This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
American spelling is used throughout.
There is no clearly established, standardized alphabetical order in Telugu. The justification for the scheme used here would be too long for discussion here.
చండ్ర, caMDra
-n.
-- black cutch; [bot.] Acacia catechu;
-- an extract of its heartwood, Khair, is used as an ingredient to give red color and typical flavor to paan - a packet of betel leaf (Piper betle) with areca nut and slaked lime paste;
-- నల్ల చండ్ర; కాచుతుమ్మ;
చందన ధృతి, caMdana dhRuti
- n. essential oil of sandalwood; oil of Santal; Oleum Santali;
చందమామ, caMdaMAma
-n.
--(1) moon; Earth’s moon; see also నెలరాజు;
--(2) Chela; a fish of the Cyprinidae family; [bio.] Oxygaster untrahi;
--(3) yellow of an egg'
చందమామ కూర, caMdaMAma kUra
-n.
--a leafy vegetable; [bot.] Marsilea minuta Linn.;
చంద్ర, caMdra
-adj.
--lunar; pertaining to the moon;
చంద్రకళలు, caMdrakaLalu
-n.
--phases of the moon;
చంద్రకాంత, caMdrakAMta
- n.
-- Four O'clock flower; Marvel of Peru; [bot.] Mirabilis jalapa Linn.;
-- an ornamental shrub, native of Mexico, with a variety of flowers;
చంద్రగ్రహణం, caMdragrahaNaM
-n.
--lunar eclipse;
చంద్రవంక, caMdravaMka
-n.
--crescent moon; new moon; see also నెలవంక;
చంద్రుడు, caMdruDu
-n. m.
--(1) moon;
--(2) the natural satellite of any planet;
---అర్ధచంద్రుడు = half moon.
---చంద్ర వంక = crescent moon.
---పూర్ణచంద్రుడు = full moon.
---రాకాచంద్రుడు = full moon.
---వర్ధమాన చంద్రుడు = waxing moon.
---క్షీణచంద్రుడు = waning moon.
-- చంద్రుడికో నూలు పోగు = A small gift to a great person; గొప్ప వారికి చిరు కానుక సమర్పించుకుంటున్నప్పుడు చెప్పే మాట; తెలుగువారి సంప్రదాయంనుంచి ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది. 1960 ప్రాంతాల వరకు విదియ చంద్రుణ్ణి సాయంసంధ్యలో పశ్చిమాకాశంలో దర్శించి, వంటిమీద చీర లేదా పంచనుంచి ఒక నూలుపోగు తీసి "చంద్రునికి నూలుపోగు" అని నోటితో చెప్పుకొని గాలిలోకి విడిచిపేట్టడం సంప్రదాయం. ఇది కులాలకు అతీతమైన ఆచారం. అయితే క్రమంగా ఈ ఆచారాన్ని మనందరం మరచిపోయాము.
చంపకమాల, caMpakamAla
-n.
--a meter in Telugu prosody; (lit.) a garland of champaka flowers;
చంపు, caMpu
-v. t.
--kill; slay; (rel.) ఖూనీచేయు;
చంపూ, caMpU
-adj.
--hybrid; mixture; a mixture of prose and poetry;
చంపూకావ్యం, caMpUkAvyaM
-n.
--a literary work containing both prose and verse;
Part 1: చ - ca
చకచక, cakacaka
-adj.
--onomatopoeia for fast action such as walking, talking and actively doing things;
చక్కగా, cakkagA
-adv.
--nicely; neatly;
చక్కపెట్టు, cakkapeTTu
-v. t.
--arrange; set right;
చక్రం, cakraM
-n.
--(1) wheel;
--(2) caster; the wheels attached to furniture legs;
--(3) discuss of Vishnu;
--(4) cycle;
--(5) astrological chart;
--(6) one of the six glands of the body, according to Ayurveda, whose secretions influence psychic activity;
---జాతక చక్రం = astrological chart.
---నువ్వు చక్రం తీసికో = you drive.
చక్రవడ్డీ, cakravaDDi
-n.
--compound interest; a method of calculating interest by interest already earned to the principal;
చక్షుశ్రవం, cakshuSravaM
-n.
--snake; (lit.) one that hears with its eyes; (ety.) it is well known that snakes cannot hear; people perhaps thought that they use eyes to hear; this word is a misnomer;
చతుర్భుజం, caturbhujaM
-n.
--quadrilateral; a plane geometrical figure with four straight sides;
చతుర్ధేను, caturdhEnu
-n.
--[chem.] butane; a hydrocarbon with four carbon atoms with all single bonds; C4H10;
చతుర్ధీను, caturdhInu
-n.
--[chem.] butene; a hydrocarbon with four carbon atoms and a double bond; C4H8;
చతుర్ధైను, caturdhainu
-n.
--[chem.] butyne; a hydrocarbon with four carbon atoms and a triple bond; C4H6;
చతుశ్శాల, catussAla
-n.
--quad; quadrangle; open area surrounded by buildings on all four sides;
చతుస్, catus^
-pref.
--four;
చతుష్టయం, catushTayaM
-n.
--quartet; team of four persons;
---దుష్టచతుష్టయం = the evil four, namely Duryodhana, Dussasana, Karna and Sakuni of Mahabharata.
---ముక్తిచతుష్టయం = the four types of salvation, namely సామీప్యం, సాలోక్యం, సారూప్యం, సాయుజ్యం.
చతుష్పాది, catushpAdi
-n.
--an animal with four feet;
చదవడం, cadavaDaM
-v. i.
--reading; చదవటం;
చదరం, cadaraM
-adj.
--flat; level; square;
---నలుచదరం = flat on four sides; flat on all sides; square.
చమరి, camari
-n. f.
--yak; Himalayan yak; Yak of Tartary; Tartarian ox;
-- [bio.] Bos grunniens of the Bovidae family; grunting ox; Bos mutus of the Bovidae family; mute ox;
-- Yak అనే ఇంగ్లీషు పేరుకి మూలం టిబెట్ భాషలోని "gyag" అనే శబ్దం; టిబెట్ భాషలో "gyag" (యాగ్) అంటే మగ మృగం, "nag" (నాగ్) అంటే ఆడ మృగం; చమరీమృగాలకి అమెరికా బైసన్ (Bison bison) తో దగ్గర సంబంధాలు ఉన్నాయి;
-- చమరీమృగం; సవరపు మెకము; జడలబర్రె;
చమరీవాలం, camarIvAlaM
-n.
--[lit.] the bushy tail of a yak; a fan made from this bushy tail is used in temples to ceremoniously fan the idols;
చరమాంకం, caramAMkaM
-n.
--(1) last digit; least significant digit;
--(2) last act; see also చరాంకం;
చర మూలధనం, cara mUladhanaM
-n.
--[econ.] liquid capital;
చర రాసి, cararAsi
-n.
--variable;
చర్చ, carca
-n.
--(1) discussion; inquiry;
--(2) application of a layer, as in చందన చర్చ;
చర్చనీయ, carcanIya
-adj.
--debatable;
చర్మం, carmaM
-n.
--(1) skin;
--(2) hide; pelt; the precursor to leather;
చర్మరంజకం, carmaraMjakaM
-n.
--any substance (food or cosmetic) that gives luster to the skin;
చర్య, carya
-n.
--action; deed; (ant.) ప్రతిచర్య;
---ప్రతీ చర్యకి సమానం, వ్యతిరిక్తం అయిన ప్రతిచర్య వుంటుంది = for every action there is an equal and opposite reaction.
చర్వణం, carvaNaM
-n.
--chewing; mastication;
---చర్విత చర్వణం = doing something again; repetition; (lit.) chewing something that has been chewed.
చరిత్ర, caritra
-n.
--(1) history;
--(2) narrative;
---జీవితచరిత్ర = biography; life history of a person.
---స్వీయచరిత్ర = autobiography; ones own life history.
చలన శక్తి, calanaSakti
-n.
--[phy.] kinetic energy; energy by virtue of motion; (1/2)mv2;
చలనశీలత, calanaSIlata
-n.
--mobility;
చలనశీలి, calanaSIli
-n.
--mobile; mobile phone; cell phone;
చల్ల, calla
-n.
--(1) buttermilk;
--(2) coolness;
చల్లడం, callaDaM
-n. s.
--shorts; knickers; half-pants;
చల్లదనం, calladanaM
-n.
--coolness; cold;
చలాకీ, calAkI
-adj.
--lively; vivacious;
చలానా, calAna
-n.
--invoice; receipt;
చల్లారు, callAru
-v. i.
--(1) to become cool;
--(2) to calm down; to become calm;
చల్లార్చు, callArcu
-v. t.
--(1) to cool;
--(2) to pacify;
చలించు, caliMcu
-v. i.
--(1) stir; move;
--(2) to be shaken; to receive a shock;
చలి, cali
-adj.
--cold;
---చలి కాలం = winter; (lit.) cold season.
-n.
--cold; coldness when referring to weather;
---బయట చలిగా ఉంది = it is cold outside.
చలిచీమలు, chalichImalu
- n. pl.
-- winged ants; Isoptera ఆర్డర్ కి చెందిన ఉన్నత తరగతి రెక్కల చీమలనే సాధారణ పరిభాషలో మనం చలిచీమలని వ్యవహరిస్తాం;
-- ఇవి చెద పురుగుల (termites) కంటే బాగా పెద్దవి;
చలిజ్వరం, calijvaraM
-n.
--malaria; ague;any fever with chills;
చలితం, calitaM
-n.
--erythema; a type of skin allergy;
చలిమంట, calimaMTa
-n.
--bonfire;
చల్లు, callu
-v. t.
--sprinkle; scatter;
చవక, cavaka
-n.
--inexpensive; cheap;
చవకబారు, cavakabAru
-n.
--cheap; of inferior quality;
చవట, cavaTa
-n.
--incompetent fellow; a stupid fellow;
చ్యవనప్రాశ, chyavanaprASa,
- n.
-- An Ayurvedic tonic named after Chyavana maharshi, son of Bhrigu maharshi; this electuary (లేహ్యం) is made from ఉసిరి, దశమూలాలు, కర్కాట శృంగి, అగరు, కరక్కాయ, తిప్పతీగ, కచ్చూరాలు, వస, యష్టీమధుకం, అశ్వగంధా, శతావరీ, నెయ్యి, అభ్రక భస్మం, మొదలైనవి;
చాంద్రమాసం, cAMdramAsaM
-n.
--[astron.] lunation; synodic month; the interval of time between new moon day to new moon day; this is approximately 29.53 days;
chaamdee, చాందీ
- n.
-- East Indian Rosebay; pinwheel flower; crape jasmine; [bot.] Tabernaemontana divaricata
-- an evergreen, much-branched shrub cultivated as a garden plant;
చాతక పక్షి, cAtaka pakshi
-n.
- house swift; Pied Crested Cuckoo; Jacobin Cuckoo; Clamator Jacobinus; [bio.] Apus affinis;
-- there is a poetic belief that this bird quenches its thirst only from falling raindrops;
-- వానకోయిల;
చాదస్తం, cAdastaM
-n.
--shilly-shally; eccentricity; whimsicality; ceremonialism; unworldliness; silliness; orthodoxy; traditional mindedness; obsessive compulsiveness; see also ఛాందసం;
చాపం, cApaM
-n.
--(1) bow;
--(2) arch;
--(3) [math.] arc; a portion of a circles circumference;
--- మహావృత్తపు చాపం = [Astron.] Great Circle arc;
చాప, cApa
-n.
--mat; floor mat;
చాపు, cApu
-adj.
--[music] non-uniform;
-v. i.
--extend; stretch;
-n.
--(1) length; full-length cloth suitable for wearing as a lower garment by men;
--(2) long-vowel;
చామంతి, cAmaMti
-n.
--chrysanthemum; mum; [bot.] Chrysanthemum of the Asteraceae family;
చామనచాయ, cAmanacAya
-n.
--swarthy complexion; swarthiness; a complexion that looks like a tanned white rather than black; brown complexion;
చామరం, cAmaraM
-n.
--whisk; fly-flap; chowry; luxurious fan; fan made from the hair of yak;
-- [ety.] చమరీ మృగం తోక లోని రోమములతో చెయ్యబడ్డ విసనకర్ర;
-- తెల్లని చామరాన్ని వింజామరం (విరి + చామరం) అంటారు;
చింత, ciMta
-n.
--(1) tamarind; Indian date; [bot.] Tamarindus indica of the Leguminosae family;
--(2) thought; reflection; worry; anxiety;
---చింత చచ్చినా పులుపు చావలేదు = [idiom] the potency is gone, but the desire persists.
చింతచిగురు, ciMtaciguru
-n.
--tender shoots of a tamarind tree; [bot.] Tamarindus indica;
చింతపండు, ciMtapaMDu
-n.
--tamarind; tamarind fruit; the sweet-sour fruit of a tamarind tree, popular in Indian cooking;[bot.] Tamarindus indica;
-- see also మలబార్ చింతపండు;
చికీర్ష, cikIrsha
-n.
--ambition; desire to do a great deed; % put this in e-2-t
చిక్కు, cikku
-n.
--(1) snag; difficulty;
--(2) tangle; knot; grip; link;
--(3) sapota fruit;
---ఇది చిక్కు సమస్య = this is a difficult problem.
---ఈ జుత్తు చిక్కులు పడిపోయింది = this hair is all tangled up.
-v. i.
--emaciate; lose weight;contract; remain;get caught;
---వాడు చిక్కిపోయాడు = he is emaciated; he lost weight.
---చేప వలలో చిక్కుకుంది = the fish got caught in the net.
చిక్కుడు, cikkuDu
-n.
--bean; Indian butter bean; Hyacinth bean; Bonavist bean; [bot.] Dolichos lablabvar typicus of the Leguminosae family; Dolichos means "long";
--other varieties include ఎర్ర చిక్కుడు; తెల్ల చిక్కుడు; గోరు చిక్కుడు; ఆనప చిక్కుడు; ఏనుగు చిక్కుడు; కోడి చిక్కుడు; తొండ చిక్కుడు;
--అనుములు = field beans; [bot.] Dolichos lablab lignosas;
చికోరీ, cikOrI
-n.
--chicory; endive; [bot.] Cichorium intybus of the Asteraceae (Daisy) family;
-- roots of the chicory plant are ground and made into a powder to blend and mix with coffee; It is often used as a caffeine-free beverage on its own or as a mixture with ground roasted coffee because it enhances the taste, aroma and makes coffee mellow;
--
చిగురు, ciguru
-n.
--(1) tender leaf; shoot;
--(2) gum; the tissue that holds the teeth;
చిచ్చర, ciccara
-n.
--fire; fierce fire; fire and brimstone;
చిచ్చర పిడుగు, ciccara piDugu
-n.
--fierce lightning bolt spewing fire and brimstone;
చిచ్చు, ciccu
-n.
--flame; fire;
చిచ్చు బుడ్డి, ciccu buDDi
-n.
--a firework called "flowering pot";
చిటచిట, ciTaciTa
-adj.
--onomatopoeia for
--(1) being itchy, and
--(2) the crackling sound of water sprinkled on boiling oil;
చిటిక, ciTika
-n.
--snap; the act of snapping of the thumb and middle finger producing a sound;
---చిటికల మీద = in a snappy way; quickly; on the double.
చిటికెడు, ciTikeDu
-n.
--a dash;
---చిటికెడు ఉప్పు = a dash of salt.
చిటికేశ్వర, ciTikESvara
- n.
-- [bot.] Delonix elata Gamb.;
చిట్టి, ciTTi
-adj.
-- very small; (note) the scale from large to tiny is పెద్ద, చిన్న, బుచ్చి, చిట్టి, బుల్లి;
- n.
-- a small butter-boat; a small cup to serve butter;
చిడత, ciData
- n.
-- (1) castanet; a swiveling wooden wedge used to keep a door closed; (2) a cotter pin;
చితగ్గొట్టు, citaggoTTu
-v. t.
--beat thoroughly;
చిత్తం, cittaM
-inter.
--OK!; will do!; Yes, sir!
-- మీ ఆజ్ఞ మనసుకు తెచ్చుకొన్నాను అని అర్థం; చెప్పినట్టే చేస్తాను అని మనవి చేసుకోవడం;
-n.
--(1) mind; consciousness;
--(2) memory bank of the mind; long term memory;
--(3) the faculty of mind that raises doubt; see also బుద్ధి;
చిత్తగించు, cittagiMcu
-v. t.
--consider; pay attention; listen;
చిత్రం, citraM
-n.
--(1) picture; diagram; painting;
--(2) wonder; curiosity;
---చలన చిత్రం = motion picture; cinema.
---విత్థ చిత్రం = portrait.
---భావ చిత్రం = spontaneous outline.
-suff.
--graph;
---ఛాయాచిత్రం = photograph; photo.
---వర్ణమాలాచిత్రం = spectrograph.
చిత్ర, citra %updated
-n.
--(1) Alpha Virginis; Spica; Yoga tara of the 14th lunar mansion; this is the brightest star in Virgo; this is 2300 times more luminous than the Sun and is about 275 light years away from us;
--(2) The 14th of the 27-star groups (or asterisms or lunar mansions) of the Hindu calendar;
చిత్రకళ, citrakaLa
-n.
--the art of painting;
చిత్రకారుడు, citrakAruDu
-n. m.
--painter; artist;
చిత్రగంధం, citragandham
-n.
--Arsenicum trisulfuratum; a substance worn by actors on their faces as a part of makeup;
చిత్రచాప, citracApa
-n.
--placemat; a small mat or decorative cloth placed under the dinner plate; % in e-2-t
చిత్రఫలకం, citraphalakaM
-n.
--easle; a painter's board; an artist's board;
చిత్రమూలం, citraMulaM
-n.
--Ceylon lead wort; [bot.] Plumbago zeylanica; This medicinal bush grows wild along tank bunds; agricultural fields and marshy lands; this is widely used as an expectorant, to improve digestion, to treat the enlargement of the spleen and to treat leucodermia; [Sans.] చిత్రక; దహన; వహ్ని; అగ్నిక; దీప్త; భాను; పాచక;
--ఎర్ర చిత్రమూలం = [bot.] Plumbago rosea; one of the "పంచ కోలాలు";
చిత్రలేఖనం, citralEkhanaM
-n.
--the fine art of drawing a picture;
చిత్రవధ, citravadha
-n.
--torture unto death; murder associated with dismemberment;
చిత్ర ప్రదర్శనశాల, citra pradarSana SAla
-n.
--(1) museum;
--(2) movie theatre;
చిత్రహింస, citrahimsa
-n.
--torture;
చిత్రాన్నం, citrAnnaM
-n.
--lemon rice; tamarind rice; any other colorful rice preparation;
చితి, citi
-n.
--funeral pyre;
చిత్రిక, citrika
-n.
--planer; a carpenter's plane;
-- వండ్రంగులు కలప వస్తువులు తయారు చేసే క్రమంలో భాగంగా ఎత్తుపల్లాలు వుండే కలపను చదును చేయడాన్ని 'చిత్రికపట్టడం' అంటారు.
చితుకు, cituku
-v. i.
--rupture; break; burst;
చితుకులు, citukulu
-n. pl.
--twigs; dry twigs; broken pieces of small branches;
చిత్తు, cittu
-n.
--(1) rough; draft; not the final version;
--(2) scrap; not important;
--(3) defeat;
---చిత్తుకాగితం = scrap paper.
---నేను చిత్తు అయిపోయేను = I am defeated.
చిత్తుప్రతి, cittuprati
-n.
--rough draft;
చిదంబర రహస్యం, cidaMbara rahaSyaM
-n.
--unfathomable secret; useless secrecy;
-- చిదంబరం అంటే ఆకాశ లింగం అని అర్థం. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉండే చిదంబరం దేవాలయంలో మహా శివుడు నటరాజ స్వామి రూపంలో దర్శనమిస్తాడు. పంచభూతాలలో ఆకాశానికి ప్రతీకగా చిదంబరాన్ని పరిగణిస్తారు. శ్రీకాళహస్తిని వాయువుకు ప్రతీకగా, కంచిలోని ఏకాంబరేశ్వరుడిని భూమికి ప్రతీకగా చెబుతారు. ఈ మూడు దేవాలయాలూ ఒకే రేఖాంశం మీద ఉంటాయి. శాస్త్రీయ పరంగా 79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. చిదంబరం ఆలయంలోని నటరాజ స్వామి విగ్రహం కాలి బోటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని శాస్త్రవేత్తలు పరిశోధనల అనంతరం స్పష్టం చేశారు. ఈ దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఇవి మానవునికి ఉండే నవ రంధ్రాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ గుడిలో ‘పొన్నాంబళం’ ఎడమవైపున ఉంటుంది. ఇది గుండె ఉండే స్థానం. ఇక్కడికి వెళ్లేందుకు ‘‘పంచాక్షర పడి’’ఎక్కాలి. ఇది న+మ+శి+వా+య పంచాక్షరిని సూచిస్తుంది. ఈ ఆలయంలో ‘‘కనక సభ’’లో 4 స్తంభాలు, 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబళంలో ఉండే 28 స్తంబాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. ఇక్కడి 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. ఆ పక్కనే ఉన్న మంటపంలోని 18 స్తంబాలు 18 పురాణాలకు ప్రతీకలు. నటరాజు భంగిమను శాస్త్రవేత్తలు కాస్మిక్ డ్యాన్స్ అని అభివర్ణించారు. ఈ విశేషాలే "చిదంబర రహస్యం."
చిదుపు, cidupu
-v. t.
--break; break with hand or fingers;
చిదుము, cidumu
-v. t.
--clip with fingernails; snip; cut;
చిన్నం, cinnaM
-n.
--one-thirtieth of a tola in weight; a measure used to weigh gold;
చిముడు, cimuDu
-v. i.
--get over-cooked, esp. rice;
చిమ్ము, cimmu
-v. t.
--spray; squirt;
చిమ్ముకారి, cimmukAri
-n.
--sprayer; a gadget to spray disinfectants, insecticides, etc.;
చియా గింజలు, chiyA giMjalu
- n. pl.
-- [bot.] Salvia hispanica of the Lamiaceae Family;
--ఈ తులసి జాతి (Mint Family)మొక్క జన్మస్థలం మధ్య అమెరికా లోని దక్షిణ మెక్సికో, గ్వాటెమాలా దేశాలు. ఒకప్పుడు అక్కడి అజ్టెక్(Aztec ) జాతులకు మొక్కజొన్న, బీన్స్ తరువాత ఈ చియా గింజలే ప్రధాన ఆహారం. కొన్ని దక్షిణ అమెరికా దేశాలలో నేటికీ వీటిని పండిస్తారు. ఆహార పానీయాల తయారీలో వీటిని వినియోగిస్తారు. ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైన ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ ( Omega -3 Fatty acids ) పుష్కలంగా ఉండే కారణంగా ఇప్పుడు అందరూ వీటి సాగు, వినియోగం మీద దృష్టి పెడుతున్నారు. ఈ గింజల్ని ఏదైనా ద్రవపదార్థంలో నానబెడితే ప్రతి గింజ చిత్రంగా తన బరువుకి పన్నెండు రెట్ల బరువుగల ద్రవాన్ని పీల్చుకుంటుంది. ఆ గింజలపైన తెల్లటి గుజ్జు వంటి మ్యూకస్ పొర ఏర్పడుతుంది;
-- కొందరు వీటిని సబ్జా గింజలుగా పొరబడుతుంటారు. నానబెట్టినప్పుడు గింజల మీద గుజ్జువంటి మ్యూకస్ ఏర్పడడం సబ్జా, చియా గింజలలో సామాన్య లక్షణం.ఈ రెండు మొక్కలూ తులసి జాతికి చెందినవే. అయితే ఈ రెండూ వేర్వేరు. చియా గింజలు ఎండువి కూడా ఆహారంగా ఉపయోగపడతాయి. సబ్జా గింజలు నానబెట్టి మాత్రమే వినియోగించాలి. సబ్జా తులసి మొక్క శాస్త్రీయ నామం Ocimum basilicum;
-- see also మహాబీర = [bot.] Hyptis suaveolens;
చిర, cira
-pref.
--long duration in time;
చిరకాలం, cirakAlaM
-n.
--forever; for a long time;
చిరాకు, cirAku
-n.
--snappiness; peevishness; crossness; anger coming out of impatience or frustration;
చిరినెల్లికాయ, చిన్న ఉసిరిక, cirinellikAya, cinna usirika
- n.
-- [bot.] Phyllanthus emblica; (Euphorbiaceae Family)
--- ఇది ఉసిరిక జాతికి చెందిన మొక్క;
--- [rel.] నేల ఉసిరిక; ఉచ్చి ఉసిరిక; ఎత్త ఉసిరిక;
చిరు, ciru
-adj.
--small;
చిరుతపులి, cirutapuli
-n.
--leopard; a spotted wild cat found in India; [bio.] Panthera pardus;
--(rel.) Cheetah [Acinonyx jubatus] is a similar cat found in Africa; Jaguar (Panthera onca) is a spotted cat found in South America;
చిరుతిండి, cirutiMDi
-n.
--snack (lit.) small food;
చిరుధాన్యములు, cirudhAnyamulu
-n.
--millets; some less popular grains of the grass family;
చిరునవ్వు, cirunavvu
-n.
--smile; beam;
---వాడు చిరునవ్వు చిందిస్తున్నాడు = he is smiling; he is beaming.
చిరునామా, cirunAmA
-n.
--address;
చిర్రు, cirru
-n.
--anger; ire; irritation;
చిలక, cilaka
-n.
--parrot;
చిలకముక్కు పూలు, chilakamukku pUlu
- n.
-- Garden balsam; [bot.] Impatiens balsamina of the Balsaminaceae family;
--చిలక ముక్కు గన్నేరు పూలు; చిలక ముక్కు గోరింట పూలు; దీని ఆకులు, పూలను రుబ్బి అరచేతులు, చేతుల, కాళ్ళ వేళ్ళకు పెట్టుకుంటే అవి ఎర్రగా పండుతాయి. దీని కాయలు చిలుక ముక్కు ఆకారంలో ఉండటంవల్ల దీనికి చిలకముక్కు మొక్క అనే పేరు వచ్చింది; హిందీలో గోరింటను మెహందీ (Mehandi) అన్నట్లు దీనిని గుల్ మెహందీ (Gul Mehandi) అంటారు. ఈ మొక్క కాయలు పక్వానికి రాగానే టప్ మనే చిన్న శబ్దంతో పగిలి లోపలి విత్తనాలను వెదజల్లుతాయి. ఇలా పగిలి విత్తనాలను వెదజల్లే కాయలను ఆంగ్లంలో డెహిసెంట్ ఫ్రూట్స్ (Dehiscent Fruits) అంటారు.
--ఈ మొక్క పూలకు యాంటిసెప్టిక్ (Antiseptic) గుణం ఉంది. అవి రోగకారకమైన బాక్టీరియా, శిలీంధ్రాలవంటి వాటిని నశింపజేస్తాయి. ఇండోనేషియా లోని బాలి ద్వీపంలో ఈ మొక్క ఆకులను ఆకుకూరగా వాడుకుంటారు. ఈ మొక్క ఆకుల రసం మూత్రకారిగా (Diuretic), విరేచనకారి (Cathartic)గా, వాంతి కలిగించే వమనకారి (Emetic) గానూ పనిచేస్తుంది. సెగగడ్డలు, పగలని మొండి వ్రణాలపై ఈ ఆకుల రసంతో మలాం పట్టీ వేస్తే, అవి త్వరగా పక్వానికొచ్చి పగుల్తాయి.
చిలకరించు, cilakariMcu
-v. i.
--sprinkle; spray;
చిలక్కొయ్య, cilakkoyya
-n.
--peg to hang clothes; so-called because of its shape resembling a parrot's beak;
చిలగడదుంప కూర, cilagaDaduMpa kUra
-n.
--leafy part of sweet potato; [bot.] Ipomoea batatas of the Convolvulaceae family;
చిల్లంగి, cillaMgi
-n.
--(1) sorcery; necromancy; black magic; casting an evil spell; an occultish evil act implemented with the help of herbs imparted with magical powers;
-- (2) a mangrove shrub; [bot.] Dalbergia horrida;
చిల్లగింజ, జిల్ల గింజ, ఇండుప గింజ, cillagiMja, jillagiMja, iMDupa giMja
- n.
-- clearing nut; paste from nuts used to clear turbid water; [bot.] Strychnos potatorum of the Loganiaceae family;
చిల్లపెంకు, cillapeMku
-n.
--a piece of broken pottery;
చిల్లర, cillara
-adj.
--miscellaneous;
---చిల్లర కొట్టు = small store carrying odds and ends.
---చిల్లర దేవుళ్లు = miscellaneous demi-gods.
---చిల్లర పనులు = errands; small tasks.
-n.
--change; loose money;
చీకు, cIku
-adj.
-- (1) blind; (2) unfertile; juiceless; dry;
-n.
--worry;
-v. t.
--suck; as in sucking a finger or sucking a breast;
చీకూ, చింతా, cIkU, ciMtA
-ph.
--cares and worries;
చీట్లపేక, cITlapEka
-n.
--pack of playing cards; deck of playing crads;
చీటికీ మాటికీ, cITikI mATikI
-adv.
--for every silly reason; every now and then;
చీటి, cITi
-n.
--(1) chit; a small note;
--(2) prescription;
--(3) ticket;
చీడ, cIDa
-n.
--blight;
చీడ పురుగు, cIDa purugu
-n.
--insect pest;
చీడీ, cIDI
-n.
--oriel; pial; raised platform serving as a seat in front of a house;
చీద పక్షి, chIda pakshi
- n.
-- the babbler; సైదా పిట్ట;
--గోవచీద or వెర్రిచీద; the Large Grey Babbler; [bio.] Argya malcolmi;
--చిట్టిచీద or చిన్నచీద; the Common Babbler; [bio.] Argya caudata;
-- పెద్ద చీద; the Jungle Babbler; [bio.] Crateropus canosu;
చీదు, cIdu
-v. i.
--(1) blow ones nose;
--(2) backfire;
---అది సిసింద్రీ చీదినట్టు చీదేసింది = it backfired like a leaky firecracker.
చీదరించు, cIdariMcu
-v.t.
--loath; rebuke;
చీనారేకు, cInArEku
-n.
--tin sheet; (lit.) Chinese metal sheet;
చీని, cIni
-n.
--Batavian orange; a type of sweet orange; [bot.] Limonia trifoliata;
చీపురు, cIpuru
-n.
-- a bush whose twigs are used in making brooms; [bot.] Aristida setacea;
చీపురుకట్ట, cIpurukaTTa
-n.
--broomstick;
చీమ, cIma
-n.
--ant; emmet; [Lat.] formica;
---కండచీమ, గండుచీమ = large black ant.
---కొండచీమ = forest ant.
---చలిచీమ = black ant.
చీము, cImu
-n.
--pus;
-- చీము చనిపోయిన బ్యాక్టీరియాను కూడా కలిగి ఉంటుంది; చీము యొక్క లేతపసుపు, పసుపు, పసుపు-గోధుమ, ఆకుపచ్చ రంగులో చనిపోయిన న్యూట్రోఫిల్స్ చేరడం ఫలితంగా ఉంటుంది; చీము పట్ట కూడదు అనుకుంటే గాయలను శుభ్రంగా పెట్టుకోవాలి; పప్పు తింటే చీము పట్టదు; తిష్ఠ (infection) ఉంటే చీము పడుతుంది;
చీర, cIra
-n.
--sari; a rectangular cloth, about 6 meters long and 1.5 meters wide, often highly decorative, worn as a standard dress by many Indian women;
చీరమీను, Cheerameenu
- n.
-- [bio.] Sarida grassisis; Sarida amboskamis; Soridatambil; a highly prized tiny little fish found near Yanam in the Godavari Delta; the name comes from the fact that fishermen use saris, instead of nets, to catch the tiny fish;
చీరిపారకం, cIripArakaM
-n.
--post-mortem; examination of a dead body to establish if a crime had been committed;
చీరు, cIru
-v. t.
--gash; tear; rend; cut into slices;
చుంబించు, cuMbiMcu
-v. t.
--kiss; osculate; touch;
చుక్క, cukka
-n.
--(1) star;
--(2) dot;
--(3) dot on the forehead worn by Hindus;
--(4) drop;
--(5) full stop; period; the dot at the end of a sentence;
చుక్కకూర, cukkakUra
-n.
--bladder dock; a leafy vegetable [bot.] Rumex vesicarius of the Polygonaceae family;
--- also known as పుల్ల బచ్చలి; ఈ మొక్కలో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్- సి ఉన్నాయి. ఈ ఆకుకూర పైత్యరోగ నివారిణిగా పేరొందింది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది;
-- పప్పు లో వేసుకుంటే ఈ ఆకుకూర చాలా రుచిగా ఉంటుంది. కొందరు పాలకూర, తోటకూర వంటి పులుపులేని ఇతర ఆకుకూరలతో దీనిని పులుపుకోసం కలిపి కలగూరగా వండుకుంటారు;
చుక్కల పయిడిగంట, cukkala payiDigaMTa
-n.
--spotted owl; a bird seen in Andhra Pradesh; it resembles an owl in appearance and its hoot is considered auspicious; [bio.] Athene brama;
చుక్కల భూములు, chukkala bhoomulu
- n. pl.
-- dotted lands;
-- "సర్వే మరియు సరిహద్దులు చట్టం" ప్రకారం ప్రతీ ముప్పై సంవత్సరాల కు ఒక సారి వ్యవసాయ భూములు తిరిగి సర్వే చేయాలి. బ్రిటిష్ వారి కాలంలో జమీందారీ వ్యవస్థ ఉండగా 1903–08 మధ్య కాలం లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు లో మొదటి సర్వే జరిగింది. ఈ సర్వే లో ఎవరు ఎంత విస్తీర్ణం ఏ నెంబర్ లో సాగు చేస్తున్నారు అనేది మాత్రమే పన్ను వసూలు సులభంగా చేయడం కోసం నిర్ణయించారు. తరువాత 1949–56 మధ్య ప్రభుత్వం జమీందారీ వ్యవస్థ రద్దు చేసి ఎస్టేట్ లు హస్తగతం చేసుకుని వ్యక్తిగత సర్వే జరిపి పాత జమీందారీ రైతులు అందరినీ పట్టా దారుగా గుర్తించి రైత్వారీ పట్టాలు ఇచ్చి శాశ్వత రికార్డ్ తయారు చేసారు.
తరువాత 1986 లో తిరిగి సర్వే చేయాలి. తెలంగాణా, రాయలసీమ కొన్ని ప్రాంతాల్లో రెండవ విడత సర్వే జరిపినపుడు (కోస్తా లో ప్రస్తుతం జరుగుతోంది) "రీసెటిల్మెంట్ రిజిస్టర్" తయారు చేసిన సమయం లో (సర్వే సమయంలో రైతు హాజరయి హక్కు పత్రాలు చూపించని సందర్భాలలో) ఆపుస్తకం లో అన్ని వివరాలు రాసి చివరన ఉన్న "పట్టాదారు" కాలమ్ వద్ద రైతు పేరు ఖాళీగా వదలి …………………… అని చుక్కలు పెట్టి వదలి వేసారు. వీటినే "డాటెడ్ లేండ్స్ అని పిలుస్తారు. ఇలాంటివి తక్కువగానే ఉన్నా రిజిస్ట్రేషన్ నిషేదించబడినది;
చుట్టుముట్టు, cuTTumuTTu
-v. t.
--surround; engulf;
చుబుకం, cubukaM
-n.
--chin;
చురక, curaka
-n.
--spark; the burn caused by a spark or hot stick or rod;
చురక పెట్టడం, curaka peTTaDaM
-v. t.
--branding; burning with a hot rod;
చురచుర, curacura
-adj.
--onomatopoeia for angry looks;
చులకన, culakana
-n.
--lightness; make light of; denigration;
చులకన చేయు, culakanacEyu
-v. t.
--belittle; disparage; denigrate;
చూచాయగా, cUcAyagA
-adv.
--vaguely, indistinctly;
చూచు, cUcu
-v. t.
--see; look;
చూచుకం, cUcukaM
-n.
--nipple; teat;
చూడాకర్మ, cUDAkarma
-n.
--the first ceremonial haircut to a boy at an odd-numbered year, typically at the age of 3 or 5;
చూడు, cUDu
-v. t.
--(1) see; behold; observe; perceive;
--(2) take care of;
-- మన పంచేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మములతోనే కాకుండా, మనస్సు, బుద్ధి, అహంకారము వంటి ద్వారా విషయ జ్ఞానాన్ని పొందడం కూడ చూడడమే అవుతుంది.
--- వాసన చూడు = smell; take a whiff;
--- రుచి చూడు = taste; taste a sample;
--- విని చూడు = listen and observe what happens;
--- మంచి చెడ్డలు చూడు = take care of the situation;
--- సరి చూడు = check; verify;
చెంగనాలు, ceMganAlu
-n.
--capers; gambols; playful jumps of young calves and other four-footed grass-eating animals;
చెంగల్వ కోష్టు, ceMgalva kOshTu
- n.
-- Costus; Putchuk; a species of thistle native to India; [bot.] Saussurea lappa;
-- Essential oils extracted from the root have been used in traditional medicine and in perfumes since ancient times;
-- [Sans.] కుష్ఠం;
చెంగావి, ceMgAvi
-n.
--saffron red color;
చెంగు, ceMgu
-n.
--free-flowing and fluttering end of a sari;
చెంగున, ceMguna
-adv.
--suddenly;
చెంచలికూర, ceMcalikUra
- n.
-- a frequent weed near cultivated fields; the plant is a laxative in large doses; the seeds are used for urinary disorders; [bot.] Digera muricata;
చెంచా, ceMcA
-n.
--spoon;
చెండు, ceMDu
-n.
--a short run of flowers strung together, and made into a ball-shaped bundle;
చెంత, ceMta
-adj.
--near; proximate;
చెంప, ceMpa
-n.
--(1) side;
--(2) cheek;
---చెంపదెబ్బ = slap.
---చెంపకి చేరడేసి కళ్ళు = big eyes on both cheeks.
చెక్కు, cekku
-n.
--(1) check; (Br.) cheque;
--(2) finely chopped substance;
--(3) composure;
--(4) cheek;
--(5) bark of a tree;
--(6) scab on a wound;
---చెక్కు చెదరలేదు = (idiom) didn't lose composure.
-v. t.
--(1) chop;
--(2) inscribe; inlay;
--(3) sculpt;
---పనసకాయ చెక్కుతావా? = will you chop the jack fruit into fine pieces?
చెట్టు, ceTTu
-n.
--tree; woody plant;
చెట్టుచేమలు, ceTTucEmalu
-n. pl.
--trees and bur-grass; vegetation;
చెట్టుసంపంగి, ceTTusaMpaMgi
-n.
--Champakam; [bot.] Michelia Champaca;
-- (rel.) ఆకుసంపంగి = మనోరంజని = [bot.] Cananga odorata of the Annonaceae family;
చెడ్డ, ceDDa
-adj.
--(1) bad; spoiled;
--(2) tremendous; terribly; great;
---చెడ్డ చిరాకు = great irritation.
---బతికి చెడ్డవాడు = a person who has been rich and has become poor.
చెడ్డీ, ceDDi
- n.
-- short breeches; shorts; knickers;
చెడు, ceDu
-v. i.
--to get spoiled, damaged or ruined;
చెదురుమదురుగా, cedurumadurugA
-adv.
--scattered; here and there;
---చెదురుమదురుగా జల్లులు పడుతున్నాయి = experiencing scattered rain showers.
చెనకు, cenaku
-v. t.
--touch; bite; provoke with words;
చెన్నంగి, chennaMgi
- n.
-- Lendia; a timber tree; [bot.] Lagerstroemia parviflora;
చెప్మా, cepmA
-inter.
--I wonder!;
చెప్పులు, ceppulu
-n. pl.
--shoes; slippers; sandals;
---చెప్పులోని రాయి [idiom] an annoyance; (lit.) a pebble in the shoe.
చెప్పుచేతలు, ceppucEtalu
-n. pl.
--guardianship; supervision; someone's beck and call; command and control;
చెమట, cemaTa
-n.
--sweat; perspiration;
చెమట కంపు, cemaTa kaMpu
-n.
--sweat odor; stink of sweat;
చెమర్చు, cemarcu
-v. i.
--(1) sweat; perspire;
--(2) become moist primarily due to leakage or condensation;
చెమ్మ, cemma
-n.
--dampness; moisture;
చెమ్మగిల్లు, cemmagillu
-v. i.
--become damp; to absorb moisture;
చెయ్యి, ceyyi
-n.
--hand; the portion of the arm from the wrist to the fingertips; (rel.) అరచెయ్యి; మండ; ముంజేయి;
---ఓ చెయ్యి వేద్దూ = lend a hand.
-v. t.
--do;
చెర్ర, cerra
-n.
--ball bearing; a device used to make wheels turn smoothly over an axle;
చెర్ల, cerla
-suff.
--surrounding a water tank; around a body of water;
-- many family names end with "cerla" are: తాడిచెర్ల = waterbody surrounded by palms; గాడిచెర్ల = waterbody surrounded by a trench; రొంపిచెర్ల = waterbody surrounded by swamps; also మేడిచెర్ల; తుమ్మలచెర్ల; బేతంచెర్ల; చాకిచెర్ల; తామరచెర్ల;
చెర్లకోల, cerlakOla
-n.
--whip with several lashes at the end;
చెరుకీగ, cerukIga
-n.
--sugarcane fly; a kind of sugarcane pest; [bio.] Pirilla perpurilla;
చెరుకెరక్రళ్లు, cerukerrakaLLu
-n.
--sugarcane red rot; a kind of fungus that attacks sugarcane; [Biol.] Glomerella tucamanensis;
చెరుగు, cerugu
-v. t.
--winnow;
చెరుచు, cerucu
-v. t.
--rape; ravish;
చెరుపు, cerupu
-v.t.
--erase; expunge; rub off;
చెరువు, ceruvu
-n.
--tank; an artificial lake created by digging; (rel.) దొరవు; కొలను; సరస్సు; కాసారం;
--- (note) the words కుంట, గుంట, కొలను, కుళం, మడుగు, కంభం - all refer to stationary bodies of water bodies of varying sizes;
చెరువుకోడి, ceruvu kODi
-n.
--a cormorant; a water bird seen in Andhra Pradesh;
చెలమ, celama
-n.
--(1) a small hole dug in a dry river bed for collecting water;
--(2) water spring;
చెలరేగు, celarEgu
-v. i.
--burst out; break out;
చెలామణి, celAmaNI
-n.
--currency; current; in use; in circulation; acceptable;
చెలాయించు, celAyimcu
-v. t.
--wield; exercise;
చెలి, celi
-n.
--playmate; woman; girlfriend; also చెలికత్తె;
చెలిమి, celimi
-n.
--friendship;
చెలియలికట్ట, celiyalikaTTa
-n.
--seashore; (lit.) the bank where the waves stop;
చెల్లి, celli
-n.
--younger sister; also చెల్లాయి;
చెల్లించు, celliMcu
-v. t.
--pay; remit;
చెవి, cevi
-n.
--(1) ear;
--(2) handle of a cup;
--(3) key;
---చెవిలో జోరీగ = [idiom] an annoyance.
చెవిటికాకి, ceviTikAki,
- n.
-- జెముడు కాకి, a colorful bird seen in Andhra Pradesh; this has a long tail and hops around on the ground hunting for worms, oblivious of people around it; the legend is that this bird knows how to recognize the life-restoring “sanjeevani” from other twigs. The legend further says that if you kill its brood, the mother bird can revive them back to life by bringing the potent twig. Now if you take the whole nest, separate the twigs and drop them in a river, the “sanjeevani” twig can be readily recognized because the legend says it will swim upstream!
చేంతాడు, cEMtADu
-n.
--rope used to draw a bucket of water from a well; (ety.) చేదు + తాడు;
చే, cE
-n.
--contracted form for "hand";
చేకొను, cEkonu
-v. t.
--accept; receive; take;
చేట, cETa
-n.
--winnowing tray;
చేటి, చేటిక, cETi, cETika
-n.
-- (1) woman; servant woman; attender; (2) server; one who provides a service;
చేత, cEta
-locative.
--in hand
---ఇదీ నీ చేత అవునా? = can you handle this?
చేతబడి, cEtabaDi
- n.
-- Black Magic; the dark art of invoking evil spirits to target and harm an individual;
-- క్షుద్రదేవతారాధన వలన ఏర్పడిన శక్తితో విరోధులపై మంత్ర ప్రయోగము చేయుట; మనిషికుండే భయాన్ని ఆసరా చేసుకునే చేతబడి అనే అశాస్త్రీయ విశ్వాసం ప్రబలింది. ఇది అవాస్తవమే అయినాసరే ప్రజలలో ప్రబలిన విశ్వాసమే ఆలంబనగా తాము చేతబడి చేస్తామని కొందరూ, ఇతరులు చేసిన చేతబడిని తిరగగొడతామనీ ఇంకొందరూ సొమ్ము చేసుకుంటున్నారు. మెదడుకు వచ్చిన పక్షవాతం కారణంగా కోమాలోకి జారుకుని అంతిమ ఘడియలలో ఉన్నవారిని సైతం ఎవరో చేతబడి చేసిన కారణంగానే వారలా అయ్యారని నమ్మజెపుతూ, ఆ చేతబడిని తాము తిప్పికొట్టగలమని బీరాలు పలుకుతుంటారు. ఒక ఎండు కొబ్బరికాయను ‘మంత్రించి’ ఇచ్చి, దానిని రోగి మంచం కింద ఇరవైనాలుగు గంటలపాటు ఉంచి ఆ తరువాత పగులగొట్టి చూస్తే లోపల ఎర్రగా ఉంటే, ఆ వ్యక్తికి ఎవరో చేతబడి చేసినట్లేనని నమ్మబలికిన 'మంత్రగాడి’ గుట్టును రట్టు చేశారు. ఆ టెంకాయ కుండే ‘కళ్ళు’ ఒక పిన్నీసుతో పొడిచి అతడు ఆ కాయ లోపలికి తెల్లని ఫెనాల్ఫ్థలీన్ (Phenolphthalein - C20 H14 O4) పొడిని జొనిపాడనీ, కొబ్బరి నీటిలో ఉండే క్షారగుణం కారణంగా ఆ పొడి తగిలిన కాయ లోపలి భాగమంతా అప్పటికే ఎర్రగా మారిపోయిందనీ, అతడిచ్చిన కొబ్బరికాయను అక్కడే పగులగొట్టి మరీ రుజువుచేశారు;
---see also కట్టుమోను; బాణామతి; గండభేరుండం; ప్రయోగం;
చేతనం, cEtanaM
-n.
--consciousness;
చేతావాతా కాని, cEtAvAtA kAni
- ph.
-- incompetent;
చేతులు దులుపుకొను, cEtulu dulupukonu
- ph.
-- getting rid of; relinquish the responsibility;
చేర్పించు, cErpiMcu
-v. t.
--(1) to cause to be joined or admitted;
--(2) to cause to be brought together or assembled;
చేరు, cEru
-v. i.
--reach; arrive; approach; join;
చేరువ, cEruva
-n.
--physical proximity; nearness;
చేర్చు, cErcu
-v. t.
--(1) join; unite; combine; assemble; bring together;
--(2) enroll; admit;
--(3) cause to reach; take to a destination;
--(4) lean against
చేరెడు, cEreDu
-adj.
--handful; the amount of solid substance that can be scooped in the cup of a hand;
-- (rel) పురిసెడు;
చేవ, cEva
-n.
--(1) strength; inner strength;
--(2) the core of a tree;
చేవడి, cEvaDi
-n.
--swiftness of hand; sleight of hand;
చైత్రం, caitraM
-n.
--first month of the Hindu lunar calendar; on the full moon day of this month, the moon will be in the asterism of the star Chitra (Spica);
చొంగ, coMga
-n.
--drool; dribbling; the saliva coming involuntarily out of a (infant’s) mouth;
చొక్కా, cokkA
-n.
--shirt;
చొరబడు, corabaDu
-v. i.
--intrude;
చొరబాటు, corabATu
-n.
--intrusion;
చొరబాటుదారు, corabATudAru
-n.
--intruder;
చొప్పదంటు, coppadaMTu
-n.
-- the dry central stalk of a millet plant;
-- ఎండిపోయిన జొన్న కాండం లోపల తెల్లగా, మెత్తగా ఉండే భాగాన్ని చొప్పదంటు అంటారు. దీన్ని పశువులకు ఆహారంగా వేయడం జరుగుతుంది. అయితే ఈ దంటులో రుచిగానీ, పోషక విలువలుగానీ ఏమీ ఉండవు. అది కేవలం పశువులు నమిలి నెమరువేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.
-- చొప్పదంటు ప్రశ్న = meaningless question; stupid question;
చొల్లు, collu
-n.
--drool; saliva falling from the mouth;
చోపుదారు, cOpudAru
-n.
--usher; the person who shows the way;
చోరులు, cOrulu
-n.
--thieves;
చోళీ, cOLI
-n.
--jacket; blouse; bodice;
చోళ్లు, coLlu
-n.
--ragi; a type of millet, resembling fine mustard, [bot.] Eleusine coracana; రాగులు;
చోవి, chOvi
- n.
-- the dough-skin wrapping used around a sweet or savory stuffing before the whole thing is deep-fried; what is inside is called పూర్ణం or సోగి;
చోష్యం, chOshyaM
- n.
-- food (or medicine) that can be sucked, such as a sauce or syrup;
చౌక్, cuk
-n.
-- a junction of four streets; a city square; booth;
--- చాందినీ చౌక్; సామారంగం చౌక్; ఆసీల చౌక్;
చౌక, cauka
-n.
--cheap; inexpensive;
చౌకట్టు, chaukaTTu
-n.
--frame;
చౌకళించు, chaukaLiMchu
- v. t.
-- skip, leap, vault, an animal (a horse) jumping a fence by lifting all four legs;
చౌకబారు, caukabAru
-adj.
--cheap; shoddy;
చౌకీ, caukI
-n.
--toll gate;
చౌకీదార్, caukIdaar
- n.
-- night watchman;
చౌటినేలలు, cauTinElalu
-n.
--salted lands; lands that were rendered useless due to the seepage of saline waters;
చౌరస్తా, caurastA
-n.
--crossroads; junction of (four) streets;
Part 3: ఛ - cha
ఛందస్సు, chaMdassu
-n.
--(1) prosody; the system for writing verse and poetry; (2) the mantras in the Vedas; (3) a rule; principle; (4) opinion;
ఛాందసం, chAMdasaM
- n.
-- (1) related to prosody;
-- (2) related to Vedic hymns;
-- (3) stupidity of a mere bookworm; ritualistic pedantry; with more focus on style than substance;
--old fashioned way; ignorant of worldly ways; (lit.) related to the Vedas or prosody;
-- కేవలం ఛందస్సును మాత్రం పాటిస్తూ, సాహిత్య విలువలను పట్టించు కొనకపోవడం వ్యవహారంలో ఛాందసం అనిపించుకొన్నది. లోక జ్ఞానం లేకపోవడం అని కూడా ఛాందసానికి అర్థం రూఢమైంది;
-- శ్రోత్రియుడైన వేదపండితుడిని "ఛాందసుడు" అంటారు; వైదిక ఆచారాలను ఉన్నది ఉన్నట్లుగా నియమబద్ధంగా పాటించడాన్ని ఛాందసము అనేవారు;