Jump to content

బియ్యం పిండి వడియాలు

Wikibooks నుండి

బియ్యపు పిండి వడియాలు 1

[మార్చు]
కావలసినవి
  1. బియ్యం ఒక కిలో,
  2. నువ్వు పప్పు 100 గ్రా,
  3. పచ్చిమిర్చి 50 గ్రా,
  4. జీలకర్ర 4 స్పూనులు,
  5. ఉప్పు సరిపడా
తయారీ
  1. బియ్యం కడిగి ఆరనిచ్చి పిండి పట్టించాలి. 1 కి 5 చొప్పున కొలతలో నీరు తీసుకోవాలి. 1 కొలతలో పిండిని జారుగా కలుపుకొని, మిగతా కొలతను ఎసరు పెట్టుకోవాలి.
  2. మరిగిన ఎసరులో ఈ పిండిని కొంచెం కొంచెంగా పోస్తూ తలపెట్టి నూరిన పచ్చిమిర్చి, జీర, నువ్వుపప్పు ముద్దను మరిగే పిండిలో వేసి బాగా కలిపి ప్లాస్టిక్ పేపర్ మీద వడియలుగా పెట్టుకుని
  3. రెండు రోజులు బాగా ఎండబెట్టి తీసి నిల్వ పెట్టుకోవాలి.

బియ్యం పిండి జంతికల వడియాలు 2

[మార్చు]
కావలసిన పదా ర్థములు
  1. బియ్యం పిండి,
  2. పచ్చిమిర్చీలు 12,
  3. జీలకర్ర 1 టీస్పూన్‌,
  4. వాము 1 టేబుల్‌స్పూన్‌,
  5. నువ్వులు 2 టేబుల్‌స్పూన్లు
  6. ఉప్పు సరిపడా.
తయారు చేసే విధానం
  1. జీలకర్ర, పచ్చి మిర్చి మెత్తగా పేస్టు చేసుకుని ఓ ప్రక్కన పెట్టుకోవాలి.
  2. బియ్యం పిండిని నీళ్ళలో కలుపుకుని పెట్టుకోవాలి.
  3. వేరొక గిన్నెలో నీళ్ళలో ఉప్పు, జీలకర్ర మెత్తగా నూరిన పేస్టు, కలిపిన బియ్యం పిండి వేసి బాగా ఉం డలు కట్టకుండా పిండిని కలుపుతూ ఉండాలి.
  4. అది దగ్గరగా ఉడికిన తర్వాత (చూడ్డానికి మనకు ఉప్మాలా కని పించాలి.)
  5. జంతికల దాంట్లో పిండి పెట్టి మనకు కావ లసిన ఆకారంలో వేసు కోవచ్చు.
  6. రెండు రోజులు బాగా ఎండబెట్టి తీసి నిల్వ పెట్టుకోవాలి.

బియ్యపు పిండి వడియాలు 3

[మార్చు]
కావలసినవి
  1. బియ్యపు పిండి-ఒక పెద్దగ్లాసు,
  2. నీరు- నాలుగు గ్లాసు
  3. ఉప్పు- తగినంత,
  4. జీలకర్ర-కొద్దిగా,
  5. అల్లం, పచ్చిమిర్చి-కొద్దిగా
తయారుచేసే విధానం
  1. ముందుగా పచ్చిమిర్చి, అల్లాన్ని ముద్దగా చేసి పక్కన పెట్టుకోవాలి.
  2. పాత్రలో నాలుగుగ్లాసుల నీటిని పోసి బాగా మరగనివ్వాలి.
  3. నీళ్లు కెర్లుతుండగా అందులో పచ్చిమిర్చి, అల్లం పేస్ట్‌, ఉప్పు, జీలకర్రను వేసి కలపాలి. 5నిమిషాల తర్వాత పిండిని అందులో పోస్తూ పెద్ద గరిటెతో పిండి ఉండలు కట్టకుండా బాగా కలియతిప్పాలి.
  4. 10నిమిషాలు ఉడికించాక దించుకుని వేడిగా ఉన్నప్పుడే త్వరత్వరగా మీకు నచ్చిన సైజులో పెట్టుకోవాలి. పిండి కాస్త పలచగా ఉన్నప్పుడే పెడితే త్వరగా ఆరిపోతాయి.
  5. పిండి చల్లబడే కొద్దీ చిక్కబడిపోతుంది. అపుడు ఆరడం లేటవుతుంది. పప్పులోకి, సాంబారులోకి ఇవి చాలా బాగుంటాయి