Jump to content

వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/T-U

Wikibooks నుండి

చూడటం

నిఘంటువు

  • This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features are continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
  • T The entries use American spelling. Where possible, British spellings are also given.
  • You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
  • PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks

25 Aug 2015.

Part 1: T

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • table, n. (1) బల్ల; మేజా; భోజనాల బల్ల; (2) పట్టిక; పట్టీ; సారణి; సరణి; (3) ఎక్కం;
    • addition table, ph. కూడిక పట్టీ; కూడిక ఎక్కం;
    • experience table, ph. అనుభవ సారణి; యాంత్రిక అభ్యాసంలో దత్తాంశాలని అమర్చే ఒక పద్ధతి;
    • multiplication table, ph. ఎక్కం; గుణకార ఎక్కం;
    • water table, ph. జలమట్టం; భూమిలో ఈ మట్టానికి దిగువ నీరు సంతృప్తంగా ఆవరించి ఉంటుంది; నుయ్యి తవ్వినప్పుడు నీరు ఈ మట్టానికి నిలుస్తుంది;
    • table of contents, ph. విషయసూచిక;
    • table salt, ph. ఉప్పు; వంటలో వాడే ఉప్పు; కూర ఉప్పు;
    • table spoon, ph. వడ్డన చెంచా; పెద్ద చెంచా;
    • table sugar, ph. చక్కెర; రోజూ వాడుకునే పంచదార;
  • tableland, n. పీఠభూమి; సానువు;
  • tablet, n. (1) బిళ్ల; గుటిక; మాత్ర; మింగడానికి అనుకూలంగా ఉన్న మోతాదు మించని మాత్ర; (2) పలక; కర్రతో కాని, మట్టితో కాని, రాయితో కాని చేసి, రాతకి అనుకూలంగా చదునుగా ఉన్న వస్తువు;
    • clay tablet, ph. మట్టి పలక;
  • taboo, n. అశ్లీలం; బూతు; సాధు సమ్మతం కానిది; చెయ్యకూడని చేత; రాయకూడని రాత;
  • tabular, adj. విన్యాస; సారణ్య విన్యాస;
    • tabular arrangement, ph. సారణీబద్ధమైన విన్యాసం:
  • tabula rasa, n. ఖాళీ పలక; తెల్ల కాగితం; అలేఖ్యం; అలేఖం;
  • tabulation, n. సారణీకరణం;
  • tacit, adj. అనుక్త; ప్రత్యేకంగా చెప్పని; ఉద్ఘాటించని; ముభావంగా ఊరుకున్న; అంతర్లీనమైన;
  • tacit assumption, ph. అనుక్త ఉపపాదన; ఉద్ఘాటించని తలంపు;
  • taciturn, adj. ముభావంగా ఉన్న; తక్కువగా మాట్లాడే తత్వం కల;
  • tack, n. పూతిక నాటు; చిన్న మేకు;
    • thumbtack, ph. బొత్తాం నాటు; సుత్తి అవసరం లేకుండా వేలితో గోడకి గుచ్చగలిగే సదుపాయం ఉన్న మేకు;
  • tact, n. యుక్తి; ఒడుపు; వెరవు; నేర్పు; చాతుర్యం;
    • tact and talent, ph. శక్తియుక్తులు;
  • tactic, n. లఘుయుక్తి; లఘుతంత్రం; పన్నాగం; సమీప భవిష్యత్తుకి కావలసిన ఎత్తు; టాక్టికల్ వ్యూహాలు అంతిమ లక్ష్యానికి చేర్చే వ్యక్తిగత దశలు లేదా చర్యలు. టాక్టిక్స్ ఆచరణకు సంబంధించినవి. టాక్టిక్స్ "ఎలా", "ఎవరు" అనే ప్రశ్న మీద ఆధారపడి ఉంటుంది. "ఎలా" చేస్తున్నారు, "ఎవరు" చేస్తున్నారు అనేది మాత్రం అందరికి కనిపిస్తుంది. see also stratagey;
  • tactile, adj. స్పర్శకి సంబంధించిన;
  • tadpole, n. తల కప్ప; భేకడింభం; చిరు కప్ప; పిల్ల కప్ప;
  • tail, n. (1) తోక; పక్షి తోక; జంతువుల తోక; విమానపు తోక; (2) వాలం; లాంగూలం; జంతువుల తోక; (3) బొరుసు;
    • hairy tail, ph. లాంగూలం; గురప్రు తోక లాంటి కుచ్చు తోక;
  • tail, v. t. వెంటాడు; తోకలా వెంటాడు; వెన్నంటి వెళ్లు;
  • tail-lights, n. pl. తోకదీపాలు;
  • tailor, n. దర్జీ; తున్నవాయుఁడు; కుట్టరి;
  • tailwind, ph. వాలుగాలి;
  • taint, n. కళంకం; కల్తీ;
  • taint, v. t. కల్తీ చేయు; కళంకం తీసుకొని వచ్చు;
  • tainted, adj. కల్తీ అయిన;
  • take, v. t. (1) తీసుకొను; కైకొను; చేపట్టు; (2) సేవించు; తిను; తాగు;
  • takeoff, n. (1) ఎత్తుగడ; (2) పైకి లేచు; గాలిలోకి లేచు; (ant.) conclusion; landing;
    • takeoff of a story, ph. కథ ఎత్తుగడ;
  • take up, v. t. చేపట్టు;
  • talc, n. మెత్తని అభ్రకం; మెత్తని కాకిబంగారం; a clay mineral, composed of hydrated magnesium silicate with the chemical formula Mg3Si4O10(OH)2; Talc in powdered form, often combined with corn starch, is used as baby powder. Its use in baby powder is now prohibited because it is suspected to contain traces of asbestos;
  • tale, n. కథానకం; ఉపాఖ్యానం;
  • talent, n. నేర్పు; కుశలత; కౌశల్యం; ప్రతిభ; ప్రజ్ఞ; ‘జన్మతః సంక్రమించే నైసర్గిక లక్షణం’ అనేదే ప్రతిభ అన్నారు దండి; అభినవ గుప్తుడు ‘అపూర్వ వస్తు నిర్మాణ ప్రజ్ఞ’గా చెప్పారు;
  • talisman, n. తావీజు; తాయెత్తు; రక్షామణి; రక్ష; మైరేకు;
  • talk, n. మాట; పలుకు; ప్రసంగం;
    • parrot talk, ph. చిలక పలుకు;
    • talk of the town, ph. కింవదంతి;
  • talk, v. t. మాట్లాడు; భాషించు;
  • talkies, n. మాట్లాడే బొమ్మలు; సినిమాలు;
    • talkative person, ph. వాగుడుకాయ; వాచాలుడు; వాచాటుడు; జల్పకుడు;
  • talkativeness, n. వాచాలత;
  • tall, adj. పొడవైన; పొడుగైన; ఎత్తయిన;
  • tallow, n. కొవ్వు;
  • tally, n. బేరీజు; తైపారు;
  • tally, v. t. బేరీజు వేసి చూడు; తైపారు వేసి చూడు;
  • talons, n. pl. పక్షి గోళ్లు; పంజా;
  • tamarin, n. మీసాలకోతి;
  • tamarind, n. చింతపండు; తింత్రిణీకం; (ety.) tamar-e-Hind = Indian date = భారతీయ ఖర్జూరం;
    • tamarind tree, ph. చింతచెట్టు; తింత్రిణీ వృక్షం;
    • tamarind seed, ph. చింతగింౙ; చింతపిక్క;
  • tame, adj. మచ్చిక అయిన; పెంపుడు; సాధు; (ant.) wild; (rel.) domesticated;
  • tame, v. t. మచ్చిక చేయు;
  • tamp, v. t. దట్టించు; కూరు;
  • tamper, n. పోఁపు; తాలింపు; తిరగబోత;
  • tamper, v. t. జోలికి పోవు; జోక్యం కలుగజేసుకొను; లంచం ఇచ్చు;
  • tan, n. (1) లేత గోధుమ రంగు; కడారు వన్నె; (2) పదును; కురటము; చర్మాన్ని తోలుగా మార్చే పద్ధతి;
  • tan, v. t. (1) ఎండలో కూర్చుని శరీరాన్ని లేత గోధుమ రంగు లోకి మార్చు; (2) ఊను; ఊన్‌చు; పదును పట్టు; కురటించు; చర్మాన్ని తోలుగా మార్చు;
  • tangent, n. (1) స్పర్శరేఖ; (2) స్పర్శాంశం; త్రిభుజంలో ఒక కోణానికి ఎదురుగా ఉన్న భుజం లవంలోనూ, పక్కగా ఉన్న భుజం హారంలోనూ వేసినప్పుడు వచ్చే నిష్పత్తి; లంబకోణ త్రిభుజంలో లంబకోణం కాని ఒకకోణానికి ఎదురుగా ఉన్నభుజం లవం లోను, ప్రక్కగా ఉన్న( కర్ణం కాని) భుజం హారం లోను వేసినప్పుడు వచ్చే నిష్పత్తి;
  • tangible, adj. స్పర్శనీయ; అనుభవనీయ; సాకారమైన; స్పష్టమైన;
  • tangle, n. చిక్కు;
  • tank, n. (1) చెరువు; తటాకం; కోనేరు; టెంకి; పుష్కరిణి; (2) తొట్టి;
  • tanner, n. కురటుడు; చర్మాన్ని తోలుగా మార్చే వ్యక్తి;
  • tanner's cassia, n. తంగేడు చెట్టు; [bot.] Senna auriculata;
  • tannery, n. కురట శాల; తోళ్లని పదును చేసే కర్మాగారం;
Tangent_to_a_curve
Academ_Base_of_trigonometry
  • tantalizing, adj. ఆశ పెట్టే; ఆశాజనకమైన; ఊరించే;
    • tantalizing clues, ph. ఆశాజనకమైన సంకేతాలు; ఆశాజనకమైన ఆచూకీలు; ఊరించే ఊహలు;
  • tantamount, adj. నిజానికి; వాస్తవానికి; మొత్తంమీద; సమానార్ధకమైన;
  • tap, v. t. (1) తట్టు; (2) చిన్న గంటు పెట్టి వెలికి తీయు;
  • tap, n. (1) కుళాయి; నల్ల; గొట్టానికి గంటు పెట్టి నీళ్లని బయటకు తీసే సాధనం; పంపు; (2) [phonetics] అల్ప కంపితం;
    • water tap, ph. నీళ్ళ కుళాయి;
    • tap root, ph. తల్లి వేరు; కూకటి వేరు;
  • tapaculo, n. వెందాపు పక్షి;
  • tape, n. పట్టెడ; నవారు; బద్దీ; నాడా; టేపు;
  • taper, adj. కూచిగా ఉన్న; ఆదోక; (ety.) ఆవుతోక వలె;
    • taper joint, ph. ఆదోక బందు; ఆదోక బంధం;
  • taperingly, adv. అదోకగా;
  • tapestry, n. చిత్ర యవనిక; గుడ్డ మీద వేసిన వర్ణ చిత్రం;
  • tapeworm, n. బద్దె పురుగు; మనుష్యుల చిన్న ప్రేగులలో పెరిగే ఒక జాతి పరాన్నభుక్కి; an invertebrate of the platyhelminth family;
  • tapioca, n. సగ్గుబియ్యం; కఱ్ఱపెండలం జాతి పిండి పదార్థంతో చేసే ఒక ధాన్య విశేషం; తాళజాతి చెట్ల నుండి వచ్చే పిండితో చేస్తే దానిని "సేగో" అంటారు; see also sago;
  • tar, n. తారు; కీలు; గంజిత్తు; (ety.) గని + జిత్తు;
  • tardy, adj. ఆలస్యం చేసెడు;
  • tare, n. తారం; తారా; పడికట్టు ఎత్తు; తూనిక తోపుడు; సరుకులు బుట్టలో వేసి తూచేటప్పుడు ఖాళీ బుట్ట బరువు;
  • target, n. లక్ష్యం;
  • targeted, adj. లక్షిత;
    • targeted reader, ph. లక్షిత పాఠకుడు;
  • tariff, n. (1) సుంకం; ఎగుమతి దిగుమతుల మీద ప్రభుత్వం వేసే సుంకం; (2) హొటేలు గదులకి పుచ్చుకొనే అద్దె; (3) సుంకాల పట్టీ; సుంకసూచిక;
  • tarnish, n. మెరుపు తగ్గుట; కిలుం పట్టుట;
  • taro root, n. చేమ దుంప;
  • tarpaulin, n. కీలుచాప; తారుగుడ్డ;
  • tart, adj. పుల్లని;
  • tartar, n. (1) ద్రాక్ష ఉప్పు; (2) పండ్లమీద చేరే మలినం; పాచి;
తింత్రిణికామ్లం
    • tartaric acid, n. తింత్రిణికామ్లం; C4H6O6
  • task, n. పని;
  • taste, n. (1) రుచి; స్వాదనం; చవి; రసం; (rel.) aroma; flavor; (2) రసజ్ఞత; (3) అభిరుచి;
  • taste, v. t. రుచిచూడు; చవిచూడు; ఆస్వాదించు;
  • taste, adj. రుచి; స్వాదు; చవి;
    • taste buds, ph. రుచిబొడిపెలు; స్వాదుముకుళాలు;
  • tasteless, adj. చప్పిడి; రుచిలేని; రసహీనమైన;
  • tasty, adj. కమ్మని; రుచికరమైన;
  • tattle, v. t. వదరుట; పేలుట; వాగుట; ఉపయోగం లేని కబుర్లు, చాడీలు;
  • tattletales, n. పనికిమాలిన కబుర్లు; గుసగుసలు;
  • tattoo, n. పచ్చబొట్టు;
  • taunt, n. దెప్పు; ఎత్తిపొడుపు; ఉపాలంభం;
  • taunt, v. t. దెప్పు; ఎత్తిపొడుచు;
  • taupe, n. తోపు; తోపురంగు; ముదర ఎరుపు;
  • Tauri Beta, n. అగ్ని నక్షత్రం; వృషభ రాశి లోని ప్రకాశవంతమైన నక్షత్రాలలో రెండవది;
  • Tauri Gamma, n. రోహిణి నక్షత్రం; వృషభ రాశిలోని ప్రకాశవంతమైన చుక్కలలో మూడవది;
  • Tauri Pi, n. కృత్తిక నక్షత్రం; వృషభ రాశిలో ఒక తార;
  • Taurus, n. వృషభ రాశి;
  • tautology, n. అనులాపం; పునరుక్తి దోషం; అనవసరంగా ఒకే భావాన్ని ఒకే వాక్యంలో మరొకసారి చెప్పడం; ఉదా. చొక్కా ఇరుకుగా ఉండి పట్టడం లేదు;
  • tawny, adj. చామనచాయ; ధూసరవర్ణం; గోధుమ రంగు; సింహం రంగు; tan color;
  • tax, n. పన్ను; సుంకం; కరం; same as cess; see also duty; (Note) duty అనేది సరుకుల మీద పడే సుంకం, tax అనేది మనుష్యుల మీద పడే సుంకం;
    • death tax, ph. మరణ సుంకం;
    • excise tax, ph. ఒక ప్రత్యేకమైన జాబితా ఉన్న అంశాల మీద వేసే అమ్మకపు పన్ను; ఈ జాబితాలో సాధారణంగా అత్యవసరం కాని విలాస వస్తువులు ఉంటూ ఉంటాయి; ఉదా. నగలు, అత్తరులు, సిగరెట్లు, మద్య పానీయాలు, కార్లు, వగైరా; అబ్కారి పన్ను; వ్యాపారపు పన్ను; వ్యాపారపు పన్ను; అబ్కారీ పన్ను;
    • house tax, ph. ఇంటి పన్ను; ఇల్లరి;
    • income tax, ph. ఆదాయపు పన్ను;
    • inheritance tax, ph. వారసత్వపు పన్ను;
    • property tax, ph. ఆస్తి పన్ను;
    • sales tax, ph. అమ్మకపు పన్ను;
    • tax collector, ph. సుంకరి; కర గ్రాహి;
  • taxes, n. పన్నులు; కప్పములు;
  • tax-free, adj. పన్నులు లేని;
  • taxi, n. కిరాయికారు; టేక్సీ; టేక్సీకేబ్ అన్న మాటని కత్తిరించగా వచ్చిన మాట;
  • taxonomy, n. వర్గీకరణ; వర్గీకరణ శాస్త్రం;
  • tea, n. తేనీరు; చా; టీ;
  • tea leaf, n. తేయాకు;
  • teach, v. t. నేర్పు; బోధించు; బోధన చేయు; బోధపరచు; ప్రబోధించు;
  • teacher, n. గురువు; అఖ్యాత; బోధకుఁడు; m. పంతులు; ఉపాధ్యాయుఁడు; ఒజ్జ; అధ్యాపకుఁడు; ఆచార్యుఁడు; దేశకుఁడు; అయ్యవారు; f. పంతులమ్మ; గుర్వి; ఉపాధ్యాయిని; ఒజ్జసాని;
    • teacher's teacher, ph. ప్రాచార్యుడు; (note)similar to ప్రపితామహుడు
  • teaching, n. బోధ; బోధన; అధ్యాపనం;
  • teak, n. టేకు; టేకు కర్ర; టేకు చెట్టు;
  • teakwood, n. టేకు; టేకు కర్ర;
  • teal, n. నీలపచ్చం; నీలహరితం;
  • teal, adj. నీలంపచ్చ; నీలహరిత;
  • team, n. జట్టు; గుంపు;
  • tear, v. t. చింపు; చించు;
  • tear, n. (1) కన్నీరు; అశ్రువు; అశ్రుజలం; బాష్పం; బాష్పజలం; (2) చిరుగు;
    • tear gland, ph. అశ్రుగ్రంథి; కన్నీటి కంతి;
  • teardrop, n. అశ్రుబిందువు; అశ్రుకణం; కన్నీటిబొట్టు;
  • teargas, n. బాష్పవాయువు; కన్నీరువాయువు;
  • tears, n. అశ్రువులు; అశ్రుబిందువులు; కన్నీటిబొట్లు; కన్నీళ్లు; కన్నీరు; బాష్పములు;
    • tears of joy, ph. ఆనంద ఆశ్రువులు; ఆనంద బాష్పములు;
  • tease, v. t. (1) చిక్కులు విడదీయు; (2) ఏడిపించు; ఉడికించు; ఆగడం చేయు;
    • tease the hair, ph. చిక్కులు విడదీయడానికి చిక్కట్టతో జుత్తుని దువ్వడం;
  • teaser, n. చిక్కట్ట;
  • teaspoon, n. మిళ్లిగరిటె; చాచెంచా; చిన్నచెమ్చా;
  • teat, n. (1) ౘన్ను; ౘనుమొన; (2 ) తిత్తి;
  • technical, adj. సాంకేతిక; తాంత్రిక; పారిభాషిక;
    • technical terminology, ph. పారిభాషిక పదజాలం; సాంకేతిక పదజాలం;
  • technicality, n. నిమిత్తమాత్రపు లొసుగు; పారిభాషికత;
  • technician, n. తాంత్రికుఁడు;
  • technique, n. పద్ధతి; కిటుకు; సంవిధానం; శిల్పం; విద్యామర్మం; కళాత్మకమైన ప్రయోగ విధానం;
  • technology, n. సాంకేతికం; సాంకేతికత; సాంకేతిక తంత్రం; సంవిధాన శాస్త్రం;
    • biotechnology, ph. జీవసాంకేతికం;
  • tectonics, n. విరూపణం;
    • plate tectonics, ph. పలక విరూపణం;
  • tedious, adj. విసుగు పుట్టించే; బోరు కొట్టించే; ఎప్పటికీ తెమలని;
  • teen-age, n. కౌమారం; మలిపదుల వయసు;
  • teeth, n. పళ్లు; పండ్లు; దంతాలు;
    • canine teeth, ph. రదనికలు; కోరపళ్ళు;
    • deciduous teeth, ph. పాల పళ్లు;
    • incisor teeth, ph. కుంతకాలు; కత్తెర పళ్ళు;
    • molar teeth, ph. చర్వణకాలు; దంతాలు;
    • permanent teeth, ph. శాశ్వత దంతాలు; ప్రౌఢ దంతాలు;
  • teething troubles, ph. [idiom] బాలారిష్టాలు; వాచ్యర్థం చిన్నపిల్లలకి వచ్చే రోగాలే అయినప్పటికీ ఏ పని చెయ్యడానికైనా మెదట్లో ఎదురయే ఇబ్బందులని సూచించడానికి గౌణ్యర్థంతో వాడే మాట;
  • teetotaler, n. [idiom] మద్యం ఎన్నడూ ముట్టని వ్యక్తి; మాదక పానీయాలు ముట్టని వాడు; మందు ముట్టని మందభాగ్యుడు;
  • tejpat, n. తేజపత్రి;
  • telegram, n. తంతి; తంతివార్త; టెలిగ్రామ్; same as wire;
  • teleological, adj. ప్రయోజన సంబంధమైన; ప్రయోజనాత్మక;
  • telepathy, n. దూరానుభూతి; దివ్యానుభూతి; ఇంద్రియముల ప్రమేయం లేకుండా రెండు మనస్సులకు మధ్య జరిగే వార్తా ప్రసరణ;
  • telephone, n. దూరవాణి; దూరశ్రవణి; శ్రవణి; టెలిఫోను;
  • telescope, n. దుర్భిణి; దూరదర్శని; ఓఁకుమర; చుక్కీ; టెలిస్కోప్;
  • television, n. దూరదర్శని; టెలివిజన్; టీవీ; దూరదర్శని;
  • tell, v. t. చెప్పు; నుడువు;
  • Tellurium, n. తెల్లురం; టెల్లూరియం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 52, సంక్షిప్త నామం, Te); [Lat. tellus = earth];
  • telo, pref. అంత్య;
  • telophase, n. అంత్యదశ;
  • temerity, n. తెగువ; సాహసం;
  • temp., n. కైజీతగాఁడు; తాత్కాలికంగా పనిచేసే వ్యక్తి;
  • temper, n. పోఁపు; తాలింపు; తిరుగబోత; సాతాళింపు;
  • temper, v. t. (1) పోఁపు పెట్టు; సాతాళించు; తాళించు; (2) గట్టిపరుచు; మలుచు; (3) మెత్తపరచు; ఇక్కడ ఒకే మాటకి రెండు వ్యతిరేక అర్థాలు గమనించునది;
  • temperate, adj. మితమైన; సమశీతోష్ణ;
  • temperature, n. ఉష్ణోగ్రత; తాపమానం; తాపక్రమం; తాప తీక్షణాన్ని తెలిపే సంఖ్య; శీతోష్ణ పరిమాణం; శీతోగ్రత;
    • temperature gauge, ph. ఉష్ణమితి;
  • tempered justice, ph. దయతో కూడిన శిక్ష;
  • tempered steel, n. గట్టిపరచబడ్డ ఉక్కు;
  • template, n. మూస; అది; తోడు; తోడిక; starter;
  • temple, n.(1) గుడి; కోవెల; దేవాలయం; దేవళం; మందిరం; (2) కణత; నుదిటికి ఇరువైపులా ఉండే శిరోభాగం;
    • temple without a roof, ph. దద్దళం;
  • tempo, n. గమనం; జోరు; బిగి;
    • tempo of a story, ph. కథాగమనం;
  • temporal, adj. (1) కర్ణాస్థులకి సంబంధించిన; (2) ఐహికమైన; (3) కాలానికి సంబంధించిన;
    • temporal lobes, ph. కర్ణావృత్తములు;
  • temporary, adj. తాత్కాలిక; అసత్; తైంతిక; హంగామీ;
    • temporary crew, ph. హంగామీ సిబ్బంది; కై సిబ్బంది;
    • temporary residence, ph. మకాం;
    • temporary staff, ph. కైజీతగాళ్లు;
  • temporary, n. తాత్కాలికం;
  • tempt, v. t. పురిగొలుపు; ఊరించు; ఆశపెట్టు; ఉసిగొలుపు; ప్రేరేపించు;
  • temptation, n. ప్రలోభం;
  • tempting, adj. ఆకర్షించెడు;
  • ten, n. పది;
  • ten, adj. దశ; పది;
  • tenacity, n. జిగి; హఠం;
  • tenancy, n. కౌలుదారితనం;
  • tenant, n. నెలసరి; అద్దెకున్నవాఁడు; భూమి కౌలుకి తీసికొన్నవాఁడు;
  • tend, v.i. ఒక వైపునకు జరుగు; మొగ్గుచూపు;
  • tendency, n. వాటం; ప్రవృత్తి; ఉన్ముఖత; పోబడి; జాడ; ధోరణి; ఆసక్తి;
  • tender, adj. లేత; కవట; కసు; మృదువైన; ఎల; (ant.) mature; ripe;
    • tender vegetables, ph. కసుగాయలు; లేత కాయలు;
    • tender age, ph. ఎలప్రాయము; చిరుతప్రాయము;
    • tender leaf, ph. కవటాకు;
    • tender shoots, ph. లేత చిగుర్లు;
  • tender, n. కొనుగోలుకి సిద్దంగా ఉన్నామని తెలియజేసే లాంఛన పత్రం;
  • tender, v. t. ఇచ్చు; లాంఛనంగా ఇచ్చు; దఖలు పరచు;
  • tendon, n. స్నాయువు; స్నాయుబంధనం; కండరాన్ని ఎముకలతో బంధించే తాడు వంటి సాధనం; ప్రతి కండరానికి చివర ఈ పోగుల లాంటి టెండాన్ ఉండటం వల్ల అది ఎముకతో అతుక్కుని వాటిని మనం సులువుగా కదపగలుగుతూ ఉన్నాం;
  • tendril, n. నులితీగ; లేత తీగ;
  • tenement, n. చిన్న చిన్న వాటాలుగా కట్టిన అద్దె కొంపలు;
  • ten-fold, n. పదింతలు; పదిరెట్లు;
  • tenet, n. సిద్ధాంతం; సూత్రం;
  • ten million, n. కోటి;
  • tenon, n. కుసి; వడ్రంగంలో రెండు కర్రలని అతకడానికి ఒక కర్రకి ఉండే ముక్కు; రెండవ కర్రకి ఉండే బెజ్జాన్ని కుసి బెజ్జం అంటారు;
  • tenor, n. (1) సారాంశం; (2) తారస్వరం;
  • tense, n. [gram.] కాలం; కాలార్థకం;
    • future tense, ph. భవిష్యత్ కాలం; భవిష్యదర్థకం;
    • future indefinite tense, ph. తద్ధర్మ కాలం;
    • past tense, ph. భూత కాలం; భూతార్థకం;
    • present tense, ph. వర్తమానకాలం; వర్తమానార్ధకం;
    • present perfect tense, ph. తద్ధర్మార్ధకం;
    • present indefinite tense, ph. తద్ధర్మకాలం;
  • tense, adj. బిర్రుగా; ఆరాటంగా; (ant.) lax;
  • tension, n. బిగి; బిగితం; బిర్రు; జిగి; పట్టు; తన్యత; ఆతతి; ఉద్రిక్తత;
    • emotional tension, ph. ఉద్రేకం;
    • surface tension, ph. తలతన్యత;
  • tension bar, ph. బిగిబద్ద;
  • tent, n. డేరా; గుడారం; పటకుటిరం; షామియానా;
  • tentative, adj. ప్రస్తుతానికి ఉపయోగపడే విధంగా;
  • tenth, adj. దశమ; పదో; పదియవ;
  • tepid, adj. నులివెచ్చ; గోరువెచ్చ; కదుష్ణ; కోష్ణమైన;
  • tepidity, n. కోష్ణం;
  • tera, pref. టెరా; ట్రిలియనుని సూచించడానికి వాడే పూర్వ ప్రత్యయం;
  • term, n. (1) పదం; మాట; (2) నియత కాలం; కందాయం; ఏల్తరి; (3) విశ్వవిద్యాలయాల్లో "అర్ధ" సంవత్సరం కాని పావు సంవత్సరం కాని; (4) గణితంలో చలరాశి కాని చలరాశుల సముదాయం కాని;
    • analogous term, ph. తుల్య పదం;
    • antecedent term, ph. పూర్వ పదం;
    • common term, ph. సమాహారక పదం;
    • first term, ph. మొదటి కందాయం; మొదటి పదం; మొదటి అంశం;
  • terminal, adj. శీర్ష; అవసాన; అంత్య; అంతిమ;
    • multi terminal, ph. బహుశీర్ష;
    • two terminal, ph. ద్విశీర్ష;
    • terminal disease, ph. అవసాన రోగం; చివరి రోగం;
    • terminal phase, ph. అంతిమ దశ;
    • terminal stage, ph. అవసాన దశ; అవసాన కాలం;
  • terminal, n. కడ; కాడు; కొస; కొన; చివరకు; అంతు; అంతం; అడంగు; అవధి; అవసాని; అవసానిక; గణి; శీర్షం; కోటి;
    • cell terminal, ph. అంత్యకణం;
    • computer terminal, ph. కలనావసాని; గణక అవసానిక; అవసాయకం;
    • positive terminal, ph. ధన గణి; ధన శీర్షం;
  • terminate, v. t. కడతేర్చు; కొసముట్టించు; అంతుచూడు; ఉపసంహరించు; చంపు; చాలించు;
  • termination, n. ఉపసంహారం; ముగింపు; కడతేర్చడం; కొసముట్టించడం; అంతుచూడడం; పూర్తిచేయడం;
  • terminator, n. ఉపసంహార రేఖ; ఒక గ్రహం మీద పగటికి, రాత్రికి మధ్య ఉండే ఊహాత్మక రేఖ;
  • terminology, n. పదజాలం; పరిభాష;
  • termite, n. చెదపురుగు; ఘణ; ఇవి చూడడానికి తెల్లటి చీమలలా ఉంటాయి కాని, ఇవి చీమలు కావు, బొద్దెంక జాతివి, చీమలకీ చెద పురుగులకీ మధ్య వైరం, చీమలు చెదపురుగులని తినేయ గలవు;
    • termite hill, ph. చెదల పుట్ట;
  • terms, n. pl. (1) అంశాలు; పదాలు; (2) నిబంధనలు; షరతులు;
  • turpentine, n. శ్రీవేష్టం;
  • terrace, n. డాబా; అలిందం; బోడిమిద్దె; గదులు లేని మీది అంతస్థు;
  • terrestrial, adj. (1) అధిభౌతిక; (ant.) అధిదైవిక; (2) భూమికి సంబంధించిన; భూ;
    • terrestrial creatures, ph. భూచరాలు;
  • terrible, adj. భీషణ; భీభత్సకరమైన; భయంకరమైన; తీవ్రమైన; దారుణమైన; ఉచ్ఛండ; ఉగ్ర;
  • terrier, n. ఉడుప కుక్క; మొరసడము;
  • terrific, adj. భయంకరమైన; తీవ్రమైన; అద్భుతమైన;
  • territorial, adj. ప్రాదేశిక; నేలవీటు; భూభాగానికి సంబంధించిన; దేశాధికారానికి సంబంధించిన;
    • territorial sea, ph. ప్రాదేశిక సముద్రం;
    • territorial waters, ph. ప్రాదేశిక జలాలు; నేలవీటు నీళ్ళు;
  • territory, adj. దేశం; సంస్థానం; ప్రదేశం; భూభాగం;
  • terror, n. విపరీతమైన భయం;
  • terrorizing, adj. భయానక;
  • terrorism, n. ఉగ్రవాదం; a philosophy that supports unlawful violence and intimidation, especially against civilians, in the pursuit of political aims; (rel.) extremism = తీవ్రవాదం;
  • terrorist, n. ఉగ్రవాది; (rel) extremist = తీవ్రవాది;
  • terse, adj. క్లుప్తమైన; సంక్షిప్త;
  • tertiary, adj. తృతీయ; see also triassic;
  • test, n. పరీక్ష; శోధన; పరిశీలన;
  • test, v. t. పరీక్షించు; శోధించు; పరిశీలించు;
  • testament, n. (1) ఒప్పందం; (2) వీలునామా; మరణశాసనం;
    • New testament, ph. మలి ఒప్పందం; క్రైస్తవుల నమ్మకం ప్రకారం మానవుడికి, దేవుడికీ మధ్య రెండవసారి జరిగిన ఒప్పందం;
    • Old testament, ph. తొలి ఒప్పందం; క్రైస్తవుల నమ్మకం ప్రకారం మానవుడికీ, దేవుడికీ మధ్య జరిగిన తొలి ఒప్పందం;
  • testator, n. మరణశాసనం రాసి చనిపోయిన వ్యక్తి;
  • testes, n. బీజాండాలు; వృషణాలు; వట్టలు; వట్టకాయలు; ముష్కగోణులు;
  • testicle, n. వట్ట; వట్టకాయ; వట్రకాయ; బీజాండం; వృషణం; ముష్కం; కర్పూరం;
  • testify, v. t. సాక్ష్యమిచ్చు;
  • testimony, n. సాక్ష్యం; వాంగ్మూలం;
    • deathbed testimony, ph. మరణ వాంగ్మూలం;
  • test tube, n. పరీక్ష నాళిక; శోధన నాళిక;
    • test tube baby, ph. కుంభ సంభవుడు; భౌతికంగా స్త్రీ పురుష సంయోగం లేకుండా ప్రయోగశాలలో పురుష బీజాన్ని స్త్రీ అండంలో ప్రవేశపెట్టి కొత్త జీవిని సృష్టించడం;
  • tetanus, n. ధనుర్వాతం; గుర్రపువాతం; బేక్టీరియా వల్ల కలిగే ఒక జబ్బు; ---a disease caused by the bacterium Clostridium tetani; this bacterium makes one harmful toxin; protection against tetanus is afforded by immunity to this single toxin; so tetanus vaccine contains one single protein;
  • tether, n. సందము; కట్టుతాడు; కన్నెతాడు; పగ్గం;
  • tethered, n. సందానితము; తాడుతో కట్టబడ్డది;
  • tetra, pref. చతుర్;
  • tetrad, n. చతుష్టయం; పుంజీ; చవిత;
  • tetrafluoroethylene, n. చతుర్‌ప్లవనవిదిలీను; టెఫ్లాన్ తయారీకి ముడి పదార్థం; C2F4;
  • tetragonal, adj. చతుష్కోణ;
  • tetrahedron, n. చతుర్ముఖి; నలుమోమి; సమత్రిభుజాకారంలో నాలుగు ఫలకాలు (ముఖాలు) గల ఘన వస్తువు;
  • tetraploid, adj. చతుస్థితిక;
  • tetravalent, adj. చతుర్‌ బల; చతుర్‌బాహు;
  • text, n. (1) పాఠం; (2) పాఠ్యపుస్తకం; వాచకం;
    • non-detailed -, ph. ఉపవాచకం;
  • text box, ph. పాఠ పేటిక; కంప్యూటర్‍ తెర మీద అక్షరాలని రాయడానికి వీలుగా ఏర్పాటు చేసిన పెట్టె;
  • textiles, n. నేతబట్టలు; నేతసరకులు; జవళి;
  • textile industry, ph. జవళి పరిశ్రమ;
  • texture, n. అల్లిక; వ్యూతి; నేత నేసిన పద్ధతి; కూర్పు; కూర్పరితనం; ఒక ఉపరితలం ఎలా ఉందో జ్ఞానేంద్రియాల స్పర్శకి కలిగే అనుభూతి; ఉ. ముతకగా ఉంది, మెత్తగా ఉంది, పిండిలా ఉంది, మొరుంలా ఉంది, అంటూ ఆ ఉపరితలం కట్టడి ఎలా ఉందో వర్ణించడానికి వాడే మాట;
  • thalamus, n. పుష్పాసనం; పర్యంకదేశము; either of two masses of gray matter lying between the brain hemispheres on either side of the third ventricle, relaying sensory information and acting as a center for pain perception;
  • Thallium, n. థేలియం; రెమ్మజం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 81, సంక్షిప్తనామం, Tl); [Gr. thalos = green shoot or twig];
  • than, conj. కంటె;
  • thank, .v. t. కృతజ్ఞత తెలుపు; ధన్యవాదాలు చెప్పు;
  • thanks, n. ధన్యవాదాలు; మెప్పిదాలు; నెనర్లు; కృతజ్ఞతలు;
  • that, pron. adj. ఆది; ఆ; తత్;
    • different from that, ph. తత్‌భిన్నం;
    • connected with that, ph. తత్‌సంబంధమైన;
    • that way, ph. అటు;
  • thatched, adj. గడ్డితో నేయబడ్డ; గడ్డితో కప్పబడ్డ; పూరి;
  • thaw, v. i. కరుగు; ద్రవించు; మంచుతో గడ్డకట్టుకుపోయిన వస్తువు ద్రవించు;
  • the, def. art. ఆ; ఈ;
  • theater, n. (1) శాల; నాటకశాల; ఆటపాక; హాలు; (2) నాటకశాస్త్రం;
  • theft, n. దొంగతనం;
  • their, pron. (1) remote. వాళ్ల; వారి; వాళ్ళవి; వారివి; (2) proximate. వీళ్ల; వీరి; వీళ్ళవి; వీరివి;
  • theism, n. ఆస్తిక మతం; భగవంతుడనే సృష్టికర్త ఉన్నాడని, అతడు దయామయుడు, మన మంచిచెడ్డలని చూస్తూ మనని కనిపెట్టుకుని ఉంటాడనే నమ్మకం; (from ‘theos’, ‘god’ in Greek) The view that the universal order is based on a hierarchical relationship between humans and a small group of ethereal entities called gods;
  • theist, n. సేశ్వర వాది;
  • theistic, adj. ఈశ్వరుడు ఉన్నాడనే నమ్మకంతో; సేశ్వర;
  • them, pron. వారిని; వాళ్ళని;
  • theme, n. ఇతివృత్తం; భూమిక;
  • themselves, pron. వారే; అవియే; తామే;
  • then, adv. అప్పుడు; అంతట; అటు పిమ్మట; ఆ తర్వాత; అనవుడు;
  • thence, adv. అక్కడనుండి; అప్పటినుండి;
  • theocracy, n. మతవర్గాధిపత్యం; మతధర్మ స్వామ్యం;
  • theology, n. మతధర్మ శాస్త్రం; దేవుడికీ, మతానికీ, మనిషికీ మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలని విచారించే శాస్త్రం;
  • theorem, n. ప్రమేయం; నియమం; సిద్ధాంతం; రుజువు అయినది;
    • converse theorem, ph. విలోమ నియమం;
    • derived theorem, ph. వ్యుత్పన్న నియమం;
    • existence theorem, ph. అస్తిత్వ నియమం;
    • fundamental theorem, ph. మూల సిద్ధాంతం;
  • theoretically, adj. సిద్ధాంతరీత్యా;
  • theorist, n. సిద్ధాంతకర్త;
  • theorize, n. సిద్ధాంతీకరించు; సూత్రీకరించు; వాదించు;
  • theory, n. వాదం; ప్రతిపాదించబడ్డది;
    • in theory, ph. సిద్ధాంతరీత్యా; శాస్త్ర ప్రకారం;
  • Theosophical Society, n. దివ్యజ్ఞాన సమాజం;
  • theosophy, n. దివ్యజ్ఞానం; దైవసంబంధమైన జ్ఞానం;
  • therapeutic, adj. జబ్బుని కుదిర్చే; చికిత్సకి సంబంధించిన;
  • therapy, n. చికిత్స;
  • there, adv. అక్కడ;
  • thereabouts, adv. ఆ చుట్టుపట్ల; ఆ సమీపంలో;
  • thereafter, adv. ఆతర్వాత; తదాది; తదుపరి; అనంతరం;
  • thereby, adv. తద్వారా; ఆ దారి వెంబడి; ఆ మూలాన్న;
  • therefore, adv. కనుక; కాబట్టి; కావున; అందువల్ల; అందుచేత; తస్మాత్;
  • therein, adv. అందులో;
  • thereupon, adv. అందుమీదట;
  • thermal, adj. తాప; తాపీయ; ఊషణ; ఉష్ణ;
    • thermal currents, ph. తాపీయ ప్రవాహాలు;
  • thermals, n. తాపీయాలు; భూతాపీయాలు; తాపవనాలు; భూమి వేడిమికి భూమినుండి పైకెగసే వేడి గాలి ప్రవాహాలు;
  • thermic, pref. తాప;
  • thermo, pref. తాప; ఉష్ణ;
  • thermodynamics, n. ఉష్ణగతిశాస్త్రం; తాపగతిశాస్త్రం; ఉష్ణ చలనం;
  • thermometer, n. తాపమాపకం; ఉష్ణమాపకం; తాపక్రమమాపి; ఉష్ణోగ్రతని కొలిచేది;
  • thermosphere, n. ఉష్ణావరణం; ఇక్కడ ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ఈ పొర ఉష్ణోగ్రత 1,500°C వరకూ ఉండే అవకాశం ఉంది. ఈ పొరలో గాలి సాంద్రత తగ్గుతుంది . ఈ పొరలోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పరిభ్రమిస్తుంటుంది;
  • thermostat, n. తాపస్థాపకి; ఉష్ణోగ్రతని ఒక చోట స్థిరంగా నిలిపే ఉపకరణం;
  • thesaurus, n. సంబంధి పదకోశం; పదార్థ భాండాగారం;
  • these, pron. proximate. ఈ: ఇవి;
    • of these, ph. వీటి;
    • whose are these?, ph. ఇవి ఎవరివి?
    • these things, ph. ఇవి;
    • these people, ph. వీళ్లు; వీరు;
  • they, pron. వాళ్లు; వారు;
  • thick, adj. దట్టమైన; మందమైన; చిక్కనైన; చిక్కని; అవిరల; నిబిడ;
  • thicket, n. గుబురు; తుప్ప; చిట్టడవి; చిన్న అడవి;
  • thickness, n. దళసరి; మందం;
  • thief, n. దొంగ; తస్కరుడు; పాటచ్ఛరుడు; తాయువు; అధశ్చరుడు; మ్రుచ్చు; హర్త; అపహర్త; కేడీ;
  • thigh, n. తొడ; పెందొడ; కురువు; ఊరువు; జంఘిక; ఊర్వి; అంకం;
    • lower thigh, ph. కీతొడ;
    • thighbone, n. తొడ ఎముక; జంఘికాస్తి; ఊర్వికాస్తి; ఉరోస్తి;
  • thin, adj. పలుచని; సన్నని; బక్కపలుచని; పేలవ; పీల;
  • thing, n. (1) వస్తువు; పదార్థం; (2) సంగతి;
  • think, v. i. ఆలోచించు; ఆలోచనచేయు; స్మరించు; తలపెట్టు; తలపోయు; యోచించు; భావించు;
    • think tank, ph. స్మరణ తటాకం;
  • thinker, n. m. భావుకుడు; ఆలోచనాపరుడు; తలపోతరి;
  • thinking, adj. ఆలోచించే; ఆలోచన చేయగల;
  • third, adj. మూడవ; తృతీయ; తార్తీయ;
  • third, n. మూడవది; తృతీయం; తార్తీయం;
  • thirst, n. దాహం; దప్పిక; దాహతి; పిపాస; తృష్ణ; ఉదన్యత;
    • excessive thirst, ph. విదాహం;
  • thirst for knowledge, ph. ఆదిత్స;
  • thirteen, n. పదమూడు;
  • thirteenth, adj. త్రయోదశ; పదమూడవ;
  • thirtieth, adj. ముప్ఫయ్యవ; ముప్పదియవ; త్రింశ;
  • thirty, n. ముప్పయి; ముప్పదియవ; త్రింశత్;
  • this, adj. ఇది; ఈ;
  • this way, ph. ఇటు;
  • thorax, n. హృదయ కుహరం; ఉరహ్ పంజరం;
    • thoracic cavity, ph. హృదయ కుహరం; ఉరః పంజరం;
  • Thorium, n. దురం; ఒక రసాయన మూలకం; (అణసంఖ్య 90, సంక్షిప్త నామం, Th);
  • thorn, n. ముల్లు; కంటకం;
  • thorns, n. pl. ముళ్లు; ముండ్లు;
    • thorny bush, ph. ముళ్లకంప;
    • thorny fence, ph. ముళ్ల కంచె;
  • thoroughbred, n. మేలుజాతి గుర్రం; రెండు వైపులా మంచి ప్రవర ఉన్న గుర్రం;
  • thoroughfare, n. రహదారి;
  • thoroughly, adv. క్షుణ్ణంగా; పూర్తిగా; సంపూర్ణంగా; కూలంకషంగా; సమగ్రంగా;
  • those, adj. ఆ; అవి; వారు;
    • those papers, ph. ఆ కాగితాలు;
    • those people, ph. వాళ్లు;
    • of those people, ph. వాటి;
  • though, conj. (దో) అయినప్పటికి;
  • thought, n. చింత; ఆలోచన; తలపు; తలపోత; భావం; మనోభావం; చిత్తం; చిత్; స్పురణ;
    • purity of thought, ph. చిత్తశుద్ధి;
    • thought experiment, ph. మనో ప్రయోగం; స్పురణ ప్రయోగం;
    • thoughtful person, ph. ఆలోచనాపరుడు;
  • thoughtfully, adv. సాలోచనగా;
  • thousand, n. వెయ్యి; వేయి; సహస్రం; దశశతి;
  • thousandth, adj. వెయ్యవ; వేయవ;
  • thrash, v. i. కొట్టుకొను; గిలగిలలాడు;
  • thrash, v. t. ఉప్పళించు; ఝాడించు;
  • thread, n. (1) దారం; సూత్రం; నూలిపోగు; తంతువు; (2) కడ్డీ మీద సర్పిలాకారంలో కోయబడ్డ వెన్నుపట్టె; (3) తంతువు; కంప్యూటర్ రంగంలో ఒక చిన్న పని చేస్తూన్న ఆదేశాల వరుసక్రమం; In technology, a thread is typically the smallest set or sequence of instructions that a computer can manage and execute; it is the basic unit of processor (CPU) utilization;
  • threat, v. t. బెదరింపు; భిభీషిక;
  • threat, n. బెదిరింపు; బిభీషిక;
  • three, n. (1) మూడు; తిగ; త్రి; (2) ముగ్గురు; మువ్వురు;
  • three people, ph. ముగ్గురు; మువ్వురు;
  • three-dimensional, adj. త్రిదిశాత్మక; త్రిమితీయ; త్రిపరిమాణిక;
  • three-fold, adj. ముమ్మడి; త్రివళి;
  • three-fourths; n. ముప్పాతిక;
  • three-times, adj. ముమ్మారు; మూడుసార్లు;
  • three-way, adj. ముమ్మడి;
  • thresh, v. t. నూర్చు;
  • threshing, n. నూర్పు; నురుపిడి;
    • threshing floor, ph. నూర్పుడు కళ్ళెం;
  • threshold, n. (1) గడప; గుమ్మం; దేహళి; (2) హద్దు;
    • space threshold, ph. గడప;
    • time threshold, ph. గడుపు;
  • thrice, n. మూడు సార్లు; ముమ్మారు; ముమ్మడి;
  • thrift, n. పొదుపు; మితవ్యయం; పోడిమి; ఊజ్జితం;
  • thrill, n. ఉద్విగ్నత;
  • thrilling, adj. హృదయంగమ;
  • thrive, v. i. వర్ధిల్లు; బాగుపడు; వృద్ధి చెందు; నమనమలాడు;
  • throat, n. గొంతుక; గళం; కంఠం; పీక;
  • throbbing, n. పరిస్పందం;
  • thrombosis, n. రక్త నాళంలో రక్తపు కుదువ ఏర్పడుట;
  • thrombus, n. గడ్డ; బెడ్డ;
  • throne, n. సింహాసనం; గద్దె; అధికార పీఠం;
  • throng, n. సమూహం;
  • through, prep. (త్రూ) గుండా;
  • throw, v. t. విసరు; రువ్వు; గిరాటు వేయు;
  • thrush, n. కస్తూరి పిట్ట; కస్తూరి పక్షి;
  • thrust, v. t. తోయు; పొడుచు; గుచ్చు;
  • thumb, n. (తమ్) బొటనవేలు; అంగుష్ఠం; చేతి బొటన వేలు;
    • rule of thumb, ph. బండ నియమం; అంగుష్ఠ నియమం;
    • thumbnail sketch, ph. చిన్నది; క్లుప్తంగా చెప్పబడ్డది; నఖచిత్రం; అంగుష్ఠ చిత్రిక; కరరుహ చిత్రం; ఒక ఊహకి టూకీగా ఇచ్చిన రూపురేఖలు;
  • thumbtack, n. బొత్తాంనాటు; సుత్తి అవసరం లేకుండా బొటనవేలితో గోడకి గుచ్చగలిగే సదుపాయం ఉన్న మేకు;
  • thunder, n. ఉరుము; మేఘనాదం;
  • thunderbolt, n. పిడుగు; ఆశనిపాతం; భిత్తిక;
  • Thursday, n. గురువారం; లక్ష్మివారం; బృహస్పతి వారం; బేస్తవారము; బృహస్పతి వార > బిహస్త వార > బియస్తవార > బేస్తవార > బేస్తార;
  • thus, adv. కావున; అని; ఇట్లు; ఈ తీరున; ఈవిధంగా;
  • thyme, n. వాముపువ్వు; ఉగ్రగంథం; వంటలలో వాడే ఒక సుగంధ ద్రవ్యం; [bot.] Thymus vulgaris;
  • thyroid, n. కాళకగ్రంథి; గళగ్రంథి; అవటుగ్రంథి; గొంతుకలో ఉండే ఒక వినాళ గ్రంథి;
  • tiara, n. లలాటపట్టం; చిన్న కిరీటం; కిరీటిక;
  • tibia, n. జంఘాస్తి; అంతర్ జంఘాస్తి; తొడలో ఉండే ఒక ఎముక;
  • ticket, n. టికెట్టు; కట్టిన డబ్బుకి రసీదు; చీటీ;
  • Tibetan, adj. కీచక;
  • tickle, n. కితకిత; చక్కలిగింత;
  • tic-tac-toe, n. దాడాట;
  • tidal wave, ph. ఉప్పెన; సముద్రంలో ఆటు పోట్లు, తుపాను కలిసినప్పుడు సముదమట్టంలో ఉన్న తీర ప్రాంతాలు ములిగిపోవడం; (rel.) tsunami;
  • tide, n. పోటు; సూర్యచంద్రుల ఆకర్షణ కారణంగా భూమి, సముద్రపు మట్టాల పెరుగుదల;
    • ebb tide, ph. ఆటు; నీటిమట్టం పెరుగుదల;
    • flood tide, ph. పోటు; నీటిమట్టం పెరుగుదల;
    • high tide, ph. పోటు; నీటిమట్టం పెరుగుదల;
    • low tide, ph. ఆటు; నీటిమట్టం తరుగుదల;
    • neap tide, ph. అష్టమినాడు వచ్చే ఆటుపోట్లు;
    • spring tide, ph. నిండు పౌర్ణమికి, అమావాస్యకీ బాగా ఉధృతంగా వచ్చే ఆటుపోట్లు;
  • tides, n. ఆటుపోట్లు; సూర్యచంద్రుల ఆకర్షణ కారణంగా భూమి, సముద్రపు మట్టాల పెరుగుదల, తరుగుదలలు; ఇవి భూమి మీద ప్రతి 24 గంటల 58 నిముషాలలో రెండుమార్లు వస్తాయి;
  • tie, v. t. కట్టు; ముడిపెట్టు;
  • tie up, v. t. అన్వయించు; ముడిపెట్టు; రెండింటికి మధ్య సంబంధాన్ని చూపు;
  • tier, (టియర్) n. (1) మెట్టు; ఆంచె; అంతస్థు; పావంచా; సోపానం; (2) వరుసల శ్రేణి;
  • tiffin, n. ఉపాహారం; ఫలహారం;
  • tiger, n. పెద్దపులి; బెబ్బులి; కోలుపులి; పులి; మువ్వన్నెమెకము; శార్దూలం; పుండరీకం; పంచనఖము; భయానకము; భేలకము; మృగశ్రేష్ఠము; వ్యాఘ్రము;
  • tight, adj. బిగువు; బిగువైన; బిగుతు;
  • tight-fisted, ph. పితలాటకం; పిసినారితనం;
  • tighten, v. t. బిగించు; ఉగ్గగట్టు; ముద్రించు;
  • tightness, n. బిగి; బిగుతు;
  • tigon, n. పుహం; మగ పులికి, ఆడ సింహానికి పుట్టిన కంచర జంతువు; see also liger;
  • tigress, n. f. ఆడుపులి;
  • tile, n. పెంకు; ఓడుబిళ్ల; పలక;
    • flat tile, ph. బిళ్ళ పెంకు;
    • Mangalore tile, ph. బంగాళా పెంకు; (మంగుళూరు పెంకు అనడానికి బదులు బంగాళా పెంకు అన్నారు)
    • native tile, ph. నాటు పెంకు;
  • till, prep. వరకు; దాక;
  • till, v. t. దున్ను;
  • till, n. సొమ్ము సొరుగు; గల్లాపెట్టి సొరుగు; గల్లాపెట్టి;
  • tillable, n. నావ్యం; దున్నడానికి వీలైనది;
  • tilt, v. t. ఒంచు; ఒరిగించు;
  • tilt, v. i. ఒంగు; ఒరుగు; మొగ్గు;
  • timber, n. కచ్చా కలప; పడగొట్టిన చెట్లు, వగైరా మానులు; see also lumber; logs;
    • timber industry, ph. దారు పరిశ్రమ;
  • timbre, n. (టేంబర్) ధ్వనిగుణం; నాదగుణం; సంగీత వాద్యవిశేషం పుట్టించే తరంగాలు చెవికి తగినలినప్పుడు మన అనుభూతిలో కలిగే వైవిధ్యత; తరచుదనం, బిగ్గతనం ఒకేలా ఉన్నా చెవికి వినబడినప్పుడు ధ్వనిలో తేడా;
  • time, n. (1) కాలం; వేళ; సమయం; గంట; పొద్దు; సేపు; (2) తీరిక; వ్యవధి; సేపు; అదను; (3) మారు; మాటు; తపవ; తూరి; తడవ; సారి; చుట్టు; పాలి; విడత; దఫా; పర్యాయం;
    • at an earlier time, ph. మునుపు; పూర్వం; గతంలో;
    • another time, ph. మరో మారు; మరొకసారి;
    • at this time, ph. ఈవేళప్పుడు; ఇప్పుడు; ఈ సమయంలో;
    • contemporary time, ph. వర్తమానకాలం;
    • first time, ph. మొదటిసారి; మొదటి దఫా;
    • from what time? ph. ఎప్పటినుండి?; (lit.) from when;
    • how much time? ph. ఎంతసేపు?;
    • in the meantime, ph. అందాకా;
    • one time, ph. ఒక మారు; ఒక పరి; ఒక సారి; ఒక తేప; ఒక తూరి; ఒక తడవ; ఒక విడుత;
    • one more time, ph. ఇంకో మారు; ఇంకోసారి; మరొకసారి;
    • this time, ph. ఈ మారు; ఈ సారి; ఈ తడవ; ఈ దఫా;
    • time barred, ph. కాలదోషం పట్టిన;
    • time stamp, ph. కాల ముద్ర; వేళ ముద్ర; ఒక పని ఎప్పుడు మొదలయిందో ఎప్పుడు పూర్తయిందో సూచించడానికి వేసే ముద్ర;
    • time table, ph. కాలదర్శిని; సమయ సారణి;
    • time travel, ph. కాల ప్రస్థానం; కాల యానం;
    • time zone, ph. కాల మండలం; సమయ మండలం;
  • timely, adj. కాలోచిత; సమయోచిత; సందర్భానికి అనుకూలమైన;
  • times, adj. సార్లు; మార్లు; చుట్లు; తడవలు; తూర్లు; ఆవర్తులు;
    • at all times, ph. ఎల్లవేళల; కలకాలం; నిరంతరం;
    • hundred times, ph. నూరు సార్లు; శతథా; చాలాసార్లు;
    • many times, ph. చాలాసార్లు; చాలా తడవలు; చాలా చుట్లు; పలుమారులు; చాలా పర్యాయములు;
    • some times, ph. అప్పుడప్పుడు;
    • two times, ph. రెండు ఆవర్తులు; రెండుసార్లు; రెండు తూర్లు;
  • timidity, n. పిరికితనం; భీరుత; భీరుత్వం; బేలతనం;
  • tin, adj. కళాయి; తగరపు;
    • tin foil, ph. తగరపు తగడు;
    • tin sheet, ph. చీనారేకు; (ety.) Chinese metal sheet;
  • Tin, n. తగరం; వంగం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 50, సంక్షిప్త నామం, Sn); [Lat.] stannum;
  • tin, n. (1) కళాయి; (2) డబ్బా; కళాయి పూసిన ఇనుప రేకుతో చేసిన డబ్బా;
  • tin-can, n. డబ్బా; కళాయి పూసిన ఇనుప రేకుతో చేసిన డబ్బా;
  • tincture, n. ద్రావణం; ఒలంతం (ఆల్కహాలు)తో కలిపిన మందు; అరఖు;
    • mother tincture, ph. మాతృ ద్రావణం;
  • tinge, n. లేశమంత రంగు;
  • tinnitus, n. (టిన్నిటస్), కర్ణనాదం; బయట ప్రేరణ కారణమైన శబ్దాలు ఏవి లేకపోయినా చెవిలో శబ్దాలు (ఈలలు, వగైరా) వినిపించడం; Tinnitus is when you experience ringing or other noises in one or both of your ears. The noise you hear when you have tinnitus isn't caused by an external sound, and other people usually can't hear it. Tinnitus is a common problem. It affects about 15% to 20% of people and is especially common in older adults.
  • tin-plate, n. కళాయి పూసిన ఇనుప రేకు;
  • tin plating, v. t. కళాయి పెట్టుట; వంగలేపనం;
  • tinsel, n. కాకి బంగారం; ముచ్చె బంగారం;
  • tint, n. డౌలు; రాగము; కవురు;
    • yellow tint, ph. పసుపు డౌలు;
  • tintinnabulation, n. గంటారావం; టింగు మనే చప్పుడు; గంట చేసే ధ్వని;
  • tiny, adj. బుల్లి; ఆణక; బుచ్చి; చిరుతుక;
  • tion, n. (టియాన్) పుహం; మగపులికి ఆడసింహానికి పుట్టిన కంచర జంతువు, ఈ జాతులు(పుహాలు) పునరుత్పత్తి చేయలేవు, ఇవి సంతానహీన జాతులు; రెండు మాటలని జత చేసి కొత్త మాట సృజించటాన్ని “పోర్ట్ మాంటో“ (Portmanteau) అంటారు. ఇంగ్లీషులో ఇలాంటి పదాలు ఇంకా స్మాగ్ (smog = SMoke+Fog), బ్రంచ్(Brunch = Breakfast+Lunch); see also liger;
  • tip, n. (1) మొన; కొన; కొడి; ముల్లు; అగ్రం; (2) బక్షిస్; ఈనాం;
  • tirade, n. దూషణ పరంపర; దుష్ర్పచారం;
  • tire, tyre (Br.) n. టైరు;
  • tire, v. i. అలసిపోవు; డస్సిపోవు; డీలాపడు;
  • tiredness, n. అలసట; అలసిపోవుట; డీలాపడుట;
  • tireless, adj. అలుపుఎరుగని; నిర్విరామమైన;
  • tissue, n. కణజాలం; కణతండము; కణసంహతి; కణరాశి; కులాయం; ధాతువు; పేసీజాలం; అంగాంశం;
    • fibrous tissue, ph. పీచు ధాతువు;
    • tissue paper, ph. పల్చటి మృదువైన కాగితం;
  • tits, n. pl. ౘన్నులు; సళ్లు; ఉరోజాలు; స్తనాలు; వక్షోజాలు;
  • Titanium, n. టైటేనియం; తితినం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 22, సంక్షిప్త నామం, Ti); [Lat.] titans are the first sons of the Earth;
  • title, n. (1) బిరుదు; పట్టం; (2) పేరు; (3) హక్కు; పట్టా; (4) శీర్షిక;
  • titles, n. (1) బిరుదులు; (2) పేర్లు; (3) సినిమాలలో చూపించే నటీనటుల పేర్లు, సాంకేతిక నిపుణుల పేర్లు;
  • titrant, n. అంశమాపణి;
  • titration, n. అంశుమాపనం;
  • titter, v. i. ఇకిలించు; భయంతో కూడిన భావంతో నవ్వు;
  • titular, adj. నామకః; నామకార్థం; నామమాత్రపు; పేరుకి మాత్రం; నామ్‌కే వాస్తే;
  • to, prep. కి, కు; తో; వద్దకు;
  • toad, n. గోదురుకప్ప; కప్ప రూపంలో ఉండే ఒక భూచరం;
  • toadstool, n. కుక్కగొడుగు; విషపూరితమైన పుట్టగొడుగు; see also mushroom;
  • tobacco, n. (1) పొగమొక్క; (2) పొగాకు; [bot.] Nicotiana tobacum of the Solanaceae family;
    • tobacco leaf, ph. పొగాకు; ధూమ్రపత్రి;
    • tobacco plant, ph. పొగమొక్క;
  • today, n. నేడు; ఈరోజు; ఈనాడు; ఈవేళ;
  • toe, n. కాలివేలు;
    • big toe, ph. కాలి బొటనవేలు; అంగుష్ఠం;
    • toe nail, ph. కాలివేలి గోరు; కాలిగోరు;
    • toe rings, ph. pl. మట్టెలు; చిట్టిబొద్దులు; స్త్రీలు ధరించే ఆభరణాలు;
  • together, prep. కలసి; తో; తోడ;
  • toil, n. ప్రయాస; శ్రమ;
  • toil, v. i. ప్రయాసపడు; శ్రమపడు; శ్రమించు; పాటుపటు; కష్టపడు;
  • toilet, n. (1) సైరంధ్రి; అలంకరణకి ఉపయోగించే గది; (2) మరుగు గది; మరుగు గదిలో మలమూత్రాదుల విసర్జనకు వాడే గది లేక ఉపకరణం;

USAGE NOTE; toilet, restroom, bathroom

  • Use bathroom for a room in a house where there is a toilet. Use restroom, men’s room, and ladies’ room to talk about a room in a public place where there are one or more toilets. On a plane or train, this room is called lavatory.
  • toiletries, n. pl. ధావన సామగ్రి; పళ్లు, ఒళ్లు తోముకోడానికి కావలసిన పళ్లపొడి, సబ్బు, వగైరా;
  • tofu, n. టోఫూ; సోయాపాల జున్ను; సోయా చిక్కుడు పాల నుండి తీసిన పెరుగు వంటి పదార్ధాలతో చేసిన జున్ను వంటి పదార్థం;
  • token, n. అడియాలం; గురుతు; చిహ్నం; ఆనవాలు; సైగ; కందువ;
  • tolerable, adj. సహ్య;
  • tolerance, n. సహనం; సహనశక్తి; ఓర్మి; ఓర్పు; నిభాయింపు; తాళుకం; సహిష్ణుత; క్షమ;
  • tolerance test, ph. తాళుక పరీక్ష; సహన శక్తి పరీక్ష;
    • glucose tolerance test, ph. గ్లూకోజు తాళుక పరీక్ష;
  • tolerate, v. t. తాళుకొను; తట్టుకొను; సహించు; భరించు; ఓర్చుకొను; నిభాయించు;
  • toleration, n. సహనం; ఓర్పు;
  • toll, n. (1) సుంకం; పన్ను; (2) దెబ్బ; నష్టం;
    • took a toll, ph. దెబ్బ తిన్నాది;
    • toll booth, ph. చవుకీ; సుంకరి మెట్టు; ఆసీల మెట్ట; ఆసీల చౌకు; ఘట్టం; రహదారిలో పన్నులు వసూలు చేసే స్థలం;
  • tomahawk, n. పరశువు;
  • tomato, n. టొమేటో; టమాటా; రామ్ములగ; సీమవంకాయ; తక్కాలీ; సీమతక్కలి; తర్కారి; కర్పూరవంగ; సీమబుడ్డబూసరకాయ; పుల్లవంకాయ; a fruit of the nightshade family that is native to S. America. The U.S. Supreme Court decided that this belongs to the vegetable family rather than the fruit family; [bot.] Lycopersicum esculatum; of the Solanaceae family;
  • tomatillo, n. టొమేటిల్లో; జాంబెరీ పండు; [bot.] Physalis ixocarpa; ఇక్సోకార్పా అంటే జిగురుగా ఉన్న పండు అని అర్థం;
  • tomb, n. (టూమ్) గోరీ; సమాధి;
  • tomcat, n. m. గండుపిల్లి;
  • tome, n. పెద్ద పుస్తకం; ఉద్గ్రంథం; దస్తరం;
  • tomorrow, n. రేపు;
    • day after tomorrow, ph. ఎల్లుండి;
  • ton, n. టన్ను; బరువుని తూచే కొలత;
    • long ton, ph. పెద్దటన్ను; 2,240 పౌనులు; ఇంగ్లండులోను, తదితర కామన్వెల్తు దేశాలలోను వాడుకలోనున్న కొలమానం;
    • metric ton, ph. మెట్రిక్‌టన్ను; 1,000 కిలోలు; 2204.62 పౌనులు; అంతర్జాతీయ మెట్రిక్ పద్ధతిలో వాడే కొలమానం;
    • short ton, ph. చిన్నటన్ను; 2,000 పౌనులు; అమెరికాలోను, కెనడాలోను వాడుకలోవున్న కొలమానం;
  • tone, n. (1) స్వరం; ధ్వని; తానం; నాదం; ఒక శబ్ద తరంగం యొక్క శ్రేష్ఠత; అది ప్రకంపించే పౌనఃపున్యం యొక్క శ్రేష్ఠత; (2) శరీరావయవాలకి, కండరాలకి ఉండే బిగి;
  • tongs, n. స్రావణం; చిమటా; నిరుకారు; (rel.) పటుకారు;
  • tongue, n. (1) నాలిక; నాలుక; జిహ్వ; అర్రు; (2) భాష;
  • foreign tongue, ph. పరదేశపు భాష;
  • mother tongue, ph. మాతృభాష;
  • slip of the tongue, ph. నోరు జారడం;
  • tongue cleaner, n. పాచిబద్ద;
  • tonight, n. ఈ రాత్రి; ఈ రోజు రాత్రి;
  • ---USAGE NOTE; tonight, last night
  • ---Use last night for the night of yesterday. Do not say, “yesterday night.”
  • tonsillitis, n. గవదల వాపు; ఘశాంత దాహం;
  • tonsils, n. గవదలు; నోటిలో కొండనాలుకకి ఇరుపక్కలా ఉండే కణజాలం;
  • tonsure, n. గుండు చెయ్యడం; గుండు కొట్టించడం; శిరోముండనం; వపనం;
  • too, adv. కూడా; సైతం; సహితం;
  • tool, n. పనిముట్టు; సాధనం; కరణం; ఉపకరణం; పరికరం;
  • toolbar, n. కరణపు పట్టీ;
  • toolbox, n. పొది;
    • barber's toolbox, ph. మంగలి పొది;
  • toot, n. (1) బూరా; (2) కూత; గుడ్లగూబ అరుపు; ఘాత్కారం;
  • tooth, n. పల్లు; పన్ను; దంతం;
    • impacted tooth, ph. అంతర్ఘటన దంతం; పూర్తిగా ఎదగకుండా ఇగుళ్ల లోనే ఉండిపోయిన పన్ను; దీనిని శస్త్ర చికిత్స చేసి బయటకి తీయాలి;
  • toothache, ph. పంటినొప్పి;
  • toothbrush, n. దంతమార్జని; దంతకాష్టం; పళ్ళు తోముకునే కుంచె;
  • toothed, adj. దంతదారు;
  • toothpaste, ph. దంతధావన ఖమీరం;
  • toothpick, n. దంతకాష్టం; పళ్లు కుట్టుకునే పుల్ల;
  • toothpowder, n. పళ్లపొడి; దంత ధావన చూర్ణం;
  • top, adj. మీద; పైన; పై;
  • top, n. బొంగరం; బ్రమరకం; విఘూర్ణి;
  • topaz, n. గోమేధికం; పుష్యరాగం; పీతస్పటికం;
  • topic, n. అంశం; చర్చనీయాంశం; సంగతి; విషయం;
    • burning topic, ph. ప్రజ్వలిత అశం;
  • topography, n. నైసర్గిక స్వరూపం; స్థలాకృతి;
  • topology, n. సంస్థితి శాస్త్రం;
  • topper, n. అగ్రగణ్యుడు; అగ్రగామి; అగ్రేసరుడు; అగ్రణి; చిటారి;
  • topple, v. t. కూలద్రోయు; పడద్రోయు;
  • topsy-turvy, adj. తలకిందైన; విటతటం;
  • torch, n. దివ్వె; దివిటీ; కాగడా; దీపం; ఇలాయి;
    • torch bearer, ph. దీపధారి; వైతాళికుడు;
  • torch, v. t. అంటించు; ముట్టించు; నిప్పుపెట్టు;
  • torment, v. t. ఆరడిపెట్టు; హింసించు; యాతనపెట్టు;
  • tormentor, n. ధూర్తుడు; కంటకుడు;
  • tornado, n. సుడిగాలి; చక్రవాతం; నిర్ఘాతం; ఉత్పాత పవనం; పెనుగాలి;
  • torque, n. పురిశక్తి; మెలిశక్తి; బలభ్రామకం; పురిశ; a twisting force that tends to cause rotation; imagine a wheel of radius r and a linear force F is applied on the circumference of the wheel, then torque = r x F x sine of the angle between the vector r and the vector F; What force is to linear motion, torque is to rotational motion;
  • torrential, adj. విపరీతమైన; కుండపోతగా;
    • torrential rains, ph. కుంభవృష్టి; కుండపోత; విపరీతమైన వాన;
  • torsion, n. పురి; మెలి; విమోటనం; పురి పెట్టినట్లు తిప్పుట; Torsion is the twisting of a beam/rod under the action of a torque (twisting moment); Torque and torsion are both related to turning effects experienced by a body. The main difference between torque and torsion is that torque describes something that is capable of producing an angular acceleration, whereas torsion describes the twist formed in a body due to torque;
    • torsion balance, ph. పురి త్రాసు;
  • torso, n. మొండెం; కబంధం;
  • tort, n. వికర్మ;
  • tortoise, n. (టార్డస్) తాఁబేలు; కూర్మం; కచ్చపం; కమఠం; నేల తాబేలు;
  • torture, n. చిత్రహింస; వింగారియ;
    • death by torture, ph. చిత్రవధ;
  • torque, n. పురిబలం; Torque is a measure of how much a force (బలం) acting on an object causes that object to rotate; The unit of torque is a Newton-meter, which is also a way of expressing a Joule (the unit for energy, శక్తి). However, torque is not energy. భౌతిక శాస్త్రంలో శక్తి, బలం వేర్వేరు భావాలు;
  • torus, n. వడాకారం;
  • toss, v. i. అల్లాడు; అల్లల్లాడు; దొర్లు;
  • toss, v. t. ఎగరవేయు; విసరు;
  • tossed, adj. ఎగరవేయబడ్డ; ఉదంచిత;
  • tot, n. m. కుర్రాడు; పిల్లాడు; డింభకుడు;
  • tot, n. f. కురద్రి; పిల్ల;
  • total, v. t. మొత్తం చేయు; కూడు;
  • total, n. మొత్తం;
  • totalitarianism, n. ఏకాధిపత్యం; నిరంకుశత్వం;
  • totally, adv. పూర్తిగా; పరిపూర్ణంగా; ఆసాంతంగా; అచ్చంగా; బొత్తిగా; సుతరామూ; వడసారంగా;
  • tottering, adj. కసిమసి;
  • toucan, n. శరారి; ఆడేలు; దక్షిణామెరికా అడవులలో ఉండే ఒక పెద్దముక్కు గల పక్షి;
  • touch, adj. సంస్పర్శ;
  • touch, v. t. తగులు; తాకు; సోకు; అంటుకొను; ముట్టుకొను; స్పర్శించు; స్పృశించు;
    • sense of touch, ph. స్పర్శ జ్ఞానం;
  • touch, n. స్పర్శ; అభిమర్శం; అభిమర్శనం;
  • touch-me-not, n. (1) సోకుడుముడుగు; అత్తిప్రత్తి; ఏటేటా పాతే రంగురంగుల పువ్వుల పూసే ఒక రకం మొక్క; (2) [idiom] నన్ను ముట్టుకోకు నా మాల కాకి;
  • touchstone, n. (1) స్పర్శవేధి; పరసువేది; నీచలోహాలను బంగారంగా మార్చగల దివ్యశక్తి ఉన్న ఒక రాయి; (2) ఒరగల్లు; గీటురాయి; బంగారం వన్నె చూడటానికి వాడే గీకుడు రాయి;
  • tough, adj. దిట్టమైన; దృఢమైన; బిరుసైన;
  • toughness, n. దిట్టతనం; దృఢత్వం; బిరుసుతనం;
  • toupee, n. (టూపే), మగవారి బట్ట తలని కప్పిపుచ్చే "విగ్గు";
  • tour, n. పర్యటన; దేశాటన;
  • tourists, n. pl. పర్యాటకులు; దేశికులు;
  • toward, towards, adv. వైపు; దెసకు; యెడల; పట్ల;
  • towel, n. తువ్వాలు; తుండు; తుండుగుడ్డ; తుండు రుమాలు;
  • tower, n. శిఖరం; గోపురం; బురుజు; సిగము;
  • town, n. పట్టణం; పట్నం; నగరం; పురం; ద్రంగం; పెద్ద ఊరు; బస్తీ;
    • town planning, ph. నగర నిర్మాణ క్రమం;
    • town hall, ph. పురమందిరం;
  • toxin, n. బేతవిషం; శరీర జన్య విషం; కొన్నిరకాల బేక్టీరియాలచేత తయారు కాబడ్డ ప్రాణ్యములు కొన్ని ప్రాణుల యెడల విషపదార్థములుగా పనిచేస్తాయి; (rel.) poison; A toxin is a poisonous substance produced within living cells or organisms; Poisons are substances that cause harm to organisms when sufficient quantities are absorbed, inhaled or ingested;
  • toxoid, n. వేడిచేత బలహీనపరచబడ్డ బేతవిషం; a chemically modified toxin from a pathogenic microorganism, which is no longer toxic but is still antigenic and can be used as a vaccine;
  • toy, n. బొమ్మ; ఆటబొమ్మ;
  • toy, v. i. చెలగాటాలాడు;
  • toy brick, n. బొమ్మయిటుక; ఆటయిటుక;
  • trace, adj. లేశ;
    • trace element, ph. లేశ మూలకం; లేశ ధాతువు;
  • trace, n. ( 1) పత్తా; అయిపు; ఐపు; ఆచూకీ; జాడ; ఆరా; అడా, పొడా; అజా, పతా; పొలకువ; ( 2) లేశం;
    • trace element, ph. పొలకువ మూలకం;
    • without a trace, ph. పత్తాలేకుండా; అయిపు లేకుండా; అడా, పొడా లేకుండా; అజా, పతా లేకుండా;
  • tracer, n. పత్తాదారి;
  • trachea, n. శ్వాసనాళం; గాలిగొట్టం; ఊపిరితిత్తులకి గాలిని తీసుకెళ్ళే గొట్టం;
  • trachea, n. శ్వాసనాళం; గాలిగొట్టం; ఊపిరితిత్తులకి గాలిని తీసుకేళ్లే గొట్టం;
  • track, n. (1) మార్గము; గాడీ; (2) జాడ;
  • track, v. t. వెతుకు; వెంటాడు;
  • tractable, adj. సుగమం;
  • traction, n. కర్షణం;
  • trade, n. వ్యాపారం; వాణిజ్యం; బేహారం;
  • trade, v. t. వ్యాపారం చేయు; ఇచ్చిపుచ్చుకొను; చేతులు మార్చు;
    • trade winds, ph. వ్యాపార పవనాలు; రుతుపవనాలు;
  • trader, n. వ్యాపారి; వ్యాపారస్తుడు; సార్థవాహుడు;
  • tradition, n. ఆచారం; సంప్రదాయం; ఆనవాయితీ; రివాజు;
  • traditional, adj. సంప్రదాయ; సనాతన;
  • traditionalist, n. ఆచారపరాయణుడు;
  • traditionally, adv. ఆచారంగా; అనూచానంగా; సంప్రదాయంగా;
  • traffic, n. సంచారం; రాకపోకలు; యాతాయాతాలు; క్రయవిక్రయాలు;
    • foot traffic, ph. జన సంచారం; పాద సంచారం;
    • pedestrian traffic, ph. జన సంచారం; పాద సంచారం;
  • traffic jam, ph. ప్రతిష్టంబించిన సంచారం; వాహన సంచార ప్రతిష్టంభనం;
  • trafficking, n. దొంగ రవాణా; మాదక ద్రవ్యాల దొంగ రవాణా;
  • tragedy, n. (1) విషాద పూరితం; దుఃఖపూరితం; (2) విషాదాంతం; దురంతం;
  • tragic, n. విషాదమయం;
  • tragopan, n. గొఱ్ఱెకోడి;
  • trail, n. జాడ; జాలు;
  • train, n. (1) రైలుబండి; (2) జూటం; వెనక వేలాడేది; (3) పరంపర; పుంఖానుపుఖం; గొలుసుకట్టుగా అమర్చబడినవి; పంక్తి ; శ్రేణి; (4) పరిజనము; పరివారము; (5) పక్షి తోక; పురి; వెనుక వేళ్లాడునది;
    • train of a peacock, ph. నెమలి పురి;
    • train of thought, ph. ఊహా పరంపర; ఆలోచనా చయనిక;
  • train, v. t. తరిఫీదు చేయు; అభ్యాసము చేయించు; శిక్షణ ఇచ్చు;
  • trainee, n. అభ్యాసి;
  • training, n. తరిఫీదు; శిక్షణ; సాధకం;
  • trail, n. పుంతబాట; డొంక; కోన; పొద;
  • trait, n. లక్షణం; చిహ్నం;
  • traitor, n. దేశద్రోహి; ద్రోహి; కావైరి; కాపురుషుడు;
  • tragedy, n. విషాద సంఘటన; దుస్సంఘటన; విషాద రచన; విషాద వార్త;
  • trajectory, n. గతిపథం; చారగతి;
    • radial trajectory, ph. త్రైజ్య సంచారగతి;
  • trance, n. వివశత; వివశత్వం; సమాధిస్థితి లాంటిది; పూనకం;
  • trans, adj. pref. [chem.] ఎదురెదురుగా; అడ్డుగా; అను; అనుప్రస్థ; see also cis;
  • trans fat, ph. అనుప్రస్థ కొవ్వు; ఒక రకం కొవ్వు పదార్థం; ఈ రకం కొవ్వులలో జంట బంధం ఉన్న కర్బనపు అణువులకి ఇటూ అటూ గొలుసు పెరగటం వల్ల ఆ గొలుసు తిన్నగా ఉంటుంది; ఈ రకం జంట బంధాలు ఉన్న కొవ్వులు తినటం గుండె ఆరోగ్యానికి మంచిది కాదు;
  • transaction, n. బేరం; లావాదేవీ; ఇచ్చిపుచ్చుకొనడం; ఇచ్చిపుచ్చుకోలు; బేరసారాలు; వ్యవహారం; వాణిజ్యం; వినిమయం;
    • business transaction, ph. వాణిజ్య వ్యవహారం; లావాదేవీ;
    • conversational transaction, ph. వాగ్వ్యవహారం;
  • transcendence, n. తారకం; అనుభవాతీతం;
  • transcendental, adj. (1) బీజాతీత; (2) అత్యుత్తమ; ఉత్తమోత్తమ; లోకోత్తర; పారమార్థిక; (3) తారక; అనుభవాతీత;
    • transcendental meditation, ph. లోకోత్తర జప విధానం;
    • transcendental number, ph. బీజాతీత సంఖ్య; లోకోత్తర సంఖ్య;
  • transgender, n. హిజ్రా; వీరు పుట్టుకతో మగ (ఆడ) వారిగా ఉన్న కూడా వీరికి ఆడ (మగ) వారికున్న లక్షణాలు , వారి ప్రవర్తన ఆలోచనలు ఆడవారి (మగవారి) లాగా ఉంటాయి;
  • transgress, v. t. జవదాటు;
  • transgression, n. తప్పు; పాపం; అపరాధం; వ్యతిక్రమం; అతిక్రమణం; ఉల్లంఘనం; అతిచారం;
  • transient, adj. తాత్కాలిక; క్షణిక; క్షణభంగుర; అనిత్య; భంగుర; దంధన; తైంతిక; క్షర; అధ్రువ;
  • transient, n. తాత్కాలికం; దంధనం; భంగురం; అనిత్యం; క్షణికం; క్షణభంగురం; తైంతికం; నశ్వరం;
  • transit, adj. ప్రయాణ;
  • transit, n. (1) పోక; ప్రయాణం; (2) ప్రయాణ సాధనం; (3) దాటు; దాటడం; అంతర్యానం; గోచర సంక్రమణం;
    • rapid transit, ph. జోరుపోక; ఊరులోని రద్దీని దాటుకు పోవడానికి రైలుబండి వంటి సదుపాయం;
    • transit of a planet across Sun's disk, ph. గ్రహం సూర్యబింబాన్ని దాటడం; గ్రహ అంతర్యానం; గ్రహ గోచర సంక్రమణం; బుధుడు, శుక్రుడు భూమి కంటే సూర్యునికి దగ్గరగా వుండే కక్ష్యలలో తిరుగుతున్నాయి కాబట్టి అప్పుడప్పుడూ ఇవి కూడా భూమి - సూర్యుల మధ్యకు వచ్చే అవకాశాలు వున్నాయి. అయితే, ఈ గ్రహాలూ రెండూ భూమి నుండి చాలా ఎక్కువ దూరం వున్నాయి కాబట్టి అవి మనకు కనిపించే పరిమాణం చాలా చిన్నది. అందుకే అవి మధ్యలోకి వచ్చినా సూర్యుడిని పూర్తిగా కప్పివేయలేవు. అవి సూర్యుడి మీదుగా ప్రయాణిస్తున్న చిన్న చుక్కలాగ మాత్రమే కనిపిస్తాయి. అలా బుధుడు గాని శుక్రుడు గాని సూర్యుని మీదుగా చేసే ప్రయాణాన్ని eclipse అనరు; transit అంటారు;
  • transitive, adj. సకర్మక;
    • transitive verb, ph. సకర్మక క్రియ;
  • transistor, n. బదిరోధకి; (ety.) బదిలీ + అవరోధకి;
  • transition, adj. సంక్రమణ; సంధి; స్థిత్యంతర; అవస్థాంతర;
    • transition element, ph. అవస్థాంతర మూలకం; అవస్థాంతర ధాతువు;
    • transition metal, ph. అవస్థాంతర లోహం; ఉ. zinc, copper, palladium, nickel, cobalt, titanium and chromium
  • translate, v. t. (1) అనువదించు; (2) జరుపు;
  • translate into Telugu, ph. ఆంధ్రీకరించు; తెలిగించు; తెలుగులోకి మార్చు;
  • translation, n. (1) తర్జుమా; భాషాంతరీకరణం; అనువాదం; (2) జరుపుట;
    • free translation, ph. స్వేచ్ఛానువాదం;
    • literal translation, ph. శాబ్దిక అనువాదం;
    • word for word translation, ph. మక్కీకిమక్కీ అనువాదం;
    • translation into English, ph. ఆంగ్లీకరణం;
    • translation into Telugu, ఆంధ్రీకరణం; తెలుగు సేత; ఆంధ్రానువాదం;
  • translator, n. అనువాదకుడు; అనువాదకి; అనువాదకం; దుబాషీ; దుబాసీ; తొపాసి; ఒక భాషని మరొక భాషలోనికి మార్చే వ్యక్తి లేక పరికరము లేక అనువర్తనం; see also interpreter;
  • transliteration, n. లిప్యంతరీకరణం; ప్రతిలేఖనం; ఒక భాషని మరొక భాషయొక్క లిపిలో రాయడం;
  • translocation, n. స్థానాంతరీకరణం;
  • translucent, adj. మసకైన; మసక; మునిమసక; పాల; పారభాసక; పాక్షికపారదర్శక; వెలుగు వెళుతుంది కాని అవతలి వాళ్లు కనబడరు;
    • translucent glass, ph. మసక గాజు; పాలగాజు;
  • trans, pref. గుండా; అడ్డుగా;
  • transmission, n. ప్రేషణం; ప్రేషితం; ప్రసారం; ఒక మాధ్యమం గుండా పంపించడం, ప్రసారం చెయ్యడం, లేదా సరఫరా చెయ్యడం;
    • live transmission, ph. ప్రత్యక్ష ప్రసారం;
    • transmission line, ph. ప్రేషణ తంతువు; పంపించడానికి మాధ్యమంగా వాడిన తీగలు;
  • transmit, v. t. పంపించు; ప్రేషించు; ప్రసరించు;
  • transmitter, n. పంపేది; ప్రేషకి; ప్రసారిణి; ప్రేషకుడు;
    • radio transmitter, ph. రేడియో ప్రసారిణి; రేడియో పంపు;
  • transparent, n. పారదర్శకం; అడ్డుగా వెలుగుని పోనిచ్చేది; తన గుండా వెలుగుని ప్రసరించనిచ్చేది;
  • transparency, n. (1) పారదర్శకత; తన గుండా వెలుగుని పోనిచ్చే గుణం; (2) పారదర్శక పత్రం; తన గుండా వెలుగుని పోనిచ్చే గుణం కల కాగితం లాంటి పత్రం;
  • transpiration, n. చెమర్చడం; ఆకులు చెమర్చడం; పత్రశ్వేదనం; ఉత్‌స్వేదనం; తన గుండా చెమ్మని పోనిచ్చే పద్ధతి; చెట్లయొక్క ఆకుల గుండా చెమ్మ బయటకి వెలిగక్కబడే ప్రక్రియ;
  • transplantation, n. (1) ఊడుపు; తిరగనాటడం; వరి నారుని తిరిగి నాటడం; (2) ఒకరి శరీర అవయవాలని మరొకరి శరీరంలో పొదగడం;
  • transport, n. రవాణా;
    • road transport, ph. రోడ్డు రవాణా; రస్తే సారిగె
  • transportation, n. యానం; రవాణా పద్ధతి; ప్రజలని కాని, సరుకులని కాని, ఒక చోటు నుండి మరొక చోటుకి రవాణా చేసే పద్ధతి;
    • transportation devices, ph. pl. యాన సాధనాలు; రవాణా సాధనాలు;
  • transpose, n. తారుమారు; పరావర్త్యం; ఇటునుండి అటు మార్పిడి;
  • transverse, adj. తిర్యక్; అడ్డు; పేక; (పడుగు పేకలో వలె); అనుప్రస్థ;
    • transverse axis, ph. తిర్యక్ అక్షం;
    • transverse section, ph. అడ్డు కోత; తిర్యక్ ఛేదనం;
    • transversal line, ph. తిర్యక్ రేఖ; ఖండించు రేఖ;
  • trap, n. బోను; వల;
  • trap, v. i. బోనులోపడు; ఇరుకుకొను; చిక్కుకొను; వలలోపడు;
  • trap, v. t. బోనులో పట్టుకొను; వలలో పట్టుకొను;
  • trapper, n. m. వాగుఱికాఁడు; f. వాగుఱిగత్తె;
  • trapezium, n. విషమ చతుర్భుజం; ఏ రెండు భుజములూ కూడ సమాంతరంగా లేని చతుర్భుజం;
  • trapezoid, n. అర్థసమాంతర చతుర్భుజం; ఏవో రెండు భుజములు సమాంతరంగా ఉన్న చతుర్భుజం;
  • trash, n. చెత్త; పిప్పి;
  • trash bin, n. చెత్త బుట్ట; చెత్త కుండీ;
  • trauma, n. క్షోభ; స్థాపం; అఘాతం;
    • mental trauma, ph. మనస్ స్థాపం; మానసిక అఘాతం;
    • physical trauma, ph. భౌతిక స్థాపం; భౌతిక అఘాతం;
  • travails, n. pl. (1) సమస్యలు; ఇబ్బందులు; (2) నొప్పులు; ప్రసవ వేదన;
  • travel, n. ప్రయాణం; పయనం;
  • traveler, n. m. ప్రయాణీకుడు; బాటసారి; తెరువరి; పాంథుడు;
  • traveling, adj. సంచార; ఆధ్వనీన; ప్రయాణీకులకి సంబంధించిన;
    • traveling doctor, ph. సంచార వైద్యుడు;
    • traveling library, ph. సంచార గ్రంథాలయం;
  • traverse, n. చంక్రమణం;
    • traverse along a branch, ph. శాఖాచంక్రమణం;
  • trawler, n. చేపలు పట్టడానికి ప్రత్యేకంగా అమర్చబడ్డ పడవ;
  • tray, n. తబుకు;
  • treachery, n. ద్రోహం;
  • tread, v. t. తొక్కు; మట్టు; కాలితో తొక్కు;
  • tread, n. తొక్కు; మట్టు; రబ్బరు చక్రాలు భూమిని కరిచిపెట్టుకు ఉండడానికి వీలుగా వేసిన మట్టు;
  • treason, n. దేశద్రోహం;
  • treasure, n. సంచితం; నిధి; కాణాచి;
    • treasure trove, ph. నిక్షిప్తనిధి;
  • treasurer, n. కోశాధికారి; ఆయతికాడు; పోతేదార్;
  • treasury, n. బొక్కసం; కోశం; ఖజానా; భండారం; భాండాగారం; ధనాగారం; ఉగ్రాణం;
  • treat, v. t. (1) చికిత్స చేయు; (2) చూడు; ఉపచారం చేయు;
  • treatise, n. సంహితం;
  • treatment, n. (1) చికిత్స; (2) చూపు; ఉపచారం; పరిపోషణ; అభిచర్య;
    • heat treatment, ph. ఉష్ణోపచారం; తాపోపచారం;
    • radiation treatment, ph. వికిరణ చికిత్స;
  • treaty, n. ఒడంబడిక; ఒప్పందం;
  • tree, n. చెట్టు; వృక్షం; ద్రుమం; తరువు; దరువు; అగం; నీవం; మహీరుహం; భూరుహం; సాలం; విటపం; మ్రాను; మ్రాకు;
    • avenue tree, ph. రహదారి చెట్టు; రహదారులకి ఇరుపక్కలా ఉండే చెట్టు;
    • deciduous tree, ph. పతయాళువు; ఆకులు రాల్చే స్వభావం గల చెట్టు;
    • evergreen tree, ph. సతతహరితం; ఎల్లప్పుడు ఆకులు పచ్చగా ఉండే చెట్టు;
    • hollow of a tree, ph. తొర్ర; కోటరం;
    • invasive tree, ph. బెడద చెట్టు; బెడద వృక్షం;
  • trefoil, n. త్రైపత్రిణి; మువ్వాకి; మూడు ఆకులు తమతమ కాడల వద్ద కలిసి ఒక వలయాకారంలోనున్న గుర్తు;
  • trellis, n. పాకిడ; పందిరి; పాదు పాకడానికి వీలుగా అమర్చిన చట్రం;
  • tremor, n. వణుకు; కంపం; వేపథువు;
  • trench, n. కందకం; అగడ్త; పరిఘ; గాడీ;
    • long narrow trench, గాడీ;
  • trend, n. పంథా; పథం; బాణి; ధోరణి; వరస; పోకడ; రీతి;
    • trend setter, ph. పథనిర్దేశకుడు; వైతాళికుడు;
  • trepidation, n. భయం; జంకు;
  • tresses, n. జడలు; జటలు; జటాజూటం;
  • triad, n. త్రేతం; త్రికం;
  • trial, n. (1) న్యాయవిచారణ; విచారణ; (2) యత్నం; ప్రయత్నం;
    • trial and error method, ph. నేతి నేతి పద్ధతి; నేతి నేతి మార్గం; ప్రయత్న వైఫల్య పద్ధతి; అవక్షేప పద్ధతి;
  • trials, n. pl. తిప్పలు; పాట్లు; కష్టాలు;
    • trials and tribulations, ph. తిప్పలు; పాట్లు; కష్టాలు;
  • triangle, n. త్రిభుజం; ముయ్యంచు; త్రికోణి; ముక్కోణి;
    • equilateral triangle, ph. సమబాహు త్రిభుజం; సమకోణ త్రిభుజం; సమ త్రిభుజం; త్రస్రం;
    • isosceles triangle, ph. సమద్విబాహు త్రిభుజం;
    • right-angled triangle, ph. లంబకోణ త్రిభుజం;
    • scalene triangle, ph. విషమబాహు త్రిభుజం; అసమభుజ త్రిభుజం;
  • triangular, adj. త్రిభుజాకారపు; ముక్కోణాకారపు;
    • triangular prism, ph. ముక్కోణ పట్టకం; త్రికోణ పట్టకం;
  • Triassic, adj. తృతీయ; తదియ; మూఁడవ; --see also tertiary;
    • Triassic period, ph. మూఁడవ జీవయుగము;
  • tribe, n. తెగ; జాతిలో ఒక భాగం;
    • tribal people, ph. గిరిజనులు; పార్వతీయులు;
  • tribunal, n. త్రిమూర్తి న్యాయస్థానం;
  • tributary, n. ఉపనది;
  • tribute, n. (1) కప్పం; ఉపప్రదానం; పెద్దలకి సంప్రదాయానుసారంగా ఇచ్చే బహుమానం; లంచం; (2) పొగడ్త; ప్రశంస;
    • pay tribute to, ph. పొగుడు; ప్రశంసించు;
  • tri-chloro methane, n. త్రిహరితపాడేను; క్లోరోఫారం; మత్తుమందు; తీపిగా ఉండి, వాసన లేని ఒక ద్రవపదార్థం; దీనిని మత్తుమందుగా వాడతారు; CHCl3;
  • trick, n. (1) టక్కు; దందన; (2) పట్టు, పేకాటలో;
  • trickery, n. టక్కరితనం;
  • trickle, v. i. కారు; స్రవించు; బొట్టుబొట్టుగా కారు;
  • trickster, n. టక్కరి; నమ్మరానివాడు; మాయావి; జిత్తులమారి; టక్కులమారి; దందనకాడు; దందనకత్తె;
  • tricycle, n. మూడు చక్రాల సైకిలు;
  • tridax, n. కుక్కబంతి;
  • trident, n. త్రిశూలం; శూలం;
  • triennial, adj. త్రైవార్షిక; తిస్సాలా; మూడేళ్లకి ఒకసారి;
  • trifle, n. అల్పం; స్వల్పం; అలతి;
  • trifle, n. కల్యవర్తం; ఒక రకమైన తీపి తినుబండారం;
  • trifling, adj. పేలవంగానున్న; చాలా కొంచెం; ఇసుమంత; ఈషత్తు; తృణప్రాయం;
  • trifoliate, adj. ముయ్యాకుల; మూడాకుల; త్రిపత్ర;
  • trigonometry, n. త్రిగుణమాత్రకం; త్రికోణమితి; త్రిభుజ శాస్త్రం; త్రికోణ గణితం;
  • trihedral, adj. త్రిముఖ; త్రిఫలక;
  • trill, n. [phonetics] అధిక కంపితం;
  • trillion, n. ట్రిలియను; ఖర్వం; ఒకటి తర్వాత పన్నెండు సున్నలు;
  • trim, v. t. (1) కత్తిరించు; కురచ చేయు; త్రుంచు; తగ్గించు; పత్రించు; (2) అలంకరించు;
  • trimer, n. త్రిభాగి; త్రితయాణువు;
  • trimester, n. (1) ఒక కాల పరిమితిలో మూడవ భాగం; (2) తొమ్మిది నెలలలో మూడవ భాగం; గర్భిణి ఎన్నవ నెలలో ఉన్నదో చెప్పడానికి వాడతారు; (3) కందాయం; జ్యోతిషంలో సంవత్సరంలో మూడవ భాగం; నాలుగు నెలలు;
  • triode, n. త్రయోడు; మూడు ముఖ్య భాగాలు ఉన్న శూన్య నాళిక; ట్రాన్సిస్టర్లు వాడుకలోకి వచ్చిన తర్వాత వీటి వాడకం తగ్గిపోయింది కాని, అంతకు పూర్వం ఇవి ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో తప్పనిసరి అయిన భాగాలుగా ఉండేవి;
  • trip, n. చిన్న ప్రయాణం; ప్రయాణం; పర్యటనం;
    • return trip, ph. తిరుగు ప్రయాణం;
  • trip, v. i. పడు; కాలితో దేన్నయినా తన్నుకుని పడు;
  • tripartite, adj. త్రైపాక్షిక; త్రిపక్ష;
  • triple, adj. త్రయ; త్రిక;
  • triple, n. త్రయం;
  • triplet, n. త్రికం; త్రయం; తిగలు;
  • tripod, n. త్రిపాది; ముక్కాలిపీట; టీపాయి; తీపాయి;
  • trisector, n. త్రిఖండిక; త్రిధాచ్ఛిత్తి; ముమ్మిడి కోట రేఖ;
  • triumphant, adj. జైత్ర;
    • triumphant march, ph. జైత్ర యాత్ర;
  • trivial, adj. (1) వ్యర్థమైన; అల్ప; సాధారణ; (2) ఆషామాషీ;
  • troika, n. ముగ్గురి ముఠా; ముగ్గురి గుంపు; త్రిష్టయం;
  • troll, n. (1) పిల్లల కథలలో వచ్చే పొట్టిగా, కురూపిగా ఉండే ఒక పాత్ర; (2) అంతర్జాలంలో జరిగే "సంభాషణలలో" మధ్యలో తలదూర్చి, అసందర్భపు వ్యాఖ్యలు చేసి దీశని మార్చడానికి ప్రయత్నించే వ్యక్తి; పానకంలో పుడక; పుల్లారిబుడ్డి;
  • trolling, n. (1) అంతర్జాలంలో పిలవని పేరంటంగా మధ్యలో వచ్చి వ్యాఖ్యానాలు చెయ్యడం; (2) carefully and systematically search an area for something; "a group of companies trolling for partnership opportunities;"
  • tropical, adj. ఉష్ణ; ఆయనరేఖా;
    • tropical diseases, ph. ఉష్ణమండలాలలో కనబడే వ్యాధులు; ఉ: కలరా, మలేరియా, నంజు (బెరిబెరి), డెంగీ, కొంకి క్రిములు, వగైరా;
    • tropical zones, ph. ఉష్ణమండలాలు; అయనరేఖా మండలం;
  • tropics, n. ఉష్ణమండలాలు; అయనరేఖా మండలం; (lit.) turning points;
    • Tropic of Cancer, ph. కర్కాటక రేఖ;
    • Tropic of Capricorn, ph. మకర రేఖ;
  • troop, n. మేళం; జట్టు; మూక; దండు; see also troupe;
    • troop of monkeys, ph. కోతి మూక;
  • trophic, adj. పోషక; జీవనాధార;
    • trophic web, ph. పోషక వలయం; పోషక జాలం; జీవనాధార జాలం; ఆధారజాలం; ఏ జంతువుకి ఏది ఆహారమో తెలియజేసే వలయాకారపు బొమ్మ;
  • trophy, n. పతకం;
  • troposphere, n. చైతన్యావరణం; సామీప్యావరణం; భూ ఉపరితలం పైన 7 నుంచి 17 కి మీ వరకు విస్తరించి ఉంటుంది. దీని కింది భాగం వేడిగా ఉండి ఎత్తు పెరిగే కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది;
  • trouble, n. ఇబ్బంది; శ్రమ; యాతన; గొడవ; కిరికిరి; ఉపహతి;
  • troubles, n. pl. ఇబ్బందులు; యాతనలు; తిప్పలు; పుర్రాకులు; అగచాట్లు; కడగండ్లు; అరిష్టాలు;
    • teething troubles, ph. బాలారిష్టాలు;
  • trough, n. (ట్రఫ్‍) (1) గోలెం; తొట్టె; గాడి; (2) గర్తం; ఉద్ది; (3) ద్రోణి; తరంగం దిగువ భాగం; అల్పపీడన ప్రాంతం;
  • troupe, n. మేళం; మూక; దండు; తండం; see also troop;
    • troupe of Lambadis, ph. లంబాడీ తండా;
  • trowel, n. తాపీ;
  • truant, n. బడి ఎగ్గొట్టిన విద్యార్థి;
  • truce, n. సంధి;
  • true, n. నిజం; వాస్తవం;
  • truffle, n. శిలీంధ్ర రత్నం; మట్టి లోపల పెరిగే ఒక రకం పుట్టగొడుగు; a kind of mushroom, of a fleshy, fungous structure and roundish in shape that is native to the wooded areas of southern Europe; much esteemed and highly prized culinary delicacy with an earthy flavor; [bot.] Tuber melanosporum;
  • truism, n. నిర్వివాదమైన నిజం; సర్వసాధారణమైన సత్యం;
  • trump, n. పేకాటలో తురఫు;
  • trumpet flower, n. అంబువాసిని; బెగోనియా;
  • trumps, v. t. పేకాటలో తురఫు పెట్టి కోయు;
  • trumpet, n. బాకా; బూరా;
  • truncate, v. t. క్షిప్తించు;
  • truncated, adj. క్షిప్తించిన; కోసేసిన;
  • trunk, n. (1) పెట్టె; (2) మొండెం; (3) మాను; మోడు; స్థాణువు; స్కంధము; (4) తొండము; కరము;
  • truss, n. (1) పటకా; ఇంటికప్పుకి ఆధారంగా దూలాలతో కట్టే పటకా; (2) ఆంత్రనిరోధక పటకా; శరీరాంగాలు జారిపోకుండా వైద్యుడు వేసే పటకా;
    • trussor flap, ph. గోచీ గుడ్డ;
  • trust, n. (1) నమ్మకం; విశ్వాసం; పూచీ; నమ్మిక; (2) విశ్వాస నిక్షేపం; విక్షేపం; ధర్మనిక్షేపం; (3) బ్యాంకు;
  • trustee, n. ధర్మకర్త; ధర్మవ్యవహర్త;
    • honorary trustee, ph. గౌరవనీయ ధర్మకర్త;
  • truth, n. నిజం; సత్యం; నిక్కం; నిబద్ధం; రుతం; యథార్థం; యథాతథం; వాస్తవం; నిలవరం; సమీచీనం;
    • truth table, ph. రుత పట్టీ; నిజంపట్టీ; నేటుపట్టీ; సత్యపీఠం;
    • naked truth, ph. నగ్నసత్యం;
  • truthfulness, n. నిజాయతీ;
  • try, v. i. ప్రయత్నించు; ఉంకించు; ఉద్యోగించు; తివురు;
  • tryst, n. (ట్రిస్ట్) ముఖాముఖీ;
  • tryst with destiny, ph. విధితో ముఖాముఖీ;
  • tsunami, n. తీరపు అల; సునామీ; (Japanese: tse = తీరపు, nami = అల)
  • tub, n. తొట్టి; తొట్టె;
  • tuba, n. బూరా; బాకా;
  • tube, n. గొట్టం; నాళం; నాళిక; సానిక; క్రోవి; గ్రోవి;
  • tuber, n. దుంప; గడ్డ;
  • tuberculosis, n. క్షయ;
  • tubular, adj. నాళాకార;
  • Tuesday, n. మంగళవారం; భౌమ్యవారం; భౌమవాసరం;
  • tumbler, n. గ్లాసు; గళాసు;
  • tummy, n. బొజ్జ;
  • tumor, n. కంతి; నెత్తురుగడ్డ; గడ్డ; కణిత; గుల్మం; అర్బుదం; --see also gland
  • tumult, n. కకపిక;
  • tundra, n. నీహారమండలం; శీతలమండలం; టండ్రా; ఆర్కిటిక్ చక్రం ప్రాంతాలలో వుండే చెట్లులేని విశాలమైన చెమ్మ మైదానాలు; see also savanna; prairie;
  • tune, n. వరస; పాట పాడే వరస; ఒకదాని తరువాత మరొక స్వరం వరసగా రావడం; భారతీయ శాస్త్రీయ సంగీతంలో పాట పాడినప్పుడు ఏదో ఒక వరస ఎంచుకుని పాడతారు; (ఉదా. కేవలం అన్నం తిన్నట్లు లేదా కేవలం చపాతీ తిన్నట్లు; పాశ్చాత్య సంప్రదాయంలో అనేక వరసలు కలిసి వినిపిస్తాయి; అనంలో ముక్కల పులుసు కలుపుకుని తిన్నట్లు;)
  • tune, v. t. శృతి చేయు;
  • tuning fork, n. శృతిదండం;
  • Tungsten, n. టంగ్‌స్టన్; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 74, సంక్షిప్త నామం, W); Swedish. tung sten = heavy stone; wolfram;
  • tunnel, n. (1) సొరంగం; బిలం; (2) తొర్ర;
  • tunnel, v. t. దొలుచు;
  • turban, n. తలపాగా; పాగా;
  • turbidity, n. కలక; ఆవిలం; మసకతనం;
  • turbid, adj. మసక; ఆవిలమైన; ఆవిల;
  • turbo, adj. విక్రమ; జోరుగా నడచే;
  • turbulence, n. (1) ఉరవడి; సమీరితం; అనిశ్చలం; (2) వాతావరణంలో అనిశ్చలత; (3) సంక్షోభం;
  • turbulent, adj. ఉరవడి; గజిబిజి; అనిశ్చల; సమీరిత;
    • turbulent flow, ph. అనిశ్చల ప్రవాహం; గజిబిజి ప్రవాహం; ఉరవడి ప్రవాహం;
  • turgid, adj. (1) వాచిన; బలిసిన; (2) అనవసరమైన ఉత్ప్రేక్షలతో కూడిన;
  • turkey, n. (1) టర్కీ; కోడి లాంటి పక్షి; (2) [idiom] అసమర్ధుడు; చేతకానివాడు;
  • turmeric, n. పసుపు; పసుపు కొమ్ము; అళది;
  • turmoil, n. మథన;
  • turn, n. (1) మలుపు; క్రాంతి; (2) పర్యాయం; సారి; చుట్టు; ఆవర్తి; (3) వంతు;
  • turn, v. i. తిరుగు; మళ్లు;
  • turn, v. t. (1) తిప్పు; మళ్లించు; మరలించు; (2) మార్పు; మార్పు చేయు; (3) చుట్టు; చుట్టబెట్టు;
  • turnery, n. తరిణ; the action or skill of making objects on a lathe;
  • turns, n. pl. సార్లు; చుట్లు;
    • turning chair, ph. అసందిక; (see also) rotating chair
    • turning point, ph. మలుపు తిరిగే స్థానం; విశ్రమ స్థానం; క్రాంతి బిందువు; పరివర్తన స్థానం;
  • turnings, n. రజను; రద్దు;
  • turnstile, n. కిర్రుమాను;
  • turpentine, n. శ్రీవేష్టం; కర్పూరతైలం;
  • turquoise, n. హరితాశ్మను వర్ణం;
  • turtle, n. నీటి తాబేలు; ఇది సాధారణంగా నీటిలో నివసిస్తుంది; నేల తాబేలుకీ, దీనికి కొన్ని పోలికలు కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి;
  • tutor, n. శిక్షకుడు; శిక్షకురాలు; బోధకుడు; బోధకురాలు;
  • tutoring, n. శిక్షణ; బోధన; అధ్యాపన;
  • tweezers, n. చిమటా; తండసం;
  • twelfth, adj. ద్వాదశ; పన్నెండవ;
  • twelve, n. పన్నెండు; ఇరారు; ఈరారు;
  • twentieth, adj. ఇరవైయ్యవ;
  • twentieth, n. ఇరవైయ్యవది;
  • twenty, n. ఇరవై; ఇరువది; వింశతి;
  • twenty-five, n. ఇరవై అయిదు; పంచ వింశతి; పచ్చీసు;
  • ---USAGE NOTE; writing numbers
  • ---While writing numbers, (1) hyphenate all numbers between 21-99, unless divisible by 10. Example: 51 = fifty-one, 450 = four hundred fifty. (2) Do not use and in whole numbers. Example: five hundred sixty-seven, not five hundred and sixty-seven. (3) Use "and" for the decimal point. Example: 234.2 (two hundred thirty-four and two tenths. (4) Avoid numbers at the start of a sentence. Example: Seventy-one people attended the meeting.”
  • Tweed, n. a misnomer for Twill;
  • tweezers, n. తండసం;
  • twice, adj. ఈరు; రెట్టింపు;
    • twice five, ph. ఈరేను; 10;
    • twice six, ph. ఈరారు; 12;
    • twice seven, ph. ఈరేడు; 14;
  • twice, n. (1) రెండు సార్లు; (2) రెండింతలు; రెట్టింపు;
  • Twill, n. గెంటెం; జంటనేత బట్ట; రెండు పేటల దారంతో నేసిన గుడ్డ యొక్క వ్యాపార నామం;
  • twig, n. రెమ్మ; పరిగె; ఉపశాఖ; కొమ్మ రెండుగా చీలడం వల్ల వచ్చిన ఉపశాఖ;
  • twilight, n. సంధ్య;
    • evening twilight, ph. మలి సంధ్య; మునిమాపు; మునిచీకటి; ప్రదోష కాలం;
    • morning twilight, ph. తొలి సంధ్య;
  • twine, n. జమిలిదారం; రెండు పేటలు వేసి పేనిన దారం;
  • twinkle, n. తళుకు; మినుకు;
  • twins, n. కవలలు;
    • identical twins, ph. సారూప్య కవలలు; ఏక రూప కవలలు; ఏక సంయుక్త బీజ కవలలు; ఇందులో ఒక అండం + ఒక శుక్ర కణం = ఒక సంయుక్త బీజం ఏర్పడుతుంది. అయితే ఏర్పడిన తర్వాత విభజన జరిగి రెండు లేదా మూడు అండాలు ఏర్పడ వచ్చు. ఇలా విభజనకు ముందే దాని లింగ నిర్ధారణ జరిగి ఉంటుంది గనక, వీరు ఒకే పోలిక ఉన్న, ఒకే లింగానికి చెందిన కవలలు. వీరి జన్యువుల్లో చాలా సామ్యం ఉంటుంది. అందుకే ఎవరు ఎవరో గుర్తు పట్టలేనంత పోలికలు ఉంటాయి;
    • fraternal twins, ph. భ్రాతృ కవలలు; సోదర కవలలు; ద్వి సంయుక్త బీజ కవలలు; ఇక్కడ రెండు లేదా ఎక్కువ అండాలు +రెండు లేదా ఎక్కువ శుక్ర కణాలు = రెండు అంతకన్నా ఎక్కువ సంయుక్త బీజాలు;
  • twist, n. మెలి; పురి; వెంటి;
  • twist, v. t. పేను; పురి ఎక్కించు; తిప్పు;
  • twisted, adj. నులి; నులి పెట్టిన;
  • twisted pair, n. నులి జంట; నులి పెట్టిన తీగల జంట;
  • twigs, n. pl. చితుకులు;
  • twitch, v. i. కండరాలలో వచ్చే చిరు స్పందన;
  • two, n. (1) రెండు; ఇరు; ఈరు; జమిలి; ద్వ; ద్వయం; ద్వయి; దో; (2) ఇద్దరు;
    • two books, ph. రెండు పుస్తకాలు;
    • two people, ph. ఇద్దరు; ఇద్దరు మనుషులు;
    • two sides, ph. ఇరువైపుల;
  • two-dimensional, adj. ద్వైమానిక;
    • two-dimensional description, ph. ద్వైమానిక వర్ణనం;
  • two-colored, n. దోరంగి;
  • two-fold, adj. ఉమ్మడి;
  • tycoon, n. వ్యాపార రంగాన్ని ఎక్కువగా ప్రభావితం చెయ్యగల వ్యాపారస్తుడు; see also mogul;
  • tympanum, n. కర్ణభేరి; గూబ;
  • type, n. (1) రకం; బాపతు; (2) టైపు; (3) ముద్రాక్షరాలు;
    • linotype, ph. పంక్తి కూర్పు;
    • monotype, ph. అక్షరాల కూర్పు;
    • type of person who will listen, ph. మాట వినే బాపతు;
  • typesetting, n. అచ్చుకూర్పు;
  • typhus, n. విష జ్వరం; టైఫస్;
  • typhoid, n. సన్నిపాత జ్వరం; టైఫాయిడ్;
  • typhoon, n. ప్రచండ తుఫాను; ప్రచండ వాయువు; చైనాలో వచ్చే గాలివాన పేరు; ఇండియాలో వచ్చే గాలివానని సైక్లోను అనీ, అమెరికాలొ వచ్చే దానిని హరికేను అనీ అనడం ఆచారం;
  • typo, n. టైపాటు; టైపు చేసేటప్పుడు దొర్లిన పొరపాటు;
  • tyrant, n. నియంత; ఇరినుఁడు;
  • tyranny, n. నైయంత్యం; ఇరినం;

Part 2: U

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • ubiquitous, adj. సర్వాంతర్యామి అయిన; సర్వవ్యాప్తమయిన; అన్నిచోట్లా ఉన్న; బాగా వాడుకలో ఉన్న; విభుత్వ;
  • udder, n. పొదుగు; గోస్తనం;
  • ugliness, n. అందవికారం; అనాకారిత్వం;
  • ugly, adj. అనాకార;
    • ugly person, ph. అనాకారి; కురూపి;
  • uh-huh, inter. అహా; ఉహూ; ఊకొట్టడం;
  • ulcer, n. గుల్మం; వ్రణం; పుండు; కొరుకుపుండు;
    • chronic ulcer, ph. విలంబిత వ్రణం;
    • duodenal ulcer, ph. ఆంత్రమూల వ్రణం;
  • ulna, n. అరత్ని; అరత్నిక; కూర్పరాస్థి; మూరెుముక; see also radius;
  • ultimate, adj. చిట్టచివరి; కడపటి; చరమ; కొస; ఆఖరు; తుది; అంతిమ; పరిపూర్ణ; కేవల;
    • ultimate authority, ph. తుది తీర్పరి; అంతిమ ప్రమాణం;
    • ultimate reality, ph. అంతిమ సత్యం; కఠోర వాస్తవం;
  • ultimatum, n. తుది హెచ్చరిక; మాట; ఆఖరి మాట; కడపటి కబురు; ఉల్లాకి; అంత్య సందేశం;
  • ultramarine, adj. అతినీల; చిక్కటి నీలిరంగు; (ety.) సముద్రాంతరాలనుండి (ఆఫ్గనిస్థాన్ నుండి) వచ్చిన నీలిరంగు;
  • ultrasonic, adj. శ్రవణాతీత; అతిధ్వనీయ;
  • ultrasound, n. (1) అతిధ్వని; ధ్వని తరంగాల కంటే వేగంగా కంపించే తరంగాలు; (2) శబ్ద తరంగాలని ఉపయోగించి శరీరపు లోపలి భాగాలని చూసే పద్ధతి;
  • ultra, pref. అతి; విపరీత; అత్యుగ్ర;
  • ultraviolet, adj. అత్యూద; అతినీలలోహిత; ఊర్ధ్వనీలలోహిత; వర్ణమాలలో ఊదా రంగు కంటె ఎక్కువ పౌనఃపున్యముతో ప్రకంపించే కాంతి కిరణాలు; ఈ తరంగాల పొడుగు 10 - 400 నేనోమీటర్లు ఉంటాయి;
  • umbel, n. గుత్తి;
  • umbilical, adj. బొడ్డుకి చెందిన; నాభికి సంబంధించిన;
    • umbilical cord, ph. బొడ్డుతాడు;
  • umbilicus, n. నాభి; బొడ్డు;
  • umbrage, n. (1) నీడ; నీడనిచ్చే గుబురైన పెరుగుదల; (2) కోపగించుకోవడం; చిరాకు పడడం;; resentment;
  • umbrella, n. గొడుగు; ఛత్రం; ఆతపత్రం;
    • umbrella tree, ph. గంగరావి; బ్రహ్మదారువు;
  • umpire, n. మధ్యవర్తి; ఆటల పోటీలలో ఇరు పక్షములకి మధ్యవర్తి; అంపైరు;
  • unable, adj. చేయ శక్యంకాని;
  • unaccented, adj. అనుదాత్త; అస్వరిత; తేలికగా పలికే;
  • unachievable, adj. అశక్య;
  • unadulterated, adj. అప్పటం; కల్తీకాని; అచ్చమైన; మేలిమి;
  • unaided, adj. అసహాయంగా; సహాయం లేకుండా;
  • unambiguously, adv. నిర్ద్వందంగా; స్పష్టంగా; అసందిగ్ధంగా; ఎటో ఒక పక్కకి తేల్పి;
  • unanimity, n. ఏకకంఠం;
  • unanimously, adv. ఏకగ్రీవంగా;
  • unasked, adj. అయాచితంగా;
  • unaspirated, adj. అల్పప్రాణ;
  • unassuming, adj. నమ్ర; అహంకారం లేని;
  • unattainable, adj. అందరాని; అందుబాటులో లేని; అప్రాప్యమైన;
  • unauthentic, adj. సిసలు కాని; నకలు; అప్రమాణిక;
  • unavailable, n. అలభ్యం;
  • unavoidable, adj. అనివార్య; అనివార్యమైన; అపరిహార్య;
  • unbiased, adj. నిష్పాక్షికంగా; పక్షపాతం లేకుండా;
  • unbleached, adj. కోరా; చలవ చెయ్యని;
  • unblushing, adj. అభిమానం లేని; సిగ్గులేని;
  • unbounded, adj. అపరిమిత; నిరవధిక; అవేల;
  • unbroken, adj. అఖండ; అఖండిత; అవిచ్ఛిన్న;
  • uncertain, adj. అనిశ్చిత;
  • uncertainty, n. విచికిత్స; సంశయం; అశంక; అనిశ్చితత్వం; వికల్పం;
  • unchanging, adj. కూటస్థ;
  • unchecked, adj. అదుపులేని;
  • uncircumcised, n. అసున్నతీయులు;
  • unclaimed, adj. బేవారసు;
  • uncle, n. (1) మావయ్య; తల్లి సోదరుడు; (2) పెదనాన్న; (3) చిన్నాన్న; బాబయ్య; కక్క; (4) అత్త భర్త; (5) భార్య తండ్రి; భర్త తండ్రి;
    • maternal uncle, ph. మావయ్య; మేనమామ; తల్లి సోదరుడు;
    • paternal uncle, ph. (1) పెదనాన్న; (2) చిన్నాన్న; బాబయ్య; కక్క;
    • paternal elder uncle, ph. పెదనాన్న;
    • paternal younger uncle, ph. చిన్నాన్న; బాబయ్య; కక్క;
  • unclear, adj. అవ్యక్త; అస్ఫుట;
  • unclear, n. అవ్యక్తం; అస్ఫుటం;
  • uncommon, adj. అసాధారణమైన;
  • uncomparable, adj. సాటి లేని; సామ్యం లేని; నిరుపమ;
  • unconcerned, adj. నిర్లిప్త; పట్టించుకోకుండా;
  • unconscious, adj. స్మృతివిహీన; స్మృతిలేని; స్మృతితప్పిన; మైకం కమ్మిన; అచేతన;
    • unconscious presumption, ph. అచేతన అహంకారం; అచేతన పురాభావన; బహుశా అవునేమో అనే అచేతన నమ్మకం;
  • unconsciously, adv. (1) అపగత చేతనంగా; అచేతనంగా; స్మృతివిహీనంగా; (2) అప్రయత్నంగా; అనుకోకుండా;
  • unconditionally, adv. బేషరతుగా; షరతులు లేకుండా;
  • unconventional, adj. కానువాయి;
  • uncountable, adj. అగణ్య; అసంఖ్యాక;
    • uncountable infinity, ph. అసంఖ్యేయ అనంతం; అగణ్య అనంతం;
  • uncountably, adv. అసంఖ్యాకంగా; లెక్కించడానికి వీలుపడని;
  • unction, n. లేపనం; అంజనం; తైలం;
  • undaunted, adv. నిరుత్సాహ పడకుండా;
  • undecidable, adj. అస్తినాస్తి;
  • undeniable, adj. తిరుగులేని;
  • under, adj. కింద; ఉప;
    • under employment, n. అల్పోద్యోగం; చదివిన చదువుకి కాని, ఉన్న తెలివితేటలకి గాని తగని చిన్న ఉద్యోగం;
  • undercurrent, n. (1) అంతర్వాహిని; (2) ధోరణి; వైఖరి; సరళి;
  • underdeveloped, adj. బడుగు;
  • underdog, n. పోటీలో వెనకబడ్డ వ్యక్తి; అణచబడ్డ వర్గంలోని వ్యక్తి;
  • undergo, v. i. అనుభవించు;
  • underground, adj. భూగత; భూగర్భ;
    • underground drainage system, ph. భూగర్భ నీటిపారుదల వ్యవస్థ;
    • underground stem, ph. భూగత కాండం;
  • underhand dealing, ph. దందా;
  • underline, n. క్రీగీటు; క్రీగీత;
  • underprivileged, adj. బడుగు; అవకాశాలు లేని;
  • underscore, v. t. (1) నొక్కి వక్కాణించు; (2) అడుగున గీత గీయు
  • understand, v. i. అర్థమవు; బోధపడు; తెల్లం ఆవు;
  • understand, v. t. అర్థం చేసుకొను;
  • understanding, n. అవగాహన; అవగతం; గ్రహణశక్తి; ఒప్పందం;
    • mutual understanding, ph. పరస్పర అవగాహన;
  • understatement, n. నిమ్నోక్తి; సరసోక్తి; చెప్పదలుచుకున్న దానిని బాధించకుండా చెప్పడం; "పాట బాగు లేదు" అనకుండా "పాట ఎదో కొత్త పంథాలో ఉన్నట్లు ఉంది" అనడం ఒక ఉదాహరణ; నిజాన్ని కాస్త మెత్తబరచి చెప్పడం;
  • undertake, v. i. తలపెట్టు; కైకొను; పూను;
  • underwater, adj. జలగత;
  • underwear, n. చెడ్డీ; లోదుస్తులు; చల్లాడం;
  • underwrite, v. i. పూచీపడు;
  • undesirable, adj. అవాంఛనీయమైన;
  • undignified, adj. లేకి;
  • undivided, adj. అవిభక్త; అఖండ;
    • undivided India, ph. అఖండ భారతదేశం;
  • undoubtedly, adv. నిస్సంకోచంగా; నిక్కచ్చిగా;
  • undue, adj. తగని;
  • undulate, v. i. ఊగిసలాడు;
  • unearned, adj. అనుపార్జిత;
    • unearned income, ph. అనుపార్జిత ఆదాయం;
  • uneasiness, n. నలత;
  • unemployed, n. నిరుద్యోగి; బికారి;
  • unemployment, n. నిరుద్యోగం;
    • unemployment problem, ph. నిరుద్యోగ సమస్య;
  • unending, adj. అంతులేని; తరగని;
  • unenthusiastically, adv. నిరుత్సాహంగా; నిరాసక్తంగా;
  • unequal, adj. అసమానమైన; అసమమైన; విసమ; విషమ; ప్రతిసమ;
  • unequivocal, n. అసందిగ్ధంగా; నిస్సంశయంగా;
  • unerring, adj. సూటిగా; తడుముకోకుండా;
  • uneven, adj. ఒడిదుడుకులతో; ఎగుడు దిగుడులతో కూడిన; ఎత్తుపల్లాలతో; మిట్టపల్లాలతో; దంతుర; దంతురిత; ఉచ్ఛావచ; నిమ్నోన్నతమైన; న్యూనాధిక;
  • unevenness, n. దంతురత; న్యూనాధికత;
  • unexpectedly, adv. అనుకోకుండా; అవశాత్తుగా; ఉభేతుగా;
  • unfailingly, adv. తప్పక; తప్పకుండా;
  • unfair, adj. అన్యాయం;
    • unfair tax, ph. అప్పణం;
  • unfair, n. అన్యాయం;
  • unfavorable, n. ప్రతికూలం;
  • unfit, adj. తగని;
  • unfounded, adj. నిర్హేతుక;
  • unfriendliness, n. అనుపపత్తి; చెలిమి లేకపోవడం;
  • ungual, adj. గోరుకి సంబంధించిన; డెక్కకి సంబంధించిన;
  • unguent, n. లేపనం;
  • unhappy, adj. నిస్సంతోషంగా; సంతోషం లేని; విచారంగా;
    • unhappy person, ph. నిస్సంతోషి;
  • unheard, n. అశ్రుతచరం; విననిది;
  • unheard of, adj. విని ఎరుగని; అశృత;
  • unhesitating, adj. నిస్సంశయంగా; అవిశంక;
  • uni, pref. ఏక;
  • unicellular, adj. ఏకకణ;
    • unicellular organisms, ph. ఏకకణ జీవులు;
  • unidirectional, n. ఏకదిశాత్మకం;
  • unification, n. సంధానం; సంయోగం; ఏకీకరణ; ఏకీకృతం; ఏకీభూతం;
  • Unification Theory, ph. సంధాన వాదం;
    • Grand Unification Theory, ph. మహత్ సంధాన సిద్ధాంతం;
  • unified, adj. తాదాత్మ్య; సమీకృత; తదేక; కూటస్థ; ఏకరీతి; ఏకవాక్య; ఏకరూప; ఏకీకృత;
    • Unified Field Theory, ph. కూటస్థ క్షేత్ర వాదం; ఏకీకృత క్షేత్ర వాదం;
  • uniform, adj. తదేక; కూటస్థ; ఏకరీతి; ఏకవాక్య; సరూప; ఏకరూప;
    • uniform acceleration, ph. తదేక త్వరణం;
    • uniform convergence, ph. తదేక పరిచ్ఛిన్నం;
    • uniform dress, ph. సరూప దుస్తులు; ఏకరూప దుస్తులు;
    • uniform velocity, ph. తదేక ధృతిగతి; ఏకరూప వేగం;
  • uniformity, n. తదేకత్వం; ఏకరూపత; సమబద్ధత;
  • unify, v. t. ఏకీకరించు; ఏకంచేయు;
  • unilateral, adj. ఏకపాక్షిక;
  • unimaginable, adj. అనూహ్యమైన;
  • unimaginable, n. అనూహ్యం;
  • unimpeachable, adj. ప్రశ్నింపలేని;
  • unimpeded, adj. ధారాళంగా; అవ్యాహతంగా; అడ్డు లేకుండా;
  • unimportant, n. అప్రధానం;
  • uninhabited, adj. నిర్జన; విజన;
  • uninterrupted, adj. అవిచ్ఛిన్న; నిర్విరామ; నిరాటంకమైన; ఎడతెగని;
  • uninterruptedly, adv. అవిచ్ఛిన్నంగా; నిర్విరామంగా; నిరాఘాటంగా; నిరంతరాయంగా;
  • uninvitedly, adv. అనాహూతంగా; పిలవని పేరంటంలా;
  • union, n. (1) సంఘం; సమాఖ్య; (2) యోగం; సంయోగం; మేళనం; సంగమం; సంధానం; సంసర్గము; సంసక్తం;
    • chemical union, ph. రసాయన సంయోగం;
    • labor union, ph. కార్మిక సంఘం;
    • reunion, ph. పునస్సంధానం;
  • uni-planar, adj. ఏకతల; సమతల;
  • unique, adj. ఏకైక; అనన్య; సాటిలేని; అపూర్వ; అనన్యసామాన్య; అనన్యాదృశ్య; అద్వితీయ; అనుపమాన;
  • uniqueness, n. ఏకైకత; అపూర్వత;
  • un-irrigated land, n. నీటిపారుదల లేని భూమి; దేవమాతృకం;
  • unreachable, adj. అగమ్య; అందని; అందుబాటులో లేని; చేరలేని;
  • un-irrigated field, n. నీటిపారుదల లేని పొలం; దేవమాతృకం;
  • uni-sexual, adj. ఏకలింగ;
  • unit, n. (1) ఒకటి; (2) ఘటికం; మూలఘటికం; అంశం; మూలాంశం; మూర్తం; ఏకాంకం; కొల ప్రమాణం;
    • Derived unit, ph. వ్యుత్పాదిత మూల-మానము.
    • Physical unit, ph. భౌతికాంకము.
    • unit of heat, ph. తాపాంకము.
    • unit of quality, ph. గుణప్రమాణము.
    • unit of quantity, ph. రాశిప్రమాణము.
    • unit of resistance, ph. ప్రతిరోధాంకము.
    • unit of stress, ph. పీడనాంకము.
    • unit of value, ph. మూల్యప్రమాణము.
    • unit of work, ph. కర్మాంకము, క్రియాంకము.
  • unite, v. i. కలియు; ఏకమగు; సంఘీభవించు;
  • unite, v. t. సంధించు; కలుపు; ఉజ్జీచేయు; కలుపు;
  • united, adj. సమైక్య; సంయుక్త;
  • unity, n. (1) ఏకత్వం; ఒరిమిక; ఐకమత్యం; ఐక్యత; సంఘీభావం; అవినాభావం; సమైక్యత; కట్టు; కలిసికట్టుతనం; (2) ఒకటి;
    • unity in diversity, ph. భిన్నత్వంలో ఏకత్వం;
  • universal, adj. విశ్వ; విశ్వతోముఖ; విశ్వజనీన; వసుధైక; సర్వతోముఖ; జగత్; సర్వసామాన్య; సార్వజనిక; సర్వజనీన; సర్వత్ర; సార్వత్రిక; వ్యాప్తిలోనున్న;
    • universal adult suffrage, ph. సార్వజనిక వయోజన నియోజనం; సావని; విశ్వజనీన వయోజన వియోజనం;
    • universal consciousness, ph. విశ్వాత్మ; జగదాత్మ;
    • universal donee, ph. సర్వ దఖలుదారు;
    • universal franchise, ph. సార్వజనిక నియోజన;
    • universal perspective, ph. వసుధైక దృక్పథం;
    • universal spirit, ph. విశ్వాత్మ; జగదాత్మ;
  • universals, n. pl. సార్వత్రికలు; సార్వత్రికాలు;
  • universe, n. విశ్వం; జగత్తు; జగం; జగతి; సృష్టి; బ్రహ్మాండం;
    • universe of discourse, ph. ప్రసంగ విషయం;
  • university, n. విశ్వవిద్యాలయం; విశ్వకళాపరిషత్తు; విద్యాపీఠం;
  • unjust, adj. అన్యాయపు; ఆకపాటి;
    • unjust allegation, ph. అన్యాయపు ఆరోపణ; ఆకపాటి ఆరోపణ;
  • unknowable, adj. అజ్ఞేయం; తెలియరానిది;
  • unknown, adj. అవ్యక్త; అజ్ఞాత;
    • unknown variable, ph. అవ్యక్త రాశి; అజ్ఞాత రాశి;
  • unlawful, adj. చట్టవిరుద్ధమైన; చట్టబద్ధము కాని; దొంగ;
  • unlimited, adj. అపరిమితమైన; పరిమితిలేని; అమితమైన;
  • unlimited, n. అపరిమితం; అనవధికం; అమితం; అపారం;
  • unload, v. t. దింపు; దించు;
  • unlucky, adj. ముదనష్టపు; దురదృష్టపు; అదృష్టవిహీన;
  • unlucky, n. దురదృష్టం; అభాగ్యం;
  • un-manifested, adj. అవ్యక్తమైన; అవ్యాకృతమైన;
  • unmarried, adj. పెళ్ళికాని, అవివాహ;
  • un-measurable, adj. అమిత; కొలవలేని;
  • unmount, v. t. దింపు; పెట్టిన స్థానం నుండి తీయు;
  • unnatural, adj. అసహజమైన; విపరీతమైన;
  • unnatural, n. అస్వభావికం;
  • unnecessarily, adv. అనవసరంగా; నిష్కారణంగా;
  • unnecessary, adj. అనవసరం;
  • unobstructed, adj. అనర్గళ; నిరర్గళ; అప్రతిహత; నిరాఘాట;
  • unobstructed, n. అనర్గళం; అప్రతిహతం;
  • unobstructedly, adv. అనర్గళంగా; నిరర్గళంగా; అప్రతిహతంగా; నిరాఘాటంగా;
  • unofficial, adj. అనధికార; అనాధికార;
  • unofficial, n. అనాధికారికం;
  • unorganized, adj. అసంఘటిత;
  • unparalleled, adj. అతులిత;
  • unpolished, adj. కోరా; మెరుగులేని; మోటు;
  • unpolluted, adj. నిర్మల;
  • unprecedented, adj. అభూతపూర్వ;
  • unreasonably, adv. బేసబబుగా;
  • unrefined, adj. ముతక; శుద్ధికాని;
  • unrepeated, n. అజప;
  • unrest, n. అలజడి; అనిశ్చలత్వం;
  • unripe, adj. అపక్వ; అపరిపక్వ; పచ్చి; పండని;
  • unrivalled, adj. పోటీలేని; సాటిలేని; అప్రతిమాన; అప్రతిమ;
  • unrivalled, n. m. అప్రతిద్వందుడు;
  • unsalted, adj. ఉప్పిడి;
  • unsatisfied, adj. అసంతృప్త;
  • unsaturated, adj. అసంతృప్త;
    • unsaturated fatty acid, ph. అసంతృప్త గోరోజనామ్లం;
  • unscathed, adj. చెక్కుచెదరని;
  • unscientific, adj., అశాస్త్రీయమైన;
  • unscrupulous, adj. కుత్సిత; నైతిక విలువలు లేని;
  • unseasonal, adj. అకాల;
  • unsigned, adj. (1) సంతకం లేని; సంతకం చెయ్యని; (2) ధన, రుణ సంకేతాలు లేని;
  • unsolicited, adj. అయాచిత; అడగకుండా; కోరబడని;
  • unsplit, adj. ఏకాండీ; విరగ్గొట్టని; చింపని; సంయుక్త; సమైక్య;
  • unspeakable, adj. అనరాని; అవాచ్య;
  • unstable, adj. అస్థిర; అధ్రువ; అనిశ్చల; చంచల; తరల;
  • unsteady, adj. చంచల; నిలకడ లేని; కసిమసి;
  • unstoppable, adj. దుర్వార;
  • unsuccessful, adj. విఫలమైన;
  • unsuitable, adj. అసంగత; అనుచిత; పొసగని;
  • unsuitable, n. అసంగతం; అనుచితం;
  • unthinkable, n. అచింత్యం;
  • until, adv. వరకు; దనుక;
  • untimely, adj. అకాల; అకాండిత;
    • untimely rains, ph. అకాల వర్షాలు; అకాండిత వర్షాలు;
  • untouchability, n. అంటరానితనం;
  • untrue, n. అబద్ధం; అసత్యం; కల్ల; నిజం కానిది; సత్యదూరం;
  • unusual, adj. అసాధారణ; అసాధారణమైన;
  • unutterable, adj. అవాచ్య; అనరాని; ఆడరాని; అశ్లీలమైన; ఉచ్చరింపగూడని;
  • unveil, v. t. ఆవిష్కరించు;
  • unwell, n. నలత; అస్వస్థత;
    • unwell person, ph. నలతరి; అస్వస్థుడు; అస్వస్థురాలు; నలతరాలు;
  • unwise, adj. తెలివి తక్కువ; అజ్ఞానం; లౌక్యం తెలియని;
  • uphill, n. ఎగుడు;
  • up, adj. (1)లేచి ఉండు; (2) పనిచేసే పరిస్థితిలో ఉండు; పడుక్కోకుండా ఉండు;
  • up, adv. (1) ఎగువకెళ్లే; (2) ఉత్తర దిశలో;
  • up, n. ఎగువ;
  • up, prep. మీద; పైన;
  • upbeat, adj. ఉత్సాహవంతమైన; ఆశాజనక;
  • update, v. t. తాజించు; తాజా చేయు; తాజీకరించు;
  • upend, v. t. తిరగబెట్టు; బోల్తాకొట్టించు; ఉల్టా-సీదా చేయు;
  • upgrade, v. t. మెరుగు పరచు; నాసి రకం వస్తువులని తీసేసి, వాటి స్థానంలో మెరుగైన వాటిని ప్రతిక్షేపించు;
  • uphill, n. ఎగుడు; ఎక్కుడు;
  • uplift, v. t. ఉద్ధరించు;
  • upliftment, n. ఉద్ధరణ; సముద్ధరణ; ఉద్ధరింపు;
  • upload, v. t. ఎక్కించు; పంపించు;
  • upper, adj. ఎగువ; మీది; పై; వర;
    • upper arm, ph. దండ; ముంజేయి;
    • upper berth, ph. ఎగువ బడ్డీ;
    • upper canal, ph. ఎగువ కాలవ;
    • upper price, ph. ధరవరలు;
  • uprising, n. తిరుగుబాటు;
  • uppercase, n. పెద్ద బడి; ఇంగ్లీషు వంటి భాషలలో రాసే A, B, C వంటి పెద్ద అక్షరాలు; same as capital letters; (rel.) lowercase;
  • uppityness, n. టెక్కు; డాబు; అతిశయం;
  • uproar, n. ఘోషణ; ఎలగోలు;
  • uproot, v. t. పెకలించు; పెల్లగించు; పెరకు; పీకు;
  • ups and downs, ph. ఒడిదుడుకులు; నిమ్నోన్నతాలు;
  • upset, v. t. తలకిందులు చేయు; తిరగబెట్టు; పాడుచేయు; వమ్ముచేయు;
  • upshot, n. పర్యవసానం;
  • upsidedown, ph. అతలాకుతలం; తలకిందులు;
  • upstairs, n. మేడమీద; ఉప్పరిగె;
  • upstream, adj. ఎగుదల;
  • upward, adj. ఊర్ధ్వముఖ; పైకి చూపే; ఎగ;
    • upward arrow, ph. ఊర్ధ్వముఖ సాయకం; పైకి చూపే బాణం;
    • upward movement, ph. ఊర్ధ్వముఖ చలనం; పైకి కదలడం;
  • upwind, ph. ఎదురుగాలి; గోగంధనం;
  • Uranium, n. వరుణము; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 92, సంక్షిప్త నామం, U);
  • Uranus, n. (యూరెనస్) (1) ఇంద్ర; (2) వరుణుడు; వరుణగ్రహం; (3) తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన గణిత ఖగోళ శాస్త్రాలు లో ఇంద్ర, వరుణ, యమ అని Uranus, Neptune Pluto ల పేర్లు ఇచ్చారు;
  • urban, adj. పౌర; నాగర; నగర; నగరీణ; నైగమ; పట్టణానికి సంబంధించిన; (ant.) rural;
  • urbanization, n. నగరీకరణ; పట్టణీకరణ:
  • urdiea, n. పాలపళ్ళు;
  • urchin, n. కుంక; కురక్రుంక; అల్లరి పిల్లాడు;
  • urea, n. మూత్రిక;
  • ureter, n. మూత్రనాళం;
  • urethra, n. మూత్రమార్గం; మూత్రం బయటకు వెళ్లే మార్గం;
  • urge, n. ప్రేరణ; కుతి;
  • urge, v. t. ప్రేరేపించు;
  • urgent, adj. అత్యవసరమైన; అవశ్యం; అర్జంటు;
  • urinary, adj. మూత్రానికి సంబంధించిన;
    • urinary bladder, ph. మూత్రాశయం;
    • urinary tubules, ph. మూత్రనాళికలు;
  • urinate, v. t. ఉచ్చపోయు; మూత్రవిసర్జన చేయు; అల్పాచిమానం చేయు;
  • urine, n. ఉచ్చ; నీరుడు; మూత్రం; పంచితం; అల్పాచిమానం; ప్రస్రావం;
  • urn, n. కూజా; కలశం; మట్టు ఉన్న చిన్న పాత్ర;
  • Ursa Major, n. బృహదృక్షం; పెద్ద ఎలుగుబంటి; ఎలుగుబంటి ఆకారంలో ఉన్న ఒక నక్షత్ర సముదాయం; ఈ ఎలుగుబంటి తుంటి భాగంలోనూ, తోక భాగంలోనూ కనిపించే కొన్ని తారలని సప్తర్షి మండలం అంటారు. దీనినే big dipper అనీ plow అనీ కూడా అంటారు;
  • Ursa Minor, n. లఘుదృక్షం; ఒక నక్షత్ర సముదాయం;
  • usable, adj. ఉపయోగపడే; (also) useable;
  • usage, n. వాడుక; వాడకం; ప్రయోగం; ప్రయుక్తం; ఎసవాడుక;
    • established usage, ph. ప్రయుక్తం;
    • improper usage, ph. అపప్రయోగం;
    • poetic usage, ph. కవి ప్రయుక్తం;
  • use, n. (యూస్) ఉపయోగం; ప్రయోజనం; వాడుక;
  • use, v. t. (యూజ్ ) ఉపయోగించు; వాడు; వ్యవహరించు;
  • use of force, ph. దండోపాయం;
  • useful, adj. పనికొచ్చే; ఉపయోగపడే; ఉపయుక్తమైన; కార్యకారకంగా; ఉపయోగకరంగా; ఉపాదేయంగా;
  • useful, n. పనికొచ్చేది; ఉపయోగపడేది; ప్రయోజనకారి; కార్యకారి;
  • useless, adj. అప్రయోజనమైన; పనికిరాని; అక్కరకురాని; పనికిమాలిన; చవట; నిరుపయోగమైన; నిష్ప్రయోజనమైన; కొరగాని; చిల్ల; పుంజులూరు;
  • useless, n. నిరర్థకం; నిష్ప్రయోజనం; నిరుపయోగం; వ్యర్థం; పనికిమాలినది; అక్కరకురానిది;
    • useless fellow, ph. అప్రయోజకుడు; అసమర్ధుడు; చవట; తేభ్యం; వాజమ్మ; దద్దమ్మ; వ్యర్థుడు; పుంజులూరు వెధవ; పనికిరానివాడు; పనికిరాని సన్నాసి; వితథుడు; పోరంబోకు;
    • useless lands, ph. పోరంబోకు భూములు; చవిటి భూములు; వ్యవసాయానికి పనికి రాని, ప్రయోజనం లేని ప్రతినేలను చవుడు లేదా చవటభూములు అనడం అలవాటయ్యింది. ఈ పనికిరాని భూముల్ని చవటలు/పోరంబోకులు అని కూడా అంటారు;
  • user, n. వినియోగదారుడు; ఉపయోగించువాడు; ప్రయోక్త; ఆచరణాఖ్యుడు; ఆచరణాఖ్యి; వాడుకరి;
  • usher, n. ద్వారదర్శి; నకీబు;
  • usual, adj. యథాప్రకారం; ఎప్పటివలె;
    • as usual, ph. యథాప్రకారం; యథావిధిగా; ఎప్పటిఉపయోక్త;
  • user, n. వాడుకరి; ఉపయోక్త; వినియోగదారు;
  • user-friendly, adj. ఉపయోక్త సఖ్యత్వ; తేలికగా ఉపయోగించడానికి వీలయే;
  • usually, adv. సామాన్యంగా; సాధారణంగా;
  • usurer, n. వడ్డీ వ్యాపారస్థుడు;
  • usury, n. (యూషరీ) ఎక్కువ వడ్డీకి అప్పు ఇచ్చే వడ్డీ వ్యాపారం; ఎక్కువ వడ్డీకి అప్పు ఇచ్చే వడ్డీ వ్యాపారస్థుడు;
  • utilitarianism, n. ఉపయోగితా వాదం;
  • usurp, v. t. అపహరించు; లాక్కొను; మింగు;
  • usurper, n. అపహర్త;
  • usury, n. వడ్డీవ్యాపారం; వడ్డీ వ్యాపారస్తుడు;
  • utensils, n. పాత్రసామాను; వాడుక గిన్నెలు; ముంతా తప్పేలాలు; తట్టుముట్లు;
  • uterine siblings, ph. ఏకోదరులు;
  • uterus, n. గర్భాశయం; గర్భకోశం; బిడ్డసంచీ; జరాయువు;
  • utility, n. (1) ఉపయుక్తి; ఉపయోగం; ప్రయోజనం; (2) టెలిఫోను, నీటి సరఫరా; విద్యుత్తు, మొదలైన సౌకర్యాలు;
  • utilizable, adj. ఉపయోజనీయ;
  • utilize, v. t. వినియోగించు; వినియోగపరచు; ప్రయుక్తపరచు;
  • utmost, adj. అతి; మిక్కిలి;
  • utopia, n. ఊహాస్వర్గం; కల్పనాలోకం; (ant.) dystopia = an imagined state or society in which there is great suffering or injustice, typically one that is totalitarian or post-apocalyptic.
  • utter, adj. శుద్ధ; పరమ; ఘన;
    • utter poverty, ph. ఘన దరిద్రం; పరమ దరిద్రం;
    • utter stupid, ph. శుద్ధ మొద్దావతారం;
  • utter, v. i. ఉచ్చరించు; అను; ఉటంకించు; వ్రాక్కుచ్చు;
  • utterance, n. ఉటంకంపు; ఉక్తి; పలకబడ్డది; ఉదీరణం;
  • uttered, n. ఉదితం; చెప్పబడ్డది;
  • utterly, adv. సుతరాము; బొత్తిగా; పరిపూర్ణంగా; శుద్ధ;
  • uvula, n. కొండనాలుక; చిరునాలుక; లంబిక; కాకలం; ఉపజిహ్విక; ఘంటిక; అంగిటిముల్లు; ఉపజిహ్విక;
  • uvulitis, n. కొండనాలుక వాపు; ఉపజిహ్వాదాహం;

మూలం

  • V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2