అంతర్జాల స్వేచ్చా వనరులు/వికీపీడియా గ్రంథాలయం
ప్రపంచవ్యాప్తంగా పుస్తకాలు, పత్రికలూ, వ్యాసాలూ అన్ని ఉచితము కావు. ఇంతకు ముందు అధ్యాయాలలో ప్రస్తావించిన ఉద్యమాలు, తీసుకున్న నిర్ణయాల ఫలితంగా కొద్దిపాటి విలువైన వైజ్ఞానిక సాహిత్యం ఉచితంగా లభిస్తోంది, అయితే చాలావరకు విలువైన సాహిత్యం చందా రూపం(సబ్స్క్రిప్షన్ ద్వారా)లో, కొనుగోలులో అధిక ధరలకు మాత్రమే లభిస్తుంది. అటువంటి సాహిత్యాన్ని వికీపీడియా తమ వాడుకరులకు తమ వ్యాసాలను ఖచ్చితమైన సమాచారము, వాటి మూలలతో సహా పేర్కొనడానికి వికీమీడియా ఫౌండేషన్ (WMF),వికీపీడియా గ్రంథాలయం ద్వారా వాడుకరులకు ఉచిత ప్రాప్యత లభింపచేస్తోంది.
వికీపీడియా గ్రంథాలయం(వికీపీడియా లైబ్రరీ) వికీపీడియా వాడుకరులకు కావలసిన అంతర్జాతీయ ప్రచురణకర్తలతో భాగస్వామ్యమయి అధిక వెలలకు మాత్రమే లభ్యమయే సాహిత్యాన్ని (పుస్తకాలు, పత్రికలూ, వ్యాసాలు మొదలగువాటిని) ఉచితంగా అందుబాటులోకి తెస్తోంది.
వికీపీడియా గ్రంథాలయం వెబ్సైట్ లో ఏప్రచురణకర్తలు, సంకలనకర్తల (Aggregators) భాగస్వామ్యాలు అందుబాటులో ఉన్నాయో చూడవచ్చు, వాటి కంటెంట్‌లను శోధించవచ్చు, పూర్తిప్రతిని దింపుకొని చదవవచ్చు. మీకు ఆసక్తి ఉన్న వనరుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రంథాలయం వనరులు
[మార్చు]ఈ వికీపీడియా గ్రంథాలయం దాదాపుగా అన్ని విషయ విభాగాలకు వనరులను అందిస్తోంది - మానవ, సామాజిక శాస్త్రాలు, వాణిజ్యం, న్యాయ శాస్త్రం, వైజ్ఞానిక సాంకేతిక శాస్త్రాలు, వైద్య ఆరోగ్య శాస్త్రాలు, భాష, సాహిత్యం, తత్వశాస్త్రం, మతం, కళలు, సంస్కృతి, విద్య మొదలగునవి.
ఈ వికీపీడియా గ్రంథాలయం నుంచి పుస్తకాలు, అధ్యాయాలు, పత్రికలూ, వ్యాసాలు, సిద్ధాంత గ్రంధాలు, వార్తలు, దినపత్రికల భాండాగారం వంటి వనరులు వాడుకరులకు అందుబాటులో ఉంటాయి.
అయితే ఈవనరులు అందుకోవాలంటే వాడుకరులు తమ వికీమీడియా ఖాతాతో లాగ్ఇన్ అవ్వాలి. లాగిన్ అయిన వాడుకరి తమ వనరుల వివరాలు (పేర్లు, లింకులు, లోగోలు) తో పాటు ఖాతాకు సంబంధించి మూడు రకాల సూచనలు చూడగలుగుతారు.
- Favorites ( ) నాకు నచ్చిన వనరులు. వనరుల దగ్గర ఉన్న నక్షత్రం బొత్తం (Star button) దగ్గర క్లిక్ చేసి ఆయా వనరులను ఈ వర్గం లో చేర్చుకోవచ్చు
- My Collections (80) వికీమీడియా భాగస్వామ్యం ద్వారా వాడుకరులకు ఉచితముగా అందుబాటులో ఉన్న వనరులు.
- Available Collections (24) - వాడుకరులకు ఉచితముగా అందుబాటులో లేని వనరులు. అయితే వాడుకరులు నిర్దుష్ట వనరులను, నియమిత కాలానికి అర్ధించవచ్చు.
వాడుకరుల కనీస అర్హత/ప్రమాణాలు
[మార్చు]ఈ వికీపీడియా గ్రంథాలయం ఉపయోగించుకోవాలంటే కనీస అర్హత/ప్రమాణాలు ఉండాలి. ఆ అర్హత సాధించిన వాడుకరికి వికీమీడియా నుండి వికీపీడియా గ్రంథాలయం ఉపయోగించుకోవచ్చని సందేశం వస్తుంది.
- 500+ సవరణలు
- 6+ నెలల సవరణ కాలం కార్యాచరణ
- గత 30 రోజుల్లో 10+ సవరణలు
- నిరోధాలు లేదా నిషేధాలు(బ్లాక్‌లు) ఉండకూడదు.
వికీమీడియా ఖాతాతో లాగిన్ అయిన తరువాత, వికీపీడియా గ్రంథాలయం యాక్సెస్ చేయడానికి ప్రతి లాగిన్ వద్ద మీ అర్హత అంచనా వేయబడుతుంది. లైబ్రరీ కంటెంట్‌లో సగానికి పైగా ఈ స్వయంచాలక అర్హత తనిఖీ ద్వారా అందించబడినప్పటికీ, ఇతర ప్రచురణకర్తల కంటెంట్‌కు యాక్సెస్ సమయం పరిమితం కావచ్చు, సాధారణంగా ఒక సంవత్సరం తర్వాత అయిపోతుంది. ఆ తర్వాత సాధారణంగా పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
గ్రంథాలయ వనరుల వినియోగ నిబంధనలు
[మార్చు]- వికీపీడియా గ్రంథాలయం ద్వారా ఈ వనరుల సదుపయోగం లేదా సద్వినియోగం (Fair Use of E-Resources) కొరకు ప్రతి వ్యక్తిగత ప్రచురణకర్త లేదా సంకలనకర్త వనరులను వినియోగించుకోవడానికి, ఆ ప్రచురణకర్త నిర్దేశించిన ఉపయోగ నిబంధనలు, గోప్యతా విధానాన్ని తప్పనిసరిగా అంగీకరించాలి.
- EBSCO డిస్కవరీ సర్వీస్ లేదా OCLC వారి EZProxy వంటి సాధనాలు ఉపయోగించి మాత్రమే నిర్దిష్ట వనరులు యాక్సెస్ చేయబడే వనరులు దానిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని గమనించండి.
ప్రచురణకర్త వనరులను వినియోగిస్తున్నప్పుడు క్రింది పనులు నిషేధించబడ్డాయి.
- మీ వికీపీడియా ఖాతా, వినియోగదారు పేర్లు, పాస్‌వర్డ్‌లు లేదా ప్రచురణకర్త వనరుల కోసం ఏదైనా యాక్సెస్ కోడ్‌లను ఇతరులతో పంచుకోవడం;
- స్వయంచాలకంగా స్క్రాప్ చేయడం లేదా ప్రచురణకర్తల నుండి పరిమితం చేయబడిన కంటెంట్‌ని డౌన్‌లోడ్ చేయడం;
- క్రమపద్ధతిలో ఏదైనా ప్రయోజనం కోసం అందుబాటులో ఉన్న నిరోధిత కంటెంట్ బహుళ సారం ముద్రిత లేదా ఎలక్ట్రానిక్ కాపీలను తయారు చేయడం;
- అనుమతి లేకుండా డేటా మైనింగ్ కార్యక్రమాలను ఉపయోగించడం
- వికీపీడియా లైబ్రరీ ఖాతా ద్వారా మీరు పొందే యాక్సెస్‌ను ఉపయోగించి వాణిజ్య లాభం కోసం మీ ఖాతా లేదా దాని ద్వారా మీరు కలిగి ఉన్న వనరులను లేదా యాక్సెస్‌ను విక్రయించడం.
ప్రత్యేక సూచనలు
[మార్చు]- వికీపీడియా గ్రంథాలయం ద్వారా సేకరించిన సమాచారమును వాడుకరులు తమ వ్యాసాలలో పొందుపరచినపుడు దాని మూలల ప్రస్తావనలో వనరుల స్వంత యుఆర్ఎల్ (URL) లేదా వెబ్ లింక్ ను ఇవ్వాలి. వికీపీడియా గ్రంథాలయం లింక్ ఇవ్వకూడదు. ఎందుకంటే వికీ వ్యాసాలు చదివేవారికి వికీపీడియా గ్రంథాలయం ప్రాప్త్యత ఉండదు. కాబట్టి వారికి ఈ లింక్ పని చేయదు.
- వికీపీడియా వాడుకరులకు తమ ప్రాంతీయ భాషలలో ప్రచురణ/సంకలన కర్తల భాగస్వామ్యం చేర్చడం కొరకు వికీమీడియా ఫౌండేషన్ కు సిఫారసు చేయవచ్చు. సిఫారసు ఇంతకు ముందే ఉంటే దానిని అప్ వోట్ చేసి బలపరచవచ్చు.
వీడియో లింకులు
[మార్చు]- Let's Connect: Introduction to Wikipedia Library: Product and Partnerships
- Navigating The Wikipedia Library
సంప్రదించండి
[మార్చు]డేటా నిర్వహణ గురించి ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు ఉంటే - wikipedialibrary@wikimedia.orgని సంప్రదించండి.