Jump to content

జాతీయములు - చ, ఛ

Wikibooks నుండి
భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


చకచకా

[మార్చు]

తొందరగా... వేగంగా.... అని అర్థం: ఉదా: చకచకా ఈ పని చేసేయాలీ

చక్కలిగిలి సంబరం

[మార్చు]

తాత్కాలిక ఆనందం . కొంతమంది తమపని చేయించుకొనేందుకు ముఖస్తుతి మాటల్ని మాట్లాడుతూ పొగుడుతుంటారు. ఆ పొగడ్తలు కాసేపే ఉంటాయి. ఇది ఎలాంటిదంటే చక్కలిగిలి పెట్టినప్పుడు కాసేపు నవ్వనిపిస్తుంది. చక్కలిగిలి ఆపగానే నవ్వూ ఆగిపోతుంది.

చక్రం తిప్పాడు

[మార్చు]

ఆతను చక్రమేమి తిప్పడంలేదు.. కాని రాజ్యమేలుతున్నాడు. అన్నింటా అతని మాటే చెల్లుబాటవు తున్నదని అర్థం. ==చక్కర్లు కొడుతున్నాడు== అనగా ఏమీ పని లేకుండా ఊరికే తిరగటం అనే సందర్భంలో వాడుతారు

చకార గుడులు

[మార్చు]

చక్కెర చిలుక

[మార్చు]

మంచితనం, సహృదయత.ఎంతమందినైనా మెప్పించగలవ్యక్తి.అందరికీ ఇష్టుడు

చచ్చి చెడి వచ్చాడు

[మార్చు]

చాల కష్ట పడి వచ్చాడు అని అర్థం: ఉదా: వాడు చచ్చి చెడి వచ్చాడు.

చచ్చి బతికినట్టైంది

[మార్చు]

చాల కష్ట పడ్డాడని అర్థం: ఉదా: దాన్ని సాధించడానికి చచ్చి బతికినంత పనైంది.

చచ్చినోడి కళ్లు చారెడన్నట్టు

[మార్చు]

గతకాల వైభవం, మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి లాగా.

చచ్చినంత ఒట్టు

[మార్చు]

ఉదా: నేను నిజమే చెపుతున్నాను చచ్చినంత ఒట్టు.

చచ్చి పుట్టినట్టు

[మార్చు]

ఘోర ప్రమాదం నుంచి బయటపడటం.బతికి బయటపడటం. తిరిగి పుట్టడంతో సమానం.

చతుర్ముఖ పారాయణం

[మార్చు]

పేకాట.చతుర్ముఖుడు అంటే నాలుగు ముఖాలు కలవాడు, బ్రహ్మదేవుడు. పేకముక్కకు ఉండే నాలుగు కోణాలు నాలుగు ముఖాలు. దైవానికి సంబంధించిన మంత్రాన్నో, కథనో ఏకాగ్రతతో పారాయణం చేసినంత దీక్షతో పేకాటను ఆడుతుంటారు.

చప్పగా ఉండడం

[మార్చు]

నిస్సారంగా ఉండడం రుచీపచీ లేకపోవటం: అతని ఉపన్యాసము చాల చప్పగా ఉంది. ఇక్కడ రుచితో పనిలేదు.. చప్పగా అంటే గొప్పగా లేదని అర్థము

చప్పట్లు చరచటం

[మార్చు]

హర్షాన్ని ప్రకటించటం ఆనందం, సంతోషం లాంటివి కలిగినప్పుడు కరతాళ ధ్వనులు చేస్తూ ఎదుటివారిని మెచ్చుకోవటం, తమ సంతోషాన్ని ప్రకటించటం

చరచర

[మార్చు]

వేగంగా వెళ్ళటం, చరచరా జరిగిపోవటం.

చర్విత చరణం

[మార్చు]

అంతకుముందు నమిలిన దాన్నే మళ్ళీ మళ్ళీ నమలటం, నెమరు వేయటం, మళ్ళీ మళ్ళీ చెప్పటం, చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయటం

చల్లబడటం

[మార్చు]

ఆవేశం తగ్గటం. = ఉదా: వాడిప్పటికి చల్ల బడ్డాడు.

చల్లని సంసారం

[మార్చు]

ప్రశాంతమైన కుటుంబ జీవనం .ఏ గొడవలూ లేకుండా హాయిగా గడిచిపోయే చల్లని సంసారం

చవితి నిందలు

[మార్చు]

చెయ్యని తప్పునకు శిక్ష అనుభవించటం అనుకోకుండా అపవాదులొచ్చి పడటం లాంటివి .శ్రీకృష్ణుడు అనాడు పాలు పితుకుతూ పాల కుండలో చవితి చంద్రుడిని చూసినందు వల్లనే నిందల పాలయ్యాడన్న మూఢనమ్మకం.

చంకదుడ్డు శరణార్థి

[మార్చు]

చంచాగాడు

[మార్చు]

ఉదా: వాడొట్టి చంచాగాడు: ఒకరి మాటలను మరొకరికి చెప్పి కాలం వెళ్ల దీశె వాడు.అలాంటి వారిని గురించి ఈ మాట వాడతారు

చంకలు గుద్దుకున్నాడు

[మార్చు]

అతిగా సంతోష పడు తున్నాడు. ఉదా: వాడు సంతోషంతో చంకలు గుద్దుకుంటున్నాడు.

చెంపకు చారెడు కన్నులు

[మార్చు]

చారెడంత కన్నులు ఎక్కడా వుండవు. అతిశయోక్తిగ చెప్పేటప్పుడు అలా అంటారు. అనగా చాల పెద్ద కన్నులున్నవని అర్థము

చండి

[మార్చు]

చందమామ ఘుటిక

[మార్చు]

చతుర్ముఖ పారాయణం

[మార్చు]

బ్రహ్మదేవుడికి మొదట్లో అయిదు తలలు ఉండేవట. ఆ ఐదవ తల గాడిదతలలాగా ఉండేదిట. భైరవుని రూపంలో ఉన్న శివుడు బ్రహ్మమీది కోపంతో అతని ఐదవతలను నరికివేసాడుట. అప్పటినుండి బ్రహ్మకు నాలుగు తలలో మిగిలాయట.బ్రహ్మదేవుడు వేదాలను నిరంతరం పలుకుతూ ఉంటాడుట. ఒక్కొక్క తలతో (ముఖంతో) ఒక్కొక్క వేదం చతర్వేదాలను చదువుతూ ఉంటాడుట. అందుకే అతనిని చతుర్ముఖుడు అంటారు. చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మకు నాలుగు తలలున్నాయి .

పేకముక్కలలో ఉన్న జాకి, రాజు, రాణి వంటి బొమ్మలు ఉండే కార్డులన్నీ నాలుగు వైపులా మొఖాలను తిప్పు ఉంటాయి. కనుక పేకముక్కలు ఆడడాన్ని గురించి చతుర్ముఖ పారాయణం అని అంటున్నారు.

చvitivaani chevilo shankam oodhinatlu

[మార్చు]

చవి కెక్కిందా

[మార్చు]

చంకనెక్కించుకోవటం

[మార్చు]

ఎక్కువగా అభిమానించటం, గౌరవించటం. (ఆ విద్యార్థి గురువు గారి చంకనెక్కాడు

చంచాగాడు

[మార్చు]

చండి

[మార్చు]

చండామార్కులు

[మార్చు]

చందమామ ఘుటిక

[మార్చు]

చాకలి కూర

[మార్చు]

చాకలి కూర

[మార్చు]

చాకలి కూరలో అన్ని రకాల కూరలు కలసి వుంటాయి. ఆ విదంగా అన్ని విషయాలు/పనులు కలగా పులగంగా చేస్తే ఈ మాటను వాడతారు.

చాకి రేవు పెట్టాడు

[మార్చు]

రహస్యమైన విషయాన్ని అందరికి చెప్పేశాడు. ఉదా: ఎవ్వరికి చెప్పొద్దని వానికి ఈ మాట చెపితే వాడు చాకి రేవు పెట్టాడు.

చాగ్గుడి ఇవ్వటం

[మార్చు]

అసహ్యించు కోవటం చి ఛీ అవతలికి పో అనడం. చ అక్షరానికి గుడి ఇస్తే చీ అవుతుంది అలా నిఘూడంగా చెప్పడం.

చావు కబురు చల్లగా చెప్పాడు

[మార్చు]

చావో రేవో తేల్చు కోవాలి

[మార్చు]

చాంతాడంత పొడవుంది

[మార్చు]

చాంద్రాయణ(వ్రత)ం

[మార్చు]

చాట చేపాయి

[మార్చు]

తిరిగిరాని అప్పు .చేపాయి అంటే చేబదులు . బస్తా ధాన్యం అప్పు తీసుకుంటే ఎవరికైనా లెక్కగా గుర్తుంటుంది. అలాకాక అప్పుడప్పుడు ఓ చాటెడు ధాన్యం అప్పు తీసుకుంటే ఇచ్చిన వారు కూడా త్వరగా అడగరు. ఇలా ఆ అప్పు తిరిగిరాని ఖాతాలో పడిపోతుంది.

చాటలో పడ్డనాడు

[మార్చు]

భూమ్మీద పడ్డవేళ, పుట్టిన మరుక్షణం .శిశువునుపుట్టగానే పూర్వం చాటలో ఉంచేవారు..

చాటలో బియ్యం, నూతిలో నీళ్ళు

[మార్చు]

సర్వం సిద్ధం అని, అన్నీ అమరి ఉండటం, సులువైనపని

చాటలో వెలగకాయ

[మార్చు]

చాలా స్పష్టంగా కనబడేది

చాప కింద నీరులాగ

[మార్చు]

చాపకిందికి నీరు చేరే టప్పుడు ఏ మాత్రం తెలియదు. చాపంతా తడిసి పోయేంత వరకు తెలియదు. అలాకె కొంత మంది మనవైపున చేరి మనకు తెలియకుండానె మన విషయాలను గ్రహించి మన శత్రువులకు చెప్తారు. ఆ సందర్భంగా ఈ మాటను వాడ తారు.

చావు కబురు చల్లగా చెప్పాడు.

[మార్చు]

అర్థం: అతి ప్రాముఖ్యమైన విషయాన్ని సాధారణ విషయం లాగ చెప్పాడు.... అని అర్థం.

చావో రేవో తేల్సుకో

[మార్చు]

ఉదా: ఎన్ని రోజులు ఈ ముసుగులో గుద్దులాట? ఈ సారి చావో రేవో తేల్చుకోవలసిందె

చాలు కొంటి చాలు

[మార్చు]

నాగటిచాలు పొలం దున్నేటప్పుడు ఒక చాలు పక్కన ఉండే చాలు మళ్ళీ అలాగే ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చే అలవాట్ట్లు లక్షణాలు .నీవు నీ అయ్యకు చేసిన మర్యాదనే నేను నీకు చేస్తున్నాను అన్నాడట కొడుకు.

చాంతాడంత పొడవు

[మార్చు]

అతి పొడవైన: అక్కడ క్యూ చాంతాడంత పొడవుంది.

చిక్కని కాపురం

[మార్చు]

చిక్కు ముళ్లు వేశాడు

[మార్చు]

చిగురు టాకులా వణికి పోతున్నాడు

[మార్చు]

చిచ్చర పిడుగు

[మార్చు]

చిన్న చూపు చూశాడు

[మార్చు]

చిటికెలో వస్తా

[మార్చు]

చిదంబర రహస్యం

[మార్చు]

చిలక పలుకులు

[మార్చు]

చిల్లర శ్రీమహాలక్ష్మి

[మార్చు]

చిలకా గోరింకల్ల వున్నారు

[మార్చు]

చిల్లి గవ్వకు కూడ సరిరాడు

[మార్చు]

చిలక్కి చెప్పినట్టు చెప్పాను

[మార్చు]

చిల్లి కాసుకు కూడ కొరగాడు

[మార్చు]

చిలికి చిలికి గాలి వాన గా మారింది

[మార్చు]

చించేశాడు

[మార్చు]

విజృంబించాడు అని అర్థం: ఉదా: సచిన్ ఈరోజు ఆటలో చించేశాడు. అటువంటి సందర్భంలో వాడే మాట ఇది.

చింతాకంత

[మార్చు]

అల్పమైనది, చాలా చిన్నది . అరిటాకు, తామరాకు పెద్దవి. .

చింతకాయలు రాలి నట్లు

[మార్చు]

ఏ చెట్టు కాయలైనా అవి పండినతర్వాత ఆచెట్టులోని కాయలు ఒకటో రెండో రాలి పడతాయి. మిగతావాటిని మనుషులే చెట్టెక్కి కోసుకోవాలి. కాని చింత చెట్టు కాయలు పండినతర్వాత బలమైన గాలి వీస్తే ఆ చెట్టులోని కాయలన్ని టప టప మని అన్ని ఒక్కసారిగా రాలి క్రింద పడతాయి. అలా అన్నీ ఒక్క సారిగా రాలిపోతే చింతకాయలు రాలినట్లు అని ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

చిక్కు ముళ్లు వేశారు

[మార్చు]

అడ్డంకులు కల్పించారని అర్థం.

చిగురుటాకులా వణికి పోతున్నాడు

[మార్చు]

చాల భయ పడుతున్నాడు; ఉదా: వారు చిగురుటాకులా వణికి పోతున్నారు.

చిచ్చర పిడుగు

[మార్చు]

అల్లరి పిల్ల వాడని అర్థం: ఉదా: ఆ పిల్లవాడు చిచ్చర పిడుగు.

చిన్న ఇల్లు

[మార్చు]

రెండో భార్య ఇల్లు, చిన్నభార్య ఉండే ఇల్లు, వివాహేతర సంబంధం

చిన్నచూపు

[మార్చు]

చులకన చేయు. ఆ మంత్రి గారు బడుగు జీవులను చిన్న చూపు చూస్తున్నాడు.

చిన్న మాటలు

[మార్చు]

అవమానకరమైన మాటలు అని అర్థము: ఎవరైన అవమాన కరమైన మాటలు మాట్లాడుతుంటే ఈ సామెతను ఉదహరిస్తారు.

చిటికెల పందిరి వేయటం

[మార్చు]

ఉత్తుత్తి మాటలు చెప్పటం, క్రియా శూన్యం. పందిరంటే గుంజలు పాతటం, వాసాలు కట్టి ఆకులు కుట్టడం లాంటి పనులన్నీ చేయాలి. అలాకాక కేవలం అవన్నీ చేసినట్టు గాలిలో చిటికలు వేసి అభినయం చేసినంత మాత్రాన అక్కడ నిజంగా పందిరి ఏర్పడదు. చేయాల్సిన పని చేయక మాటలతో కాలక్షేపం చేయటం.

చిటికెలో

[మార్చు]

స్వల్ప వ్యవధిలో. ( ఉదా: చిటికెలో వచ్చేస్తా....)

చిటపటలాడటం

[మార్చు]

కలహించటం, ఎప్పుడూ అసహనంగా, దురుసుగా మాట్లాడటం

చిటపటలు

[మార్చు]

కోపతాపాలు, అల్లరులు . వంటకోసం పొయ్యిలో రాజేసిన మంట సజావుగా వెలుగుతూ ఉంటే వంట త్వరగా అయిపోతుంది.మంటకు బదులు చిటపటమంటూ నిప్పురవ్వలు వెలువడుతూ ఉంటే ఇబ్బంది.

చితికిల బడ్డాడు

[మార్చు]

బ్రతుకు పోరాటంలో ఓడి పోయాడని అర్థం:

చిత్తు చిత్తు చేశాడు

[మార్చు]

చిత్తు చిత్తుగా తాగాడు

[మార్చు]

చిన్న చూపు చూశాడు

[మార్చు]

బాగ కొట్టాడని అర్థం. ఓడించాడని కూడా అర్థం.

చిందులేస్తున్నాడు

[మార్చు]

చాల కోపంగావున్నాడని అర్థం.

చిపచిప

[మార్చు]

ఎడతెగని ముసురు

చిప్ప చేతికొచ్చింది

[మార్చు]

బ్రతుకు చిద్రమై పోయిందని అర్థం.

చిప్ప కూడు తింటున్నాడు

[మార్చు]

జైలు కెళ్లాడని అర్థం.

చివరకు మిగిలింది

[మార్చు]

చిర్రు బుర్రు లాడు తున్నాడు

[మార్చు]

కోపంగా వున్నాడు అని అర్థం. ఉదా: వాడెప్పుడూ చిర్రు బుర్రు లాడుతుంటాడు.

చిల్లర శ్రీమహాలక్ష్మి

[మార్చు]

చిల్లరగా అతి తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేసే వారికి పెద్ద నష్టాలేమీ ఉండవు.ఖర్చులుపోగా మిగిలిందంతా లాభమే. రొట్టెలవాడి కన్నా ముక్కల వాడి పనే నయం అన్నట్లు.

చిల్లి కడవ తీరు

[మార్చు]

వచ్చిందేదీ నిలవకపోవటం.అధికంగా ఖర్చు చేస్తూ ఆస్తిని హరించటం

చిల్లి కాకపోతే బొక్క

[మార్చు]

నష్టాన్ని కలిగించటంలో అందరూ సమానులేనని .రంధ్రం, చిల్లు, చిల్లి, బొక్క అర్థాలన్నీ నష్టం అనేకదా?

చిల్లి కాసుకు కూడ సరి రాడు

[మార్చు]

పూర్తిగా నిరుపయోగమైన వాడని అర్థం. ఉదా: వాడు చిల్లి కాసుకు కూడా సరి రాడు.

చిల్లి పేరే తూటు

[మార్చు]

ఏదైనా ఒకటే,..... అనే అర్థంలో పై మాటను వాడతారు

చిల్లి బొక్కెన తీరు

[మార్చు]

అలంకార ప్రాయం, నిరుపయోగమైనా అలాగే ఉంచుకోటం.బతికుంటే చాలని అనుకోవటం

చిలుక కటు కాలం

[మార్చు]

కరువుకాలం.చిలుకకు సాధారణంగా ఎప్పుడూ కరవు పరిస్థితి ఎదురు కాదు.అన్ని రుతువుల్లోనూ పంటలు, పండ్లు ఆహారంగా దొరుకుతూనే ఉంటాయి. అయితే ఒక్కోసారి చిలుకకు కూడా ఆహారం దొరకదు. ఆ సందర్భంగా ఈ మాటను వాడుతారు.

చిల్లులకడవ

[మార్చు]

పనికిరాని వస్తువు, నిరుపయోగకరం తెంపులతాడులాగా మూస:చిప్పకూడు చిప్పలో ఎవరు అన్నం తినరు. దీని అర్థం: వాడు జైలు కెళ్ళాడు అని.

చింపిరి బతుకులు

[మార్చు]

చింతకాయలు రాలవు

[మార్చు]

చీకట్లో లేని దొంగ

[మార్చు]

చీకు చింత లేకుండా వున్నాడు

[మార్చు]

ఆనందంగా వున్నాడు అని అర్థం. ఉదా: వాడెప్పుడు చీకు చింత లేకుండా ఉన్నాడు.

చీకటి మడి

[మార్చు]

అనుభవం లేని వ్యక్తి కార్యాచరణకు పూనుకోవటం .ఆత్రం కొద్దీ వెలుతురున్నప్పుడే దొంగతనానికి వెళ్ళి పట్టుబడటం

చీడ పురుగు

[మార్చు]

ఉదా: వాడు చీడపురుగు.. = ధుర్మార్గుడు అని అర్థం.

చీదరించు కున్నాడు

[మార్చు]

అసహ్యించు కున్నాడని అర్థం. ఉదా: వానికెమైనా చెపితె చీదరించు కుంటాడు.

చీమ కుట్టినట్టు కూడా లేకపోవటం

[మార్చు]

పెద్ద పెద్ద ప్రమాదాలు, బాధలు వచ్చినా ఏ మాత్రం చలించకుండా, ప్రతిస్పందించకుండా ఉండటం.బాధ్యత లేకుండా ప్రవర్తించటం (ఇంత చెప్తున్నా వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.)

చీమకు రెక్కలొచ్చినట్టు

[మార్చు]

చీమలకు పక్షులకున్నట్టు రెక్కలు పుట్టుకొస్తే ఇకవాటి గమన వేగాన్ని ఎవరాపగలరు అని ఒక ఊహ. తక్కువస్థాయి వారికి ఉన్నట్టుండి అన్నీ కలిసొచ్చి గర్వంతో విర్రవీగుతున్నప్పుడు, తుళ్ళి పడుతున్నప్పుడు వారిని గురించి అంటారు.చీమ ఎంత చిన్నదో గర్వపడే వ్యక్తి కూడా అంత అల్పుడని, అయితే ఆస్తి కలిసి రాబట్టి అలా మిడిసి పడుతున్నాడన్నది భావన.నడమంత్రపుసిరి లాగ.

చీమ తలకాయంత

[మార్చు]

అతి స్వల్పమైనది. ఉదా:

చీమదూరే సందు

[మార్చు]

స్వల్ప అవకాశం. (అక్కడ చీమ దూరె సందు కూడా లేదు ఎలా వెళ్ళను?)

చీమబలం

[మార్చు]

పట్టుదలకు నిదర్శనం. చీమ తనకంటే ఎక్కువ బరువున్న ఆహారపు గింజను మోసుకుంటూ చాలాసార్లు జారి కిందపడుతుంటుంది. అయినా పట్టు వదలకుండా తనకు కావలసిన ఆహారాన్ని చేర్చుకుంటుంది.

చీము నెత్తురు లేని వాడు

[మార్చు]

సిగ్గు లేని వాడని అర్థం: ఉదా: వాడినెన్నన్నా సిగ్గు లేదు; వాడు చీము నెత్తురు లేని వాడు.

చీముపట్టినోడు

[మార్చు]

చీములాంటి అసహ్యకరమైన పనులుచేసి, అవినీతి పద్ధతుల్లో బాగా ధనాన్ని సంపాదించినవాడు.

చీమ కుట్టినట్టు కూడ లేదు

[మార్చు]

చీము పట్టినవాడు

[మార్చు]

చీమ చిటుక్కు మన్నా

[మార్చు]

చీమ తలకాయంత

[మార్చు]

చీము నెత్తురు లేదు

[మార్చు]

చుక్కవాలు

[మార్చు]

చుక్కులు చూపించాడు

[మార్చు]

చుక్క పొద్దున లేచి

[మార్చు]

చుక్కెదురు

[మార్చు]

చుప్పనాతి ముండ

[మార్చు]

చుట్టపు చూపుగా వచ్చాడు

[మార్చు]

చుట్టాల సురభి

[మార్చు]

చుర కత్తి లాంటి వాడు

[మార్చు]

చూపులగుర్రం

[మార్చు]

చెక్ పెట్టాలి

[మార్చు]

చెక్కేశాడు

[మార్చు]

చెట్టాపట్టాలేసుకొని

[మార్చు]

చెట్టంట కొడుకు

[మార్చు]

చెట్టంత మనిషిని నేనుండగా

[మార్చు]

చెట్టెక్కి కూర్చున్నాడు

[మార్చు]

చెట్టంత ఎదిగాడు

[మార్చు]

చెప్పు కుంటే సిగ్గు చేటు

[మార్చు]

చెప్పులు మోసె రకం

[మార్చు]

చెవిలొ సీసం పోసుకున్నావా

[మార్చు]

చెవిలో పువ్వులు

[మార్చు]

చెవిలో ఇల్లు కట్టుకొని పోరు

[మార్చు]

ఒక్క విషయం పదే పదే వినిపించడం.

చెవి కోసుకున్నారు

[మార్చు]

చెవిలో ఊదాడు

[మార్చు]

రహస్యంగా ఏదో చెప్పడని అర్థం.

చెవులు కొరుక్కుంటున్నారు

[మార్చు]

చెవులు వేళాడేసుకొని వచ్చారు

[మార్చు]

చెల రేగి పోయారు

[మార్చు]

చెర బట్టాడు

[మార్చు]

చెరిగేశారు

[మార్చు]

చేజారి పోయింది

[మార్చు]

చేటభారతం

[మార్చు]

చేయి ఇచ్చాడు

[మార్చు]

చేతిలో పెడుతున్నాము

[మార్చు]

చేతిచమురు భాగవతం

[మార్చు]

చేతి వాసి మంచిది

[మార్చు]

చేతికి ఎముక లేదు

[మార్చు]

ఎక్కువ దానాలు చేశే వారిని గురించి ఈ జాతీయాన్ని వాడుతారు.

చేతి సమురు వదిలింది

[మార్చు]

చేతులు కాల్చుకున్నాడు

[మార్చు]

చేతులకు మట్టి అంటకుండా

[మార్చు]

చేయి విరిగినట్టుంది

[మార్చు]

చుక్కవాలుగా ఉండటం

[మార్చు]

మేలు జరగటం, కలిసి రావటం, అదృష్టం వరించటం. చుక్క అంటే శుక్రగ్రహం.శుక్ర గ్రహానికి ఎదురుగా ప్రయాణం చేయటం కీడును కలిగిస్తుందంటారు. అయితే ఆ శుక్ర గ్రహానికి ఎదురుగా కాక దానికి భిన్నంగా వాలుగా ప్రయాణం చేస్తే కీడుకు బదులు మేలు జరుగుతుందని మూఢభావన.

చుక్కెదురైంది

[మార్చు]

అనుకున్న దానికి వ్వతిరేకంగా జరిగింది.: ఉదా: అతనికి కోర్టులో చుక్కెదురైంది. బైల్ దొరకలేదు.

చుట్ట కుతి

[మార్చు]

కుతి అంటే కోరిక . పొగాకు చుట్టను తాగటానికి అలవాటు పడి, దాన్ని విడిచి పెట్టలేకపోవటం

చుట్టం చూపు

[మార్చు]

అప్పుడప్పుడు ఎప్పుడో కుదిరినప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళటం. (ఏరా? బడికి చుట్టపు చూపుగా వస్తున్నావు......)

చుట్టమై వచ్చి దయ్యమై పట్టటం

[మార్చు]

మిత్రుడిగా వచ్చి శత్రువుగా ప్రవర్తించటం .అనురాగం పొందేవాడిలాగా ముందుగా ప్రవర్తించి, ఆ తర్వాత శత్రువుగా మారి పీడించటం

చురుకు ముట్టడం

[మార్చు]

కష్టాలు ప్రాప్తించడం, తెలిసిరావడం

చూపులకు చుక్క

[మార్చు]

బయట ఒకలా, అంతరంగంలో మరోలా ప్రవర్తించే మోసకారి.నమ్మి వెంట వెళితే మోసపోవాల్సి వస్తుంది. పైపై మెరుగులు చూసి మోసపోవద్దని ఈమాటకు అర్థం.

చూసి రమ్మంటే కాల్చి రావటం

[మార్చు]

చెప్పిన దానికన్నా అధికమైన అక్కరలేని పనిని కూడా చేయడం, అమితోత్సాహంతో ప్రవర్తించడం

చూరు నీళ్ళు ఎనగర్రకు ఎక్కినట్టు

[మార్చు]

జరగటానికి వీలులేని పనులు.ఇంటిచూరు వెన్నుగర్ర కంటే చాలా కిందకు ఉంటుంది. చూరు నీళ్ళు అక్కడి నుండి ఇంకా కిందికి దిగుతాయేకాని పైనున్న వెన్నుగర్ర వైపు వెళ్ళ లేవు.

చెక్క భజన చేస్తున్నారు

[మార్చు]

ఒకరికి వంత పాడుతున్నారని అర్థం. ఉదా: వాడొట్టి చక్క భజన గాడు.

చెట్టంత ఎదిగాడు

[మార్చు]

పెద్దవాడయాడు: ఉదా: వాడు చెట్టంత ఎదిగాడు ఏం లాభం ఏ పని చేత కాదు. ఆ సందర్భంలో ఈ మాటను వాడుతారు.

చెట్టుకింద గడ్డి

[మార్చు]

ఒకరి మీద ఆధారపడి జీవించేవాడు, నిరుపయోగి .దట్టమైన చెట్లకింద గడ్డి అంతగా మొలవదు. ఒక వేళ మొలిచినా ఆరుబయట మొలిచిన గడ్డిలాగా ఉపయుక్తంగా ఉండదు. నిస్సహాయుడై ఒకరి పంచన చేరిన వ్యక్తి కూడా అలాగే ఏ మాత్రం గుర్తింపు లేకుండా పడిఉంటాడు.

చెట్టుకొకరు, పుట్టకొకరుకావటం

[మార్చు]

ఎంతో దూరదూరంగా చెల్లాచెదురై పోవటం .అప్పటి దాకా కలిసి ఉన్నవారు.. ఒకరికొకరు సంబంధం లేకుండా దూరదూరంగా విడిపోవట

చెట్టు తొలిచే పురుగులు

[మార్చు]

దుర్మార్గులు అచ్చంగా చెడు పురుగుల్లాంటి వారే. పచ్చటి చెట్టులాంటి సమాజంలో ఆ చెడు పురుగులుంటే పురుగులు కనిపించకుండా చెట్టునెలా తొలచి నిర్వీర్యం చేస్తాయో దుర్మార్గులు సమాజాన్ని అలా నాశనం చేస్తారు.

చెట్టుమీది పిట్ట చందం

[మార్చు]

అజ్ఞానంతో తానే గొప్పని అనుకోవటం

చెట్టెక్కించి నిచ్చెన తీసినట్టు

[మార్చు]

ఉపకారం పేరుతో అపకారం చేయటం

చెట్టెక్కి కూర్చున్నాడు

[మార్చు]

అలిగాడని అర్థం: ఉదా: ఆ కొత్తల్లుడు కారు కొనివ్వలేదని చెట్టెక్కి కూర్చున్నాడు.

చెప్పి చెప్పి

[మార్చు]

ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోని సందర్భం. విసిగివేసారటం.

చెప్పు కింద తేలు

[మార్చు]

చెప్పు కిందనున్న తేలు పూర్తిగా చిక్కినట్టే. అది తప్పించుకోలేదు. అలా తప్పించుకోలేని పరిస్థితిలో వున్న వారి గురించి ఈ మాట వాడతారు.

చెప్పుల్లో కాళ్లు పెట్టుకొని వున్నారు

[మార్చు]

వెళ్లి పోవడానికి సిద్దంగా వున్నాడని అర్థం: ఉదా: వాడప్పుడే చెప్పుల్లో కాళ్లు పెట్టుకొని ఉన్నాడు./

చెప్పేస్తే కుండకు తగలదు

[మార్చు]

చెప్పు ఎంత కోపంగా విసిరినా ఒక్క కుండకూ తగిలే అవకాశం లేని, కుండలు కూడా లేని దుర్భర దారిద్య్రం ఉన్న ఇల్లు. నీ ఇంట్లో చెప్పేస్తే కుండకు తగలదు అంటారు.

చెప్పులరిగేలా తిరిగాడు

[మార్చు]

చాల ప్రయాస పడి తిరిగాడని అర్థం: ఉదా: ఆ సంబంధం కొరకు చెప్పులరిగేలా తిరిగాను.

చెబితే సిగ్గు దాస్తే దుఃఖం

[మార్చు]

మోసపోయామని బయటకు చెప్పుకోటానికి సిగ్గు, చెప్పకుండా మనసులోనే దాచుకుంటే దుఃఖం

చెమటలు పట్టించాడు

[మార్చు]

సామాన్యంగా చెమట పట్టింది అంటే అతిగా ఎండలో తిరగడమో, అతిగా శ్రమ చేయడమో... వాతావరణము అతి వేడిగా వుండడమో వంటి కారణాలుంటాయి. ఒకరు మరొకరిని చెమటలు పట్టించ లేరు. మాటలతో గాని, చేస్టలతో గాని ఆపని చేయలేరు. కానీ కొందరు ఎదుటివారికి అతి భయంకరమైన వార్తలు చెప్పితే ఎదుటి వాడు నమ్మితే ఆ సందర్భాన్ని ..... వాడికి చెమటలు పట్టించాడు అని అంటుంటారు. నిజంగా ఆభయానక సందర్భంలో కూడా చెమటలు పట్టవు. కాని జాతీయ ప్రయోగమున్నది. ఒక జాతీయము యొక్క నిజార్థం మొకటి వుంటే ..... దాని ప్రయోగార్థం మరొకటుంటుంది. అలాంటివి నిజమైన జాతీయాలు. అలాంటి వాటిలో ఇది ఒకటి.

చెయ్యి విరగి నట్టుంది

[మార్చు]

చేస్తున్న పనికి బాగా అంతరాయం కలగటం, పనివాడు, పనిముట్టు పోవటం. ఆ సందర్భంగా ఈ మాటను వాడతారు. ఉదా:.. ఈ రోజు పని వాడు రాక పోయే సరికి చెయ్యి విరిగి నట్టుంది.

చెరిగేశారు

[మార్చు]

ఉదా: ప్రతి పక్షాలు అధికార పార్టీ వారిని చెరిగేశారు.

చెరువంత

[మార్చు]

సువిశాలమైనది, చాటంత, ఎకరమంత, లంకంత .గుండె చెరువైంది అనేటప్పుడు మాత్రం చాల ఎక్కువ దుఃఖం కలిగినదని అర్థం.

చెరువులో పడ్డ వాణ్ణి తీసి బావిలో వేసినట్లు

[మార్చు]

సహాయమడిగితే చేతిలో ఉన్నది కూడా లాక్కుపోవటం.చెరువు విశాలంగా ఉంటుంది. బావి ఇరుకుగా ఉంటుంది.చెరువులో పడ్డప్పుడు దెబ్బలేం తగలవు కానీ బావిలో పడ్డప్పుడు దెబ్బలు తగలొచ్చు. తక్కువ కష్టాల నుంచి తప్పిస్తామని చెప్పి ఎక్కువ కష్టాలను కలిగించటం. ఇలాంటిదే మరొక సామెత: పెనంలో నుండి పొయ్యిలో పడ్డట్టు\

చెరువులో సెనగేసినట్లు

[మార్చు]

అదృష్టం మీద ఆధారపడటం.పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనుకున్నా, అంతా బాగానే జరుగుతుందనుకున్నా అనుకోని అవాంతరాలు సంభవించటం వల్ల ముందు అనుకున్నదంతా తారుమారవుతుంది.

చెలరేగి పోయాడు

[మార్చు]

విజృంబించాడు. ఉదా: ధోని ఆటలో చెలరేగి పోయాడు.

చెల్లని నాణెం,చెల్లని కాసు

[మార్చు]

విలువలేనిది పనికిరానిది. = ఉదా: వీడొక చెల్లని కాసు. ఎవరికి పనికి రాడు.

చెవిన ఇల్లు కట్టుకొని పోరటం

[మార్చు]

నిరంతరం చెబుతుండటం వినేదాకా విసుగులేకుండా చెప్పటం. (నీ చెవిన ఇల్లు కట్టుకొని చెప్పాను.... నామాట విన్నావా? ఇప్పుడు చూడ ఎలా అయిందో?)

చెవి నులమటం

[మార్చు]

తప్పు చేసినప్పుడు హెచ్చరించటం

చెవి కెక్కిందా

[మార్చు]

వినబడిందా... ఉదా: నేను చెప్పింది చెవి కెక్కిందా?

చెవి కోసిన మేకలా అరుస్తున్నాడు

[మార్చు]

ఉదా: అతను చెవి కోసిన మేకలా అరుస్తున్నాడు. ఎవరైనా పిల్లలు ఎడతెరిపి లేకుండా ఏడుస్తుంటే ఈ మాట అంటారు.

చెవిలో పూలు పెట్టుకొని వున్నానా

[మార్చు]

నేనేమన్న అమాయకుడినా.. ఉదా: నేనేమైనా చెవిలో పూలు పెట్టుకొని వున్నానా... అమాయకత్వం, చాదస్తం .అర్చకుడు పువ్వునిచ్చినప్పుడు స్త్రీలైతే జడలో ముడుచుకుంటుంటారు. పురుషులకు అలాంటి అవకాశం లేదు. కానీ ఆ పువ్వు పవిత్రమైంది. దాన్ని శిరస్సున ధరించే తీరాలి అని అనుకొని చెవిలో ఉంచుతుంటారు.

చెమటోడ్చి......

[మార్చు]

చాల కష్టపడి.....; అని అర్థం.

చెవిటికి పట్టిన శంఖం

[మార్చు]

ఫలితం లేని పని చేసే వారినుద్దేశించి ఈ సామెత వాడతారు

చెవిటి వాని ముందు శంఖం ఊది నట్టు

[మార్చు]

ప్రయోజనం లేని పని.చెవిటివాడి ముందు శంఖం వూదితే..... దాన్ని కొరకటం నీ అబ్బ తరం కాదు అన్నాడట ఉపయోగంలేని పని చేస్తే ఈ మాట వాడతారు.

చెవుల్లో చెట్లు మొలవటం

[మార్చు]

శ్రవణ శక్తి లోపించటం, చెబుతుంటే వినిపించుకోకపోవటం, మాట్లాడుతున్నప్పుడు పరధ్యానంగా, ఏదో ఆలోచిస్తూ ఉండటం

చెవులు కొరుక్కుంటున్నారు

[మార్చు]

రహస్యంగా మాట్లాడు కుంటున్నారు. ఉదా: వారిద్దరు చెవులు కొరుక్కుంటున్నారు. రహస్యంగా మాట్లాడుకుంటుంటే ఈ మాటను వాడతారు.

చెంప పెట్టు

[మార్చు]

గుణ పాటము: ఉదా: వానికి ఇది చెంప పెట్టు లాంటిది.

చెంపకు చారేడేసి కళ్లు

[మార్చు]

చాల పెద్ద కళ్లున్నాయని అర్థం.

చేట భారతం

[మార్చు]

ఒక విషయాన్ని బాగా విస్తరించి చెప్పటం, ఏదైనా విషయాన్ని ఆపకుండా చెప్పటం

చేతల మనిషి కాడు

[మార్చు]

ఒట్టి మాటల మనిషి అని అర్థం: ఉదా: వాని మాటలు నమ్మకు, వాడు చేతల మనిషి కాడు.

చేతలుడిగి పోయాయి.

[మార్చు]

నీరసం వచ్చింది: ఉదా: చేతలుడిగి పోయాయి నేను ఆ పని చేయలేను.

చేతి నిండా

[మార్చు]

తగినంత.... (వాడికి చేతి నిండా పని ఉంది.)

చేతికి రావటం

[మార్చు]

సొంతం కావటం, చేతికొచ్చేదాకా నమ్మకం లేదంటారు

చేతిలో పెట్టడం

[మార్చు]

అప్పగించడం . పిల్లను ఓ అయ్య చేతిలో పెట్టాము అంటారు

చేతి వాటం చూపించాడు

[మార్చు]

దొంగ తనం చేశాడని అర్థం: ఉదా: వాడు సందట్లో సమారాధనంగా తన చేతి వాటం ప్రదర్శించాడు.

చేతి వాసి మంచిది

[మార్చు]

ఉదా: ఆ డాక్టర్ చేతి వాసి మంచిది.

చేతికి ఎముకలేదు

[మార్చు]

ధర్మాత్ముడు అని అర్థం: ఉదా: అతను అడిగిన వారి కాదనడు: అతని చేతికి ఎముక లేదు.

చేతికి అంది వచ్చిన కొడుకు

[మార్చు]

ఎదిగిన కొడుకు. ఉదా: వాడికేం పర్వాలేదు కొడుకులందరు చేతికి అంది వచ్చారు.

చేతి చమురు వదిలింది

[మార్చు]

ఉదా: ఆ పని కావడానికి అతనికి చేతి చమురు బాగానె వదిలింది. బాగా నష్టపోయాడని అర్థం.

చేతి కింది మనిషి

[మార్చు]

సహాయకుడు అని అర్థం. ఒక పనిలో సహాయకునిగా వున్న వాడిని చేతి కింది మనిషి అంటారు.

చేతుసాపు

[మార్చు]

చేతు అంటే చేతులు . సాపు అంటే సాధన బాగా ఉండటం . చేతాళం, పేతాళం. ఒక పని చేయటానికి చేతులు బాగా అలవాటుపడటం, చేతులతో పని బాగా చేసే సాధన లేక నేర్పరితనం కలిగి ఉండటం

చేతులు చాచు

[మార్చు]

విస్తృతంగా వ్యాపించటం, ఆహ్వానించటం. (దీన్ని నిందా వాచకంకా గూడ వాడుతారు) ఉ: వాడు అందరిదగ్గరా చేతులు చాస్తున్నాడు. అందరి దగ్గరా యాచిస్తున్నాడని అర్థం

చేతులెత్తేశారు

[మార్చు]

పని విరమించు కున్నారు. ఉదా: ఈ పని తమ వల్ల కాదని వారు చేతులెత్తేశారు.

చేతులు కట్టుకోవటం

[మార్చు]

విధేయతతో ప్రవర్తించటం, అణిగి ఉండటం. పని లేక పోవటం. ( పని లేక పోవడం::: అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఇలా వాడుతారు. అలా చేతులు కట్టుకుని కూర్చోక పోతె ... వచ్చి వాళ్లకు సాయం చేయవచ్చు గదా )

చేతులు కట్టేసి నట్టుంది

[మార్చు]

పని లేక పోవడం: ఉదా: నాలుగు రోజుల నుండి పనిలేక పోయే సరికి చేతులు కట్టేసి నట్టుంది.

చేతులు కాల్చుకున్నాడు

[మార్చు]

నష్ట పోయాడు. ఉదా: అతను వ్వాపారంలో బాగా చేతులు కాల్చుకున్నాడు.

చేతులు ఖాలీగా లేవు

[మార్చు]

తీరిక లేదు అని అర్థం: ఉదా: చేతులు ఖాళీగా లేవు పక్కింటికి వెళ్లు.

చేతులు పడి పోయాయి

[మార్చు]

పని చేయలేక పోవడం: ఉదా: పనిచేసి, చేసి చేతులు పడి పోయాయి. నిందా వాచకముగా కూడా ఈ మాటను వాడుతారు: నీ చేతులు పడిపోనూ

చేతులకు మట్టి అంటకుండా

[మార్చు]

జాగ్రత్తగా: ఉదా: అతడు ఏ పనిచేసినా చేతులకు మట్టి అంట కుండా చేస్తాడు. నింద పడడు అని అర్థం. (మంచికి, చెడుకి కూడా ఈ జాతీయాన్ని వాడుతారు. )

చేతులు కలపడం

[మార్చు]

చేయి కలపడం, ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒకటి కావడం. ఒకరికొకరు సాయం చేసు కోవడం. (వారందరు చేతులు కలిపితేనె నా గెలుపు సాద్యమైంది.) (చెడు పనికి కూడా ఈ మాటను వాడతారు: ఉదా: ఆ దొంగలిద్దరు చేతులు కలిపారు

చేదు అనుభవం

[మార్చు]

గుణ పాటం: ఉదా: ఆ పని నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.

చేదు నిజం

[మార్చు]

అసలు విషయం: ఉదా: ఇప్పటికైనా ఆ చేదు నిజం చెప్పావు సంతోషం.

చేదు మాత్ర మింగినట్టు

[మార్చు]

బాధాకరమైన విషయం ప్రయోజనం కూడా ఉంటుంది. ఆ సందర్భంగా ఈ మాటను వాడతారు.

చేప పిల్లకు ఈత నేర్పినట్లు

[మార్చు]

ఎవరూ నేర్పనక్కరలేదు. తాతకు దగ్గులు నేర్పినట్టు అలాంటిదె.

చేపల మార్కెట్లా వున్నది

[మార్చు]

గోలగా వున్నది: ఉదా: ఇదేమన్నా క్లాసా లేక చేపల మార్కెట్టా/. అలా అరుస్తున్నారు.

చేపాయి బతుకు

[మార్చు]

నిరంతరం ఒకరికి జవాబుదారీగా ఉండి బతకటం, స్వేచ్ఛ లేకుండా జీవించటం, ఇంకొకరి సూచనల మేరకు వ్యవహరిస్తూలెక్క చెప్పాలి.

చేయి పట్టడం

[మార్చు]

వధూవరులు ఒకరి చేతిని ఒకరు పట్టుకోవడంతోటే వారికి వివాహ బంధం ఏర్పడుతుంది.చేయి పట్టి, జీవిత భాగస్వామిగా చేసుకోవటం

చేయి చాచటం

[మార్చు]

అడగటం,, అర్థించటం, యాచించడం. ఉదా: వాడెప్పుడు ప్రతి ఒక్కరిదగ్గర చేయి చాస్తుంటాడు.

చేయి చేసుకోవడం

[మార్చు]

ఎదుటివ్యక్తిపై ఆగ్రహంతో చేయి చేసుకోవటం, కొట్టటం, తన్నటం

చేయి తిరిగిన వాడు

[మార్చు]

చాల పని మంతుడని అర్థం. (వాడు ఈ పనిలో బాగా చేయి తిరిగిన వాడు.)

చేయి వదులవ్వటం

[మార్చు]

ఆర్థిక ఇబ్బందుల నుంచి కాస్తంత వెసులుబాటు కలగటం ఉదా: నాకష్టాలు తీరాయి. ఇప్పుడు నా చేయి కొంత వదులయ్యింది.

చేయ్యిచ్చాడు

[మార్చు]

ఉదా: వాడు సినిమాకు వస్తానని చెప్పి నాకు చెయ్యిచ్చాడు.

చేయుండటం

[మార్చు]

ప్రమేయం, పాత్ర ఉండటం.

చొప్ప తినే ఎద్దులా

[మార్చు]

విరామం లేకుండా మేస్తూనే ఉండటం. నిరంతరం ఏదో ఒకటి నములుతూ, ఏదో ఒక పని నిర్విరామంగా చేస్తుండటం. ఆ సందర్భంగా ఈ జాతీయాన్ని వాడుతారు.

చొప్పలో చొప్ప కలిసినట్లు

[మార్చు]

ఇరుగు పొరుగు చేలల్లోది ఒక చోటకు చేర్చి కలిపితే ఏ చేలోది ఏ చొప్పో అంత తొందరగా కనుక్కోలేరు.చొప్ప అంతా ఒకలానే ఉంటుంది. ఇలా రెండు కుటుంబాల్లోని సభ్యులు ఇరుగు పొరుగునే ఉండి వారంతా కలివిడిగా తిరుగుతున్నప్పుడు 'చొప్పలో చొప్ప కలిసినట్లు వారంతా కలిసిపోయారు అంటారు

చొప్ప వామిలో నిప్పు దాచినట్లు

[మార్చు]

చోద్యం చూస్తున్నారు

[మార్చు]

తమాషా చూస్తున్నారు; ఉదా: పని చేయ కుండా చోద్యం చూస్తున్నారా?

చోద్యం సొరకాయ గుడ్డు పెట్టిందట

[మార్చు]

ఛీ కుక్కా అంటే ఏమక్కా అన్నదట

[మార్చు]

ఛీఛీ అనేదీ ఈ నోరే శివశివా అనేదీ ఈనోరే

[మార్చు]