Jump to content

తెలుగు స్థానికీకరణ మార్గదర్శిని/అనువదించ కూడని అంశాలు

Wikibooks నుండి

ప్లేస్‌హోల్డర్లు

[మార్చు]

కంప్యూటరు తెరపై మనం చూసేవాటిలో, లేదా అది మనకు వినిపించే మాటలలో ప్రోగ్రాములు నడిచేటప్పుడు మాత్రమే తెలిసే సమాచారం కొంత ఉంటుంది. ఉదాహరణకు వాడుకరి పేరు (ఎవరు ఈ ప్రోగ్రామును వాడుతున్నారో ముందే తెలియదు), ఫైలు పరిమాణం (ప్రతి ఫైలు పరిమాణం వేరుగా ఉంటుంది), ప్రస్తుత ఉష్ణోగ్రత. ప్రోగ్రాములు వ్రాసేటప్పుడు ఆయా పదబంధాలలో వీటి విలువలను నేరుగా వాడకుండా ప్లేస్‌హోల్డర్లు వాడతారు. ప్రోగ్రాము నడిచినపుడు ఆ ప్లేస్‌హోల్డర్ల స్థానంలో అసలు విలువను నింపుతుంది. కనుక స్థానికీకరణ చేసేటప్పుడు ఈ ప్లేస్‌హోల్డర్లను అనువదించకుండా అలానే వదిలేయాలి.

కంప్యూటరు ప్రోగ్రాము ప్రస్తుత వాడుకరిని సంబోధించాలనుకోండి. ప్రోగ్రాము మూలంలో ఇలా వ్రాసి ఉంటారు: Hi %username%. ప్రోగ్రాము నడిచేటప్పుడు, వాడుకరి పేరుని %username% అనే చోట ప్రతిక్షేపించి Hi Ramu అని చూపిస్తుంది. ఇలాంటి పదబంధాలను అనువదించేటప్పుడు %username% అనే ప్లేస్‌హోల్డరును అలానే ఉంచేసి తతిమా భాగాన్ని అనువదించాలి. దీనికి తెలుగు అనువాదం ఇలా ఉండొచ్చు: నమస్తే %username%.

అయితే, ప్రోగ్రామింగు భాషను బట్టీ ఆయా అనువర్తనాలు వాడిన అంతర్జాతీయీకరణ విధానాన్ని బట్టీ ఈ ప్లేస్‌హోల్డర్లు, వాటి రూపాలు మారవచ్చు. ఇవి కొన్ని ఉదాహరణలు:

  • %1$d, %2$s, %d, %s
  • $1, $2
  • {{name}}, {{dateModified}}
  • %(domain)s, %(escapedEmail)s, %(total)s
  • { $hostname }, {-brand-short-name}

అనువదించదగ్గ పాఠ్యంతో కూడిన ప్లేస్‌హోల్డర్లు

[మార్చు]

అనువదించదగిన పాఠ్యం క్రింద ఉదాహరణలలో పచ్చరంగుతో గుర్తించబడింది.

  • <a data-l10n-name="help-link">Support</a>
  • <xliff:g id="count">%d</xliff:g> votes