అంతర్జాల స్వేచ్చా వనరులు/పరిచయం
ప్రధానంగా నేటి కాలములో జ్ఞానసముపార్జనకు విద్య, బోధన, అభ్యాసం, పరిశోధనలు అవసరమైన అంశాలు. విద్య సమాచార ఆధారితమైనది. అభ్యాసం నిరంతరమైనది. వీటికి సంబంధించిన ప్రతి అంశం కొరకు సమాచార సముపార్జన, సమాచార సాంకేతిక ప్రక్రియ (ప్రాసెసింగ్), సమాచార పంపిణీ (Information Distribution) కి లోను కావలసి ఉంటుంది. వివిధ రంగాలలో పరిశోధనలు సమాచారాన్ని జోడిస్తాయి/అవసరమైన చోట మార్పు చేస్తాయి.
ఇంతకు పూర్వము అంటే ముద్రిత వనరుల కాలంలో విద్య, బోధన, పరిశోధన సంప్రదాయ ప్రాథమిక, ద్వితీయ, తృతీయ సమాచార ముద్రిత వనరులపై పూర్తిగా ఆధారపడి ఉంది. బహుళ-విషయ పరిశోధనలు (multi-disciplinary research), సమాచార విస్ఫొటనము (Information Explosion), కంప్యూటర్ కమ్యూనికేషన్ సాంకేతిక పురోగతి, 90లలో ఆరంభమైన ఎలక్ట్రానిక్ ప్రచురణలు, ప్రతుల డిజిటలైజేషన్ మొదలగునవి మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని అనగా విద్య, పరిశోధన, వ్యాపారం, ప్రభుత్వ, ప్రభుత్వేతర సేవలు, వంటి వాటిని తీవ్రంగా ప్రభావితం చేసాయి, చేస్తున్నాయి.
సమాచార వనరులు
[మార్చు]సమాచార వనరులు సాదా వచన ప్రతులు నుంచి, సూచికలు (కేటలాగ్‌లు), చిత్రాలు, దృశ్య శ్రవణ, హైపర్ లింక్డ్ టెక్స్ట్‌లు, మల్టీమీడియా, స్లైడ్ షోలు (ప్రదర్శనలు), గణాంకాలు, నివేదికలు, నియమాలు, వివిధ ప్రభుత్వ/ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు సృష్టించిన ఉచిత ప్రతులే కాకుండా ప్రచురణకర్తలు/ప్రొవైడర్లు తయారు చేసిన చందా ఆధారిత లైసెన్స్ ప్రతులు, వైజ్ఞానిక వ్యాసాలు, పత్రికలు, ఎలెక్ట్రానిక్ పుస్తకాలు, ఇంకా అనంతంగా ఏర్పడుతున్న డిజిటల్ రూపంలో సమాచార ప్రతులకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
సమస్యలు
[మార్చు]లెక్కకు మించిన డిజిటల్ ప్రతులు అంతర్జాలం లో లభిస్తున్నప్పటికిని విద్య, బోధన, అభ్యాసం, పరిశోధనలకు వలసిన వనరులు చాలావరకు ప్రచురణకర్తల నుండి అధిక ధరలకు చందా రూపంలో, కొనుగోలు రూపములో మాత్రమే అనుమతులు (లైసెన్స్) లభిస్తున్నాయి. ఇది సంబంధిత వ్యక్తులకు, విద్యా పరిశోధనా సంస్థలకు, ప్రభుత్వాలకు కూడా భారమవుతోంది.
పరిష్కారాలు
[మార్చు]అయితే నిరంతర అధ్యయనాలకు అనువుగా వనరులు, ఉపకరణాల స్వేచ్ఛా వినియోగానికి వాటి స్వేచ్ఛా పంపిణీ కూడా చాలా అవసరం. ఉన్న అనేక పరిష్కారాలలో -
- రచయితలు తమ రచనలను స్వేచ్ఛాప్రాప్యత ఉన్న పత్రికలలో, స్వేచ్ఛాప్రాప్యత విధానంలో ప్రచురించుటo, స్వేచ్ఛా భాండాగారాలలో తమ రచనలను భద్రపరచటo, అనుసంధాన వ్యవస్థల ద్వారా పంపిణీ చేయగలగడం ఒకటి.
- ఈ స్వేఛ్ఛాలబ్ధికి ప్రభుత్వాలు, ప్రచురణ సంస్థలు, విద్యా సంస్థలు, పరిశోధకులు అనుసరిస్తూ వచ్చిన మార్పులు, చేసిన ఉద్యమాలు వచ్చే అధ్యాయం లో . . .