Jump to content

జాతీయములు - అ

Wikibooks నుండి

అ, అం, అః - అక్షరాలతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి.

భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆంగ్లభాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్ధం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్ధం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్ధం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్ధం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని.

జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్ధం - తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా స్థిరపడిపోయిన పదరూపాలే జాతీయాలు. భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.

వేటూరి ప్రభాకర శాస్త్రి, నేదునూరి గంగాధరం, బూదరాజు రాధాకృష్ణ వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు.

అక్కన్న మాదన్నలు

[మార్చు]

ఒకరికొకరు విడిపోని వారు. తానీషా కొలువులోని అక్కన్న మాదన్నలులా అని అర్థము.

అక్కసు వెళ్ల గక్కాడు

[మార్చు]

ఎదుటి వానిపై వున్న తన కోపాన్ని బయట పెట్టాడు.

అగసాట్లు పడ్డాడు

[మార్చు]

చాల కష్టాలు పడ్డాడు. ఉద: వీణ్ని పెంచడానికి నేను నానా అగసాట్లు పడ్డాను. ===అగస్త్య భ్రాత ===రామాయణంలో పేరు లేని పాత్ర

అగస్త్య మంత్రం

[మార్చు]

అగ్గకౌలు - దుబ్బ చేను

[మార్చు]

ఏదైనా చౌకగా వస్తుంటే దాని కొనేసి ఆ తర్వాత ఆ వస్తువు ఉపయోగానికి పనికి రాక పోతే విలపించ వలసి వస్తుంది. అలాంటి సందర్భములో చేప్పేది ఈ జాతీయము. ఇదే అర్థంలో మరొక సామెత ఉంది. అది: ఓలి సరసమని గుడ్డి దాన్ని పెళ్ళాడితే కుండలన్ని పగల గొట్టిందట

అగ్ని పరీక్ష

[మార్చు]

ఉదా: నాకు పని చెప్పి అగ్ని పరీక్ష పెట్టాడు.

అగ్ర తాంబూల మిచ్చారు

[మార్చు]

పెద్ద గౌరమమిచ్చారు. ఉదా: రాజ సూయ యాగంలో శ్రీకృష్ణునకు అగ్ర తాంబూలమిచ్చారు.

అగ్గిపగ

[మార్చు]

క్రోధం, ద్వేషం, పగ, కక్ష లాంటివన్నీ అగ్ని లాంటివి. నిప్పు ఎంతటి వాటినైనా దహించినట్టే పగ కూడా అగ్నిలాంటిదే కనుక ఎంతగొప్ప వారి మధ్యనైనా అశాంతి అనే మంటలను రేపుతుంది. కనుక అగ్గిలాంటి పగను ఎవరూ పెంచుకోకూడదు.

అగసాట్లు

[మార్చు]

కస్టాలు: ఉదా: వాడు నాలుగు రూకల కొరకు నానా అగసాట్లు పడు తున్నాడు:

అగ్గి బుక్కు

[మార్చు]

కోపంతో ఉడికి పోవటం . నిప్పులు కక్కడం . అగ్గి అంటే అగ్ని బుక్కు అంటే బొక్కటం

అగ్గిమీద గుగ్గిలం

[మార్చు]

కోపంతో మండిపోవటం . దీపావళి సందర్భంగా మైనాన్ని నూనెలో కరిగించి దానిలో తెల్లటి గుడ్డలను నానపెట్టేవారు. ఆ తర్వాత వాటిని గుడ్డ పుల్లలకు చుట్టేవారు.వాటిని అగ్గితో అంటించేవారు. మైనం, నూనె కలిసి బాగా మండుతూ ఉండేది ఆ పుల్ల. దాని మీద గుగ్గిలపు పొడి చల్లితే అది మరింత భగ్గున మండేది.

అగ్గిదాగి పోవడం

[మార్చు]

తహతహలాడడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. తీరని కోరికలు మనిషిలో, మనసులో అగ్నిలాగా బాధ పెడుతూ ఉంటాయి. ఈభావన ఆధారంగా ఈ జాతీయం అవతరించింది. 'మధ్య నిషేధం అమలు కారణంగా జనాలలో సారా అగ్గి దాగి పోయినట్టయింది' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

అగ్రతాంబూలం

[మార్చు]

మొదటి స్థానము ఇవ్వు, అందరి కంటే ఎక్కువగా గౌరవించు। కృష్ణున్ని ధర్మరాజు మయసభలో "అగ్రతాంబూలం" ఇచ్చి సత్కరించాడు।

అగ్నిహోత్రావధానులు

[మార్చు]

ఎప్పుడూ కోపంతో మండిపడుతూ ఉండేవాడు

అచ్చట ముచ్చట తీరనే లేదు

[మార్చు]

ఉదా: వానికి ఏ అచ్చట ముచ్చట తీరనే లేదు. అప్పుడే పోయాడు.

అచ్చంగా అచ్చు గుద్దినట్లు

[మార్చు]

ఉదా: వారిద్దరు అచ్చంగా అచ్చు గుద్దినట్లు అమ్మ పోలికె.

అచ్చి రాలేదు

[మార్చు]

ఉదా: వానికి ఈ ఇల్లు అచ్చిరాలేదు. (కలిసి రాలేదు)

అట్టట్టుకూ తూట్లేనన్నట్లు

[మార్చు]

అందరూ దోషులే అనటం. అట్లకు తూట్లు (చిల్లులు) ఉంటాయి. అట్లు ఎవరేసినా, ఎన్నేసినా ఈ తూట్లు లేకుండా ఉండవు. అలాగే ఒకచోట ఉన్నవారు అందరూ దోషులే అయినప్పుడు 'అట్టట్టుకూ తూట్లేనన్నట్లు అక్కడ ఉన్న వారంతా అలాంటివారే' అనటం కనిపిస్తుంది.

అటు పొద్దు ఇటు పొడిచినా సరే

[మార్చు]

ఎట్టి పరిస్థితిలోను..... ఉదా: అటు పొద్దు ఇటు పొడిచినా సరే నేను వానితో మాట్లాడను.

అడుగుజాడలు

[మార్చు]

మహానుబావుల యొక్క నడవడికను అనుసరించమని ఈ జాతీయం యొక్క ముఖ్య ఉద్దేశం. కేవలం వారు నడిచిన అడుగు జాడలలో అడుగులు వేసి నడమని కాదు... వారి జీవిత విధానాన్ని అనుకరించమని అర్థం.

అధః పాతాళం

[మార్చు]

అతి తక్కువ స్థాయి, నీచాతి నీచం.కింద ఏడులోకాల్లో ఎంతో అడుగున ఉండే పాతాళంలో కూడా ఇంకా అడుగు భాగం

అన్నం, నీళ్లు పట్టించుకోకుండా

[మార్చు]

ప్రతిరోజూ చేసే దినచర్యలోని విషయాలేవీ పట్టించుకోకుండా ఏదో ఒక్క విషయాన్నే పట్టుకుని, అదే ధ్యాసలో ఉండడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. సాధారణంగా ఏ మనిషైనా ఎంత కష్టపడి ఏకాగ్రతతో పనిచేస్తున్నా ఏదో ఒక సమయానికి ఎంతోకొంత తినడమో, తాగడమో చేస్తుంటాడు. అలా ఆహారం స్వీకరించడానికి కూడా సమయాన్ని వెచ్చించకుండా సమయాన్నంతటినీ అనుకున్నపనికే వెచ్చిస్తున్నాడని ఒక వ్యక్తి కార్యదీక్ష గురించి చెప్పేందుకు ఈ జాతీయ ప్రయోగాన్ని చేయడం కనిపిస్తోంది. 'తిండి, నీళ్లు మాని కష్టపడి సంపాదించి పిల్లలను పైకి తెచ్చాడాయన' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

అంట పొడవటం

[మార్చు]

ఎత్తిపొడుపు మాటలు దెప్పినట్టుగా మనసుకు తగిలే విధంగా ఆ మాటల తీవ్రత ఉంటుంది.

అందని గోచి, చీకుల మొలతాడు

[మార్చు]

తీవ్ర స్థాయిలో దరిద్రం, ధనలేమి. వస్త్రధారణ, గోచీ స్థాయికి వచ్చిందంటేనే అది దరిద్రానికి చిహ్నం. పోనీ ఆ గోచి అన్నా సరిపోయినంతగా లేదట. ఎలాగో ఒకలాగా సర్దుకుందామన్నా మొలతాడూ చివికి చివికి ఉందట.

అందని ద్రాక్షపండ్లు పుల్లన

[మార్చు]

తనకు దక్కనిది మంచిది కాదని. అవకాశవాదం, స్వార్థం, పలాయనవాదం.అందని పూలు దేవుడికే అర్పణం అన్నట్టు.

అంధకరదీపికా న్యాయం

[మార్చు]

అశక్తుడు. ఎన్ని మంచి అవకాశాలు కల్పించినా వాటిని అందిపుచ్చుకోలేని వాడు. అంధుడి చేతికి దీపాన్నిస్తే దానివల్ల ప్రయోజనం పొందలేడు.

అందిపుచ్చుకోవడం

[మార్చు]

అలవరచుకోవడం, ఒకరి నుంచి మరొకరు ఏదైనా అలవాటు చేసుకోవటం -== వీడి సహాయాన్ని అంది పుచ్చుకొని పైకెదిగాడు.

అరివీర భయంకరుడు

[మార్చు]

అరివీరుడు అంటే వీరుడైన శత్రువు అని అర్థం. అలాంటి బలమైన శత్రువులకు అంతకంటే బలమైనవాడు ఎదురైతే వాడిముందు ఆ వీరులైన శత్రువులంతా నశించిపోవలసిందే. ఈ భావం ఆధారంగానే గొప్ప గొప్ప శత్రువులను, మహాబలవంతులైనవారిని మించిన బలవంతుడు, అత్యంత సమర్ధుడు అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. 'వాడి జోలికి వెళ్లొద్దు, వాడసలే అరివీర భయంకరుడు సుమా!' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

అర్జీలకు పనులు కావు

[మార్చు]

అడ్డుకట్ట వేయడం

[మార్చు]

అదుపు చేయడమనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఒక ప్రవాహాన్ని ఆపడానికి అడ్డుకట్ట వేయడం అందరికీ తెలిసిందే. ఆ అడ్డుకట్టతో నీటి ప్రవాహాన్ని అదుపుచేసినట్లే ఒకరు మరొకరిని అదుపులో పెట్టే సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'వాడి దూకుడుతనానికి వాళ్ల నాన్న అడ్డుకట్ట వేసి ఓ మంచి పనిచేశాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగించడం కనిపిస్తుంది.

అధఃపాతాళానికి చేరటం

[మార్చు]

దిగజారిపోవడం, పతనమవ్వటం అనే అర్ధాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పాతాళం ఎక్కడో అడుగున ఉంటుంది. అంత అట్టడుగుకు చేరటమంటే ఇక కనిపించకుండా పోవటమనే ఓ భావన ఉంది. ఎంతో గొప్పగా, ఉన్నతంగా ఉండాల్సినవారు తప్పులుచేసి నైతికంగా విలువను కోల్పోయిన సందర్భంలో ఈ జాతీయ ప్రయోగం కనుపిస్తుంది. "నిన్నటి ఆయన ప్రవర్తన ఆయనను అధఃపాతాళానికి చేర్చింది" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

అడగని వాడు పాపాత్ముడు

[మార్చు]

అందరికి దాన మిచ్చేవాడు అని అర్థము. ఉదా: వాడిని అడగని వాడు పాపాత్ముడు. (అడగని వాడు లేడని అర్థం)

అడవి కాచిన వెన్నెల

[మార్చు]

వృధా అయింది. ఉదా: నేను వానికి చేసిన సాయం అడవి కాచిన వెన్నెల అయ్యింది.

అడ్డదారులు తొక్కడం

[మార్చు]

అక్రమ పద్ధతులను అనుసరించడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. మనిషి ఒక గమ్యాన్ని చేరుకోవడానికి ఒకదారి నిర్దేశితమై ఉంటుంది. ఆ దారిలో పదిమంది నడుస్తూ ఒక క్రమపద్ధతిని అనుసరిస్తే అంతా సక్రమంగా ఉంటుంది. అలా కాక అందులో ఎవరైనా స్వార్థబుద్ధితో ప్రవర్తించి అందరికంటే ముందుగా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరడానికిగాను నిర్దేశించిన మార్గంలో కాక వెళ్లకూడని విధంగా అడ్డదోవలో వెళ్లినప్పుడు అతడు లక్ష్యాన్ని చేరవచ్చేమోకానీ ఆ అడ్డదోవలో వెళ్లినప్పుడు చాలామందికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంటుంది. ఎవరి ఇళ్ల మధ్య నుంచి వెళ్లడమో, లేదా మరెవరి పొలం మధ్యనుంచో వెళ్లడమో చేస్తే ఆయా వ్యక్తులకు అసౌకర్యం కలగవచ్చు. ఎదుటివారి అసౌకర్యాలను లెక్కించక తన లాభం కోసం ప్రయత్నించడం పదిమందినీ బాధిస్తుంది కూడా. ఇలాంటి భావన ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. 'అడ్డదారులు తొక్కి, ఎంతమందినో బాధించి సంపాదించాడు.ఇప్పుడు పట్టుబడి జైలుపాలయ్యాడు' అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది.

అడుగంటింది

[మార్చు]

అయిపోయింది, బావిలో గాని, చెరువులోగాని నీరు అయిపోతే దానిని అడుగంటింది అని సామాన్యర్థం. అదే భావంతో ఇంట్లో ఏదైనా వస్తువులైపోతే అదే అదే అర్థంలో అడుగంటింది అని గూడంగా అంటుంటారు. ఖాళీ అయిపోయిందని అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.

అక్షింతలు వేయు

[మార్చు]

నిందలు వేయు

ఆశీర్వదించు కాదు ఇక్కద ..ఆక్షతలు అర్థం ఆశీర్వదించు,

పలాన కేసు విషయంలో కోర్టు వారికి అక్షింతలు వేసింది. అనగా తప్పు పట్టిందని అర్థం.

అచ్చటా, ముచ్చటా

[మార్చు]

ముద్దూ మురిపము = అచ్చటా ముచ్చటా తీరకనే వానికి నూరేళ్లు నిండాయి.

అచ్చిక, బుచ్చిక

[మార్చు]

కలుపుకోలుతనము

అచ్చు, ముచ్చు

[మార్చు]

దొంగ దొర

అచ్చేసిన ఆంబోతులా

[మార్చు]

ఊరిమీదకు జులాయిగా (ఏ పనీ పాట లేకుండా) తిరగడానికి వదిలేసినట్లు. పల్లెటూళ్ళలో బళ్ళు లాగడానికి వాడే ఎడ్లు 'జెల్లకొట్టడం వలన' సంతానోత్పత్తికి పనికిరావు. ఒకటి రెండు గిత్తలను అలా కాకుండా యద అయిన ఆవులను 'దాటించడం కోసం' ఉంచుతారు. దానిని ఆంబోతు లేదా ఆబోతు అంటారు. ఒకో సారి దానికి 'అచ్చు' వేయడం, అనగా వంటిమీద కాల్చిన ముద్ర వేయడం, కూడా జరిగేది. ఈ ఆబోతుకు బాగా మేయడం, బలిసి వూరంతా తిరగడం, యద అయిన ఆవులను 'దాటడం' - ఇదే పని. దానికి అంతా భయపడతారు కూడాను. దానికి బళ్ళు లాగడం, నాగలి దున్నడం వంటి పనులు ఉండవు. కనుక పనీ పాటా లేకుండా తిరిగేవాడిని "అచ్చేసిన ఆంబోతు" లేదా "అచ్చోసిన ఆంబోతు" అని అంటారు. [అచ్చుబోసిన ఆంబోతు ]

అజగరోపవాసం

[మార్చు]

అజాగళస్తనం

[మార్చు]

అజగళ స్థనము అనగా కొన్ని జాతి మేకలకు మెడకింద రెండు వ్రేళ్ళ లాంటి చన్నులుంటాయి. అవి చూడడానికి మేక చన్నులు లాగే వుంటాయి. కాని వాటిలో పాలుండవు. అనగా ఉపయోగము లేనిదని అర్థము.

అజ్ఞాతవాసం

[మార్చు]

ఎవరికంట పడకుండా ఎంతో జాగ్రత్తగా చేసేది. పాండవులు విరాట మహారాజు కొలువులో అజ్ఞాతవాసం చేసిన తీరు.ఏమాత్రం కొద్దిపాటి సమాచారం బయటకొచ్చినా మళ్ళీ సుదీర్ఘకాలంపాటు అరణ్యవాసం చేయాల్సిన దుస్థితి వచ్చేది.

అజాయుద్ధం

[మార్చు]

అట్టుడికినట్టు

[మార్చు]

అందరికి చర్చనీయాంశం కావడం. == వాడు చేసిన నిర్వాకంతొ ఊరంతా అట్టుడికినట్టు ఉంది.

అడపాదడపా

[మార్చు]

అప్పుడప్పుడు ఉదా: 'అడప దడప ఇద్దరూ అలిగితేనె అందం, ఆ అలకతీరాక కలిసేదే అందమైన బంధం' ఒక పాట.

అడకత్తెర / అడకొత్త

[మార్చు]

అడకత్తెరలో పోక చందాన. అనగా ఎటు తప్పించుకోలేని స్థితి అని ఆర్థము.

అడకత్తెరలో పోకచెక్క

[మార్చు]

తప్పించుకోడానికి ఏ మాత్రం అవకాశం లేనప్పుడు ఈ మాటను వాడతారు. వాడు అడకత్తెరలో పోక చెక్కలాగ చిక్కుకున్నాడు.

అడవి ఉసిరి, సముద్రపు ఉప్పు కలిసినట్లు

[మార్చు]

ఎక్కడెక్కడివారో ఒకచోట కలుసుకోవడము = అడవిలో పుట్టిన ఉసిరి, సముద్రంలో పుట్టిన ఉప్పు కలిసి నట్టు.

అడవి కాచిన వెన్నెల

[మార్చు]

ఎంతో విలువైన వస్తువు వృధా అయిపోతున్నదనే అర్ధంలో వాడతారు.

అడుగులకు మడుగులొత్తుతున్నారు

[మార్చు]

అణగి మెణిగి వుంటున్నాడు. ఉదా:.. వాడు అతని అడుగులకు మడుగులోత్తుతున్నాడు. అడుగులకు మడుగులు

వివరణ = గత కాలములో రాజులు, ఇతర ప్రముఖులు సభామందిరమునకు వచ్చేటప్పుడు చాకలివారు ముందుగా చీరలను పరుస్తుంటే వాటిమీద రాజు గారు నడుస్తుండే వాడు. ఈ సంప్రదాయము ఇప్పటికి కొన్ని కులాలలో కొన్ని సందర్భాలలో (ఉత్సవాలలో) జరుగు తున్నది. ప్రముఖుల కాళ్ళు కంది పోకుండా ఇలా వస్త్రం పై నడుస్తుంటారు. దానినే అడుగులకు మడుగు లిడుట అని అంటారు. ఇలా అడుగులకు మడుగులిడిచేవారు చాకలి వారు. అందుకే చాకలిని మడేలు అని అంటారు. లవకుశ సినిమా లోని ఒక పాటలో పద ప్రయోగము చూడండి. చదివినోడికన్నా ఓరన్నా మడేలన్న మిన్నా

అటుకులు తిన్నట్టు

[మార్చు]

శ్రమ లేని పని. అటుకులు తింటే చేతికి ఏమి అంటదు. కడుక్కోక పోయినా పర్వాలేదు.

అరటి పండు వలిచి పెట్టినట్టు

[మార్చు]

చక్కగా విడమరచి అర్ధమయ్యేలా చెప్పడం. అసలు అరటిపండు తినడమే చాలా సులభం. అది కూడా వలిచి పెడితే ఇంక తినేవాడికి ఏ మాత్రం కష్టం ఉండదు. అలాగే అరటిపండు వలిచిపెట్టినట్లు చెప్పితే వినేవాడికి అర్ధం కాకపోవడం జరగదు.

అడుగులకు మడుగులొత్తు

[మార్చు]

చాల వినయం, మర్యాదగా ప్రవర్తించడం. = వాని అడుగులుకు మడుగులోత్తు చున్నాడు.

అడుగు గులాము

[మార్చు]

పాద దాసుడు (అడుగులకు మడుగులోత్తడం)

అడుగూడటం

[మార్చు]

ఆధారం పోవటం పాత్ర పనికిరాకుండా పోవటం. అధికారాలు పోయినవారిని, ఆదరణ నశించిన వారిని, పైకి ఎదిగేందుకు ఆధారం కోల్పోయిన వారిని అడుగు ఊడిన మనిషి అంటారు.

అడగనివాడు పాపాత్ముడు

[మార్చు]

ఒక వూళ్ళో ఒక మంచి ఆసామి అడిగినవాడికల్లా అప్పులో, దానాలో, సలహాలో దండిగా ఇచ్చేవాడు.అడగనివాడికి ఏమీ ముట్టి ఉండదు. మిగిలినవాళ్ళు పుణ్యం చేసుకొన్నారు గనుక కష్టపడకుండా లాభం పొంది ఉంటారు. అడగనివాడు పాపాత్ముడు గనుక సులభంగా ప్రయోజనం పొందే అవకాశం జారవిడుచుకొన్నాడు.

అడవి మృగాల్లాగ

[మార్చు]

విచక్షణా రహితంగా అడవిలో ఉండే జంతువుల్లాగా విచక్షణ అనేది లేకుండా ఎలాపడితే అలా ప్రవర్తించటం

అడ్డగఱ్రలు

[మార్చు]

అడ్డగాలు

[మార్చు]

అడుసు తొక్కటం

[మార్చు]

తప్పు చేయటం .అడుసు తొక్క నేల, కాలు కడుగనేల .బురద అని తెలిసి దాన్ని తొక్కటమెందుకు, తర్వాత దాన్ని వదిలించుకోవటానికి కష్టాలు పడటమెందుకు అని

అడ్డంగా నరుక్కు రావటం

[మార్చు]

నియమ రహితంగా కార్యాన్ని సాధించుకు రావటం == ఈ పని సాధించాలంటే అడ్డంగా నరుక్కురావాలి.

అడ్డమైన గడ్డి

[మార్చు]

ఏది పడితే అది == వాడు అడ్డమైన గడ్డి తింటున్నాడు. \ అక్రమార్జనతో జీవిస్తున్నాడని అర్థం.

అడ్డుపుల్లలు

[మార్చు]

ఆటంకపరచడం. --== నీవు పని చేయకపోగా అడ్డు పుల్లలు వేస్తున్నావు.

అడ్డూ అదుపూ లేకుండా

[మార్చు]

నిరాటంకంగా = వాడి ప్రవర్తనకు అడ్డు అదుపు లేదు.

అడ్డాదిడ్డాలు

[మార్చు]

అదుపులేకుండ.

అదవద

[మార్చు]

కలత.= "గీ. కీలిఁగబళించి యాతమ్మిచూలిమించి, శూలిఁగదలించి యుగ్రగ్రహాళినొంచి, యెందునున్నను దెత్తునీయిందువదన, నదన ననుఁజూడు మదవదల్‌ వదలియధిప." రామా. ౫, ఆ.

అత్త కొంగు

[మార్చు]

సంకటస్థితి . కొత్తగా పెళ్లయిన ఓ కోడలు, ఆమె అత్త ఇద్దరూ కలిసి వేరొక చోటికి వెళ్ళారట. అక్కడ అత్తగారు మైమరిచిపోయి అందరితోనూ మాట్లాడుతున్నప్పుడు ఆమె కొంగు పక్కకు తొలగిందట. కొంగు సరిచేసుకో అని చెప్పేటంతటి చొరవ ఇంకా ఆ కొత్త కోడలికి రాలేదు. చెప్పకపోతే అత్తగారి పరిస్థితి పది మంది ముందూ బాగుండదు కదా అని ఆమె అత్తతో చెప్పాలా, వద్దా? చెబితే ఏమో, చెప్పకపోతే ఏమో, ఆ మాత్రం నాకు తెలియదా అని అందరిముందూ తనను కసురుకుంటుందేమోనని ఆ కోడలుపిల్ల వ్యధ చెందిందట.

అతలాకుతలం

[మార్చు]

అత్తా ఒకింటి కోడలె

[మార్చు]

అత్తమీద చూపులు, అంగటి మీద చేతులు

[మార్చు]

అతిపరిచయం

[మార్చు]

అదను పదను

[మార్చు]

సరియైన సమయము = అదనుపదును చూసి విత్తనం వేయాలి.

తగు సమయము, తగు సందర్భము. = "అదను పదనునె కూర్చి మా యప్పు దీర్చి, సొమ్ము నీవన్నబోమె యీ పోరు మాని." [హరి.-4-37]

అణగ దొక్కాలి

[మార్చు]

గర్వం అణచాలి: ఉదా: వానికి పొగరెక్కువయింది. అణగ దొక్కాలి.

అతని మనసు వెన్న

[మార్చు]

చాల మంచి వాడని అర్థం: ఉదా: అతని మనసు వెన్న: చాల మంచి వాడు.

అత్తరు సాహెబు

[మార్చు]

అతలా కుతలమైంది

[మార్చు]

చెడగొట్ట బడింది. ఉదా: వాడు పనిచేస్తుంటే వీడొచ్చాడు. పనంతా అతాలాకుతలమైంది.

అతిరథ మహారథులు

[మార్చు]

రాజకీయ పోరాటాల్లో రాటుదేలి పేరెన్నికగన్న నాయకులు stalwarts ............ అతిరథ మహారథులైన రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి బన్సీలాల్, లోక్‌దళ్ (బి) నాయకుడు దేవీలాల్‌ రాష్ట్ర బి.జె.పి. అధ్యక్షుడు మంగల్‌ సేన్, మాజీ ముఖ్యమంత్రి బి.డి.గుప్తా తదితర మాజీ మంత్రుల భవితను నిర్ణయించే ఎన్నికలు ఇవి. (ఈ. 18-6-87)

అదరు బెదరు

[మార్చు]

భయపడటము == వానికెక్కడికి కెళ్లడానికైనా అదురు బెదురు లేదు. == అదురుబెదురు లేని వాడు.

అద్దం పట్టడం

[మార్చు]

ఉన్నది ఉన్నట్టుగా చూపటం

అద్దంలో ముడుపు

[మార్చు]

అద్దద్దనటం

[మార్చు]

బాగా బతిమలాడు కోవటం, తమనుతాము తగ్గించుకొని ఎంతో నిదానంగా మాట్లాడటం

అద్దములో నీడకి ఆశపడు

[మార్చు]

అద్దంలో కనబడేది ఆయా వస్తువుల నీడ మాత్రమే. లేదా ప్రతిమ మాత్రమే. అది చేతికిదొరకదు. దానికి ఆశ పడడమంటే, లేని దానికి ఆశ పడడమని అర్థం. వృధా ప్రయాస.

అద్దమరేయి

[మార్చు]

అర్థరాత్రి

అద్వైతం

[మార్చు]

అదుపులో వున్నాడు

[మార్చు]

ఉదా: వీరు పోలీసు వారి అదుపులో ఉన్నారు.

అదెప్పుడు నీళ్ల కుండ నెత్తిన పెట్టుకొని వున్నది

[మార్చు]

ఏడవడానికి సిద్దంగా వుందని అర్థం: (ప్రతి చిన్న విషయానికి ఏడ్చే వాళ్ల గురించి ఈ మాట వాడతారు. ===అందెవేసిన చేయి === మిక్కిలి నైపుణ్యం కలిగిన. ( ప్రహేళికలు విప్పడంలో మా మామయ్యది అందెవేసిన చేయి.)

అధ: పాతాళానికి అణగ దొక్కాలి

[మార్చు]

ఉదా: వాడిని అధ: పాతాళానికి అణగ దొక్కాలి.

అనగి, పెనగి

[మార్చు]

కలసిమెలసి ఉండటము

అన్నదీక్ష - అక్షరదీక్ష

[మార్చు]

అన్నమో రామచంద్రా!

[మార్చు]

అనంతశయనం

[మార్చు]

అనుకేయటం

[మార్చు]

పనిచేయకుండా తప్పించుకు తిరగటం.ఎద్దు పనిచేయకుండా మొండికేసి కూర్చున్నప్పుడు ఎద్దు అనుకేసింది అంటారు.

అనాఘ్రాత పుష్పము

[మార్చు]

వాసన చూడని పుష్పము అనుభవించని వస్తువు == ఉదా: ఆ అమ్మాయి అనాఘ్రత పుష్పము.

అన్నమో రామచంద్రా అను

[మార్చు]

అన్నెము, పున్నెము

[మార్చు]

అన్యాయము, న్యాయము తెలీకుండుట ఉదా:.... వాడికీవిషయంలో అన్నెము పున్నెము తెలీ దు ... అమాయకుడు

అన్ని ఉన్న విస్తరి

[మార్చు]

చక్కగా అణిగి మణిగి ఉండటం. అన్ని ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటే ఎంగిలాకు ఎగిరెగిరి పడుతుందంటారు.

అపరంజిబొమ్మ

[మార్చు]

చాల అందమైన అమ్మాయి. ఉదా: ఆ అమ్మాయి అపరంజి బొమ్మలాగున్నది.

అపసోపాలు పడి వచ్చాడు

[మార్చు]

చాల కష్టపడి వచ్చాడు అని అర్థం: ఉదా: వాడు అపసోపాలు పడి వచ్చాడు

అప్పనంగా దొరికింది

[మార్చు]

ఉచితంగా దొరికింది: సులభంగా దొరికింది. ఉదా:

అప్పారావు హర్కారాలు

[మార్చు]

అప్పు సప్పులు

[మార్చు]

అప్పులు అప్పొ సప్పో చేసి తన పిల్లలను చదివించాడు.

అప్రాచ్యుడు

[మార్చు]

ప్రాచ్య అంటే తూర్పు దిక్కు. అప్రాచ్యం అంటే తూర్పుకి వ్యతిరేకమైన పడమర దిక్కు. అప్రాచ్యులు అంటే పడమటిదిక్కునుంచి వచ్చినవారు. మన దేశానికి పశ్చిమదిక్కునుంచి వచ్చిన పాశ్చాత్యులు అప్రాచ్యులు. మన సంప్రదాయవాదులు ఆంగ్లేయుల్ని అనుసరిస్తున్న వారిని అప్రాచ్యుడు అని అంటారు. ఇది నిందా వాచకము.

అభావ ప్రత్యామ్నాయం

[మార్చు]

అభావం అంటే లేకపోవడం. ప్రత్యామ్నాయం అంటే ఏదైనా లేనిదానికి బదులుగా అని అర్థం. ఏదైనా ఉండవలసిన వస్తువు లేకపోతే దానికి బదులుగా ఇంకొకటి వాడడాన్ని ప్రత్యామ్నాయం అంటాం. పూజలు, యాగాలు చేసినప్పుడు చాలా వస్తువులు దాన ధర్మాలుగా ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఖర్చు భరించలేకపోతే దానికి బదులు మరొక తక్కువ ఖర్చుతో వచ్చే వస్తువును దానంగా ఇస్తారు. ఆవులను కొని దానం చేయలేని వారు అభావ ప్రత్యామ్నాయంగా ఒక రూపాయి బిళ్ళను ఇస్తుంటారు.

అభావవిరక్తి

[మార్చు]

భావం అంటే ఉండడం. అభావం అంటే లేకపోవడం. విరక్తి అంటే కోరిన వస్తువు దొరకనప్పుడు అది అక్కరలేదనుకోవడం. అందుబాటులో లేదు, అది దొరకదు అని తెలిసినప్పుడు దానిమీద విరక్తి పెంచుకోవాడాన్ని అభావ విరక్తి అంటారు.

అమ్మ తోడు

[మార్చు]

ఒట్టు పెట్టడం: ఎక్కువగా చిన్నపిల్లలు అంటుంటారు: ఉదా: అమ్మతోడు వాడిని నేను కొట్టలేదు.

అమాయకుడు

[మార్చు]

ఎలపట దాపట తెలియనివాడు, కుడి, ఎడమలు తెలియనివాడు

అమావాస్య మరణం

[మార్చు]

అమ్మయ్య

[మార్చు]

ఏదేని ఒక పని సాధించాక చవరన అమ్మయ్య సాధించాను అని అనుకొంటారు.

అమ్మలక్కలు

[మార్చు]

చుట్టు పక్కల పరిచయమున్న అడవాళ్ళు. ("'అమ్మ"'లు + "'అక్క"'లు) అమ్మలక్కలంతా ఒకచోట చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు.

అమావాస్యకు..... పౌర్ణానికి వస్తాడు

[మార్చు]

చాల అరుదుగా వస్తాడు: ఉదా: వీడు బడికి అమావాస్యకు పౌర్ణానికి వస్తాడు.

అమీతుమీ

[మార్చు]

అటో, ఇటో / నువ్వో నేనో . సందిగ్ధతను పోగొట్టి విషయాన్ని అటో ఇటో తేల్చేసుకోవడమనే అర్థంలో ఈ పదాన్ని వాడతారు. హిందీ లేదా బెంగాలీ నుండి చేరిన మాటగా అనిపిస్తుంది. ఉదా: నేనెంతగా అడుగుతున్నా బాసు ఏ విషయమూ తేల్చడం లేదు. ఇక లాభంలేదు, ఇవ్వాళ అమీ తుమీ తేల్చుకోవాల్సిందే.

కష్టసమయము దాఁటి ప్రాణము గూటఁబడగానే పలికెడు శబ్దము.

అయిదు పది సేయు

[మార్చు]

అయ్యలవారి నట్టిల్లు

[మార్చు]

అరణ్యరోదన

[మార్చు]

అరణ్యం అంటే అడవి. రోదనం అంటే ఏడుపు. అడవిలో ఏడిస్తే వినేవారు ఉండరు. కాబట్టి ఎవరూ ఓదార్చలేరు, సానుభూతి చూపించలేరు. అందువల్ల ఏడ్చినా ప్రయోజనం లేదు.అనవసరమైన శ్రమ అని ఈ జాతీయానికి అర్థం.

అరణ్యరోదనన్యాయం
సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006 Report an error about this Word-Meaning
అడవిలో ఏడ్చినట్లు. [నిష్ప్రయోజనమని భావం.]

అరవ ఏకాంతం

[మార్చు]

అరికాలి మంట నడినెత్తికెక్కు

[మార్చు]

కోపము ఎక్కువగు ఉదా: వాడు చేస్తున పనిని చూస్తుంటే అరికాలి మంట నెత్తికెక్కుతున్నది.

అరచేతిలో వైకుంఠము చూపు

[మార్చు]

కల్లబొల్లి కబుర్లతొ మాటకారి తనంతో ఎదుటి వాడిని తన వైపుకు తిప్పుకొనుట

అరచేతిలో ప్రాణములుంచుకొను

[మార్చు]

కొన ఊపిరితో వుండడం. == ఉదా:... పాపం ... వాడు అరచేతిలో ప్రాణాలుంచుకొని వచ్చాడు.

అరచేతిలొ స్వర్గం చూపించాడు

[మార్చు]

మహా మాట కారి. తిమ్మిని బమ్మిని చేయగల సమర్థుడు:

అరచేతి మాణిక్యము

[మార్చు]

చేతికి అందుబాటులో వున్న సంపద.

అరవ ఏడుపు

[మార్చు]

అరవ గోల

[మార్చు]

ఆరవీర భయంకరుడు

[మార్చు]

చాల గొప్ప యోధుడు అని అర్థం:

అర్క వివాహం

[మార్చు]

అర్ధరాత్రి మద్దెల దరువు

[మార్చు]

సమయము సందర్భం లేకుండా చేసే పని.

అరకొరగా

[మార్చు]

చాలి చాలని. ఉదా: వారు నాకు అరకొర తిండి పెట్టి అరవ చాకిరి చేయిస్తున్నారు.

అరచేతులు కాపు పెట్టటం

[మార్చు]

ఎంతో జాగ్రత్తగా పరిరక్షించటం.ప్రమిదలో దీపం వెలుగుతున్నప్పుడు గాలి తాకిడికి అది ఆరిపోకుండా అరచేతులడ్డుపెట్టి కాపాడుతుంటారు.

అరవ చాకిరి

[మార్చు]

ఎక్కువ పని: వాళ్లు అరవ చాకిరి చేస్తున్నారు.

అర్రులు చాచు

[మార్చు]

ఎక్కువగా ఆశపడ = ఉదా: వాడు అన్నింటికి అర్రులు చాస్తున్నాడు.

అరుంధతీ దర్శనం

[మార్చు]

అలక పానుపు ఎక్కాడు.

[మార్చు]

అలిగాడు: ఉదా: కొత్తల్లుడు కారు కొనివ్వలేదని అలకపానుపు ఎక్కాడు.

అలవోకగా

[మార్చు]

అతి సులభంగా: ఉదా: అతడు ఆ పనిని చాల అలవోకగా చేసెయ్య గలడు.

అలాత పిశాచం

[మార్చు]

అలంకరణ విద్యార్థి

[మార్చు]

అలంకృతశిరచ్ఛేదం

[మార్చు]

అల్లారు ముద్దు

[మార్చు]

ఎక్కువ మురిపెంగా పెంచటం ఉదా: వారు తమ పిల్లలిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.

అల్లిబెల్లి మాటలు

[మార్చు]

కల్లబొల్లి పలుకులు == వాడు అల్లి బెల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటున్నాడు.

అల్లుక పోయాడు

[మార్చు]

బాగా కలిసి పోయాడు: \ వెంటనే నేర్చు కుంటాడు. ఉదా: వాడు ఆపనిలో కొంత చూపిస్తే చాలు అల్లుక పోతాడు.

అల్లుడికి బెట్టు ఇల్లాలికి గుట్టు

[మార్చు]

అల్లుడు బెట్టుగా వ్యవహరిస్తుండాలని, ఇల్లాలు ఇంటిలో ఉన్న లొసుగులు బయటపడకుండా గుట్టుగా వ్యవహరిస్తుండాలని

అల్లోనేరేడు

[మార్చు]

రాజ జంబూ వృక్షము (నేరేడు చెట్టు) సంగీత విశేషము బాలక్రీడా విశేషము

అవటకచ్ఛపం

[మార్చు]
1. బొరియలోనున్న తాఁబేలు.
2. లోకజ్ఞానము లేనివాఁడు. ఇది కూపస్థమండూకమువంటిది.

అయోమయం జగన్నాధం:

[మార్చు]

ఉదా: వాడొట్టి అయోమయం జగన్నాధం గాడు/

అవాకులు, చవాకులు

[మార్చు]

అడ్డాదిడ్డపు మాటలు .నోటికి వచ్చినట్లు మాటలాడుట.అవాకులు, చవాకులు పేలుట

అవినాభావం

[మార్చు]

అశ్వత్థ ప్రదక్షిణం

[మార్చు]

అశ్వత్థ వృక్ష మంటే రావిచెట్టు. ఆ చెట్టు చుట్టూ తిరగటమే అశ్వత్థ ప్రదక్షిణం. ఎంతకాలమైనా సంతానం కలగని వారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పిల్లలు పుడతారన్నది ఒక మూఢనమ్మకం.

అష్టావక్రుడు

[మార్చు]

ఏకపాదునికి సుజాతయందు పుట్టిన కొడుకు. ఇతఁడు గర్భమున ఉండుకాలమున అనవరతము శిష్యులచే వేదాధ్యయనము చేయించుచు ఉండు తన తండ్రితో శిష్యులు నిద్రలేమింజేసి జడమతులై చదువు తప్పఁజదువుచున్నారు అనిన, తండ్రి కోపగించి 'నీవు అధ్యయనంబునకు వక్రముగా పలికితివి కావున అష్టవక్రుండవై జన్మింపుము' అని కొడుకునకు శాపము ఇచ్చెను. ఇతఁడు అతితేజస్వియును లోకపూజితుఁడును అయి ఉండెను. ఈతని కురూపము చూచి ఒకప్పుడు రంభాద్యప్సరసలు నవ్వినందున, వారు దొంగలచే పట్టుపడునట్లు శపింపఁబడిరి. అది కారణముగ కృష్ణనిర్యాణానంతరము గోపికారూపులై ఉండిన అతని భార్యలు అగు నప్సరసలు అర్జునిని వెంట వచ్చునవసరమున దొంగలచే పట్టుబడిరి.

అష్టావధానం చేయటం

[మార్చు]

అనేక పనులు ఒకేసారి చేయటం, అష్టావధానంలో అవధాని ఎనిమిది మందికి సమాధానాలు చెప్పగలగాలి. అలా ఒక్కడే అనేకమైన పనులు చేస్తుంటే వాడిని అష్టావదానం చేస్తున్నాడని " అంటారు.

అస్సస్సుగా

[మార్చు]

భుక్తాయాసం .భుక్తాయాస స్థితిలో ఉన్న వారు అస్సు, అస్సో అంటూ పడే ఆపసోపాలు

అస్త్రశస్త్రాలు అందించటం

[మార్చు]

పూర్తి సహాయ సహకారాలను అందించటం

అసిధారావ్రతం

[మార్చు]

ఉత్కృష్టమైన వ్రతము. సౌందర్యవతియు, యౌవనవతియు నైన స్త్రీతో నేకశయ్య యందు శయనించి యామెయందు మనసైన బ్రసరింపకుండుట. (కత్తిమీది సాము.)

అహరహం జపించడం

[మార్చు]

నిరంతరం ఒకే విషయాన్ని మాట్లాడడం, పదేపదే చెప్పిందే చెబుతూ ఉండడం అనేలాంటి అర్థాలతో ఈ జాతీయం కనిపిస్తుంది. కొంతమంది ఎదురైన ప్రతివారి దగ్గర తమకు కావలసిన దాన్ని గురించి విసుగూ విరామం లేకుండా చెబుతుంటారు. అలాంటి పరిస్థితులలో 'వాడు అహరహం జపించే ఆ విషయాన్ని గురించి కాస్త మీరైనా పట్టించుకోండి' అనేలాంటి ప్రయోగాలు ఉన్నాయి.

అహినకులికం

[మార్చు]

తిరుమలలో బ్రహ్మోత్సవములుకు అంకురార్పణము చేయుట అనునది ఈ జాతియానికి చాలా ప్రముఖ ఉపయోగము

అంకెల గారడి చేశాడు

[మార్చు]

లెక్కలలో తేడా చూపాడు: ఉదా: అతను అంకెల గారడి చేశాడు. అవకతవలు చాల ఉన్నాయి.

అం అనిన ఢం అననేరడు

[మార్చు]

అం అంటే ఢం రాదుఅని కూడా దీన్ని వాడతారు. అంటే కొంచెం కూడా చదువు రాదు అనే అర్థంలో వాడతారు. పొట్ట కోస్తే అక్షరం ముక్క లేదు అనే జాతీయం కూడా ఇదే సందర్భంలో వాడతారు.

అంకకాడు

[మార్చు]

కలహ ప్రియుడు

అంకాపొంకాలు

[మార్చు]

కోపము, విరోధము, తీవ్రము

అంకురార్పణము

[మార్చు]

అంకురము అనగా మొలక. మొలకెత్తించుట. అంకురార్పణము అనగా ప్రారంభ మని భావము. ఏదేని శుభకార్యము చేయునపుడు మొదలుపెట్టుటకు దీనిని ఉపయోగిస్తారు.

అంగడానపకాయ

[మార్చు]

అంగట్లో ఆనపకాయను ముదురుదా, లేతదా అని చూడటానికి కొనడానికి వచ్చిన వారంతా గోరుపెట్టి గిల్లి చూస్తుంటారు. దీనిమీద అలా గాట్లు పడుతుంటాయి. వేశ్యలను కూడా అలాగే వాడుతుంటారు.

అంగడి పెట్టు

[మార్చు]

అంగడి అనగా దుకాణము లేదా కొట్టు. ఏదన్నా విషయాన్ని అనవసరంగా నలుగురితో చెప్పడాన్ని/బహిరంగపరచడాన్ని అంగడి పెట్టడం, లేదా దుకాణం పెట్టడం అని అంటారు.

అంగ రంగ వైభవంగా...

[మార్చు]

ఉదా: వారి పెళ్ళి అంగ రంగ వైభవంగా జరిగింది

అంగలార్చు

[మార్చు]

అతిగా ఆశపడటం. ఎక్కువగా ప్రతికూలార్ధంలో వాడతారు.

అంగారక జపం

[మార్చు]

అంగుష్ఠ మాతృలు

[మార్చు]

ఏ మాత్రం స్థాయి లేనివారు . బొటనవేలు అన్నివేళ్ళ కంటే పొట్టి.వేలెడంతలేవు నీ కెందుకింత పొగరు అని, నా బొటనవేలంత కూడా లేవు నువ్వేంటి నాకు చెప్పేది అని అంటారు.

అంచుక ఇంచుక

[మార్చు]

ఏదో కొద్ది గొప్ప

అంజనమున మాటలాడనేల?

[మార్చు]

దీనికి ముంజేతి కంకణమునకు అద్దమేల? సమానార్దముగా చెప్పుకొనవచ్చు

అంటగట్టడము

[మార్చు]

కొన్ని సందర్భాలలో కొందరు తెలివి తక్కువ తనంతోనో, తెలివి వుండి మొగమోటముతోనో ఇతరుల ప్రలోభాలకు లోబడి తక్కువ ధర వున్న వస్తువులు గాని ఇతర సేవలు గాని ఎక్కువ ధర పెట్టి కొనేస్తుంటారు. వారి గురించి ఈ మాట వాడుతుంటారు.

అండ దండ

[మార్చు]

ఆదుకొను దిక్కు। "నాకండా దండా నీవేనయ్యా" "భద్రాచలం కొండా.... కావాలా నీకండా దండా....." అను చిరంజీవి పాట గుర్తు రావడంలేదూ!

అంతు పంతు

[మార్చు]

ఆదీ అంతమూ అని అర్థము। అంతూ పొంతూ లేకుండా సాగిపోతున్న మన టీ వీ సీరియల్లు లాగా అన్నమాట :-) మొండి వారి ఆగడాలకు అంతు పొంతు వుండదు.

అంతె సంగతులు

[మార్చు]

తిరిగి రాదు: ఇక మర్చి పోవాలసిందే.. ఉదా: వానికి ఏమైనా ఇచ్చినామా... ఇక అంతే సంగతులే.

అందని ద్రాక్ష పండ్లు పుల్లన

[మార్చు]

అవి తనకు అందలేదు కాబట్టి అవి వుల్లగా వున్నాయని అనడం. ఆవిధంగా మనసును సమాదాన పరచుకోవడం.

అందచందములు

[మార్చు]

అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు

[మార్చు]

వీలు ఐతే అధికారం చేయడం లేకపోతే కాళ్ళు పట్టుకోవడం. ఉదా: == వాడు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకం.

అందలం ఎక్కాడు

[మార్చు]

మంచి పదవిలోకి వచ్చాడని అర్థం: ఉదా: వాడు అందలం ఎక్కాడు.

అందె వేసిన చేయి

[మార్చు]

బాగా అనుభవము ఉన్న: అందెలు కాళ్ళకు, చేతులతో కూడా వేసుకునేవారు గత కాలంలో. ముఖ్యంగా ఏదైన ఒక విద్యలో ప్రావీణ్యత సాధించిన వారికి ఆవిషయానికి గుర్తింపుగా చేతికి ఒక అందే తొడిగేవారు గౌరవ చూచకంగా... అనగా ఆ అందే తొడిగిన వాడు ఒక గొప్ప వాడని అర్థం. అదే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఉదా=== అతను సంగీతంలో అందే వేసిన చేయి

ఆంబోతులా తిరుగు తున్నాడు

[మార్చు]

అడ్డు అదుపు లేకుండా తిరుగు తున్నాడు: ఉదా: వాడు అచ్చోసిన ఆంబోతులా తిరుగు తున్నాడు.

అంబలి పోసి గొంగళి కాజేసినట్టు

[మార్చు]

మేలు చేస్తున్నట్లు నటించి కీడు తలపెట్టడం. ఓ వ్యక్తి పేదవాడిని అంబలి పోస్తాను రా రమ్మని ప్రేమగా పిలిచాడట. ఆకలి మీద ఉన్న ఆ వ్యక్తి అంబలి తాగుతుండగా అతడి దగ్గర ఉన్న గొంగళిని కాజేశాడట.

అంబరాన బిడ్డ పుడితే, ఆముదం పెట్టి ముడ్డి కడిగిందట

[మార్చు]

సాధారణంగా పిల్లలు ఎరిగెతే వారి ముడ్డిని నీళ్ళు పెట్టికడుగుతారు. కాని నీళ్ళకంటే ఖరీదైన ఆముదంతో ముడ్డిని కడుగటం ఓ వింత. ఈ సామెతను పిల్లలను బాగా గారాబం పెట్టినప్పుడు వాడతారు.

అంబాజీపేట ఆముదం

[మార్చు]

పెద్ద మోసము, కుంభకోణము. అనిఅర్థము.

అయితంపూడి ఉద్యోగం

[మార్చు]

అయిదు పది చేయు

[మార్చు]

అయోధ్య, సయోధ్య

[మార్చు]

అక్షింతలు పడ్డాయి

[మార్చు]

చీవాట్లు పడ్డాయి అని అర్థం: ఉదా: బడికి ఆలస్యంగా వచ్చినందుకు ఆ పిల్లవాడికి అక్షింతలు పడ్డాయి.