సేమియా పకోడీ
Appearance
- సేమియా పకోడి తయారు చేయు విధానము
కావలసిన పదార్థాలు
[మార్చు]- సేమియా - ఒక కప్పు,
- శెనగపిండి - ఒక కప్పు,
- ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు,
- అల్లం పేస్ట్ - అర స్పూన్,
- కరివేపాకు రెబ్బలు - కొన్ని,
- కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు,
- బేకింగ్ పౌడర్ - చిటికెడు,
- కారం - ఒక స్పూన్,
- ఉప్పు - రుచికి సరిపడా,
- నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే పద్ధతి
[మార్చు]- స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక స్పూన్ నూనె వేసి వేడెక్కాక ఒక కప్పు సేమియా వేసి దోరగా వేయించు కోవాలి.
- ఇంకో గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు నీళ్లు పోసి వేడిచేసి అందులో వేగించిన సేమియా వేసి మెత్తగా అయ్యే వరకు మూతపెట్టి ఉడికించాలి.
- ఉడికించిన సేమియా, శెనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర తురుము, బేకింగ్ పౌడర్, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడి పిండిలా గట్టిగా కలుపుకోవాలి .
- ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసిస్టవ్ మీద పెట్టి వేడిచేసుకోవాలి.
- కలిపి పెట్టుకున్న పిండిని పకోడీల్లా కొద్దికొద్దిగా కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి చిల్లుల గరిటెతో తీయాలి.
- వేడి వేడిగా తింటుంటే బలే రుచిగా వుంటాయి.
వనరులు
[మార్చు]http://telugutaruni.weebly.com/15/category/4332b63754/1.html