This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
American spelling is used throughout.
There is no clearly established, standardized alphabetical order in Telugu. The justification for the scheme used here would be too long for discussion here.
16 March 2016.
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Part 1: గం - gaM
గం, gaM
-root.
--suggests movement; [Sans.] గచ్ = to go;
---ఖగం = one that moves in space; kite; bird.
---తరంగం = one that moves on water; wave.
---విహంగం = one that moves in air; bird.
గంగ, gaMga
-n.
--(1) the river Ganges;
--(2) river goddess Ganga;
--(3) water, especially pure (in the sense of unadulterated, rather than distilled) water;
---పాతాళ గంగ = underground water, especially underground springs.
గంగడోలు, gaMgaDOlu
-n.
--dewlap; the loose skin hanging from the neck of a cow or ox;
గంగరావి, gaMgarAvi
-n.
--portia tree; umbrella tree; [bot.] Hibiscus populnea; Thespesia populnea;
-- juice of leaves and fruits applied to scabies; psoriasis and other skin ailments;
-- బ్రహ్మదారువు;
గంగరేగు, gaMgarEgu
-n.
-- Indian plum; Chinese date; [bot.] Ziziphus jujuba;
-- a small evergreen tree with dark, green leaves, and egg-shaped edible fruits with acidic pulp and a hard, central stone;
-- గంగరేను; పెద్దరేగు; [Hin.] బేర్;
గంగవల్లికూర, గంగవల్లికూర
- n.
-- Purslane, [bot.] Portulaca aleracea; a small, smooth, fleshy annual herb populrly used as a green leaf vegetable;
-- గంగావాయలాకు; కులఫా;
గంగవెర్రులెత్తు, gaMgaverrulettu
-v. i.
--going crazy; going out of control;
గంగసింధూరం, gaMgasiMdhUraM
-n.
--red oxide of lead;
గంగాళం, gaMgALaM
-n.
--a large metallic vessel with a wide mouth; (rel.) పంచపాత్ర;
గంగి, gaMgi
-adj.
--venerable;
---గంగి గోవు = a cow of good breed; euphemism for a gentle personality of either gender.
గంగిరెద్దు, gaMgireddu
-n.
--venerable bull; an ordinary bull decorated with colorful blankets and bells and taught to do what the master says; a euphemism for a "yes" man.
గంటం, gaMTaM
-n.
--stylus; iron pen; [Sans.] కంటకం;
గంట, gaMTa
-n.
--(1) hour; approximately 24th part of a solar day;
--(2) bell; gong; chime;
--(3) stubble; shoots growing around the main stem of a paddy plant;
గంటగలగరాకు, gaMTagalagarAku
-n.
--False Daisy; [bot.] Eclipta prostrata; Eclipta alba;
-- is a herb that has traditionally been used in Ayurvedic medicine for being a liver tonic (for which it is one of the more effective herbs apparently) and having beneficial effects on diabetes, eye health, and hair growth; this grows wild along irrigation canals in India;
-- [Sans.] భృంగరాజు;
గంటు, gaMTu
-n.
--notch;
గంటుబారంగి, gaMTubAraMgi
-n.
-- Bharangi; Glory bower; Bleeding-heart; Bag flower; [bot.] Clerodendron serratum; Siphonanthus indica; Premna herbacea;
-- herb used in the Ayurvedic system which is very famous for a healthy respiratory system and for giving good rhythm to voice;
గండకీ వృక్షం, gaMDakI vRkhaM
-- Cow's paw; [bot.] Bauhinia variegata;
-- used as an anti-bacterial, anti-arthritic, anti-inflammatory, anti-diabetic, immunomodulatory, hepato-protective, anti-oxidant, trypsin inhibitor and anti-carcinogenic activity;
-- దేవకాంచనం is [bot.] Bauhinia purpurea;
గండంగి, gaMDaMgi
-n.
--a large black monkey; Madras langur; [bio.] Semnopithicus prianus;
గండ, gaMDa
- adj.
-- male;
గండడు, gamDaDu
-n.
--a strong, brave man;
---గండరగండడు = the bravest of the brave = మగవాళ్లల్లో మగవాడు;
గండపెండేరం, gaMDapenDEraM
-n.
--an anklet awarded to a scholar or warrior;
గండభేరుండం, gaMDabhEruMDaM
-n.
--a fictional bird with two heads and three eyes;
గండమాల వ్యాధి, gaMDamAla vyAdhi
- n.
--Scrofula; Scrofula is a condition in which the bacteria that causes tuberculosis causes symptoms outside the lungs. This usually takes the form of inflamed and irritated lymph nodes in the neck. Doctors also call scrofula “cervical tuberculous lymphadenitis” The cervical refers to the neck;
గండమృగం, gaMDamRgaM
-n.
--rhinoceros;
గండశిల, gaMDaSila
-n.
--boulder;
గండసరిగ, gaMDasariga %e2t
- n.
-- gentleman;
గండ్ర, gaMDra
-adj.
--big; large;
గండ్రగొడ్డలి, gaMDragoDDali
-n.
--pick-ax;
గండ్రచీమ, gaMDracIma
-n.
--big ant;
గండు, gaMDu
-adj.
--male of an animal; maleness; masculine;
---గండుపిల్లి = tomcat; male cat.
---గండు తుమ్మెద = male carpenter bee.
---గండుచీమ = a big, black ant;
---గండుమీసాలు = bushy mustache;
గండుమల్లి, gaMDumalli
- n.
-- a climbing shrub; [bot.] Jasminum angustifolium;
-- లింగమల్లి; సిరిమల్లి; అడవిమల్లి;
గండి, gaMDi
-n.
--(1) breach in a river bank; gap between two hills; gorge;
--(2) steep embankment;
--(3) canyon wall;
గండి పడు, gaMDi paDu
-v. i.
--be breached; (note) used when a river bank gets breached during floods;
గంత, gaMta
-n.
--a narrow walkway on the side of a house that leads to the backyard; alleyway;
గంతలు, gaMtalu
-n. pl.
--blinders; blinkers; eye cover;
గందరగోళం, gaMdaragOLaM
-n.
--confusion; ado;
గంధం, gaMdhaM
-n.
--(1) smell; odor;
--(2) paste obtained by grinding wood or nut on a stone base;
--(3) sandalwood paste;
---దుర్గంధం = malodor.
---సుగంధం = sweet odor; nice odor.
---మంచిగంధం = sandalwood paste.
---కరక్కాయ గంధం = paste of Chebulic myrobalan.
గంధం చెట్టు, gaMdhaM ceTTu
-n.
--sandalwood tree; [bot.] Santalum album;
---రక్త చందనం = red sandalwood; [bot.] Santalum rubrum; Pterocarpus santalinus;
---శ్వేత చందనం = white sandalwood;
--- పీత చందనం = yellow sandalwood;
---హరి చందనం = yellow sandalwood;
---కుచందనం = Bastard sandalwood; False sandalwood; there are many trees that go by this name;
గంధం పిట్ట, gaMdhaM piTTa
-n.
--bunting; a type of bird;
--- నల్లతల గంధం పిట్ట = black-headed bunting; [bio.] Emberiza melanocephala;
--- ఎర్రతల గంధం పిట్ట = red-headed bunting; [bio.] E. bruniceps;
గంధకం, gaMdhakaM
-n.
--sulfur; (Br.) sulphur; one of the chemical elements with the symbol S; brimstone;
గంధర్వులు, gaMdharvulu
- n. pl.
-- (1) legendary "creatures" fathered by Kashyapa and ArishTha (or Pradha?), daughter of Daksha PrajApati;
-- దేవతలలో ఒక తెగవారు; హాహాహూహూ ప్రభృతులు; కశ్యపునికి, దక్ష ప్రజాపతి కూతురు అయిన అరిష్టకు (ప్రధ కు) పుట్టినవారు గంధర్వులు;
-- (2) ఇంద్ర సభలో గానము చేయు ఒక తెగ దేవతలు; గంధర్వుడు మధురంగా పాటలు పాడువాడు అని నిఘంటు అర్థం. గంధర్వ జాతిలో ఆడవారు నృత్య కళల్లో ప్రావీణ్యం కలిగి వుంటారు. వీరు అమరలోక సభాసదులను తమ గాన మాధుర్యంతో, నృత్యంతో తన్మయత్వంలో విహరింపజేసెదరు.
-- (3) గాంధార దేశానికి చెందిన ప్రజలు; వేదాలు, మహాభారత గ్రంధాలలో గంధర్వుల ప్రస్తావన ఉంది. పురాణాలలో తుంబురుడు అను విద్వాంసుడు (గుర్రము తల కలిగి వుండును) గంధర్వ జాతిలో శ్రేష్ఠుడిగా ప్రసిద్ధి గాంచారు.
-- see also యక్షులు;
గంప, gaMpa
-n.
--basket;
గంపగుత్తగా, gaMpaguttagA
-adv.
-- by basketful; by contract, with no regard to details;
-- మొత్తానికి మొత్తంగా;
గంపపులుగు, gaMpapulugu
-n.
--a type of fowl; [bio.] Phasianus gallus;
గంభీర, gaMbhIra
-adj.
--solemn; grave; deep;
గ్రంథము, graMthamu
- n.
-- a book; a volume; a collection of essays; a record of proceedings;
గ్రంధి, graMthi
- n.
-- (1) knot; (2) A knot or joint in bamboo or cane; (3) gland; (4) swelling or hardened body tissue;
-- గణుపు; కంతి;
Part 2: గ - ga
గగనం, gaganaM
-adj.
--hard to get;
---గగన కుసుమం =[idiom] pie in the sky; (lit.) flower in the sky; something hard to get; unreal.
-n.
--sky; heavens;
గగుర్పాటు, gagurpATu
-n.
--tingling; thrill; goosebumps; erection of body hair due to excitement or fear; పులకరింత; రోమహర్షణం;
గగ్గోలు, gaggOlu
-n.
--uproar; clamor;
గచ్చ, gacca
-n.
--bondue; a thorny shrub; [bot.] Caesalpinia bonduc;
-- the leaves are used for the treatment of hydrocyl, seeds and oil have medicinal properties;
గచ్చకాయ, gaccakAya
-n.
--bondue nut;
గచ్చు, gaccu
-n.
--floor; plastered floor; hard floor;
గజం, gajaM
-n.
--(1) one yard; a length equal to 36 inches or approximately one meter; 2 మూరలు; 90 సెంటీమీటర్లు;
--(2) elephant;
-- (3) eight; (ety.) because 8 legendary elephants are carrying the universe on their shoulders;
గజ, gaja
-adj.
--big; jumbo; large size;
---గజఈతగాడు = great swimmer; expert swimmer; literally, a swimmer whose stride covers a distance of one yard (గజం) with each stroke; perhaps "meter beater" would be an appropriate translation.
---గజదొంగ = big thief; an expert thief.
గజగజ, gajagaja
-adj.
--onomatopoeia for shivering; trembling;
గడ్డ, gaDDa
-adj.
--lumpy; solid;
-n.
--(1) lump; thrombus; boil; వ్రణము;
--(2) brook; stream;
--(3) tuber;
--(4) any solidified matter;
--(5) clump of the earth;
గడ్డకట్టు, gaDDakaTTu
-v. i.
--solidify; freeze; clot;
గడ్డపార, gaDDapAra
-n.
--an indigenous tool widely used for digging and picking up chunks of loose dirt; unlike a spade which can be used while standing up, this tool requires the person to bend, practically doubling up; see also గునపం;
గడ్డపెరుగు, gaDDaperugu
-n.
--curds; yogurt; sour cream; hard milk curds; hard yogurt;
గడ్డమంచు, gaDDamaMcu
-n.
--ice; block of ice;
గడి, gaDi
-n.
--(1) plaid; checkers; a type of design on a fabric;
--(2) a square in a diagram like a crossword puzzle;
గడియ, gaDiya
-n.
--(1) wooden bolt across a door; latch;
--(2) duration of time equal to 24 minutes; ఘడియ;
గడియారం, gaDiyAraM
-n.
--clock; watch; (lit.) a time meter;
---అనుగడి = clockwise; also అనుఘడి.
---ప్రతిగడి = counter-clockwise; anti-clockwise; also ప్రతిఘడి.
---గోడ గడియారం = wall clock.
---చేతి గడియారం = wrist watch.
గడ్డి, gaDDi
-n.
--grass; hay; common grass [bot.] Cynodon dactylon; Arukam pal;
---ఎండుగడ్డి = hay.
---పచ్చిగడ్డి = green grass.
గడ్డి గాదం, gaDDi gAdaM
-n.
--animal feed; (lit.) grass and leaves;
గడ్డిగం, gaDDigaM
-n.
--seeder; a funnel-like device attached to a plow to drop seeds along the furrow;
-- జడ్డిగం;
గడ్డిచేమంతి, gaDDicEmaMti
-n.
-- [bot.] Tridax procumbens Linn.;
-- గాయపాకు; ఇది విస్తృతంగా పెరిగే కలుపు మొక్క; ఈ మొక్క ఆకులు రసం గాయం దగ్గర రాస్తే ఒక అరగంటలో నొప్పి మాయం అవుతుంది;
గడ్డిపువ్వు, gaDdipuvvu
-n.
--wildflower;
గడ్డివాము, gaDDivAmu
- n.
-- haystack;
గడ్డివాము కాడ కుక్క, gaDDivAmu kADa kukka
- ph.
-- Dog in the manger; an idiom to describe a person who has custody of something useless to him but won't allow another person to use it;
గడుగ్గాయి, gaDuggAyi
-n.
--daredevil; mischievously smart person; (note) a term usually used while referring to children and young adults;
గడువు, gaDuvu
-n.
--time limit; a duration of time within which a task must be done;
గద్య, gadya
-n.
--colophon; the small coda like verse or blank verse that is traditionally written at the end of a section or chapter of classical Indian literary works;
గది, gadi
-n.
--(1) room; chamber; cabin;
--(2) compartment;
--(3) a square on a chess board;
గద్దించు, gaddiMcu
-v. t.
--chide; rebuke;
గదుము, gadumu
-v. t.
--push; urge on;
గదులగోడ, gadulagODa
-n.
--a wall with pigeonholes such as the one used for sorting letters at a post office;
గదులపెట్టె, gadulapeTTe
-n.
--a box with compartments; pigeonholes a box of this type is often used in Indian kitchens to store frequently used spices;
గద్దె, gadde
-n.
--throne; the seat of power;
గని, gani
-n.
--mine; a dig where ores are found; same as ఖని;
గనిజబ్బుగ్గ, ganijabbugga
-n.
--mineral spring;
గన్నేరు, gannEru
-n.
--oleander; [bot.] Nerium odorum;
--the common Oleander; sweet scented oleander; [bot.] Nerium odorum;
---పచ్చ గన్నేరు = Yellow Oleander; [bot.] Thevetia nerifolia;Cascabela thevetia; Thevetia peruviana;
---సువర్ణ గన్నేరు = Yellow Oleander; [bot.] Thevetia nerifolia; Cascabela thevetia;
---నందివర్ధనం = a native of tropical Africa; [bot.] Nerium coronarium; Tabernaemontana divaricata;
---కొడిసె పాలచెట్టు = [bot.] Nerium antidysentricum;
---దొంత గన్నేరు = [bot.] Nerium odorum; (a variety - may be a species now).
---అడవి గన్నేరు, గన్నేరు చెట్టు, పెద్ద గన్నేరు = Sweet scented Oleander; [bot.] Plumeria alba;
---దేవ గన్నేరు = a native of tropical America; [bot.] Plumeria acuminata;
-- వాడ గన్నేరు, గుడి గన్నేరు, తెల్ల చంపకం = Temple Tree or Pagoda Tree; White Frangipani; [bot.] Plumeria alba of the Apocynaceae family;
-- గుడి గన్నేరు = [bot.] Thevetia peruviana; గుడి గన్నేరు కాయలలోని పప్పు విషపూరితం.
---పప్పు మాత్రమే కాదు, ఆకులు, కాండంలో ఉండే పాలు కూడా విషపూరితమే. ఈ కాయ పప్పు లో ఉండే కార్డియాక్ గ్లైకోసైడ్స్ (Cardiac Glycosides) ప్రాణాంతకమైనట్టివి. ఈ పప్పు తిన్న వ్యక్తి వాంతులు చేసుకుని అంతిమంగా మరణిస్తాడు. సకాలంలో వైద్యసేవలు అందిస్తే విషహరణం సాధ్యం కావచ్చు. Cerberocide, Thevetin, Peruvoside మొదలైనవి గన్నేరు పప్పులో ఉండే విషపూరితమైన గ్లైకోసైడ్స్;
-- కరవీరం; కరవీ వృక్షం; తెల్ల గన్నేరు, పచ్చ గన్నేరు;
గప్పాలు, gappAlu
-n. pl.
--bragging; boasting;
గబగబ, gabagaba
-adj.
--onomatopoeia for the act of being fast, quick, or rapid;
---గబగబ నడు = walk fast.
గబ్బిలం, gabbilaM
-n.
--bat; a flying mammal with a furry body and membranous wings;
గబ్బు, gabbu
-adj.
--malodorous;
గబ్బుకంపు, gabbukaMpu
-n.
--malodor; stale odor;
గభీమని, gabhImani
-adv.
--suddenly; hurriedly;
గమకం, gamakaM
-n.
--[music] microtone; glide; a cluster of intermediate frequencies in the 12-tone Western scale or the 22-tone Indian scale of music; a group of frequencies that cluster around the frequency defining the primary tone; a glide through a continuum of frequencies;
గమేళా, gamELA
-n.
--(1) a high perch on a ship's mast where a man can stand and look far;
--(2) crow's nest;
--(3) a utensil in the shape of a hollow spherical segment;
గయ్యాళి, gayyALi
-n.
--shrew; an aggressive, domineering or possessive woman;
గరకట్టు, garakaTTu
-v. i.
--clot; solidify;
గరగడ, garagaDa
-n.
--funnel;
గరగర, garagara
-adj.
--onomatopoeia for the feeling of rough to the touch;
గరిమ, garima
-n.
--mass; size; greatness; see also గురుత్వం;
గరిమనాభి, garimanAbhi
-n.
--center of mass;
గరిమ వ్యాసం, garima vyAsaM
-n.
--[astron.] gravitational diameter; if a celestial body is compressed below this diameter, it becomes a black hole;
గరిసె, garise
-n.
--(1) silo;
--(2) a large hamper or basket;
--(3) a volumetric measure equal to the size of a silo;
--(4) a volumteric measure for measuring large quantities of grain until the metric system was introduced;
-- 1 గరిసె = 400 తూములు = 1600 కుంచములు;
గరిష్ట సామాన్య భాజకం, garishTa sAmAnya bhAjakaM
-n.
--[math.] greatest common factor; G.C.F.; (ant.) L.C.M.
గర్విష్టి, garvishTi
-n.
--prig;
గరుకు, garuku
-adj.
--rough; coarse; rough like a sand paper; see also ముతక;
గరుకు స్తంభం, garuku sthambhaM
-n.
--a rough pillar-like stone placed in cow sheds to help cows scratch their body parts by rubbing against them;
గరుడపచ్చ, garudapacca
-n.
--a type of emerald; corundum with transparent light green color;
గరుడపురాణం, garuDapuraaNaM
- n.
-- మరణానంతర జీవితం, పునర్జన్మ మరియు జీవిత అర్ధంతో సహా అనేక అంశాలతో వ్యవహరించే హిందూ గ్రంథం. విష్ణువు యొక్క వాహనం అయిన గరుడ, విష్ణువును వాస్తవిక స్వభావం (nature of Reality) గురించి వరుస ప్రశ్నలను అడుగుతాడు. గరుడుడు అడిగే ప్రశ్నలలో ఒకటి మృత్యువు యొక్క అర్థం గురించి;
గరుడఫలం, garudaphalaM
-n.
--chaulmoogra; [bot.] Hydnocarpus laurifolia;Hydnocarpus wightianus;
Plant
-- Hydnocarpus wightianus or Chaulmoogra is a tree in the Achariaceae family. Hydnocarpus wightiana seed oil (Chaulmoogroil) has been widely used in traditional Indian medicine, especially in Ayurveda, and in Chinese traditional medicine for the treatment of leprosy and vitiligo;
గరుడవర్ధనం, garuDavardhanam
- n.
-- a flowering plant;
-- see also గోవర్ధనం; నందివర్ధనం;
గరుపం, garupaM
-n.
--loam;
గరుపకొడి, garupakoDi
-adj.
--loamy;
గరుప నేలలు, garupa nElalu
-n.
--loamy soils;
గరువం, garuvaM
-n.
--pride; same as గర్వం;
గరువు, garuvu
-adj.
--gravelly;
- n.
-- hard and gravelly land;
-- సన్నని గులకరాయి కలిసిన నేల; కొన్నిచోట్ల ఇసక గులక గలిసిన ఎర్రనేలలు గాని, నల్లనేలలు గాని; పునాసపంటలు (వేరుశెనగ, జొన్న, సజ్జ, మొ.), అరటి, పసుపు, నిమ్మ, మొ. తోటలు ఈ నేలల్లో వేస్తారు.
గలం, galaM
-n.
--[prosody] dactyl; the combination of a long sound followed by two short sounds;
గలగల, galagala
-adj.
--onomatopoeia for the sound of flowing water, tinkling bells, jingling bangles, etc.;
గలన పత్రం, galana patraM
-n.
--filter paper;
గలని, galani
-n.
--filter; filtering device;
గల్లంతు, gallaMtu
-n.
--disturbance; tumult;
గల్లా, gallA
-n.
--cash-box; till; cash register;
గలిజేరు, galijEru
-n.
--hogweed; a medicinal herb spreading on the ground; decoction of leaves used for kidney and liver troubles; Ayurvedic medicine produced from this is supposed to help alleviate symptoms from prostate enlargement; [bot.] Trianthima monogyna;
-- [Sans.] పునర్నవ; భృంగరాజు;
గల్పిక, galpika
-n.
--sketch; short literary piece;
-- ఇది వచన ప్రక్రియలో ఒకటి; గల్పికను కొడవగంటి కుటుంబరావు ప్రాచుర్యం లోకి తీసుకొచ్చారు. గల్పిక పరిమాణంలో కధానిక కంటే చిన్నది. ఇందులో భావన, అనుభూతి ప్రధానమైనదిగా ఉంటుంది. గల్పిక లో విమర్శలు ఉంటాయి. సంఘటనలకు ప్రాధాన్యత ఉంటుంది. ఎగతాళి లేదా వ్యంగ్యం ద్వారా ఒక వ్యక్తిని లేదా వ్యవస్థను విమర్శించడం ప్రక్రియలో చూడవచ్చు. కొడవటి గంటి కుటుంబరావు రాసిన 'అంపకాలు ' గల్పికకి ఒక ఉదాహరణ.
గల్లీ, gallI
-n.
--narrow lane;
గలేబు, galEbu
-n.
--pillow case; covering; jacket; anything that covers another as a protection from dirt or grease;
-- గౌసేన;
గళగండం, gaLagaMDaM
- n.
-- goiter; a swelling of the neck or larynx resulting from enlargement of the thyroid gland
గళకుండిక, gaLakuMDika
- n.
-- uvula; a conic projection from the posterior edge of the middle of the soft palate,
గళ్లా, gaLlA
- n.
-- funnel;
గవదలు, gavadalu
-n.
--(1) mumps; a communicable disease of childhood, usually associated with the swelling of the salivary glands, especially the parotid glands;
--(2) glands of the throat;
గవరు, gavaru
-n.
--Indian bison; wild buffalo;
గవ్యము, gavyamu
-n.
--dairy product; (lit.) a product of the cow;
గవ్వ, gavva
-n.
--cowry; shell; sea shell;
గవాక్షం, gavAkshaM
-n.
--window;
గవేషణ, gavEshaNa
-n.
--search;
గసగసాలు, gasagasAlu
-n. pl.
-- seeds of opium poppy; [bot.] Papover somniferum;
-- గసగసాలను అన్ని దేశాల్లో పండించరు. పండించకూడదనే ఒడంబడిక ఉంది. కేవలం అనుమతి ఇవ్వబడిన దేశాల్లో (టర్కీ అందులో ఒకటి) - UN ఆధ్వర్యంలో మాత్రమే పండించాలి. కొన్ని రకాల వంటకాలలోనూ, కొన్ని జగమొండి జబ్బుల నియంత్రణకై వాడటం కోసమే పరిమిత మొత్తంలో పండిస్తారు;
గసాభా, gasAbhA
-n.
--[math.] GCF; greatest common factor; short for గరిష్ట సామాన్య భాజకం;
గసి, gasi
-n.
--dregs of melted butter; the sediment left after butter is made into ghee by boiling it; also గోదావరి;
గసిక, gasika
-n.
--(1) wooden wedge or spike;
--(2) wooden or iron digging instrument;
--(3) plug;
--(4) a plug in a wound caused by the healing process;
గస్తీ, gastI
-n.
--patrol; watch by a security officer;
గస్తీవాడు, gastIvADu
-n.
--sentry;
గళం, gaLaM
-n.
--(1) throat;
--(2) voice;
గళధమని, gaLadhamani
-n.
--carotid artery; the main vessel that carries blood to the brain;
గవ్యము, gavyamu
-n.
-- (1) any cow-derived product including dung, urine, milk, or meat; (2) milk and milk products;
గహనము, gahanamu
- adj.
-- (1) dense; thick; deep; wild; (2) impenetrable; inaccessible;
- n.
-- (1) a forest; wood; (2) a cave; (3) distress; grief;
గహ్వరం, gahvaraM
-n.
--cave;
గ్రంథం, graMthaM
-n.
--book; treatise;
గ్రంథకర్త, graMthakarta
-n.
--author; (rel.) రచయిత = writer; creator;
గ్రంథగ్రంథి, graMthagraMthi
-n.
--a tough to untangle passage; a difficult to understand passage in a long narrative;
-- వ్యాసఘట్టం;
గ్రస్త, grasta adjvl.
-suff.
--seized by; consumed by;
---భయగ్రస్తుడు = one overcome by fear.
---రోగగ్రస్తుడు = one taken ill.
గ్రహం, grahaM
-n.
--(1) planet; this is the modern scientific meaning; to qualify as a planet, an astronomical body has to satisfy three properties: (a) orbit around a star in a well-defined orbit; (b) spherical in shape; and (c) possess sufficient gravitational pull to clear any planetary debris in the neighborhood;
--(2) [lit.] one that holds with its attractive pull; with this literal definition, our sun (or, any other star) is also a "grahaM";
-- గ్రాహయతీతి గ్రహ: – అంటే ప్రభావం చూపేది గ్రహము అని. జ్యోతిషం ప్రకారం సూర్య చంద్రాదులకు మనమీద ప్రభావం ఉన్నది కాబట్టి వాటినికూడా జ్యోతిషం గ్రహాలుగానే వ్యవహరిస్తుంది;
--(3) ghost; poltergeist; evil spirit;
గ్రహకూటమి, grahakUTami
-n.
--conjunction of planets;
గ్రహచారం, grahacAraM
-n.
--fate; misguided path; misfortune; bad luck; (lit.) the path of a planet; (rel.) గోచారం = (lit.) the path of a cow, whereabouts of a lost or missing cow; వ్యభిచారం = adultery; fornication; (lit.) taking a misguided path;
గ్రహణం, grahaNaM
-n.
--(1) acceptance;
--(2) comprehension;
--(3) eclipse; the apparent darkening of a heavenly body when the shadow of another falls on it; (rel.) occultation is the disappearance of one heavenly body behind another,
--(4) seizing; seizure; taking away;
---పాణిగ్రహణం = wedding.
---గోగ్రహణం = cattle rustling; stealing of cattle.
---శబ్దగ్రహణం = sound recording; capturing the sound.
---ఛాయాగ్రహణం = photography; capturing the image.
గ్రహణపు మొర్రి, grahaNapu morri
-n.
--cleft palate; (note) this meaning came into vogue because of the belief that cleft palate is caused by when an expecting mother scratches her lip during an eclipse;
గాజు, gAju
-adj.
--glass;
---గాజుగ్లాసు = a glass tumbler.
---గాజుపలక = a glass pane.
-n.
--(1) glass;
--(2) bangle;
గాటు, gATu
-n.
--gash; cut; wound;
గాడి, gADi
-n.
--groove; striation; trench;
గాడిద, gADida
-n.
--donkey; ass; jackass;
-- అడవి గాడిద = ass
-- మచ్చిక అయిన గాడిద = donkey
గాడిదగడప, gADidagaDapa
-n.
--Bracteated birth wort; a slender, prostate herb; leafy juice mixed with castor oil is applied to eczema; [bot.] Aristolochia bracteolata Lam;
--వృషగంధిక;
గాడిదగుడ్డు, gADidaguDDu
-ph.
--[idiom.] mare’s nest; pie in the sky; something impossible; falsehood; nothingness; (lit.) the egg laid by a donkey;
గాడిదపులి, gADidapuli
-n.
-- hyena;
గాడిపొయ్యి, gADipoyyi
-n.
--pit-oven; in-ground fireplace; an outdoor cooking hearth made in the form of a trench for cooking in a line of large pots; such fireplaces were traditionally used at weddings or other festivals; after hotel catering came into vogue, these traditional pit-ovens are fast disappearing;
గాడ్పు, gADpu
-n.
--hot wind or breeze; summertime breeze;
గాథ, gAtha
-n.
--(1) poem; a verse or stanza;
--(2) story; story written in verse; story-verse suitable for singing; అ tale;
---వీరగాథ = ballad.
గాదం, gAdaM
-n.
--(1) a type of grass;
--(2) leaf;
గాదె, gAde
-n.
--silo; a large wicket container for storing grain;
గానం, gAnaM
-n.
--song;
గానకచేరీ, gAnakacErI
-n.
--musical concert;
గానమందిరం, gAnamaMdiraM
-n.
--concert hall;
గానుగ, gAnuga
-n.
--(1) press; oil-mill; a rotating press for extracting oil from oil seeds;
--(2) mixer; a rotating device to mix sand and lime to prepare native cement;
--(3) pongam tree; beech tree; [bot.] Pongamia pinnata; Pongamia glabra;
గాబరా, gAbarA
-n.
--(1) agitation; agitation due to fever;
--(2) panic; hyper; perplexity; confusion;
---ఒంట్లో గాబరాగా వుంది = I feel agitated.
---గాబరా పడకు = do not panic.
గామి, gAmi
-suff.
--traveller;
---వ్యోమగామి = space traveller.
గాయం, gAyaM
-n.
--wound; injury; cut; lesion;
గాయపాకు, gAyapAku
-n.
--Coat-buttons; [Bot.] Tridax procumbens L. Asteraceae
గార, gAra
-n.
--(1) a yellow substance, called tarter, accumulating on the teeth;
--(2) mortar; plaster;
--(3) a medicated paste used by fishermen to stun fish;
-- (4) Desert date; Zachun-oil tree; [bot.] Balanites aegyptiaca (L.) Del. Balanitaceae; [bot.] Balanites roxburghii. of the Zygophyllaceae family; Balanites indica;
-- (5) (Note). ఎంతటి ఎండల్లోనూ ఈ చెట్టు ఆకులు రాల్చదు. ఇది ఎప్పుడూ పచ్చగా ఉండే సతత హరిత వృక్షం. ఈ చెట్టు ఆకులకూ, కాండం పైని బెరడుకూ, గింజల నుంచి తీసే తైలానికీ వైద్యపరమైన ప్రయోజనాలున్నాయి. సంస్కృత మహాభారతంలోని శల్య పర్వంలోని 36 వ అధ్యాయంలో 58 వ శ్లోకంలో సరస్వతీ నదీ తీరంలో ఇంగుదీ వృక్షాలున్నట్లు పేర్కొనబడ్డది; దగ్గుకూ, తీవ్రమైన కడుపునొప్పి(Colic) కి గార గింజల కషాయం ఇస్తారు. కాండం పైని బెరడు, పచ్చి కాయలు, ఆకులు పిల్లల కడుపులోని క్రిములను వెడలింపజేసేందుకు వాడతారు. గార పళ్ళను పాముకాటుకు విరుగుడుగా వాడతారు. కాలిన గాయాలు, పుళ్ళు తగ్గించడానికి గార గింజల నుంచి తీసిన నూనెను పూస్తారు;
-- (6) (Note). ఇంగుదీ వృక్షం అంటే 'గార చెట్టు', కణ్వ మహర్షి శకుంతలను దుష్యంతుడి వద్దకు సాగనంపే దృశ్యమది. తాను కట్టుకున్న నారచీరను ఎవరో పట్టుకుని వెనక్కి గుంజినట్లు అనిపించి శకుంతల వెనక్కి తిరిగి చూస్తుంది. తన చీర కొంగును పట్టుకుని లాగింది మరెవరో కాదు - తాను కొంతకాలంగా పుత్రసమానంగా పెంచుకుంటున్న లేడి పిల్లేనని ఆమె గ్రహిస్తుంది.
అప్పుడు కణ్వ మహర్షి ఆమెతో ఇలా అంటాడు -
వత్సే !
యస్య త్వయా వ్రణ విరోపణమింగుదీనామ్
తైలమ్ న్యషిచ్యత ముఖే కుశసూచి విద్ధే
శ్యామాక ముష్టి పరివర్థిత కో జహాతి
సోయం న పుత్ర కృతకః పదవీమ్ మృగస్తే ||
(బిడ్డా! పచ్చి గడ్డి మేస్తున్న ఈ లేడి పిల్లకు నోటిలో దర్భ ముల్లు గుచ్చుకున్నప్పుడు, దాని గాయం మాన్పడానికి ఇంగుదీ కాయల తైలం పూసి చికిత్స చేశావు. నోటి గాయంతో అప్పుడది గడ్డి మేయడం సాధ్యంకాదని దానికి ప్రేమమీరగా శ్యామాకాలు - సామలు లేక చామధాన్యం - గుప్పెళ్ళతో తినిపించావు. అలా నీవు పుత్ర సమానంగా పెంచుకున్న ఈ లేడి నిన్ను నీ మార్గాన ఎలా వెళ్ళనిస్తుంది ?)
గారాబం, gArAbaM
-n.
--affectionate indulgence;
గారు, gAru
-suff.
--a suffix after names and titles to show respect;
గారె, gaare
- n.
-- a toroidal-shaped, palm-sized, deep-fried savory dish popular in South India; this item is typically made from "Urid dal," although variations exist; Its trademark characteristic is the hole in the center; If the hole is missing, then it is called "వడ;"
గాలం, gAlaM
-n.
--(1) hook especially a device with a bunch of hooks to retrieve buckets when they fall in a well;
--(2) fishing line;
గాలించు, gAliMcu
-v. t.
--search; exhaustive search; search by washing; levigate; pan;
గాలి గుమ్మటం, gAli gummaTaM
-n.
--balloon; esp. a balloon in which people can travel;
గాలికొట్టు, gAlikoTTu
-v. t.
--inflate;
గాలికోడి, gAlikODi
-n.
--weather cock; wind vane;
గాలిగుడి, gAliguDi
-n.
--ring around the moon; moon-bow; ring around the sun; the halo seen around the sun or moon which appears like a circular cloud and believed to indicate an oncoming rain;
గాలిగోపురం, gAligOpuraM
-n.
-- the tall, ornamental tower at the entrance of a classical south Indian temple;
గాలిపటం, gAlipaTaM
-n.
--kite; a paper toy that is tied to a string and flown in the air for amusement;
గాలితిత్తి, gAlititti
-n.
--air sac; alveolus;
గాలిబిళ్లలు, gAlibiLlalu
-n. pl.
--mumps;a viral disease of the human species, caused by the mumps virus. Before the development of vaccination and the introduction of a vaccine, it was a common childhood disease worldwide. It is still a significant threat to health in developing countries, and outbreaks still occur sporadically in developed countries.
గాలిదోషం, gAlidOshaM
-n.
--evil effect of a ghost; ill wind;
గాలిమర, gAlimara
-n.
--windmill;
గాలిమేడలు, gAlimEDalu
-n. pl.
--castles in the air;
గాలివాన, gAlivAna
-n.
--storm; cyclone; hurricane; typhoon; (lit.) windy rain; storms in the Atlantic are called hurricanes; Pacific storms are called typhoons; storms in the Indian ocean are called cyclones; (rel.) సుడిగాలి; ఉప్పెన;
గ్రాడి, grAdi
-n.
--grid;
---ఇనపగ్రాడి = iron grid.
గ్రామం, grAmaM
-n.
--village; (def.) according to Kautilya, a self-sufficient habitation with at least 500 households, representing different trades and occupations, and has a proximate market outlet for its products and services;
-- గ్రామం అంటే వందకుటుంబాలు పైన ఉంటాయి (సుమారు 200 లేదా ఆ పైనే )కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉంటాయి. ఇక్కడ మాత్రo ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల (అరవతరగతి నుంచి పదవతరగతి వరకు ), సర్పంచ్ కూడా గ్రామం లోనే ఉంటారు.పల్లెకి సంబందించిన ఏవైనా సమస్యలున్నా గ్రామo లో ఉన్న పంచాయితీ ఆఫీస్ దగ్గర తెలుపుకోవాల్సిందే.ఓట్లు లెక్కింపులన్నీ గ్రామం లో నే జరుగుతాయి.
గ్రామసింహం, grAmasiMhaM
-n.
--dog; (lit.) lion of the village;
గ్రామీణ, grAmINa
-adj.
--rural; country; pastoral;
---గ్రామీణ ప్రాంతం = countryside.
గ్లాసుడు, glAsuDu
-adj.
--a glass-full of; a glass of;
%గిం - giM, గి - gi, గీ - gl
గింజ, giMja
-n.
--seed; see also పిక్క; విత్తనం;
గింజుకొను, giMjukonu
- v. i.
-- grab to own;
-- తనది కానిదాని కోసం అనేక రకాలుగా అరిచి ఆగం చేస్తూ ఉంటే గింజుకుంటున్నాడు అంటాం;
గిగా, gigA
-pref.
--giga; billion; one followed by nine zeros;
---బిలియను ద్వింకములు = gigabits.
గిచ్చు, giccu
-v. t.
--pinch; same as గిల్లు;
గిజగిజ, gijagija
-adj.
--onomatopoeia for wriggling and kicking of hands and legs;
గిజిగాడు, gijigADu
- n.
-- Baya; Weaver Bird; [biol.] Ploceus baya or Ploceus philippinus of the Ploceidae (ప్లోసీడే) family;
-- గ్రామసీమలలో ఎక్కువగా ఈత చెట్లకూ, తుమ్మ చెట్లకూ తలకిందులుగా వేళ్ళాడుతూ ఉన్న గిజిగాడి గూళ్ళు కనిపిస్తాయి. వర్షాకాలంలో జతకట్టే ఈ పక్షులు తమ గూళ్ళను ఎంతో ప్రయాసపడి నిర్మించుకుంటాయి. పాముల నుంచి తమ గుడ్లు, పసికూనలను రక్షించుకోవడం కోసం అవి గూళ్ళను చిటారు కొమ్మలకు వేళ్ళాడేటట్లు, గూడు ముఖద్వారం బహిరంగంగా ఉండకుండా పొడవాటి గొట్టం లో నుంచి గూటిలోకి ప్రవేశించే విధంగానూ ఏర్పాటు చేసుకుంటాయి. మరో వింత విషయం. ఈ వలసపక్షులు వానాకాలం ముగిసి తమ పిల్లలతో స్వస్థలాలకు వెళ్ళిపోయేటప్పుడు వదలివెళ్ళే ఖాళీ గూళ్ళలో ఎండిపోయిన బురద పెళ్ళలు కనిపిస్తాయి. అవి ఎందుకంటే తమకూ, తమ కూనలకూ గూళ్ళలో వెచ్చదనం కోసం అవి తమ గూళ్ళలోని ఒక ఎత్తైన వేదికమీద కొద్దిగా బురద తీసుకొచ్చిపెట్టి, ఆ బురదలో మిణుగురు పురుగుల్ని తీసుకొచ్చి గుచ్చుతాయి. రాత్రిపూట ఆ మిణుగురుల కాంతి, వెచ్చదనం అవి అనుభవించడానికి అలా అలవాటు పడ్డాయి.
-- పసుపు పిట్ట; పచ్చ పిట్ట;
గిరి, giri
-n.
--(1) hill; mountain;
--(2) a line drawn on the ground;
గిరిజనులు, girijanulu
-n.
--(lit.) hill-people; a term used to refer to some aboriginal tribes in India; Scheduled Tribes (ST);
గిలక, gilaka
-n.
--(1) hernia;
--(2) toy rattle;
--(3) pulley;
--(4) Sun-hemp; the plant yields excellent feiber; it is also used as a green manure; [bot.] Crotolaria juncea; గిలిగింత;
గిలకసరులు, gilakasarulu
-n.
-- a gold ornamental chain of yester year made out of small pullet-shaped links;
గిలకపాము, gilakapAmu
-n.
--rattle snake;
గిలక్కాయ, gilakkAya
-n.
--toy rattle;
గిలగిల, gilagila
-adj.
--onomatopoeia for the act of thrashing or flailing;
గిలాబా, gilAbA
-n.
--plaster;
గిలుకరించు, gilukariMcu
-v. t.
--beat; whip; shake; stir;
గుంతలు, guMTalu
- n. pl.
-- potholes; holes in a road surface;
గుంపు, guMpu
-n.
--(1) group of people;
--(2) mob;
--(3) [chem.] group; radical;
గుంభనంగా, guMbhanaMgA
-adv.
--secretly;
గుక్క, gukka
-n.
--(1) the act of drawing a lungful of breath;
--(2) crying hard without a chance to take a breath;
గుక్కతిప్పుకొను, gukkatippukonu
-v. i.
--stop to take a breath;
గుక్కెడు, gukkeDu
-adj.
--a mouthful of (any liquid); a swig;
గుగ్గిలం, guggilaM
-n.
--(1) Gum Gugal; gooey secretion from Indian Bdellium, a small thorny plant; [bot.] Balsamodendron Mukal or Commiphora Mukul of the Burseraceae family;
-- (2) a bushy shrub; [bot.] Aegiceras corniculatum;
-- గుగ్గులు మొక్క;
గుగ్గిలం చెట్టు, guggilaM ceTTu
-n.
--sal tree; [bot.] Shorea robustaof Dipterocarpaceae family);
-- this is different from Indian Bdellium; the resin obtained from the sap of this tree is called సాంబ్రాణి; unfortunately, the name గుగ్గిలం చెట్టు is a misnomer here, because గుగ్గిలం is obtained from the resin of the tree గుగ్గుల్, or Commiphora mukul of the Burseraceae family;
-- సాలవృక్షం, సర్జకం;
గుట్టు, guTTu
-n.
--secret; tight lipped;
---ఇంటిగుట్టు రచ్చకి ఎక్కించకు = do not wash dirty laundry in public; do not make family secrets public;
గుటిక, guTika
-n.
--pill; tablet;
గుడం, guDaM
-n.
--raw sugar; unrefined sugar; brown sugar;
గుడ్లగూబ, guDlagUba
-n.
--owl;
---కొమ్ముల గుడ్లగూబ = the great horned owl; [biol.] Bubo bubo;
గుడారం, guDAraM
-n.
--tent; hut;
గుడి, guDi
-n.
--(1) temple;
--(2) halo around the Sun or Moon; The ring, or a lunar halo, is caused by the refraction and reflection of light from ice crystals that are suspended in thin, wispy, cirrus or cirrostratus clouds that are at high altitudes; in Indian folk wisdom, the appearance of this ring with a large diameter indicates the possibility of rain in the near future and a small diameter indicates rain far into the future;
--(3) the intra-syllabic form of the vowel ఇ;
గుడిదీర్ఘం, guDidIrgaM
-n.
--the intra-syllabic form of the vowel ఈ;
గుడి పావురం, guDi pAvuraM
- n.
-- blue rock pigeon; [biol.] Columba livia;
గుడిసె, guDise
-n.
--hut; cottage; hovel; a small thatched-roof tenement with a circular floor plan;
--(note) note the similarity in the shapes of "temple" and "hut";
గుడిసేటిది, guDisETidi
-n. f.
--prostitute; (ety.) గుడిచేటిక = temple girl; this derivation can be traced back to the deplorable custom, still in vogue, in Karnataka and western Andhra Pradesh that requires the first female child of a family consigned to the service of a temple god; as temple services went into decline, these women became destitute and routinely fall prey to men who exploit their condition;
గుడ్డి, guDDi
-adj.
--blind;
గుడ్డితనం, guDDitanaM
-n.
--blindness;
గుడ్డు, guDDu
-n.
--(1) egg; ovum;
--(2) eyeball;
గుణం, guNaM
-n.
--property; quality; primary property of the "mind stuff"; (ant.) నిర్గుణం;
---సత్వగుణం = the property of being calm, contemplative and reflective;
---రజోగుణం = the property of being active, impulsive and aggressive;
---తమోగుణం = the property of being dull, indifferent and lazy;
గుణపాఠం, guNapAThaM
-n.
--lesson learned from experience;
గుణవంతుడు, guNavaMtuDu
-n. m.
--a person of good character; (note) గుణమంతుడు is not correct spelling. The rule is "అ తరువాత వ"; శ్రద్ధావంతుడు is correct;
గుణవంతురాలు, guNavaMturAlu
-n. f.
--a woman of fine upbringing and character;
గుణవతి, guNavati
-n. f.
--a person of good character;
--The miswak is a teeth cleaning twig made from the Salvadora persica tree (known as arak in Arabic). A traditional and natural alternative to the modern toothbrush, it has a long, well-documented history and is reputed for its medicinal benefits It is reputed to have been used over 7000 years ago.
గుప్తోష్ణం, guptOshNaM
-n.
--latent heat; the quantity of heat absorbed or released by a substance undergoing a change of state, say from water to ice;
గుమ్మం, gummaM
-n.
--(1) entrance;
--(2) the floor-end of a door frame;
---దొడ్డిగుమ్మం, = rear entrance.
---వీధిగుమ్మం = front entrance.
గుమ్మటం, gummaTaM
-n.
--(1) lamp shade;
--(2) dome; see also గాలి గుమ్మటం;
గుమ్మడి, gummaDi
-n.
--pumpkin; squash gourd; a member of the gourd family;
-- తియ్య గుమ్మడి = red pumpkin; [bot.] Cucurbita maxima of the Cucurbitaceae family;
-- తియ్య గుమ్మడి గింజలు చూసేందుకు చిన్నవిగానే కనిపించినా, అవి విలువైన పోషకాలతో నిండి ఉన్నాయి. రోజూ కాసిని గుమ్మడి గింజలు తిన్నా మన శరీరానికి ఎంతో అవసరమైన కొవ్వు పదార్థాలు, మెగ్నీసియం, పొటాసియం, కాల్షియం, జింకు వంటి ఖనిజాలన్నీ వీటి నుంచి లభిస్తాయి. ఇవి రోజూ తింటే గుండె పని తీరు మెరుగు పడుతుంది. ప్రోస్టేట్ గ్రంథి కి రక్షణ లభిస్తుంది. ఇంకా కొన్ని తరహాల కాన్సర్ల నుంచి ఇవి మనల్ని కాపాడతాయి. పచ్చి విత్తులు ఒట్టివే తినవచ్చు. లేక ఏ ఆహార పదార్థాలలోనైనా వీటిని వేసుకోవచ్చు. లేక కాస్త నెయ్యి లేక నూనెలో వేయించి ఉప్పు కారం చేర్చి తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇరవై ఎనిమిది గ్రాముల గుమ్మడి పప్పులో ప్రోటీన్లు, ప్రయోజనకరమైన కొవ్వులతో కూడిన రమారమి 151 కాలరీల శక్తి ఉంటుంది. ఇంకా వీటిలో శరీరానికి ఎంతో అవరమైన పీచు పదార్ధం, ఫాస్ఫరస్,మాంగనీస్, ఇనుము, రాగి వంటివి కూడా ఎక్కువ. మనకు గాయాలు అయినప్పుడు రక్తస్రావం ఆగటానికి, గాయం త్వరగా మాని, చర్మం మూసుకొనేందుకు ఉపయోగపడే విటమిన్ - కె కూడా ఈ విత్తనాలలో ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ - ఇ కూడా ఎక్కువే. శరీరానికి ఎంతో అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫాటీ యాసిడ్స్, రైబోఫ్లేవిన్ (Vitamin B2) వంటివి కూడా వీటిలో ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని జీవకణాలను ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ బారినుంచి కాపాడతాయి. అందుకే గుమ్మడి గింజలకు మన ఆరోగ్య రక్షణలో అంత ప్రాముఖ్యం ఏర్పడింది. గుమ్మడి గింజలు క్రమం తప్పకుండా తింటూ ఉంటే రొమ్ము కాన్సర్, ఊపిరి తిత్తుల కాన్సర్, ప్రోస్టేట్ గ్రంథి కాన్సర్ వంటివి మనజోలికి రావు.
---సమ్మర్ స్క్వాష్ = summer squash; [bot.] Cucurbita pepo;
---కషా గుమ్మడి = African gourd; [bot.] C. mixata;
---బూడిద గుమ్మడి = ash gourd; wax gourd; [bot.] Benincasa hispida; Benincasa cerifera;
---[Sans.] పీత కూష్మాండ; కూష్మాండ;
గుమ్మరించు, gummariMcu
-n.
--plunk; pour a lot into;
గుర్మర్, gurmar
-n.
--saponins from this plant extract have been shown to possess potent inhibition of glucose and antihyperglycemic activity; (lit.) sugar destroyer; [bot.] Gymnema sylvestr;
గురక, guraka
-n.
--snore;
గురణం, guraNaM
-n.
--effort; (rel.) ఉద్యమం;
గురదాలు, guradAlu
- n. pl.
-- kidneys;
గుర్రం, gurraM
-n.
--(1) horse;
--(2) knight in chess;
--(3) a measure of sixteen tamarind seeds in a childrens game;
---ఆడ గుర్రం = dam; mare.
---ఆడ గుర్రపు పిల్ల = filly.
---గుర్రపు పిల్ల = foal.
---మగ గుర్రం = stallion; stud;
---మగ గుర్రపు పిల్ల = colt.
గురి, guri
-n.
--(1) aim; mark;
--(2) belief; trust; respect;
---గురి చూసి కొట్టు = aim and shoot.
---ఆయనంటే మంచి గురి = trusts his word very much.
గురివింద, guriviMda
- n.
-- Crab's eye; rosary pea; India shot; wild liquorice; Indian liquorice; [bot.] Abrus precatorius;Adinathera pavonia;Canna indica of the Liguminosae family;
-- పరిపక్వతకు వచ్చిన గింజలు అన్నీ ఒకే బరువు కలిగి ఉంటాయి. ఈ ఈ గుణం వల్ల దీనిని మన దేశంలో బంగారపు తూకానికి వాడేవారు. 100 గింజలు ఒక తులం బరువు తూగుతాయి. ఒక గింజ బరువును రత్తి అంటారు.
-- గురివింద గింజలో ఉన్న విషం ఆపిల్ గింజల విషం కన్నా 75 రెట్లు ప్రమాదకరమైనది. 50 ఆపిల్ గింజలను నూరి ఆ పొడిని తింటే మనిషికి విషపూరితం కావచ్చు. కానీ ఒకే ఒక్క గురివింద గింజను నమిలి ఆ పొడిని మింగితే కచ్చితంగా ప్రాణాంతకం కాగలదు;
-- [Sans.] రక్తిక;
గుర్తింపు, gurtiMpu
-n.
--recognition;
గురుంగూర, guruMgUra
- n.
-- [bot.] Celosia argentia Linn.
గురు, guru
-adjvl. pref.
--great; major; heavy; venerable;
---గురు అక్షం = major axis.
గురుగు, gurugu
- n.
-- [bot.] Celosia argentea of Amaranthaceae family
--- తోటకూర జాతికి చెందిన మొక్క; [Sanskrit] వితున్న; [rel.] కోడిజుత్తు తోటకూర;
గురుగ్రహం, gurugrahaM
-n.
--the planet Jupiter;
గురుడు, guruDu
-n.
--the planet Jupiter;
గురుత్వం, gurutvaM
-n.
--[phy.] gravity; gravitation; (lit.) massiveness; heaviness; massiveness; respectability;
---విశిష్ట గురుత్వం = specific gravity; relative density; the ratio of the mass of a substance to the mass of an equal volume of water;
గురుత్వ, gurutva
-adj.
--[phy.] gravitational;
గురుత్వ కేంద్రం, gurutva kEMdraM
-n.
--[phy.] center of gravity;
గురుధాతువు, gurudhAtuvu
-n.
--[phy.] heavy element;
గురువు, guruvu
-n.
--(1) guru; teacher; preceptor;
--(2) [prosody] a long syllable; a syllable that takes a duration of two snaps to pronounce; [lit.] the big one; the heavy one;
గులాబ్ జామున్, gulAb^jAmun^
- n.
-- (1) A sweet popular in India;
-- (2) MalayA apple; [bot.] Syzygium malaccense of the Myrtaceae family;
-- కొన్ని పూలు తెల్లగా ఉంటే ఇంకొన్ని ఎర్రగా గులాం (గులాల్) రంగులోనూ, కొన్ని రక్త వర్ణం లోనూ ఉంటాయి. పూల రంగును బట్టే కాయల రంగు ఉంటుంది. ఈ పండ్లనుంచి కొన్ని దేశాలలో వైన్ (Wine) తయారు చేస్తారు. మలేషియా, ఆస్ట్రేలియాలు ఈ పండ్ల మొక్క తొట్టతొలి జన్మస్థానాలు.
గులాబి, gulAbi
-n.
--rose; [bot.] Rosa centifolia;
గులిమి, gulimi
-n.
--ear wax; cerumen;
గులేబకావళి, gulEbakaavaLi
- n.
-- Gul-E-Bakavali (గుల్ -ఏ-బకావలి); బకావలి అనే పువ్వు; బకావలి = తెలుగులో బ్రహ్మ కమలం;
గుసగుస, gusagusa
-n.
--onomatopoeia for whisper; susurration;
గుహ్యం, guhyaM
-n.
--secret; code; రహస్యం;
గుహ, guha
-n.
--cave;
గూండా, gUMDA
-n.
--thug;
గూటం, gUTaM
-n.
--pestle; mallet;
గూటించు, gUTiMcu
-v. t.
--pester; put pressure on;
గూఢచారి, gUDhacAri
-n.
--spy; secret messenger;
గూడు, gUDu
-n.
--(1) nest; bird's nest;
--(2) web; a spider's web;
--(3) cocoon; chrysalis; web;
--(4) shelf; a shelf-like opening in a wall for storing things;
--(5) niche; a one-sided hole in the wall used as a shelf;
గూడుపిట్ట, gUDupiTTa
-n.
--nestling; a young bird that has not left the nest yet;
గూడుపుఠాణి, gUDupuThAnI
-n.
--conspiracy; plot;
గూడెం, gUDeM
-n.
--tiny village comprised of thatched-roof tenements; a village comprised of a group of గుడిసెలు; a tribal village;
గూబతడ, gUbataDa
-n.
--a tree with yellow flowers; [bot.] Sida rhombofolia;
గ్లూకోజు, glUcOju
-n.
--glucose; a form of sugar found in fruits and honey; blood sugar; dextrose; C6H12O6;
%గృ - gR, గె - ge, గే - gE, గై - gai
గృహం, gRhaM
-n.
--(1) home;
--(2) abode;
గృహస్తు, gRhastu
-n. m.
--householder;
గృహ్యసూత్రాలు, gRhyasUtrAlu
- n. pl.
-- గృహస్థు దైనందిన జీవితంలో ఏయే కర్మలు ఎలా చేయాలి, శుభాశుభ కర్మలు ఎలా చేయాలి, ఒకటేమిటి, మొఖం కడగడం ఎలా అనే విషయం దగ్గర్నుండీ సమస్త కర్మాచరణ విధానం గృహ్యసూత్రాలలో ఉంటుంది. వీటిని రచించినవారిలో ఇద్దరు ప్రముఖులు. ఒకరు ఆపస్తంబుడు, రెండవవారు అశ్వలాయనుడు. (ఆంధ్రులలో ఎక్కువమంది ఆపస్తంబ గృహ్యసూత్రాలను అనుసరిస్తారట. అందుకని ఆపస్తంబుడు ఆంధ్రుడు అయి ఉంటాడని తిరుమల రామచంద్ర గారి అభిప్రాయం.)
గృహిణి, gRhiNi
-n. f.
--homemaker; head of the home; see also ఇల్లాలు;
గెంటు, geMTu
-v. t.
--eject; kick out; push;
- n.
-- movement;
గెంతు, geMtu
-v. i.
-- jump; leap;
గెడ, geDa
-n.
--(1) stalk; staff;
--(2) door-latch in the shape of a rod;
---వెదురు గెడ = bamboo staff.
---చెరకు గెడ = sugarcane stalk.
గొంతెమ్మ కోరిక, goMtemma kOrika
-n.
--an impossible wish; a greedy wish; (ety.) In Mahabharata, Kunti dearly wished that her extra-marital son Karna join her other children, the Pandavas. But this wish was never fulfilled. So the word కుంతి + అమ్మ = గొంతెమ్మ;
గొంద్వానా, goMdvAnA
-n.
--Gondwanaland; one of the original land masses of the world, the other being Pangea. According to the theory of Plate Tectonics, these two land masses broke into seven pieces, one of which is the Indian Plate.
గొంది, goMdi
-n.
-- (1) alley; bylane; (2) land in the shadow of a hill;
గొగ్గి, goggi
-n.
--[chem.] benzene; భైరవాసం;
గొగ్గి చక్రం goggi cakraM
-n.
--benzene ring;
గొజ్జంగి, gojjaMgi
-n.
--screw pine; [bot.] Pandanus odoratissmus; same as మొగలి;
గొటగొట, goTagoTa
-adj.
--onomatopoeia for the sound signifying drinking;
గొట్టం, goTTaM
-n.
--tube; pipe; duct; hose; barrel; either a rigid or a flexible tube (hose);
---పొగ గొట్టం = chimney.
---తుపాకి గొట్టం = gun barrel.
---నీటి గొట్టం = water pipe.
---రబ్బరు గొట్టం = rubber hose; rubber tube.
గొడ్డురాలు, goDDurAlu
-n.
--barren woman; a woman who bore no children; గొడ్రాలు;
గొప్ప, goppa
-adj.
--rich; affluent; big; great; noble;
---గొప్ప వాళ్లు = rich people; famous people.
---పెద్ద గొప్ప! = big deal!
గొప్పు, goppu
-n.
--basin around a plant to hold water;
గొబ్బరం, gobbaraM
-n.
--manure;
గొబ్బి, gobbi
- n.
-- an erect herb; [bot.] Barleria cristata Linn.; పెద్ద గోరింట;
గొయ్యి, goyyi
-n.
--(1) pit; deep pit; hole in the ground;
--(2) grave; (rel.) నుయ్యి = well;
---ఎవరు తీసుకొన్న గోతిలో వాళ్లే పడతారు = one falls victim for ones own treacherous plots; hoist with ones own petard.
గొరక, goraka
-n.
--(1) thick iron wire; thin iron rod;
--(2) any heavy-duty long splinter;
---గొరక చీపుళ్లు = heavy-duty broom made from the spines of coconut leaves. --sheep;
గొరపం, gorapamu
-n.
--heavy-duty brush used to groom horses; brush;
గొరిల్లా, gorillA
-n.
--gorilla; a large monkey-like animal with strong human features;
గొలుకు, goluku
-v. t.
--(1) scribble;
--(2) bug; pester; bother;
గొలుకుడు, golukuDu
-n.
--scribble; scrawl;
గొలుసు, golusu
-n.
--chain;
గొలుసుకట్టు రాత, golusukaTTu rAta
-n.
--cursive writing;
గొళ్లెం, goLleM
-n.
--chain-latch; bolt for a door;
గోకర్ణం, gOkarNaM
- n.
-- a serving dish in the shape of a cow's ear; a serving utensil with a spout in the shape of a beak to facilitate pouring; use of this vessel and the name are gradually going out of use;
గోంగూర, gOMgUra
-n.
--kenaff; mesta; sorella; roselle plant; Deccan Hemp; Bhimilipatam jute; [bot.] Hibiscus cannabinus; Hibiscus sabdariffa of the Malvaceae family; see also గోగు;
-- a leafy vegetable popular in Andhra region;
---పుల్ల గోంగూర = ఎర్ర గోంగూర = red sorella; [bot.] Hibiscus sabdariffa; ఎరుపు రంగు కాండం, ఎరుపు పువ్వులు మరియు చిన్న చిన్న తమ్మెలు కలిగిన ఆకులతో వుంటుంది. పచ్చళ్ళకు, కూరలకు దీనినే ప్రధానంగా ఎంచుకుంటారు.
--- మంచిగోంగూర = Kenaf; [bot.] Hibiscus Cannabinus; పులుపు తక్కువగా వుండే గోంగూర; దీనిలో ఎరుపు లేదా ఆకుపచ్చ కాండం, మరియు క్రీమ్ పువ్వులు ఉన్నాయి. ఆకులు పొడవాటి తమ్మెలను కలిగివుంటాయి.
---ధనాసరి గోంగూర = red sorella.
---సీమ గోంగూర = roselle plant.
--- గోగునార = BhimilipataM jute; Deccan hemp;
---[Sans.] పీలుః; ఉష్ణప్రియా; నాళిత; [Hindi] అంబారీ;
---[Notes] గోంగూర రక్తవృద్ధికి పేరొందిన ఆకుకూర. గోగు పూల రసంలో పంచదార, మిరియాల పొడి కలుపుకుని తాగితే కాలేయ సంబంధిత వ్యాధులు నయమౌతాయి. గోంగూర ఉడికించి, ఆముదం కలిపి సెగగడ్డల మీద కట్టుకడితే అవి పక్వానికొచ్చి పగుల్తాయి.
---ముదిరిన గోగు మొక్కలను నీటిలో నానబెట్టి నార తీస్తారు. గోగు నార (Kenaf Hemp) ను గోనె సంచుల తయారీలో వాడతారు. పాడి పశువులకు గోంగూర మేపితే అవి పుష్కలంగా పాలు ఇస్తాయి. గోగు విత్తులను పశువుల దాణాలో కలుపుతారు. గోగు గింజలను కొందరు వీర్యవృద్ధికి నేతిలో వేయించి చూర్ణంచేసి తేనెతో కలిపి తింటారు. ఈ విత్తుల నుంచి తీసే పసుపు పచ్చని, వాసనలేని నూనె కందెన (lubricant) గానూ, దీపాలు వెలిగించడానికి కూడా వాడతారు. ఆ నూనెను సబ్బులు, పెయింట్లు, వార్నిష్ ల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
గోకు, gOku
-v. t.
--(1) scratch;
--(2) scribble;
- n.
-- వెన్న కాచి నెయ్యి చేసినప్పుడు గిన్నె అడుగున మిగిలిన మాడు సరుకు;
గోగునార, gOgunAra
-n.
-- the fiber from sorella plant; Indian hemp; Kenaf hemp; BhImilipatnaM jute;
గోచరం, gOcaraM
-adj.
--perceptible; gained from sense organs;
---కర్ణగోచరం = audible.
---దృగ్గోచరం = visible.
గోచరించు, gOcariMcu
-v. t.
--appear;
గోచరి, gOcari
-n.
--sensor; an instrument to sense our surroundings; % put this in e-2-t
గోచారం, gOchAraM
- n.
-- (1) path of a planet; movement of a planet; (2) [astrol] current state of planets relative to their positions at the time of the birth of an individual;
-- మీ జన్మ నక్షత్ర/నామ నక్షత్ర రాశి నుండీ లెక్కించ్చినపుడు నవ గ్రహాలు ప్రస్తుతం (మనం జాతకానికి గోచారం చూడాలని అనుకున్న రోజుకు) ఎక్కడెక్కడ ఉన్నాయో దానినే 'గోచారం' అని పిలుస్తారు. ఉదాహరణకి, అశ్వని జన్మ నక్షత్రంగా గల వ్యక్తి రాశి మేషం. ఈ మేష రాశి నుంచీ ఈ రోజు (అంటే, 14 ఆగస్టు 2022 న) ఏ గ్రహం ఎక్కడ ఉన్నదో లెక్క వేస్తే ఇక్కడ చూపిన విన్యాసం వస్తుంది: మేషంలో రాహువు, వృషభంలో కుజుడు, మిథునంలో ఏ గ్రహమూ లేదు, కర్కాటకంలో శుక్రుడు, రవి, సింహంలో బుధుడు, కన్యలో ఏ గ్రహమూ లేదు, తులలో కేతువు, వృశ్చికంలో ఏ గ్రహమూ లేదు, ధనుస్సులో ఏ గ్రహమూ లేదు, మకరంలో శని, కుంభంలో చంద్రుడు, మీనంలో గురువు. ఈ సమాచారమే అంటే.
గోచి, gOci
-n.
--G. string; a truss or flap; waist cloth; a narrow strip of cloth, worn by men between the legs, just to cover the genitals;
గోచిపాతరాయుడు, gOcipAtarAyuDu
-n.
--(1) a celibate student;
--(2) an un-accomplished individual; (lit.) one who just wears a G. string; in ancient India celibate students just wore the G. string;
గోచికట్టు, gOcikaTTu
-n.
--a style of wearing a dhoti or saree; here a portion of the cloth is taken from front to back; between the legs, pleated, and then tucked into the waistband at the back;
గోటీబిళ్ల, gOTIbiLLa
-n.
--bat and pellet; Indian cricket; a childrens game involving the hitting of a small wooden pellet with a stick;
గోడ, gODa
-n.
--wall;
---ప్రహరీగోడ = compound wall.
గోడకుర్చీ, gODakurchee
- n.
-- a type of punishment meted out to children in elementary schools in which the child is made to sit in an imaginary chair by resting his back against a wall;
గోడు, gODu
-n.
--peeve;
---ఎవడి గోడు వాడిది = every one has his (her) pet peeve.
గోత్రం, gOtraM
-n.
--lineage; source; origin; group; (of a family); there are innumerable lineages and it is impossible to list them all; one normally tells one's lineage by listing one, two, three or five ancestral sages;
-- In India people belonging to the same lineage are prohibited to marry each other;
-- (1) పాణిని వ్యాకరణ ప్రయోజనాల కోసం గోత్రాన్ని "అపత్యం పౌత్రప్రభృతి గోత్రం" (IV. 1. 162)అని నిర్వచించాడు, దీని అర్థం "గోత్ర అనే పదం కుమారుని కుమారునితో ప్రారంభమయ్యే సంతానాన్ని (ఒక ఋషి యొక్క) సూచిస్తుంది." ఒక వ్యక్తి "నేను కౌశిక-గోత్రం" అని చెప్పినప్పుడు, నేను నా సంతతికి చెందిన పురాతన ఋషి కౌశిక లేదా విశ్వామిత్రుని నుండి అవిచ్ఛిన్నమైన పురుష సంతతి ద్వారా గుర్తించబడతానని అర్థం. కాని దీనికి విరుధ్ధమైన వాదం కూడా ఉంది;
-- (2) ఒకప్పుడు మనందరిదీ వ్యావసాయిక సమాజం. అప్పుడు సమాజంలో అందరికీ తమతమ గోవుల మందలు ఉండేవి. గోవులు అనే మాటను ఆవులు, ఎద్దులకు కలిపి వాడతారనేది తెలిసిందే. ఒకే మందలోని గోవులు గనుక జతకడితే, ఆ జాతి క్రమంగా క్షీణించిపోయే ప్రమాదం ఉన్న కారణంగా, వేర్వేరు మందలలోని గోవులను జతకట్టించేవారు. దీనివల్ల జన్యుపరంగా కూడా ఆ జాతి వృద్ధి పొందేది. కనుక, ఏ గోవు ఏ మందలోదో తెలుసుకోవటం అవసరంగా ఉండేది. అందుకే, ఒక్కొక్క గోవుల మందకు, ఒక్కొక్క పేరుండేది. సాధారణంగా, ఆ మందకు నాయకత్వం వహించే వారి పేరుమీదుగా ఆ మందను వ్యవహరించటం పరిపాటి. అలా, ఏ గోవును చూసినా, అది ఏ మందకు చెందిందో తెలుసుకోవటం సులభంగా ఉండేది. ఆ పద్ధతిలోని ప్రయోజనాలను గుర్తించి, వాటిని క్రమంగా మనుషులకూ వర్తింపజేయటంతో, మనుషులు సైతం 'ఫలానా గుంపు'లోకి చెందినవారని గుర్తించటం ఆరంభమయింది. ఆ 'ఫలానా గుంపు' క్రమంగా 'గోత్రం' అయి ఉండవచ్చు.
-- 1. వంశం, 2. గుంపు, సమూహం, 3. పేరు, 4. గొడుగు, 5. బాట;
గోతము, gOtamu
- n.
-- a sac; a bag; a gunny-bag; a bag made of jute fiber;
గోతులు, gOtulu
-n.
--pits; excavations;
గోదం, gOdaM
-n.
--(1) brain;
--(2) [comp.] memory or storage;
గోమేధికం, gOmEdhikaM
-n.
--agate; topaz; a pale blue, pale green, yellow or white semi-precious stone with a striped or cloudy coloring; a silicate of Aluminium and Fluorine;
గోరింక, gOriMka
-n.
--myna bird;
-- సాధారణ గోరింక = common myna bird; [bio.] Acridotheres tristis of the Sturnidae family;
-- మాట్లాడే గోరింక = talking myna; Grackle; hill myna; [bio.] Gracula religiosa of the Sturnidae family;
-- గోరువంక; [Sans.] శారికా;
గోరింట, gOriMTa
-n.
-- henna; [bot.] Acacia intsia; Lawsonia inermis;
-- గోరింటాకులో లాసోన్ (హెన్నోటానిక్ యాసిడ్) (Lawsone; hennotannic acid (2-hydroxy-1,4-naphthoquinone) అనే ఎర్రటి పదార్థం ఉంటుంది. ఇది ఆకు నలిపినప్పుడు బయటకు వస్తుంది.ఈ పదార్థానికి కొన్ని ప్రోటీన్లను అతుక్కునే గుణం ఉంటుంది, ఇదొక రసాయన చర్య. లాసోన్, చర్మం లో ఉన్న కెరాటిన్ ( జుత్తులో కూడా కేరాటిన్ ఉంటుంది) అనే ప్రోటీన్ తో రసాయనం గా కలిసి ఎర్ర గా కనిపిస్తుంది. ఈ కేరాటిన్కి అతక్కునే ప్రక్రియను ఆంగ్లంలో Michel addition రియాక్షన్ అంటారు.
-- [Note] ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారంగా మారింది. దీని వెనుక పలు కారణాలున్నాయి. ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని వుంటుంది. ఆషాడంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుది. కాబట్టి అనారోగ్యాలు తప్పవు. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే ఆషాడంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు చెప్పడమే కాకుండా డాక్టర్లు కూడా చెప్తున్నారు.
గోరుచిక్కుడు, gOrucikkuDu.
-n.
-- cluster beans; field vetch; guar; [bot.] Cyamopsis tetragonoloba; Cyamopsis psoralioides of the Fabaceae family;
--(note) guar gum, an emulsifier, is made from the mature seeds of this plant;
--[Sans.] బకుచీ; గోరక్షా ఫలినీ; గోరాణీ; క్షుద్ర శింబీ;
గోరుచుట్టు, gOrucuTTu
-n.
--whitlow; fleon; an infection of the bed of the finger or toenail;
గోరువెచ్చ, gOruvecca
-n.
--lukewarm;
గోరోజనం, gOrOjanaM
-n.
--(1) ox gall; gallstone; serpent stone;
--(2) same as గోరోచనం = బెజోవార్ = bezoar; a hard mass such as a stone or hair-ball in the stomach of ruminants, once believed to have medicinal properties;
--(3) an yellow orpiment (auri + pigment) or a yellow-colored pigment; Arsenic trisulfide; As2S3;
--(4) fat;
--(5) arrogance; pride; uppityness; గర్విష్టివాళ్ళని "వీడికి గోరోజనం ఎక్కువరోయ్" అనడం వినే ఉంటారు.
-- (Note) దీనివలన "మగతనానికి" సంబంధించిన సమస్యలు నివారించబడతాయని అంటారు. శృంగారపరంగా మగవారికి ఉపయోగపడుతుందని కూడా అంటారు. అందువల్ల, మాటిమాటికి మగతనం మగతనం అంటూ విర్రవీగే వారిని, నాకంటే పెద్ద మగాడు లేడని గొప్పలు చెప్పుకునే వారిని, లేదా కొంచెం బలుపుగా మాట్లాడే వారిని "నీకు గోరోజనం కొంచెం ఎక్కువైందిరా" అని మందలిస్తూ ఉంటారు.
--(Note) Some say the mineral should be called గోరోచనం, because రోచన means "shining" and గోరోచనం means yellow shining substance from a cow;
--(Note) Natural gallstones are obtained from cows (ox). Synthetic stones are manufactured by using the juice from the gallbladder as a raw material;
--(Note) This is believed to have anti-spasmodic properties; In the Iliad, the Greek physician Machaon uses this to treat the warrior Philoctetes who suffered from a snake bite;
గోరోజనామ్లం, gOrOjanAmlaM
-n.
--fatty acid;
గోల, gOla
-n.
--noise; commotion; disturbance;
గోలాంగూలం, gOlAMgUlaM
-n.
--lion-tailed monkey;
గోళం, gOLaM
-n.
--sphere; orb; a suffix to any of the planetary names;
గోళాకార, gOLAkAra
-adj.
--spherical;
గోళీయం, gOLIyaM
-n.
--spheroid;
గోళీలు, gOLIlu
-n. pl.
--marbles; small glass spheres used by children in games;
గోళ్లు, gOLlu
-n. pl.
--(1) nails; finger nails; toe nails;
--(2) claws;
గోవ, gOva
-n.
--scaffolding;
గోవర్ధనం, gOvardhanam
- n.
-- a flowering plant;
-- see also గరుడవర్ధనం; నందివర్ధనం;
గోషా, goshA
-adj.
-- pertaining to women;
---గోషా ఆసుపత్రి = women's hospital.
-n.
--the custom of keeping women under viel;
గోష్పాదం, goOshpAdaM
-n.
-- tuft of hair left on a tonsured head; (lit.) a cow's hoof;
-- పిలక;
గౌరవం, gauravaM
-n.
--respect; honor; (lit.) treating someone with respect;
గౌరీమనోహరి, gaurImanOhari
-n.
--Rangoon creeper; Chinese honeysuckle; [bot.] Quisqualis indica; Combretum indicum of the Combretaceae family;
--This creeper, like all lianas, attaches itself to trees in the wild and creeps upwards through the canopy in search of the sun. In the home garden, Quiqualis (means, what is this?) can be used as an ornamental over arbors or gazebos, on trellises; With some supportive structure, the plant will arch and form large masses of foliage.
గౌరుకాకి, gaurukAki
-n.
--gull; a sea-bird;
గౌళగాత్రం, gauLagAtraM
- n.
-- big voice; loud voice; high decibel voice; harsh voice;
Part 3: ఘం - ghaM
ఘంటాపథం, ghaMTApathaM
-n.
--Royal road; నిస్సందేహమగు మార్గము; పది విల్లుల వెడల్పు గల రోడ్డు;
ఘంటాపథంగా, ghaMTApathaMgA
-adv.
--definitely; emphatically; without a doubt;
ఘంటారావం, ghaMTArAvaM
- n.
--sound of a bell;
ఘంటిక, ghaMTika
- n.
-- (1) a small bell; (2) epiglottis;
Part 4: ఘ - gha
ఘటం, ghaTaM
-n.
--(1) a pot made out of clay;
--(2) an earthenware pot used as a musical instrument, an art made popular by SrI Kolamka Venkataraju of Tuni;
--(3) (electrical) cell; container of electricity;
--(4) person; individual; body; character; container of soul;
---మొండి ఘటం = obstinate character.
ఘటన, ghaTana
-n.
--(1) happening; occurrence;
--(2) dispensation; the will of God;
--(3) facilitation;
ఘటమాల, ghaTamAla
-n.
--[phy.] battery; (lit.) a string of cells;
ఘటశాసి, ghaTaSAsi
-n.
--logician; an expert in logic; an umpire in logic;
ఘట్టయంత్రం, ghaTTayaMtraM
-n.
--water wheel; a wheel with buckets to lift water;
ఘట్టం, ghaTTaM
-n.
--(1) stage; phase;
--(2) the edge of a pool or river;
-- (3) toll booth;
-- ఘట్ట కటికా న్యాయం = ఎంత ప్రయత్నం చేసినా కష్టమే మిగులుతుంది తప్ప ఖర్చు తప్పించుకోలేం అన్న హెచ్చరిక;
ఘటికుడు, ghaTikuDu
-n. m.
--competent person; expert hardened with experience; stalwart;
ఘటిల్లు, ghaTillu
-v. i.
--happen; occur;
ఘటీగణితం, ghaTIgaNitaM
-n.
--modulo mathematics; modulo arithmetic; When we divide an integer A by an integer B we will have an equation that looks like the following:
A/B = Q with R as remainder. Sometimes, we are only interested in what the remainder is when we divide A by B.
For these cases, there is an operator called the modulo operator (abbreviated as mod).
Using the same A, B, Q, and R as above, we would have: A mod B = R;
ఘటీయంత్రం, ghaTIyaMtraM
-n.
--clockwork;
ఘడియ, ghaDiya
-n.
--time measure in Hindu calendar; approx. 24 minutes;
--sixtieth part of a day;
-- 1 రోజు = 60 ఘడియలు; 1 ఘడియ = 60 విఘడియలు = 24 నిమిషాలు;
--షష్టి ఘడియలు = 24 గంటలు = రోజల్లా
ఘనం, ghanaM
-n.
--(1) solid;
--(2) cube;
--(3) great; grand;
--(4) extinguishing;
---ఘన పరిమాణం = volume.
---పిట్టకొంచెం, కూత ఘనం = bird is small, but the call is loud.
---దీపం ఘనమవనీయకు = do not let the lamp get extinguished.
ఘనకార్యం, ghanakAryaM
-n.
--heroic deed;
ఘనత, ghanata
-n.
--greatness;
ఘనపదార్థం, ghanapadArthaM
-n.
--solid matter;
ఘనపరిమాణం, ghanaparimANaM
-n.
--volume; a measure of space occupied by an object;
ఘనపుటడుగు, ghanapuTaDugu
-n.
--cubic foot; the space occupied by an object of length, widtghe and depth of 1 foot each;
ఘనమూలం, ghanamUlaM
-n.
--cube root; the cube root of 27, for example, is 3 because 27 is obtained my multiplying 3 x 3 x 3;
ఘనాపాఠీ, ghanApAThI
-n.
--(1) an expert in the Vedas; వేదమును చదవడానికి 'పద పాఠము' తో మొదలై 'ఘన పాఠము' వరకు మొత్తం 11 పద్దతులు వుంటాయి. అవి ఒకదానికంటే ఒకటి కష్టతరమైనవి. అన్నింటిలో ఆఖరిదైన 'ఘనము' అనే పద్దతి వరకూ నేర్చుకున్నవారిని 'ఘనపాఠి' అంటారు. ఈ పద్ధతిలో వేదాన్ని నేర్చుకోవాలంటే కనీసం ఒక వెయ్యిసార్లు అయినా పఠించాలి;
--(2) an expert;
-- అపారమైన ప్రతిభాసంపత్తి కలిగినవారు అని ఎవరినయినా పొగడాలనుకున్నప్పుడు మన తెలుగు పత్రికలవారు వాడుతున్న పదాలు ఘనాపాఠి లేదా ఘనాపాటి.
ఘనీభవన స్థానం, ghanIbhavana sthAnaM
-n.
--freezing point; the temperature at which a liquid freezes; for example, the freezing point of water is 32 degrees F or 0 degrees C;
ఘనీభవించు, ghanIbhaviMcu v.i.
-v. t.
--freeze; solidify;
ఘర్మం, gharmaM
-n.
--sweat;
ఘరానా, gharAnA
- adj.
-- (1) good at doing bad things; (2) related to a house; ఉత్తర భారతంలో ఒక సంగీత కళాకారుడు ఘరానా గాయకుడు అంటే ఒక స్థిరపడిన సంగీత సంప్రదాయానికి చెందిన వాడు అన్న అర్థమే కాకుండా పేరుమోసిన గాయకుడు అన్న అర్థాల్లో వాడుతారు;
ఘృతం, ghRtaM
-n.
--ghee; clarified butter;
ఘాటీ, ghATI
-n.
--(1) hill pass;
--(2) police station;
ఘాటీ రోడ్డు, ghATI rODDu
-n.
--a winding road through a hill pass;
ఘాతకుడు, ghAtakuDu
-n. m.
--destroyer; tormentor; villain;
---విశ్వాస ఘాతకుడు = one who destroyed the trust.
ఘాతకురాలు, ghAtakurAlu
-n. f.
--destroyer; tormentor;
ఘాతాంకం, ghAtAMkaM
-n.
--[math.] exponent; power;
ఘాతీయ, ghAtIya
-adj.
--[math.] exponential;
ఘాతీయ పద్ధతి, ghAtIya paddhati
-ph.
--[math.] exponential notation; for example, 1,000,000 in exponential notation can be written variously as 10e6, 10^6 or 106;
ఘ్రాణేంద్రియం, ghrANEMdriyaM
-n.
--sense of smell;
ఘుమఘుమ, ghumaghuma
-adj.
--redolent; flavorful; onomatopoeia for a fragrant substance as in ఘుమఘుమ లాడు;
ఘృతం, ghRtaM
-n.
--ghee; melted butter; fat;(
ఘృతార్థం, ghRtArthaM
-n.
--[chem.] steroid; (ety.) ఘృతం వంటి పదార్థం;
ఘృతాల్, ghRtAl
-n.
--[chem.] sterol; alcohol of the steroid family;
ఘృతికామ్లం, ghRtikAmlaM
-n.
--[chem.] stearic acid; Stearic Acid is a saturated long-chain fatty acid with an 18-carbon backbone. Stearic acid is found in various animal and plant fats; C18H36O2 or CH3(CH2)16COOH;
ఘోష, ghOsha
-n.
--(1) loud cry; lamentation; loud sound; amplified sound; (2) a village where cowherds live;
-- వేద ఘోష = sound of Veda recitation;
-- ఘోష స్త్రీ = milkmaid;
-- ఘోష యాత్ర =
-- ఘోషాసుపత్రి = a hospital specializing in Ob & Gyn;
-- గొల్లవారుండే పల్లె ప్రాంతాన్ని "ఘోష" అంటారు. వీరున్న చోట పశుసంపద ఉండి, అవి శబ్దం చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ పేరు వచ్చిందట.