లేని పిల్ల - ఉల్లిలేని కూర
[మార్చు]తల్లి లేని పిల్ల దయ్యాల పాలు
[మార్చు]తల్లి వంకవారు తగినవారు
[మార్చు]తల్లి విషం - పెళ్ళాం బెల్లం
[మార్చు]తల్లిసాలు బొల్లి పిల్ల
[మార్చు]పిల్ల కూడా తల్లిలాగె వుంటుంది..... విత్తు ఒకటి వేస్తే చెట్టు మరొకటి మొలుస్తుందా ఈ సామెత లాంటిదె అది కూడ
తల్లిని బట్టి బిడ్డ..... నూలును బట్టి గుడ్డ
[మార్చు]తల్లిని బట్టి బిడ్డ..... విత్తును బట్టి పంట
[మార్చు]తా వలచింది రంభ - తా మునిగింది గంగ
[మార్చు]తవ్వగా తవ్వగా నిజం తేలుతుంది
[మార్చు]తవ్వినా దొరకనిది మొత్తుకుంటే దొరుకుతుందా?
[మార్చు]తవ్వి మీద పోసుకున్నట్లు
[మార్చు]తవుడు తింటూ వయ్యారమా?
[మార్చు]చేసేది వెదవ పనైనా బడాయి పోయే వారి గురించి ఈ సామెత చెప్తారు.
తాకబోతే తగులు కున్నట్లు
[మార్చు]తాగను గంజి లేదు - తలకు సంపంగి నూనెట
[మార్చు]తాగనేరని పిల్లి ఒలక పోసుకున్నదట
[మార్చు]తాగపోతే నీరు లేదుగానీ ఈద పోయినట్లు
[మార్చు]తాగినవాడి తప్పుకు తగవు లేదు
[మార్చు]తాగిన వాడిదే పాట - సాగిన వాడిదే ఆట
[మార్చు]తాగిన మందు ఉంచుకొన్నదాని పొందు ఎలాంటి పనైనా చేయిస్తుంది
[మార్చు]మధ్యం అలవాటు, పరస్త్రీ గమనం చాల కష్టాలు తెప్పిస్తాయని హిత బోధ చేస్తున్నది ఈ సామెత.
తాగిన రొమ్మే గుద్దినట్లు
[మార్చు]తాగేవాడే తాళ్ళ పన్ను కడతాడు
[మార్చు]తాచుపోతు తామసం - జర్రిగొడ్డు పిరికితనం
[మార్చు]తా జెడ్డ కోతి వనమెల్లా చెరచిందిట
[మార్చు]తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా?
[మార్చు]తాటి చెట్టుకింద పాలు తాగినా కల్లే అంటారు
[మార్చు]తాటి చెట్టుకి తేనె పట్టుపడితే ఈతచెట్టుకు ఈగలు ముసిరాయట
[మార్చు]తాటిచెట్టు నీడ గాదు తగులుకున్నది పెండ్లామూ గాదు
[మార్చు]తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ గడ్డి కొరకు అన్నాడట
[మార్చు]అబద్ధం చెపితే అతికి నట్టుండాలి. అలా చాత కాని వారికి ఈ సామెత వాడతారు
తాటి చెట్టు కింద పాలు తాగినా ఎవరు నమ్మరు
[మార్చు]ఏపని చేసినా సమయము, సందర్భము చూసుకోవాలని ఈ సామెత అర్థం.
తాడి తన్నే వాడుంటే తల తన్నే వాడుంటాడు
[మార్చు]తాడు తెగిన గాలిపటంలా
[మార్చు]తాడూ లేదు - బొంగరం లేదు
[మార్చు]తాతకు దగ్గులు నేర్పినట్ట్లు
[మార్చు]తాత తిన్న బొచ్చె తరతరాలు
[మార్చు]తాతా చార్యులకు పీర్ల పండక్కి పొంతనేమిటి
[మార్చు]ఒక దానికొకటి పొంతన లేని మాటలు మాట్లాడె వారిని గురించి ఈ సామెత వాడతారు.
తాతాచార్యుల ముద్ర భుజం తప్పినా వీపు తప్పదు
[మార్చు]తాత తవ్విన చెరువని దూకుతామా
[మార్చు]తాతలనాడు నేతులు తాగాం, మా మూతులు వాసన చూడండి
[మార్చు]తానా అంటే తందానా అన్నట్లు
[మార్చు]బుర్రకత చెప్పేటప్పుడు ప్రధాన గాయకుడు ఒక వచనం చెప్పితె వంత పాట గాళ్లు వెంటనే తందాన తానా.... అంటారు. అనగా వాడు చెప్పిందే నిజమని వంత పాడడ మన్న మాట. ఇలాంటిదే ఇంకో సామెత అదిగో పులి అంటే ఇదిగో తోక
తాను త్రవ్విన గోతిలో తానే పడతాడు
[మార్చు]తాను తిన తవుడు లేదు - వుంచుకున్న దానికి వడియాలు
[మార్చు]తాను తుమ్మి తానే శతాయుశ్షు అనుకున్నట్లు
[మార్చు]తాను దూర సందులేదు - మెడకో డోలు
[మార్చు]తాను మింగేదాన్నీ - తనను మింగేదాన్నీ చూచుకోవాలి
[మార్చు]తాను వలచినది రంభ, తాను మునిగింది గంగ
[మార్చు]తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే సామెత లాంటిదే ఇదీను. మొండి వాడు, ఎవరి మాట వినని వాని గురించి వాడే సామెత ఇది.
తా(ను) పట్టిన కుందేటికి మూడే కాళ్లు
[మార్చు]తన మాటే చెల్లాలనే మొండి వాళ్ల గురించి ఈ సామెత పుట్టింది.
తాను మెచ్చ తినాలి - పరుల మెచ్చ నడవాలి
[మార్చు]తాను పట్టిన కుందేలుకు మూడె కాళ్లు అనే రకం
[మార్చు]తన మాటనే నెగ్గించుకోవాలని చేసె వారి గురించి ఈ సామెత వాడతారు
తాను వలచింది రంబ తాను మునిగింది గంగ
[మార్చు]మొండి వాళ్ల గురించి వాడె సామెత.
తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు
[మార్చు]అన్ని పనులు తాననుకున్నట్టు జరగవని చెప్పేదే ఈ సామెత
తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడట
[మార్చు]తాను తలిచినట్లే అన్ని జరగవని హిత బోధ చేయడమే ఈ సామెత లక్ష్యం.
తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు
[మార్చు]తాళ్ళపాక వారి కవిత్వం కొంత - నా పైత్యం కొంత
[మార్చు]తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి
[మార్చు]తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి అని కూడా అనటం కద్దు. గురజాడ అప్పారావు కలం నుండి భాషలోకి ప్రవహించిన గొప్ప వాక్యాల్లో ఇది ఒకటి. ఆయన తన రచనల్లో రాసిన ఎన్నో పదాలు నానుడులై, సామెతలై, నుడికారాలై భాష లోకి ఒదిగి పోయాయి. అటువంటి సామెతల్లో అగ్రశ్రేణికి చెందినది కన్యాశుల్కం నాటకం లోని ఈ వాక్యం. అగ్నిహోత్రావధాన్లు అనే ఒక పాత్ర, కన్యాశుల్కం మీది పేరాశతో భార్య ఇష్టానికి వ్యతిరేకంగా, ఆమెకు తెలియకుండా, తమ కూతురుకి ఒక ముసలివాడితో పెళ్ళి నిశ్చయిస్తాడు. దానికి భార్య, బావమరిది అభ్యంతరం చెప్పినపుడు, ఆసక్తికరమైన సంభాషణ వారి ముగ్గురి మధ్య జరుగుతుంది. ఆ సందర్భంలో అగ్నిహోత్రావధాన్లు చేత గురజాడ ఈ మాట అనిపిస్తాడు. తాంబూలాలివ్వడమనేది భారతీయ సాంప్రదాయంలో పెళ్ళి నిశ్చయం చేసుకోవడం. అక్కడి వరకూ వచ్చాక ఇక ఆ పెళ్ళి ఆగటం సాధారణంగా జరగదు, పెళ్ళి దాదాపు జరిగినట్లే. నేను తాంబూలాలు కూడా ఇచ్చేశాను, ఇక మీరెంత గింజుకున్నా ఒరిగేదేమీ లేదని ఆ పాత్ర భావం. చెయ్యాల్సిందంతా చేసేశాను, ఇంక ఎన్ననుకున్నా ఏమీ లాభం లేదు అని చెప్పాల్సిన సందర్భంలో దీనిని వాడతారు. కేవలం ఒక పాత్ర సంభాషణలలో భాగంగా రాసిన సంభాషణ సామెతగా భాషలో ఇంకిపోయింది.
తాడిచెట్టు కింద మజ్జిగ తాగినా కల్లు అంటారు
[మార్చు]తాను తాగుతున్నది మజ్జిగే అయినా.... ఆస్థలం తాటి చెట్టు క్రింద అయినందున అతడు తాగుతున్నది కల్లే అనుకుంటారు. ఏ పనిచేసినా సమయా సందర్భాన్ని అనుసరించి చేయాలి అనే భావం ఈ సామెతలో దాగున్నది.
తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు
[మార్చు]ఒకరికి మించిన వారు ఇంకొకరు వుంటారు. తానె గొప్పవాడినని విర్ర వీగే వారికి గుణ పాటంగా ఈ సామెత చెప్తారు.
తాడు చాలదని బావిని పూడ్చమన్నాడట
[మార్చు]ఒక పద్ధతిలో పని కాక పోతె వేరొక మార్గంలో ఆలోసించాలి గాని..... అసలు పని మానుకోకూడదని హితవు చెప్పేదే ఈ సామెత.
తాడు బొంగరం లేనివాడు
[మార్చు]ఎవరి అదుపులో లేకుండా గాలికి తిరిగేవాడని అర్థం.
తాతకు దగ్గులు నేర్పినట్టు
[మార్చు]సాధారణంగా తాతలు ఎక్కువగా దగ్గుతూ ఉంటారు. వారికి ఎలా దగ్గాలో ఛెప్పటం హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే అపార అనుభవం కలిగిన విషయ పరిజ్ఞానికి అదే విషయంపై బోధలు చేయటం తాతకు దగ్గులు నేర్పటం లాంటిదే అని దీని అర్ధం.
తాత చస్తే బొంత నాది అనే రకం
[మార్చు]తాదూర సందు లేదు, మెడకో డోలు
[మార్చు]తన పరిస్థితె అంతంత మాత్రము. దానికి తోడు ఇంకొడిని ఇంటికి భోజనానికి ఇంటికి పిలిస్తే ఎలా? ఇలాంటి సందర్భాలలో పుట్టినదే ఈ సామెత: "తాదూర సందు లేదు, మెడకు ఒక డోలు"
తామరాకు మీద నీటిబొట్టులా
[మార్చు]తామ రాకు మీద నీటి బొట్టు స్థిరంగా వుండదు. ఆకుకు అంటు కోదు. పాదరసం లా కదులు తుంటుంది. ఏదైనా వ్యవహారంలో అంటి ముట్ట నట్లు వ్వవహరించి కష్టాల పాలు గాకుండా వుండాలని దీని అర్థం.
తాయెత్తులకే పిల్లలు పుడితే మొగుడెందుకన్నట్లు
[మార్చు]తిని కూర్ఛుంటే కొండలైనా కరుగుతాయి
[మార్చు]సంపాదన లేకుండా తండ్రులు సంపాదించారని తింటూ కూర్చుంటే అది ఎంతోకాలం వుడదని చెప్పేదే ఈ సామెత.
తింటే అయాసం - తినకుంటే నీరసం
[మార్చు]తింటే కదలలేను - తినకపోతే మెదలలేను
[మార్చు]తింటేగానీ రుచి తెలీదు - దిగితేగానీ లోతు తెలీదు
[మార్చు]తింటే గారెలే తినాలి,వింటే భారతమే వినాలి
[మార్చు]గారెల రుచి గొప్ప తనాన్ని.... మహాభారతం విశిష్టతను చెప్పేదె ఈ సామెత. == తిండికి తిమ్మరాజు, పనికి రాధక్రిష్న
తిండికి ఏనుగు - పనికి పీనుగు
[మార్చు]తిండికి చేటు - మందికి బరువు
[మార్చు]తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు
[మార్చు]తిండికి తిమ్మరాజు - పనికి పోతరాజు
[మార్చు]తిండికి మెండు - పనికి దొంగ
[మార్చు]తిండికి వచ్చినట్టా - తీర్ధానికి వచ్చినట్టా?
[మార్చు]తిండి కొద్దీ పసరం
[మార్చు]తిండెక్కువైతే తీపరం పెరుగుతుంది
[మార్చు]తిక్కల వాళ్లు తిరుణాళ్లకెళ్తే ఎక్కనూ దిగనూ సరిపోయిందట
[మార్చు]తిక్కోడి పెళ్ళిలో తిన్నవాడిదే లాభం అన్నట్లు
[మార్చు]తిట్టను పోరా గాడిదా అన్నట్టు
[మార్చు]తిట్టను పోరా అంటూనె గాడిదా అని తిడు తున్నాడు. ఒక మాటమీద నిలబడని వారి గురించి ఈ సామెత పుట్టింది.
తిట్టబోతే అక్కబిడ్డ - కొట్టబోతే బాలింత అన్నట్లు
[మార్చు]తిట్టితే చచ్చేవాడూ - దీవించితే బ్రతికేవాడూ లేడు
[మార్చు]తిట్టితే గాలికి పోతాయి
[మార్చు]తిట్టిన వాడికి తిట్టున్నర అన్నట్లు
[మార్చు]తిట్టుకు సింగారం లేదు
[మార్చు]తిట్టే నోరు, తిరిగే కాలు , చేసే చెయ్యి ఊరకుండవు
[మార్చు]తిన మరిగిన కోడి దిబ్బ ఎక్కి కూసిందట
[మార్చు]మామూలుగా కోడిపుంజు దిబ్బలో మేస్తుంది, ఇంటి కప్పు ఎక్కి కూస్తుంది. అనుకూలంగా ఉందికదా అని దిబ్బెక్కి కూయదు. ఆ విధంగా ఎవరైనా పనిని చేయవలసిన విధంగా కాకుండా తమ సుఖానికి అనుకూలమైన విధంగా చేసినప్పుడు ఈ సామెతను వాడుతారు.
తినగల అమ్మ తిండి తీర్థాలలో బయటపడుతుంది
[మార్చు]తినగా తినగా గారెలు చేదు
[మార్చు]తినగ తినగ వేము తియ్యగనుండు
[మార్చు]ఈ సామెత వేమన శతకంలోని ఒక పద్యం నుంచి ఉద్భవించింది. అనగననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినుర వేమ సాధన చేస్తూ ఉంటే పనులు సులభతరమౌతాయని దీని అర్థం.
తిననేర్చినమ్మ పెట్ట నేరుస్తుంది
[మార్చు]తినబోతూ రుచులు అడిగినట్లు
[మార్చు]చాలామంది భోజనానికి కూర్చున్నప్పుడు, ఎలాగూ తాము తినబోతున్నా, వంటకాల రుచి ఎలా ఉందని ఇతరులను అడుగుతుంటారు. ఈ విధంగా తాము స్వయంగా కాసేపట్లో తెలుసుకోబోయే విషయాలను ఇతరుల ద్వారా తెలుసుకోవాలని ఎవరైనా ప్రయత్నించినప్పుడు ఈ సామెతను వాడుతారు.
తిన్న యింటి వాసాలు లెక్కపెట్టినట్లు
[మార్చు]తిన్నదాని కంటే అరిగిందే బలం
[మార్చు]తినమరిగిన కుక్క అలమరిగిందట
[మార్చు]తినమరిగిన కోడి యిల్లెక్కి కూసింది
[మార్చు]తినమరిగిన ప్రాణం అల్లాడిపోతుంది
[మార్చు]తిని వుండలేక, తాగి బొందలో పడినట్లు
[మార్చు]తిని కక్కరాదు - కని పోగొట్టుకోరాదు
[మార్చు]తిన్నింటి వాసాలు లెక్కేయటం
[మార్చు]అన్నం పెట్టిన వారికే ద్రోహం చేయాలనే బుద్ధి గలవారి గురించి ఈ సామెత పుట్టింది.
తినే తినే కూడులో మన్ను పోసుకున్నట్లు
[మార్చు]తినేది గొడ్డు మాంసం పైగా విభూతి రేఖలు
[మార్చు]తిమ్మన్నా! తిమ్మన్నా! నమస్కారం అంటే నా పేరు నీకెలా తెలిసిందని అడిగితే నీ ముఖం చూడగానే తెలిసిందని అన్నాడట
[మార్చు]తిమ్మిని బ్రహ్మి, బ్రహ్మిని తిమ్మి చేసినట్లు
[మార్చు]తిమింగలాలకు ఏ చేప అయితే ఏమిటి?
[మార్చు]సముద్రంలోని తిమింగలాలకు టన్నులకొద్దీ చేపలు ఆహారంగా అవసరం అవుతాయి. అంత పెద్ద మొత్తంలో చేపల్ని తినే తిమింగలాలకు ఏ చేప అయినా ఒకటే. ఈనాటి కొంతమంది రాజకీయ నాయకులకు ఇది సరిగ్గా సరిపోతుంది. ప్రభుత్వం విడుదల చేసే ఏ రకం నిధులైనా వారి అవినీతికి అతీతం కాదు.
తియ్యని ముద్దులకు మురవాలో, అదిరే దెబ్బలకు అరవాలో తెలియటం లేదన్నదట
[మార్చు]తియ్యని రోగాలు - కమ్మని మందులు
[మార్చు]తిరిగి రైతు - తిరక్క బైరాగి చెడతారు
[మార్చు]తిరిగే కాలూ, తిట్టే నోరు వూరుకోవు
[మార్చు]తిరుగానాం మరగానాం తీపి వాయనం అన్నట్లు
[మార్చు]తిరుపతి క్షవరంలాగా
[మార్చు]తిలా పాపం తలా పిడికెడు
[మార్చు]తిండికి ముందు తగువుకు వెనకాల వుండాలంటారు
[మార్చు]తీగ లాగితే డొంకంతా కదిలినట్లు
[మార్చు]ఒక్కోసారి ఏదైనా చిన్న తీగను అవసరంకొద్దీ లాగినప్పుడు అనూహ్యంగా ఆ తీగతోపాటు డొంకంతా కదలడం జరుగుతుంది. ఈ విధంగా ఏదైనా చిన్న విషయం గురించి ఆరా తీస్తున్నప్పుడు పెద్ద విషయం బయటపడితే ఈ సామెతను వాడుతారు.
తీగ కదిలిస్తే డొంకంతా కదుల్తుంది
[మార్చు]తీగకు కాయ బరువా?
[మార్చు]తీట గలవానికి తోట గలవానికి తీరికుండదు
[మార్చు]తీట బట్టి వాడే గోక్కుంటాడు
[మార్చు]తీట సిగ్గెరగదు
[మార్చు]తీతువ పిట్టలాగా
[మార్చు]తీపి ఏదంటే ప్రాణం అన్నట్లు
[మార్చు]తీయగా తీయగా రాగం - మూలగ్గా మూలగ్గా రోగం
[మార్చు]తీర్థము, స్వార్థము కలిసి వచ్చినట్లు
[మార్చు]తీరు తీరు గుడ్డలు కట్టుకొని తీర్థానికి పోతే, ఊరికొక గుడ్డ వూడిపోయిందట
[మార్చు]తీర్చే వారుంటే ఎన్ని బెట్టులైనా పోవచ్చు
[మార్చు]తీసినవాడూ బాగానే వుంటాడు - చూచినవాడూ బాగానే వుంటాడు ఎదుటివాని మీద పడుతుంది ముట్టుపుల్ల
[మార్చు]తుంగభద్రకు మంగమ్మ పోతే భంగము తప్పుతుందా?
[మార్చు]తుండూ పిండం చిక్కిన వెనుక ముండకు దిక్కెవరు?
[మార్చు]తుట్టె పురుగుకు రెక్కలొచ్చినా, ముసలాడికి ప్రాయం వచ్చినా పట్టపగ్గా లుండవు
[మార్చు]తుప్పరల పసే గానీ మంత్రాల పస లేదు
[మార్చు]తులసి వనంలో గంజాయి మొక్క వున్నట్టు
[మార్చు]తుమ్మ తోపుల్లో కొత్త కోలాటం
[మార్చు]తుమ్మ దుడ్డు వలె - కాపు కదురు వలె
[మార్చు]తుమ్మల్లో ప్రొద్దుకూకినట్లు
[మార్చు]తుమ్మితే ఊడె ముక్కు
[మార్చు]శాశ్వతము కానికి.... తాత్కాలికమైనది అర్థం.
తుమ్మితే వూడిపోయే ముక్కు ఎన్నాళ్ళుంటుంది
[మార్చు]తుమ్ముకు తమ్ముడు లేడు గానీ ఆవలింతకు అన్న వున్నాడు
[మార్చు]తుమ్ము తమ్ముడై చెపుతుంది
[మార్చు]తుమ్మెదలాడితే వాన తప్పదు
[మార్చు]తుంటి మీద కొడితే పళ్ళు రాలాయి
[మార్చు]అసందర్బ ప్రేలాపన చేసే వారి గురించి ఈ సామెత పుట్టింది.
తురకల సేద్యం పెరికల పాలు
[మార్చు]రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్నట్లు
తురకలలో మంచివాడెవరంటే తల్లిగర్భాన వున్నవాడు, పుడమిగర్భాన ఉన్నవాడు
[మార్చు]తురక లేని వూళ్ళో దూదేకులవాడే ముల్లా
[మార్చు]తురకవాడికి గంగిరెద్దు పోతే కోసుకుని తిన్నారట
[మార్చు]తులము నాలుకకు తొంభై రుచులు
[మార్చు]తులలో వానకు ధరణి పండును
[మార్చు]తులవ నోటికి ఉలవపప్పు
[మార్చు]తులసి కోటలో దురదగొండి మొలచినట్లు
[మార్చు]==తులసివనంలో గంజాయి మొక్కని తెచ్చుకున్నట్టు ఉంది ==
తూట్లు పూడ్చి... తూములు తెరిచినట్లు...
[మార్చు]చిన్న చిన్న నష్టాలను కలిగించే వాటిని పట్టించుకొని పెద్ద నష్టాలు కలిగించే విషయాల జోలికెళ్లని వారి గురించి ఈ సామెత చెప్తారు.
తూనీగలాడితే తూమెడు వర్షం
[మార్చు]ఇది రైతుల సామెత: ఒక్కో సారి తూనీగలు గుంపులు గుంపులుగా ఎగురు తుంటాయి. అప్పుడు రైతులు వర్షం వస్తుందని భావిస్తారు.
తూటు పేరె బొక్క
[మార్చు]రెండు ఒక్కటే అని చెప్పే సామెత ఇది
తూర్పున ఇంద్ర ధనుస్సు - దూరాన వర్షం
[మార్చు]తూర్పున ఇంద్ర ధనుస్సుకు దుక్కిటెద్దు రంకె వేస్తుంది
[మార్చు]తూర్పున కొరడు వేస్తే దుక్కెద్దు రంకె వెయ్యునా?
[మార్చు]తెగిన వేలుమీద ఉచ్చకూడ పోయడు
[మార్చు]తెగితే లింగడు రాయి
[మార్చు]తెగించిన వానికి తెడ్డే లింగం
[మార్చు]తెగిందాకా లాగకు
[మార్చు]తెగించి దానం చేస్తా తేరా పిడికెడు రాళ్ళు అన్నాడట
[మార్చు]తెగిన చేను తేమ ఓడుతుంది
[మార్చు]తెగువ దేవేంద్ర పదవి
[మార్చు]తెగేదాకా లాగరాదు
[మార్చు]తెడ్డుకేమి తెలుసు వంట రుచి?
[మార్చు]తెడ్డుండగా చెయ్యి కాల్చుకున్నట్లు
[మార్చు]తెలఘాణ్యపు టెక్కు - నియోగపు నిక్కు
[మార్చు]తెల్లనివన్నీ పాలు -నల్లనివన్నీ నీళ్ళు అనుకున్నట్లు
[మార్చు]తెల్లవారితే చూడు ఎల్లాయి బ్రతుకు
[మార్చు]తెలిసే వరకూ బ్రహ్మవిద్య తెలిశాక కూసువిద్య
[మార్చు]ఏదైనా ఒక విషయం తెలియనంత వరకు అదేదో మహా విద్య అనుకుంటారు. అది తెలిశాక ఒహో ఇంతేనా అను కుంటారు. ఈ సామెత అర్థం ఇదే.
తెలివి ఒకరి సొత్తా!
[మార్చు]తెలివికి తల లేకపోయినా, భోజనానికి పొట్ట వుంది
[మార్చు]తెలివి తక్కువ - ఆకలెక్కువ
[మార్చు]తెలివైనవాడికి చిటికెల సంకేతం చాలు
[మార్చు]తెలియని దయ్యంకన్నా తెల్సిన దయ్యం మేలు
[మార్చు]తెలిసే వరకే బ్రహ్మ విద్య - తెలిసిన తర్వాత కూసు విద్య
[మార్చు]తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పది వేలు చేరు
[మార్చు]ఇది సుమతి శతక పద్య భాగము.
తెంపుల నీళ్ళు - చిల్లులు కడవ
[మార్చు]తేనెటీగల పని తీరుబడి లేని పని
[మార్చు]తేనె పోసి పెంచినా వేపకు చేదుపోదు
[మార్చు]దుర్మార్గులకు ఎంతగా నీతులు బోధించినా మనసు మారదు.
తేరగా వచ్చింది తెగ తిన్నట్లు
[మార్చు]తేరగా వచ్చింది వూరికే పోతుంది
[మార్చు]తేర గుర్రం - తంగేడు బరిక
[మార్చు]తేలు కుట్టిన దొంగలా
[మార్చు]దొంగతనానికి ఇంట్లో దూరిన దొంగ తేలు కుట్టినా (పట్టుబడతాడు కాబట్టి)అరవలేడు. అదే విధంగా తాము ఉండకూడని పరిస్థితిలో ఉన్నవారు అట్టి సమయంలో తమకు ఏదైనా నష్టం జరిగినప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల ఏమీ చెయ్యలేరు
తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లూ తెగ కుట్టిందట
[మార్చు]తేలు తేలండీ! అంటూ అరిస్తే మొగాళ్ళను పిలవ్వే అన్నాట్ట,
[మార్చు]తేలు మాదిరి కుట్టటం - బల్లి మాదిరి అణగటం
[మార్చు]తేలువలె కుట్టినట్లు
[మార్చు]తేలేనయ్యకు తిండి మెండు - వండలేనమ్మకు వగలు మెండు
[మార్చు]తొడ సంబంధం తొంభై ఏళ్ళుంటుంది
[మార్చు]తొత్తు క్రింద బడి తొత్తులాగా
[మార్చు]తొత్తులాగా పనిచేసి దొరలాగా అనుభవించాలి
[మార్చు]తొలకరి జల్లులు - ఆశల మొలకలు
[మార్చు]తొలకరిలో చెరువు నిండినా - తొలిచూలు కొడుకు పుట్టినా లాభం
[మార్చు]తొలకరి వాన మొలకలకు తల్లి
[మార్చు]తొలి ఏకాదశికి తొలి తాటిపండు
[మార్చు]తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు
[మార్చు]ఆర్తిక పరిస్థితులు బాగు పడితే వారి బుద్ధులు కూడా మారతాయి అని చెప్పేదె ఈ సామెత.
తొందరకు ఆలస్యం తోడు
[మార్చు]తొందరగా రమ్మంటే, తిరగమూత వేసి వస్తానన్నట్లు
[మార్చు]తోక తెగిన కోతిలా
[మార్చు]అసలే అది కోతి. క్షణమైనా తిన్నగా వుండదు. దాని తోక తెగితే ఇక ఎలా గంతు లేస్తుందో కదా. ఈ సామెత అర్థం అదె.
తోక తెగిన నక్కలాగా
[మార్చు]తోక ముడుచుట
[మార్చు]తోక ముడుచుట అనగా ఓడి పోవుట లేదా పారి పోవుట అని అర్థం . జంతువులు పోట్లాటకు దిగే టప్పుడు తమ తోకను పైకెత్తుకొని రంగంలోకి దిగుతాయి. అందులో ఏదైనా ఓడి పోతే తన తోకను తన కడుపు క్రిందికి దాచుకొని పారి పోతాయి. కుక్కలు, ఎద్దులు, పులులు, మొదలగు జంతువులలో ఈతతంగం బాగా గమనించ వచ్చు. దాని నుండి పుటినదే ఈ సామెత.
తోకతో నారాయణా అన్నట్లు
[మార్చు]తోచీ తోయనమ్మ తోటికోడలు పుట్టింటికి వెళ్ళినట్టు
[మార్చు]కొంతమంది ఏమీ తోచక విచిత్రమైన పనులు చేస్తుంటారు. చూసేవాళ్ళకు ఆ చేష్టలు వింతగా ఉంటాయి. ఈ విషయాన్ని ఎంతో హాస్యరసపూరితంగా చెప్పడానికి తోచీ తోచనమ్మ తన తోటికోడలు పుట్టింటికి వెళ్ళినట్టుంది అంటారు. తెలుగు సామెతలలో చమత్కారం మేళవింపుకి ఇది ఒక మచ్చుతునక.
తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటి కెళితే - చూచీ చూడనట్లు చూచారట
[మార్చు]తోటకూర నాడైనా చెప్పవైతివిరా కొడకా అన్నట్లు
[మార్చు]తోట మీద వారికి, పీట మీద వారికి మొగమాట ముండదు
[మార్చు]తోడులేక రాచపీనుగ వెళ్ళదు
[మార్చు]తోడేలును గొర్రెలకు కాపుంచినట్లు
[మార్చు]తోరణం కట్టగానే పెళ్ళయినట్టా?
[మార్చు]ఇల్లు అలకగానే పండగ అన్నట్లు......
తోరణం కట్టినింట్లో తగవు పనికిరాదు
[మార్చు]తోలు కొరికే వాడు పోతే ఎముక కొరికే వాడు వస్తాడు
[మార్చు]ఇలాంటిదే మరొ సామెత: తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నె వాడు మారొకదుంటాడు.
తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది... తుస్సు మనుట ఖాయం
[మార్చు]మానవ శరీరాన్ని గురించి వైరాగ్యంతో అనే మాటలు. ఇది బ్రంహయ్య గారి తత్వాలలోని భాగము.