సామెతలు - వ

Wikibooks నుండి
భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "వ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

వంకరటింకర పోతుంది పాము కాదు[మార్చు]

వంకరో టింకరో వయసే చక్కన[మార్చు]

వంకాయలు కోస్తున్నారా ఇంత సేపు[మార్చు]

ఇంత సేపు ఏం చేస్తున్నారని ఈసడింపుగా అనడం.

వంకలేనమ్మ డొంక పట్టుకు తిరిగిందట[మార్చు]

వంగలేక మంగళవారం అన్నాడంట[మార్చు]

వంట నేర్చిన మగవాడికి సూకరాలెక్కువ[మార్చు]

వంటింటి కుందేలు[మార్చు]

సిద్దంగా వున్న వస్తువు.

వంటిల్లు కుందేలు చొచ్చినట్లు[మార్చు]

వంటి మీద ఈగను కూడ వాలనీయను[మార్చు]

అతి జాగ్రత్తగా కాపాడతానని అర్థం:

వండని అన్నం - వడకని బట్ట[మార్చు]

వండలేనమ్మకు వగపులు మెండు - తేలేనమ్మకు తిండి మెండు[మార్చు]

వండాలేదు, వార్చాలేదు - ముక్కున మసెక్కడిది అన్నట్లు[మార్చు]

వండుకున్నమ్మకు ఒకటే కూర - అడుక్కునే అమ్మకు ఆరు కూరలు[మార్చు]

వంతుకు గంతేస్తే దిగింది బుడ్డ[మార్చు]

వంద మాటలు చెప్పొచ్చు - ఒక్కనికి పెట్టేదే కష్టం[మార్చు]

వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్లు[మార్చు]

వంపున్న చోటకే వాగులు[మార్చు]

వంపుసొంపులే ఫలపుష్పాలు - లేత పెదిమలే తమలపాకులు అన్నట్లు[మార్చు]

వంపూసొంపుల సేవలు వలపు పాన్పు మీదే అన్నట్లు[మార్చు]

వంశమెరిగి వనితను - వన్నెనెరిగి పశువును తెచ్చుకోవాలి[మార్చు]

వగలమారి వంకాయ సెగలేక ఉడికిందట[మార్చు]

వగలెందుకంటే పొగాకు కోసం అన్నట్లు[మార్చు]

వచ్చింది కొంత - పఠించింది కొంత[మార్చు]

వచ్చింది పాత చుట్టమే - పాత చేట గొడుగు పట్టండి అన్నట్లు[మార్చు]

వచ్చిననాడు వరాచుట్టం - మరునాడు మాడ చుట్టం - మూడవనాడు మురికి చుట్టం[మార్చు]

వచ్చిన పేరు చచ్చినా పోదు[మార్చు]

వచ్చేకాలం కన్నా వచ్చిన కాలం మిన్న[మార్చు]

వచ్చే కీడు వాక్కే చెపుతుంది[మార్చు]

వచ్చేగండం చచ్చినా తప్పదు[మార్చు]

వచ్చేటప్పుడు వెంట తీసుకురారు - పోయేటప్పుడు వెంట తీసుకుపోరు[మార్చు]

వచ్చినవారికి వరాలు - రానివారికి శాపాలు[మార్చు]

వచ్చిపోతూ వుంటే బాంధవ్యం - ఇచ్చి పుచ్చుకుంటూంటే వ్యాపారం[మార్చు]

వచ్చీరాని మాట వరహాల మూట[మార్చు]

వచ్చీరాని మాట ఊరీ ఊరని ఊరగాయ రుచి[మార్చు]

వజ్రానికి సాన - బుద్ధికి చదువు[మార్చు]

వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి[మార్చు]

వట్టి గొడ్డుకు అరుపు లెక్కువ[మార్చు]

వట్టి చేతులతో మూర వేసినట్లు[మార్చు]

వట్టి నిందలు వేస్తే గట్టి నిందలు వస్తాయి[మార్చు]

వట్టి మాటలు కూటికి చేటు[మార్చు]

వడ్లగాదిలో పందికొక్కులాగా[మార్చు]

వడ్లగింజలో బియ్యపు గింజ[మార్చు]

వడ్లల్లో, రెడ్లల్లో ఎన్నో రకాలన్నట్లు[మార్చు]

వడ్డించినదంతా మేం తింటాం ఆకులు మీరు నాకండి అన్నట్లు[మార్చు]

వడ్డించేవాడు మనవాడయితే ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు[మార్చు]

వడ్లూ గొడ్లూ ఉన్నవానిదే వ్యవసాయం[మార్చు]

వనితగానీ, కవితగానీ వలచిరావాలి[మార్చు]

వనితకూ వయసుకూ తోడు కావాలి[మార్చు]

వయసుకు వర్జ్యం లేదన్నట్లు[మార్చు]

వయసుకోట వాయనం, సొగసుతోట పాయసం అన్నట్లు[మార్చు]

వయసు తప్పినా వయ్యారం పోలేదు[మార్చు]

వయసుపడే ఆరాటం సోయగాల సమర్పణకే అన్నట్లు[మార్చు]

వయసు ముసలెద్దు - మనసు కోడెదూడ[మార్చు]

వయసొస్తే వంకర కాళ్ళు వాడి అవుతాయి[మార్చు]

వరహాకన్నా వడ్డీ ముద్దు - కొడుకుకన్నా మనమడు ముద్దు[మార్చు]

వరాలిచ్చాం, తన్నుకు చావండి అన్నట్లు[మార్చు]

వరిమొలకా, మగమొలకా ఒకటి[మార్చు]

వలచివస్తే మేనమామ కూతురు వరుస కాదన్నట్లు[మార్చు]

వలపులు మనసుల్ని తడితే కోరికలు తనువుల్ని తడతాయట[మార్చు]

వస్త్రహీనం - విస్తరి హీనం పనికిరావు[మార్చు]

వాచినమ్మకు పాచినన్నం పెడితే పరమాన్నం పెట్టారని ఇరుగుపొరుగులకు చెప్పుకొన్నదట[మార్చు]

వసుదేవుడంతటివాడే గాడిదకాళ్ళు పట్టుకున్నాడు[మార్చు]

ఎంతటి వానికైనా ఒక్కోసారి కాల కలసి రాకపోతె చాల కష్టాలు పడవలసి వస్తుంది. ఈ సామెతలో అదే అర్థం వున్నది

వస్తూ ఏమి తెస్తావు? పోతూ ఏమిస్తావు?[మార్చు]

వస్తే కొండ పోతే వెంట్రుక[మార్చు]

ఒక వెంట్రుకతో కొండను లాగడానికి ప్రయత్నించినప్పుడు వస్తే కొండ వస్తుంది, పోతే ఒక వెంట్రుక పోతుంది. చిన్న పెట్టుబడితో దాదాపుగా అసాధ్యమైనంత పెద్ద లాభం సంపాయించడానికి ఎవరైనా ప్రయత్నించినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదు[మార్చు]

భోజనాలకు బంతిలో కూర్చున్నప్పుడు మొదటగా వున్నావారికి అన్ని పదార్థాలు వడ్డిస్తారు. చివరకు వచ్చేసరికి కొన్ని పదార్థాలు అయిపోవచ్చు. ఆ కారణంగా చివర బంతిలో కూర్చున్న వారుకి అన్ని భోజన పదార్థాలు అందక పోవచ్చు. కాని వడ్డించే వాడు మన వాడైతే మనం చివరన లేదా వెనకగా కూర్చున్నా మన కోసమని మనవాడైన వడ్డించే వాడు మన వద్దకు వచ్చి కావలసిన పదార్థములను వడ్డిస్తాడస్ని అర్థము.

వ్యవసాయం గుడ్డాడి చేతిరాయి[మార్చు]

వ్యసనం ఏడూళ్ళ ప్రయాణం[మార్చు]

వ్రతం చెడ్డా ఫలం దక్కాలి[మార్చు]

వాగాడంబరం - అధిక ప్రసంగం[మార్చు]

వాడికి సిగ్గు నరమే లేదు[మార్చు]

వాడికి సిగ్గు నరమే లేదు- అంటే వాడికి సిగ్గు అనేదే లేదు, సిగ్గు వాడి నైజం కాదు ఎందుకంటే వాడికి సిగ్గు పుట్టించే నరం లేదు. ఇది ఇండోనేసియాలో బాగా ప్రాచుర్యంలో ఉన్న సామెతకు స్వేచ్ఛానువాదం. (original in Indonesia - 'Dia Tidak ada urat malu')

వాడు నామెదడుతింటున్నాడు.[మార్చు]

అనవసరపు మాటలతో విసిగిస్తున్నాడని అర్థం: ఉదా:గంట నుండి వాడు నా మెదడు తింటున్నాడు.

వాడో పెద్ద ముదురు[మార్చు]

మోసగాడని అర్థం:

వాతలు మానుతాయి - వాదులు పోవు[మార్చు]

వానకంటే ముందు వరద వచ్చినట్లు[మార్చు]

వానరాకడ, ప్రాణం పోకడ తెలియదు[మార్చు]

వానలకు మఖాకార్తె - కుక్కలకు చిత్తకార్తె[మార్చు]

వానవుంటే కరువులేదు - మగడు వుంటే దరిద్రం లేదు[మార్చు]

వాన వెలసినా చూరునీళ్ళు పడుతున్నట్లు[మార్చు]

వాపును చూసి బలుపనుకుంటే పొరబాటు[మార్చు]

వాపు బలుపు కాదు - వాత అందం కాదు[మార్చు]

వాములు తినే స్వాములవారికి పచ్చగడ్డి ఫలహారం అన్నట్లు[మార్చు]

వ్యాధికి రట్టు, సంసారానికి గుట్టు కావాలి[మార్చు]

వ్యాధికి మందుకానీ విధికి మందా?[మార్చు]

వ్యాపారం జోరుగా సాగుతోంది, రెండో బర్రెను అమ్మి డబ్బు పంపమన్నాడట[మార్చు]

వాలుచూపులతో గాలమేసి[మార్చు]

ఉదా: వాలు చూపులతొ గాలమెసి వలపులోకి దింపు వారు మీరుగాదా..... (ఆడ వారి గురించి ఒక పాటలో)

విగ్రహపుష్టి నైవేద్యనష్టి[మార్చు]

గంభీరంగా విగ్రహం వలే ఉండి పని తనం లేకుండా ఉండేవారికి ఉపయోగించే సామెత. విగ్రహం ఉంది కాని ఆ విగ్రహాన్ని రోజు నైవేద్యం పెట్టి సేవించడం వల్ల ఉపయోగం లేదు. నైవేద్యం మాత్రం నష్టం.

వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి[మార్చు]

వియ్యం అనగా పెళ్ళి. కయ్యం అనగా యుధ్ధం, పోరాటం. పెళ్ళి సంబంధం వెతికేటప్పుడు తమ ఆస్తీ అంతస్తులకు సరితూగే కుటుంబాన్ని వెతకాలి. లేదా నూతన వధూవరుల కాపురంలో ఆ అసమానతల కారణంగా కలతలు రావచ్చు. అలాగే ప్రత్యర్థి మనకు భుజబలంలోనూ, బుధ్ధిబలంలోనూ సరిసమానుడైతేనే పోరు రక్తి కడుతుంది. బలహీనుని ప్రత్యర్థిగా ఎంచుకొనడం వీరుల లక్షణం కాదు అని చెప్పటానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.

విస్తరి చిన్నది వీరమ్మ చెయ్యి పెద్దది[మార్చు]

విషవలయంలో చిక్కుకున్నాడు[మార్చు]

వ్రాత కరణమా? మేత కరణమా? అన్నట్లు[మార్చు]

వ్రాయగా వ్రాయగా కరణం - దగ్గగా దగ్గగా మరణం[మార్చు]

వ్యాస ప్రోక్తమా? పరాశర ప్రోక్తమా?[మార్చు]

వాసి తరిగితే వన్నె తరుగుతుంది[మార్చు]

విదియ నాడు కాకపోతే తదియ నాడైనా కనపడక తప్పదు[మార్చు]

వినేవాడు వెధవ అయితె పంది కూడా పురాణం చెపుతుంది[మార్చు]

విన్నవన్నీ నమ్మొద్దు నమ్మినవన్నీ చెప్పొద్దు[మార్చు]

ఒకవేళ నమ్మితే ఆ మాటలను మనసులోనే ఉంచుకోవాలి కానీ దాన్ని మరొకరి దగ్గర చెబితే కొన్ని సందర్భాల్లో దోషరహితులను దోషులుగా ప్రచారం చేసినట్లు అవుతుంది.

విందు అయినా మూన్నాళ్ళు - మందు అయినా మూన్నాళ్ళు[మార్చు]

విందు మర్నాడు మందు[మార్చు]

విగ్రహపుష్టి - నైవేద్య నష్టి[మార్చు]

విడవమంటే పాముకు కోపం - పట్టమంటే కప్పకు కోపం[మార్చు]

విడిచిన ముండకు వీరేశలింగం[మార్చు]

విడిచినమ్మలు వియ్యమందబోతే అంతకంటే అడ్డాలమ్మ వచ్చి హారతిపట్టిందట[మార్చు]

విడిచేసిన వాడు వీధికి పెద్ద[మార్చు]

విత్తం కొద్దీ వైభవము[మార్చు]

విత్తటానికి శుక్రవారం - కోయటానికి గురువారం[మార్చు]

విత్తు ఒకటయితే చెట్టు ఒకటౌతుందా?[మార్చు]

విత్తుకొద్దీ పంట[మార్చు]

విత్తు ముందా? చెట్టు ముందా?[మార్చు]

విద్య కొద్దీ వినయము[మార్చు]

విధం చెడ్డా ఫలం దక్కాలి[మార్చు]

విధి వస్తే పొదలడ్డమా?[మార్చు]

విదియనాడు రాని చంద్రుడు తదియనాడు తనకు తానై కనబడతాడు[మార్చు]

విన్న మాట కంటే చెప్పుడు మాట చేటు[మార్చు]

విన్నమ్మ వీపు కాలింది - కన్నమ్మ కడుపు కాలింది[మార్చు]

వినాయకుడి మీద భక్తా? ఉండ్రాళ్ళ మీద భక్తా?[మార్చు]

విని రమ్మంటే తిని వచ్చినట్లు[మార్చు]

వినేవాటికీ - కనేవాటికీ బెత్తెడే దూరం[మార్చు]

వియ్యానికి కయ్యం తోబుట్టువు[మార్చు]

వియ్యానికయినా కయ్యానికయినా సమవుజ్జీ వుండాలి[మార్చు]

వియ్యాలందితే కయ్యాలందుతాయి[మార్చు]

విరిగిన వేలు మీద ఉచ్చ పోయనన్నట్లు[మార్చు]

విరుచుకుని విరుచుకుని వియ్యాలవారింటికి పోతే పలుగురాళ్ళతో నలుగు పెట్టారట[మార్చు]

విల్లంబులు కలవారికి చల్లకుండలవారు తోడా?[మార్చు]

విశాఖ కురిస్తే విషము పెట్టినట్లే[మార్చు]

విశాఖ చూచి విడువర కొంప[మార్చు]

విశాఖ పట్టితే పిశాచి పట్టినట్లే[మార్చు]

విశాఖలో వరదలు - సంక్రాంతికి మబ్బులు[మార్చు]

విశాఖలో వర్షం - వ్యాధులకు హర్షం[మార్చు]

విషానికి విషమే విరుగుడు[మార్చు]

విస్తరి కొదవా, సంసారపు కొదవా తీర్చేవారు లేరు[మార్చు]

విస్తరి చిన్నది - చెయ్యి పెద్దది[మార్చు]

విస్సన్న చెప్పింది వేదం[మార్చు]

విసిగి వేసారి పోయారు[మార్చు]

అన్ని ప్రయత్నాలు చేసి విసిగి పోయారని అర్థం: ఉదా: ఇక ఆ ప్రయత్నం చేయ లేను నేను విసిగి వేశారి పోయాను.

వీధిలో చెప్పుతో కొట్టి, ఇంట్లో కాళ్ళు పట్టుకున్నట్లు[మార్చు]

వీపున కొట్టచ్చుగానీ, కడుపుమీద కొట్టరాదు[మార్చు]

వీపు విమానం మోత మోగుతుంది[మార్చు]

పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తుంటే పెద్దవారు కొట్టడానికి ముందు భయపెడుతూ వీపు విమానం మోత మోగిపోతుంది అని అంటారు. దీని అర్థం విమానం బయలు దేరేటప్పుడు చాలా శబ్దం చేస్తుంది. ఇప్పుడు అల్లరి ఆపక పోతే నే వీపు మీద వేసే దెబ్బలు, అంత గట్టి శబ్దం చేస్తూ, బాధ కలిగిస్తాయి అనే అర్థం ఆధారంగా వచ్చిన సామెత వీపు విమానం మోత మోగుతుంది.

వీరభద్రపు పళ్ళెములాగా[మార్చు]

వీలెరిగి మాట - కీలెరిగి వాత[మార్చు]

వీసం యిచ్చి గంపెడు అడిగినట్లు[మార్చు]

వీసంలో మానెడు తీసినట్లు[మార్చు]

వృద్ధనారీ పతివ్రత[మార్చు]

వృద్ధ వైద్యం - బాల జోస్యం[మార్చు]

వృష్టికి ప్రమాణాలు - ఉత్తర, హస్త కార్తెలు[మార్చు]

వెంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చింది[మార్చు]

వెంటపోయినా వెనుక పోరాదు[మార్చు]

వెంట పోయైనా చూడాలి - వెంట వుండయినా చూడాలి[మార్చు]

వెక్కిరించబోయి వెల్లికిలా పడ్డట్లు[మార్చు]

వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు[మార్చు]

వెదకబోయిన తీర్థం ఎదురయినట్లు[మార్చు]

వెధవముండ కాళ్ళకు మ్రొక్కితే నాలాగే వర్ధిల్లమని దీవించిందట[మార్చు]

వెధవ ముండ యాత్రకు పోతే వెతకను కొందరు, ఏడవను కొందరు[మార్చు]

వెనక నొక్కుళ్ళేనా ముందు పనులున్నాయా అందిట[మార్చు]

వెన్న అరచేతిలో పెట్టుకుంటే అడక్కుండానే కరుగుతుంది[మార్చు]

వెన్న తిన్నవాడు వెళ్ళిపోతే చల్లత్రాగిన వాడ్ని కొట్టినట్లు[మార్చు]

==వీనతో పెట్టిన విద్య చిన్నతనం నుంది అలవాడిన గుణం ==

వెన్నెల వేళే విరహాలన్నట్లు[మార్చు]

వెయ్యి అబద్ధాలు చెప్పయినా ఒక పెళ్ళి చేయాలి[మార్చు]

వెయ్యి గుళ్ళ పూజారి[మార్చు]

వెర్రి కుదిరింది - తలకు రోకలి చుట్టమన్నాడట[మార్చు]

వెర్రివాడా వెర్రివాడా అంటే వెక్కెక్కి ఏడ్చాడట[మార్చు]

వెర్రివాడి పెళ్ళాం వాడకంతటికీ లోకువ[మార్చు]

వెర్రివాడి పెళ్ళాం వాడకంతటికీ మరదలు[మార్చు]

వెర్రివాడి పెళ్ళాం వాడకల్లా వదినే[మార్చు]

వెర్రివాడికి పెళ్ళిచేస్తే వేలెట్టి కెలికాడట[మార్చు]

వెర్రివాని చేతి రాయిలాగా[మార్చు]

వెర్రి వేయి విధాలన్నట్లు[మార్చు]

వెల తక్కువ - ఫల మెక్కువ[మార్చు]

వెండ్రుకలున్నమ్మ ఏ కొప్పైనా వేయగలదు[మార్చు]

మనకున్న వనరులను బట్టి పని చేయాలి. అంతే గాని ఆశగా మనకున్న వనరుల కన్న ఎక్కువున్న పనిని చేయ కూడదు: అలాంటి సందర్భాలలో పుట్టినదే ఈ సామెత. వెండ్రుకలున్న అమ్మ ఏ కొప్పైనా వేయ గలదు. సరిపడ వెండ్రుకలు లేనిదే కొప్పేం వేయ గలదు?

వెంపలి చెట్టుకు నిచ్చెన వేసినట్లు[మార్చు]

వేటుకు వేటు - మాటకు మాట[మార్చు]

వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడయినట్లు[మార్చు]

వేపకాయంత వెర్రి ఎవరికైనా వుంటుంది[మార్చు]

వేలు వంక పెడితేగానీ వెన్న రాదు[మార్చు]

వేలు మీద గోరు మొలిచింది ఏం చేతు మొగుడా అన్నట్టు[మార్చు]

ఏదో ఒక వంక చెప్పి చెయ్యాల్సిన పనిని తప్పించుకోటం

వేగం కన్నా ప్ర్రాణం మిన్న[మార్చు]

వాహనాలు నడిపే వారికి ఈ పలుకుబడి వర్తిస్తుంది. ప్రయాణము వేగవంతమైతే ప్రమాదాలు జరుగుతాయి గనుక, వేగం కన్నా.... ప్రాణం మిన్న అని అంటారు. అనగా మితిమీరిన వేగం ప్రాణ హాని అని అర్థము.

వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడు[మార్చు]

ఒకరికొకరు తోడుగా వుండి ఐకమత్యంగా పని చేసుకోవాలని దీని అర్థం>

వేడినీళ్ళకు ముందు, పంక్తి భోజనానికి వెనుక పోగూడదు[మార్చు]

వేడుకకు వెల లేదు[మార్చు]

వేలం వెర్రి - గొర్రెవాటు[మార్చు]

వేలుకు వేలు ఎడమా?[మార్చు]

వేలు చూసి అవలక్షణ మనిపించుకొన్నట్లు[మార్చు]

వేలు చూపితే హస్తం మింగుతాడన్నట్లు[మార్చు]

వేలు పెట్టేందుకు చోటిస్తే తల దూర్చినట్లు[మార్చు]

వేలు మీద గోరు మొలిచింది వేరుపోదాం రారా మగడా! అన్నదట[మార్చు]

వేలు వాచి రోలంతయితే, రోలు వాస్తే మరెంత కావాలి?[మార్చు]

వేశ్య - వైశ్యుడు అబద్ధాల కోరులే[మార్చు]

వేషాల కోసం దేశాల పాలయినట్లు[మార్చు]

వేషాలమారికి వేవిళ్ళొస్తే, ఉన్నచోటు విడవను అన్నదట[మార్చు]

వేషాలెన్ని వేసినా కూటి కోసమే[మార్చు]

వేసిన వత్తికి - పోసిన చమురుకు సరి[మార్చు]

వేసినట్టే వేస్తే వెర్రివాడైనా గెలుస్తాడు[మార్చు]

వేసిందే ఒక గంతు - దిగిందే ఒక బుడ్డ[మార్చు]

వేసిందే ఒక గంతు - విరిగిందే ఒక కాలు[మార్చు]

వేసేటప్పుడు వేపకొమ్మ, తీసేటప్పుడు పోలేరమ్మ[మార్చు]

మామూలుగా మనం ఎక్కి తొక్కే వేపకొమ్మనే పదిమందీ కూడి ఒకచోట ప్రతిష్ఠించి అమ్మవారుగా భావించి పూజలు పునస్కారాలు జరపడం ప్రారంభించిన తర్వాత ఆ కొమ్మ దేవతామూర్తి అవుతుంది. దానిని బలవంతంగా అక్కడి నుంచి తొలగించదలిస్తే ఆ దేవతను కొలిచే అక్కడి జనంలో ఆగ్రహం రగిలి శాంతి, భద్రతలకు విఘాతం కలుగుతుంది

వేసేది విషముష్ఠి విత్తనాలు - ఆశించేవి మధుర ఫలాలు[మార్చు]

వేసిన వత్తికి పోసిన చమురుకు సరిపోయిందన్నట్టు[మార్చు]

ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉండటం. పడిన శ్రమకు దక్కిన ఫలితానికి సరిపోయిందని చెప్పటం.

వేసినదే ఒకఅడుగు; విఱిగినదే కాలు[మార్చు]

వైద్యం నేర్వనివాడూ - వానకి తడవనివాడూ వుండడు[మార్చు]

వైదీకి వైద్యంలో చచ్చినా ఒక్కటే బ్రతికినా ఒక్కటే[మార్చు]

వైద్యుడి పెళ్ళాంగూడా ముండ మోసేదే[మార్చు]

వైద్యుని పేరు చెపితే రోగాలు పారిపోతాయా?[మార్చు]

వైద్యుని భార్యకే భగంధర రోగము[మార్చు]

వైద్యుడు రోగాలు కోరు - వైశ్యుడు కరువు కోరు[మార్చు]

వైరాగ్యం ముదిరితే వారవనిత కూడా తల్లితో సమానం[మార్చు]

కష్టాలలో చిక్కుకున్నాడు అని అర్థం: ఉదా: అతడు విషవలయంలో చిక్కుకున్నాడు.

  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
"https://te.wikibooks.org/w/index.php?title=సామెతలు_-_వ&oldid=32377" నుండి వెలికితీశారు