Jump to content

సగ్గుబియ్యం వడియాలు

Wikibooks నుండి
  • కావలసిన పదార్థాలు
  1. సగ్గుబియ్యం - 1 డబ్బా
  2. పచ్చిమిరపకాయలు: 1/4 కేజీ
  3. ఉప్పు - తగినంత
  4. నిమ్మకాయలు - 2
  • తయారీ విధానం
  1. ముందురోజు రాత్రి సగ్గుబియ్యాన్ని నీళ్ళలో నానపెట్టుకోవాలి.
  2. 1 డబ్బా సగ్గుబియ్యానికి 14 గ్లాసులనీళ్ళు పోసి(అంత పలుచగా వద్దనుకుంటే 8 గ్లాసులు సరిపోతాయి) బాగా మరిగించాలి.
  3. సగ్గుబియ్యం ఉడికి, చిక్కబడే వరకు గరిటతో తిప్పుతూ ఉండాలి.
  4. దానిలో మిరపకాయల పేస్టుని కలుపుకొని, బాగా కలియ తిప్పి స్టొవ్ ఆపాలి.
  5. ఆ మిశ్రమంలో నిమ్మరసం వేసి బాగా కలిపి, చిన్న వడియాలలా గరిటతో పలుచటి ప్లాస్టిక్ పేపరు మీద పెట్టి ఎండలో ఉంచాలి.
  6. ఈ వడియాలను విడిగానూ, అన్నములో నంచుకునీ తినవచ్చు.

సగ్గుబియ్యం వడియాలు 1

[మార్చు]
  • కావలసినవి:
  1. సగ్గుబియ్యం - కప్పు;
  2. నీరు - 4 కప్పులు;
  3. పచ్చిమిర్చి - 4;
  4. జీలకర్ర - కొద్దిగా;
  5. ఉప్పు - తగినంత;
  6. నువ్వుపప్పు - పావు కప్పు
  • తయారుచేసే విధానం:
  1. మందపాటి గిన్నెలో నీళ్లు పోసి స్టవ్‌ మీద ఉంచి, బాగా మరిగించాలి.
  2. సగ్గుబియ్యం పోసి స్టౌ మంట తగ్గించాలి.
  3. మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ సుమారు గంటసేపు సగ్గుబియ్యాన్ని ఉడికించాలి.
  4. సగ్గుబియ్యం పూర్తిగా కరిగిపోయి, రంగు లేకుండా అయితే అప్పుడు పూర్తిగా ఉడికినట్టి పాత్రను కిందికి దించి, పచ్చి మిర్చిపేస్ట్‌, ఉప్పు, జీల కర్ర, నువ్వులు వేసి కలపాలి.
  5. చల్లారాక ఎండలో గ్లాస్కో పంచె మీద కావలసిన సైజులో వడి యాలు పెట్టాలి.
  6. బాగా ఎండిన తరువాత వీటిని వేయించుకుని స్నాక్స్‌లా కాని, సాంబారు అన్న ంలో కాని నంచుకుని తింటే బాగుంటాయి.