తెలుగు స్థానికీకరణ మార్గదర్శిని

Wikibooks నుండి
Jump to navigation Jump to search

కంప్యూటర్, జాల, మొబైల్ ఉపకరణాలను తెలుగు లోనికి తీసుకురావడంలో తోడ్పడే మార్గదర్శిని ఈ పుస్తకం. వివిధ ఉపకరణాల తెలుగీకరణకు ఉపయోగపడే అంశాలు, మార్గదర్శక సూత్రాలు ఈ పుస్తకంలో ఉంటాయి.

ఈ పుస్తకం ప్రధానంగా స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ఉపకరణాల స్థానికీకరణకు ఉద్దేశించాం. ఇతర స్థానికీకరణ/అనువాదాలకు కూడా ఉపయోగపడవచ్చు.

విషయ సూచిక[మార్చు]

ఆధునిక వాణిజ్య, వ్యాపార, వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో విస్తారంగా వాడుకలో ఉన్న ఇంగ్లీషుని సరళమైన, భావస్పోరకమైన, దేశీ నుడికారంతో ఉట్టిపడే తెలుగులోకి మార్చటంలో ఉన్న కష్టసుఖాలని విశ్లేషించి, ఆచరణయోగ్యమైన సలహాలు ఉత్పాదించాలనే కోరిక ఈ పుస్తక ప్రేరణ కారకం. తెలుగు స్థానికీకరణలో ఆయా సాంకేతిక ఉపకరణాలలో , ఆ మెనూ , మాడ్యుల్ అంశాలు ఇతర రంగాలలో ఉన్న ఇంగ్లీషుని తెలుగులోకి మార్చటంలో ఉన్న సమస్యలని, వాటి పరిష్కార మార్గాలని అభివర్ణించటం జరిగింది. తెలుగు స్థానికీకరణలో తెలుగు నుడికారం ఉట్టిపడాలంటే తెలుగు వాడకంలో దొర్లే ఇంగ్లీషు తత్సమాలు 25 శాతం మించకుండా ఉంటే బాగుంటుందని ప్రతిపాదించటం జరిగింది. ఈ గమ్యాన్ని చేరుకోవటం కష్టమేమీ కాదు. మొదట, ఇంగ్లీషు మాటలని యథాతథంగా పెద్ద ఎత్తున గుచ్చెత్తి వాడెయ్యకుండా, సాధ్యమైనంత వరకు ఉన్న తెలుగు మాటలని వాడటానికి ప్రయత్నం చెయ్యటం. రెండు, సమానార్థకమైన తెలుగు మాట లేకపోయినా, వెనువెంటనే స్పురించకపోయినా ఇంగ్లీషు తత్సమాలని వాడటం కంటే తెలుగు ఉచ్చారణకి లొంగే తద్భవాలని వాడటం. మూడు, సందర్భానికి సరిపోయే భావస్పోరకమైన తెలుగు మాటలని అవసర రీత్యా సృష్టించి వాడటం. నాలుగు, ఇంగ్లీషు వాడుకలో స్థిరపడిపోయిన దుర్నామాలని యథాతథంగా తెలుగులోకి దింపేసుకోకుండా జాగ్రత పడటం. చివరగా, ఈ ప్రయత్నాలన్నీ విఫలమైన సందర్భాలలో ఇంగ్లీషు మాటలని తెలుగు లిపిలో రాయటం. (ముద్రణకి వీలయినప్పుడు, పక్కని కుండలీకరణాలలో ఇంగ్లీషు లిపిలో చూపించటం.) ఈ సూచనలన్నీ ఆచరణయోగ్యాలేనని అనుభవం చెబుతోంది. ఇంగ్లీషు మూలాన్ని తెలుగులో తిరగ రాయడానికి ముందు సాధారణంగా ఇంగ్లీషు మూలాన్ని - కేవలం అర్థం చేసుకునే నిమిత్తం - రెండు, మూడు సార్లు చదువాలి. అప్పుడు ఆ పాఠాన్ని తెలుగులో చెప్పే నిమిత్తం కొన్ని ముఖ్యాంశాలని దృష్టిలో పెట్టుకుని తెలుగులో రాయటం మొదలు పెట్టాలి. ఒక భాషనుండి మరొక భాషలోనికి అనువాదం చేసే టప్పుడు Transliteration ఎక్కువగా వాడవలసిన అవసరం ఉంటుంది . దీనికి కారణం సాంకేతిక అంశాలు తెలుగు లోనికి అర్ధవంతంగా వివరించ వచ్చు అందుకు ప్రధానకారణం ఆ మూలభాషలోని సాంకేతిక అంశాల పేర్లు, ఆయా బ్రాండులు మరో భాషలోకి "అర్థవంతంగా" అనువదించే పనిలేకపోవటం. ఆ మాటలక్కూడా తెలుగులో సరిసమానమైన అర్థవిశేషపు పదాలు చెప్పవచ్చు

ఉపకరణాలు[మార్చు]