Jump to content

జాతీయములు - ఎ, ఏ, ఐ

Wikibooks నుండి

ఎ, ఏ, ఐ - అక్షరాలతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి.

భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆంగ్లభాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని.

జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్థం - తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా స్థిరపడిపోయిన పదరూపాలే జాతీయాలు. భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.

ఎంగిలికెగ్గులేదు

[మార్చు]

ఎగ్గు అంటే కీడు అని అర్థం. ఎవరి ఎంగిలి అయినా తిన్నంత మాత్రాన కీడేమీ జరగదు.

ఎంగిలి మంగలము

[మార్చు]

ఎండ కన్నెరుగక

[మార్చు]

అతి సుకుమారముగ పెరుగుట.ఎండకన్నెరగక ఉండటం.భోగభాగ్యాల నడుమ మాత్రమే పెరగటం అన్నది భావన.అసలేనాడు ఎండలోకే రాకుండా ఉండటం

ఎండకెండి, వానకు తడిసి

[మార్చు]

అన్ని కష్టములకోర్చి

ఎండగట్టడం

[మార్చు]

బాగా బాధించటం, తీవ్రంగా విమర్శించటం == ఈ నాడు దేశంలో పాతుకు పోయిన అవినీతిని అన్నా హజారే ఎండగడుతున్నాడు.

ఎండిన తాటాకు

[మార్చు]

అతిగా స్పందించే గుణం .కొద్దిగా గాలి వీచినా పెద్దగా శబ్దం చేస్తుంది.

ఎండిన దానిమ్మ కాయ

[మార్చు]

బక్కచిక్కి, నీరసంగా ఉండటం.నునుపు నిగనిగ తగ్గిపోయి ఎండిపోయి కనిపించటం.

ఎంత పండినా కూటిలోకే

[మార్చు]

ఎంత పండినా కూటిలోకే, ఎంత ఉండినా కాటిలోకే .పంట ఎంత పండినా దాన్ని కలకాలం నిల్వ ఉంచరు. ఆహార పదార్థంగా ఆ పంట మారాల్సిందే.అలాగే నూరేళ్లు బతికినా అంతకంటే ఎక్కువ బతికినా, అంత ఎక్కువకాలం బతికాడని మరణించాక అతడిని ఇంట్లో ఉంచుకోరు. కాటికి పంపాల్సిందే. అంటే ఎప్పటికో ఒకప్పటికి మరణం తప్పదు కనుక ప్రాణం ఉన్న రోజుల్లోనే జీవితాన్ని పదిమందికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలనే సూచన

ఎకరమంత

[మార్చు]

సువిశాలమైనది బాగా పెద్దది

ఎక్కడ పుట్టిన గడ్డి అక్కడే

[మార్చు]

జన్మస్థలాలను విడిచి వెళ్ళక జననం నుంచి మరణం దాకా ఒకే వూళ్ళో ఉండేవారు.ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండేవారు

ఎక్కడ తగలడ్డావు ఇంత సేపు

[మార్చు]

కోపంతొ ఎక్కడున్నావూ' ఇంతసేపు అనడానికి ఇలా అంటారు.

ఎగదిగ

[మార్చు]

తేరిపార చూచుట పైనుండి క్రిందివరకు చూచుట "పల్లెలోకి క్రొత్తగా వచ్చిన వారిని ఎగదిగ చూడటం సర్వసాధారణం"

ఎగదోయటం

[మార్చు]

విద్వేషాలను రెచ్చగొట్టడం == వారిరువురు పోట్లాడుకుంటుంటే వీరు పక్కన చే ఎగదోస్తున్నారు.

ఎగ నామం పెట్టాడు

[మార్చు]

తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వకుంటే వాడు నాకు ఎగనామం పెట్టాడూ' అంటారు.

ఎగవేయు

[మార్చు]

అప్పు తీసుకొని ఇవ్వక పోతే ఎగరేశాడు అని అంటారు.

ఎగిరి గంతేశాడు

[మార్చు]

అధిక సంతోషంగా వున్న వాణ్ని చూసి ఇలా అంటారు.

ఎగిరే పిట్టలకు గురి చూసినట్టు

[మార్చు]

తెలివి తక్కువ వ్యవహారం, విఫల ప్రయత్నం చేయడం

ఎట్లయినా సాబునే

[మార్చు]

సాబు అంటే సాహెబ్, సాయుబు, గొప్పవాడు, పాలకుడు.ఓడినా, గెల్చినా నేను గొప్ప అని .కిందపడ్డా, మీదపడ్డా నాదే పైచేయిఅని.

ఎడమపక్క సున్నాగాడు

[మార్చు]

విలువలేనివాడు, నిరర్థక జీవితాన్ని గడిపేవాడు .అంకెలకు కుడివైపు ఉన్న సున్నాలు అంకెకు విలువను పెంచుతూ ఉంటాయి. అదే ఎడమ పక్కన పెట్టిన సున్నాకు విలువ ఉండదు.

ఎడమొఖం పెడమొఖం

[మార్చు]

ఒకరి మీద ఒకరికి ఇష్టం లేనప్పుడు వారిద్దరు ఎడమొఖం పెడమొఖంగా వున్నారూ అని అంటారు.

ఎడప దడప

[మార్చు]

అటు ఇటు రెండు వైపులా అని అర్థం.

ఎడా పెడా

[మార్చు]

ఉదా: వాణ్ణి ఎడా పెడా వాయించారు. రెండు వైపులా అని అర్థం.

ఎడ్డెమంటే తెడ్డెమనే రకం

[మార్చు]

ఔనంటే కాదనే రకం:

ఎత్తిన కత్తి దించకపోవటం

[మార్చు]

లక్ష్యాన్ని చేరేవరకు విశ్రమించక పోవటం, అనుకున్నది సాధించే వరకూ వూరుకోక పోవటం

ఎత్తిన పిడికిలి దించొద్దు

[మార్చు]

పోరాటం ఆపొద్దు అని అర్థం.

ఎత్తి పొడచు

[మార్చు]

మనసు గాయపడేలా సూదితో గుచ్చినట్లు మట్లాడటం. == వారు సూటి పోటి మాటలతో ఎత్తి పొడుస్తున్నారు.

ఎత్తుపళ్ళతో కొరికినట్టు

[మార్చు]

కొరకలేరు, నమలలేరు. పళ్ళు ఉన్నా ప్రయోజనం శూన్యమే.పని జరగదు. ఎత్తు పళ్ళతో కొరికినట్త్టెంది అంటారు

ఎత్తు పళ్ళ పోకట

[మార్చు]

భయపడాల్సిన పనిలేదు.మేకపోతు గాంభీర్యం . పోకట అంటే పొగరు .చూడ్డానికి ఓ రకంగానూ, కార్యసాధనలో మరో రకంగానూ కనిపించటం.

ఎత్తు మరగిన బిడ్డా

[మార్చు]

క్రిందకి దించిన ఏడ్చు బిడ్డ ఎల్లప్పుడూ ఎత్తుకున్న బిడ్డ

ఎత్తుపీట

[మార్చు]

ప్రముఖ స్థానం, అగ్రాసనం, ఎత్తుపీట పెద్దకుర్చీ వేసి గౌరవించడం

ఎద్దడుగులో ఏడుగుణాలు

[మార్చు]

ఒకే చోట విభిన్న లక్షణాలుండటం.ఆకాస్తలోనే తేడాలు చూపించటం

ఎదురీత ఈదుతున్నాడు

[మార్చు]

కొని కష్టాలు తెచ్చుకుంటున్నాడని అర్థం.

ఎదురు చుక్క

[మార్చు]

ఎదుగు పొదుగు

[మార్చు]

అభివృద్ధి లేకుండా వుండడము .... వాడి ఉద్యోగం ఎదుగు బొదుగు లేక ఎక్కడ వేసిని గొంగళి చందాన అక్కడే ఉంది.

ఎదురు బొదురు

[మార్చు]

చుట్టుపక్కల వారు అని అర్థం.

ఎనుబోతుపై వాన

[మార్చు]

ఏమిచెప్పినా అర్థం కాకపోవడం, ఏంతచెప్పినా వినిపించుకోకపోవటం.

ఎన్ని గుండెలురా

[మార్చు]

ఎంత ధైర్యం రా నీకు అని అడుగుట == నీకెన్ని గుండెలురా నాతోనే వాదనకొస్తావా?

ఎన్ని వేషాలేసినా కాటికే

[మార్చు]

ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా ఆయువు ఉన్నంతకాలమే అదంతా ఆ తర్వాత ఎవరైనా సరే పోయేది ఒక చోటుకే.

ఎన్నెర్ర కన్నెర్ర

[మార్చు]

ఎన్నుఅంటే వెన్ను కంకి, వెన్ను ఎర్రపడటం అంటే పంట,,4125

ఎముకలు మెళ్లో వేసుకు తిరిగినట్లు

[మార్చు]

చెయ్యకూడని పనిని బాహాటంగా చేస్తూ ఉండటం.చేసిన పనికి సిగ్గుపడక అందరికీ చెప్పుకోవటం

ఎముకలు కొరికే చలి

[మార్చు]

చాలా ఎక్కువ చలి అని అర్థం.

ఎముకలేని చెయ్యి

[మార్చు]

అనగా గొప్ప దాత అని అర్థము./ ఉదా: వాని చేతికి ఎముక లేదు అని అంటుంటారు.

ఎవరికి వారే యమునా తీరే

[మార్చు]

ఒకరికొకరు సహకరించు కోకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఎవరిష్టం ప్రకార వారు నడుచు కోవడం.

ఎరక్కపోయి వచ్చి ఇరుక్క పోయారు

[మార్చు]

తెలియక వచ్చి ఆపదలో చిక్కుకున్నారు అని అర్థమొచ్చే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు.

ఎరుగని వూళ్లో మొరగని కుక్క

[మార్చు]

ఒక వూరి కరణం ఇంకో వూరికి వెట్టి, ఒక వూరి పోలీసు పటేలు ఇంకో వూరి సుంకరితో సమానం లాగా. స్థాన బలం.కుక్క యజమానుల దగ్గర కొత్త వారిని చూసి మొరుగుతుంటుంది. అదే కుక్క పొరుగూరికి వెళితే అక్కడున్న కుక్కలను చూసి తోక ముడుస్తుంది.

ఎర్రటోపీవాళ్లు

[మార్చు]

పోలీసువాళ్లు

ఎర్ర గొర్రె మాంసము

[మార్చు]

మామిడి కాయ కారం, ఆవకాయ

ఎరుక పిడికెడు ధనం

[మార్చు]

మిత్రలాభం.ఎరిగి ఉండటం.బాగా తెలిసి ఉండటం, పరిచయమై ఉండటం.తెలిసినవారుంటే సరుకు అప్పు తెచ్చుకొనే వీలుంటుంది.

ఎల్లయ్య మల్లయ్య చదువు

[మార్చు]

నామమాత్రపు చదువు, మనుషుల పేర్లు మాత్రమే రాసే వరకూ వచ్చి ఆగిపోయిన అక్షర జ్ఞానం

ఎలవెట్టి కయ్యం కొనుక్కున్నట్టు

[మార్చు]

లేనిపోనిది కొని తెచ్చుకున్నట్టు, వెల ఇచ్చి మరీ తగాదాను కొని తెచ్చు కోవటం

ఎల్లమ్మ కొలుపు

[మార్చు]

చాలాసేపు జరిగే పని.ఎల్లమ్మ కొలుపుల్లా ఇంకా ఎంతసేపు ఆ పని చేస్తారు, త్వరగా కానీయండిఅంటారు.

ఎల్లలు లేని

[మార్చు]

ఎదురు లేని.. అడ్డు అదుపు లేని అని అర్థం.

ఎలుక కోసం ఇల్లు తగలపెట్టడం

[మార్చు]

చిన్న తప్పు కోసం పెద్ద ముప్పుల్ని సంకల్పించటం చిన్న తప్పు దొర్లినప్పుడు సహన గుణం ప్రదర్శించకుండా పెద్ద ముప్పును తల పెట్టటం

ఎలుగు సలుగెరిగిన పని

[మార్చు]

నాగలికి దుంపను సరిగా అమర్చకపోతే నేలను దున్నటం వీలుకాదు.దుంప వదులుగా ఉన్నా బాగా ముందుకు బిగిసి ఉన్నా రెండూ ఇబ్బంది.ఎలుగు ఎక్కువైతే నాగలి కర్ర నేల మీద ఆనదు.పనిలో జాగర్తగా ఉండమని, ఎలుగు సలుగెరిగి చేస్తేనే పనిసులువుగా జరుగుతుందని.

ఎలుగ్గొడ్డుకు తంటసం తీసినట్లు

[మార్చు]

వృధా ప్రయాస. ఎంత తీవ్రంగా పనిచేసినా దానికి తగిన ప్రతిఫలం దక్కదు. అసలు పని చేయలేదేమోనన్న భావన ఎదుటి వారికి కలిగి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు వస్తుంటాయి.త్వరగా అయ్యేపనికాదు

ఎళ్ళ బారిపోవటం

[మార్చు]

ప్రాణం పోవటం, వెళ్ళటం, పారిపోవటం .ఏదో ఈ జీవితం ఇలా ఎళ్ళబారిపోతే చాలు

ఎవరికైనా వేపకాయంత వెర్రి వుంటుంది

[మార్చు]

ఏ ఎండకాగొడుగు పట్టే రకం

[మార్చు]

పచ్చి అవకాశ వాధి అని అర్థం.

ఏండ్లూ పూండ్లు

[మార్చు]

చాలా కాలము

ఏకై వచ్చి మేకై కూర్చున్నాడు

[మార్చు]

ఏనుగు కూర్చున్నా గుర్రమంత ఎత్తే

[మార్చు]

ఉత్తములు కాలం కలిసిరాక కష్టాలపాలైనా వారి వ్యక్తిత్వం, సమాజంలో వారంటే ఉన్న మంచితనం ఏవీ పూర్తిగా తరిగిపోవు.మంచివారు ఒక్కోసారి కలిసిరాక చతికిలపడ్డా వారి పరువు పోదు.

ఏనుగు దాహం

[మార్చు]

పేరాశ, అత్యాశ

ఏకిపెట్టడం

[మార్చు]

ఎవరైనా తప్పులు చేసినప్పుడు ఆ తప్పులన్నిటినీ ఎదుటివారు ఏ ఒక్కదాన్నీ విడిచి పెట్టకుండా అన్నిటినీ తీవ్రంగా విమర్శిస్తున్న సందర్భం.దూదిని పరుపులు లేదా దిండ్ల కోసం సిద్ధం చేసేటప్పుడు దానిలో ఉన్న దుమ్ము, ధూళిని పోగొట్టటానికి ఏకుతుంటారు. ఏకిన తర్వాత దూది శుభ్రపడుతుంది.చేసిన తప్పులు దూదికంటుకున్న దుమ్ము, ధూళి లాంటివి. ఆ తప్పులను విమర్శించి చేసిన వారికి అవి తప్పులని తెలియచెబితే వాటికి దూరంగా ఉండే ప్రయత్నం జరుగుతుందన్న భావన

ఏకు మేకవటం

[మార్చు]

మెత్తగా వచ్చి, గట్టివాడై ద్రోహం చేయటం..అల్పుడు అధికుడై, బలహీనుడు బలవంతుడై ఎదురు తిరగటం.

ఏకులు పెట్టిన బుట్ట

[మార్చు]

ఏకులు పెట్టిన బుట్ట చాలా ఏకులు తనలో ఇముడ్చుకోగలుగుతుంది. కష్టాలొచ్చినా దిగమింగుకుంటూ ఎప్పుడూ బయట పడకుండా ఉండే వ్యక్తులు

ఏకుల్లేని రాట్నం

[మార్చు]

పనికి రాకుండా వృధాగా ఉండటం .ఏకులే లేనప్పుడు ఇక ఆ రాట్నం వృథాగా పనికి రాకుండా ఉండిపోవాల్సిందే.

ఏటావలి గిలిగింతలు

[మార్చు]

సాహసోపేతం.దూర ప్రాంతాల్లో ఉండి ఆత్మీయుల దగ్గరకు సమయానికి చేరుకోలేని పరిస్థితి

ఏటికోళ్ళు

[మార్చు]

నమస్కారములు

ఏడులు పూడులు

[మార్చు]

చాలా కాలము

ఏడుకట్ల సవారీ

[మార్చు]

పాడే అని అర్థం

ఏటావలి గిలిగింతలు

[మార్చు]

ఏనుగు తిన్న వెలగపండు

[మార్చు]

ఏనుగు తిన్న వెలగ పండు పేడలో కాయ లాగానే బయటకు వస్తుంది. కాని దాని లోపలి పదార్థమంతా మాయ మై ఖాళీగా వుంటుంది. (ఇది ఈ జాతీయం నిజార్థం. అసలర్థం ఏమంటే........ ఎదుటి వాడికి తెలియకుండా మోసం చేసి అతడిని నష్టపరిచే వారి గురించి ఈ జతీయము చెప్తారు.)

ఏనుగుదాహం

[మార్చు]

అత్యాశ, అధిక దాహం అనే సందర్భాలలో వాడుతారు.

ఏనుగుమీది సున్నము

[మార్చు]

ఏనుగుపాడి

[మార్చు]

సమృద్ధి అని అర్థం.

ఏనుగు కొమ్ము

[మార్చు]

ఏనుగుకు కాలు విరగటం దోమకు రెక్కవిరగటం ఒకటే

[మార్చు]

కష్టాల తీవ్రత పెద్దవారికొకలాగా చిన్నవారికొకలాగా ఉండవు.కష్టాలు అందరూ అనుభవించాల్సిందే

ఏనుగు కోసం రాజు, పంది కోసం దొమ్మరి బాధపడినట్లు

[మార్చు]

కష్టాలు ఎవరి స్థాయిలో వారికుంటాయి.'రాజు ఏనుగుపోయి బాధపడితే... దొమ్మరి పందిపోయి బాధపడ్డట్టు

ఏనుగు దాహము

[మార్చు]

చాలా ఎక్కువగు దాహము

ఏనుగు మేత

[మార్చు]

సింహభాగం అధిక భాగం లాగ. ఏనుగు దాని ఆకారానికి తగ్గట్టుగానే మేత మేస్తుంది. ఏనుగంత మేత ఏనుగు మేసేంత ఎక్కువమేత అని,

నే నెక్కడా తా నెక్కెడ

[మార్చు]

నేనెక్కడా తనెక్కడ? (నాతో నీవు ఏవిషయంలోను సమ ఉజ్జీ కాదని చెప్పడమే ఈ జాతీయం యొక్క అర్థం.)

ఏ నోరు పెట్టుకొని మాటలాడుదుము?

[మార్చు]

ఒకడు చేసిన తప్పును కప్పిపుచ్చుకొనడానికి అబద్ధం చెప్పి ఆతర్వాత అసలు విషయం తెలిసి పోతే ఈ మాట వాడతారు.

ఏపూరోని దీపం మలిగినట్టు

[మార్చు]

ఏపూరి వంశం వారు ప్రజలను ఇబ్బందులపాలు చేయటంతో ఆ బాధలు తట్టుకోలేక ఆ గ్రామాల్లోని ప్రజలంతా వేరే ప్రాంతాలకు వలస వెళ్ళారట. ఆ ప్రజల ఉసురు తగిలి ఆ వంశం అంతా నిర్వంశం అయిందట. ఆ ఇళ్ళలో దీపం మలగలేదు (వెలిగించే వారే లేకుండా పోయారని అంటారు). నిర్వంశం కావటం లేదా దీపం వెలిగించే దిక్కు లేకుండా పోవటం

ఏ బట్టకా బట్ట మాసిక

[మార్చు]

సమ ఉజ్జీగా ఉండేవాళ్ళే ఒకటిగా కలిసిపోగలరని చెప్పటం.ఏ గూటి పక్షి ఆ గూటికి చేరినట్టు .

ఏ మరకా అంట లేదు

[మార్చు]

ఏలాంటి నింద అతని మీద పడలేదు: ఉదా: ఈ వ్యవహారంలో అతనికి ఏ మరకా అంటలేదు.

ఏమాట కామాటె చెప్పుకోవాలి

[మార్చు]

ఇదొక ఊత పదం.

ఏ మొఖము పెట్టుకొని వెళ్ళెదము?

[మార్చు]

తమ ఇంటికి వచ్చిన ఒకరిని వెళ్ల గొట్టి ఆతర్వాత అవసర నిమిత్తం వారింటి వెళ్లవలసి వస్తే ఇలా అనుకుంటారు.

ఏ యెండకాగొడుగు పట్టు

[మార్చు]

అవకాశవాదం నీతి నియమాలు మాని సందర్భాను సారం తనకు లాబమైన పని చేసే వారిని గురించి దీన్ని వాడతారు

ఎల్లలు లేని

[మార్చు]

ఏలుముడి

[మార్చు]

తక్కువ స్థాయి . సిగను వేలుతో ముడివేసుకోవటం

ఏరు ఎండినా వయసు ముదిరినా

[మార్చు]

ఏ పని చేయాలన్నా తగిన సమయానికే చేయాలి. సమయం మించి పోయాక అవకాశాలన్నీ అయిపోతాయి.వయస్సు మీరిన తర్వాత, నది ఎండిపోయిన తర్వాత చెయ్యగలిగింది ఏమీ లేదు అని

ఏలేశ్వరోపాధ్యాయుడు

[మార్చు]

ఏసులేని కొంప

[మార్చు]

ఏసు అంటే అభివృద్ధి, ఎదుగుదల లేని ఇల్లు

ఐదు పది కావటం

[మార్చు]

ఓడిపోవటం రెండు చేతుల్నీ ఒక చోటికి చేర్చినమస్కారం పెట్టడం అనేది ఓడిపోవటానికి, పారిపోవటానికి, లొంగిపోవటం లేదా మర్యాదపూర్వకంగా దండం పెట్టడాన్ని ఇలా అంటారు నిఘూడంగా.

ఐపు ఆజ్ఞ

[మార్చు]

అజా పజా

ఐరావతం

[మార్చు]

మోయలేని భారం == దేవేంద్రుడి వాహనం ఐరావతం. ఇది తెల్ల ఏనుగు. ఇది దైవంతొ సమానం. దీని చేత పనులు చేయించ కూడదు. అయినా మంచి ఆహారం పెట్టలి. అది మోయ లేని భారం.

ఐరావటం

[మార్చు]

కలిసి రావటం, లాభపడటం.అయి వచ్చింది, అయ వచ్చింది, ఐ వచ్చింది అంటారు.

ఐసరు బొజ్జ

[మార్చు]

అయిసర బజ్జా అని ఊపుతెచ్చుకొని దూకటం లేదా భారమైన పనిచేసెటప్పుడు పాట పాడుతు ఈ మాట అంటారు./

ఐలెస్సా

[మార్చు]

ఐలెస్సా ఐలెస్సా.... అని పూపు తెచ్చుకిని అందరు కలిసి బరువులను లాగటము. ఐసర బొజ్జా లాంటిదే ఈ మాట కూడ./