తెవికీ సోదర ప్రాజెక్టులు/వికీవ్యాఖ్య
వికీకోట్ అనగా వికీవ్యాఖ్య. వికీమీడియా ఫౌండేషను ఆధ్వర్యములో మీడియావికీ సాఫ్టువేరుతో రూపొందిన ఒక ప్రాజెక్టు. దీనికి ‘డేనియల్ ఆల్స్టన్’ ఆలోచనతో ‘బ్రయన్ విబ్బర్’ కార్యాచరణలో పెట్టారు. ఈ ప్రాజెక్టు లక్ష్యం సమిష్టి సమన్వయ కృషితో వివిధ ప్రముఖ వ్యక్తులు, పుస్తకాలు, సామెతల నుండి సేకరించిన వ్యాఖ్యలతో విస్తృత వనరును తయారుచేసి వాటికి సంబంధించిన వివరాలు పొందుపరచడం. అనేక వ్యాఖ్యల సేకరణలు అంతర్జాలంలో ఉన్నప్పటికీ వివిధ వాడుకరులకు వ్యాఖ్యల సేకరణ ప్రక్రియలో పాలుపంచుకొనే అవకాశము ఇస్తున్న ప్రాజెక్ట్ వికీవ్యాఖ్య.
ఈ ప్రాజెక్ట్ జూన్ 23, 2003న ప్రారంభించబడింది. ఇంగ్లీషులో ఇప్పటికి 54 వేల పేజీలు ఉన్నాయి, ఇతర భాషలలో ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వందల కొద్దీ సవరణలు చేస్తున్నారు ఇంకా అనేక కొత్త వ్యాఖ్యలు సృష్టిస్తున్నారు.
వికీకోట్ అభివృద్ధి
[మార్చు]వికీకోట్ జూన్ 23, 2003లో ఉద్భవించింది. 2003 ప్రారంభంనుంచి వివిధ భాషలలో వికీకోట్‌ల వృద్ధి, వ్యాస సృష్టి, మైలురాళ్ళు , వికీస్టాట్స్ నుండి తీసుకోబడ్డాయి.
- 27 జూన్ 2003: వోలోఫ్ లాంగ్వేజ్ వికీపీడియా (wo.wikipedia.org)లో తాత్కాలికంగా ఏర్పాటు చేసారు.
- 10 జూలై 2003 నాటికి quote.wikipedia.org సొంత సబ్ డొమైన్ ఏర్పరచుకున్నారు. దీనిని వికీపీడియా సర్వర్ లో ఉంచారు.
- 25 ఆగస్టు 2003 తేదీకి స్వంత డొమైన్ ఏర్పడింది, అది wikiquote.org.
- 17 జూలై 2004 నాటికి కొత్త భాషలలో వికీకోట్ ప్రారంభమైంది. నవంబర్ 2004లో 24 భాషలలో వికీకోట్ చేరుకుంది.
- మార్చి 2005 నాటికి మొత్తం 10,000 పేజీలకు చేరుకుంది.
- జూన్ 2005 లో ఒక క్లాసికల్ (లాటిన్), ఒక కృత్రిమ (ఎస్పరాంటో)తో సహా 34 భాషలకు చేరుకుంటుంది
- ఏప్రిల్ 2006 లో చట్టపరమైన కారణాల వల్ల ఫ్రెంచ్ వికీకోట్ తీసివేసినా 4 డిసెంబర్ 2006న ఫ్రెంచ్ వికీకోట్ ను పునఃప్రారంభించారు.
- జూలై 2007 నాటికి వికీకోట్ 40 భాషలకు చేరుకుంది.
- ఫిబ్రవరి 2010: అన్ని భాషల్లో మొత్తం 100,000 వ్యాసాలకు చేరుకుంది.మే 2016: అన్ని భాషల్లో కలిపి 200,000 కథనాలకు చేరుకుంది.
- జనవరి 2018: పాఠశాలలు, లాభాపేక్ష లేని సంస్థల మధ్య జాతీయ భాగస్వామ్యాల పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టారు (ఇటలీ)
- జనవరి, 2019 నాటికి, వికీకోట్ ప్రాజెక్ట్ మొత్తం 800,000 వ్యాసాలకు చేరింది. ఆంగ్ల వికీకోట్‌తో సహా 28 ప్రాజెక్ట్‌లలో 1,000 కంటే ఎక్కువ వ్యాసాలు ఉన్నాయి: ఉదా: పోలిష్ వికీకోట్‌లో 24,600, ఇంగ్లీష్ 46,300, ఇటాలియన్ 48,800. రష్యన్ లో 14,400 వ్యాసాలు ఉన్నాయి.
- అక్టోబర్ 10, 2022 న నాలుగు కొత్త వికీకోట్‌లు సృష్టించబడ్డాయి, అవి సెంట్రల్ బికోల్ వికీకోట్, బెంగాలీ వికీకోట్, ఇగ్బో వికీకోట్, తగలోగ్ వికీకోట్
ఆంగ్ల వికీకోట్
[మార్చు]- 13 నవంబర్ 2004: ఇంగ్లీష్ ఎడిషన్ 2,000 పేజీలకు చేరుకుంది.
- ఇంగ్లీష్ ఎడిషన్ దాదాపు 3,000 పేజీలకు చేరింది.
- 4 నవంబర్ 2005: ఆంగ్ల వికీకోట్ 5,000 పేజీలకు చేరుకుంది.
- 7 మే 2007: ఆంగ్ల వికీకోట్ 10,000 పేజీలకు చేరుకుంది.
ఇతర భాషలు
[మార్చు]- నవంబర్ 18, 2019 క్రొయేషియన్ వికీకోట్ 2,000 వ్యాసాలకు చేరుకుంది.
- డిసెంబర్ 6, 2020 నాటికి హీబ్రూ వికీకోట్ లో 5,000 వ్యాసాలున్నాయి
- ఫిబ్రవరి 1, 2021 డచ్ వికీకోట్ 1,000 వ్యాసాల మైలు రాయికి చేరింది
- ఆగస్టు 26, 2021 తేదీకి ఉర్దూ వికీకోట్ లో 500 వ్యాసాలు చేరాయి
- జనవరి 15, 2022 జపనీస్ వికీకోట్ 1,000 వ్యాసాలున్నాయి
- జూలై 2, 2022 సఖా వికీకోట్ 1,000 వ్యాసాల కు చేరింది
- అక్టోబర్ 18, 2022 నాటికి ఎస్పరాంటో వికీకోట్ కు 5,000 వ్యాసాలు చేరాయి.
- డిసెంబర్ 3, 2022కు పోర్చుగీస్ వికీకోట్ 10,000 వ్యాసాలు సేకరించింది
- ఆగస్టు 23, 2023 నాటికీ అస్సామీ వికీకోట్ కు 500 వ్యాసాలు ఏర్పడ్డాయి
- అక్టోబర్ 12, 2023 తేదీకి థాయ్ వికీకోట్ 100 వ్యాసాలు సేకరించింది.
వికీవ్యాఖ్య
[మార్చు]వికీవ్యాఖ్య ఉచిత ఆన్లైను వ్యాఖ్యల భాండాగారములో అన్ని భాషల ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు, వాటి అనువాదాలు కూడా లభిస్తాయి. అంతేకాదు వ్యాఖ్యలను చేసినవారి గురించి తెలుసుకోవడానికి తెలుగు వికీపీడియాకు లింకులు కూడా ఉంటాయి. ఒక్కో పేజీలో ఒకటి కంటే ఎక్కువ వ్యాఖ్యలు, సామెతలు ఉంటాయి. వికీవ్యాఖ్య మొదటి వ్యాసం డిసెంబర్ 2004 లో నమోదు అయింది. నవంబర్ 2024 నాటికి వికీవ్యాఖ్యలో కంటెంట్ పేజీలు 787 ఉన్నాయి, సవరణలు 19,510 జరిగాయి.
ఆధారాలు
[మార్చు]- వికీవ్యాఖ్య గురించి https://te.wikipedia.org/wiki/వికీకోట్
- https://en.wikiquote.org/wiki/Wikiquote:Wikiquote
- అన్ని పేజీలు (వికీవ్యాఖ్య లో చేర్చిన పేజీల అకారాది క్రమం లో రూపొందిన జాబితా) https://w.wiki/8aKj
- వికీవ్యాఖ్య ప్రత్యేక గణాంకాలు: https://te.wikiquote.org/wiki/ప్రత్యేక:గణాంకాలు
- వికీవ్యాఖ్య/పట్టిక: తెలుగుతో సహా 74 భాషలలో గణాంకాలు రోజుకు నాలుగు సార్లు నవీకరించబడతాయి. వాటి లింకు https://meta.wikimedia.org/wiki/Wikiquote/Table/te
- వికీవ్యాఖ్య:ఆమె చెప్పింది (Wikiquote: #SheSaid) ప్రాజెక్ట్