అంతర్జాల స్వేచ్చా వనరులు/వెబ్ సైట్లు/పోర్టల్స్

Wikibooks నుండి

ఇక్కడ అధ్యనాలకు,పరిశోధనలకు, రచనలకు, భోధనకు ఉపయోగించగల ప్రామాణికమైన వెబ్ సైట్లు లేదా పోర్టల్స్ జాబితా వివరాలు ఇయ్యబడ్డాయి.

సిద్ధాంత గ్రంధాలు[మార్చు]

శోధ్ గంగా: భారత సిద్ధాంత గ్రంధాల భాండాగారము (Shodhganga: a reservoir of Indian Theses)
https://shodhganga.inflibnet.ac.in/

  • ఇవి ప్రామాణికమైన మూల పరిశోధనా గ్రంధాలు. అన్ని భారతీయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలలో అన్ని విషయ విభాగాలలో (Departments), అన్ని భారతీయ భాషలలో జరిగే పరిశోధనల నివేదికలు. "శోధగంగ" అనేది INFLIBNET సెంటర్ ఏర్పాటు చేసిన భారతీయ ఎలక్ట్రానిక్ సిద్ధాంత గ్రంధాల (థీసెస్ డిసర్టేషన్ల) భాండాగారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు, పరిశోధకులకు భారతీయ సిద్ధాంత గ్రంధాలకు బహిరంగ ప్రాప్యత లభిస్తుంది.
  • సిద్ధాంత గ్రంధాలను శీర్షిక, పరిశోధకులు, పర్యవేక్షకులు, విషయం, విషయ విభాగం, విశ్వవిద్యాలయం, సంవత్సరం సమర్పించిన తేదీ, ద్వారా శోధించి కావలసిన సమాచారం పొందవచ్చు.
  • విశ్వవిద్యాలయ నిధుల సంఘం (UGC) వారు (ఎం.ఫీల్. పి.హెచ్.డి లను సంస్కరించుటకు ఏర్పరచిన 5 మే,2016 ప్రకటన అనుసరించి కనీస ప్రమాణాలు & విధానము ఏర్పరచే లక్ష్యంతో) విశ్వవిద్యాలయాలలో పరిశోధకులు (థీసిస్, డిసర్టేషన్‌)ల ఎలక్ట్రానిక్ వెర్షన్‌ను సమర్పించడం తప్పనిసరి చేసారు. విశ్వవిద్యాలయాలు ఇదివరకే ఉన్న సిద్ధాంత గ్రంధాలను డిజిటైజ్ చేసి శోధ్ గంగా భాండాగారాన్ని సమర్పిస్తున్నాయి.
  • హ్యూలెట్-ప్యాకర్డ్ (HP) భాగస్వామ్యంతో MIT (మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) అభివృద్ధి చేసిన DSpace అనే ఓపెన్ సోర్స్ డిజిటల్ రిపోజిటరీ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి శోధగంగా@INFLIBNET రూపొందించారు. శోధగంగా భాండాగారం పరిశోధకులు సమర్పించిన సిద్ధాంత గ్రంధాల(ఎలక్ట్రానిక్ థీసెస్\డిసర్టేషన్స్) సంగ్రహించడం, సూచిక చేయడం, నిల్వ చేయడం, వ్యాప్తి చేయడం, సంరక్షించడం వంటి కార్యక్రమాలకు తగిన సామర్ధ్యం ఉంటుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు భారతీయ సిద్ధాంత గ్రంధాలకు బహిరంగ ప్రాప్యతను సులభతరం అయింది.
  • ఇది సిద్ధాంత గ్రంధాలు సమర్పిస్తున్న విశ్వవిద్యాలయాలే కాకుండా అందరికి అందుబాటులో ఉంటుంది.
  • దీని ప్రతులను (Document full text) అధ్యాయాలుగా PDF రూపంలో దింపు(డౌన్లోడ్)కోవచ్చును.
  • గూగుల్ శోధనలో కూడా ఈ ప్రతుల లింకులు కనపడుతాయి.

పరిశోధకుల నెట్వర్కులు (Citations)[మార్చు]

మెండలీ
అకాడెమియా
రీసెర్చ్‌గేట్

సాంప్రదాయ సంగీతం:[మార్చు]

సంగీత సుధ: కర్ణాటక సాహిత్యం ఆంగ్ల అనువాదం (Sangeeta Sudha: English Translation of Karnatic Lyrics)
లింక్ - http://www.sangeetasudha.org/site/index.html

సంగీత సుధ

పరిచయం: ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని, ముఖ్యంగా కర్ణాటక సంగీతాన్ని అనేకమంది గానం చేస్తున్నారు. వీటిని ఆధారంగా కొందరు సాంప్రదాయ నృత్యాలను కూడా రూపొందిస్తున్నారు. అయితే భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యం, సంగీతం, నృత్యం వంటి శాస్త్రీయ కళలను అర్థం చేసుకోవడానికి ఆంగ్లం ఒక ప్రముఖ మాధ్యమంగా అయింది. ఈ నేపథ్యంలో శాస్త్రీయ సంగీతం నేర్చుకునే విద్యార్థులకు, నేర్పే గురువులకు, సాంప్రదాయ నృత్యాలను రూపొందిస్తున్నవారికి కూడా వివిధ దక్షిణ భారతీయ భాషలలో వాగేయకారుల రచనలను తగినట్లుగా ఉచ్చరించడము, అర్ధం చేసికోవడము చాలా ఇబ్బంది కరం. ఈ సంగీత సుధ వెబ్ రిసోర్స్ ఈ ఇబ్బందిని చాలావరకు అధిగమింపచేస్తుంది.

  • ఇది శాస్త్రీయ సంగీతానికి కావలసిన సాహిత్యం కోసం ప్రధానంగా రూపొందించిన వెబ్ సైట్ లేదా వెబ్ రిసోర్స్ అని పేర్కొనడం సముచితంగా ఉంటుంది.
  • దీనిని దాసు దామోదరరావు గారు (USA) తమ కుటుంబ సభ్యుల సహకారంతో రూపొందించారు.
  • దీనిలో చాలావరకు అందరి వాగ్గేయకారుల (వారికి లభించినన్ని) రచనలకు ఆంగ్లంలో ఉచ్చారణ (Transliterated form), ఆంగ్లం లో వివరణ (అర్ధము) ఇచ్చారు. దానివలన ఆంగ్ల మాధ్యమంలో అధ్యయనం చేసినవారికి, ఇతర భాషా సంగీత నృత్య కళాకారులకు సంగీత ప్రక్రియలతో పాటుగా సాహిత్యాన్ని అర్ధవంతంగా, భావయుక్తముగా, ఇంకా ఉచ్చారణ దోషాలు లేకుండా ఉపయోగించడం అభ్యాసం చేయగలుగుతారు.
  • కాబట్టి ఇది ప్రధానంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకునే విద్యార్థులకు, నేర్పే గురువులకు, సాంప్రదాయ నృత్యాలను కూడా రూపొందిస్తున్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

వాగ్గేయకారులు

  1. త్యాగరాజ భాగవతార్
  2. ముత్తుస్వామి దీక్షితార్
  3. శ్యామ శాస్త్రి
  4. పురందర దాసు
  5. అన్నమాచార్యులు
  6. రామదాసు
  7. నారాయణ తీర్థులు
  8. భక్త జయదేవ్
  9. ముత్తై భాగవతార్
  10. దాసు శ్రీరాములు
  11. స్వాతి తిరునాల్
  12. పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్
  13. మైసూర్ వాసుదేవాచార్య
  14. క్షేత్రయ్య
  15. ఊటుక్కడు వెంకట సుబ్బయ్యర్
  16. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి
  17. సుబ్బరాయ శాస్త్రి
  18. జి ఎన్ బాల సుబ్రహ్మణ్యం
  19. డాక్టర్ ఎం బాలమురళీ కృష్ణ
  20. పూచి శ్రీనివాస అయ్యంగార్
  21. జావళీలు, పదములు (క్షేత్రయ్య,దాసుశ్రీరాములు,ధర్మపురి,పట్టాభిరామయ్య తదితరులు)
  22. స్వామి దయానంద్ సరస్వతి
  23. తిరువతియూర్ త్యాగయ్య
  24. తూము నరసింహదాసు
  25. పొన్నయ్య పిళ్లై
  26. ఓగిరాల వీర రాఘవ శర్మ
  27. అశోక్ మాధవ్
  28. జయచామరాజ వడయార్

2008వ సంవత్సరంలో సంగీత సుధని పుస్తక రూపం లో 2 సంపుటాలుగా ప్రచురించారు.