This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
American spelling is used throughout.
There is no clearly established, standardized alphabetical order in Telugu. The justification for the scheme used here would be too long for discussion here.
16 March 2016.
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Part 1: కం - kaM
కంకణం, kaMkaNaM
-n.
--(1) bracelet;
--(2) bangle;
--(3) a bracelet worn on the wrist or ankle as a mark of taking a vow;
కంకణం కట్టుకొను, kaMkaNaM kaTTukonu
-ph.
-- take a vow; commit oneself to a task;
కంకర, kaMkara
-n.
--gravel; road metal; (esp.) the stones used in road building; Gravel often has the meaning a mixture of different size pieces of stone mixed with sand and possibly some clay;
కంకాళం, kaMkALaM
-n.
--skeleton;
కంకి, kaMki
-n.
--ear of grain; seedhead;
కంఖాణి, kaMkhANi
-n.
--a horse of good pedigree; an Arabian horse;
కంగారు, kaMgAru
-n.
--(1) agitation; anxiety; confusion;
--(2) kangaroo; a marsupial native to Australia;
కంగుతిను, kaMgutinu
-v. i.
--lose; take a loss; get defeated; get humiliated; get embarrased;
కంగుమను, kaMgumanu
-v. i.
--produce a clangy metallic sound;
కంచం, kaMcaM
-n.
--dinner plate; (lit.) plate made out of bronze; కంచుతో చేసినది కనుక కంచం;
కంచరం, kaMcaraM
-n.
--carriage; cart;
కంచర, kaMcara
-adj.
--hybrid;
కంచర గాడిద, kaMcara gADida
-n.
--mule; (lit.) hybrid donkey; the offspring of a mare and a jackass; (ety.) this word probably came about because mules are mostly used to carry goods or pull carts;
కంచు యుగం, kaMcu yugaM
-n.
--bronze age; the period of time between stone age and iron age; circa 4000 B. C. E;
కంచి, kaMci
-n.
--short for కాంచీపురం, a holy place in South India;
కంచి గరుడ సేవ, kaMci garuDa sEva
-ph.
--[idiom] futile effort; unrecognized effort;
-- కంచి గరుడ సేవ అంటే వృథా నిరీక్షణ; పెద్దగా ఉపయోగం లేని పని, బండ చాకిరి లాంటిది చేసి దాని నుండి ఏమాత్రం లాభం, ఫలితం లేకపోతే అలాంటిదాన్ని "కంచి గరుడ సేవ" అని అనడం జనవ్యవహారం లోకి వచ్చింది. దీని వెనుక కథ: కంచిలో వరదరాజస్వామికి విపరీతంగా అలంకారం చేస్తారు. దీనికి బాగా సమయం పడుతుంది. అంతకు చాలాసేపటికి ముందే గరుడ వాహనాన్ని తీసుకువచ్చి రాజగోపురం ముందు నిలుపుతారు. ఆ తరవాత రెండు మూడు గంటలకు అలంకారంతో ఉన్న ఉత్సవమూర్తిని తెచ్చి వాహనం ఎక్కిస్తారు. అంతసేపూ గరుత్మంతులవారు అలా నిరీక్షిస్తూ ఉంటారు. అలా ఎందుకు చాలాముందే గరుడుని తెచ్చి, వీధిలో పెట్టటం అంటే, ప్రసార సాధనాలు లేని ఆ రోజుల్లో ఉత్సవం మొదలు కాబోతుందని జనానికి తెలిసి, ఆ వార్త ఊరంతటా పాకి, ఉత్సవంలో విశేష ప్రజానీకం చేరటానికి.
కంచె, kaMce
-n.
--fence; hedge; a fence made out of thorny material; a living fence;
కంటి, kaMTi
-adj.
--related to the eye; possessive form of కన్ను;
కంటికంత, kaMTikaMta
-n.
--eye-hole; eyelet; a small hole in a front door that permits people inside to see who is outside;
కంటికటకం, kaMTikaTakaM
-n.
--lens in the eye;
కంటిపాప, kaMTipApa
-n.
--pupil in the eye;
కంటిరెప్ప, kaMTireppa
-n.
--eyelid;
కంటె, కన్న, kaMTe, kanna
-p.p.
--than; rather than; other than;
-n.
--(1) collar;
--(2) an ornament in the shape of a ring worn by women around their neck;
కంఠతాపట్టు, kaMThatApaTTu
-v. t.
--to learn by heart; to commit to memory;
కంఠమణి, kaMThamaNi
-n.
--Adam's apple;
కంఠశోష, kaMTha SOsha
-n.
--strain to the throat; used to refer to strain caused by talking with no useful result; unproductive talk;
కంఠసర్పి, kaMThasarpi
-n.
--diphtheria; Diphtheria is a serious infection caused by strains of bacteria called Corynebacterium diphtheriae that make toxin (poison). It can lead to difficulty breathing, heart failure, paralysis, and even death;
కంఠాణి, kaMThANi
-n.
--awl; a sharp stout needle useful to make holes through leather or stacks of paper;
కంఠ్యాచ్చులు, kaMThyAcculu
-n.
--[phonet.] back vowels; vowels uttered from the back of the throat;
కంఠోష్ట్యములు, kaMThOshTyamulu
-n.
--[phonet.] glotto-labials; a type of vowel sound used in some spoken languages;
కండ, kaMDa
-n.
--(1) muscle; biceps;
--(2) meat of a fruit;
--(3) hardened sugar;
కండకావరం, kaMDakAvaraM
-n.
--arrogance;
కండపుష్టి, kaMDapushTi
-n.
--muscle strength;
కండబలం, kaMDabalaM
-n.
--strength of the biceps; ability to fight;
కండరం, kaMDaraM
-n.
--muscle;
కండ్లకలక, kaMDlakalaka
-n.
--conjunctivitis; a contagious infection of the eye;
కండువా, kaMDuvA
-n.
--shoulder cloth; a towel-like upper garment typically worn by men on their shoulder;
కండ్లు, kaMDlu
-n. pl.
--eyes;
కంత, kaMta
-n.
--slit; small hole; eyelet; aperture;
కంతి, kaMti
-n.
--(1) bump; swelling caused by a bruise;
--(2) tumor;
కందం, kaMdaM
-n.
--a type of poetic meter;
కంద, kaMda
- n.
-- corm; elephant-foot yam; [bot.] Amorphophallus campanulatus of the Araceae family; Typhonium orixenese;
-- గ్రీకు భాషలో ‘ఎమార్ఫోస్' అంటే ‘ ఒక నియమిత ఆకారం లేని' అని అర్థం. ‘గంట ఆకారంలో ఉన్న’ దీని పుష్ప గుచ్ఛాన్ని బట్టి దీనికి ‘కాంపాన్యులేటస్’ అనే పేరు వచ్చింది;
-- కందలో తీట కంద, తియ్య కంద అని రెండు రకాలున్నాయి. తీట కంద గడ్డ (Corm) అర్ధ గోళాకారంలో, ముదురు గోధుమ వన్నెలో నున్నగా ఉంటుంది. దాన్ని చిన్నచిన్న ముక్కలుగా కోసి నేలలో పాతిపెడితే ప్రతి ముక్క నుంచి మొక్క మొలుస్తుంది. తీట కందలోని దురద దాన్ని ముక్కలు కోసి నీళ్ళతో వండి పారవంచితే పోతుంది. అప్పుడే తవ్వి తీసిన తీట కంద గడ్డలు మరింత దురదగా ఉంటాయి. వాటిని కొంతకాలం నిల్వ ఉంచితే వాటిలోని దురద కొంతమేరకు తగ్గుతుంది.ఇక తియ్య కంద గడ్డకు మొత్తం ఒళ్లంతా కాయల్లా చిన్న గడ్డలుంటాయి. ఈ చిన్న గడ్డల్ని పిల్ల గడ్డలు (Cormels ) అంటారు. పాతిపెట్టిన ఇలాంటి ప్రతి చిన్న గడ్డ నుంచీ ఒక తియ్య కంద మొక్క మొలుస్తుంది.
-- కంద దుంపలో ఉండే కాల్షియం ఆగ్జలేట్ (Calcium Oxalate) అనే రసాయనిక పదార్ధం కారణంగా పచ్చి కంద తింటే, నోటిలోనూ గొంతులోనూ విపరీతమైన వికారంతో కూడిన దురద వస్తుంది. తియ్య కందలో ఈ దురద కలిగించే స్వభావం తక్కువగా ఉంటుంది. తీట కందలో దురద ఎక్కువ. ఇక అడవి కందలోనైతే దురద విపరీతం;
-- వజ్ర కంద = వన కంద = అడవి కంద = [bot.] Amorphophallus sylvaticus is poisonous but has medicinal uses;
-- [Sans.] సూరణ; అర్శోఘ్న; -- తీటకంద; తియ్యకంద; వజ్రకంద; వనకంద;
--[Sans.] సూరణ; అర్శోఘ్న; కన్‌ద;
కందకం, kaMdakaM
-n.
--moat; a wide; water-filled trench around fortifications;
కందమూలములు, kaMdamUlamulu
-n. pl.
--roots and tubers; typically, edible stuff found under the soil;
కందరం, kaMdaraM
-n.
--cave;
కందలి, kaMdali
- n.
-- [bot.] Musa superba; the tree bears red flowers only after the ground has been moistened by monsoon rains;
కందాయం, kaMdAyaM
-n.
--trimester; a duration of four months, a term widely used in astrology;
కంది, kaMdi
-adj.
--red gram; pigeon pea; Congo pea; toor dal; a kind of lentil used in soups; [bot.] Cajanus cajan; Cajanus indicus;
-- [Sans.] అఢకీ; తువరీ;
కందిగుండ, kaMdiguMDa
-n.
--a spicy powder made from lightly fried red gram; this powder is mixed with rice and eaten;
కందిచేను, kaMdicEnu
-n.
--field of red gram crop;
కందిపప్పు, kaMdipappu
-n.
--split red gram; toor dal;
కంపచెట్టు, kaMpacheTTu
-n.
-- [bot.] Prosopis juliflora of the Fabaceae family; a kind of mesquite;
-- The seeds were received from Jamaica and sown in South India during 1877. While various species of Prosopis were introduced at the time, P. juliflora has spread over large areas in most of the arid and semi-arid regions of India; This has become an invasive weed in several countries where it was introduced. It is considered a noxious invader in Ethiopia, Hawaii, Sri Lanka, Jamaica, Kenya, the Middle East, India, Nigeria, Sudan, Somalia, Senegal, South Africa, Namibia, and Botswana. It is also a major weed in the southwestern United States. It is hard and expensive to remove as the plant can regenerate from the roots;
-- ఫారం చెట్టు;
కక్కి, kakki
-n.
--aunt; mother’s younger sister;
-- (note) పిన్ని is wife of father's younger brother;
కకుభ, kakubha
- n.
-- [bot.] Termilania arjunaof the Combretaceae family;
--this tree produces clusters of flowers at the end of hot season; The arjuna is one of the species whose leaves are fed on by the Antheraea paphia moth which produces the tassar silk, a wild silk of commercial importance;
-- తెల్ల మద్ది;
కక్ష్య, kakshya
-n.
--(1) thread worn around the waist;
--(2) orbit; trajectory;
కచ్చ, kacca
-n.
--(1) crotch, the junction whence the legs separate from the torso;
--(2) the end of the traditional lower garment of Indian men or women that goes between the legs;
కచ్చడం, kaccaDaM
-n.
--(1) garter belt; a belt with elastic suspenders used by women as underwear;
--(2) loin-cloth;
-- (ety.) కచ్చ + అడ్డం = కచ్చకి అడ్డంగా ఉన్నది;
---ఇనప కచ్చడం = chastity belt.
కచిక, kacika
-n.
--ash of burned cow-dung; this ash is often used as a tooth powder;
కచికపదం, kacikapadaM
-n.
--palindrome; any word or phrase that reads the same both forward and backward. "Able was I ere I saw Elba" is a well known palindromic sentence. "Malayalam" is the longest known palindromic word (though a proper noun) in English. There are palindromic poems in Telugu;
-- same as భ్రమకం;
కచ్చితం, kaccitaM
-adj.
--exact; strict;
కచ్చూరం, kaccUraM
-n.
--round zedoary; an aromatic root from the turmeric family; [bot.] Curucuma zedoaria;
-- same as కచోరము
కట్టకడలు, kaTTakaDalu
-n. pl.
--the dots and dashes of telegrahic Morse Code;
కట్టడం, kaTTaDaM
-n.
--(1) structure;
--(2) building;
---అయిఫిల్ టవరు పేరిస్‌లో ముఖ్యమైన కట్టడం = the Eiffel Tower is an important structure in Paris.
కట్టడి, kaTTaDi
-n.
--(1) structure; construction;
--(2) discipline; rule; restriction;
---రక్తచందురపు బణువు యొక్క కట్టడి చాలా క్లిష్టమైనది = the structure of the hemoglobin molecule is very complex.
కట్టలాణి, kaTTalANi
-n.
--Khatlan horse; a black horse with a white mane and tail;
కట్నం, kaTnaM
-n.
--(1) a cash gift; 'కట్నం' అన్నది ఒక కానుక లేక బహుమతి. సాధారణంగా తక్కువ స్థాయిలో ఉన్నవారు ఎక్కువ స్థాయిలో ఉన్నవారికి సమర్పించుకొనేది కట్నం. సామంత రాజులు చక్రవర్తికి, ఉద్యోగులు అధికారికి ఇచ్చే బహుమతిని కట్నం అనొచ్చు. అలాగే పెళ్లికూతురి తండ్రి వరునికి ఇచ్చుకొనే సొమ్ము, కానుకలు 'వరకట్నం' అయింది; కనుక వరకట్నం ఎంత ఇచ్చినా అది ఆ మగవాడి 'ఎంటైటిల్మెంట్' అవుతుంది కానీ అతడు అమ్ముడు పోయినట్లు కాదు; see also శుల్కం;
--(2) dowry; often, the dowry paid by a girl's parents to a boy at the time of the wedding; can also mean the fee paid by a boy to get a girl, but this practice is no longer in vogue;
--(3) award; typically a cash award given for display of talent or scholarship;
కట్లపాము, kaTlapAmu
-n.
--Russell's viper; banded krait; a venomous snake with black stripes;
కట్ఫల వృక్షం, kaTphala vRkshaM
- n.
-- [bot.] Myrica nagi;
కటాక్షం, kaTAkshaM
-n.
--grace; favorable look;
కట్రాయి, kaTrAyi
-n.
--(1) a flagged floor; a floor paved with stones;
--(2) any natural geological formation that looks like a flagged floor;
కట్టిటిక, kaTTiTika
-n.
--cobbled floor; cobbled pavement; a floor paved with bricks;
కట్టిపెట్టు, kaTTipeTTu
-v. t.
--(1) bring under control; close;
--(2) build; construct something on behalf of someone;
కటిక, kaTika
-adj.
--(1) raw; green; unripe; unaltered; unadorned;
--(2) total; complete;
---కటిక కాయ = raw, green fruit.
---కటిక చీకటి = pitch darkness.
---కటిక దరిద్రుడు = downright pauper.
---కటిక పచ్చడి = chutney made from raw, unsoaked pulses.
---కటిక నేల = bare floor; bare ground.
కటుక రోహిణి, kaTuka rOhiNi
-n.
--black hellebore; Piccorriza; [bot.] Picrorriza kurroa;
-- a small, hairy, perennial medicinal herb with woody rhizomes;
-- కుటికి;
కటువు, kaTuvu
-adj.
--harsh; pungent;
కటుకరోహిణి, kaTukarOhiNi
- n.
-- black hellebore; [bot.] Helleborus niger; Helleborus argutifolius; Helleborus foetidus – stinking hellebore or setterwort;
-- కటురోహిణి; అశోకరోహిణి; కరికసరు;
కట్టు, kaTTu
-n.
--(1) puree; broth; thin soup; soup made by cooking one part dry cereal with eight parts water and boiled until water is reduced by half;
--(2) clannishness; unity;
--(3) bandage;
-- (4) construction;
-- (5) style of wearing clothes;
---పెసరకట్టు = a soupy preparation made out of green gram and offered as a first course of a meal. The difference between plain పప్పు and కట్టు is that the latter is thinner and receives పోపు as a final step in its preparation.
---కందికట్టు = a soupy preparation made out of red gram and offered as a first course of a meal.
-v. t.
--(1) build;
--(2) tie; bind;
--(3) wear;
--(4) remit;
-- (5) compose;
---కట్టు కట్టుట = tying a bandage.
---కట్టు బట్టలు = the clothes one is wearing.
---జీతం కట్టుట = paying the tuition.
కట్టుక, kaTTuka
-n.
--miscarriage;
కట్టుకథ, kaTTukatha
- n.
-- believable fiction;
-- కట్టు కథలులో పకడ్బందీగా నమ్మించేట్టు సంఘటన కథా నిర్మాణం చేయడం ఉంటుంది. కట్టు కథలు నిజమే అని నమ్మేసేటట్టు ఉంటాయి. నిజంగా జరగక పోయినా జరిగాయి అని నమ్మించేవి ఇవి.
కట్టుగొయ్య, kaTTugoyya
-n.
--a stake planted in the ground and used for tieing cattle;
కట్టుడు, kaTTuDu
-adj.
--built; artificial; not natural;
కట్టుమాను, kaTTumAnu
-n.
--catamaran; a kind of boat that originated in Kerala;
కట్టుబాటు, kaTTubATu
- n.
-- regulation; restriction;
కట్టె, kaTTe
-n.
--(1) piece of wood; stick;
--(2) the physical body;
కట్టెదుట, kaTTeduTa
-adv.
--right in front;right in front of the physical body;
కట్టెపెట్టి, kaTTepeTTi
-n.
--crate; wooden box;
కట్టెబొగ్గులు, kaTTeboggulu
-n. pl.
--charcoal; wood charcoal;
కట్టెలు, kaTTelu
-n. pl.
--firewood;
కట్లపాము, kaTlapaamu
- n.
-- krait;
-- కట్లపాము వంటిమీద కట్లు లేదా అడ్డగీతలు తెలుపు, నలుపు రంగుల్లో ఉంటాయి; కట్లపాము విషం మనిషి నాడీమండలం మీద పని చేస్తుంది;
కఠిన, kaThina
-adj.
--hard; severe; harsh;
---కఠిన జలం = hard water; water containing certain dissolved salts.
---కఠిన శిక్ష = rigorous imprisonment.
కఠినత్వం, kaThinatvaM
-n.
--hardness;
కఠోర, kaThOra
-adj.
--harsh; dreadful;
---కర్ణకఠోరం = harsh to the ear.
---కఠోర శిక్ష = dreadful punishment.
కడ, kaDa
-n.
--end;
కడగండ్లు, kaDagaMDlu
-n. pl.
--difficulties; calamities; troubles;afflictions;
కడగొట్టు, kaDagoTTu
-n.
--the youngest; the last in line;
కడపటి, kaDapaTi
-adj.
--the later; the later part of a sequence;
కడమ, kaDama
-adj.
--remaining; rest;
కడముట్టు, kaDamuTTu
-v. i.
--reach the end; get to be finished; reach a conclusion;
కడలి, kaDali
-n.
--sea; ocean;
కడి, kaDi
-n.
--bolus; lump; morsel;
---పేడకడి = a bolus of dung.
---అన్నపుకడి = a bolus of cooked rice.
కడుపు, kuDupu
-n.
--(1) stomach;
--(2) abdomen; tummy;
--(3) pregnancy;
---కడుపు నొప్పి = stomach ache.
---ఆమె కడుపుతో ఉంది = she is pregnant.
కడుపు ఉబ్బరం, kaDupu ubbaraM
- n.
-- flatulence;
కడుపే కైలాసం, kaDupE kailAsaM
- ph.
-- materialistic; solely driven by the desire to make more money;
కణం, kaNaM
-n.
--(1) [biol.] corpuscle, a term used specifically to indicate blood cells;
--(2) particle;
---ఎర్ర కణం = red corpuscle; red blood cell.
---ఘర్మ కణం = drop of sweat.
---నిప్పు కణం = spark; particle of fire.
కణ కవచం, kaNa kavacaM
-n.
--[biol.] cell wall;
కణ విభజన, kaNavibhajana
-n.
--[biol.] mitosis; cell division;
కణజాలం, kaNajAlaM
-n.
--[biol.] tissue; a group of cells;
కణతలు, kaNatalu
-n.
--[biol.] temples; temples of the forehead;
కత్తెరకార్తె, kattera kArte
-n.
--the period between 10-24 May, traditionally the hottest part of Summer in India; (ety.) this name owes its origin to the fact that the six stars of Pleides, that rise in the East with the Sun during this period, are in the shape of a barber’s razor; another possible explanation is that the Sanskrit name for Pleides is కృత్తిక and perhaps కత్తెర is a Telugu version of that name;
-- కత్తెర్లు;
కథ కమామీషు, katha kamAmIshu
-ph.
--business affairs; management of affairs; status of affairs;
-- పారశీకంలో కమాయిష్- అంటే వ్యవహారము. వ్యవహారము నిర్వహించుట. అదే తెలుగులో కమాయిష్షు, కమామిషు అయ్యింది. (کمایش kamāyish, Affairs, business; the management of affairs);
-- కథ సంస్కృతంలోని కథం-/కథా- అంటే 'ఎందుకు?' 'ఎట్లా?' అన్న ప్రశ్నార్థక శబ్దం నుండి వచ్చింది. సంస్కృతంలోనూ, ప్రాకృతంలోనూ మాట్లాడడానికి (conversation), చర్చకు, కథకు (story) ఈ పదాన్ని వాడినా, తెలుగులో ఇది స్టోరీ అన్న అర్థంలోనే స్థిరపడిపోయింది.
-- కథా కమామీషు అంటే, కథ, వ్యవహారం ఎంతదాకా వచ్చింది అని వాకబు చేయడం. (సురేశ్ కొలిచాల);
కథాక్రమం, kathAkramaM
-n.
--sequence of events in a story;
కథానిక, kathAnika
-n.
--short story;
కథావస్తువు, kathAvastuvu
-n.
--theme; topic of story; (rel.) ఇతివృత్తం;
కదంబం, kadaMbaM
-n.
--potpourri; variety; mixture; collection;
---(1) a garland made with a variety of flowers;
---(2) mixture, medley; variety; Salmagundi; smorgasbord; potpourri;
--- హాస్యకదంబం = వ్యంగ్య, హాస్య ప్రధానమైన రచనల కలగూరగంప - నాటకం, పద్యనాటకం, నవలు, ప్రహసనములు, గీతములు, చణుకులు, చతుర సంభాషణలు ఇలాంటివి అన్నీ కలసి వున్నది హాస్యకదంబం.
--- కదంబము = వివిధ రకముల కూరగాయలు వేసి వండిన దప్పళమును కదంబము అంటారు.
--- కదంబశతకం = ఒకే విషయంపై కాకుండ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండ వ్రాసిన పద్య సమాహారం.
---(3) [bot.] Anthocephalus cadamba;Anthocephalus indicus; గోళాకారంలో ఉన్న కదంబపు గుత్తిలో అనేక పువ్వులు వుంటాయి;
---(4) [astron.] pole of the ecliptic; the imaginary point where the axis of the Sun's orbit intersects with the celestial sphere;
కదలించు, kadaliMcu
-v. t.
--move; flex;
కదలిక, kadalika
-n.
--movement;
కదలు, kadalu
-v. i.
--move;
కదాచిత్తుగా, kadAcittugA
-adv.
--once in a while; occasionally; rarely;
కదుము కట్టు, kadumu kaTTu
-v. i.
-- (1) clot; harden due to clotting of blood caused by a hard blow;
- v. t.
-- (1) occupy; (2) oppress; (3) suppress; keep under control;
కనకాంబరం, kanakAMbaraM
-n.
--goldenfabric; a flowering shrub with golden yellow flowers; [bot.] Crossandra infudibuliformis of the Acanthaceae family;
-- గొబ్బి పూలు;
కనపడు, kanapaDu
-v. i.
--appear; seem;
కనరు, kanaru
-n.
--bitterness; astringency; a disagreeable bitter taste exhibited by some vegetables
కన్నం, kannaM
-n.
--hole; orifice; (rel.) కంత;
కన్నంగి, kannaMgi
-n.
--Indian tarpon; ox-eye herring of the Megalopidae family; [bio.] Megalops cyprinoides;
కన్నతండ్రి, kannataMDri
-n.
--one's own father; one's birth father;
కన్నమ్మ, kannamma
- n.
-- a village goddess who looks after (కను) the welfare of the village;
కన్య, kanya
-n.
--(1) Virgo; one of the 12 signs of the Zodiac;
--(2) maiden; virgin; spinster; unmarried girl;
కనాకత్తుగా, kanAkattugA
-adv.
--approximately;
కనాతి, kanAti
-n.
--curtain; wall made of cloth; screen;
కన్యాశుల్కం, kanyAsulkaM
-n.
--(1) money paid by a boy to get the right to marry a girl, a practice no longer in vogue;
--(2) the first social play in Telugu by Gurajada Apparao;
కనికరం, kanikaraM
-n
--compassion; pity;
కనిపించు, kanipiMcu
-v. i.
--seem; appear;
కనిపెట్టు, kanipeTTu
-v. t.
--discover; invent; find out;
కనిపెట్టుకొని ఉండు, kanipeTTukoni uNDu
-v. t.
--look after; keep an eye on;
కని విని ఎరగని, kani vini eragani
-ph.
--unseen, unheard and unknown; outside one's experience;
కనిష్ఠ, kanishTha
-adj.
--(1) the least; minimum; (ant.) గరిష్ఠ; (2) the youngest; (ant.) జ్యేష్ఠ;
కనిష్ఠ సామాన్య గుణిజం, kanishTha sAmAnya guNijaM
-n.
--[math.] least common multiple; LCM; కసాగు;
కనీనిక, kanInika
-n.
--pupil of the eye;
కనీసం, kanIsaM
-adj.
--(1) at the worst;
--(2) at the least;
---కనీసపు విలువ = the least value.
కన్నీళ్లు, kannILlu
-n.
--tears;
కను, kanu
-v. t.
--(1) give birth to; sire;
--(2) see; observe;
---ఆమె కవలలని కన్నది = she gave birth to twins.
---అతను ముగ్గురు పిల్లలని కన్నాడు = he sired three children.
---కని, విని ఎరగం = we never saw and never heard.
కనుక, kanuka
-conj.
--therefore; thereby;
కనుగవ, kanugava
-n.
--a pair of eyes;
కనుగుడ్డు, kanuguDDu
-n.
--eye-ball;
కనుగీటు, kanugITu
-n.
--wink;
కనుగొను, kanugonu
-v. t.
--find; locate; discover; invent;
కనుచూపు, kanucUpu
-n.
--vision; sight;
---కనుచూపు మేరలో = within sight; as far as one can see;
కనుపాప, kanupApa
-n.
--pupil of the eye;
కనుమలు, kanumalu
-n. pl.
--hilly ranges; ghats; hills along the east and west coast of India;
కనురెప్ప, kanureppa
-n.
--eye-lid;
కన్ను, kannu
-n.
--eye;
కన్నులార, kannulAra
-adv.
--with one's own eyes; an eyeful;
కనోలా, kanOlA
-n.
--Canola, [bot.] Brassica napus; B. campestris; a hybrid variety of rape plant, related to mustard, bred to produce oil low in saturated fatty acids; Canola is the trade name used in Canada for the oil drawn from the "rape" plant; (ety.) "Can" is derived from Canada, "o" from oil, and "la" is for low acid;
కపాలం, kapAlaM
-n.
--(1) skull, cranium; (2) fontanels; the two soft spots at the crown of the skull in infants;
-- కపాల మోక్షం = శిరస్సు పై భాగం లో చిన్న బిడ్డపుడు మెత్తగా ఉండి క్రమంగా గట్టిబడి పోయె భాగం కపాలం; దాన్ని భేదించుకొని ప్రాణోత్క్రమణం ఐతే మోక్షం పొందాడు అంటాము;
కపాలాస్థిక తమ్మె, kapAlAsthika tamme
-n.
--[anat.] occipital lobe;
కపి, kapi
-n.
--monkey; ape;
కపిలా, kapilA
- n.
-- [bot.] Mallotus philippensis;
కపిలె, kapile
-n.
--water lift; a large bucket which is raised and lowered by a rope passing over a large pulley and powered by bullocks;
కపోతాంజనం, kapOtAMjanaM
-n.
--antimony; a silvery white, brittle metallic element whose chemical symbol is Sb and atomic number 51.
కపోలం, kapOlaM
-n.
--cheek;
---స్వకపోల కల్పితం = something created in one's own cheek; an original.
కఫం, kaphaM
-n.
--(1) phlegm;
--(2) foam; froth;
--(3) one of the three governing principles of Ayurveda, India's traditional medical system;
-- కఫ ఆధిపత్యం ఉన్న వ్యక్తులు దృఢంగా, బలమైన ఎముకలు కలిగి ఉంటారు; శ్రద్ధచూపుతూ ఉంటారు. కఫ ఆధిపత్యం ఉన్న వాళ్ళు సులభంగా బాధపడరు. ఆలోచించి నెమ్మదిగా, ఉద్దేశపూర్వకంగా జీవితాన్ని గడుపుతారు.
కబళించు, kabaLiMcu
-v. t.
-- devour; eat; swallow;
కబ్బలి, kabbali
-n.
-bartender;
కబ్బా, kabbA
-n.
--vest; a short jacket with no sleevs;
కబ్జా, kabjA
-n.
--(1) encroachment; possession by force; స్థిరమైన ఆస్తి సంబంధంగానే దీనికి ప్రయోగం; ఈ భూమి పదేళ్లనుండీ నా కబ్జాలో ఉంది.
--(2) land illegally possessed by an occupier;
కమటం, kamaTam
-n.
--furnace; furnace of a goldsmith;
కమతం, kamataM
-n.
--land holding; lessee's land holding;
-- కమతం అంటే వ్యవసాయం చేసే మాగాణి పొలం;
-- same as కయ్య;
కమలం, kamalaM
-n.
--a floating herb with large leaves; [bot.] Nelumbo nucifera;
కమలాఫలం, kamalAphalaM
-n.
--Mandarin orange; bergamot; [bot.] Citrus nobilis of the Rutaceae family;
కమ్మ, kamma
-adj.
--pleasant flavor or taste (esp.) of food;
-n.
--(1) ornamental stud used in earlobes;
--(2) sheet of paper or letter;
--(3) palm leaf;
--(4) one of the castes in Andhra Pradesh, India; (ety.) this meaning probably came from కమ్మతం, suggesting that Kamma caste people were collective farmers;
కమ్మకసింద, kammakasiMda
-n.
--Sweet Negro Coffee;
కమ్మతం, kammataM
-n.
--collective farming;
కమ్మదనం, kammadanaM
-n.
--pleasing aroma; used especially when referring to food;
కమ్మనాడు, kammanADu
-n.
--the region between the rivers గుండ్లకమ్మ and పేరకమ్మ (కృష్ణ) rivers in Guntur and Prakasam districts of Andhra Pradesh; (ety.) this may be the origin for the Kamma caste name;
కమ్మపిల్లి, kammapilli
-n.
--civet cat;
కమ్మరి, kammari
-n.
--blacksmith; ironsmith;
కమ్మరి కొలిమి, kammari kolimi
-n.
--forge;
కమాను, kamAnu
-n.
--bow; (esp.) bow of a violin or a fiddle;
కమిటీ, kamiTI
-n.
--committee; a group of people assigned to work on a specific task;
కమ్మి, kammi
-n.
--rod; rod used as a window railing;
కమీజు, kamIju
-n.
--undershirt; sleeveless shirt;
కమీషన్, kamIshan
-n.
--commission;
--(1) a committee appointed by a government body to resolve an issue;
--(2) fee charged by a middle man in a business transaction;
--(3) a percentage charged by business for its services;
కమ్చీ, kamcI
-n.
--whip;
కమ్ము, kammu
-v. i.
--(1) cover up, spread; surround;
-- (2) draw into a wire;
కయ్య, kayya
-n.
--(1) branch; spur; section; అ small land holding; కమతం,
--(2) branch of a backwaters; a small segment of a crop field;
---ఉప్పుకయ్య = salt creek; backwaters; estuary.
కరం, karaM
-n.
--(1) hand;
--(2) ray;
--(3) trunk of an elephant;
-suff.
---ఉపయోగకరం = useful.
---భయంకరం = dreadful.
---హానికరం = harmful.
కరండం, karaMDaM
-n.
--(1) casket;
--(2) cassette;
కరంబోలా, karaMbOlA
- n.
-- star fruit; [bot.] Averrhoa carambola of the Oxalidaceae family;
-- మూత్రపిండాల పనితీరులో లోపాలున్నవారు, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు స్టార్ ఫ్రూట్స్ తినకూడదు. తింటే వాటిలోని కరంబాక్సిన్ (Caramboxin), ఆగ్జాలిక్ యాసిడ్ (Oxalic Acid) కారణంగా వారి ఆరోగ్యానికి మరింత చెడు జరుగుతుంది;
కరంభం, karaMbhaM
-n.
-- (1)pudding; a sweet made by mixing various flavors;
కరకర, karakara
-adj.
--onomatopoeia for crunchy sound; used to describe crispy foods;
కరక్కాయ, karakkAya
-n.
--Indian gall nut; ink nut; myrobalan; the fruit of Chebulic myrobalan; [bot.] Terminalia chebula of the Combretaceae family; Terminelia indica; Terminelia arjuna;
--(note) This is used as a cough medicine in the traditional Indian system of medicine;
--[Sans.] హరితకీ; పథ్యా; అభయా; అమృతా;
కరగు, karagu
-v. i.
--(1) melt; liquefaction by melting;
--(2) dissolve; see also కరుగు;
కరగించు, karagiMcu
-v. t.
--(1) melt; liquefaction by melting;
--(2) dissolve;
కరచాలనం, karacAlanaM
-n.
--handshake;
కరడు, karaDu
-n.
--(1) lump; chunk, as in a chunk of cooked rice;
--(2) solidified liquid;
కరడుగట్టు, karaDugaTTu
-v. i.
--lumping; formation of a lump, esp. during solidification;
కరణం, karaNaM
-n.
--(1) tool;
--(2) keeper of village land records;
--(3) one-half of “tithi” in a Hindu calendar;
కరబూజా, karabUjA
-n.
--cantaloup-like melon; [bot.] Citrullus vulgaris of the Cucurbitaceae family;
కరభం, karabhaM
-n.
--(1) metacarpus; part of the hand from the wrist to the base of the metacarpal bones; (lit.) hand bones;
-- (2) a young camel; a young elephant;
కరవాక, karavAka
-n.
--salt marsh;
కరవాలం, karavAlaM
-n.
--sword; (lit.) extension of hand;
కరవేరు, karavEru
-n.
--[bot.] root of Lavendula carnosa;
కర్కటకం, karkaTakaM
- n.
-- (1) a crab;
-- (2) the sign cancer of the zodiac.
-- (note) కర్కాటకం is not the correct usage;
కర్కట శృంగి, karkaTa SRMgi
- n.
-- [bot.] Rhus succedonea;
కర్కరి, karkari
-n.
--colander, strainer; a vessel with holes to facilitate draining of liquids from food;
కర్ణం, karNaM
-n.
--(1) ear;
--(2) hypotenuse of a right triangle;
--(3) diagonal (of a quadrilateral);
--(4) hole;
--(5) rudder;
కర్ణగోచర, karNagOcara
-adj.
--audible; (lit.) one that can be sensed by the ears; (rel.) దృగ్గోచరం; స్పర్శగోచరం;
కర్ణధారి, karNadhAri
-n.
--ship's pilot; the person who drives a ship; (rel.) నియామకుడు = navigator.
కర్ణభేరి, karNabhEri
-n.
--eardrum; tympanum;
కర్త, karta
-n.
--(1) doer; actor;
--(2) [gram.] subject; the causative agent;
కర్తరి, kartari
-n.
--(1) the specific period of time when the Sun spends in the third and fourth quarters of the asterism భరణి, all four quarters of the asterism కృత్తిక, and the first quarter of the asterism రోహిణి; this period is especially hot in India; a colloquial name for this is కత్తెర;
--(2) [gram.] active voice;
కర్తవ్యం, kartavyaM
-n.
--responsibility; duty; thing to do;
కర్బనం, karbanaM
-n.
--carbon; this word can be used for all three allotropic forms of carbon, namely graphite, diamond and carbon-60 (or fullerene, a short form of Buckminsterfullerene);
-- కర్బన ఉద్గారం = carbon emission;
కర్బనోదకం, karbanOdakaM
-n.
--[chem.] carbohydrate; starches (పిండి పదాథాలు) and sugars (చక్కెరలు) are examples of carbohydrates;
కర్త, karta
- n.
-- (1) doer; maker; author; (2) [gram.] the nominative case;
-- see also కారయిత, ప్రేరకుడు, అనుమోదకుడు;
కర్మ, karma
-n.
--(1) fate; karma; lot; destiny;
--(2) law of causation and action;
--(3) deed; work; effect of a deed;
--(4) [gram.] object;
-- According to Hindu thought, there are three types of "karma:" (1) సంచిత కర్మ = the karma accumulated from the previous birth(s). This is analogous to inherited wealth; (2) ప్రారబ్ధ కర్మ = the karma "earned" during the current birth; (3) ఆగామి = the "karma" forwarded to the next birth;
కర్మధారయం, karmadhArayaM
-n.
--[gram.] name of a compound word where the first half is an adjective and the second half a noun; ex. నల్లపిల్లి; ఉక్కుపాదము;
కర్ర, karra
-n.
--wood;
కర్రపెండలం, karrapeMDalaM
-n.
--cassava root; yucca; [bot.] Manihot utilissima; Manihot esculenta;
-- the starch from this root is used to make tapioca or sago
కరి, kari
-n.
-- (1) elephant; (2) mold; a kind of fungal infection; (3) blackness; (4) an illustration; a proof; (5) witness;
-- కర్రి;
కరివేప, karivEpa
-n.
-- curry leaf; sweet neem; [bot.] Murraya koenigii of Rutaceae family; విఖ్యాత వృక్షశాస్త్రజ్ఞుడు జొహాన్ యాండ్రియాస్ మర్రే (Johann Andreas Murray 1740- 1791) పేరిట దీనిని మర్రయా (Murraya) అంటున్నారు;
--(note) curry powder is not powdered curry leaves; curry powder is a mixture of several spices;
-- (ety.) కరి = కర్రి = black; వేప = neem; the leaves of are indeed darker than neem leaves; "sweet neem" does not imply that the leaves are sweet, rather they are not as bitter as neeem leaves;
--[Sans.] కైడర్య; కృష్ణ నింబ;
-- కరివేప ఆకులలో కాల్షియం, ఫాస్ఫరస్, పీచు పదార్ధం, విటమిన్- ఎ, విటమిన్- సి పుష్కలంగా ఉన్నందున అవి ఆహారపరంగా విలువైనవి. కరివేప ఆకులను డిస్టిలేషన్ చేసి కర్రీ లీఫ్ ఆయిల్ అనే నూనె తయారుచేస్తారు. ఈ నూనెను సబ్బుల తయారీలో వినియోగిస్తారు. కరివేప చెట్టు వేళ్ళు, కాండం బెరడు, ఆకులు వైద్యపరంగా విలువైనవి. ఇవి శరీరపు కాకను తగ్గించి చల్లబరుస్తాయి. జ్వరాలనూ, కడుపులోని క్రిములను పోగొట్టి, పొట్టలోని గాస్ ను వెడలించి, ఆకలి పుట్టిస్తాయి. నొప్పులు, వాపులు పోగొడతాయి. కుష్ఠు, ప్రూరిటస్, ల్యూకోడెర్మా వంటి మొండి చర్మవ్యాధులకు కరివేప దివ్యౌషధంగా పనిచేస్తుంది. భోజనంలో ముందుగా కొద్ది అన్నంతో కరివేప కారం నెయ్యి వేసుకు తింటే కడుపు ఉబ్బరం, అగ్నిమాంద్యం, నోటి అరుచి తగ్గిపోయి ఆకలి పెరుగుతుంది. కరివేప పచ్చడి నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలను అరికడుతుంది. కరివేపాకు పచ్చడి వాంతులను, వాపులను పోగొడుతుంది. మూత్రపిండాల వాపులు, నొప్పులను కరివేప వేళ్ళ రసం పోగొడుతుంది. కరివేప మాను చెక్క అరగదీసి రాస్తే ఒంటిమీది పొక్కులు తగ్గుతాయి. కరివేప పళ్ళు నల్లగా, రుచిగా ఉంటాయి. దాహాన్నీ, రక్తపైత్యాన్నీ అవి పోగొడతాయి.
కర్ణిక, karNika
-n.
--(1) auricle; one of the upper chambers of the heart; (rel.) జఠరిక;
--(2) middle finger;
--(3) ear stud; external ear;
--(4) tip of an elephant's trunk;
కర్రి, karri
-adj.
--black, dark;
కర్రి కాయ, karrikAya
-n.
--[phys.] black body; a hypothetical object that absorbs radiation of all frequencies;
కర్రి పెట్టె, karri peTTe
- n.
-- [engr.] black box; a hypothetical object that takes an input and produces an output, but whose internals are unknown to the analyst;
కర్రి బిలం, karri bilaM
- n.
[phys.] black hole; an astronomical object of intense mass and intense gravitational pull such that even light cannot escape from it, thus making it appear black;
కర్పూరం, karpooraM
- n.
-- Camphor; [bot.] Cinnamomum Camphora;
-- కర్పూరంలో రెండు రకాలు ఉన్నాయి: పచ్చ కర్పూరం, హారతి కర్పూరం;
-- ప్రాకృతిక మయిన కర్పూరం మన దేశంలో చాలా తక్కువ. ఇక అలాంటి దాని ఖరీదు చాలా ఎక్కువ. బహుశా నిర్ధారణగా దాన్ని అమ్మే వారు ఉన్నారా అనేది సందేహమే. కర్పూరం చెట్టు యొక్క ఎత్తు 50-60 అడుగులకు చేరుకుంటుంది మరియు దాని గుండ్రని ఆకులు 4 అంగుళాల వెడల్పు కలిగి ఉంటాయి. ఈ చెట్టు బెరడు నుండి కర్పూరం తయారుచేస్తారు. చెట్టు యొక్క బెరడు ఎండబెట్టడం లేదా బూడిద రంగులో కనిపించడం ప్రారంభించినప్పుడు, అది చెట్టు నుండి తీసివేయబడుతుంది. దీని తరువాత అది వేడి చేయడం ద్వారా శుద్ధి చేయబడుతుంది మరియు పొడిగా మార్చబడుతుంది. ఇది అవసరానికి అనుగుణంగా రూపొందించబడింది. కర్పూరం చెట్టును నల్ల బంగారం అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోని అత్యంత విలువైన చెట్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. పూజలో ఉపయోగించే కర్పూరం మాత్రమే కాదు, ఈ చెట్టు నుండి అనేక ఇతర వస్తువులను తయారు చేస్తారు.
-- కృత్రిమ తయారీలో టర్పెంటైన్ అనే ముడిపదార్ధం నుంచే కర్పూరం వస్తుంది. ఇది పైన్ జాతి, ఇతరత్రా వృక్షాల నుంచి, లభించేదే. కాబట్టి దీన్ని అందరూ నేచురల్ అని గప్పాలు కొట్టుకుని లేబిల్స్ మీద ముద్ర వేసుకుంటున్నారు. అయితే టర్పెంటైన్ ని, కర్పూరం గా మార్చేది ప్రయోగశాలలలోనే.
-- ఫార్మా గ్రేడ్ 98% శుద్ధమైనది, మందుల్లోనూ వాడతారు. టెక్నికల్ గ్రేడ్ 93–94% శుద్ధమైనది - పూజల్లో వాడతారు.
కలువ, kaluva
- n.
-- prickley water lily; Gorgon plant; Foxnut plant; [bot.] Euryale ferox of the Nymphaeaceae family; The flowers are usually white, red, or blue;
-- the seeds of this plant, called foxnuts, are nutritious and are getting widely popular;
-- see also తామర;
కళ్ళాపి, kaLLaapi
- n.
-- వాకిలి చిమ్మి పేడనీళ్ళు చల్లడాన్ని కళ్ళాపి అంటారు.
కళ్ళేం, kaLLEM
- n.
-- చక్కగా అలికి శుభ్రం చేసి, తడి లేని మిట్టనేల కళ్ళాం. పైరుకోతలు అయిన తర్వాత ఆ కంకులను నురిచే ప్రదేశాన్ని కళ్ళాం అంటారు.
-- కోసిన పైరు పనాలు (చిన్న మోపులు)గా కట్టి పెట్టి, రెండు మూడు రోజులకు చెమ్మ ఆరిపోగా ఆ కట్టలను ఈ నేలలో నురిచి, ధాన్యమూ గడ్డీ వేరుచేస్తారు. ఆ ధాన్యంలోని తరకలన్నీ ఎగిరిపోయి గట్టి గింజలు చేతికి రావడానికి తూర్పారబడ్తారు. ఎడ్లబండి మీదనో/ ఎత్తైనా ప్రదేశంలోనో నిలబడి పై నుంచి కిందికి ధాన్యం జారవిడుస్తూ ఉండగా, తాలు తరకలు దూరంగా పడిపోతాయి. ఆ శుభ్రమైన ధాన్యాన్ని బస్తాలకు ఎత్తుతారు. ఈ ప్రక్రియ అంతా జరిగేది కళ్ళాంలోనే.
కాచు, kaachu
- n.
-- తుమ్మ జాతికి చెందిన చెట్టు బెరడు; తాంబూలంలో వేస్తారు; [bot.] Acacia catech;
కానుగ, kaanuga
- n.
-- [bot.] Millettia pinnata, Pongamia pinnataof the FABACEAE family;
-- Pongamia tree, an ancient tree from India, could help provide the world with renewable energy as a petroleum alternative. Its beans yield oil 30% by weight. The 70% that is left is high-quality protein. Further research is needed to convert this protein into edible consumer products; This tree can yield both food and fuel;
కాపు, kaapu
- n.
-- (1) a social subdivision in Southern India; a cultivator; ryot; తూర్పు కాపు (ఉత్తరాంధ్ర); కాపు (కోస్తా ఆంధ్ర); తెలగ (కోస్తా ఆంధ్ర); ఒంటరి (కోస్తా ఆంధ్ర); బలిజ (రాయలసీమ); మున్నూరు కాపు -పటేల్ (తెలంగాణా);
(2) a householder; (3) protection; guard; (4) productiveness of plants and trees;
కారణం, kAraNaM
-n.
--cause; reason;
కారణకార్యములు, kAraNakAryamulu
-ph.
--cause and effect;
కారణకార్య సంబంధం, kAraNakArya saMbaMdhaM
-ph.
--relation between cause and effect;
కారణజన్ములు, kaaraNajanmulu
- ph.
-- ఒక లోకోపకారం జరగడానికి పుట్టిన వాళ్ళు. స్వాతంత్ర్యం రావడానికి గాంధీజీ, సంఘ సంస్కరణ లక్ష్యంగా, వీరేశలింగం గారు ఉదాహరణలు. శాస్త్ర పరిశోధనలో అనేక నూతన ఆవిష్కరణలు చేసిన వాళ్లూ కారణ జన్ములే. వాళ్ల అన్వేషణలు భవిష్యత్ తరాల జీవితాలనే మార్చివేసేవిగా ఉంటాయి;
కారణభూతం, kAraNabhUtaM
-n.
--cause; reason;
కారణభూతుడు, kAraNabhUtuDu
-n.
--originator;
కారణాంకం, kAraNaMkaM
-n.
--[math.] factor;
కారణాంశం, kAraNaMSaM
-n.
--[med.] factor; an agent responsible for an event;
కారయిత, kArayita
- n.
-- the person or agent who causes;
-- see also కర్త, ప్రేరకుడు, అనుమోదకుడు;
కార్యం, kArayaM m.
--(1) effect;
--(2) the deed;
--(3) nuptials; the first night together for the bride and groom;
---కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు = the Gandharvas will do the deed. This popular quotation refers to a small skirmish in the epic Mahabharata; This phrase is used to covey the meaning, "why do we bother, there are others who can render punishment in more appropriate ways."
కార్యకలాపాలు, kAryakalApAlu
-n.
--activities;
కార్యకర్త, kAryakarta
-n.
--office-bearer; staff; a member of a political party who takes active responsibility;
కార్యక్రమం, kAryakramaM
-n.
--program; itinerary; agenda; order of doing things;
కారాలు మిరియాలు నూరడం, kArAlu miriyAlu nUraDaM
- ph.
-- the act of showing extreme anger;
కార్యాలయం, kAryAlayaM
-n.
--office;
కారింగువ, kAriMguva
-n.
--[bot.] Gardenia resinifera of the Rubiaceae family;
--Gardenia plants are prized for the strong sweet scent of their flowers, which can be very large in size in some species;
-- కొండమంగ;
కార్డిగన్, kArDigan
-n.
--cardigan; an open-front sweater; named after the Earl of Cardigan (1797 - 1868), British general;
కార్తికేయుడు, kArtikEyuDu
-n.
--the six-headed son of Lord Shiva; according to one legend, the six mothers are believed to be six women representing the six stars of the Pleides group of stars, a group of stars often referred to in the Vedas;
కారు, kAru
-adj.
--extreme;
---కారు నలుపు = extremely dark.
---కారు చవుక = very cheap.
---కారు మేఘం = thick cloud.
-n.
--(1) car; wagon; automobile;
--(2) short for పటకారు;
--(3) strong malodor; offensive odor; కారు కూతలు = వినడానికి కఠినమైన మాటలు;
-v. i.
--drip; leak; trickle;
కారుప్పు, kAruppu
-n.
--bittern; brine; the thick solution left over after the crystallization of salt from seawater;
కారుశిల్పి, kAruSilpi
-n.
--artisan;
కార్డు, kArDu
-n.
--postcard; card; cardboard;
కార్తె, kArte
-n.
--the heliacal rising of a star; the period of time during which the Sun rises along with one of the 27 asterisms of the Hindu calendar; duration of about 13.5 days spent by the Sun in each one of the star groups;
కాలం, kAlaM
-n.
--(1) time;
--(2) season;
--(3) life-span;
--(4) [music] speed;
---ఆయన కాలం చేసేరు = he finished his time; he is dead.
---చలి కాలం = cold season.
---వాడి కాలం తీరింది = he is dead; (lit.) his time was up.
---కాలము, దూరము = time and distance.
కాల, kAla
-adj.
--(1) black; dark;
--(2) pertaining to time;
కాల రంధ్రం, kAla raMdharaM
-n.
--[astron.] black hole; collapsed star whose gravitational force is so strong even light cannot escape from it;
కాలకృత్యం, kAlakRtyaM
-n.
--morning routine such as brushing, bathing etc;
కాలక్షేపం, kAlakshEpaM
-n.
--passing time; spending time;
---గ్రంధ కాలక్షేపం = passing time reading books.
---పురాణ కాలక్షేపం = passing time listening to epic readings.
కాలగర్భం, kAlagarbhaM
-n.
--the march of time; (lit.) the womb of time;
కాలచక్రం, kAlacakraM
-n.
--the march of time; (lit.) the wheel of time;
కాలజ్ఞానం, kAlaj~nAnaM
-n.
--ability to prophecy;
కాలదన్ను, kAladannu
-v. t.
--refuse to avail an opportunity; reject; kick away;
కాలదోషం, kAladOshaM
-n.
--(lit.) expiration of time to take action; expiration of the statute of limitations;
---కాలదోషం పట్టేసింది = the statute of limitations has expired; it is too late to take any action.
కాలధర్మం, kAladharmaM
-n.
--death;
---ఆయన కాలధర్మం చెందేరు = a respectful way of saying he is dead.
కాలమానం, kAlamAnaM
-n.
--(1) climate;
--(2) standard time;
---కాలమాన పరిస్థితులు = climatic conditions.
---భారతీయ కాలమానం = Indian Standard Time.
కాలయాపనం, kAlayApanaM
-n.
--delay; wastage of time; procrastination;
కాలరు, kAlaru
-n.
--collar;
కాలవ్యతిక్రమం, kAlavyatikramaM
- n.
-- anachronism;
కాలసర్పం, kAlasarpaM
-n.
--(1) black snake;
--(2) metaphorical snake representing time;
---కాలసర్పం కాటు వేసింది = the "time snake" bit, which means "met with death."
కాలసర్పదోషం, kaalasarpadOshaM
- n.
-- an euphimism for wasting time by indulging in sleep and banter;
-- నిద్రతో, వ్యర్దపు మాటలతో కాలాన్ని దుర్వినియోగం చేసేవారికి కాలసర్పదోషం తగులుతుందని జ్యోతిషులు అంటారు;
కాలహరణం, kAlaharaNaM
-n.
--delay; loss of time; wastage of time;
కాల్బలం, kAlbalaM
-n.
--infantry; soldiers on foot;
కాలాతీతం, kAlAtItaM
-n.
--(1) delay; out of time; సమయం ఇప్పటికే చాలా అయింది. ఇక తర్వాత పని మొదలు పెట్టాలి అనే సందర్భం లో వాడతాము.
--(2) out of step with the times; కాలంతో సంబంధం లేకండా ఎవర్ గ్రీనుగా ఉండటాన్ని కాలాతీతమయినదిగా చెప్తారు. అది మనిషి యొక్క కీర్తిప్రతిష్ఠలు కావచ్చు,పుస్తకం కావచ్చు, సినిమా కావచ్చు, నవల కావచ్చు, నాయకులు చేపట్టే మంచి పథకాలు కావచ్చు.
-- (3) Beyond time; దేవుడు కాలాతీతమయినవాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఆయన ప్రభ శాశ్వతంగా ఓకే లాగ ఉంటుంది.
కాలిదారి, kAlidAri
-n.
--foot path;
కాలిపిక్క, kAlipikka
-n.
--calf; calf muscle;
కాలిబంటు, kAlibaMTu
-n.
--foot soldier;
కాలిబాట, kAlibATa
-n.
--footpath;
కాలిబోను, kAlibOnu
-n.
--snare;
కాలీఫ్లవర్, kAlIphlavar
-n.
--cauliflower;
కాలు, kAlu
-n.
--(1) leg;
--(2) foot;
-- (3) the fraction 1/4;
-v. i.
--burn; bake; scald;
---ఇల్లు కాలిపోతోంది = the house is burning.
కాలువ, kAluva
-n.
--canal; an artificially created waterway as opposed to a channel which is a natural waterway; (lit.) కాల్ = to flow;
కాలుష్యం, kAlushyaM
-n.
--pollution;
కాల్చు, kAlcu
-v. t.
--burn; roast;
---చెయ్యి కాల్చుకోకు = do not burn your hand; as an idiom this also means do not cook.
---జీడిపిక్కలు కాల్చు = roast the cashews.
కాలేజి, kAlEji
-n.
--college; an institution for learning beyond high school;
కాలేయం, kAlEyaM
-n.
--[biol.] liver; the organ that produces bile;
కాలోచిత, kAlOcita
-adj.
--seasonal; appropriate for a time; timely; opportune;
కావరం, kAvaraM
-n.
--fat;
కావ్యం, kAvyaM
-n.
--any literary work (prose, verse, or a mixture) that places emphasis on the quality of the concept being treated;
-- "వాక్యం రసాత్మకం కావ్యం" అని పెద్దల మాట. అంటే రసాత్మకంగా ఉండి మనసును స్పందింపజేసే ఒక వాక్యమైనా కావ్య గౌరవాన్ని అందుకొంటుంది. కావ్యం అందమైన ఊహలతో, వర్ణనలతో, అర్థ గాంభీర్యంతో, ఔచిత్యంతో చదవగానే మనసులో రసాలు ఊరేలా ఉండాలి. కవి భావనలతో మన హృదయం కూడా స్పందించేలా చేయగలిగిన ఏ రచనైనా కావ్యమే;
కావిడిబద్ద, kAviDibadda
-n.
-- shoulder pole; a pole carried on the shoulder with two loads suspended from both ends of the pole;
కావి రంగు, kAvi raMgu
-n.
--tan color;
కావిరి, kAviri
-n.
--vapor; black vapor;
కావున, kAvuna
-adv.
--therefore;
కాశీగన్నేరు, kASIgannEru
-n.
--dog's cane; a plant;
కాశీరత్నాలు, kASIratnAlu
- n.
-- Red Cypress Vine; red tubular flowering vine, also called Scarlet Morning Glory; [bot.] Ipomoea hederifolia of the Convolvulaceae family; This is native to the Americas but is now widely seen all over the world, including Andhra Pradesh; A related plant with similar flowers is called Red Cypress Vine, [bot.] Ipomoea quamoclit;
కాసం, kAsaM
-n.
--(1) cough;
--(2) (abbr.) light-year; short for కాంతి సంవత్సరం; జ్యోతిర్‌వర్షం;
కాసారం, kAsAraM
-n.
--lake;
కాస్తా, kAsiMta
-n.
--a little, a small amount; a little bit;
కాసింత, kAsiMta
-adj.
--little bit;
-n.
--a little, a small amount; a little bit;
కాస్మిక్ కిరణాలు, kAsmik kiraNAlu
-n.
--cosmic rays; these high energy rays, coming from outer space, constantly bombard the Earth. The ionosphere protects us all from the damaging influence of these rays.
కాసీరత్నం, kAsIratnaM
- n.
-- a climber or bushy plant with scarlet red flowers; [bot.] Ipomoea hederifolia Linn.;
కాసు, kAsu
-n.
--(1) sovereign; a gold coin weighing 10 grams;
--(2) cash; copper coin; any coin;
కాసేపు, kAsEpu
-adj.
--little while;
కాష్ఠం, kAshThaM
-n.
--wood; wood used on the funeral pyre;
కాష్ఠ, kAshTha
-n.
--(1) quadrant; a fourth of the region created by two rectangular coordinate axes;
--(2) duration of time equal to 18 winks; 1 / 450th of a Muhoortham;
క్త్వార్థం, ktvArthaM
-n.
--[gram.] any infinite verb ending in ఇ, such as వచ్చి, తెచ్చి;
-- భూతకాలిక అసమాపక క్రియ; ఉదా. వచ్చియిచ్చెను. ఇందులో 'వచ్చి' క్త్వార్థకము.
%క్రా - krA, క్షా - kshA, కిం - kiM, కి - ki, క్రి - kri, క్షి - kshi
క్రాంతి, krAMti
-n.
--(1) turning;
--(2) revolution;
--(3) [astro.] declination; the angular distance of a celestial object north or south of the celestial equator, analogous to latitude on Earth; this is always measured in degrees, minutes, and seconds;
క్రాంతిచక్రం, krAMticakraM
-n.
--ecliptic; the apparent path of the sun in the sky;
క్రాంతివృత్తం, krAMtivRttaM % replacement for old entry
-n.
--(1) ecliptic; the great circle on the celestial sphere that lies in the plane of the Earth's orbit; the apparent circular path of the Sun as it travels in its annual journey, as seen from Earth; the plane of the ecliptic is tilted at an angle of 23.5 degrees from the plane fo the celestial equator; the two points at which the ecliptic crosses the celestial equator are the equinoxes; the constellations through which the ecliptic passes are the constellations of the Zodiac;
--(2) the Zodiac;
కిత్తనార, kittanAra
-n.
--a fiber made from agave;
కిత్తలి, kittali
-n.
--agave; [bot.] Agave americana; bast sagopalm;
-- పల్లెలలో పొలం గట్లపైన, బహిరంగ ప్రదేశాల్లో మొలిచే కలబంద మొక్కలా కనిపించే పలుచని ఆకుల మొక్క కిత్తలనార. పాత రోజుల్లో పొలాల సరిహద్దులలో ఈ మొక్కలను నాటి సహజమైన కంచెను తయారుచేసుకునే వారు. వీటి ఆకులు పలచగా, పొడవుగా వుండి అంచుల్లో ముళ్లను కలిగి ఉంటాయి. అందుకే పశువులు, మనుషులు వీటి జోలికి పోలేరు. మట్టి కోతకు గురికాకుండా వుండటానికి వీటిని రక్షణ కవచాల్లా ఉపయోగిస్తారు. ఆయుర్వేద ఔషధాలలో ప్రతి భాగాన్ని వాడతారు. ఆకుల నుండి వచ్చిన నారను వస్త్రాలు, తాళ్లు తయారీకి వినియోగిస్తారు. ఇప్పుడు చాలా గిరిజన ప్రాంతాల్లో ఈ మొక్కలను వాణిజ్య పంటగా పండిస్తున్నారు.
కితాబు, kitAbu
-n.
--(1) kudos; praise; appreciation;
--(2) book;
కిన్నర, kinnara
-n.
-- see కిన్నెర;
కినుక, kinuka
-n.
--anger;
కినోవా, quinoa
- n.
- the goosefoot plant; [bot.] Chenopodium quinoa;
-- the protein-rich, gluten-free seeds of this plant, native to South America, are being used as a cereal grain and as an alternative to rice and wheat;
కిన్నెరులు, kinnerulu
- n. pl.
-- legendary creatures with a human head and a horse’s body; వీరు అశ్వ శరీరం, నరముఖం కలవారు;
-- see also కింపురుషులు;
కిఫాయతు, kiphAyatu
-n.
--benefit; advantage;
కిమ్మనకుండా, kimmanakuMDA
-adv.
--without making any protest; quietly; without hesitation;
కిరణవారం, kiraNavAraM
-n.
--a beam of (light) rays; (Chinnaya Suri uses the phrase తరణి కిరణవారం);
కిరసనాయిలు, kirasanAyilu
-n.
--kerosene; a combustible hydrocarbon liquid which is derived from petroleum. It is widely used as a fuel in aviation as well as in household Kerosene lamps;
-- కిరసనాయిలు సహజంగా రంగు లేని ద్రవం. కేవలం మన దేశంలోనే, ప్రజాపంపిణీకి ఉద్దేశించిన కిరసనాయిలు నల్ల బజారు పాలు కాకుండా రక్షించడానికి అందులో నీలి రంగు 'డై' ని, ఇంకా 'పర్ఫ్యూరాల్అనే మరో రసాయనాన్ని కలుపుతారు. ఆ రంగును సులభంగా పోగొట్టగల రసాయనాలు లేవు. ఉన్నా వాటిని వాడడం చట్ట ప్రకారం నేరం;
కిర్రుచెప్పులు, kirruceppulu
-n.
--creaking slippers; shoes deliberately made to produce a creaking sound to act as a means to ward off creeping creatures like serpents;
కిలకిల, kilakila
-adj.
--onomatopoeia for the sound of a woman or baby laughing;
కిలారం, kilAraM
- n.
-- farce;
-- కిలకిల నవ్వించేది; రూపకాలలో ఒక రకం;
కిలుం, kiluM
-n.
--verdigris; a mildly toxic substance formed when bronze or brass vessels react with domestic organic acids;
-- ఇత్తడి, రాగి పాత్రలు వాడకుండా, శుభ్రం చేయకుండా కొన్ని రోజులు వుంచినట్లైతే మలినాలు చేరి, వాటి రంగు మారి మచ్చలు ఏర్పడతాయి. పాత్రలో లోహంతో ఆమ్లజనీకరణ జరగడం వలన ఉపరితలంపై విషపూరితమైన మలినాలు చోటు చేసుకుంటాయి. దాన్నే "కిలుము" అంటారు. ఈ కిలుము పట్టిన పాత్రలు ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం.
కిలో, kilO
-pref.
--వెయ్యి;
---కిలోగ్రాము = measure of weight in the metric system; one thousand grams; కిలో.
---కిలోమీటరు = measure of distance in the metric system; one thousand meters; ఉరమరగా 8 కి.మీ. = 5 మైళ్లు.
కిళ్లీ, kiLlI
-n.
--an after-dinner chewable item prepared by wrapping scented betel nut pieces and some sweet or pungent condiments in a betel leaf;
---(e. g.) కారా కిళ్లీ = one made from pungent condiments and tobacco.
---(e. g.) మిఠాయి కిళ్లీ = one made from sweet condiments.
కీచురాయి, kIcurAyi
-n.
--cricket; an insect of the cricket family;
కీచులాట, kIculATa
-n.
--squabble; minor quarrel, esp. between a husband and wife;
కీటకం, kITakaM
-n.
--insect; any of the small invertebrate animals with a head, thorax, abdomen, three pairs of legs, and two pairs of membranous wings;
కీటకారి, kITakAri
-n.
--insecticide; (lit.) killer of insects;
కిడెంచి మేలెంచడం, kIDeMci mEleMcaDaM
- ph.
-- the act of looking at the downside before counting the benefits;
కీత, kIta
-adj.
--(1) inferior;
--(2) level; not heaping;
---కీత చెంచాడు = a level tea-spoonful.
కీరచేప, kIracEpa
-n.
--Cotio; a fish of the Cyprinidae family; [biol.] Osteobramma vigorsii; Osteobramma cotio;
కీర్తన, kIrtana
-n.
--(1) a type of song sung in the Carnatic style; these songs typically have a refrain and one or more stanzas of lyrics;
--(2) praise;
కుంకుడు కాయ, kuMkuDu kAya
-n.
--soap nut; see also సీకాయ;
కుంకుమ, kuMkuma
-n.
--red rouge-like substance used for making the red dot worn on the forehead of Hindu women; There are several methods of making this; (1) to mix turmeric powder with alum, and quicklime; (2) to mix turmeric powder with lime juice; (3) to mix turmeric powder with some crystals available in the market;
-- కుంకం;
కుంకుమ పువ్వు, kuMkuma puvvu
-n.
--saffron; [bot.] Crocus sativa of the Iridaceae family;
-- తృణ కుంకుమం = hay saffron;
--[Sans.] అగ్నిశిఖ; కుంకుమం; కాశ్మీరం; బాహ్లీకం; అస్రం;
-- ఈ పూల పురుష కేసరాలు పసుపుపచ్చగా ఉంటే, స్త్రీ కేసరాలు ఎర్రగా ఉంటాయి. ఒక్కో పువ్వులో మూడు స్త్రీ కేసరాలుంటాయి. కీలాగ్రాలు (Stigmas), వాటి పొడవాటి కాడలు (కీలములు - Styles) కూడా ఎర్రగా రక్తవర్ణంలో ఉంటాయి. వీటిని వేరుచేసి ఎండబెట్టి దాన్నే కుంకుమపువ్వు పేరుతో మార్కెట్లో విక్రయిస్తారు. కుంకుమ పువ్వు అని మనం వాడుకునేది ఆ మొక్క పువ్వును కాదు; పూల కీలములు, కీలాగ్రాలను మాత్రమే అని గ్రహించాలి.
-- లేటిన్ ”సాఫ్రానం” అనే పదం, ఇటాలియన్ "జాఫ్రానో" అనే పదం అరబ్బుల "అల్ జేఫరిన్" నుంచి వచ్చినవే. వీటన్నిటికి "బంగారు రంగు" అని అర్ధం. సంస్కృత పదం "కుంకుమం" నుంచి ఆ మొక్క పేరు క్రోకస్ వచ్చిందనిన్నీ, దాని అర్ధం "పసుపు రంగు" గా మారిందని చరిత్ర కారులంటారు;
కుంకుమ బొట్టు, kuMkama boTTu
-n.
--the red dot on the forehead worn esp. by Hindu married women, traditionally made from turmeric powder and a dash of lime (calcium carbonate);
కుంగు, kuMgu
-v. i.
--sag; sink; bend; (rel.) ఒంగు;
కుంచం, kuMcaM
-n.
--a volumetric measure for measuring grain until the metric system was introduced; approximately two liters; 1 కుంచం = 2 అడ్డలు = 4 మానికలు = 8 తవ్వలు = 16 సోలలు = 64 గిద్దలు; Similarly, 4 కుంచాలు = 1 తూము; 5 తూములు = 1 ఏదుము (ఐదు + తూము); 10 తూములు = 1 పందుము (పది + తూము); 4 ఏదుములు = 1 పుట్టి;
-- గరిసె అంటే పెద్ద ధాన్యపు గంప అనీ ధాన్యపు కొట్టు అనీ అర్థం. ఈ గంపలు, ధాన్యపు కొట్లు వివిధ ప్రాంతాలలో వివిధ పరిమాణాలలో ఉండే కారణంగా గరిసె ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది.
కుంచె, kuMce
-n.
--brush;
కుంజరం, kuMjAraM
-n.
--elephant; (ety.) one that has కుంజలు;
కుంజలు, kuMjAlu
-n. pl.
--little depressions found on both sides of an elephants head, just below the కుంభస్థలం;
కుండపోత, kuMDapOta
-n.
--torrential rain; heavy rain; rain coming down as if someone is pouring water from a pot;
కుండమల్లి, kuMDamalli
-n.
--star jasmine; a plant of the Oleaceae family; [bot.] Jasminium multiforum; This plant has medicinal uses in treating ulcers; known to have an antidote for cobra venom; This plant was mentioned in Potana's Bhagavatam;
కుండలము, kuMDalamu
-n.
--ear ring;
కుండలిని, kuMDalini
- n.
-- A Yoga system to tame and harness the internal energy in the human body; Kundalini yoga (kuṇḍalinī-yoga) derives from kundalini, defined as energy that lies within the body, at the base of the spine. Kundalini is considered to be dormant until it is activated (as by the practice of yoga) and channeled upward through the central channel, along the spine, in a process of spiritual perfection;
-- కుండలిని అనేది భారతీయ యోగ శాస్త్రం ప్రకారం ఒక అనిర్వచనీయమైన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నులో క్రింది భాగాన చుట్ట చుట్టుకొని పాములా దాగి ఉంటుంది. ఈ స్థానాన్ని మూలాధారం అంటారు. ఈ మూలాధారం లో దాగివున్న ఈ కుండలినీ శక్తిని మానవ శరీరంలోని షట్చక్రాల (అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా) నుండి సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతి కుండలినీ యోగం. కుండలినీ యోగంలో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామం ఒక ముఖ్య సాధనం. కుండలిని స్థితి శక్తి (potential energy) రూపంలో ఉండగా, త్రికరణ శుద్ధితో అరిషడ్వర్గాలను జయించినప్పుడు, గతి శక్తి (kinetic energy) గా మారి ఊర్ధ్వ ముఖంగా పయనించి, షట్చక్రాల్లోని ఒక్కొక్క చక్రాన్నీ దాటుతూ, తల మాడు భాగాన ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది. ఈ స్థితినే అష్టాంగ యోగంలోని అత్యున్నత దశ అయిన "సమాధి స్థితి"గా కూడా పేర్కొంటారు. ఈ స్థితిలో సాధకుడు అనిర్వచనీయమైన ఆనందాన్ని (బ్రహ్మానందాన్ని) పొందుతాడని అంటారు. కుండలినీ విద్యను ఉపాసించిన రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస సమాధి స్థితికి చేరారని అంటారు.
కుండలీకరణం, kuMDalIkaraNaM
-v. t.
--parenthesize; bracket;
కుండలీకరణములు, kuMDalIkara-Namulu
-n. pl.
--parentheses; brackets;
కుందము, kuMdamu
- n.
-- star jasmine; Downy jasmine;[bot.] Jasminum multiflorum
-- [Sans.] సదాపుష్ప;
కుందేలు, kuMDElu
-n.
--(1) Indian hare; rabbit; [biol.] Lepus nigricollis;
--(2) total loss in a card game; (ety.) In certain card games, Indians use the terms ఆట (game), బేస్తు (marginal win), and కుందేలు (total loss); కుందేలు, probably a distortion of కుదేలు, means total loss;
కుంభం, kuMbhaM
-n.
--(1) Aquarius; one of the 12 signs of the Zodiac;
--(2) pot, water pot;
కుంభ, kuMbha
-adj.
--convex;
కుంభకం, kuMbhakaM
-n.
--holding the breath in yoga practice;
---అంతః కుంభకం = inhaling and holding the breath.
---బహిః కుంభకం = exhaling and holding the breath.
కుంభకటకం, kuMbhakaTakaM
-n.
--convex lens;
కుంభకామెర్లు, kuMbhakAmerlu
-n.
--yellow fever;
కుంభకోణం, kuMbhakONaM
-n.
--(1) a town in Southern India;
--(2) scam; allegorically used while referring to big-time deceit; a toponym;
కుంభస్థలం, kuMbhasthalaM
-n.
--an area at the top part of the head and between the shoulders of an elephant, where the mahout uses his iron stylus to control the elephant;
కుంభాకార, kuMbhAkAra
-n.
--adj. convex; (lit.) pot shaped;
కు, ku
-n.
--pref. false; pseudo; artificial;
-- షష్ఠీ విభక్తి ప్రత్యయం; అకారాంత పదాలకి కు అనే ప్రత్యయం వచ్చి చేరుతుంది; కుక్క > కుక్కకు
కుక్కమూతి పిందెలు,
- n.
-- vegetables, like gourds and cucumbers, that were deformed and twisted at a tender stage thus rendered useless;
-- బాల్యంలోనే చెడు నడవడికకు అలవాటు పడినపిల్లలను కుక్క మూతి పిందెలతో పోల్చడం ఉంది. వక్రంగా పుట్టిన పిందెలు నిజంగానే కుక్క మూతిని పోలి ఉండడం కద్దు.
కుక్కవాయింట, kukkavAyiMTa
-n.
--dog mustard; an edible green; [bot.] Polanisia viscosa; Cleome viscosa Linn. ; శ్వానబర్చర; కుక్కవావింట;
కుక్కవెర్రి, kukkaverri
-n.
--hydrophobia; a disease, characterized by a fear of water, caused by a dog bite;
కుక్కలదొడ్డి, kukkaladoDDi
-n.
--dog-kennel;
కుక్కుటం, kukkuTaM
-n. m.
--cock; rooster; chicken; fowl;
కుక్కుటి, kukkuTi
-n. f.
--hen;
కుక్షి, kukshi
-n.
--stomach;
---నిరక్షర కుక్షి = illiterate person; (lit.) without a syllable in the stomach.
కుచందనం, kucaMdanaM
- n.
-- bastard sandalwood; [bot.] Myoporum sandwicense; native to Hawaii, grows as either a small tree, large tree, or dwarf shrub, depending on the elevation and conditions;
కుచము, kucamu
-n.
--breast; woman's breast;
కుచాగ్రము, kucAgramu
-n.
--nipple; the tip of the breast;
కుచ్చు, kuccu
-adj.
--pleated; bushy; (alt.) కుచ్చుల;
---కుచ్చు టోపీ = cap with a tassel.
---కుచ్చు తోక = bushy tail.
కుచ్చులు, kucculu
-n. pl.
--(1) pleats;
--(2) tassels;
కుచ్చెళ్లు, kucceLLu
-n. pl.
--pleats; frills; folds used in clothing to lend body and beauty;
---కుచ్చెళ్ల అంచు = the side of a sari suitable for pleating.
కుజుడు, kujuDu
-n. m.
--Mars; (alt.) కుజగ్రహం; this is a misnomer because (lit.) కు = Earth, జ = born, కుజ = born of Earth; the translation అంగారకుడు is better because అంగారము connotes fire and fire is red and Mars is the red planet;
కుటకి, kuTaki
- n.
-- [bot.] Picrorhiza kurroa of the Plantaginaceae family;
-- one of the major income-generating non-timber forest products found in the Nepalese Himalayas. It is one of the oldest medicinal plants; It is a perennial herb and is used as a substitute for Indian gentian (Gentiana kurroo); Taking picrorhiza by mouth for up to one year, in combination with a drug called methoxsalen, that is also taken by mouth, and applied to the skin, seems to help treat vitiligo in adults and children;
కుడ్య చిత్రాలు, kuDya chitrAlu
- n. pl.
-- murals; pictures painted on walls and ceilings;
-- మన దేశంలో గుహల్లో వేసినవి, బాగా ప్రాముఖ్య మైనవి -భింభేత్క, అజంతా,ఎల్లోరా, సిత్తనవాసల్ వంటి చోట్ల ఇలాంటి చిత్రాలు కనిపిస్తాయి. ప్రపంచంలో గోడ చిత్రాలను ఫ్రెస్కో అంటారు. ఇది ఇటాలియన్ పదం. తాజా అయిన అని అర్ధం;
-- మొదటి రకమైన ఫ్రెస్కో - బ్యునో (fresco-buno) అనేది తడి/తేమ పద్ధతి .ఇందులో సున్నపు పొర తడిగా ఉన్నప్ప్పుడే, రంగు పొడులను నీటితో కలిపి దాని మీద వివిధ ఆకారాల్లో సిద్ధంగా ఉంచుకున్న ఆకార రేఖల పై పూస్తారు. అప్పుడు రంగులు లోపలికి చొచ్చుకుని పోయి చిత్రానికి ధృడత్వాన్ని,మన్నికని ఇస్తాయి. వాటికన్ సిస్టిన్ చాపెల్ లో మైకలాంజేలో వేసింది ఇలానే.
-- రెండోది ఫ్రెస్కో - సెక్కో (fresco-secco) రకం. ఇది పొడి/ఎండు పద్ధతి. తెల్లటి సున్నపు పొర(గార లేక గచ్చు) ఆరిన తర్వాత రంగు పొడులను,ఇతర పట్టీ ఉంచే పదార్ధాలతో(నూనెలో,బంకగా ఉండే మరేదో )** కలిపి చిత్రిస్తారు. ఇది మన అజంతా రకపు చిత్రాలలో వేసినది. వీటిలో చివరగా, నునుపు రాయితో మెరుపు వచ్చే వరకు, రుద్దుతారు.
కుడితి, kuDiti
-n.
--a drink for cattle made from the rice wash water, bran, etc.;
కుతకుత, kutakuta
-n.
--onomatopoeia for the sound of cooking;
కుతర్కం, kutarkaM
-n.
--false logic;
కుత్సిత, kutsita
-adj.
--unscrupulous;
కుతూహలం, kutUhalaM
-n.
--the desire to know; anxiety to find the unknown; inquisitiveness;
కుత్తుక, kuttuka
-n.
--neck; throat;
కుత్తుకబంటి, kuttukabaMTi
-n.
--upto the neck; neck-deep;
కుదప, kudapa
-n.
--clot; curds of blood;
కుదవ, kudava
-n.
--pledge; pawn; mortgage;
కుదుపు, kudupu
-n.
--vibration; rough ride;
కుదించు, kudimcu
-v. t.
--compress; shorten; abbreviate; abridge;
కుదురు, kuduru
-n.
--(1) shapeliness;
--(2) stability; steadiness;
--(3) support; basin to support a round-bottomed pot; basin to support free-flowing liquids;
--(4) cure; recovery from illness;
--(5) root; పెనుకుదురు = big root; కొండుకుదురు = baby root; చనుకుదురు = nipple;
కుదేలు, kudElu
-n.
--(1) total loss of investment; bankruptcy;
--(2) (note) in card games, Indians use the terms కుదేలు, and sometimes కుందేలు, to refer to a total loss and బేస్తు to indicate a marginal win.
కునుకు, kunuku
-n.
--catnap; dozing;
కునుకుపాట్లు, kunukupATlu
-n.
--little catnaps;
కుపోషణ, kupOshaNa
-n.
--malnutrition;
కుప్ప, kuppa
-n.
--heap; pile;
కుప్పింటి ఆకు, kuppiMTi Aku
- n.
-- leaf of Indian Acalypha; [bot.] Acalypha indicaof the Euphorbiaceae family;
-- మురిపింటి; పిప్పింటి; మూర్కొండ; ఈ మొక్కను ఎన్నో వైద్య యోగాలలో వినియోగిస్తారు. ఇది నిటారుగా పైకి పెరిగే వార్షిక మొక్క- అంటే ఏటా పడి మొలుస్తుంది. 30 నుంచి 100 సెంటీమీటర్ల ఎత్తు వరకూ పెరుగుతుంది. తోటలలో కలుపు మొక్కగా, ఖాళీ స్థలాలలో, రోడ్లవెంట పిచ్చి మొక్కగా భారతదేశం అంతటా కనిపిస్తుంది;
-- [Sans.] హరిత మంజరీ;
.
కుప్పె, kuppe
-n.
--flask; bottle; a long necked bottle used in chemistry labs;
కుబుసం, kubusaM
-n.
--molt; slough; the skin that is shed periodically by certain animals like snakes and silkworms;
---కుబుసం విడచుట = molting; ecdysis.
కుబేరుడు, kubEruDu
- n.
-- the demigod of wealth;
-- కుబేరుడు అనగా అవలక్షణములతో కూడిన శరీరము కలవాడు (బేరము అంటే శరీరము అని అర్థము). పేరుకి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా (మరగుజ్జులా), పెద్ద కుండ వంటి పొట్టతో, మూడు కాళ్ళు, ఒకే కన్ను, ఎనిమిది దంతాలతో వుంటాడని, పురాణాలలో చెప్పబడింది;
-- పులస్త్యుడికి, తృణబిందుని కుమార్తెకి పుట్టిన శిశువే విశ్రవసుడు. విశ్రవసుడి కుమారుడు కుబేరుడు
-- విశ్రవునికీ, భరద్వాజ మహర్షి కుమార్తె అయిన దేవవర్ణికీ పుట్టినవాడు వైశ్రవణుడు. ఈ వైశ్రవణుడే కుబేరుడు.
కుమ్మక్కు, kummakku
-n.
--aid and abetment in the commission of a crime; support in a conspiracy; collusion; plotting together;
కుమ్మరిమట్టి, kummarimaTTi
-n.
--kaolin; clay; (note) a mixture of sterilized kaolin and pectin is sold as Kaopectate, an over-the-counter medicine for the treatment of diarrhea; % spell check
కుమ్ము, kummu
- n.
-- smouldering ashes;
-v. t.
--butt; gore; pierce;
కుమ్ములాట, kummulATa
-n.
--playful butting in bed;
కుమ్ముసుద్ది, kummusuddi
-n.
--enigma; a talk or communication through symbols;
కురంతకం, kuraMtakaM
-n.
--Yellow Amaranth; a plant of the Acanthaceae family; [bot.] Barleria prionitis; Chewing the leaves of this plant is known to relieve tooth ache; This potassium-rich plant has other medicinal uses in treating boils and fevers; This plant was mentioned in Potanas Bhagavatam; (Syn.) పచ్చ పెద్ద గోరంట; ములు గోరంట;
కురిడీ, kuriDI
-n.
--the meat part of a very mature coconut after all the water had been absorbed;
కురు, kuru
-adj.
--short; small; little;
కురుచ, kuruca
-adj.
--short; diminutive in size;
కుర్చీ, kurcI
-n.
--chair; seat;
కురుపు, kurupu
-n.
--boil; (rel.) పొక్కు;
కురువిందం, kuruviMdaM
-n.
--corundum; a crystallized mineral of aluminum oxide varying in color from light blue to smoky gray, brown, and black; the finest varieties of corundum are sapphire and ruby; ruby is called "kuruvinda" in Sanskrit.
కురులు, kurulu
-n.
--curls; curly hair;
కులం, kulaM
-n.
--(1) group; collection; family;
--(2) caste;
---కాకులం = group of crows.
---గురుకులం = the residence of a teacher; a place where students gather;
---గోకులం = group of cows; a place where cows reside;
---ముక్కులం = group of clouds.
కులగోత్రాలు, kulagOtrAlu
-n.
--lineage; ancestry;
కుల్లా, kullA
- n.
-- cap; hat; Muslim hat;
-- శీర్షాచ్చాదనం; ఆలవట్టం; ఉల్లడ; టోపీ;
కులాసా, kulAsA
-n.
--happiness;
కుళాయి, kuLAyi
-n.
--tap; faucet; spigot;
కుశలము, kuSalamu
-n.
--wellbeing; happiness;
కుశి, kusi
-n.
--a joint in woodwork; carpenter's joint;
కుశిని, kusini
-n.
--(1) cuisine; cooking;
--(2) kitchen;
క్షుద్రగ్రహాలు, kshudragrahAlu
-n.
--asteroids; the planetary fragments found in a belt between Mars and Jupiter;
క్షురి, kshuri
-n.
--barber;
క్షురిక, kshurika
-n.
--razor; razor blade;
కృదంతం, kRdaMtaM
- n.
-- [gram.] a noun form created from a verb by appending a suffix (ప్రత్యయం); also called కృదంత నామవాచకం; ఉదా: అలుగు > అలక; ఆడు > ఆట;
%కూ - kU, క్రూ - krU, క్షూ - kshU
కూకటి, kUkaTi
-adj.
-- main; principal; central;
-- మాడు మీఁద పెరిగిన జుట్టునకు కూకటి అని పేరు. అట్లే పీచుపీచుగా ఉన్న దేనికైనను కూకటి అనియే పేరు.
--- కూకటి వేరు = main root; tap root;
--- కూకటి కొట్టు = [comp.] main store.
కూగర్, kUgar
- n.
-- cougar; [bio.] Puma concolor of the Felidae family;
కూజుపిట్ట, kUjupiTTa
-n.
--warbler; a type of bird;
కూటం, kUTaM
-n.
--(1) association; clique; tight-knit group;
--(2) pinnacle; summit; tip of a mountain;
కూట, kUTa
-adj.
--artificial; pseudo; not real;
---కూట సృష్టి = artificial creation; hoax.
కూటజ పుష్పం, kUTajapuShpaM
- n.
-- [bot.] Holarrhena antidysentrica; these white flowers bloom in the rainy season;
కూటపక్షి, kUTapakShi
- n.
- magpi; a crow-like bird found in colder climates; కృశకూట, కాలకూట, పూర్ణకూట పక్షులు ఉపజాతులు;
కూటపాదం, kUTapAdaM
-n.
--pseudopod; temporary cytoplasmic extensions produced by cells for purposes of locomotion and for engulfing material;
కూడు, kUDu
-n.
--meal; food; cooked rice;
-v. t.
--add; put together; join; mix;
కూత, kUta
-n.
--(1) bird call; toot; cry;
--(2) whistle; siren;
--(3) shout;
---పిట్టకొంచెం, కూత ఘనం = the bird is small but the call is loud.
---కూతవేటు దూరం = shouting distance; distance at which a shout can be heard.
కూన, kUna
-n.
--little one; young one;
---పిల్లి కూన = kitten.
---పసి కూన = human baby.
కూనిరాగం, kUnIrAgaM
-n.
--humming;
కూనీ, kUnI
-n.
--murder;
కూపం, kUpaM
-n.
--pit; hole;
కూపకం, kUpakaM
-n.
--(1) ships mast; the pole to which the sails are attached;
--(2) pelvis; the bone structure around the waist;
కూపస్థ మండూకం, kUpastha maNDUkaM
-n.
--[idiom] a person with limited worldly knowledge, but thinks he knows everything; (lit.) like frog in a well;
కూపీలు, kUpIlu
-n. pl.
--whereabouts; clues; secrets;
కూయు, kUyu
-v. i.
--cry; toot; scream; call; mew;
కూర, kUra
-n.
--(1) vegetable;
--(2) herbs or leafy vegetables;
--(3) curried vegetable or meat dish meant to be eaten with rice or bread;
---కోడికూర = curried chicken.
కూరగాయలు, kUragAyalu
-n.
--vegetables;
కూర్పరాస్తి, kUrparAsti
-n.
--[anat.] ulna; a bone in the forearm; the other bone in the forearm is radius;
కూర్పరి, kUrpari
-n.
--[comp.] compiler; a program that translates a high level language into a low level language;
--(2) [cinema] compiler; editor;
కూరా నారా, kUrA nArA
-n.
--vegetables and stuff;
కూరిమి, kUrimi
-n.
--love; friendship;
కూరు, kUru
-n.
--stuffing;
-v. t.
--stuff; pack; cram;
కూర్చుండు, kUrchuMDu
-v. i.
--sit; be seated;
కూర్చు, kUrchu
-v. t.
--assemble; compile; gather;
కూర్పు, kUrpu
-n.
--compilation; editing;
కూలంకషం, kUlaMkashaM
-adj.
--exhaustive;
కూలపడు, kUlapaDu
-v. i.
--collapse; slump;
కూలి, kUli
-n.
--hire; hired labor;
కూలిన, kUlina
-adj.
--fallen; collapsed; razed;
కూలిన తార, kUlina tAra
-n.
--[astron.] collapsed star; black hole;
కృతజ్ఞత, kRtaj~nta
-n.
--gratitude; gratefulness;
-- కృతం అంటే చేసినది. జ్ఞ అంటే తెలిసిన. కృతజ్ఞత అంటే చేసిన సహాయం మరచిపోకుండ ఉండడం.
-- (ant.) కృతఘ్నత;
కృతయుగం, kRtayugaM
-n.
--the Age of perfection or Krita Yuga; according to Hindu belief, in Krita Yuga, law and order was 100%; in Treta Yuga, it was 75%; in Dvapara Yuga, 50%; in Kali Yuga, 25%. The duration of Krita Yuga is 1,728,000 years;
కృత్యాద్యవస్థ, kRtyaadvastha
- n.
-- the mental struggle one goes through before embarking on a major task
-- ఏదైనా పని చేయడంలో ఎటు చేయనూ తోచక ఆలోచిస్తూ ఉంటే "కృత్యాద్యవస్థ అనుభవిస్తున్నాడు" అంటారు.
కృతి, kRti
-n.
--(1) a type of musical composition sung in the Carnatic style; these songs typically have a Pallavi, Anupallavi, and one or more Charanams; a కృతి is distinct from వర్ణం; పదం; జావళి, తిల్లానా:
--(2) composition; a literary composition;
--(3) dedication;
--(4) a finished item or thing;
కృత్తిక, kRttika %updated
-n.
--(1) Eta Tauri; Alcyone; Yoga tara of the third lunar mansion;
--(2) the Pleiades; The Seven Sisters; It is believed that there were seven stars in this group, but now there are only six; The third of the 27 star groups (or asterisms or lunar mansions) of the Hindu calendar;
--(3) the period of Indic history around 2220 BCE when the vernal equinox occurred in this asterism;
కృత్తికా నక్షత్ర సముదాయం, kRttikA nakshatra samudAyaM
-n.
--Pleiades; A group of six or seven stars found in the constellation Taurus; one of the 27 star groups of the Hindu calendar;
కృత్రిమ, kRtrima
-adj.
--artificial; unnatural;
కృదంతం, kRdaMtaM
-n.
--verbal noun; noun obtained by adding a suffix to a verb;
కృప, kRpa
-n.
--grace; mercy;
కృశించు, kRsiMcu
-v. i.
--waste away; become thin due to malnutrition or disease; languish;
కృష్ణ, kRshNa
-n., adj.
-- Sri Krishna, the incarnation of Lord Vishnu; dark; black; blue; iron; black peppers; croe; cuckoo; buffalo;
-- విష్ణువు యొక్క శ్రీకృష్ణ అవతారం; నలుపు; నీలం; ఇనుము; మిరియము; కాకి; కోకిల; దున్న;
కృష్ణతులసి, kRshNatulasi
-n.
--[bot.] dOcimum americanum; నల్ల తులసి;
కృష్ణపదార్థం, kRshNapadArdhaM
-n.
--[astron.] dark matter;
కృష్ణపక్షం, kRshNapakshaM
-n.
--waning half of a lunar cycle;
కృష్ణశక్తి, kRshNaSakti
-n.
--[astron.] dark energy;
కృషి, kRshi
-n.
--effort;
---కృషితో నాస్తి దుర్భిక్షం = with effort, there is no famine.
కృషీవలుడు, kRshIvaluDu
-n.
--farmer, cultivator;
కెంపు, keMpu
-n.
--ruby; one of the nine gems or semi-precious stones;
-- మాణిక్యం అన్నది సంస్కృత పదం. అది కెంపుకు పర్యాయ పదమే. "మాణిక్య వీణాముపలాలయంతీం. మదాలసాం మంజుల వాగ్విలాసాం" అన్న కాలిదాస కృత దేవీ స్తోత్రం వినే ఉంటారు. కన్నడ భాషలో కెంపు అన్న మాట మాణిక్యానికే కాక 'ఎరుపు రంగు' అన్న అర్థంలో కూడా వాడుతారు. కెంపు యొక్క నాణ్యతను, రంగులోని స్వచ్ఛతను బట్టి 'పద్మ రాగం', 'కురువిందం', 'సౌగంధికం', 'నీలగంధి' అన్న పేర్లతో కూడా పిలుస్తారు;
కెఫీన్, kephIn
-n.
--caffeine; a chemical in coffee or tea that is responsible for the lift experienced after ingesting these drinks;
కెమేరా, kemErA
-n.
--camera; a device to take photographs;
కెరటం, keraTaM
-n.
--wave;
కెరటిన్, keraTin
-n.
--keratin; the protein out of which skin, nails, bones and the like are made;
కెరడు, keraDu
-n.
--bolus; lump; esp. a lump of cooked rice;
కెలుకు, keluku
-v. t.
--stir up;
కెవ్వున, kevvuna
-adj.
--aloud; in a shrill manner;
కేంద్రం, kEMdraM
-n.
--center;
కేంద్ర, kEMdra
-adj.
--central;
---కేంద్ర నాడీ వ్యవస్థ = central nervous system.
కేంద్రకం, kEMdrakaM
-n.
--nucleus; see also కణిక;
కేంద్రకామ్లం, kEMdrakAmlaM
-n.
--[biol.] nucleic acid;see also కణికామ్లం;
కేంద్రాభిముఖ, kEMdrabhimukha
-adj.
--convergent;
కేక, kEka
-n.
--yell; shout; loud cry;
కేకపెట్టు, kEkapeTTu
-v. i.
--yell; shout;
కేకసం, kEkasaM
-n.
--cartilage;
కేకి, kEki
-n.
--peacock; peahen;
కేకు, kEku
-n.
--cake;
కేటాయించు, kETAyiMcu
-v. t.
--allocate; assign; allot; consign;
కేడి, kEDi
-- n. Known Dacoit; Known Depradator;
-- ఈ పదాన్ని మోసగాళ్ళని, అతితెలివి ప్రదర్శనలు చేసేవాళ్ళని ఉద్దేశించి వాడుతుంటాం. Known Dacoit లేదా Known Depradator అనే పదాలకి కుదింపు పేరు;
కేతక, kEtaka
- n.
-- [bot.] Pandanus doratissimus; this is a shrub with fragrant flowers in the shape of long pointed leaves;
కేపు, kEpu
-n.
--offspring; child;
కేబేజీ, kEbEjI
-n.
--cabbage; [bot.] Brassica oleracea of Creciferae family;
కేరం, kEraM
-n.
--cocoanut palm;
కేరట్, kEraT
-n.
--carrot [bot.] Dacus carota;
కేరళం, kEraLaM
-n.
--Kerala; the land of cocoanut palms;
కేరళ వక్క, kEraLa vakka
-n.
--betel nut;
కేరు, kEru
-v. i.
--warble; crow; giggle; chuckle;a screetching sound made by children playfully;
కేరింతలు కొట్టు, kEriMtalu koTTu
-v. i.
--behave hilariously; scream with joy; have fun;
కేలండరు, kElaMDaru
-n.
--calendar;
కేలరీ, kElarI
-n.
--(1) calorie; small calorie; the amount of heat needed to raise the temperature of one gram of water by one degree centigrade; This is the calorie one encounters often in physical sciences; abbreviated cal.;
--(2) Calorie; large calorie; great calorie; the amount of heat needed to raise the temperature of one kilogram of water by one degree centigrade; This is the unit used, in biological sciences, for measuring the energy produced by food as it is metabolized; abbreviated Cal., with a capital C;
కేవు, kEvu
-n.
--freight; the charge for carrying goods on a vehicle;
కేశం, kESaM
-n.
--hair;
కేశనాళిక, kESanALika
-n.
--(1) capillary; the finest of the blood vessels;
--(2) any fine tube;
కేశిక, kESika
-n.
--[biol.] flagellum;
కేసర, kEsara
- n.
-- [bot.] Mimyusops elengi; a large tree with small round flowers whose sweet and pungent smell lasts when the flowers are picked and dried in the sun;
కేసరములు, kEsaramulu
-n. pl.
--(1) [bot.] stamens;
--(2) lion's mane;
కేసరావళి, kEsarAvaLi
-n.
--(1) [bot.] androecium;
--(2) a group of lions;
కేసరి, kEsari
-n.
-- lion;
-- filament in a flower; పుష్పంలోని కింజల్కము;
-- saffron; కుంకుమ పువ్వు; కష్మీర్ లో సాగుచేసే Crocus sativus అనే శాస్త్రీయ నామం కల ఒక మొక్క నీలిరంగు పుష్పాలలోని ఎర్రటి కీలములు, కీలాగ్రములను సేకరించి, సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తారు. దానినే కుంకుమ పువ్వు అంటారు;
క్షేమం, kshEmaM
-n.
--welfare; maintaining what one has;
కైంకర్యం, kaiMkaryaM
-n.
--service;
కైకట్టు, kaikaTTu
-n.
--connection; % use this for electrical connection in E-T part
కైకిలి, kaikili
-n.
--daily wages;
కైకొను, kaikonu
-v. i.
--undertake; takeup; receive; take with one's hand;
కైజారు, kaijAru,
-v. i.
--slide; slip;
కైతవం, kaitavaM
-n.
--hypocrisy;
కైపు, kaipu
-n.
--intoxication;
కైవడి, kvaivaDi
-n.
--manner; likeness;
కైవల్యం, kaivalyaM,
-n.
-- త్రిగుణాతీత స్థితి కైవల్యం. సుఖ, దుఃఖ, మోహ రహిత స్థితి అది. మళ్ళీ పుట్టుక లేని స్థితి కైవల్యం. "యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ" అని భగవద్గీత.
కొంకి పురుగు, koMki purugu
-n.
--[med.] hookworm; a small parasitic nematode worm bearing hooked mouth parts with which it fastens itself to intestinal walls of various hosts, including humans, and causing anemic conditions;
కొంగ, koMga
-n.
--crane; heron; stork;
కొంగు, koMgu
-n.
-- edge, border, or hem of a cloth worn as a dress;
--one of the two ends of a rectagular piece of cloth a woman wears as a sari;
---కట్టుకొంగు = the inner end of the sari that is wrapped around the waist.
---పైటకొంగు = the flying end of the sari that is thrown over the breasts and hangs down freely from the shoulder.
--- కొంగుపడు = walk next to; accompany;
కొంగు బంగారం, koMgu baMgAraM
- ph.
-- easily accessible (like the gold coin tied to the flying end of a sari); low-hanging fruit; easily achievable goal; a good friend who is readily available in times of need;
కొంచెం, koMceM
-adj.
--little; small amount; a bit;
కొంచెపోడు, koMcepODu
- n. m.
-- mean fellow; selfish fellow;
--అల్పుడు; దుష్ట బుద్ధి; స్వార్థ పరుడు;
కొండగోరింక, koMDagOriMka
-n.
--myna bird;
-- మాట్లాడే గోరింక = talking myna; Grackle; hill myna; [bio.] Gracula religiosa of the Sturnidae family;
-- సాధారణ గోరింక = common myna bird; [bio.] Acridotheres tristis of the Sturnidae family;
-- మాట్లాడే గోరింకకి ముఖాన ఉండే బొబ్బలనుబట్టి ఋగ్వేద కాలంలోనే సంస్కృతంలో దానిని ‘రోపణాకా’ అన్నారు. ఆ తరువాత కాలంలో ఆ కారణంగానే దానిని వరణ్డ (వరండ అంటే ముఖం మీద వచ్చే మొటిమ లేక బొబ్బ) అనే పేరుతో పిలిచారు. మాట్లాడే మైనాను సంస్కృతంలో ‘మదన శలాక’ (మన్మథ బాణం) అని కూడా అంటారు. రోపణ అనే సంస్కృత శబ్దానికి బాణము అని అర్థం ఉంది కనుక మన్మథుడి బాణం అనే అర్థంలోనే దీనిని రోపణాకా అనివుంటారు. మాట్లాడే మైనాను మదన శారికా, మదన సారికా అని కూడా అంటారు. దీని మెరిసే నల్లని ఈకలనుబట్టి దీనిని సంస్కృతంలో ‘ కాదంబరీ’ అంటారు. (కద్ + అంబర = Black-plumaged = నల్లని ఈకలు కలిగినది). ప్రేయసీ ప్రియులకు దౌత్యం నెరపుతుంది కనుక దీనికి ‘దూతీ’ అనే పేరూ ఉంది. ప్రయాసపడి ప్రేమికులను కలుపుతుంది కనుక దీనిని ‘యాసా’ అనికూడా అంటారు. తమను పెంచుకునే యజమానులకు ఆనందాన్ని ఇస్తుంది కనుక దీనికి కంజక, కంజన అనే పేర్లూ ఏర్పడ్డాయి. ఈ మైనా ‘మాటల పోగు’ లేక ‘కబుర్ల పోగు’ కనుక దీనికి ‘వచా’ అనే పేరు సార్థకం. మన ప్రాచీనులు గుర్తించిన చతుష్షష్ఠి (అరవై నాలుగు) కళలలో శుకశారికములకు (చిలుకలు, గోరింకలకు) మాటలు నేర్పటం కూడా ఒకటి.
-- గోరువంక;
కొండచింత, koMDachiMta
- n.
-- Copper Pod Tree; [bot.] Peltophorum pterocarpum;
-- The trees have been planted in India as avenue trees alternately with Delonix regia (Poinciana) to give a striking yellow and red effect in summer, as has been done on Hughes road in Mumbai;
కొండచిలువ, koMDaciluva
-n.
--python; rock snake; mountain snake; [Sans.] అజగరం;
కొండచీపురు, koMDacIpuru
-n.
--an elegant large grass; its panicles are used to make brooms; [bot.] Thysonolaena maxima;
కొండతంగేడు, koMDataMgEDu
-n.
--[bot.] Inga xylocarpa; Delonix regia;
-- కొండ తంగేడు వృక్షం ఎర్రటి పూల రసాన్ని, కోడిగుడ్డు తెల్ల సొనతో కలిపి విరిగిన ఎముకలకు కట్టు వేస్తారు.
-- see also నేల తంగేడు (Cassia auriculata);
కొండని తవ్వి ఎలకని పట్టడం, koMDani tavvi elakani paTTaDaDaM
- ph.
-- making a major effort and getting a minuscule reward; (lit.) digging a mountain and catching a mouse;
కొట్టు, koTTu
-n.
--(1) store; shop; grocery store;
--(2) storage room in a house;
--(3) jail;
---కిరాణా కొట్టు = general store.
---కిళ్లీకొట్టు = pan shop; a store where pan or betel leaves and nuts are packaged into a fragrant after-dinner chew.
-v. t.
--hit; knock; rap; strike; slap;
---do not hit the child = బిడ్డని కొట్టకు.
---someone is knocking (rapping) on the door = ఎవరో తలుపు కొడుతున్నారు ,
---the clock struck four = గడియారం నాలుగు కొట్టింది,
---it smelled bad = అది కంపు కొట్టింది.
కొట్టుకొను, koTTukonu
-v. i.
--(1) thrash; flail;
--(2) beat; pulsate; throb;
---the heart pulsated = గుండె కొట్టుకున్నది.
---the dog thrashed his legs and died = కుక్క గిలగిల కొట్టుకుని చచ్చిపోయింది.
---కొట్టుకొని వచ్చు = arrive by drifting in a current of water;
కొటేరు, koTEru
-n.
--an downside-up plow with the blade pointing upwards;
-- ఏరు అంటే దున్నడానికి సిద్ధంగా ఉన్న నాగలి. ఏరువాక అంటే దున్నడానికి మొదలయే సమయం. కోటేరు అంటే దున్నడానికి సిద్ధంగా లేని నాగలి.
---కొటేరు లాంటి ముక్కు = a sharp nose.
కొడవలి, koDavali
-n.
--sickle; scythe;
కొడుకు, koDuku
-n.
--son; In classical Indian tradition, there are 12 types of sons; Some are listed below;
--- ఔరసుడు = son born to a man and his legally married wife, both belonging to the same "varnam;"
--- క్షేత్రజ్ఞుడు = if a man couldn't sire a child, then son born to his legally married wife with the help of an appointed man for this purpose;
--- దత్తుడు = son adopted through traditional religious rites;
--- కృత్రిముడు = an orphan boy raised by a couple;
--- అపవిద్ధుడు = a boy abandoned by birth parents and raised by a different couple;
--- జ్ఞాతుడు = son of a brother;
కొబ్బరి చెట్టు, kobbari ceTTu
-n.
--coconut palm; [bot.] Cocos nucifera of the Arecaceae family;
కొబ్బరితురుం పూలు, kobbariturum pUlu
- n.
-- Indian Crepe Myrtle; [bot.] Lagerstroemia indica of the Lythraceae family;
-- Bred by the National Arboretum, these outstanding Crape Myrtle varieties were named after North American native Indian tribes; This is a widely commercialized ornamental shrub or small tree that has become naturalized and invasive in many tropical and subtropical regions of the world;
కొబ్బరి పాలు, kobbari pAlu
-n.
--coconut milk; milky liquid obtained by grinding and squeezing fresh coconut meat;
కొబ్బరి పువ్వు, kobbari puvvu
- n.
-- (1) coconut flower; (2) coconut sprout that grows inside a mature coconut; బాగా పండిన కొబ్బరికాయకు తేమ తగిలినప్పుడు కొబ్బరికాయ నుండి మొలక వస్తుంది, కొబ్బరికాయ కన్నుల నుంచి అన్ని విత్తనాల లాగానే. ఆలా కొబ్బరికాయలో మొలక వచ్చినపుడు కొబ్బరికాయ లోపల పువ్వులాంటి తెల్లని పదార్థం లోపల పెరుగు తుంది. దీన్నే కొబ్బరి పువ్వు అంటారు. దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే అదృష్టం అని చెబుతారు.
కొబ్బరి మట్ట, kobbari maTTa
-n.
--stem of a coconut leaf;
కొబ్బరి నల్లి, kobbari nalli
-n.
-- Eriophyid mites; a pest that attacks coconuts;
-- నల్లి మరింతగా విస్తరించకుండా ముందుగా నల్లి సోకి రాలిన పిందెల్ని ఏరి ఒకచోటపోసి తగలబెట్టాలి. వేపమందు (అజాడిరాక్టిన్) ఒక లీటర్ నీటిలో 5 మిల్లీలీటర్లు చొప్పున కలిపి గెలలపై పిచికారీ చెయ్యాలి. నాలుగు నెలలకు ఒకసారి ఇదే మందును నీటిలో కలిపి వేరు ద్వారా కూడా ఎక్కించాలి. నత్రజని, భాస్వరం, పొటాష్ (NPK) ఎరువులు, సేంద్రియ ఎరువులు నిర్దేశిత మోతాదులలో వాడుకుంటే నల్లి ఉద్ధృతిని తగ్గించవచ్చు.
కొబ్బరి నీళ్లు, kobbari nILLu
-n.
--coconut water; there is some confusion on the proper translation of this phrase; Indians prefer to use the literal translation "coconut water" and use "coconut milk" to refer to the milky liquid obtained by grinding and crushing fresh coconut meat; English-speaking countries translate these words respectively as "coconut milk" and "coconut juice";
-- also called ఎడ నీళ్లు;
--[Sans.] నారికేళః
కొప్పు, koppu
-n.
--a tuft into which the long tresses of a female are folded;
కొమ్మ, komma
-n.
--(1) branch;
--(2) a female;
కొమ్మదాసరి, kommadAsari
-n.
--an alms-seeker who climbs up a tree branch, threatening not to come down until he is given alms;
కొమ్మరటి, kommaraTi
-n.
--branchy banana; bananas with green-skinned fruit; బంగాళీ రంభ; the word plantain is reserved for the green cooking variety and banana is used to indicate the fruit variety;
కొమ్ము, kommu
-n.
--(1) horn;
--(2) antler; scientifically, horn is solidified hair whereas antler is skin with a blood supply;
--(3) dried stick of a tuber like turmeric as in పసుపు కొమ్ము;
--(4) the symbol attached to a consonant to impart the vowel sound "U";
--(5) a sweet snack called మిఠాయికొమ్ము;
--(6) the handle on a side of a palanquin;
--(7) musical instrument; perhaps made out of horn;
కొర్రలు, korralu
- n.
-- a grain similar to millet; foxtail millet; Italian millet; German millet; Chinese millet; and Hungarian millet; [bot.] Panicum Italicum; Setaria Italica of the Poaceae family;
--an annual grass grown for human food. It is the second-most widely planted species of millet and the most important in Asia. It has the longest history of cultivation among the millets, having been grown in India since antiquity.
-- నక్కతోక బియ్యం; పంటకి వచ్చిన వెన్నులు నక్క తోక ఆకారంలో ఉంటాయి;
--రోజూ కొర్ర జావ కాచుకుని దానిలో పాలు కలుపుకుని తాగుతుంటే కొద్ది రోజులలోనే విరిగిన ఎముకలు అతుక్కుంటాయి.
కొరవ, korava
-n.
--(1) anchovy; a fish; [biol.] Coilia korua;
--(2) long finned anchovy; a fish; [biol.] Setipinna godavari;
కొరివి, korivi
-n.
--a burning log that can be held at one end;
కొరివికారం, korivikAraM
-n.
--a spicy pickle made from fresh (as opposed to dry) fruits of red peppers, salt and tamarind;
కొరివిదయ్యం, korividayyaM
-n.
--fiery fiend; a ghost or apparition that purportedly appears in the shape of a moving flame or with a torch in its hand; spontaneous combustion of marsh gases probably led to this belief; willow-o'-the-wisp; [Latin] Ignis fatuus; (ఇగ్నిస్ ఫేచ్యూఅస్) fool's fire;
కొరుకు, koruku
-v. t.
--bite; bite to the extent of taking a piece off;
కొర్రు, korru
-n.
--(1) a peg;
--(2) a spike used to impale criminals in ancient times;
కొలకర్ర, kolakarra
-n.
--measuring rod;
కొలత, kolata
-n.
--measurement;
కొలపట్టీ, kolapaTTI
-n.
--measuring tape;
కొలపాత్ర, kolapAtra
- n.
-- measuring vessel;
కొలబద్ద, kolabadda
-n.
--measuring strip; scale;
కొలమానం, kolamAnaM
- n.
-- system of measurement;
కొలమానిక, kolamAnika
-n.
--measuring cup;
కొలను, kolanu
-n.
--pool; pond;
కొల్లం, kollaM
-n.
--bin; bin for animal fodder;
కొల్ల, kolla
-n.
--plunder; pillage;
కొల్లగొట్టు, kollagoTTu
-v. t.
--plunder; rob; pilfer; loot;
కొస ముట్టించు, kosa muTTiMcu
-v. t.
--finish; conclude; bring an end to; (lit.) lit up the end (of a fuse);
కొసరు, kosaru
-n.
--a little extra given by a merchant as a goodwill gesture over and above a measured quantity;
%కో - kO, కౌ - kau
కోక, kOka
-n.
-- sari; a woman's garment;
కోకలి, kOkali
- n.
-- Indian acalypha; [bot.] Acalypha indica of the Euphorbiaceae family;
-- an erect annual herb;
కోకా, kOkA
-n.
-- coca; [bot.] Erythroxylon coca; The leaves of this bush, found in South America, have 14 different drugs, most important of which is cocaine. South American Indians chew these leaves, sometimes after applying quicklime paste. Chewing this combination gives a little high. See also కాకౌ (cacao);
కోకిల, kOkila
-n.
--the Indian black cuckoo;
కోకోచెట్టు, kOkO
-n.
--cocoa tree; cacao tree; [bot.] Theobroma cacao, which means "food of the Gods";
కోకెయిన్, kokeyin
-n.
--cocaine;
కోట, kOTa
-n.
--(1) fort;
--(2) tower;
---తులసి కోట = a miniature brick structure to house the holy basil plant, something that is invariably found in any traditional Hindu family's front or back yard.
కోటా, kOTA
-n.
--(1) coat; covering; especially a heavy application of talcum powder to the face;
--(2) quota; a designated quantity;
---కోటా కొట్టేడు = he applied a heavy coat of powder.
---కోటా కొట్టు = a government depot where food rations are sold.
కోటాకు, kOTAku
-n.
--the last leaf (usually much shorter in length) produced by a banana plant before it blooms the only time in its life cycle;
---వాడు కోటాకు వేసేడు = [idiom] he finished all his responsibilities toward gaining skills to earn a livelihood and ready to bear fruit.
కోటానుకోట్లు,
-n.
--innumerable; very many; billions and billions;
కోటి, kOTi
-n.
--(1) ten million; hundred lakhs; crore; one followed by 7 zeros in the traditional Indian method of counting; కరోరు;
కోటీశ్వరుడు, kOTISvaruDu
-n.
--(1) ten-time millionaire; a person having tens of millions of rupees; same as కరోర్‌పతి;
కోటు, kOTu
-n.
--(1) coat; jacket; an outer garment worn by men;
--(2) a type of bidding in a card game where the player challenges that he will take all the tricks. Similar to slam bidding in Bridge.
కోతల రాయుడు, kOtala rAyuDu
-n.
--raconteur, prevaricator; a person who habitually tells tall tales; falsehoods, lies; or fabrications;
కోతి, kOti
-n.
--monkey; monkey with a red mouth; (rel.) కొండముచ్చు; ఏపుకోతి;
కోతి కొమ్మచ్చి, kOti kommacci
-n.
--a game where children climb a tree, come down and chase each other;
కోదండం, kOdaMDaM
- n.
-- a type of punishment meted out to children in elementary schhols in India in which the errant child is held upside down for a few minutes;
-- శీర్షాసనం వెయ్యడంరాని పిల్లలకు, పెద్దలే కాళ్ళు పట్టుకొని తలక్రిందులుగా కొంతసేపు ఉంచడమే కోదండం. కోదండం అనేది కొరత వేయడం లాంటి క్రూరమైన శిక్ష యేమీకాదు. ఏమాత్రం జాలిపడవలసిన విషయమూ కాదు. క్రమశిక్షణతో పాటు జ్ఞానాన్ని కూడా పెంచే ప్రయత్నం మాత్రమే!
-- see also గోడకుర్చీ, గుంజీలు;
కోరడి, kOraDi
-n.
--fence; hedge; an earthen ridge with thorny bushes to act as a fence;
కోరపళ్లు, kOrapaLlu
-n.
--incisors; canine teeth;
కోరాం, kOrAM
-n.
--grater; a kitchen implement to grate vegetables;
---కొబ్బరి కోరాము = coconut grater.
కోరా, kOrA
-adj.
--unbleached;
కోర్వాదులు, kOrwaadulu
- n. pl.
-- [Gram.] the list of words starting with "కోరు", namely [కోరు, పూను, పోలు, మను, విను, చూడు];
-- కోర్వాదులు అంటే కోరు ఆది గా గల కొన్ని శబ్దాలు. అంటే ఇది ఒక జాబితా. ఈ జాబితాకు మొదటి పదం "కోరు" కాబట్టి ఈ చిట్టా పేరు కోర్వాదులు. ఇవి తప్ప మనలాంటి వారు కొత్త మాటలు ఈ చిట్టా కు చేర్చకూడదు;
కోరు, kOru
-n.
--gratings;
---కొబ్బరి కోరు = grated coconut.
-v. t.
--(1) wish; ask; propose; pray;
--(2) erode;
---ఒక వరం కోరుకో = make one wish.
---నది ఒడ్డుని కోరేస్తున్నాది = the river is eroding the banks.
కోర్టు, kOrTu
-n.
--(1) court; a hall of justice;
--(2) playground organized for a specific game, typically involving a net to separate two sides;
---కోర్టులో దావా వేస్తాను = I will file a suit in the court.
---టెన్నిస్‌కోర్టు బాగా తడిసిపోయింది = the tennis court has become very wet.
కోలంగోవా, kOlaMgOvA
-n.
--a variety of mangoes suitable for pickling;
కోల, kOla
-adj.
--oblong; long; oval;
-n.
--baton; stick;
కోలపరగ, kOlaparaga
-n.
--golden anchovy; a fish; [biol.] Coilia dussumieri;
కోలాటం, kOlATaM
-n.
--a folk dance in which people, with batons in hands, go around a circle and strike the batons in harmony;
కోలాహలం, kOlAhalaM
-n.
--commotion; noise from a crowd; hubbub;
కోలు, kOlu
-adj.
--big; large;
---కోలుపడిగె = large banner.
కోలుకర్ర, kOlukarra
- n.
-- measuring stick; scale;
కోలుకాడు, kOlukADu
-n.
--bailiff; (lit.) the big man;
కోలుకొను, kOlukonu
-v. i.
--recover; get cured;
కోలుపోవు, kOlupovu
-v. t.
--lose;
కోవి, kOvi
-n.
--tube;
కోవిదత్వం, kOvidatvaM
- n.
-- scholarship; learnedness; erudition;
కోవిదుడు, kOviduDu
-n. m.
--skilled man; learned man; scholar;
కోశస్తం, kOSasthaM
-n.
--(1) pupa; chrysalis; one of the life stages of silkworms, butterflies and the like;
కోశాగారం, kOSAgAraM
- n.
-- treasury;
కోశాధికారి, kOSAdhikAri
- n.
-- treasurer;
కోష్ఠిక, kOShThika
- n.
-- [sci.] chamber;
కోష్టు, kOshTu
- n.
-- Snow lotus; [bot.] Saussurea lappa; a perennial herbaceous plant, ranging in height from dwarf alpine species 5–10 cm tall, to tall thistle-like plants up to 3 m tall
--Costi amari radix or costus root was an important item of Roman trade with India and is believed to have been the dried root of Saussurea lappa;
--this is an ingredient in the Ayurvedic mixture called "vacaadi choornam;"
కోస్తా, kOstaa
- n.
-- coast;
-- తీరం అంటే నదీతీరం కావచ్చు, సముద్రతీరం కావచ్చు. కోస్తా అంటే సముద్రతీరం మాత్రమే. కోస్తా అనే మాట ఇంగ్లీషు మాట coast నుండి వచ్చింది. దీనికి తెలుగు మాట "ఒడ్డు." ఈ ఒడ్డు అనే మాట నదీతీరంని కానీ, సముద్రతీరంని కానీ సూచించవచ్చు;
కోసు, kOsu
-n.
-- a measure of distance used in India until recently (believed to be about 5.5 kilometers or 2.5 miles);
క్రోమియం, krOmiyaM
-n.
--Chromium; one of the chemical elements whose symbol is Cr and atomic number 20;
క్షోణి, kshONi
-n.
--(1) the earth;
--(2) the number 1017; one followed by seventeen zeros;
క్షోభ, kshObha
-n.
--agitation; suffering;
కౌగలింత, kaugaliMta
-n.
--embrace; hug;
కౌటిల్యం, kauTilyaM
-n.
--Machiavellianism; craftiness; political craftiness;
కౌపీనం, kaupInaM
-n.
--modesty piece used by men;
కౌమారం, kaumAraM
-n.
--youth; bloom;
కౌముది, kaumudi
-n.
--moonlight;
కౌలు, kaulu
-n.
--land-lease; the process by which a tiller leases land for agricultural purposes and pays the landlord an agreed upon rent;
-- కౌలుకు తీసుకొనడం అంటే ఇంతకాలం ఇంత భూమి అని భూయజమాని దగ్గర భూమి తీసుకొని సంవత్సరానికి ఇంత అని (ముందు ఉభయులూ ఒప్పుకొన్న ప్రకారం) ప్రతి సంవత్సరమూ చెల్లించడం. ఆ పొలం పండించుకోవడం అంతా గుత్తకు తీసుకొన్న అతని బాధ్యత. అతడు పని వాళ్ళను పెట్టుకొని పంట పండించుకోవాలి. ఖర్చులన్నీ రైతే భరించి పండించాలి.
క్రౌంచపక్షి, krauMchapakshi
- n.
-- Indian Sarus Crane; curlew;
-- (1) ఒక తరహా సముద్రపు పక్షి; ఉల్లంకాయ; నల్లకంకణము; వడ్లకంకణము; బలాకము; (2) కొంగ; ఓదెకొంగ;
--a large wading bird of the sandpiper family, with a long down-curved bill, brown-streaked plumage, and frequently a distinctive ascending two-note call.
-- ‘క్రుఞ్ క్రౌఞ్చః’ అని అమరకోశం క్రౌంచపక్షికి క్రుఙ్, క్రౌంచః అని రెండు పేర్లు చెపుతుంది. ఈ రెండు పేర్లూ ‘క్రుఞ్చ గతి, కౌటిల్య, అల్పభావయోః’ అనే ధాతువునుండి ఏర్పడినాయని – అంటే పంక్తిరూపముగా బోవునది, లేక కుటిలమై (వంకరగా) నుండునది – అని గురుబాలప్రబోధిక. కొంగ అని దీనికి తెలుగులో అర్థము వ్రాసినారు అమరంలో. కొంగలు బారులు దీరి పోవుట, వాటి శరీరనిర్మాణము వంకరగా నుండుటచే ఈ వ్యుత్పత్తులు సరిపోయినవి. ఈ క్రౌంచ శబ్దంయొక్క వికృతులే కొంచ, క్రొంచ అను తెలుఁగు పదాలు. ‘పసిఁడికీల్బొమ్మ మీపజ్జ నేగదు గదా కొంచలార, కొలంకుటంచలార!’ అని అచ్చతెనుఁగు రామాయణంలో కొంచలార = కొంగలార అనే అర్థంలో వాడిన కొంచశబ్దం. ‘చలాచలక్రౌంచ కారండవ మండలీ పటపటత్కారపటహారవంబులతో’ అని వసుచరిత్రము. ఈ వాక్యంలో గల క్రౌంచకారండవాలకు క్రౌంచ = కొంగలయొక్కయు, కారండవ = కన్నెఱేడు పక్షులయొక్కయు అని సోమకవి వ్యాఖ్యానం. ఈ విధంగా క్రౌంచపక్షి అంటే కొంగ అనడానికి సాహిత్యంలో అనేక ప్రయోగము లున్నవి. (దేశికాచారి)
-- "The key event at the start of the Sanskrit Rāmāyaṇa attributed to Vālmīki is the death of a bird at the hands of a hunter. In Sanskrit, that bird is termed krauñca. Various identifications have been offered in the past but uncertainty persists. Focusing on the text of the critical edition and drawing on ornithological data regarding the birds commonly suggested, this article establishes beyond doubt that Vālmīki’s ‘krauñca bird’ is the Indian Sarus Crane. It then considers a key verse in the southern recension, omitted by the editors of the critical edition, which supports this identification. Finally, the article explores the significance of the Indian Sarus Crane for the epic scene." - LESLIE, JULIA. “A BIRD BEREAVED: THE IDENTITY AND SIGNIFICANCE OF VĀLMĪKI’S ‘KRAUÑCA.’” Journal of Indian Philosophy 26, no. 5 (1998): 455–87. http://www.jstor.org/stable/23496373.
Part 3: ఖం - khaM
ఖంగుతిను,khaMgutinu
-v.i.
--get hurt or get defeated; astonished at the unexpected turn of events;
-- same as కంగుతిను;
ఖంగుమను,khaMgumanu
-v.i.
--sound like a metal striking metal;
ఖగోళీయ క్షితిజం, khagOLIya kshitijaM
-n.
--celestial horizon; the imaginary circle created by extending the plane of observation;
ఖచరం, khacaraM
-n.
--(1) bird;
--(2) wind;
--(3) cloud; (lit.) one that wanders in space; ఖేచరం;
ఖచ్చితం, khaccitaM
-n.
--(1) strict; by the book;
--(2) accurate; on the button;
ఖజానా, khajAnA
-n.
--treasury;
ఖటికము, khaTikamu
-n.
--[chem.] calcium;
ఖటికధరోల్, khaTikadharol
-n.
--[chem.] calciferol; one of the D vitamins; an alcohol C28H43OH usually prepared by irradiation of ergosterol and used as a dietary supplement in nutrition and medicinally in the control of rickets and related disorders;
ఖటికపుటెరువు, khaTikapuTeruvu
-n.
--fertilizer with a major portion of calcium carbonate;
ఖనిజం, khanijaM
-n.
--mineral; ore; (lit.) one that is found in a mine; (rel.) లోహం;
ఖనిజ లవణం, khanija lavaNaM
-n.
--mineral salt;
ఖనిజపు చమురు, khanijapu camuru
-n.
--mineral oil; The name mineral oil by itself is imprecise, having been used for many specific oils over the past few centuries; Mineral oil is any of various colorless, odorless, light mixtures of higher alkanes from a mineral source, particularly a distillate of petroleum, as distinct from usually edible vegetable oils; Other names, similarly imprecise, include white oil, paraffin oil, liquid paraffin (a highly refined medical grade), paraffinum liquidum (Latin), and liquid petroleum. Baby oil is a perfumed mineral oil;
ఖబడ్దార్, khabaddaar
-inter.
--be so informed!; be so warned!;
ఖురసాని వాము, khurasAni vAmu
-n.
--seeds of Bishop's weed; (Bishop's weed is also known as అజమోద or అజామోద;)
--Henbane; black henbane; stinking nightshade; [bot.] Hyoscyamus niger of the Solanaceae family;
ఖుషీ, khuShI
- n.
-- happiness; delight;
ఖూనీ, khUnI
- n.
-- murder;
ఖేచరం, khEcaraM
-n.
--(1) bird;
--(2) wind;
--(3) cloud; (lit.) one that wanders in space;
ఖేచరుడు, khEcaruDu
-n.
--demigod;
ఖైదు, khaidu
-n.
--jail; prison; imprisonment;
ఖైదీ, khaidI
-n.
--prisoner; inmate;
మూలం
V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN: 0-9678080-2-2