చర్చ:తెలుగు స్థానికీకరణ మార్గదర్శిని/పరిచయం
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: ప్రస్తావించాల్సిన అంశాలు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Veeven
ప్రస్తావించాల్సిన అంశాలు
[మార్చు]- స్థానికీకరణ అనేది వాడుకరి అనుభూతిలో భాగమే (user experience). దీని గురించి రెండు మూడు వాక్యాలలో తెలియజేయాలి.
- కథల, వార్తల అనువాదానికి కంప్యూటరు ఉపకరణాల అనువాదానికి మధ్య భేదాలు. (తక్కువ చోటు, నిలకడ, సందర్భ లేమి). అవసరమయితే దీన్ని మరో పేజీగా చేయవచ్చు.
- తెలుగింపు గురి ఎవరు: తెలుగు వార్తాపత్రికలు, పుస్తకాలు చదవి అర్థం చేసుకోగలిగేవారు. (తెలుగు కొద్దిగా చదవడం వచ్చినవారు—వారు తెలుగు పత్రికలు చదివి అర్థం చేసుకోలేరు—తెలుగించిన అనువర్తనాలను వాడి నిరాశ చెందే అవకాశం ఉంది. తెలుగులో ఉపకరణాలను వాడేవారు కనీసం తెలుగు పత్రికలు, పుస్తకాలు చదివి అర్థం చేసుకోగలిగే స్థాయిలో ఉండాలని ఆశించడం తప్పుకాదనుకుంటాను. తెలుగు చదివి అర్ధం చేసుకోగలిగేవారికి తెలుగింపును గురిపెడితే, మాములుగా తెలిసిన మాటలకు కూడా ఆంగ్ల పదాలు వాడే బాధ తప్పుతుంది.)