వంటపుస్తకం:టమాట సూపు

Wikibooks నుండి
Jump to navigation Jump to search

వర్గం : శాకాహారం

కావలసిన పదార్దాలు :

  • టమాటాలు : 4
  • కొత్తిమీర తరుగు : 1 టీ స్పూను
  • నీళ్ళు : 3 కప్పులు
  • పంచదార : 1/2 టీ స్పూను
  • క్యారెట్ : 1
  • ఉల్లిగడ్డ : 1
  • వెల్లుల్లి : 2 పాయలు (రెకలు)
  • బిర్యానీ ఆకులు : 2
  • మిర్యాలు : 3
  • వెన్న/నెయ్యి : 1/2 టీ స్పూను
  • ఉప్పు : తగినంత
  • నల్ల ఏలకులు : 2

తయారీ విధానం:

టొమాటో, క్యారెట్, నీళ్ళు, నల్ల ఏలకులు, మిరియాలు, బిరియానీ ఆకులు, వెల్లుల్లి, ఉల్లిపాయ, పంచదార, ఉప్పు లను కుక్కర్ లో ఉడికించాలి. (కుక్కర్ 3 విజిల్స్ వస్తే సరిపోతుంది). మెత్తగా అయిన టొమాటో మిశ్రమాన్ని వడ పోయాలి. మెత్తగా చేత్తో మెదిపి, ఆ గుజ్జును కూడా వడ పోయాలి. ఫ్రయింగ్ పాన్ లో వెన్న/నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలను వేయించాలి. వడ్డించే ముందు ఈ బ్రెడ్ ముక్కలను సూప్ లో వేసుకోవాలి.