Jump to content

చికెన్ పులావ్

Wikibooks నుండి


కావలసిన పదార్థాలు

[మార్చు]
  • బియ్యం : 2 కప్పులు (శుభ్రంగా కడిగి, పది నిముషాలు నానబెట్టుకోవాలి)
  • కోడి మాంసము: 250 గ్రాములు (చిన్న ముక్కలుగా లేదా మధ్యస్థంగా ముక్కలు చేసుకోవాలి)
  • ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలు చేసుకోవాలి)
  • టమోటా: 1 (చిన్న ముక్కలు చేసుకోవాలి)
  • పచ్చి మిర్చి: 2 (చిన్న ముక్కలు చేసుకోవాలి)
  • పసుపు: 1 చెంచాడు
  • కారం: 1 ½ చెంచాడు
  • జీలకర్ర పొడి: 1 చెంచాడు
  • కొత్తిమీర పొడి: 1 చెంచాడు
  • గరం మసాలా: చిటికెడు
  • జీలకర్ర: 1 చెంచాడు
  • బిర్యానీ ఆకు: 1
  • ఉప్పు: రుచికి సరిపడా
  • నూనె: 2 చెంచాడు
  • నీళ్ళు: 2 కప్పులు

తయారీ

[మార్చు]
  1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేగించుకోవాలి.
  2. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మధ్యస్థ మంట మీద రెండు నిముషాలు వేగించుకోవాలి.
  3. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, వేసి బాగా కలిపి వేగించుకోవాలి. తర్వాత టమోటో ముక్కలు కూడా వేసి వేగించుకోవాలి.
  4. టమోటో ముక్కలు కొంచెం మెత్తబడ్డాక అందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా, వేసి బాగా కలపాలి.
  5. మసాలా మొత్తం బాగా వేగిన తర్వాత అందులో ముందుగా శుభ్రం చేసి, ముక్కలు చేసి పెట్టుకొన్నచికెన్ వేసి మధ్యస్థ మంట మీద పది నిముషాలు వేగించాలి.
  6. ఆ తర్వాత శుభ్రం చేసి, కడిగి పెట్టుకొన్న బియ్యం, సరిపడా నీళ్ళు వేసి బాగా కలిపి మూత పెట్టి, విజిల్ పెట్టి మధ్యస్థ మంట మీద మూడు ఈలలు (విజిల్స్) వచ్చేవరకూ ఉడికించుకోవాలి.
  7. అంతే పొయ్యి కట్టేసి ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత వేడి వేడిగా వడ్డించాలి..