Jump to content

వంటపుస్తకం:విషయ సూచిక

Wikibooks నుండి

మూస:మొలక

వికీమీడియా వంటపుస్తకం
ప్రపంచ వ్యాప్త వంటల సమాహారము


-: మెంతి ఆవకాయ :-

కావలసిన పదార్థాలు:-

మామిడికాయలు: 10

మెంతి పొడి: అరకప్పు

కారప్పొడి: 4 కప్పులు

ఉప్పు:-5 కప్పులు

ఆవపొడి: అరకప్పు

నూనె: 6 కప్పులు

ఇంగువ: చెంచాడు

పసుపు: 2 చెంచాలు

తయారు చేసే పద్ధతి:-

‌. ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడగాలి ముక్కలుగా కోసి ఒక పాత్రలో వేసి ఉప్పు, పసుపు వేయాలి మెంతులు ఆవాలు వేయించి పొడిచేసి అందులో చేయాలి కారప్పొడిని నూనె వేయకుండానే దోరగా వేయించి మామిడి ముక్కల్లో వేసి అన్నింటిని బాగా కలపాలి. వాటిని ఒక జాడీలో వేసి పెట్టి మూడవరోజు ఈ మిశ్రమాన్ని ఒక గంట పాటు ఎండ బాగా ఉన్నచోట పెట్టాలి. తర్వాత మరొకసారి బాగా కలపాలి. నూనె వేడి చేసి చల్లారాక అందులో వేసి బాగా కలపాలి. కొంచెం నూనెతో ఇంగువ వేసి కాచి కలపాలి. దీనిని ఒక వారం రోజులు బాగా ఊరనిచ్చిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది.