Jump to content

వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/S

Wikibooks నుండి


నిఘంటువు

  • This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
  • This dictionary uses American spelling as the primary entry word. British spelling is also shown, whenever possible.
  • You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
  • PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks

25 Aug 2015.

Part 1: sa-sc

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • sac, n. సంచి; తిత్తి; బస్తా; గోతం;
  • sacramental offering, ph. నైవేద్యం; ప్రసాదం;
  • sacred, adj. మంగళప్రదమైన;
    • sacred necklace, ph. మంగళసూత్రం; తాళిబొట్టు; శతమానం;
    • sacred thread, ph. యజ్ఞోపవీతం; జందెము;
  • sacrifice, n. (1) బలి; (2) త్యాగం; ఆహుతి;
    • human sacrifice, ph. నర బలి;
  • sacrilege, n. దేవదూషణ; చెయ్యరాని పని; అపవిత్రం; ధర్మోల్లంఘన;
  • sacrum, n. త్రికాస్థి;
  • saddle, n. జీను;
  • sadism, n. హనన క్రౌర్యం; ఒకరిని హింసించి చూసి ఆనందించడం; రతి క్రీడలో ఎదుటి వారి శరీరానికి బాధ కలిగే పనులు చేసి ఆనందం పొందడం; see also masochism;
  • sadist, n. హింసాళువు; ఎదుటి వారి శరీరానికి బాధ కలిగే పనులు చేసి ఆనందం పొందే వ్యక్తి; (ety.) Marquis de Sade అనే వ్యక్తి పేరు మీదుగా వచ్చిన మాట;
  • safe, adj. సురక్షితమైన; నిరపాయమైన;
  • safe, n. (1) ఇనప్పెట్టి; మందసం; ఖాయిదా; (2) నిరపాయం;
  • safeguard, n. చేకాపు;
  • safeguard, v. t. కాపాడు; రక్షించు; బ్రోచు; సాకు;
  • safely, adv. క్షేమంగా; భద్రంగా; పదిలంగా;
  • safety, n. క్షేమం; యోగక్షేమం; భద్రత;
Carthamus tinctorius
  • safflower, n. కుసుంభం; కుసుంభ పువ్వు; కుసుంభా పుష్పం [bot.] Carthamus tinctorius;
    • safflower oil, ph. కుసుంభ తైలం; కుసుంభ నూనె;
  • saffron, n. కుంకుమ పువ్వు; కేసరి; అగ్నిశిఖ;
  • sag, v. i. కుంగు;
  • sagacity, n. జాణతనం; సూక్ష్మగ్రాహత్వం; గడుసుతనం;
  • sage, n. (1) ముని; రుషి; (2) వంటలలో వాడే ఒక సుగంధ ద్రవ్యం; [bot.] Salvia officinalis; Salvia splendens;
  • saggy, adj. కుక్కి;
  • sagittal suture, n. బ్రహ్మరంధ్రం.; the soft spot on the top of an infant's head;
  • Sagittarius, n. (1) ధనూరాశి; (2) ఉత్తరాషాడా నక్షత్రం; ధనూరాశిలో ఉన్న ఒక చిన్న నక్షత్ర సమూహం;
    • Delta, Epsilon of Sagittarius, ph. పూర్వాషాఢ నక్షత్రం;
  • sagittate, adj. బాణపు మొన ఆకారం కల;
  • sago, n. సగ్గుబియ్యం; కొన్ని తాళ జాతుల మొక్కల కాండములలో లభించే పిండి పదార్థముతో చేయబడ్డ కృత్రిమ ధాన్య విశేషం; see also tapioca;
  • sail, n. తెరచాప;
  • sailor, n. ఓఁడంగి, కళాసి; ఆరకాటి;
  • saint, n. m. పుణ్యాత్ముడు; దైవసమానుడు; f. పుణ్యాత్మురాలు; దైవసమానురాలు;
  • sal, n. ఏపి చెట్టు;
  • salable, adj. విక్రేయం; see also sale; seller;
  • salary, n. జీతం; సాధారణంగా నెల నెలా ఇచ్చేది; ఒక యజమాని లేదా సంస్థ వద్ద పనిచేయడానికి వచ్చిన ఉద్యగి, పనిలో చేరడానికి ముందు, వ్రాతపూర్వకంగా, వారు చేసిన ఉద్యోగానికి "ఎంత చెల్లిస్తారో, ఒప్పందం చేసుకోబడిన" పరిహారం లేదా ప్రతిఫలం అని చెప్పవచ్చు; దీనికి ఇతర భత్యాలు కలిపే అవకాశం కూడా ఉంటుంది; ఇది సంవత్సరానికి లేదా నెలకి ఒకసారి చెల్లిస్తారు; (rel.) pay; emoluments; stipend; wages;
  • sale, n. (1) అమ్మకం; విపణం; వ్యాపారం; విక్రయం; (2) తెగుబడి; ప్రత్యేకంగా తగ్గింపు ధరకి అమ్మకం;
  • salient, adj. విశిష్టమైన; ప్రముఖమైన;
  • saline, adj. ఊసర; చవిటి; ఉప్పని;
    • saline land, ph. ఊసర క్షేత్రం; ఊసర నేల; చౌడు నేల;
    • saline soil, ph. ఊసరం; ఊసర నేల;
    • saline solution, ph. చవిటి నీరు; ఊసర జలం;
  • saline, n. (1) చవిటి నీరు; ఊసర జలం; (2) [med.] లవణోదకము; సేలీను;
  • salinity, n. ఉప్పదనం;
  • saliva, n. లాలాజలం; ఉమ్మినీరు; నోటూట; చొంగ;
    • salivary ducts, ph. లాలాజల నాళములు;
    • salivary glands, ph. లాలాజల గ్రంథులు;
  • salivation, n. నోటి ఊట; లాలాస్రావం; చొంగ కారడం;
  • salt, n. లవణం; ఉప్పు; చవి;
    • chemical salt, ph. రసాయనపు ఉప్పు;
    • grain of salt, ph. ఉప్పు కల్లు; ఉప్పు రాయి; ఉప్పు బెడ్డ;
    • Roman salt, ph. రోమక లవణం; రాతి ఉప్పు;
    • rock salt, ph. రాతి ఉప్పు; సైంధవ లవణం; గని ఉప్పు; రవుమకం; రోమక లవణం; (note) రాతి ఉప్పుని సైంధవ లవణం అంటారు. సింధువు అంటే సముద్రం కనుక సైంధవ లవణం అంటే సముద్రపు ఉప్పే. కాని గనిలోకి మాత్రం ఉప్పు ఎక్కడనుండి వచ్చింది? అక్కడ ఒకానొకప్పుడు సముద్రం ఉండడం వల్లనే కదా.
    • sea salt, ph. సముద్రపు ఉప్పు; సైంధవ లవణం;
    • salt crypt, ph. ఉప్పు పాతర;
    • salt marsh, ph. కరవాక; ఉప్పళం; ఉప్పు పర్ర;
    • salt warehouse, ph. ఉప్పు కొఠారు;
    • salt bed, ph. ఉప్పు మడి;
    • kosher salt, ph. పెద్ద స్పటికముల రూపంలో ఉన్న ఉప్పు;
    • table salt, ph. ఉప్పు; ఉప్పుబెడ్డ; చవి; బిడము;
  • saltpeter, n. పెట్లుప్పు; సురేకారం; యవక్షారం; Potassium nitrate; KNO3;
  • saltworks, n. ఉప్పురేవు;
  • saltiness, n. లావణ్యం; ఉప్పతనం;
  • saltless, adj. ఉప్పిడి; చప్పిడి;
  • saltpeter, n. యవక్షారం; సురేకారం; పెట్లుప్పు;
  • salty, adj. చవిటి; ఉప్పని;
  • salty soil, n. ఊసరం;
  • salutation, n. అభివందనం; వందనం; నమోవాకము; జోత; నమస్కారం; కయిమోడ్పు; ప్రణతి; ప్రణామం;
    • salutation at dawn or dusk, ph. సంధ్యావందనం;
  • salvation, n. నివృత్తి; నిర్వృతి; నిష్కృతి; మోక్షం; కైవల్యం;
  • salve, n. లేపనం; గాయాలకి పూయు మందు;
మగ కణుజు
  • sambur, n. సాంబా; కణితి; కణుజు; భారతదేశపు అడవులలో ఉండే పెద్ద లేడి వంటి మృగం; sambar; [bio.] Rusa unicolor;
  • sample, n. మచ్చు; మాదిరి; మచ్చుతునక; ప్రతిరూపం;
    • sample lessons, ph. మాదిరి పాఠాలు;
  • sampling, n. మచ్చు చూడడం; స్థాలీపులక న్యాయం;
    • sampling theory, ph. స్థాలీపులాక సిద్ధాంతం; స్థాలీపులాక వాదం;
  • sanction, v. t. (1) మంజూరు చేయు; ఆమోదించు; అనుమతించు; (2) సరఫరాని నిలిపివేయు; ఆంక్షలు విధించు; (note) ఒకే మాటకి వచ్చిన వ్యతిరేకార్థాలు గమనించునది;
  • sanctity, n. పవిత్రత;
  • sanctuary, n. (1) శరణ్యం; శరణాలయం; ఆశ్రయం; అభయాలయం; (2) పుణ్యస్థలి; గర్భగుడి;
    • bird sanctuary, ph. విహంగ శరణాలయం;
    • forest sanctuary, ph. అభయారణ్యం;
    • wildlife sanctuary, ph. వన్యమృగ శరణాలయం; వన్యమృగ శరణారణ్యం;
  • sanctum, n. గుడి;
    • inner sanctum, ph. గర్భగుడి;
    • outer sanctum, ph. ముఖమండపం;
    • sanctum sanctorum, ph. గర్భగుడి; పరమ పవిత్రమైన;
  • sand, n. సైకతం; సికత; వాలుక; ఇసుక; కూర్పం;
    • sand clock, ph. వాలుకాయంత్రం; ఇసక గడియారం; ఇసుక గడియారము;
    • sand dune, ph. ఇసక దిబ్బ; ఇసక తిన్నె; సైకతం; ఇసుక దిబ్బ; ఇసుక తిన్నె;
  • sandbank, n. ఎక్కిలి; ఇసక మేట; ఇసుక మేట;
  • sandals, n. pl. ఆకుచెప్పులు; ఆకుజోళ్లు;
    • sandalwood paste, ph. చందనం; గంధం; మంచిగంధం; గంధపు ముద్ద; చందన ఖమీరం;
    • sandalwood tree, ph. చందనపు చెట్టు; గంధపు చెట్టు; పటీరవిటపి; భద్రశ్రీ;
  • sandbar, n. ఇసక మేట; ఇసుక మేట;
  • sandpaper, n. ఉప్పుకాగితం; గరుకుకాగితం; హంస కాగితం;
  • sandpiper, n. ఉల్లంకి; ఒక రకం పక్షి;
    • common sandpiper, ph. సాదా ఉల్లంకి; సాధారణ ఉల్లంకి;
    • spotted sandpiper, ph. చుక్కల ఉల్లంకి;
    • solitary sandpiper, ph. ఒంటరి ఉల్లంకి;
    • spotted redshank sandpiper, ph. కెంపుకాలి ఉల్లంకి;
    • green sandpiper, ph. ఏరుల్లంకి పిట్ట; పచ్చ ఉల్లంకి;
    • greater yellowlegs sandpiper, ph. పసుపుకాళ్ల పెద్ద ఉల్లంకి;
    • lesser yellowlegs sandpiper, ph. పసుపుకాళ్ల చిన్న ఉల్లంకి;
    • common redshank sandpiper, ph. పగడపుకాళ్ల ఉల్లంకి;
    • marsh sandpiper, ph. చిత్తడినేల ఉల్లంకి;
    • wood sandpiper, ph. కలప ఉల్లంకి;
  • sandy, adj. ఇసక; సికతల; ఇసుక సంబంధమైన;
    • sandy soil, ph. ఇసక మట్టి; ఇసుక మట్టి;
  • sanitation, n. శౌచం; పారిశుధ్యం;
  • sanity, n. స్థిరచిత్తత; చిత్త స్థిరత;
  • sans, prep. వినా; లేకుండా; కాకుండా;
    • sans devotion, ph. భక్తి వినా; భక్తి లేకుండా;
  • sap, n. రసం; కర్రు; సారం; పస;
  • sapphire, n. నీలం; ఇంద్రనీలం; నీలమణి; నవరత్నాలలో ఒకటి; (ety.) Sans. శనిప్రియా;
saraca=అశోక
  • saraca, n. అశోకవృక్షం;
  • sarsaparilla, n. సుగంధిపాల; అనంతమూల్; [bot.] Smilax officinalis; Smilax regelii; Hemidesmus indica; ఒక సుగంధ ద్రవ్యం;
  • sarcasm, n. ఎత్తిపొడుపు; ఉపాలంభం; వ్యంగ్యం; వక్రోక్తి; సంతక్షణ;
    • sarcastic speech, ph. వ్యంగ్యోక్తి;
  • sari, n. చీర; కోక; శాటి; సాడి;
  • Satan, n. సైతాను; క్రైస్తవ మతంలో మంచికి చుక్కెదురు; మానవుని శత్రువు; ఇస్లాం మతంలో సైతాను అంటే మానవుని శత్రువు; ఈ సైతానునే Devil అని కూడా అంటారు;
  • satellite, n. (1) ఉపగ్రహం; (2) అనుచరుడు; ఆశ్రితుడు;
    • communication channel, ph. సమాచార పథం; వార్తా పథం;
    • communication gap, ph. అవగాహన లోపం;
    • communication satellite, ph. సమాచార ఉపగ్రహం;
  • satire, n. వక్రోక్తి; ఆక్షేపం; అధిక్షేపం; వ్యంగ్యం; వ్యంగ్యకావ్యం;
  • satisfaction, n. సంతృప్తి; సంతృష్టి; తృప్తి; తనివి; తుష్టి; ఆపోక;
  • satisfactory, adj. సంతృప్తికరమైన;
  • saturated, adj. సంతృప్త;
    • saturated hydrocarbons, ph. సంతృప్త ఉదకర్బనాలు;
    • saturated fatty acid, ph. సంతృప్త ఘృతికామ్లం;
  • Saturday, n. శనివారం; స్థిరవారం; మందవారం;
  • Saturn, n. (1) శని; శనిగ్రహం; (2) శనైశ్చరుడు; శనైః అంటే నెమ్మదిగా, చరః అంటే నడచే వాడు అని వాచ్యార్థం; వేదాంగ జ్యోతిష్య పరంగా శని గ్రహం తక్కిన గ్రహాలకంటే మిక్కిలి దూరంగా ఉన్నది. అందువల్ల, ఆయన ఒక పూర్తి పరిభ్రమణం చేయడానికి అన్ని గ్రహాలకంటే ఎక్కువ సమయం తీసుకుంటాడు. రాశి చక్రం ఒక సారి చుట్టి రావడానికి, ఆయనకు 30 సంవత్సరాలు పడుతుంది;
  • satyr, n. (సేటర్) (1) కామాతురుడు, రిరంసువు; (2) గ్రీకు పురాణ గాథలలో కనిపించే ఒక శాల్తీ; (3) కిన్నరుడు; హిందూ పురాణాలలో కనపడే మనిషి శరీరం, గుర్రపు చెవులు, గుర్రపు తోక ఉండి, కామాతురతతో ఉండే ఒక శాల్తీ; see also centaur;
  • saunter, v. i. నెమ్మదిగా, తొందర లేకుండా, నడుచు; పెళ్లి నడకలు నడచు;
  • saute, v. t. వేయించు; దోరగా వేయించు; వేపు;
  • saucer, n. తాంబాళం; తలియ; తటి;
    • flying saucer, ph. ఉడ్డీన తాంబాళం;
  • savage, adj. కిరాతక;
  • save, adv. వినా; తప్ప;
  • save, v. i. ఆదాచేయు; దాచు;
  • savings, n. ఆదా; నిల్వలు; పొదుపు మొత్తాలు;
  • savory, n. రుచ్యం; రుచి అయిన పదార్థం:
  • saw, v. i. చూసెను; చూసితిని; చూసేడు; చూసింది;
  • saw, n. రంపం; క్రకచం; కదరం;
  • sawtooth, n. రంపపుపన్ను; క్రకచదంతం;
    • sawtooth wave, ph. [elec.] క్రకచదంత కెరటం;
  • say, v. t. చెప్పు; అను; ఉటంకించు; ఆడు; వచించు; వ్రాక్కుచ్చు; నుడువు;
  • saying, n. నానుడి; సామెత; లోకోక్తి; కింవదంతి;
  • scab, n. పక్కు; పుండు మీద గడ్డకట్టిన రసి;
  • scabies, n. గజ్జి; ఒక రకం చర్మ రోగం; Scabies is an itchy skin condition caused by tiny parasites. It’s passed through skin-to-skin contact, usually during sex. Scabies isn’t dangerous and can be cured;
  • scaffolding, n. (1) గోవ; సారువ; పరంజా; (2) మంచె; అరప;
  • scalariform, n. నిచ్చెన ఆకారం;
  • scalding, adj. మరుగుతూన్న; సలసల మరుగుతూన్న; కాగుతూన్న; దాహక;
పియానో మీద 12 స్వరముల స్వరదండం
  • scale, n. (1) పొలుసు; పొర; (2) కొలమానం; కొలబద్ద; గీట్లబద్ద; మానదండం; కాటా; కాకిణి; స్కేలు; (3) ఎత్తు; (4) రాగం; a musical scale may contain all the seven swaras or only a subset of swaras; (5) భారీతనాన్ని సూచించే మాట;
    • chromatic scale, ph. పాశ్చాత్య సంగీతంలో 12 స్వరములు కల స్వరదండం; The chromatic scale is a set of twelve pitches (more completely, pitch classes), with notes separated by the interval of a semitone; The word chromatic comes from the Greek chroma, color; and the traditional function of the chromatic scale is to color or embellish the tones of the major and minor scales;
    • large scale, ph. పెద్ద ఎత్తు; భారీ;
    • small scale, ph. చిన్న ఎత్తు; లఘు;
  • scale, v. t. (1) ఎక్కు; అధిరోహించు; (2) చేప పొలుసులని ఒలుచు;(3) సంగీతంలో కొన్ని స్వరముల కలయిక;
  • scales, n. (1) తక్కెడ; త్రాసు; తుల; కాటా; కాకిణి; తూనిక; (2) తక్కెడలో ఇటూ అటూ ఉండే సిబ్బిలు; (3) పొలుసులు; చేపల వంటి జీవుల శరీరంమీద ఉండే పొలుసులు;
  • scalp, n. మాడు; కపాలం; జుత్తు గీకేసిన తర్వాత కనిపించే శిరోభాగం;
  • scam, n. మోసం;
  • scan, v. t. ఆలోకించు;
  • scandal, n. కళంకం; లజ్జాకర విషయం;
  • scanner, n. ఆలోకిని;
  • scapegoat, n. బలిపశువు;
  • scapula, n. అంసఫలకం; రెక్క ఎముక; భుజంలో ఉన్న పలక వంటి ఎముక;
  • scar, n. మచ్చ; కిణం; గాయం మానగా మిగిలే చర్మపు ముడత;
Scarabaeus.pius=పేడపురుగు
  • scarabaeus, n. పేడపురుగు;
  • scarce, adj. అరుదైన; అపురూపమైన; దొరకకపోవడం;
  • scarce, adv. అరుదుగా; అపురూపంగా; కదాచిత్తుగా;
  • scarcely, adv. అరుదుగా; సకృత్తుగా;
  • scarcity, n. ఎద్దడి; కొరత; చాలమి; లేమిడి; సంక్షోభం; దొరకకపోవుట;
    • scarcity of electricity, ph. విద్యుత్ సంక్షోభం;
    • scarcity of water, ph. నీటి ఎద్దడి;
  • scare, v. t. భయపెట్టు; హడలగొట్టు; బెదిరించు;
  • scarecrow, v. t. బెదురుబొమ్మ; దిష్టిబొమ్మ;
  • scatter, v. i. చెదురు; విరజిమ్ము;
  • scatter, v. t. జల్లు; విరజిమ్ము; పరిక్షేపించు;
    • scatterbrain, n. అపసంతి; a person who is forgetful, disorganized, or unable to concentrate or think clearly;
    • scatter diagram, ph. వ్యాకీర్ణ పటం; పరిక్షేప పటం; వ్యాపక పటం;
  • scattered, adj. చెదురు మదురుగా; ప్రకీర్ణ; వ్యాకీర్ణ; పరిక్షిప్త; అవకీర్ణ; ప్రకిరణ: ఉద్ధూత;
  • scattering, n. జల్లు; చెదరడం; విరజిమ్ముట; పరిక్షేపణం; జల్లడం;
    • back scattering, ph. అప పరిక్షేపణం; వెనకకి జల్లడం; పతన వికిరణం పరావర్తనం చెందినప్పుడు, పరావర్తన కోణం పతన కిరణం దిశ నుండి 90 డిగ్రీలకి మించి ఉంటే దానిని అప పరిక్షేపణం అంటారు;
    • elastic scattering, ph. స్థితిస్థాపక పరిక్షేపణం; ఈ రకం పరిక్షేపణలో పతన రేణువుల మొత్తం గతిజ శక్తి క్షీణించకుండా పరావర్తన రేణువుల మొత్తం గతిజ శక్తికి ఆపాదించబడుతుంది; An elastic collision is a collision in which there is no net loss in kinetic energy in the system as a result of the collision. Both momentum and kinetic energy are conserved quantities in elastic collisions. Suppose two similar trolleys are traveling toward each other with equal speed. They collide, bouncing off each other with no loss in speed. This collision is perfectly elastic because no energy has been lost.
    • inelastic scattering, ph. ఘన పరిక్షేపణం; కేరం బల్ల మీద పిక్కలు గుద్దుకున్నప్పుడు ఈ రకం పరిక్షేపణ జరుగుతుంది; ఈ రకం పరిక్షేపణలో పతన రేణువుల మొత్తం గతిజ శక్తిలో సింహ భాగం క్షీణించి, మిగిలినది పరావర్తన రేణువుల గతిజ శక్తికి ఆపాదించబడుతుంది; An inelastic collision is a collision in which there is a loss of kinetic energy. While the momentum of the system is conserved in an inelastic collision, kinetic energy is not. This is because some kinetic energy had been transferred to something else. Thermal energy, sound energy, and material deformation are likely culprits. Suppose two similar trolleys are traveling towards each other. They collide, but because the trolleys are equipped with magnetic couplers they join together in the collision and become one connected mass. This type of collision is perfectly inelastic because the maximum possible kinetic energy has been lost. This doesn't mean that the final kinetic energy is necessarily zero; momentum must still be conserved.
  • scavenger, adj. పాకీ;
  • scavenger, n. బలిభుక్కు; బలిభుజం; చచ్చిపోయిన జీవులని తినే జంతువు;
  • scene, n. (1) దృశ్యం; ఈక్షితం; సన్నివేశం; (2) ఘట్టం; (3) రాద్ధాంతం;
  • scenery, n. దృశ్యం; ఈక్షితం;
  • scent, n. (1) వాసన; సుగంధం; (2) తావినూనె; అత్తరు; సెంటు;
  • scepter, n. రాజదండం;
  • schadenfreude, n. ఎదుటివాడికి తగిన శాస్తి జరిగిందని సంతోషించడం;
  • schedule, n. కాలసూచి; కాలపట్టిక; అనుసూచి; సమయాపన; సేపరము; షెడ్యూలు; (2) అధికరణం; రాజ్యామ్గంలో ఒక భాగం;
  • scheduling, n. సేపరణ; ఒక సమయం ఎన్నుకుని ఏర్పరచు;
  • schema, n. బొమ్మ; వ్యూహం;
  • schematic, n. ఒక పథకాన్ని నఖచిత్రంలా చూపించే బొమ్మ;
  • scheme, n. ఎత్తు; పద్ధతి; ఉపాయం; పథకం; తంత్రం; వ్యూహం; వ్యూహరచన; యుక్తి; పన్నాగం; కుట్ర;
  • schizophrenia, n. మనోవిదళనం; ఒక రకమైన మానసిక వ్యాధి; వాస్తవమేదో, భ్రమ ఏదో తెలియకుండా, ఏవేవో అపోహలతో, సాంఘికమైన లంకెలు లేకుండా ఉండే ఒక తత్త్వం;
  • schmooze, n. బాతాకానీ;
  • scholar, n. m. పండితుడు; ప్రాజ్ఞుడు; పారంగతుడు; విబుధుడు; భట్టారకుడు; మనీషి; ధీమతి; దీర్ఘదర్శి; f. పండితురాలు; ప్రాజ్ఞి; విదుషి; విదుషీమణి;
  • scholarship, n. (1) పాండిత్యం; వైదుష్యం; ప్రజ్ఞ; విద్వత్తు; వేత్తృత్వం; (2) విదార్థి వేతనం;
  • school, n. బడి; పాఠశాల; విద్యాలయం; పడగసాల;
    • school of thought, ph. వాదం; సిద్ధాంతం; అభిప్రాయం; మతం;
  • sciatic, adj. కటి; తుంటి; ఆసన;
  • science, n. శాస్త్రం; విజ్ఞానం; విన్నాణం; నీతి;
    • applied science, ph. ఉపయుక్త శాస్త్రం;
    • mathematical science, ph. గణిత శాస్త్రం;
    • penal science, ph. దండనీతి; penal code;
    • political science, ph. రాజనీతి;
    • pure science, ph. ఔపపత్తిక శాస్రం;
  • scientific, adj. శాస్త్రీయ; వైజ్ఞానిక;
    • scientific attitude, ph. శాస్త్రీయ వైఖరి;
    • scientific method, ph. శాస్త్రీయ విధానం; శాస్త్రీయ పద్ధతి;
    • scientific perspective, ph. శాస్త్రీయ దృక్పధం;
  • scintillation, n. ప్రస్పురణం; తళుకులు;
  • scion, (సియన్) , n. వారసుడు; వంశోద్ధారకుడు;
  • scissors, n. కత్తెర; కృపాణి; కర్తరి; కడిదెన; (ety.) కడియు (నరుకు) అనే తెలుఁగు ధాతువుకు ఎన = వెనుజేర్పు అనే ప్రత్యయాన్ని కలిపి రూపొందించినట్టిది.
  • scold, v. t. తిట్టు; నిందించు; మాటలు అను; ఆడిపోసికొను;
  • scoot, v. i. డేకు; దేకు; slide in a sitting position;
  • scope, n. అవకాశం; ఆస్కారం;
  • scorch, v. i. మాడు; మలమల మాడు;
  • scorch, v. t. మాడ్చు; మలమల మాడ్చు;
  • score, n. (1) అంకాలు; ఆటలలో వచ్చే “గెలుపులు ”; స్కోరు; ఆటల పోటీలలో జట్లకి వచ్చే మార్కులు; (2) స్వరకల్పన; సంగీత దర్శకుడు కుదిర్చే వాద్య సంగీతం; (3) ఇరవై; కోడిగ;
  • scorn, v. t. తిరస్కరించు;
  • scorn, n. తిట్టు; ఆరడి;
  • Scorpio, n. వృశ్చికరాశి; ఆకాశంలో కనిపించే ద్వాదశ రాశులలో ఒక రాశి;
    • Alpha, Sigma, Tao of Scorpio, ph. జ్యేష్ఠ నక్షత్రం;
    • Beta, Delta, Pi of Scorpio, ph. అనూరాధ నక్షత్రం;
  • scorpion, n. తేలు; వృశ్చికం;
    • black scorpion, ph. నల్ల తేలు; ఎనుప తేలు;
    • large black scorpion, ph. మండ్రగప్ప; పుట్టతేలు;
    • red scorpion, ph. ఎఱ్ఱ తేలు;
  • scoundrel, n. తులువ; కుత్సితుడు; దగుల్భాజి;
  • scour, v. t. రుద్దు; పాము;
  • scouring rushes, n. అశ్వవాలం; ఒకరకం గడ్డి;
  • scout, v.t. పరిశీలన చేయు;
  • scrap, adj. చిత్తు; బీడు; రద్దు;
    • scrap iron, ph. చిత్తు ఇనుము; బీడు ఇనుము;
    • scrap paper, ph. చిత్తు కాగితం;
  • scrape, v. t. గీకు; గోకు;
  • scratch, n. గీర; గీరిక;
  • scratch, v. t. గోకు; గీరు; రక్కు; బక్కురు;
    • gently scratch, ph. గోకు; గీరు;
    • harshly scratch, ph. రక్కు; బక్కురు;
  • scream, n. గావు కేక; అరుపు;
  • screen, n. (1) తెర; తెరచీర; యవనిక; ప్రతిసీర; కనాతి; (2) అడ్డు; వ్యవధానం; ముసుగు; (3) గాజుతెర;
  • screen, v. t. (1) తెరమీద బొమ్మ వేసి చూపించు; (2) అడ్డు పెట్టు; (3) వైద్య పరీక్ష చేసి ఫలానా జబ్బు ఉందో లేదో నిశ్చయించు; వడకట్టు; ఎంపిక చేయు;
  • screenplay, n. చిత్రానువాదం; చిత్రానుకరణ; చిత్రానుసరణ; ఒక కథని సినిమా తియ్యడానికి వీలుగా మలచి రాసిన రాత;
  • screenshot, n. తెరపట్టు; కంప్యూటర్ తెర మీద కనిపించే అంశాన్ని బొమ్మ రూపంలో పట్టుకునే ప్రక్రియ ద్వారా సేకరించిన బొమ్మ;
  • screw, n. నీల; కీలం; మర; మరమేకు; చీల; మరచీల; మరచుట్టు;
  • screwdriver, n. మరచుట్టు ని తిప్పే కొరముట్టు;
  • screwpine, n. మొగలి; గేదంగి; గొజ్జంగి;
  • screw, v. t. (1) సీలతో బిగించు; (2) పాడు చేయు;
  • scribble, v. t. బరుకు; గిలుకు;
  • scribe, v. i. రాయు; లిఖించు;
  • scribe, n. లేఖరి; లేఖకుడు; రాయసకాడు; రాతకాడు; వ్రాయసకాడు; నోటితో చెబితే కాగితం మీద రాసే ఆసామీ;
  • scrip, n. చీటీ; చందా చీటీ;
  • script, n. (1) లిపి; వ్రాత; లేఖనము; అక్షర విన్యాసము; see also font; (2) రాతప్రతి; సంభాషణలు రాసిన పుస్తకం;
  • scriptures, n. pl. పవిత్ర గ్రంథాలు;
  • scroll, n. (1) కాగితపు చుట్ట; చుట్ట చుట్టిన పొడవైన కాగితం; (2) చుట్టచుట్టిన పొడవైన కాగితం మీద రాసిన రాత; (3) జాబితా;
  • scroll, v. i. జరుపు; పొడవైన జాబితాని చిన్న తెర మీద చదవడానికి వీలుగా పైకి, కిందకి జరపడం;
    • scroll bar, ph. జరుపుడు పట్టా; చిన్న కంప్యూటర్ తెర మీద పొడుగ్గా ఉన్న రాతని పైకి, కిందకి జరపడానికి వాడే ఉపకరణం;
  • scrotum, n. బీజకోశం; సాటెం;
  • scrub, v. t. తోము; రుద్దు;
    • scrub jungle, ph. చిట్టడవి; a plant community characterized by vegetation dominated by shrubs, often also including grasses, herbs, and geophytes;
  • scruples, n. ధర్మాధర్మ శంక; పాపభీతి;
  • scrupulous, adj.ధర్మాధర్మ శంక గల; పాపభీతిగల;
  • scrupulously, adv. నిష్టతో; నమ్మకంగా;
  • scrutiny, n. సూక్ష్మపరీక్ష;
  • sculptor, n. శిల్పి; కారువు;
  • sculpture, n. శిల్పం;
  • scum, n. (1) తెట్టు; జల పదార్థాలమీద తేలే మరొక పదార్థం; సాధారణంగా మలిన పదార్థం; (2) మడ్డి; జల పదార్థాలని నిలబెడితే దిగువకి దిగే మరొక పదార్థం; సాధారణంగా మలిన పదార్థం; (3) పాచి; నిల్వ ఉన్న మురికి నీటిలో కనబడే ఆకుపచ్చని పదార్థం;
  • scurvy, n. శీతాదం; విటమిన్ సి లోపం వల్ల కలిగే ఒక జబ్బు;
  • Scuttlebutt, n. వ్యర్థప్రసంగం, జల్పనం. సుద్దులు; వదంతి; వినికిడి; జనప్రవాదము; లోకవార్త; (కిం)వదంతి; పుకారు; rumor; gossip;
  • scythe, n. కొడవలి; వంకర కత్తి;

Part 2: sd-sl

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • sea, n. సముద్రం; సింధువు; మున్నీరు; సాగరం; జలనిధి; జలధి; జలరాశి; అర్ణవం; కడలి; కంధి; అబ్ధి; అంబుధి; ఉదధి; నీరాకరము; రత్నాకరము; పారావారము; వారాశి;
    • inland sea, ph. తట్టు కడలి;
    • sea breeze, ph. సముద్ర మారుతం; కడలి తెమ్మెర;
    • sea level, ph. సముద్ర మట్టం; కడలి మట్టం;
    • sea shore, ph. సముద్రపుటొడ్డు; పారావారం; చెలియలికట్ట; కడలిటొడ్డు;
  • seafarer, n. నావికుఁడు;
  • seafood, n. మీనాద్యాహారాలు; కడలి తిండి;
  • seal, n. (1) అతుకు; (2) ముద్ర; ముద్రిక; మొహరు; సీలు; (3) నీటి సింహం -- Sea Lion;
  • seal, v. t. (1) అతుకు; అంటించు; (2) ముద్రవేయ; సికా వేయు;
    • sealing wax, ph. లక్క; సికా లక్క; యావం;
  • seam, n. కుట్టు; అతుకు;
  • seamstress, n.f. కుట్టు పనిచేసే స్త్రీ;
  • sear, v. t. మాడ్చు;
  • search, v. t. వెతుకు; అన్వేషించు; శోధించు; గవేషించు; గాలించు; దేవు; తనిఖీ చేయు; నెమకు;
    • search in water by dragging, ph. దేవు;
  • search, n. అన్వేషణ; శోధన; సోదా; గవేషణ; వెతుకుడు;
    • search engine, ph. అన్వేషణ యంత్రం; శోధన యంత్రం; గవేషణ యంత్రం; ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్ల వాడకం పెరిగిన తర్వాత ఎవరెవరి కంప్యూటర్లలో ఏ విషయాలు లభ్యమవుతాయో వెతికే యంత్రం;
    • search for truth, ph. సత్యశోధన;
  • searchlight, n. కంచు కాగడా; శోధన జ్యోతి;
  • seashell, n. గుల్ల; శంఖం;
  • season, n. కాలం; ఋతువు; సమయం; అత్తడి;
    • Fall season, ph. శిశిరర్తువు; ఆకురాలు కాలం;
    • rainy season, ph. వర్షాకాలం; వర్షర్తువు; వానత్తడి;
    • autumn season, ph. శిశిరర్తువు; ఆకురాలు కాలం;
    • summer season, ph. ఎండాకాలం; వేసవి; గ్రీష్మర్తువు; ఎండత్తడి;
    • winter season, ph. శీతాకాలం; చలికాలం;
  • season, v. t. తాలించు;
  • seasonal, adj. కాలోచిత;
  • seasonable, adv. కాలానుగుణ్యంగా; అత్తడికి అనువుగా;
  • seasoning, n. మసాలా; సాంబారం; రుచి కొరకు వేసే ఉప్పు; కారం, వగైరాలు;
  • seat, n. (1) ఆసనం; పీఠం; పీట; ఠేవిణి; వితర్థిక; ఉపవిష్టిక; అదివాసం; కూర్చునే చోటు; ఇరువు; సీటు; (2) ఇరువు; స్థానం; సీటు; కళాశాలలో ప్రవేశార్హత;
    • seat of the pants guess, ph. [idiom] , ఊహాగానం; ఊహ;
  • seaweed, n. సముద్ర శైవాలం; సముద్రపు నాచు; సముద్రపు కలుపు; శైవాలం; కడలి కలుపు; కడలి పాచి; కంబుని; Kelps are large seaweeds (algae) belonging to the brown algae (Phaeophyceae) in the order Laminariales; (see also) kelp;
    • sebaceous glands, ph. చమురు గ్రంథులు; తైల గ్రంథులు; నూనె కంతులు; చర్మం కింద ఉండే ఈ గ్రంథులలో ఊరే చమురు వల్లనే మన శరీరాలు ఎండి పోకుండా ఉంటున్నాయి;
  • secant, n. (1) ఖండన రేఖ; కోత గెర; ఒక వక్రరేఖని రెండు చోట్ల ఖండించే గీత; (2) ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం పొడుగుకీ, లఘు కోణానికి ఆసన్నంగా ఉన్న చిన్న భుజం పొడుగుకీ ఉన్న నిష్పత్తి; కోసైను యొక్క వ్యుత్క్రమము;
  • seclusion, n. ఏకాంతం;
  • second, n. (1) లిప్త; క్షణం; సెకను; నిమిషంలో అఱవైయవ వంతు; (2) రెండవది; ద్వితీయం;
  • second, adj. ద్వితీయ; రెండవ; మలి;
    • second printing, ph. మలి ముద్రణ;
    • second to none, ph. అద్వితీయం;
    • second hand, ph. గడియారంలో సెకండ్లు చూపించే ముల్లు;
  • secondhand, adj. ఒకసారి వాడిన; పాతబడిన;
  • secondary, adj. ఉప; పిల్ల; అప్రధాన; గౌణ; ద్వితీయ; రెండవ;
    • secondary meaning, ph. గౌణార్థం;
    • secondary school, ph. ఉన్నత పాఠశాల; రెండవ పాఠశాల;
    • secondary stem, ph. ఉపకాండం; ఉపశాఖ; పిల్ల కొమ్మ;
  • secondary, n. అప్రధానం; గౌణం; ద్వితీయం; రెండవది;
  • secrecy, n. గుప్తత; గోప్యత; గుట్టుతనం; గోపనీయత; విషయాన్ని దాచి పెట్టడం;
  • secret, adj. రహస్య; మర్మ; గుప్త; గోప్య;
  • secret organs, ph. మర్మేంద్రియాలు; మర్మావయవాలు;
  • secret, n. రహస్యం; గుట్టు; మర్మం; గుప్తం; గోప్యం; గాయకం; గుహ్యం;
    • open secret, ph. బహిరంగ రహస్యం; రట్టైన గుట్టు;
    • top secret, ph. గుహ్యాతి గుహ్యం;
    • unfathomable secret, ph. చిదంబర రహస్యం;
    • chamber of secret, ph. గుట్టుల గది;
  • secretly, adv. రహశ్యంగా; చాటుగా; దొంగచాటుగా; గుంభనంగా; గోప్యంగా; గుప్తంగా; గుట్టుగా;
  • secretariat, n. సచివాలయం; కార్యదర్శుల కార్యాలయం; ఏలుబడి నెలవు;
  • secretary, n. కార్యదర్శి; సచివుడు; ఏలుదోఁడు;
  • secretion, n. ఊట; స్రావం; కిట్టు; ఉట్రం;
  • secretiveness, n. దాపరికం;
  • sect, n. తెగ; శాఖ; కొమ్మ; కోవ;
  • sectarian, n. శాఖాభిమాని;
  • section, n. (1) సర్గం; పరిచ్ఛేదం; భాగం; గణం; ప్రకరణం; స్కంధం; పాదం; ఖండం; సంపాతం; (2) కోత;
    • cross section, ph. అడ్డకోత;
    • longitudinal section, ph. నిలుకోత;
  • sector, n. (1) రంగం; పేట; (2) వృత్తంలో ఒక భాగం;
    • public sector, ph. ప్రభుత్వరంగం;
  • secular, adj. (1) లౌకిక; ప్రాపంచిక; (2) మతాతీత; మత సంబంధం కాని;
  • security, n. (1) భద్రత; బందోబస్తు; (2) జామీను; తాకట్టు; హామీ; ధరావతు; జమానతు;
    • security forces, ph. pl. భద్రతా దళాలు;
    • security system, ph. భద్రతా వ్యవస్థ;
  • Security Council, n. భద్రతా సంఘం;
  • sedative, n. శమనకారి; ఉపశమనికం; ఉపశమనాన్ని ఇచ్చే ఔషధం;
  • sedentary, adj. నిలగ్న; ఒకే స్థానమందు ఉండేది;
    • sedentary lifestyle, ph. నిలగ్న జీవన సరళి; నిలగ్న బతుకు బాణీ;
  • sedge, n. తుంగ; ఒక రకం గడ్డి;
  • sedition, n. రాజద్రోహం; దేశద్రోహం; అధికారధిక్కారం;
  • sediment, n. మడ్డి; గసి; మష్టు; కల్కం; అవసాదం;
  • sedimentary, adj. కల్కిక; అవక్షేప; మస్టు;
    • sedimentary rock, ph. కల్కిక శిల; అవక్షేప శిల; మస్టు శిల;
    • sedimentary rock formation, ph. కల్కిక ఛిలా విన్యాసం; అవక్షేప శిలా విన్యాసం; మస్టు శిలా విన్యాసం;
  • sedimentation, n. కల్కనం; మట్టి దిగజారడం; గసికట్టడం; అవసాదనం;
  • seduce, v. t. చెరచు; భ్రష్టం చేయు; మరులుగొల్పు;
  • seductively, adv. ఒయ్యారంగా; వయ్యారంగా; విమోహకంగా; కామోద్రేకకరంగా;
  • see, v. t. చూడు; కను; కాంచు; అవలోకించు; వీక్షించు; దర్శించు; తిలకించు;
  • see, v. t. (1) చూడు; కను; కాంచు; అవలోకించు; వీక్షించు; దర్శించు; తిలకించు; ఆలోకించు; (2) అమర్చు; చక్కబెట్టు;
  • seed, n. గింజ; విత్తనం; విత్తు; బీజం; రేతస్సు; పిక్క; టెంక;
    • orthodox seed, ph. చెట్టునివీడి, ఎండిపోయిన తరువాత కూడ ఎన్నో సంవత్సరాలు మొలకెత్తే శక్తిని కలిగి ఉండే విత్తనం; ఖర్జూరం ఈ రకం విత్తనాలని ఇస్తుంది;
    • recalcitrant seed, ph. కొత్తగా, చెమ్మగా ఉన్నప్పుడే మొలకెత్తగల విత్తనాలు; అవకాడో ఈ జాతిది;
  • seed, v. t. నాటు; విత్తనం వేయు;
  • seedbed, n. నారుమడి;
  • seeded, adj. (1) గింజలతో కూడిన; (2) గింజలు తీయబడ్డ; (3) విత్తులు నాటబడ్డ; ( note) వ్యతిరేకార్థములతో ఉన్న మాట;
    • seeded bed, ph. నారు మడి;
    • seeded bread, ph. గింజలతో కూడిన రొట్టె;
    • seeded tamarind, ph. పిక్కతీసిన చింతపండు;
  • seeding, n. నాట్లు; విత్తులు నాటడం;
  • seedling, n. మొలక; నారు; ఈరిక, Irika
  • seeing, adj. దృష్ట; చూసే వ్యక్తికి సంబంధించిన;
  • seek, v. i. వెతుకు; కోరు; ఆపేక్షించు;
  • seem, v. i. అనిపించు; కనబడు;
  • seen, adj. దృశ్య; చూస్తున్న వస్తువుకి సంబంధించిన;
  • seep, v. i. ఇంకు; కారు;
  • seer, n. ద్రష్ట; ప్రవక్త; అన్నీ తెలిసిన వ్యక్తి;
  • see-saw, n. ఏతాం;
  • seethe, v. i. ధుమధుమలాడు; కుతకుతలాడు; మండు;
  • seldom, adv. సకృత్తుగా; అప్పుడప్పుడు; ఎప్పుడైనా; ఎప్పుడోకప్పుడు;
  • self-destructive, adj. ఆత్మవినాశక;
  • self-realization, n. ఆత్మానుభవం; fulfillment of one's own potential;
  • self-reliance, n. స్వావలంబన;
  • segment, n. తొన; భాగం; ముక్క; ఖండం; పరిచ్ఛేదం;
  • segregate, v. t. వేరుచేయు; విడదీయు; దూరంగా ఉంచు;
  • segregation, n. వేఱ్పాటు;
  • seismic, adj. భూకంప సంబంధిత; గ్రహకంప సంబంధిత;
    • seismic data, ph. భూధర్మ దత్తాంశాలు;
    • seismic waves, ph. భూకంప తరంగాలు;
  • seismology, n. గ్రహకంప శాస్త్రం; భూకంప శాస్త్రం;
  • seize, v. t. (1) పట్టుకొను; ఆక్రమించు; (2) జప్తుచేయు;
  • seldom, adv. అరుదుగా; కదాచిత్తుగా; క్వాచిత్కంగా; సకృత్తుగా;
  • select, v. t. ఎంచు; ఏరు; ఎంపిక చేయు;
  • selection, n. ఎంపిక; స్వీకరణ; ఎన్నిక; వరణం; వివేచనం; (rel.) election;
    • Natural Selection , ph. నైసర్గిక నిర్ణయం; నైసర్గిక వరణం;
    • Theory of Natural Selection , ph. నైసర్గిక వరణ వాదం;
  • selective, adj. వరణాత్మక;
    • selective breeding, ph. వరణాత్మక ప్రజననం;
  • Selenium, n. సోమం; ఇందియం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 34, సంక్షిప్త నామం, Se); [Gr. selene = moon];
  • self, pref. ఆత్మ; స్వ; స్వయం; స్వార్థ; సొంత; స్వంత; తాఁ;
  • self-aggrandizement, n. ఆత్మస్తుతి; ఆత్మప్రశంస; సొంతడబ్బా;
  • self-acquisition, n. స్వార్జితం;
  • self-adjoint, adj. స్వానుబంధ;
  • self-assertion, n. ఆత్మనిశ్చయం;
  • self-centered, n. ఆత్మాభిమాని; తాఁౘుట్టు;
  • self-caused, n. స్వయంకృతం;
  • self-cleansing, adj. ఆత్మప్రక్షాళిక;
  • self-compliment, n. ఆత్మశ్లాఘనం;
  • self-conceited, n. గర్వి; గర్వపోతు; అహంవాది; అహంకారి;
  • self-condemnation, n. ఆత్మనింద;
  • self-confidence, n. ఆత్మవిశ్వాసం;
  • self-conscious, n.ఆత్మచేతనం;
  • self-control, n. ఆత్మనిగ్రహం; ఆత్మసంయమనం;
  • self-defense, n. ఆత్మరక్షణ; తాఁకాపు;
  • self-delusion, n. ఆత్మవంచన;
  • self-denial, n. వైరాగ్యం;
  • self-discipline, n. స్వయంశిక్షణ;
  • self-esteem, n. ఆత్మగౌరవం; అభిజాత్యం; అతిశయం; ప్రకర్ష;
  • self-evident, n. స్వయం విదితం; తాఁదెలివి;
  • self-explanatory, adj. స్వయంవివరణాత్మక;
  • self-fertilization, n. స్వసంపర్కం; స్వసంయోగం;
  • self-government, n. స్వపరిపాలనం; తానేల్పు;
  • self-help, n. స్వయంకృషి; తాయూత; స్వయం సహాయం;
  • self-inflicted, adj. స్వయంకృత;
  • self-interest, n. స్వప్రయోజనం;
  • self-less, adj. స్వార్థరహితమైన; నిస్వార్థమైన;
  • self-luminous, adj. స్వయంప్రకాశక; దివ్య;
  • self-pity, ph. ఆత్మకారుణ్యం; ఆత్మానుకంపం;
  • self-pollination, n. స్వపరాగ సంపర్కం; స్వజాతి సంపర్కం; ఆత్మపరాగ సంపర్కం;
  • self-reliance, n. స్వావలంబన;
  • self-respect, n. ఆత్మాభిమానం; ఆత్మగౌరవం; తన్నదటు (తన + అదటు);
  • self-rule, n. స్వరాజ్యం;
  • self-seeker, m. స్వార్థపరుడు;
  • self-sufficiency, adj. స్వావలంబన;
  • self-sufficient, adj. స్వయంసమృద్ధ;
  • self-supporting, adj. స్వయంపోషకమైన; నిరాలంబ;
  • selfish person, n. ఆత్మంభరి; m. స్వార్థపరుడు; స్వార్థకాముడు;
  • selfishness, n. స్వార్థం; స్వార్థపరత్వం; ఆత్మంభరత్వం; ప్రలోభం; ఒంటెత్తుతనం; ఒంటెత్తు బుద్ధులు;
  • selfless, adj. నిస్వార్థమైన;
  • selflessly, adv. నిస్వార్థంగా;
  • selflessness, n. స్వార్థరాహిత్యం; నిస్వార్థం;
  • sell, v. t. అమ్ము; విక్రయించు;
  • seller, n. అమ్మేవాడు; విక్రేత; దాయకుడు; vendor;
  • semantic, adj. అర్థ;
    • semantic analysis, ph. అర్థ విశ్లేషణ;
    • semantic divergence, ph. అర్థ విపరిణామం;
  • semanticist, n. మాటల యొక్క అర్థం గురించి కాని, ఆ అర్థం యొక్క మార్పుకి సంబంధించిన విషయాలలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి;
  • semantics, n. అర్థం; పదార్థశాస్త్రం; మాటలయొక్క అర్థానికి సంబంధించిన శాస్త్రం;
semaphore=రెక్క
  • semaphore, n. రెక్క; రెక్కమాను; రెక్కపేడు; లలామం; సంబావుటా; టెక్కెం; వాకేతం;
  • semen, n. రేతస్సు; వీర్యం; సాఁడు; పురుష జననాంగాలలో తయారయే తెల్లటి ద్రవం;
  • semester, n. అర్ధ సంవత్సరం;
  • semi, pref. అర్ధ; అసంపూర్ణ; పూర్తికాని; పదార్థం; ఈ ద్రవంలో వీర్య కణాలు ఉంటాయు; see also sperm;
  • semicircle, n. అర్ధవృత్తం;
  • semiconductor, n. అర్ధవాహకి; అర్ధవాహకం;
  • semicolon, n. అర్ధ బిందువు; వాక్యంలో విరామ చిహ్నం;
  • semiconscious, adj. పూర్తిగా స్మారకం లేని;
  • seminal, adj. (1) ప్రబలమైన; వ్యాపకత్వము గల; (2) వీర్య సంబంధమైన;
    • seminal fluid, ph. రేతస్సు; వీర్యం; సాఁటి నీరు;
  • seminar, n. సదస్సు; గోష్ఠి; చర్చాసభ;
  • semi-permeable, adj. అర్ధప్రవేశ్య;
  • semivowels, n. అంతస్థములు; లఘువులు; అలఘువులు;
    • harsh semivowels, ph. అలఘువులు;
    • light semivowels, ph. లఘువులు;
  • semolina, n. రవ్వ; గోధుమ రవ్వ; సూజీ; the coarse, purified wheat middlings of durum wheat;
  • semal tree, n. బూరుగ చెట్టు; శాల్మలీ వృక్షం; [bot.] Bombax ceiba;
  • senate, n. శిష్టసభ; పరిషత్తు; భారతదేశంలోని రాజ్యసభ అమెరికాలోని సెనేటుకి సమానం;
  • senator, n. శాసనసభలో సభ్యుడు లేదా సభ్యురాలు;
  • send, v. t. పంపు; పంపించు;
  • sender, n. పంపువాడు; ప్రేషకుడు; ప్రేషకం;
  • sendoff, n. వీడ్కోలు; ఉద్యాపన; see also expulsion;
  • sendoff, v. t. సాగనంపు; వీడుకొలుపు; పంపించు;
  • senescence, n. The aging process; a cell's loss of the ability to divide;
  • senility, n. వార్ధక్యంతో వచ్చే మనోదౌర్బల్యం; వార్ధక్యం; వృద్ధాప్యం; ముసలితనం;
  • senior, n. (1) పెద్ద; జ్యేష్ఠుడు; గరిష్ఠుడు; (2) నాలుగేళ్లపాటు కొనసాగే విద్యార్థి దశలో నాలుగవ ఏటి విద్యార్థి; (3) పై తరగతి విద్యార్థి; (4) పెద్ద వకీలు;
  • senna, n. నేల తంగేడు; సునాముఖి;
  • sensation, n. సంవేదనం; సంచలనం;
  • sensational, adj. సంచలనాత్మక; ఉద్రేకపూరిత;
  • sense, n. (1) ఇంద్రియం; తన్మాత్ర; ఆద (2) తెలివి; జ్ఞానం; (3) భావం; ఉద్దేశం;
    • sense of hearing, ph. శ్రవణేంద్రియం;
    • sense of sight, ph. చక్షురేంద్రియం;
    • sense of smell, ph. ఘ్రాణేంద్రియం;
    • sense of taste, ph. రసేంద్రియం; జిహ్వేంద్రియం;
    • sense of touch, ph. త్వగింద్రియం;
    • sense organs, ph. జ్ఞానేంద్రియాలు;
  • senses, n. pl. తన్మాత్రలు;
    • five senses, ph. పంచ తన్మాత్రలు;
  • sensitiveness, n. సున్నిత తత్వం;
  • sensor, n. గోచరి; సంవేదకి; గ్రాహకం;
    • glucose sensor, ph. మధు సంవేదకి; మధు గోచరి;
    • sensor array, ph. సంవేదక శ్రేణి; గ్రాహక శ్రేణి; గోచర శ్రేణి;
  • sensory, adj. సంవేదక;
    • sensory nerves, ph. సంవేదక నాడులు;
  • sensual, adj. శృంగార; విషయాసక్తి గల; ఇంద్రియ సుఖ సంబంధమైన; కామాతురమైన;
  • sensuality, n. శృంగారం; కాయువం;
  • sensuous, adj. ఇంద్రియాలని ఆకర్షించేటటువంటి శృంగార;
  • sentence, n. (1) వాక్యం; మాట (2) శిక్ష;
    • complex sentence, ph. సంశ్లిష్ట వాక్యం; చిక్కు మాట;
    • compound sentence, ph. ద్వంద్వ వాక్యం; కలగలుపు వాక్యం;
    • simple sentence, ph. సరళ వాక్యం; చిన్న మాట;
  • sentient, adj. స్పర్శజ్ఞానము కల; చక్షు, శ్రవణ, ఘ్రాణ స్పర్శలతో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనుభవించగల; able to perceive or feel things;
  • sentiment, n. (1) మనోభావం, భావవృత్తి, చిత్తవృత్తి, భావానుబంధం, సంవేదన; ప్రబల విశ్వాసం; (2) రసం; ఆర్ద్రత; రాగం;
    • sentiment analysis, ph. మనోభావ విశ్లేషణ; వినియోగదారులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం;
  • sentimental, adj. రసస్పూరిత; మనోభావాలని ప్రదర్శించే విధంగా; లోపలలేని భావాలని పైపైన ప్రదర్శించే విధంగా;
  • sentinel, n. కాపు; కావలివాడు; పహరాదారు; రక్షకుడు; సిపాయి;
  • sentry, n. కావలి బంటు; హెగ్గాడి;
  • separate, adj. ప్రత్యేకం;
  • separate, v. i. ప్రత్యేకం; విడిపోవు;
  • separate, v. t. వేరు చేయు; విడగొట్టు; విడదీయు; వింగడించు; అన్యథాకరించు;
  • separately, adv. (1) విడిగా; అనామత్తుగా; (2) ప్రత్యేకంగా;
    • treat separately, ph. అన్యథాకరించు;
  • separation, n. వియోగం; వేఱ్పాటు; ఎడబాటు;
    • separatist attitude, ph. వేఱ్పాటు భావం;
  • sepsis, n. కుళ్లు; విషపూరితం; పూతిదోషం;
  • septic, adj. కుళ్లిన; విషపూరిత; కలుషమైన; పూతిదోష; పూతికర; (ant.) anti-septic = పూత్యారి;
    • septic tank, ph. కుళ్లుకోనేరు;
  • septillion, n. సెప్టిలియను; అమెరికాలో ఒకటి తర్వాత 24 సున్నలు; 1024; బ్రిటన్లో, పాత కాలంలో, 1042;
  • septuagenarian, n. డెబ్బది, ఎనబది ఏండ్ల మధ్య వయస్సులో ఉన్న వ్యక్తి;
  • septum, n. పటి; రెండు కుహరములు మధ్యనున్న గోడ;
  • sequel, n. తరువాయి; తరువాయి కథ; తరువాయి గ్రంథం; పరిణామం; ఫలం;
  • sequence, n. క్రమం; వరుస; వరుసక్రమం; శ్రేఢి; పరంపర; ఒగి; ఓలి; ఓజ; సొరిది; హాళి; (rel.) series; (note) In mathematics the word sequence (శ్రేఢి) is used to indicate a succession of comma-separated entities whereas the word series (శ్రేణి) is used to indicate partial sums of the same entities; (see also) progression;
    • genetic sequence, ph. జన్యు శ్రేఢి;
  • sequential, adj. అనుపూర్విత;
  • serenade, n. ప్రేమగీతిక;
  • serenade, v. t. పాటలతో ప్రేమను వ్యక్తపరచుట;
  • serene, adj. ప్రశాంతమైన;
  • serendipity, n. కాకతాళీయంగా కలిసొచ్చిన అదృష్టం;
  • serf, n. బానిస; కమతగాడు;
  • serfdom, n. దాస్యం;
  • serial, adj. శ్రేణిక; పరంపరగా; వరుసగా;
  • serial, n. శ్రేణిక; ఖండకథ; స్రవంతి; సానుక్రమికం;
  • sericulture, n. పట్టుపరిశ్రమ; పట్టుపురుగుల పెంపకం;
  • series, n. శ్రేణి; మాల; క్రమం;
    • arithmetic series, ph. అంక శ్రేణి; అంకగణిత శ్రేణి; అంకెయొగి; ఉ: 3 + 7 + 11 + 15 + ...
    • ascending series, ph. ఆరోహణ శ్రేణి; ఉచ్ఛ శ్రేణి; ఎక్కుయొగి; ఉ: 3 + 5 + 11 + 15 + 16 + ...
    • convergent series, ph. పరిచ్ఛిన్న శ్రేణి;
    • descending series, ph. అవరోహణ శ్రేణి; దిగుయొగి; ఉ: 16 + 15 + 11 + 10 + ...
    • exponential series, ఘాత శ్రేణి; ఘాతీయ శ్రేణి; ఉ: e−x =1 − x1/1! + x2/2! + x3/3! + ......
    • divergent series, ph. అపసృత శ్రేణి; వెడయొగి;
    • geometric series, ph. గుణ శ్రేణి; గుణాత్మక శ్రేణి;
    • harmonic series, ph. హర శ్రేణి; హరాత్మక శ్రేణి;
    • infinite series, ph. అనంత శ్రేణి;
  • serious, adj. (1) ప్రమాదకరమైన; ఘోరమైన; (2) నిజమైన; హాస్యంకాని; గంభీరమైన;
  • seriously, adv. నిజంగా;
  • sermon, n. ధర్మోపదేశం; ధర్మప్రవచనం;
  • serpent, n. సర్పం; పాము; పన్నగం; వ్యాళం; హవ్వరం; ఉరగం;
    • serpent stone, ph. మణి; నాగమణి; గోరోచనం ని అరగదీసి నున్నగా చేసిన రాయి; గ్రీకు పురాణగాథ "ఇలియాడ్" లో ఫిలోక్టిటీస్ అనే యోధుడిని పాము కరిస్తే ఆ విషం దిగడానికి మెకేయాన్ అనే వైద్యుడు ఈ రకం నాగమణిని ఉపయోగించేడుట;
  • serpentine, adj. మెలికలు తిరిగిన; ఔరగ;
  • serrated, adj. దంతురిత; ఱంపపు పళ్ళ వంటి పళ్ళు కల;
  • serum, n. లసి; రక్తపు రసిలో కరిగిన ఫిబ్రినోజస్‌ని తీసివేయగా మిగిలినది;
  • servant, n. f. సేవకి; సేవకురాలు; పనిమనిషి; కింకరి; భృత్యురాలు; దాసి; పారిక; తొత్తు; చేటకుఁడు; చేటకి;
    • son of a servant, ph. తొత్తు కొడుకు;
  • servant, n. m. సేవకుడు; పనిమనిషి; భృత్యుడు; దాసుడు; లెంకఁడు; బంటు; కింకరుడు; డింగరి; గులాం; పారికాపు;
  • serve, v. t. వడ్డించు; సేవ చేయు; కైంకర్యం చేయు; శుశ్రూష చేయు; ఉపచారం చేయు;
  • server, n. (1) ఉపచారి; కింకరి; చేటి; చేటిక; పరిచారిక; సేవిక; (2) ఉపచారం చేసే వ్యక్తి; కైంకర్యం చేసే వ్యక్తి; వడ్డన చేసే వ్యక్తి;
  • service, n. (1) సేవ; సపర్య; పరిచర్య; సహాయం; (2) కైంకర్యం; ఉపాసన; పూజ; (3) నౌకరీ; ఊడిగం; దాస్యం; ఒంటరికం; (4) శుశ్రూశ; చాకిరీ; పని; (5) అనువృత్తి; ఉపచర్య; ఉపచారం; (6) క్రియ;
    • civil service, ph. ప్రభుత్వానువృత్తి; ప్రభుత్వోపచారం;
    • sixteen-fold service, ph. షోడశోపచార పూజ;
    • service motto, ph. సేవా ప్రవృత్తి; సేవాభావం;
    • service organization, ph. ఉపచార సంస్థ;
    • service representative, ph. సపర్య ప్రతినిధి; ఉపచార చారి;
    • service to God, ph. కైంకర్యం;
    • service to teacher, ph. గురు శుశ్రూష;
  • services, n. క్రియలు; ఉపచర్యలు;
    • funeral services, అంత్యక్రియలు;
  • servitude, n. బానిసత్వం; దాస్యం; ఊడిగం;
  • sesame cake, n. తెలకపిండి; తిలపిష్టం;
  • sesame seed, n. నువ్వులు; తిలలు; నువ్వు పప్పు; నూపప్పు; తెలికలు;
  • sesame oil, n. నువ్వుల నూనె; తైలం; నూనూనె;
  • sesquipedalian, adj. బహుపాద సమీకరణ సహిత;
  • set, n. (1) సమితి; వర్గం; గణం; సమూహం; కట్టు; తతి; సంపుటం; పటలి; చయము; (2) దృశ్య బంధం; రంగాలంకరణ విశేషం;
    • non-empty set, ph. అక్షయ సమితి;
    • ordered set, ph. క్రమ సమితి; క్రమ చయము;
    • set of hundred (poems), ph. శతకం;
    • set of eight (poems), ph. అష్టకం;
    • set of five (poems), ph. పంచకం;
    • set of two (*), ph. ద్వికం;
  • set, v. i. అస్తమించు; క్రుంగు; మునుఁగు; క్రిందకు దిగు;
  • set-square, n. మూలమట్టం;
  • setting, n. నేపథ్యం;
  • settle, v. i. స్థిరపడు; ఇరవుపడు; నెలకొను; అధివసించు;
  • settle, v. t. స్థిరపరచు; పరిష్కరించు; తీర్పు చెప్పు; తేల్చు;
    • settle down, ph. కుదుటపడు;
  • settlement, n. (1) స్థిరనివాసం; స్థావరం; (2) పరిష్కారం; ఫైసలా;
  • seven, n. ఏడు; ఆరున్కొక్కటి; సప్తకం;
  • seventeen, n. పదిహేడు; పదునేడు;
  • seventh, adj. ఏడవ; ఏడో; సప్తమ;
  • seventh, n. ఏడవది; సప్తమం;
  • sever, v. i. తెగు; తెగిపోవు;
  • sever, v. t. త్రెంపు; నరుకు; తెగగొట్టు; తెగటార్చు;
  • several, adj. చాలా; పెక్కు; పలు; వేఱ్వేఱు; తమతమ; ఆయా; కొన్ని; కొందఱు;
    • several people, ph. చాలామంది; పలువురు; అనేకులు; పెక్కండ్రు; వేవురు;
    • several varieties, ph. పలురకాలు;
  • severally, adv. ఎవరిమట్టుకు వారు; ఎవరితోవన వారు;
  • severance, n. వేఱు చెయ్యడం; విడిపోవడం;
  • severe, adj. ఘోర; ప్రచండ; కఠిన; క్రూర;
  • severity, n. కఠినత; క్రూరత;
  • Seville orange, n. ఇటలీలోని సెవిల్ ప్రాంతంలో దొరికే నారింజ; నారదబ్బ;
  • sew, v. t. (సో) కుట్టు;
  • sewing, n. కుట్టుపని;
  • sewage, n. మురుగు; మురుగునీరు; మురికి నీరు;
  • sewer, n. మురుగు గొట్టం; మురుగు కాలవ; మురుగునీటి గొట్టం;
  • sewerage, n. మురుగు నీటిని మోసుకుపోయే, శుభ్రపరచే అవస్థాపన వ్యవస్థ;
  • sex, adj. లింగ; లైంగిక; శృంగార; కాయువ;
    • sex appeal, ph. శృంగారాకర్షణ; కాముకత్వము;
    • sex cell, ph. లింగ కణం;
    • sex discrimination, ph. లింగ వివక్షత;
    • sex education, ph. జననాంగ విద్య; జననాంగ విద్యాశాస్త్రం; కాయువ చదువు;
    • sex hormone, ph. లైంగిక ఉత్తేజితం;
    • sex organs, ph. జననాంగాలు; జననేంద్రియాలు;
  • sex, n. (1) రతిక్రియ; స్త్రీ పురుష సంయోగం; (2) [gram.] లింగము; ఆడో, మగో తెలిపే పదం; the anatomic and physiological aspects of male versus female bodies; see also "gender;"
  • sexagecimal, adj. షష్టాదశాంశ; షష్ట్యంక; అరవై అంశలు ఉన్న;
    • sexagecimal system, ph. షష్టదశాంశ పద్ధతి; షష్ట్యంక పద్ధతి; అరవై అంశలు ఉపయోగించి లెక్కపెట్టు పద్ధతి;
  • sextant, n. షడ్భాగి; వృత్తంలో ఆరో భాగం ఆకారంలో ఉన్న ఒక ఖగోళ పనిముట్టు;
  • sextillion, n. సెక్స్‌టిలియను; ఒకటి తర్వాత 21 సున్నలు ఉన్న సంఖ్య; 1021
  • sextuplets, n. pl. షష్ఠకం; షష్ఠకులు; ఒకే కాన్పులో పుట్టిన ఆరుగురు పిల్లలు;
  • sexual, adj. లింగ; లైంగిక; దైహిక ప్రేమ;
  • sexy, adj. కాముక; కామోద్దీపిక; కామప్రేరిక;
  • shackles, n.pl. సంకెళ్ళు;
  • shade, adj. లేశం; లవలేశం; పిసరు;
  • shade, n. (1) నీడ; ఛాయ;(2) దృగక్షకం;
  • shadow, n. నీడ; ఛాయ; క్రీనీడ;
  • shaft, n. (1) కాడి: (2) ఏడికోల; బాణం;
  • shag, n. ఒత్తుగా, చిందరవందరగా ఉన్న ఉన్ని; ఒత్తుగా చిందరవందరగా పెరిగిన జుత్తు;
  • shake, v. i. (1) ఊగు; వీగు; (2) వణుకు;
  • shake, v. t. (1) రంగరించు; గిలకరించు; చిలకరించు; (2) ఊపు; ఝళిపించు; కుదుపు; ఆడించు; కంపించు; (3) అసమ్మతిని తెలియజేయడానికి బురన్రి అడ్డుగా ఆడించడం;
  • shakeup, v. t. దుళ్లగొట్టు;
  • shallow, adj. కాకపేయ; కాకి స్నానం చెయ్యడానికి సరిపడే లోతు గల; లోతు తక్కువైన; సారహీనమైన;
  • sham, n. మోసం; నకిలీ; బూటకం; సాకు;
  • shambles, n. s. (1) కసాయి గూడెం; (2) చిందరవందరగా, చేపల బజారులా ఉన్న స్థలం;
  • shame, n. (1) తలవంపు; అవమానం; అపత్రప; (2) లజ్జ; సిగ్గు;
  • shamelessly, adv. సిగ్గు లేకుండా; నిస్సిగ్గుగా;
  • shampoo, n. కేశకాంతి; జుత్తుని శుభ్రపరచడానికి వాడే కుంకుడురసం లాంటి పదార్థం;
  • shape, n. ఆకారం; ఆకృతి; మూర్తం; రూపం; రూపధేయం;
  • shaped, adj. సాకార; ఆకారంతో కూడిన; రూపధేయ;
  • shapeful, n. సాకారం; ఆకారం ఉండడం;
  • shapeless, n. నిరాకారం; నిరాకృతి; అమూర్తం; (ant.) సాకారం;
  • shards, n. పెంకులు; విరిగిన ముక్కలు;
    • shards of glass, ph. గాజు పెంకులు;
    • shards of pottery, ph. చిల్ల పెంకులు; విరిగిన కుండ ముక్కలు;
  • share, n. వాటా; భాగం; వంతు; పాలు; భాగధేయం; దాయం; అంశ; దామాషా; దాయం; హిస్సా; షేరు;
  • share, v. i. పంచుకొను;
  • sharecropper, n. పాలేరు; కౌలుకి తీసికొన్న రైతు; కామందు దగ్గర పొలాన్ని "అద్దెకి" తీసుకుని, పంటలో ఒక భాగం శిస్తు చెల్లించే వ్యక్తి;
  • shareholder, n. వాటాదారుఁడు; భాగస్వామి; భాగస్థుఁడు; భాగధేయుఁడు; పాలివాఁడు; అంశకుఁడు;
  • shark, n. ఏలాం; ఏలాంచేప; సొఱచేఁప;
  • sharp, adj. వాడిగా; వాడియైన; పదునుగా; పదునైన; చురుగ్గా; చురుకైన; తీక్షణంగా; తీక్షణమైన; తీవ్రంగా; తీవ్రమైన; నిశితమైన; ఉదాత్తమైన; లఘు;
    • sharp pain, ph. లఘు శూల; ఉదాత్తమైన నొప్పి;
  • sharpen, adj. పదునుపెట్టు;
  • sharpness, n. పదును; వాడితనం; నైశిత్యం;
  • shave, v. t. గీసు; గొరుగు; కోరు;
  • shaved, adj. ముండన;
  • shaving, n. ముండనం;
  • shavings, n. కోరు; ఛాతనములు; చిత్రిక పట్టడం వల్ల వచ్చే బీడు;
  • shawl, n. శాలువా;
    • ornamental shawl, ph. దుశ్శాలువా;
  • she, pron. (1) remote. అది; ఆమె; (2) respectful. remote. ఆవిడ; (3) proximate. ఇది, ఈమె; (4) respectful proximate, ఈవిడ; (5) sneering. proximate. ఈవిడగారు; (6) sneering. remote. ఆవిడ గారు;
  • sheaf, n. కట్ట;
  • shear, n. కత్తిరించు;
  • shears, n. పెద్ద కత్తెర; మొక్కలని కత్తిరించడానికి వాడే పెద్ద కత్తెర;
  • sheath, n. ఒఱ; కోశం;
    • intellectual sheath, ph. విజ్ఞానమయ కోశం; తెలివొఱ;
    • mental sheath, ph. మనోన్మయ కోశం; మనసొఱ;
  • shed, n. పాక; పంచ; శాల; సాల; కొట్టం; గుడిసె:
  • shed, v. t. రాల్చు; కార్చు; జల్లు; వదలిపెట్టు;
  • sheen, n. జిలుగు;
  • sheep, n. గొర్రె; గొర్రెలు; పొట్టేలు; తగరు; ఏడిక; మేషం;
  • sheer, adj. కేవలం;
  • sheet, n. (1) పత్రం; కాగితం; (2) దుప్పటి; (3) రేకు; తగడు;
  • shelf, n. (1) అలమారు; అరమారు; బీరువా; గూడు; (2) స్తరిక; అలమారులో ఒక సొరుగులాంటి అంతస్తు; (2) మేట; ఇసక మేట;
  • shell, n. (1) గుల్ల; చిల్లగవ్వ; గవ్వ; చిప్ప; డొల్ల; కంబు; కర్పరం; కోశం; కర్క; (2) కవచం; స్పోటం; తొబక; (3) ఫిరంగిలో గుండు;
    • electron shell, ph. ఎలక్ట్రాను కవచం; విద్యుత్కణ కవచం;
    • inner shell, ph. అంతర్ కవచం; లోగవ్వ; లోగుల్ల;
    • outer shell, ph. బాహ్య కవచం; బాహ్య కోశం; పైగవ్వ; పైగుల్ల;
    • pearl shell, ph. ముక్తాస్పోటం; ముత్యపు చిప్ప;
    • sea shell, ph. సముద్రపు గుల్ల; సింధుస్పోటం; కడలి గవ్వ; కడలి చిప్ప;
    • valence shell, ph. బాలపు కోశం; కడగవ్వ; కడగుల్ల;
  • shell lime, ph. గుల్ల సున్నం;
  • shellfish, n. గుల్ల చేప;
  • shellac, n. పెల్లక్క; అటుకుల లక్క; శుద్ధమైన లక్క; ముడి లక్కని కరగించి, వడపోసి, పెల్లల వలె పోయబడ్డ లక్క;
  • shells, n. pl. గుల్లలు;
  • shelter, n. ఆశ్రయం; వాసం; మరుగు; రక్షణ;
    • food and shelter, ph. ఆశ్రయం; వాసమూ, గ్రాసమూ;
  • shelterless, n. ఆశ్రయ హీనులు; ఇల్లులేని;
  • shenanigans, n. (1) మోసాలు; (2) లీలలు; అల్లరి చేష్టలు;
  • shenanigans, n. pl. (1) కుయుక్తులు;; (2) అల్లరి పనులు;
  • shepherd, n. m. గొర్రెల కాపరి; గొఱ్ఱెలవాడు; కురుమువాడు;
  • sherry, n. సారాయి; స్పెయిన్‍ దేశంలో తయారయే తెల్ల సారాని, బ్రాందీని కలపగా వచ్చే ఒక మాదక పానీయం;
  • shield, n. డాలు; కవచం;
  • shift, n. విస్థాపనం; స్థలం మార్చడం;
    • Doppler shift, ph. డాప్లర్ విస్థాపనం;
    • paradigm shift, ph. విశ్వవీక్షణ విస్థాపనం;
    • red shift, ph. ఎర్ర విస్థాపనం;
  • shilly-shally, n. చాదస్తం;
  • shin, n. క్రీగాలి ముందు భాగం; మోకాలికీ మడమకీ మధ్యనున్న కాలి ముంభాగం;
  • shine, n. ప్రకాశం; రుచి; తేజం; వెలుగు;
  • shine, v. i. ప్రకాశించు; రాణించు; భాసిల్లు; అలరు; తేజరిల్లు; వెలుగు; ఉద్యోతించు; హవణిల్లు; పరిఢవిల్లు;
  • shingles, n. ఇంటికప్పుకి వాడే పెంకుల వంటి ఉపకరణాలు;
  • shining, adj. తేజస్సుతో కూడిన; విద్యోతమాన; ఉజ్వల;
  • ship, n. ఓఁడ; నావ; నౌక; తరణి; తరండం; తరి; కలం; కప్పలి;
    • cargo ship, ph. కప్పలి;
  • ship, v. t. పంపు; బంగీచేసి పంపు;
  • shipment, n. ఎగుమతి; ఎగుమతి చేయబడ్డ వస్తువు;
  • shipworm, n. సముద్రంలో మునిగిపోయిన కొయ్య పడవలని తినే ఒక రకం సూక్ష్మజీవి; [bio.] Teredo navalis;
  • shipwreck, n. నౌకాభంగం; ఓడ పగిలిపోవడం; ఓడ కెడవు;
  • shirk, v. t. తప్పించుకొను; కర్తవ్యం త్యజించు;
  • shirt, n. చొక్కా; లాల్చీ; కమీజు; జుబ్బా; కంచుకం; అంగీ; ఆంగరకం;
    • shirt with a collar and front pocket, ph. చొక్కా; కమీజు;
    • shirt without a collar, ph. జుబ్బా;
    • short-sleeved inner shirt, ph. జుబ్బా; కంచుకం; బనీను;
    • long-sleeved, collar-less, cuff-less (with side pockets) shirt, ph. లాల్చీ; అంగీ; అంగరకా;
  • shiver, v. i. వణుకు; కంపించు; కంపరమెత్తు;
  • shoal, n. మెరక; మేట; ఎక్కిలి; గాధం; లోతు తక్కువగా ఉన్న జలభాగం;
  • shock, n. (1) ఘాతం; ఆఘాతం; దెబ్బ; అదురు; గుభిల్లు; (2) నిర్ఘాతం; అకస్మాత్తుగా రక్తపు పోటు పడిపోవడం వల్ల స్మారకం పోయిన పరిస్థితి; (3) మనోఘాతం; విభ్రాంతి; దిగ్భ్రాంతి; కలత; భయోత్పాతం;
    • electrical shock, ph. విద్యుత్ ఘాతం; విద్యుదాఘాతం; విద్యుత్ ప్రకోపం; విద్యుత్ గుభిల్లు; షాకు;
    • shock absorber, ph. ఘాత శోషణి; చక్రాలున్న బండి కుదుపు లేకుండా నడవడానికి ప్రతి చక్రానికీ తగిలించబడే ఉపకరణం;
  • shoddy, adj. చవకబారు; నాణ్యత లేని;
  • shoe, n. చెప్పు; పాదుక; పాదరక్ష;
  • shoebill, n. తాడిముక్కు కొంగ; తాడితల కొంగ; [zoo.] Balaeniceps rex
  • shoemaker, n. గొడారి;
  • shoes, n. pl. చెప్పులు; జోళ్లు; పాదుకలు; పాదరక్షలు; పాంకోళ్లు; మెట్లు;
    • pair of shoes, ph. చెప్పుల జత;
    • wooden shoes, ph. పాంకోళ్లు;
  • shoot, n. మొలక; అంకురం; నారు; నవోద్భిజం; అభినవోద్భిజం; ఈరిక; కందళికం; sprout;
  • shoot, v. i. మొలకెత్తు; అంకురించు; ఈరికలు ఎత్తు; ముందుకు వచ్చు;
  • shoot, v. t. బాణంతో కొట్టు; తుపాకితో కొట్టు;
    • shooting stars, ph. ఉల్కలు; తోకచుక్కలు;
  • shop, n. కొట్టు; దుకాణం; అంగడి; విక్రయశాల; విపణి; జన్యం; ఆదణం; ఆపణం;
  • shop, v. i. కొను; కొనుగోలు చేయు;
  • shopkeeper, n. కొట్టువాఁడు; దుకాణదారుఁడు; ఆపణికుఁడు; వైపణికుఁడు;
  • shoplifting, n. దుకాణాలలో వస్తువులని దొంగిలించడం;
  • shore, n. తీరం; ఒడ్డు; గట్టు; తటి; తటం; దరి; ఈ మాటని పెద్ద పెద్ద జలాశయాల తీరాలని సూచించడానికి వాడతారు; (rel.) beach; bank; coast;
    • sea shore, ph. సముద్రతీరం; సముద్రపుటొడ్డు; చెలియలికట్ట;
  • short, adj. (1) పొట్టి; కురుచ; గిడస; బుడుగు; నన్న; కుదిమట్టం; లఘు; వామన; హ్రస్వ; (2) తక్కువ; కొరత;
    • short story, ph. కథానిక; పిట్ట కథ;
    • short syllable, ph. లఘువు; హ్రస్వము;
    • short wall, ph. పిట్టగోడ;
    • short-sightedness, ph. హ్రస్వదృష్టి;
  • shortage, n. కొరత; కొదవ; వెలితి; సంక్షోభం; ఎద్దడి; అభావం; తక్కువ;
    • shortage of ideas, ph. భావనాభావం;
    • shortage of space, ph. స్థలాభావం;
  • short-circuit, n. (1) అడ్డుదారి; దగ్గరదారి; ఉన్మార్గగమనం; (2) లఘు వలయం; ధన, రుణ ధ్రువాల మధ్య అవరోధం లేకుండా విద్యుత్తు ప్రవహించడానికి సులభమైన మార్గం ఏర్పడ్డ పరిస్థితి;
  • shortcoming, n. లోటు; లోపం; కొరత;
  • short-cut, n. అడ్డుదారి; దగ్గరదారి;
  • shorten, v. t. తగ్గించు; కురచ చేయు;
  • shortening, n. వనస్పతి; శాక తైలాలతో చేసిన, నెయ్యిని పోలిన ఒక కొవ్వు పదార్థం; While technically shortening is any fat that is solid at room temperature, “shortening” typically refers specifically to hydrogenated vegetable oils. Shortening gets its name from the effect it has on gluten production; the fats shorten gluten strands, making baked goods tender and flaky;
  • shortest, n. హ్రస్వతమం;
  • shorthand, n. సంక్షిప్తలిపి;
  • short-lived, n. ఆకాలికం; పుట్టిన వెంటనే నశించేది;
  • short-range, adj. లఘు;
    • short-range interaction, ph. లఘు సంకర్షణ;
  • shortfall, n. కొరత;
  • shortly, adv. కొద్దిసేపట్లో; త్వరలో; స్వల్పకాలంలో;
  • shorts, n. లాగు; చల్లడం; అర్ధోరుకము; నిక్కరు;
  • short-sighted, adj. దూరాలోచన లేని; దూరదృష్టిలేని;
  • short story, n. కథానిక; ఆఖ్యానిక;
  • short-tempered, adj. ముక్కోపి అయిన; ముక్కుమీద కోపం ఉన్న;
  • short-term, adj. స్వల్పకాలిక;
  • shot, n. (1) ; సీసపుగుండు; పడిగల్లు; (2) [cinema] సన్నివేశం లో భాగం;
  • should, v. pt. of shall;
  • shoulder, n. అంసము; భుజం; భుజశిరం; బాహుశిరం; భుజస్కందం; మూఁపు; అఱక;
    • shoulder bag, ph. భుజసేవకం; అఱకడ సంచి;
    • shoulder blade, ph. అంసఫలకం; అఱక పలక;
    • shoulder joint, ph. భుజసంధి; అఱకంటు;
    • shoulder of a bull, ph. మూపురం;
  • shoulder, v. t. కొమ్ముకాయు; బాధ్యత తీసుకొను; సహాయ పడు;
  • shove, v. t. నెట్టు; గెంటు; తోయు;
  • shovel, n. గడ్డపాఱ;
  • show, n. (1) ఆట; (2) వేషం;
  • show, n. ఆడంబరం;
  • show, v.t. చూపించు; చూపు; రుజువు చేయు;
  • shower, n. (1) వానజల్లు; (2) స్నానపు జల్లు;
  • showy, adj. ఆడంబరంగా ఉన్న;
  • shrapnel, n. తూటాతునకలు; తూటాబీడు;
  • shred, v. t. ముక్కలు ముక్కలుగా చేయు;
  • shredder, n. కాగితాలని చిన్న చిన్న ముక్కలుగా చేసే యంత్రం;
  • shrew, n. (1) గయ్యాళి; (2) చుంచు;
  • shrewdness, n. గడుసుతనం; యుక్తి; సూక్ష్మబుద్ధి; చాణక్యం; వైదగ్ధ్యం; వ్యవహారిక ఎత్తుగడ;
  • shrike, n. కసాయి పిట్ట; కళింగ పక్షి;
    • babbler shrike, ph. సైదా పిట్ట;
  • shrill, adj. కీచు; కీచుమనే;
  • shrine, n. చిన్న దేవాలయం; పుణ్యక్షేత్రం;
  • shrink, v. t. కుంచించుకొను; తీసిపోవు; ముడుచుకొనిపోవు;
  • shrubs, n. pl. తుప్పలు; పొదలు;
  • shrug the shoulders, ph. భుజాలు ఎగురవేయు; సందిగ్ధతని తెలియజెయ్యడానికి చేసే చేష్ట;
  • shubbalith, n. పడికట్టు మాట; పడికట్టు పదం:
  • shut, v. t. మూయు; మూసు;
  • shutters, n. తలుపులు; కిటికీ తలుపులు;
  • shyness, n. సిగ్గు; బిడియం; మొగపిరికితనం; మొహం చూపించడానికి పిరికితనం;
  • shyster, n. నిజాయతీ లేని వ్యక్తి; నిజాయతీ లేని వకీలు;
  • siblings, n. pl. తోఁబుట్టువులు; తోడఁబుట్టువులు; అనుజులు; ఏకోదరులు; ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు; సైఁదోఁడులు;
  • sic, adv. ఇలా; ఉన్నది ఉన్నట్లు; యథాతథంగా; (ety.) [Lat.] అసలులో ఉన్న తప్పుని యథాతథంగా నకలు తీసినప్పుడు కుండలీకరణంలో sic అని రాస్తారు.
  • sick, adj. జబ్బు; జబ్బు పడ్డ; రోగగ్రస్త;
  • sickle, n. కొడవలి;
  • sickness, n. అస్వస్థత; అనారోగ్యం; జబ్బు; వ్యాధి; రోగం; రుగ్మత; సుస్తీ; తెగులు; కాయిలా;
  • side, n. పక్క; సరస; వంక; ఓర; పార్శ్వం; పక్షం; తట్టు; చెంప; గరువు; వాక;
    • leeward side, ph. వాలువాక; గాలి వీచే దిశలో;
    • on that side, ph. అటు పక్క; అటు తట్టు;
    • on this side, ph. ఇటు పక్క; ఇటు తట్టు;
    • one side, ph. ఒక పక్క; ఒక తట్టు;
    • shore side, ph. కరవాక;
    • that side, ph. ఆ పక్క; ఆ తట్టు; ఆ వంక;
    • windward side, ph. గాలివాక; గాలి వీచే వైపు;
  • side-dish, n. ఉపదంశం;
  • side-effect, n. అవాంఛనీయ ఫలితం; ఒక రోగాన్ని కుదర్చటానికి మందు ఇచ్చినప్పుడు ఆశించని మరొక ఫలితం;
  • side-looking, adj. ఓరచూపుల;
  • sideburns, n. pl. చెంపలు; చెంపలమీద జుత్తు;
  • sidekick, n. సత్రకాయ; వంతగాఁడు;
  • sidereal, adj. (సైడీరియల్) నాక్షత్ర; astral;
    • sidereal day, ph. నాక్షత్ర దినం; నడినెత్తి మీద ఉన్న నక్షత్రం మళ్ళా నడినెత్తి మీదకి రావడానికి పట్టు కాలం; నక్షత్రాల నేపథ్యంలో భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం; 23 గంటల 56 నిమిషాలు; భూమి ప్రదక్షణం కారణంగా ఇది 24 గంటల కంటె తక్కువగా ఉంది;
    • sidereal month, ph. నాక్షత్ర మాసం;
    • sidereal year, ph. నాక్షత్ర సంవత్సరం;
  • siege, n. ముట్టడి;
  • sieve, n. జల్లెడ; చాలిని;
  • sieve, v. t. జల్లించు; జల్లెడపట్టు; see also sift;
  • seize, n. ముట్టడి; (rel.) blockade;
  • sift, v. t. జల్లించు; వేరు చేయు;
  • sigh, n. నిట్టూర్పు;
  • sigh, v. i. నిట్టూర్చు;
  • sight, n. దృష్టి; లోచనం; దృశ్యం; వీక్షణం; ఈక్షణం; చూఁపు; చూఁడ్కి;
    • line of sight, ph. లోచనపథం; అక్ష మార్గం; చూఁగీత;
    • long sight, ph. దీర్ఘ దృష్టి; దూరపు వస్తువులే కనిపించడం; చత్వారం; దౌఁజూఁపు;
    • short sight, ph. హ్రస్వ దృష్టి; దగ్గర వస్తువులే కనిపించడం;
  • sigmoid, adj. ఆంగ్లాక్షరం 'S' ఆకారంలో ఉన్న;
  • sign, n. (1) గుర్తు; సన్న; సంజ్ఞ; చిహ్నం; జాడ; సంకేతం; అభిజ్ఞ; (2) రాశి;
    • birth sign, ph. జన్మ రాశి; ఆమతి గుర్తు;
    • negative sign, ph. ఋణ సన్న;
    • positive sign, ph. ధన సన్న;
    • sign language, ph. సన్నభాష; కుమ్ముసుద్ధి; సంకేత వృత్తాంతం;
  • sign, v. t. సంతకం పెట్టు;
  • signal, n. సంకేతం; సంజ్ఞ; సూచకి; వాకేతం = వార్త + సంకేతం;
    • analog signal, ph. సారూప్య వాకేతం;
    • digital signal, ph. అంక వాకేతం;
    • signal processing, ph. వాకేత సంవిధానం; వాకేత సంవిధీకరణ;
  • signal, v. t. వాకేతించు; సంకేతించు;
  • signatory, n. సంతకం చేసిన వ్యక్తి;
  • signature, n. సంతకం; చేవ్రాలు; హస్తాక్షరం; దస్కతు;
  • signet, n. ముద్ర; రాజముద్ర; అభిజ్ఞానం;
  • significance, n. ప్రాముఖ్యం; మహత్వం; ముఖ్యత; సార్థకత;
  • significant, adj. ముఖ్యమైన; విశేష; సార్ధక; గణనీయమైన; అన్వర్థక;
    • significant digit, ph. అన్వర్థక అంకం;
    • significant half, ph. అర్ధాంగి; సార్థక భాగస్వామి;
  • silence, n. (1) నిశ్శబ్దం; (2) మౌనం; మూకీభావం;
  • silent, adj. నిశ్శబ్దమైన; మూకీ; మూఁగ; మౌన;
    • silent majority, ph. మౌనభూషణులు;
    • silent, n. ph. అనుచ్చరితం; తూష్ణీకం;
    • silent R, ph. అనుచ్చరిత రకారం;
    • silent state, ph. తూష్ణీక స్థితి;
  • Silica, n. సిలికాన్ డై ఆక్సైడ్ కి పొట్టి పేరు; ఇసక లో ఎక్కువ భాగం ఇదే; Silica is found naturally in some foods, and it is added to many food products and supplements. It is commonly used in the form of silicon dioxide as an anti-caking agent in foods and supplements to keep ingredients from clumping up or sticking together, and it’s sometimes added to liquids and beverages to control foaming and thickness.
    • Silica gel, ph. Silica gel is an amorphous and porous form of silicon dioxide, consisting of an irregular tridimensional framework of alternating silicon and oxygen atoms with nanometer-scale voids and pores. The voids may contain water or some other liquids, or may be filled by gas or vacuum;
  • Silicon, n. సైకతము; సిలికాను; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 14, సంక్షిప్త నామం; Si) [Lat] silex;
  • Silicon Valley, n. సిరి కోన; (లరయో నబేధఃః)
  • silhouette, n. (సిలూయెట్) ఛాయారూపం; పొడ; నీడబొమ్మ;
  • silk, n. పట్టు; చీనాంబరం;
    • Chinese silk, ph. చీనీ చీనాంబరం; చీనా పట్టు;
  • silkworm, n. పట్టుపురుగు;
  • silly, adj. చిలిపి; తెలివితక్కువ; బుద్ధిలేని;
  • silo, n. గాదె; ధాన్యాగారం; ధాన్యపు గిడ్డంగి; కోష్ఠాగారం; కొటారం; లిబ్బి; పాతర; అంబారం; అంబర్‌ఖానా;
  • silt, n. ఒండుమట్టి; ఒండు; వండలి; పూడిక;
  • silt, v. i. పూడు; పూడిక; ఒండలి; ప్రవాహంలోని బురద, ఇసుక, వగైరా;
  • silting, n. పూడిక; ఒండుమట్టితో పూడిపోవడం;
  • Silver, n. వెండి; రజతం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 47, సంక్షిప్తనామం, Ag); [Lat.] Argentum;
    • silver nitrate, ph. రజత నత్రితం; AgNO3 ;
  • simian, adj. వానర;
  • simian, n. వానరుఁడు;
  • similar, adj. సరూప; సారూప్య; పోలినటువంటి;
    • similar triangles, ph. సారూప్య త్రిభుజాలు;
    • similar units, ph. సారూప్య శాల్తీలు;
  • similarity, n. సారూప్యం; సాపత్యం; సాదృశ్యం; పోలిక; ఉపమితి;
  • similitude, n. సాజాత్యం; తౌల్యం; సామ్యం;
  • simile, n. (సిమిలీ) ఉపమాలంకారం; ఉపమానం;
  • simmer, v. i. ఉడుకు; మరగు; నెమ్మదిగా సన్నటి సెగ మీద మరుగు;
  • simple, adj. వ్యస్త; సాదా; సాధారణమైన; బారు; అవ్యాజ; అలతి;
    • simple interest, ph. బారువడ్డీ; సరళ వడ్డీ;
    • simple word, ph. వ్యస్తపదం; అలతి పదం;
  • simple, n. వ్యస్తం; సాదా; సాధారణం; బారు; అవ్యాజం;
  • simpleton, n. దద్దమ్మ; వెర్రిబాగులవాడు; వెర్రిబాగులది;
  • simplification, n. సూక్ష్మీకరణ;
  • simplify, v. t. సూక్ష్మీకరించు;
  • simultaneous, adj. యుగపత్తు; ఏకకాల; జమిలి; సమాంతర;
    • simultaneous elections, ph. జమిలి ఎన్నికలు;
  • simultaneously, adv. యుగపత్తుగా; ఏకకాలంలో;
  • simulated, adj. పెట్టుకోలు; అభికరణ; అసలు దానివలె;
    • simulated pearls, ph. పెట్టుకోలు ముత్యాలు;
    • simulated praise, ph. పెట్టుకోలు ప్రశంస;
  • simulation, n. పెట్టుకోలు; అభికరణ; విడంబన; అసలు దానివలె ప్రవర్తించడం;
  • simultaneity, n. యౌగపద్యం; సమకాలికత్వం;
  • sin, n. పాపం; పాతకం; భవం; కసటు; కావలం;
    • heinous sin, ph. మహాపాపం; మహా పాతకం; పెంగసటు; పెంగావలం;
    • ocean of sin, ph. భవసాగరం; కావలాల కడలి; కసటుల కడలి;
    • remover of sin, ph. భవహరుఁడు;
  • sincere, adj. నిష్కపటమైన; కపటములేని; హృదయపూర్వక; చిత్తశుద్దిగల; విశ్వాసపాత్ర;
  • sincerely, adv. చిత్తశుద్ధిగా; హృదయపూర్వకంగా;
  • sincerity, n. చిత్తశుద్ధి; నిష్కాపట్యం; ఆర్జవం;
  • sine, n. శంకువు; జ్యా; త్రిజీవా; త్రిజ్యా; కోణం యొక్క ఉన్నతి; లంబకోణ త్రిభుజంలో కోణము ఎదురుగా ఉన్న భుజం; కర్ణము పొడుగుల నిష్పత్తి;
  • sine qua non, n. అవసరమైన షరతు; ఆవశ్యకమైనది;
  • sinew, n. (1) స్నాయువు; నరం; (2) బలం; శక్తి; త్రాణ; సామర్ధ్యం;
  • singer, n. పాటరి; m. గాయకుడు; పాటగాడు; గాణ; గాణుడు; f. గాయని; పాటకత్తె; గాణ; గాణీ;
  • single, adj. ఏక; ఒక; ఒంటరి;
  • single-file, adj. ఒక వరుసలో; ఒకరి వెనకాతల ఒకరు;
  • single-minded, adj. ఏకదీక్షగా; అసహాయంగా;
  • singular, adj. ఏకైక; అరుదైన; అసమాన్య; విశిష్ట;
  • singularity, n. ఏకైకత్వం; ఏకత్వం; వైపరీత్యం; విశిష్టస్థితి; చోద్యం;
  • sink, v. i. మునుగు; ఇంకు;
  • sink, v. t. ముంచు;
  • sink, n. మునుఁగుతొట్టి; శింకు;
  • sinner, n. m. పాపాత్ముఁడు; f. పాపాత్మురాలు; కాసటుఁడు; కావలుఁడు;
  • sinuous, adj. వంపులు తిరిగిన;
  • sinusoidal, adj. తరంగిత; కెరటాకారంలో ఉన్న;
  • sir, inter. అయ్యా; స్వామీ; (ety.) short for sire;
  • sire, n. తండ్రి; అయ్య; అబ్బ;
  • sire, v. i. కను; (exp.) a man sires and a woman bears and delivers;
  • Sirius, n. మృగవ్యాధ రుద్రుఁడు; కుక్కచుక్క; శ్వాన నక్షత్రం; (ety.) ఋగ్వేదంలో వచ్చే “శునాశీరా” అనే కుక్క ఉంది (IV-57-5). That became శేర్య that became Sirius, according to Max Muller; ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన ఈ నక్షత్రం కుక్క ఆకారంలో ఉన్న నక్షత్ర రాశి ముట్టె మీద ఉన్నట్లు అనిపిస్తుంది; మృగవ్యాధుడు (ఒరాయన్ నక్షత్ర రాశి లేదా మృగశీర్ష రాశి) ఉదయించిన కొద్ది సేపట్లో ఈ చుక్క దక్షిణాన కనిపిస్తుంది; మృగవ్యాధుడి పటకాలో ఉన్న మూడు నక్షత్రాలని కలిపే సరళరేఖని దక్షిణానికి పొడిగిస్తే అక్కడ కుక్కచుక్క కనిపిస్తుంది;
  • sister, n. అక్క; చెల్లి;
    • elder sister, ph. అక్క;
    • younger sister, ph. చెల్లెలు; చెల్లి; చెల్లాయి;
  • sit, v. i. కూర్చొను; కూర్చుండు;
  • site, n. స్థలం;
  • sit-in, n. బైఠాయింపు;
  • sitomania, n. ఆకలిగొట్టుతనం; తిండిపోతుతనం; తిండిమీద ధ్యాస;
  • sitomaniac, n. తిండిపోతు;
  • situation, n. (1) పరిస్థితి; అవస్థ; స్థితిస్థానం; (2) స్థానం; ఉద్యోగం;
  • sit-ups, n. గుంజీలు;
  • six, n. ఆఱు; ఇరుమూఁడు; ఇత్తిగ; షట్కము; షష్ఠి;
    • group of six, ph. ఆరుగురు;
    • six-pack, ph. (1) ఆరు బీరు సీసాల బంగీ; (2) నిత్యం వ్యాయామం చేస్తూ, మంచి దేహసౌష్టవం ఉన్న వారి పొట్ట మీద స్పుటంగా అందంగా కనిపించే ఆరు కండరాల సముదాయం;
  • sixteen, n. పదహారు; షోడశం;
  • sixteenth, n. పదహారవది; షోడశం;
  • sixth, adj. ఆరవ; షష్ఠము; షష్ఠి;
    • sixth sense, ph. దివ్యదృష్టి; షష్ఠేంద్రియం;
  • sixty, n. అఱవై; షష్టి; ఇరుముప్ఫై;
    • sixty four, ph. అరవై నాలుగు; చతుష్షష్టి;
  • size, n. కైవారం; కొలత; పరిమాణం; మట్టు; సైజు;
  • skein, n. ఉండ; దారపుండ; బంతి; నూలుకండె; బుడఁత;
    • skein of string, ph. దారపు ఉండ;
  • skeleton, n. అస్థిపంజరం; కంకాళం; ఎమ్మూట; ఎముకల మూట;
    • exo skeleton, ph. బాహ్య కంకాళం; పైయెమ్మూట;
    • skeleton in the closet, ph. ఇంటిగుట్టు;
  • skeptic, sceptic, n. సంశయవాది; సంశయాళువు; నిత్యశంకితుఁడు; సందేహశీలుఁడు; ప్రతిదానిని శంకించే వ్యక్తి;
  • skeptical, adj. అనుమానాస్పద;
  • sketch, n. (1) రేఖాకృతి; రేఖాపటం; నఖ చిత్రం; గెఱపటం (2) గల్పిక; చిత్రణ;
    • thumbnail sketch, ph. నఖచిత్రం; గోటిగెర;
  • skill, n. నైపుణ్యత; కౌశలం; నేర్పు; చతురిమ; చాతుర్యం; పాటవం; ప్రావీణ్యం; చాకచక్యం; దక్షత; విన్ననువు;
    • business skill, ph. వ్యాపార దక్షత;
  • skim, v. t. (1) మీగడతీయు; (2) పైపైన తాకు, స్థూలదృష్టితో చూచు;
    • skimmed milk, ph. వెన్న తీసేసిన పాలు;
  • skin, n. చర్మం; తొక్క; తోఁప; తోలు; చమడా; ప్రభాసిని; త్వక్కు; అజినం;
    • skin of milk, ph. మీఁగడ;
  • skin, v. t. ఒలుచు; చమడాలు ఒలుచు; చర్మం తీయు;
  • skink, n, బిందిపాము; నలికళ్ళ పాము; రక్తపుచ్చం; ఇది చిన్న పాములా కనిపించే బల్లి; రక్తపుచ్చం అంటే ఎర్రని తోక గలది అని అర్థం; బిందిపాము గాఢమైన ఆకుపచ్చ, నలుపు రంగులలో మధ్య నిలువు లేత రంగు చారలతో మెరుస్తూ ఎరుపు తోకను కలిగివుంటుంది. కొన్ని మొత్తం ఒకే రంగులో కూడా వుంటాయి. దీనికి రెండు జతల కాళ్లు తల వెనుక, తోక ముందు భాగంలో వుంటాయి. చిన్న చిన్న కీటకాలు వీటి ఆహారం;
  • skinny, adj. సన్నని; బక్కపలచని;
  • skip, v. t. దాటు; గెంతు; లంఘించు;
    • skip a meal, ph. లంఘనం చేయు; లంకణం చేయు;
  • skirmish, n. కన్నెకయ్యం; కలఁత; వివాదం; చిన్న యుద్ధం;
  • skirt, n. పావడా; చేలాంచలం; లంగా;
    • long skirt, ph. పరికిణీ;
    • skirt, v. t. తప్పించు; చుట్టుతిరుగు; దాటు;
  • skit, n. నాటిక; తక్కువ నిడివిలో నాటకం; ప్రహసనం; హాస్యనాటిక; వ్యంగ్యకావ్యం;
  • skittish, adj. బెదిరిపోయే; బెదురు;
    • skittish animal, ph. బెదురుగొడ్డు;
  • skull, n. పుర్రె; కరోటి; కరంకం; కపాలం; పునుక; (చర్మ, మాంసాదులని తీసివేయగా మిగిలిన శిరోభాగం)
    • skull bone, n. పుర్రె ఎముక;
  • sky, n. ఆకాశం; అంబరం; గగనం; నింగి; నభం; విను; మిన్ను; అంతరిక్షం; వ్యోమం; ఖ; దివి;
  • Sky fruit, n. అడవి బాదం; చేదు బాదం; సుగర్ బాదం; ఇది చాలా చేదుగా ఉంటుంది;

ఆ చేదు వర్ణనాతీతం; పైన పొట్టు తీస్తే లోపల పప్పు తెల్లగా ఉంటుంది దీన్ని కొంచెం చితకొట్టి మాత్ర లాగా మింగేయాలి; [bot.] ‎Swietenia ‎Mahogany;

  • skyrocket, n. తారాజువ్వ;
  • skyscraper, n. అంబరచుంబితం; అభ్రంకషం; ఆకాశాన్నంటే భవనం; నింగిని తాకే మిద్దెలు;
  • sky way, n. వినువీథి; గగనమార్గం; నింగిత్రోవ; దివిబాట;
  • sky wheel, n. అరఘట్టం; ఆకాశ చక్రం; వినోదవనాలలో తరచు కనిపించే పెద్ద చక్రం;
  • slab, n. కడీ; దిమ్మ;
  • slackness, n. అలసత్వం;
  • slag, n. తెట్టు; చిట్టెం; మండూరం; లోహమలినం; ధాతుమలం;
    • iron slag, ph. ఇనుప చిట్టెం;
  • slake, v. t. తడుపు; చల్లార్చు;
  • slaked, adj. తడిపిన; చల్లార్చిన;
    • slaked lime, ph. తడిసున్నం;
  • slander, n. అపవాదు; దూషణ;
  • slander, n. పరువు తీసే మాట; పరువు నష్టపు మాట; అపనింద; అపవాదు; ఆడిక; (note) a slander is a spoken word injurious to the reputation of another person; (rel.) libel; ok
  • slang, n. ఏస; గ్రామ్య భాష;
  • slant, n. వాలు; వాలుదల; వాటం; అధోక;
  • slant, v. i. వాలు; దోరగిల్లు;
  • slant, v. t. వాల్చు; దోరగించు;
  • slantingly, adv. వాలుగా; ఆధోకగా; వాలుదలగా;
  • slap, n. చెంపదెబ్బ;
  • slat, n. బద్ద; సన్నని కర్ర; చీరిక;
  • slate, n. (1) పలక; (2) నాపరాయి; (3) అభ్యర్థుల జాబితా;
    • slate pencil, ph. బలపం; పలకపుల్ల;
  • slather, v. i. పులుముకొను;
  • slather, v. t. పులుము; ఒంటి మీద లేపనం పుష్కలంగా పులుము;
  • slaughterhouse, n. కబేళా;
  • slave, n. బానిస; గులాం; m. దాసుడు, భృత్యుడు; f. దాసి;
    • slave mentality, ph. బానిసత్వపు బుద్ధి; మనోదాస్యం;
  • slavery, n. బానిసత్వం;
  • slay, v. t. చంపు; సంహరించు; హతమార్చు;
  • slayer, n. సంహర్త; చంపువాడు; నిహంత; హంతకుడు; హంతకి;
  • slaying, n. హననం; వధ;
  • sledgehammer, n. సమ్మెట;
  • sleep, n. నిద్ర; సుప్తం; సుప్తి; కునుకు;
    • deep sleep, ph. సుషుప్తి;
    • disturbed sleep, ph. కలఁత నిద్ర;
    • dreamless sleep, ph. సుషుప్తావస్థ;
  • sleepiness, n. నిద్రమత్తు;
  • sleeping, adj. సుప్త; నిద్రిత; కునుకిన;
    • sleeping beauty, ph. సుప్త సౌందర్యవతి; కునుకు వన్నెలాడి;
  • sleepy, adj. నిద్రాణమైన;
  • sleet, n. మంచువాన; తుషారవృష్టి; హిమవర్షం;
  • sleeves, n. pl. చేతులు; దుస్తులలో చేతిమీదకి వచ్చే భాగం;
    • puffed sleeves, ph. బుట్ట చేతులు;
  • sleuth, n. అపరాధ పరిశోధకుడు; గూఢచారి;
  • slice, n. ముక్క; తొన;
  • slide, n. (1) పలక; (2) జారుడు బల్ల; జారుడు పలక;
  • slide, v. i. జారు; కైజారు;
  • slide, v. t. జార్చు; దూర్చు;
  • slightly, adv. కొద్దిగా; చూచాయగా;
  • slip, adj. జారు;
    • slip knot, ph. జారు ముడి;
  • slip, n. చీటీ;
  • slip, v. i. జారు; దిగజారు; v. t. జార్చు;
  • slippery, adj. జారుడుగానున్న;
  • slime, adj. తుచ్ఛమైన; నిలకడ లేని;
    • slime ball, ph. తుచ్ఛుడు;
  • slime, n. పాకుడు; బంకబురద; బెందడి; ఱొంపి; విజ్జలి;
  • sling, n. (1) ఉండేలు; వడిసెల; ఒడిసెల; క్షేపణి; పిట్టలబారు; కేటిల్‌బారు; చిన్న చిన్న ఱాళ్ళు ఱువ్వడానికి వాడే ఉపకరణం; (2) భుజంమీద నుండి వస్తువులని వేలాడదీయడానికి వాడే ఉపకరణం;
  • slingshot, n. same as sling;
  • slip, n. (1) అమ్మాయిలు లోఁపల వేసుకొనే మెత్తటి దుస్తులు; (2) తప్పు దొర్లడం; (3) కాగితం ముక్క;
    • slip of the tongue, ph. మాట తడబడి నోరు జారడం;
  • slip, v. i. జారు; స్ఖలించు; జారవేయు; జారవిడుచు;
  • slip, v. t. జార్చు;
  • slip-knot, n. జారుముడి;
  • slippers, n. pl. చెప్పులు; పాదరక్షలు;
  • slippery, adj. జారుగా ఉన్న; జారెడు;
  • slipshod, adj. బిగుతులేని; ఒదులుగా ఉన్న జోళ్ల వలె; పనితనం లేని;
  • slit, n. కంత; సన్నంగా, కోలగా ఉన్న రంధ్రం; బీట; చీలిక;
  • sliver, n. చిన్న ముక్క; పిసరు; ఏకు;
  • slogan, n. నినాదం; ఘోష;
  • slope, n. నతి; వాలు; వాలుతనం; వాలుదల; ఏటవాలు; గండీ; ప్రవణత; నతిక్రమం;
  • slouch, v. i. నడుం వంచి కూర్చొను; నిటారుగా కాకుండా భుజాలు వేలాడేసిన భంగిమ;
  • slough, n. (1) (స్లఫ్) కుబుసం; జీవం లేని కణజాలం; అవసరంలేని పైపొర కాని వస్తువు కాని, ఏదైనా సరే; (2) (స్లవ్) రొంపి; బురద భూమి;
  • slough, v. i. (స్లఫ్) రాలు; రాలిపోవు; మాను, మానిపోవు;
  • slough, v. t. (స్లఫ్) పారవేయు; రాల్చు; పేకాటలో పట్టు మనదే అయినప్పుడు అక్కరలేని ముక్కని పారవెయ్యడం; see also rough;
  • slow, adj. నెమ్మది; మంద; మెల్లని; జడ;
    • slow flow, ph. మందాకిని; మంద + అకిని;
    • slow motion, ph. మందగతి;
    • slow mover, ph. మందగామి;
    • slow moving person, ph. మందయానుఁడు; మెల్లగఁబోవువాఁడు;
  • slowly, adv. నెమ్మదిగా; నింపాదిగా; మెల్లగా; మందముగా; (rel.) నిదానంగా;
  • slug, n. (1) మెట్ట జలగ; నత్తలలాగే ఇవి కూడా అతి మెల్లగా ప్రయాణిస్తాయి. అయితే నత్తలకి ఉన్నట్లు వీటికి గుల్లలు (Shells) ఉండవు. నత్తలలాగే మెట్ట జలగలు కూడా గాస్ట్రోపోడా (Gastropoda) తరగతిలోని సిగ్మురెత్రా (Sigmurethra) కుటుంబానికి చెందుతాయి. నీటి జలగల (Leeches) లాగా వీటికి రక్తం పీల్చే స్వభావం లేదు; (2) బద్ధకిష్టి; same as land slug; (3) పురాతన బ్రిటిష్ కొలమానం; The slug is a derived unit of mass in a weight-based system of measures, most notably within the British Imperial measurement system and the United States customary measures system;
  • sluggish, adj. బద్ధకపు;
  • sluggishness, n. అలసత్వం; బద్ధకత్వం;
  • sluice, n. అలుగు; మదుం; తూము; వరద గేటు; నీటిగండి; పరివాహం; తూపరాణ; దేవరాతం;
  • slum, n. మురికివాడ;
  • slumber, n. నిద్ర; కునుకు;
  • slump, n. ధరలు పడిపోయిన పరిస్థితి;
  • slur, n. (1) సరిగా ఉచ్చరించకుండా మాటలని నమిలేయడం; (2) సంగీతంలో ఒక రాగంలోంచి మరొక రాగంలోకి జారి స్వరసంకరం చెయ్యడం; (3) దూషణ;
    • racial slur, ph. జాత్యహంకారంతో పలికే దూషణ వాక్యం; దూషణ భాషణం;
  • slurp, v. i. జుర్రు;
  • slut, n. లంజ; నీతి లేని ఆడుది; పలువురు మగవారితో కులికే ఆఁడది;
  • sly, adj. టక్కరి;
    • sly fox, ph. టక్కరి నక్క; వంచన శృగాలం;

Part 3: sm-ss

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • small, adj. చిన్న; చిరు; చిట్టి; చంటి; పిట్ట; లఘు; లవ; లేశ; సన్నకారు;
    • small farmer, ph. సన్నకారు రైతు;
    • small quantity, ph. కొద్దిగా; రవంత; లవం; లేశం; లవలేశం;
  • small caltrop, n. పల్లేరు;
  • small-scale, adj. లఘు; కుటీర; సన్నకారు;
    • small-scale industry, ph. లఘు పరిశ్రమ;
  • smaller, adj. లఘీయ; అల్పీయ;
  • smallest, adj. లఘిష్ఠ; అల్పిష్ఠ; కన్య; కనిష్థ;
  • smallpox, n. స్పోటకం; మసూచికం; పెద్దమ్మవారు;
  • smartness, n. తెలివితేటలు; గడుసుతనం; వైదగ్ధ్యం; ప్రోడతనం;
  • smattering of knowledge, ph. మిడిమిడి జ్ఞానం;
  • smear, v. t. పూయు; పులుము; అలుకు; అలదు; చరుము;
  • smell, n. వాసన;
  • smell, v. t. వాసన చూడు; మూర్కొను;
  • smell, n. (1) వాసన; (2) కంపు;
    • bad smell, ph. దుర్వాసన; కంపు;
    • good smell, ph. సువాసన; వాసన;
    • musty smell, ph. ముక్క వాసన; గబ్బు కంపు; గబ్బిలాయి కంపు;
  • smelt, v. t. కరగించు; ద్రవీకరించు;
  • smelter, n. లోహాలని కరిగించే చోటు; కొలిమికొట్టు; కొలిమి;
  • smidgen, n. పిసరు;
  • smidgen, n. పిసరు; చిన్న పిసరు;
  • smile, n. చిరునవ్వు; మందహాసం; దరహాసం; స్మితం; హసితం; విహసితం;
  • smiles, n. (1) తొనలు; (2) చిరునవ్వులు;
    • orange smiles, ph. నారింజ తొనలు;
  • smirk, n. వెకిలినవ్వు;
  • smith, n. కంసాలి; కమ్మరి; బత్తుఁడు; శిల్పి; కార్మారుఁడు
    • black smith ph. కమ్మరి;
    • gold smith ph. కంసాలి;
    • wordsmith, n. పదశిల్పి; మాటలని తూచి తూచి వాడడంలో నేర్పరి; % move to W
  • smithereens, n. pl. తునాతునకలు; చిన్న చిన్న ముక్కలు;
  • smog, n. స్మాగు; పొంచు; పొగ + మంచు = పొంచు; smoke + fog = smog;
  • smoke, n. (1) పొగ; పావ; ధూమం; ధూపం; (2) దమ్ము;
  • smoke, v. i. పొగ తాగడం; దమ్ము కొట్టడం;
  • smoke, v. t. పొగ పట్టడం;
  • smoked, adj. పొగ పట్టిన; ధూపిత; ధూపాయిత;
    • smoked fish, ph. పొగ పట్టిన చేపలు;
  • smooth, adj. నునుపైన; నున్ననైన;
  • smoothness, n. నునుపు; నున్నదనం; నయగారం;
  • smudge, n. మరక;
  • smugglers, n. pl. దొంగచాటు రవాణాదారులు;
  • smuggling, n. దొంగవ్యాపారం; దొంగరవాణా;
  • smut, n.(1) లైంగిక విషయాల గురించి అశ్లీలంగా చెప్పే పుస్తకాలు, సినిమాలు; వగైరా; (2) [bot.] కాటుక; కాటుక తెగులు;
  • snack, n. చిరుతిండి; ఉపాహారం; పలహారం (ఫలహారం కాదు); అల్పాహారం; తాయిలం; తినుబండారం; నలితిండి; నాస్తా;
  • snag, n. చిక్కు; ఇబ్బంది;
  • snail, n. నత్త; కురుమింద; శంఖనఖం;
  • snake, n. పాము; చిలువ; చిల్వ; సర్పం; చక్షుశ్రవం; భుజంగం; ఉరగం; దందశూకం;
    • asp, n. నైలు నదీ ప్రాంతాలలో కనబడే ఒక పాము;
    • cobra, n. నాగుపాము; త్రాచుపాము; కృష్ణసర్పము; నల్లనాగు; ఫణకరము; ఫణి;
    • green snake, ph. పసిరిక పాము;
    • mountain snake, ph. కొండ చిలువ;
    • rattlesnake, ph. గిలక పాము;
    • Russell's viper = కట్లపాము; A venomous snake with black stripes;
    • types of snakes, కూకవేటు; సముద్రపు పాము; రక్తపెంజర; జెర్రిగొడ్డు; గడ్డపాము; గుఱ్ఱపుబెరజు; తుట్టెపురుగు; దాసరిపాము; దుంపనాగులు; పలుగుడుబాము; పుల్లురుకుపాము; పుష్కరము; పెరజు; పొడపాము; బొక్కబెరడు; ముడినాగు; మొగలిత్రాచు(మిన్నాగు);
    • snake gourd, ph. పొట్లకాయ;
    • snake stone, ph. నాగమణి; మణి; ఇది నున్నగా అరగదీసిన రాయి కాని ఎముక కాని అయి ఉంటుందని కొందరి అభిప్రాయం; దీని ప్రభావం వల్ల పాము విషం దిగిపోతుందనే నమ్మకం కేవలం గుడ్డి నమ్మకమే;
  • snap, n. చిటికె; అంగుళిస్పోటనం;
  • snap, v. t. తెంచు; తెంపు; ఛేదించు; తునియు;
  • snappiness, n. చిరాకు;
  • snare, n. ఉచ్చు; వితంసము; గుబ్బిక; పక్షులని జంతువులని పట్టే సాధనం;
    • snare for birds, ph. గుబ్బిక;
  • sneeze, n. తుమ్ము;
  • sniff, v. i. ఎగపీల్చు;
  • snip, v. t. కత్తిరించు; చిదుము; తుంచు; తునియు;
    • snip with fingers, ph. చిదుము; తుంచు;
  • snippet, n. తునక; తునియ;
  • snob, n. గర్విష్ఠి; ఎదుటివారిని చులకన చేసే వ్యక్తి;
  • snore, v. i. గుర్రుపెట్టు; గురక పెట్టు;
  • snore, n. గుర్రు; గురక;
  • snot, n. చీమిడి; ముక్కులోని అమత్వక్కు నుండి స్రవించే ద్రవం;
  • snout, n. ముట్టె; మోర; కుక్క, పంది, మొ. జంతువుల మూతి భాగం;
  • snow, n. హిమం; పొడిమంచు; పిండిమంచు; మంచు; మిహిక; నీహారం; ప్రాలేయం; ధూమిక; తుషారం;
    • snowflake, ph. మంచు రేకు;
    • snow leopard, n. మంచు కిరుబా; హిమ కిరుబా;
  • snowcap, n. హిమశృంగం;
  • snowfall, n. హిమపాతం;
  • snuff, n. ముక్కుపొడుం; ముక్కుపొడి; నస్యం;
  • snuffbox, n. పొడుంకాయ; పొడుండబ్బా;
  • so, prep. కాబట్టి;
  • soak, v. i. నాను; తడుసు;
  • soak, v. t. నానబెట్టు; తడుపు; తడిపిపెట్టు;
  • soaked, adj. నానిన; నానబెట్టిన; తడిసిన; సిక్తం;
    • blood soaked, ph. రక్తసిక్తం;
  • soaking, adj. ఉరుపు;
    • soaking pits, ph. ఉరుపు గుంటలు; ఉక్కు కర్మాగారాల్లో ఇవి ఉంటాయి;
  • soap, n. (1) సబ్బు; జిడ్డుని పోగొట్టే రసాయనం; Soap is a cleaning agent produced with an alkali metal hydroxide by the chemical reaction of a fatty acid; (2) టెలివిషన్ లో ఒకే నటీనట వర్గంతో ధారావాహికగా వచ్చే సాంఘిక కార్యక్రమం;
    • washing soap, ph. బట్టల సబ్బు;
    • soap suds, n. సబ్బు నురుగ;
  • soapnut, n. (1) కుంకుడుకాయ; (2) సీకాయ; (3) ఇషిరాసి;
  • sobriquet, [sō-bri-ˌkā], n. nickname; ex. Big Apple for New York City, Yankee for American, Jack for JFK;
  • Sochal salt, n. అక్షము; సౌవర్ఛలము; Hydrated Sodium Carbonate; Natron;
  • social, adj. సాంఘిక; సామాజిక;
    • social consciousness, ph. సామాజిక స్పృహ;
    • social media, ph. సామాజిక మాధ్యమాలు;
    • social unrest, ph. సామాజ కల్లోలం;
  • socialism, n. సామాజిక వాదం; సమాజవాదం; సామ్యవాదం;
  • society, n. సంఘం; సమాజం; సభ; కూటం; మండలి;
    • member of a society, ph. సభ్యుడు;
    • membership in a society, ph. సభ్యత్వం;
    • one present at a society, ph. సభాసదుడు;
    • president of a society, ph. సభాపతి;
  • socialist, n. సామ్యవాది;
  • socialistic, adj. సమాజవాద; సామ్యవాద;
  • sociology, n. సాంఘిక శాస్త్రం; సామాజిక శాస్త్రం;
  • sociopath, n. (def.) a sociopath is made, whereas a psychopath is born;
  • sock, n. కాల్తిత్తి; మేజోడు;
  • socket, n. ఉతక; ఉత్తరాసి;
  • sod, n. గరికచెక్క; గడ్డ్డి విత్తులు మొలిచిన మట్టి చెక్క;
  • soda, n. (1) చవుడు; సోడా ఉప్పు; (2) తాగే సోడా నీళ్లు; కొద్దిగా కార్బన్‍ డై ఆక్సైడ్‍ కరిగించిన నీళ్లు;
    • baking soda, ph. తినే సోడా; వంట సోడా; NaHCO3;
    • caustic soda, ph. దాహక సోడా; NaOH;
    • washing soda, ph. చాకలి సోడా; Na2CO3;
  • Sodium, n. సోడియం; సోడా; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 11, సంక్షిప్త నామం, Na); [Lat.] Natrium;
    • Sodium bicarbonate, ph. వంటసోడా; తినే సోడా; NaHCO3;
    • Sodium carbonate, ph. చాకలి సోడా; Na2CO3;
    • Sodium chloride, ph. ఉప్పులో ముఖ్యమైన అంశం; ఉప్పు; NaCl;
    • Sodium hydroxide, ph. దాహక సోడా;
    • Sodium nitrate, ph. సురేకారం; పెట్లుప్పు; ఛిలీ సాల్ట్‍ పీటర్‍; NaNO3;
  • sodomy, n. పుమ్మైధునం; అసహజమైన రతి క్రీడ; ఆడువారి మధ్యకాని, మగవారి మధ్యకాని, మనుష్యులకీ, జంతువులకీ మధ్యకాని జరిగే మైధునం;
  • soft, adj. మృదువైన; మెత్తనైన; కోమలమైన; కఠినంకాని; వంగెడు; సుకుమారమైన; దయగల; సుతారమైన; మృదుల;
  • soft c, ph. సకారం;
  • soft g, ph. జకారం;
    • soft drink, ph. ఆల్కహాలు లేని పానీయం; ఉదా. సోడా, కోకాకోలా, మొదలైనవి;
    • soft palate, ph. మెత్తని అంగులి; నోటి కప్పు వెనక భాగం;
    • soft water, ph సాధు జలం; నిజమైన శసాధు జలంలో ఒక్క సోడియం అయానులు తప్ప మరే ఇతర లవణాలు ఉండవు; ఈ నీటికి కాసింత ఉప్పదనం ఉంటుంది;
  • softly, adv. సాఫీగా; మెత్తగా; సున్నితంగా; నెమ్మదిగా; బిగ్గరగా కాకుండా;
  • softness, n. మార్దవం; మృదుత్వం; నయగారం;
  • software, n. తంత్రాంశం; సూక్ష్మకాయం; మృదులాంగం; కోమలాంగం; మెత్తసరుకు; తోయం; దేహి; కంప్యూటర్ల చేత పనులు చేయించుకోడానికి రాసే క్రమణికలు;
  • soil, n. మట్టి; మన్ను; మురికి; నేల;
    • alluvial soil, ph. ఒండుమట్టి; ఒండునేల;
    • barren soil, ph. ఇరిణం;
    • black cotton soil, ph. నల్లరేగడి నేల; కృష్ణమృత్తిక;
    • cotton soil, ph. రేగడి నేల; బంకమట్టి; మృత్తిక;
    • loamy soil, ph. గరుపనేల; గరుపకొడి నేల;
    • loamy clay soil, ph. గరుప బంకనేల; గరుపకొడి బంకనేల;
    • loamy sandy soil, ph. గరుప ఇసకనేల; గరుపకొడి ఇసకనేల;
    • marshy soil, ph. ఉబ్బ నేల;
    • on American soil, ph. అమెరికా గడ్డ మీద;
    • rocky soil, ph. మొరప నేల;
    • saline soil, ph. ఇరిణం;
    • topsoil, ph. మంచిమట్టి;
  • soil, v. t. మురికిచేయు; మాపు; ఖరాబుచేయు;
  • sojourn, n. మజిలీ; ప్రయాణంలో ఆగడం; కొద్ది కాలం పాటు ఇంటి దగ్గర కాకుండామరొక చోట బస చేయడం;
  • sol, adj. అర్ధద్రవ; a colloid in which the suspended particles assume a random pattern; see also gel;
  • sol, n. అంగారక గ్రహం మీద ఒక రోజు, అనగా తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం; 24 గంటల 39 నిమిషాల 35 సెకన్లు;
  • solar, adj. సౌర; సూర్య; సౌరమాన; ఖద్యోత; మార్తాండ;
    • solar calendar, ph. సౌర పంచాంగం; సౌరమానం;
    • solar cells, ph. సౌర కణాలు; సౌర విద్యుత్‍ ఘటాలు;
    • solar day, ph. సౌర దినం; ఒక సూర్యోదయం నుండి తరువాత సూర్యోదయం వరకు ఉన్న మధ్య కాలం; ఇది దినంవారీగా మారుతూ ఉంటుంది;
    • solar eclipse, ph. సూర్య గ్రహణం;
    • solar flare, ph. సౌర జ్వాల; సూర్య జ్వాల;
    • solar mean day, ph. సగటు సౌర దినం; 24 గంటలు;
    • solar system, ph. సౌర కుటుంబం; సూర్యగ్రహ మండలి; ఖద్యోత మండలం; మార్తాండ మండలం;
  • solder, n. టంకం; మాటు;
  • solder, v. t. మాటు వేయు; మాటు పెట్టు; టంకం వేయు;
    • soldering iron, ph. టంకపునాటు; మాటునాటు;
  • soldier, n. సిపాయి; బంటు;
    • foot soldier, ph. కాలిబంటు;
  • sole, adj. ఏక; ఏకైక;
  • sole, n. అరకాలు; పాదము అడుగు భాగం;
    • sole to crown, ph. నఖశిఖ పర్యంతం;
  • solemn, adj. పవిత్ర; గంభీర;
  • solemnity, n. హుందాతనం; గంభీరత; పవిత్రత;
  • solenoid, n. తీగచుట్ట; చుట్ట ఆకారంలో చుట్టిన తీగ; తూణం; ఇటువంటి చుట్ట గుండా విద్యుత్తుని పంపితే ఆ చుట్ట అయస్కాంతం వలె పనిచేస్తుంది;
  • solicit, v. t. (1) వేడుకొను; ప్రార్థించు; విన్నవించు; అర్థించు; (2) న్యాయ సలహాదారుగా పని చేయు;
  • solid, n. ఘనం; ఘనపదార్థం;
  • solid, adj. ఘన; దిట్టమైన; నమ్మకమైన;
  • solidification, n. ఘనీభవనం;
  • solidify, v. i. గడ్డకట్టు; పేరుకొను; ఘనీభవించు; ముద్దకట్టు;
  • soliloquy, n. స్వగతం; ఏకాంత సల్లాపం;
  • solitaire, n. ఒంటాట; ఏకాంతపు ఆట; ఒక్కరూ కూర్చుని ఆడుకునే ఒక రకం పేకాట;
  • solitary, adj. ఏకాంత; ఐకాంతిక; ఉపాంశు; వివిక్త; ఒకే ఒక్క; ఒంటరి;
  • solitude, n. ఏకాంతం; ఏకతం;
  • solstice, n. అయనాంతం; రవితిష్ట; (ety.) solstice = sun standing still;
    • summer solstice, ph. ఉత్తరాయనాంతం; గ్రీష్మ సంక్రమణం; జూన్ 22; ఉత్తరార్థ గోళంలో ఈ రోజున పగలు పొడుగు అత్యధికం; రాత్రి పొడుగు అత్యల్పం; ఈ రోజున సూర్యుడు కర్కాటక రేఖకి నడినెత్తి మీద ఉంటాడు; గ్రీష్మ సంక్రమణం ఏటేటా ఒకే తారీఖున రావాలని నిబంధన లేదు; కొంచెం ఇటూఅటూగా జూన్ 21-23 మధ్య తారట్లాడుతూ ఉంటుంది;
    • winter solstice, ph. దక్షిణాయనాంతం; హిమ సంక్రమణం; డిసెంబరు 22; ఉత్తరార్థ గోళంలో ఈ రోజున పగలు పొడుగు అత్యల్పం, రాత్రి పొడుగు అత్యధికం; ఈ రోజున సూర్యుడు మకర రేఖకి నడినెత్తి మీద ఉంటాడు; ఈ రోజున ఉత్త ధృవం దగ్గర సూర్యుడు నామమాత్రం ఉదయించి, ఆకాశంలో పైకి లేవకుండానే అస్తమించెస్తాడు; హిమ సంక్రమణం; ఏటేటా ఒకే తారీఖున రావాలని నిబంధన లేదు; కొంచెం ఇటూఅటూగా డిసెంబరు 21-23 మధ్య తారట్లాడుతూ ఉంటుంది;
  • solubility, n. ద్రావణశక్తి; కరగు గుణం;
  • solute, n. ద్రావితం; In chemistry, a solution is a homogeneous mixture composed of two or more substances. In such a mixture, a solute is a substance dissolved in another substance, known as a solvent.
  • solution, n. (1) పానకం; ద్రావణం; (2) పరిష్కారం; తెన్ను; సమాధానం; జవాబు; పూరణం;
    • liquid crystalline solution, ph. ద్రవస్పాటిక ద్రావణం;
  • solve, v. t. సాధించు; పరిష్కరించు;
  • solvent, n. ద్రావణి; పంచదారని నీళ్లల్లో కరిగించినప్పుడు నీరు ద్రావణి, పంచదార ద్రావితం, పానకం ద్రావణం;
  • soma, n. తనువు; శరీరం; కాయం;
  • somatic, adj. తనువు; శారీరకం; కాయ; శరీరానికి సంబంధించిన;
    • somatic cell, ph. తనుకణం; శోమకణం; పునరోత్పత్తి చేయలేని కణం;
    • somatic pain, ph. శారీరకమైన నొప్పి కండర వ్యవస్థ (muscular system)లో కాని కంకాళ వ్యవస్థ (skeletal system)లో కాని పుట్టి, చర్మం ఉపరితలం మీద ద్యోతకమవుతుంది;
  • some, adj. (1) కొంత; కొంచెం; కాస్త; ఇంచుక; (2) కొన్ని; (3) కొందరు;
    • some extent, ph. కొంత; కొంతవరకు;
    • some money, ph. కొంత డబ్బు;
    • some monkeys, ph. కొన్ని కోతులు;
    • some people, ph. కొందరు మనుషులు; కొందరు;
    • some things, ph. కొన్ని;
  • some, adv. దాదాపుగా;
  • somebody, pron. ఒకరు; ఒక వ్యక్తి;
  • somehow, adv. ఏదో ఒక విధంగా; ఎలాగో ఒకలాగ;
  • somersault, n. పిల్లిమొగ్గ;
  • sometime, adv. ఎప్పుడో ఒకప్పుడు; కదాచిత్తుగా;
  • somewhere, adv. ఎక్కడో ఒక చోట;
  • somnalent, adj. నిద్ర మత్తుగా ఉండడం;
  • somnambulism, n. నిద్రలో నడవటం;
  • somniloquence, n. నిద్రలో మాట్లాడటం;
  • son, n. కొడుకు; కుమారుడు; అబ్బాయి; పుత్రుడు; బిడ్డడు; సుతుడు; తనయుడు; ఆత్మజుడు; బొట్టె; పట్టి;
  • son-in-law, n. s. అల్లుడు; జామాత;
    • co son-in-law, ph. తోడల్లుడు; షడ్డకుడు;
  • son-of-a-bitch, n. లంజకొడుకు;
  • sons-in-law, n. pl. అల్లుళ్లు;
  • song, n. పాట; గానం; గీతం;
  • sonic, adj. శబ్దానికి సంబంధించిన; శబ్ద తరంగాలు కదిలే విధానానికి సంబంధించిన;
    • hypersonic, adj. శబ్ద తరంగాల వేగానికి 5 రెట్లు మించిన వేగంతో;
    • supersonic, adj. శబ్ద తరంగాల వేగానికి మించిన వేగంతో; శబ్ద తరంగాల వేగానికి మించి, శబ్ద తరంగాల వేగానికి 5 రెట్లు తక్కువగా ఉన్న వేగాలు;
  • soon, adj. త్వరగా; వేగిరం; శీఘ్రం; సత్వరం;
  • soot, n. మసి;
  • soothsayer, n. f. ఎరుకలసాని; ఎరుకత; సోది చెప్పే మనిషి; m. ఎరుకల వాడు;
  • soothsaying, n. సోది;
  • soothingly, adv. అనునయంగా;
  • sops, n. pl. ప్రోత్సాహకాలు; తాయిలాలు;
  • sophism, n. వంచితర్కం; వంచన తలపుతో చేసే కుతర్కం;
  • sophisticated, adj. ఆడంబర; అధునాతన; పరిష్కృత;
  • sophomore, n. నాలుగేళ్లపాటు కొనసాగే విద్యార్థి దశలో రెండవ సంవత్సరపు విద్యార్థి;
  • sorcerer, n. మంత్రగాడు; మాంత్రికుడు;
  • sordid, adj. క్షుద్ర; అసహ్య; నీతిబాహ్య;
  • sore, adj. బాధ కలిగించే; నొప్పి పుట్టించే; నొప్పి పెట్టే;
  • sores, n. pl. కురుపులు; పుండ్లు;
    • mouth sores, ph. నోటిలో పుండ్లు; నోటి పూత; జిహ్వాపాకం;
  • sorghum, n. జొన్నలు; [bot.] Sorghum bicolor;
  • sorrow, n. విచారం; వ్యాకులం; చింత; వగపు;
  • sorry, inter. మన్నించండి; క్షమించండి;
  • sort, n. రకం;
  • sort, v. t. (1) రకాలవారీగా విడగొట్టు; (2) పేర్చు; క్రమర్చు; క్రమంలో అమర్చు;
  • sortie, n. దాడి; వైమానిక దాడి;
  • sorting, v. t. విడగొట్టడం; పేర్చడం; క్రమపర్చడం;
    • sorting and merging, ph. పేర్చడం; కూర్చడం;
  • so so, adj. ఓ మోస్తరుగా; మిడి మిడి;
  • sotto voce, ph. (సాటో వోచే) తగ్గు స్వరంలో; మనలో మనమాట;
  • soul, n. ఆత్మ; అంతర్యామి; దేహి; క్షేత్రజ్ఞడు;
    • manifested soul, ph. జీవాత్మ;
    • subtle soul, ph. ఆత్మ; జీవాత్మ;
    • Supreme soul, ph. పరమాత్మ;
  • soul-searching, n. ఆత్మప్రక్షాళనం;
  • sound, adj. మంచి; దృఢమైన; ఆరోగ్యకరమైన;
  • sound, n. (1) ధ్వని; శబ్దం; సడి; చప్పుడు; క్వాణం; సద్దు; అలికిడి; సవ్వడి; నాదం; మోత; రొద; రవము; రవళి; నినాదం; మొరపం; (rel.) resound, (2) ఇరుకు మూతి గల సముద్ర శాఖ; (rel.) fjord;
    • dependent on sound, ph. శబ్దాశ్రయ;
    • non-physical sound, ph. అనాహత్ నాదం; భౌతిక ప్రక్రియల ప్రమేయం లేకుండా జనించిన నాదం; unstruck sound;
    • physical sound, ph. అహత్ నాదం; భౌతిక ప్రక్రియల వల్ల పుట్టిన నాదం; struck sound;
    • ultrasound, ph. అతిధ్వని; అత్యధికంగా ప్రకంపించే శబ్ద తరంగం;
    • sound wave, ph. శబ్దతరంగం; ధ్వనితరంగం;
  • sound, v. i. ధ్వనించు; అనిపించు;
  • sound, v. t. కదిపి చూడు; కనుక్కుని చూడు;
  • soup, n. సూపం; పులుసు; కట్టు; పలచగా చేసిన పప్పు;
  • sour, adj. పుల్ల; పుల్లన; పులి;
    • sour belch, ph. పులి తేనుపు; పుల్లత్రేన్పు;
    • sour cream, ph. పులిమస్తు; కాదంబరం;
  • source, n. మాతృక; జనకం; కాణాచి; ఆధారం; ఆకరం; మూలం; ఉత్పత్తి స్థానం; జనకస్థానం;
    • source code, ph. [comp.] జనక క్రమణిక; మూల భాషలో రాసిన క్రమణిక;
  • south, adj. దక్షిణ; తెన్;
  • South, n. దక్షిణం; వలపల; వలకడ; కుడిమట; కుడిపల; అవాచి;
  • southeast, n. ఆగ్నేయ;
  • southernwood, n. దవనం; సువాసన గల ఒక మొక్క; [bot.] Artemisia abrotanum; southern wormwood;
  • southern, adj. దక్షిణ; దాక్షిణాత్య; అవాచీన; తెంకణ; సరాజిత;
    • southern planet, ph. సరాజిత గ్రహం;
  • Southern Cross, n. త్రిశంకు నక్షత్రం; దక్షిణార్థ గోళంలో ఉన్న వాళ్లకి శిలువ ఆకారంలో కనిపించే నాలుగు నక్షత్రాల సమూహం;
  • southpaw, n. కవ్వడి; ఎడంచేతి వాటం మనిషి; according to Reader's Digest, this misnomer was apparently coined by Chicago's sportswriters in the late nineteenth century; they used this word to refer to left-handed baseball pitchers who had to pitch facing the evening sun; in that position, their left arms were toward the south; other words for left-handers are lefties, south paws, sinistrals, and port-siders;
  • southwest, n. నైరృతి దిక్కు; నైరృతి; నైఋతి; సోకుమూల;
  • souvenir, n. స్మారక సంచిక; స్మృతి చిహ్నం; జ్ఞాపిక;
  • sovereign, adj. సర్వసత్తాక;
    • sovereign republic, ph. సర్వసత్తాక గణతంత్ర రాజ్యం;
  • sovereign, n. (1) సార్వభౌముడు; రాజరాజు; చక్రవర్తి; ప్రభువు; అధిపతి; (2) నవరసు; కాసు;
  • sovereignty, n. సార్వభౌమత్వం; సార్వభౌమాధికారం; ఆధిపత్యం; పాలనాధికారం; సర్వసత్తాధికారం; రాజ్యాధిపత్యం;
  • sow, n. ఆడ పంది; ఈడొచ్చిన ఆడ పంది;
  • sow, v. t. విత్తులు నాటు;
    • sowing device, ph. జత్తిగె; జడ్డిగం;
  • sox, n. pl. మేజోళ్లు; కాల్తిత్తులు; --also see socks
  • soybean, n. సోయాచిక్కుడు; హరేణుచిక్కుడు
  • spark, n. నిప్పుకణం; విస్పులింగం; చురక; అగ్నికణం;
  • space, adj. స్థల; అంతరిక్ష; వ్యోమ; నభో; దిక్‍;
  • space, n. (1) స్థలం; జాగా; ఎడం; చోటు; దిక్కు; అంతరం; (2) బయలు; ఆవరణ; (3) ఖ; రోదసి; నభం; వ్యోమం; అంతరిక్షం; విష్ణుపదం; అంతరాళం; ఆకాశమండలం;
    • Euclidean space, ph. యూక్లిడీయ ఆవరణం; అంతరాళం;
    • expanse of deep space, ph. గగనాంగణం;
    • intervening space, ph. మధ్యంతర ఆవరణం; అంతరాళం;
    • lack of space, ph. స్థలాభావం;
    • three-dimensional space, ph. త్రిమితీయ అంతరాళం; త్రిమితీయ ఆవరణం;
    • space travel, ph. నభోయానం; అంతరిక్ష యానం;
  • spacecraft, n. నభశ్చరం; ఖేచరం;
  • spaceship, n. వ్యోమనౌక; నభోతరంగిణి; నభోతరణి; అంతరిక్ష నౌక;
  • space-time, n. స్థలకాలం; దిక్కాలం; కాలస్థలం; అంతరాళ కాలం;
    • space-time continuum, ph. స్థలకాల అఖండత్వం; స్థలకాల సమవాయం;
  • spacious, adj. విశాలమైన;
  • spade, n. (1) తౌగోల (తవ్వు + కోల); (2) చీట్లపేకలో నలుపు రంగులో ఉండే ఆకారం;
  • span, n. (1) జానెడు పొడుగు; జాన; (2) వంతెనలో రెండు స్తంభాల మధ్య దూరం;
  • spanner, n, పానా;
  • spark, n. నెరుసు; నిప్పురవ్వ; విస్పులింగం; ఆచిరాంశువు;
    • spark plug, ph. నెరసు బిరడా; పెట్రోలు కారు ఇంజనులో ఒక భాగం;
  • sparkler, n. కాకరపువ్వొత్తి;
  • spasm, n. ఈడ్పు; దుస్సంకోచం; అదుపుతప్పి కండరం సంకోచ వ్యాకోచాలు చెందడం;
    • Laryngeal spasm, ph. స్వరపేటిక ఈడ్పు; స్వరపేటిక బిగిసిపోవడం;
    • vascular spasm, ph. రక్తనాళ దుస్సంకోచం; రక్తనాళాల ఈడ్పు;
  • spasmodic, adj. అప్పుడప్పుడు;
  • spate, n. వరద; వెల్లువ;
  • spathe, n. మొవ్వు;
  • spatial, adj. దేశగత;
    • spatial extension, ph. దేశగత వ్యాప్తి;
  • spatula, n. అట్లకాడ; సలగ;
  • speak, n. మాట్లాడు;
  • speaker, n. వాగ్మి; వాచకుడు; వాచకి; అభిభాషి;
  • spear, n. ఈటె; బల్లెం; బరిసె; see also javelin;
  • special, adj. విశిష్ట; విశేష; ప్రత్యేక; పరిమిత;
    • special case, ph. విశిష్ట వ్యవహారం; విశిష్ట సంఘటన;
    • special dualism, ph. విశిష్ట అద్వైతం; రామానుజాచార్యుల మత సిద్ధాంతం;
    • special purpose, ph. పరిమిత ప్రయోజనం;
    • special rule, ph. విశిష్ట నియమం;
    • special terminology, ph. విశేష పదజాలం;
    • special theory of relativity, ph. విశిష్ట సాపేక్ష సిద్ధాంతం;
  • specialty, n. విశిష్టత; ప్రత్యేకత;
  • species, n. (1) తెగ; జాతి; ఉపజాతి; వర్గం; (2) జాతి; శాస్త్రవేత్తలు జీవకోటిని ఏడు వర్గాలుగా విడగొట్టినప్పుడు ఏడవ వర్గానికి పెట్టిన పేరు; [see also] genus, family, order, class, phylum and kingdom; two organisms belong to the same species if they tend to mate with each other giving birth to fertile offspring; Horses and donkeys mate if induced, but their offspring - mules - are not fertile;
  • specific, adj. నిర్ణీతమైన; నిర్ధిష్టమైన; అవశ్యమైన;
    • specific gravity, ph. విశిష్ట గురుత్వం; విశిష్ట గరిమ; అవశ్య గరిమ; తారతమ్య గరిమ;
    • specific heat, ph. విశిష్ట ఉష్ణం; విశిష్టోష్ణత;
  • specification, n. తబ్సీల జాబితా; చెయ్యవలసిన పనుల పట్టిక;
  • specified, adj. వ్యక్తం;
  • specificity, n. ప్రత్యేకత; విశిష్టత;
  • specify, v. t. వివరించు; నిర్దేశించు; కరతలించు;
  • specimen, n. నమూనా; మచ్చు; మాదిరి;
  • speck, n. నలక; నలుసు; నెరుసు;
  • spectacle, n. దృశ్యం;
  • spectacles, n. pl. కండ్లజోడు; ముక్కద్దాలు; సులోచనాలు; ఉపనేత్రాలు;
  • spectacular, adj. కళ్లు జిగేలుమనిపించే;
  • spectators, n. pl. ప్రేక్షకులు; చూపరులు; ఈక్షకులు;
  • spectrograph, n. వర్ణపటలేఖిని; వర్ణమాలాచిత్రం; వర్ణలేఖిని;
  • spectrometer, n. వర్ణపటమాపకం;
  • spectroscope, n. వర్ణపటదర్శని; వర్ణమాలాదర్శని;
  • spectroscopy, n. వర్ణమాలాదర్శనం; వర్ణమాలని అధ్యయనం చేసే శాస్త్రం;
    • Raman spectroscopy, ph. రామన్ వర్ణమాలాదర్శనం;
  • spectrum, n. వర్ణపటం; వర్ణమాల; కాంతిని గాజు పట్టిక ద్వారా పంపితే కనిపించే సకలవర్ణ పటం;
  • speculation, n. సట్టా;
    • speculation business, ph. సట్టా వ్యాపారం;
  • speech, n. (1) ప్రసంగం; ఉపన్యాసం; (2) వాక్కు; ఉక్తి;
    • gracefulness of speech, ph. వాగ్విలాసం;
    • keynote speech, ph. కీలకోపన్యాసం;
    • telegraphic speech, ph. తంత్యోక్తి;
  • speed, n. వేగం; వడి; జోరు; ధృతి; త్వరితం; జవం; see also haste;
    • high speed, ph. శరవేగం; జవాతిశయం;
  • spell, n. మంత్రశక్తి; మంత్రం;
  • spell, v. i. వర్ణక్రమం చెప్పగలుగు;
  • spelling, n. వర్ణక్రమం; పదగుణితం; వ్రాకట్టు; స్పెల్లింగు;
  • spend, v. i. ఖర్చుపెట్టు; వ్యయపరచు;
  • sperm, n. శుక్రం; రేతస్సు;
  • sperm cell, n. శుక్ర కణం;
  • spermatorrhea, n. శుక్ర నష్టం; శుక్ర స్రావం;
  • spermatozoa, n. శుక్ర కణం; పురుష బీజకణం;
  • spend, v. i. (1) ఖర్చు పెట్టు; వెచ్చించు; వ్యయపరచు; (2) గడుపు;
    • spend some time, ph. కొంత కాలం గడుపు;
  • sperm, n. వీర్యం; పురుష జననాంగాలలో తయారయే వీర్య కణాలు; rel. semen;
  • spew, v. t. వెళ్లగక్కు;
  • sphenoid bone, n. కీలాస్థి; జతూకాస్థి; a compound bone that forms the base of the cranium, behind the eye and below the front part of the brain;
  • sphere, n. (1) గోళం; ఉండ; (2) మండలం; ప్రదేశం; ఆవరణం;
    • sphere of action, ph. వ్యవహార మండలం;
  • spherical, adj. గోళాకార; గోళీయ;
  • spheroid, n. గోళాభం;
  • spheroidal, adj. గోళాభీయ;
  • Spica, n. చిత్ర; చిత్రా నక్షత్రం; కన్యారాశిలో నక్షత్రం;
  • spice, n. కటువు; కారము;
  • spick and span, ph. [idiom] నిగనిగలాడేటట్లు;
  • spicy, adj. కారం; కటు;
    • spicy substance, ph. కారపు వస్తువు; కటు ద్రవ్యం;
  • spider, n. సాలీడు; సాలెపురుగు; నేతపురుగు; అష్టపాది; తంతునాభం; ఈగపులి; లూతపురుగు; అల్లికపురుగు;
  • spies, n. pl. చారులు; గూఢచారులు;
  • spike, n. శంకువు;
  • spill, v. i. ఒలుకు; పొర్లు;
  • spill, v. t. ఒంపు; తొళికించు; ఒలికించు;
  • spillway, n. పొర్లుకట్ట; పొర్లుమదుం; తొళకరి తోము; ఒలుకుదారి; ప్రవాహ మార్గం; మరిగొమ్ము; అలుగు; పరీవాహం;
  • spin, v. t. వడుకు;
  • spin, n. (1) ఆత్మభ్రమణం; భ్రమణం; (2) [idiom] ఉన్న విషయాన్ని తనకి అనుకూలంగా మలిచి చెప్పడం; (3) [phy.] అణుప్రమాణంలో ఉండే రేణువులకి సహజసిద్ధంగా ఉండే ఒక లక్షణం; ఒక ఎలక్ట్రానుకి "స్పిన్" ఉందంటే అది బొంగరంలా తిరుగుతోందని వ్యాఖ్యానించకూడదు; బొంగరం లాగనే కొన్ని పరమాణు రేణువులు కూడ సహజసిద్దమైన కోణీయ భారవేగం (intrinsic angular momentum) అనే గణిత లక్షణాన్ని ప్రదర్శిస్తాయి కనుక వాటికి "స్పిన్" ఉందని చమత్కరిస్తాము;
    • spin angular momentum, ph. భ్రమణ కోణీయ భారవేగం;
  • spinach, n. గోళికూర; పాలక్; దుంపబచ్చలి వంటి ఆకు కూర; చుక్కాకు; [bot.] Spinacia oleracea;
  • spinal, adj. మైరవ; మజ్జా; సుమామ్న;
    • spinal canal, ph. మజ్జా నాళిక; సుమామ్న నాళిక;
    • spinal cord, ph. వెన్నుపాము; మజ్జా రజ్జువు; సుమామ్న నాడి; కశేరుక నాడి; మేరువు; కుండలి;
    • spinal vertebra, ph. వెన్నుపూసలు;
  • spindle, n. కదురు; తుర్కం; నూలు వడికే కదురు; తంతుకాష్ఠం;
  • spine, n. వెన్ను; వెన్నెముక;
  • spinster, n. (1) అవివాహిత; బ్రహ్మచారిణి; ప్రస్తుతం పురుష సంపర్కం లేని ఆడది; భర్త లేని స్త్రీ; విధవ కాదు, కన్య కాదు; (2) నూలు వడికే స్త్రీ;
  • spiral, n. సర్పిలం; మురి; శంఖావర్తం;
    • right-handed spiral, ph. ఎల మురి;
  • spiral, adj. సర్పిల; శంఖాకార; శంఖావర్త;
    • spiral-shaped, ph. సర్పిలాకృతి;
  • spirit, n. (1) ఆత్మ; జీవాత్మ; అంతరాత్మ; మూలశక్తి; (2) ప్రేతాత్మ; పిశాచం; దయ్యం; (3) మూలార్థం; అంతరార్థం; పరమార్థం; (4) సారా; మద్యం; ద్రావకం; (5) స్పూర్తి; ఉత్సాహం;
    • finite spirit, ph. ప్రత్యగాత్మ;
    • infinite spirit, ph. అనంతాత్మ;
    • spirit lamp, ph. సారా దీపం; మద్యార్కదీపం; స్పిరిట్ దీపం;
    • spirit of cooperation, ph. సహకార స్పూర్తి;
  • spiritual, adj. ఆధ్యాత్మిక; పారమార్థిక; ఆధిదైవిక; ఆత్మజ్ణాన; ఆత్మిక;
  • spiritualism, n. ఆధ్యాత్మిక వాదం;
  • spirulina, n. స్పిర్యులీనా; an organism that grows in both fresh and saltwater; It is a type of cyanobacteria, which is a family of single-celled microbes that are often referred to as blue-green algae.
  • spit, n. ఉమ్మి; లాలాజలం;
  • spit, v. i. ఉమ్ము;
  • spite, n. కార్పణ్యం; జుగుప్స;
  • spittoon, n. కాళంజి; తమ్మ పడిగె; ఉమ్మి వేసే గిన్నె;
  • spittle, n. ఉమ్మి; లాలాజలం;
  • splash, v. t. చిందించు;
  • splash, v. i. చిందు;
  • splatter, v. i. చిందు;
  • spleen, n. ప్లీహం; గోళాకారపు ఎరన్రి గ్రంధి;
  • splendid, adj. ఉజ్వల; జేగీయమాన;
  • splendor, n. వైభవం;
  • splice, n. అతుకు;
  • splint, n. బద్ద; కొయ్య బద్ద; దెబ్బలు తగిలినప్పుడు కట్టు కట్టడానికి అప్పుడప్పుడు వాడే సాధనం;
  • splinter, n. పేడు; పుల్ల; పుడక; చీలిక; యష్టి;
  • splinter, v. t. చీలిపోవు; విడిపోవు;
  • split, n. చీలిక; చీరిక;
  • split, adj. చీలబడ్డ; చీల్చిన;
  • split, v. t. చీరు; చీల్చు; చించు; వ్రచ్చు; వ్రక్కలించు; ఛేదించు;
    • split chickpeas, n. శనగపప్పు;
    • split peas, n. బటానీ పప్పు;
  • splitting, n. పరిస్పోటనం;
  • spoke, n. శలాకం; ఊస; చువ్వ; ఆకు; లాక; probe; pin; peg;
  • spoke, v. t. past tense of "speak;"
  • spoil, v. i. చెడు; పాడగు; బెడియు; ఆరుమూడగు; బుసిపోవు; కర్యావైకల్యమగు;
  • spondylosis, n. వెన్నుముకలో అరుగుదల (degeneration) వలన వచ్చే జబ్బుని డిజెనెరేటివ్ డిస్క్ డిసీజ్ (degenerative disc disease) లేదా స్పాండెలోసిస్ (spondylosis) అంటారు;
    • cervical spondylosis, ph. మెడలో వస్తే సెర్వికల్ స్పాండెలోసిస్ అంటారు; స్పాండెలోసిస్ వలన మెడలో వెన్నుపాము నలిగితే దాన్ని మైలోపతి (myelopathy) అంటారు.
    • lumbar spondylosis, ph. నడుములో వస్తే లంబార్ స్పాండెలోసిస్ అంటారు.
  • sponge, n. (1) స్పంజి; నీటిని పీల్చే పదార్థం; (2) ఒక రకం సముద్రపు జంతువు;
  • sponsored, adj. ప్రాయోజిత; మనకు ఉచితం, వారికి భవిష్యత్తులో ప్రత్యక్షం గా కానీ పరోక్షంగా కానీ ఆర్జనం;
  • sponsors, n. ప్రాయోజితులు;
  • spontaneous, adj. అయత్నకృత; ఆకస్మిక; ఐచ్ఛిక; సద్యస్పూర్తితో;
  • spontaneity, n. సద్యస్పూర్తి;
  • spoon, n. చెంచా; ఉద్దరిణి; గరిటె; పాణికి; స్పూను; దర్వి;
    • deflagrating spoon, ph. ఒంపు గరిటె; మంట గరిటె; పోపు గరిటె; ఉద్దహన చెంచా;
    • perforated spoon, ph. జల్లి గరిటె;
    • table spoon, ph. చెంచా; 15 ml ప్రమాణం;
    • tea spoon, ph. మెల్లి గరిటె; 5 ml ప్రమాణం;
  • spoonerism, n. అస్తవ్యస్త పదప్రయోగం; స్పూనరీయం; a linguistic somersault that turns a "well-oiled bicycle" into a "well-boiled icicle" and "tinglish errors" into "English terrors"; (ety.) named after Rev. William Archibald Spooner (born 1844); Examples in Telugu include, "చొక్కరు, నిక్కా", పుహం, సింలి";
  • sporadically, adv. అప్పుడప్పుడు; చిలకేటుగా;
  • spore, n. సిద్ధబీజం;
  • sport, n. సయ్యాట; అలవోక; క్రీడ; కేళి; హేల; లీల; చీటకం; ఆట;

---Usage Note: sport, game, recreation, hobby

  • ---A sport is an activity that requires physical effort and skill, has rules and is done in competition. Use recreation to talk about all activities that people do in order to relax. Use game to talk about a particular competition in a sport. You can also use game to talk about a competition requiring mental skill, knowledge and luck: a game of cards. A hobby is an activity that you do in your spare time.
  • sportsman, n. ఆటగాడు; చీటకుడు;
  • spot, n. (1) మచ్చ; డాగు; (2) స్థానం; ప్రదేశం;
  • spotless, adj. నిరంజన;
  • spouse, n. జీవిత భాగస్వామి;
  • spout, n. జలదారి;
  • spp., suff. జాతిది; ద్వినామ పద్ధతిలో జంతువుల పేర్ల చివరకాని, మొక్కల పేర్ల చివర ఈ అక్షరాలు వస్తే ఆ ప్రాణి జాతి ఇదమిత్థంగా తేలలేదని అర్థం;
  • sprain, n. ఇరుకు; బెణుకు;
  • spray, v. t. చిమ్ము; జల్లు; ఎగజల్లు; చిలకరించు;
  • spray, n. శీకరము; జల్లు;
  • sprayer, n. చిమ్మనగ్రోవి; చిమ్ముకారి;
  • spread, v. i. వ్యాపించు; విస్తరించు; అత్తమిల్లు; ఉ. "అంగళ్ల ముంగిళ్ల నత్తమిల్లిన ముత్తియంపు రంగవల్లుల మీద" - జైమిని భారతం
  • spread, v. t. పరుచు; నెరుపు; వెదజల్లు; జల్లు; పంచారించు; పంచు;
  • spread, n. (1) పరుచుకొనేది; నెరుపుకొనేది; పులుముకొనేది; (2) విస్తృతి;
    • bed spread, ph. పరుపుమీద పరుచుకొనేది; దుప్పటి;
    • bread spread, ph. రొట్టె మీద రాసుకొనేది;
  • sprig, n. (1) రెమ్మ; రెబ్బ; (2) మొలక; పిలక; (3) పిల్లకాయ; వంశాకురం;
    • sprig of curry plant, ph. కరివేపాకు రెబ్బ;
    • sprig of banana plant, ph. అరటి పిలక;
  • spring, n. (1) వసంతం; వసంత కాలం; వసంత రుతువు; (2) నీటిబుగ్గ; జల; జెల; ఊట; ఎగదట్టిక; ఉద్గమం; (3) తీగచుట్ట; స్ప్రింగు;
    • hot water spring, ph. వేడినీటి జల; వేడినీటి బుగ్గ;
    • spring equinox, ph. వసంత విషువత్;
    • spring tide, ph. నిండు పోటు; పౌర్ణమికి, అమావాస్యకీ బాగా ఉదృతంగా వచ్చే పోటు;
  • sprinkle, v. t. జల్లు; ఎగజల్లు; చిలుకు; చిలికించు; చిమ్ము; ప్రోక్షించు;
  • sprinkle, n. తూర; జల్లు; వాన జల్లు;
  • sprinkler, n. ప్రోక్షకి; ప్రోక్షకుడు;
  • sprint, n. పరిగెత్తు; దౌడుతీయు;
  • sprout, v. i. మొలుచు; అంకురించు; పొటమరించు; కందళించు;
  • sprouts, n. మొలకలు; నారు; నవోద్భిజాలు; అభినవోద్భిజాలు; అంకురాలు; ఈరికలు; కందళికాలు; shoots;
  • spun, adj. వడకిన;
    • spun yarn, ph. వడకిన నూలు; దారం;
  • spur, n. కయ్య; చీలిక; పక్క దారి;
  • spurious, adj. ప్రక్షిప్త;
  • sputum, n. ఉమ్మి;
  • spy, n. చారుడు; చారిణి; గూఢచారి;
  • spycraft, n. గూఢచర్య; అపసర్పణం;
  • sphygmomanometer, n. రక్తపు పోటు లేదా BP కొలిచే పరికరము
  • squabble, n. తగాదా; తోకపీకుడు; కలహం; జగడం;
  • squall, n. జడిజల్లు; జడివాన; కొద్దికాలంపాటు ఉధృతంగా పడే వాన;
  • squander, v. t. దుర్వినియోగం చేయు; దుర్‌వ్యయం చేయు; వృధా చేయు; నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టు;
  • square, adj. చతురస్ర; వర్గ;
    • square foot, ph. చతురపుటడుగు;
    • square root, ph. వర్గమూలం;
    • square wave, ph. చతురస్ర తరంగం;
  • square, n. (1) చతురస్రం; సమచతురస్రం; చదరం; నలుచదరం; చవుకం; చచ్చవుకం; ఎదురెదురు భుజాలు సమంగానూ, సమాంతరంగానూ ఉండి నాలుగు సమకోణాలు ఉన్న చతుర్భుజం; (2) వర్గం; (3) కూడలి; శృంగాటకం; రచ్చబండ;
    • carpenter's square, ph. మూలమట్టము;
    • inverse square, ph. విలోమ వర్గం;
    • perfect square, ph. (1) చచ్చవుకం; నలుచదరం; సంపూర్ణ చతురస్రం; (2) సాంగమైన వర్గు;
  • squash, n.ఒక రకం గుమ్మడి కాయ; దోసకాయ;
    • chayote squash, ph. బెంగుళూరు వంకాయ;
    • squash gourd, ph. గుమ్మడి కాయ;
  • squat, v. i. గొంతుక్కూర్చొను; గొంతుకలా కూర్చొను;
  • squeak, v. i. కిర్రుమను; కీచుమను;
  • squeeze, v. t. (1) నొక్కు; పిండు; పిసుకు; (2) ఇరికించు;
  • squint, n. మెల్ల;
  • squire, n. కామందు; భూస్వామి; a large land owner;
  • squirrel, n. ఉడుత;
  • squishy, adj. పిసపిసలాడు; పిసకడానికి వీలుగా ఉండు; మెత్తగాను, తడిగాను ఉండు;

Part 4: st-sz

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • stab, v. t. కత్తితో పొడుచు;
  • stability, n. నిశ్చలత; స్థిరత్వం; సుస్థిరత్వం; నిలకడ; స్థయిర్యం; స్థాయిత్వం; ప్రతిష్ఠ;
  • stabilization, n. స్థిరీకరణ;
  • stable, n. (1) నిశ్చలం; స్థిరం; సుస్థిరం; (2) గుర్రాలసాల; అశ్వశాల; కొట్టం; మందడి; లాయం;
  • stack, n. దొంతర; దొంతి; బొత్తు; వాము;
  • stack, v. t. దొంతి పెట్టు; పేర్చు;
  • staff, n. (1) దండము; కర్ర; గడ; (2) సిబ్బంది; అధికారవర్గం; నౌకర్లు;
  • stag, n. మగ లేడి; జింక;
  • stage, n. (1) దశ; మజిలీ; అంచె; (2) వేదిక; (3) రంగం; రంగస్థలం; నాటకరంగం;
    • backstage, ph. నేపథ్యం; నైపథ్యం;
    • stage fright, ph. సభాకంపం; సభలో మాట్లాడడానికి భయపడడం;
    • stage lighting, ph. రంగోద్దీపనం;
    • stage manager, ph. సూత్రధారుడు;
  • stage, v. t. నాటకమాడు; మభ్యపరచు;
  • stagnation, n. స్తబ్దత; ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోవడం;
  • stain, n. మరక; డాగు; కళంకం; చార;
    • blood stain, ph. రక్తపు మరక; రక్తపు డాగు;
    • water stain, ph. నీటి చార;
  • staining, n. వర్ణసంధానం; అభిరంజనం;
  • stainless, adj. నిష్కళంకం; మచ్చలేని; అకళంకము;
  • staircase, n. మేడ మెట్లు; సోపానశ్రేణి; మెటికలు; తాపలు;
  • stairs, n. మేడ మెట్లు; సోపానశ్రేణి; మెటికలు; తాపలు;
  • stake, n. (1) శంకువు; (2) పణం; పణితం; ఒడ్డిమి; ఒడ్డిదం; పన్నిదం; జూదంలో ఒడ్డే పందెం;
  • stakeholder, n. ఒడ్డిమిదారు;
  • stale, adj. అడవ; పాచిపోయిన; తాజాతనం కోల్పోయిన; పాతబడిన;
    • stale food, ph. పాచిపోయిన ఆహారం;
    • stale smell, ph. ముక్క వాసన; అడవ వాసన;
    • stale stuff, ph. అడవ సరుకు;
  • stalemate, n. ప్రతిష్టంభం; తట్టు;
  • stalk, n. (1) కాండం; గడ; (2) తొడిమె;
  • stalk, v. t. వేటాడు; పొంచియుండు;
  • stall, n. బడ్డీ; వ్రజం; దుకాణం; అంగడి; కొట్టు; ఖద;
  • stallion, n. మగ గుర్రం; గుండు;
  • stalwart, n. దిట్ట;
  • stamen, n. కేసరములు; కింజిల్కములు; పురుషపత్రములు;
  • stamina, n. ఓపిక; సత్తా; సహనశక్తి; సామర్థ్యం;
  • staminode, n. వంధ్యకేసరం; పుప్పొడితిత్తిలేని పుంకేసరం;
  • stammer, n. నత్తి;
  • stammer, v. t. నత్తితో మాట్లాడు;
  • stamp, n. (1) తపాలాబిళ్ల; సికా; స్టేంపు; (2) ముద్ర; మొహరు;
    • postage stamp, ph. తపాలా బిళ్ల; తపాలా ముద్ర;
    • stamp of approval, ph. ఆమోద ముద్ర;
  • stamp, v. t. ముద్రకొట్టు; ముద్రవేయు; టపటపా బాదు;
  • stamped, n. ముద్రాంకితము;
  • stampede, n. దొమ్మీ; తొక్కిసలాట;
  • stamping, n. ముద్రకొట్టుట; ముద్రవేయుట;
  • stance, n. స్థిరచిత్తము; నిశ్చితాభిప్రాయము; ఉద్దేశము; భంగిమ;
  • stand, n. (1) నిలిపే స్థలం; స్థావరం; (2) బడ్డీ; మంచె; (3) దిమ్మ;
    • bus stand, ph. బస్సులు నిలిచే స్థలం;
    • concession stand, ph. రాయితీ బడ్డీ;
    • cycle stand, ph. సైకిళ్లు నిలిపే స్థలం;
    • lamp stand, ph. దీపపు దిమ్మ;
  • stand, v. i. (1) నిలబడు; (2) భరించు; సహించు; తట్టుకొను;
    • I cannot stand this heat, ph. ఈ వేడి నేను భరించలేను;
  • stand down, ph. తగ్గు; దిగు;
  • standard, adj. ప్రామాణిక;
  • standard, n. (1) స్థాయి; అంతస్తు; తరగతి; (2) ప్రమాణం; ప్రామాణికం; ఆదర్శం;
    • aesthetic standard, ph. అలంకారిక ప్రమాణం;
    • aristocratic standard, ph. కులీన ప్రమాణం;
    • colloquial standard, ph. వ్యావహారిక ప్రమాణం;
    • global standard, ph. భౌగోళిక ప్రమాణం;
    • prescribed standard, ph. నిర్దేశిత ప్రమాణం;
    • regional standard, ph. ప్రాంతీయ ప్రమాణం;
    • standard time, ph. ప్రమాణ కాలం;
    • sub-standard, ph. న్యూన ప్రామాణికం;
  • standardization, n. స్థాయీకరణం; స్థిరీకరణం; ప్రామాణీకరణం;
  • standardize, v. t. స్థాయీకరించు; ప్రమాణీకరించు; స్థిరీకరించు;
  • standing, adj. నిలబడి ఉన్న; ప్రస్తుతం అమలులో ఉన్న;
    • standing orders, ph. స్థిరాజ్ఞలు;
    • standing waves, ph. స్థిర తరంగాలు; నిలకడ తరంగాలు;
  • stanza, n. చరణం; పద్యం;
  • stapes, n. కర్ణాంతరాస్థి; అంకెవన్నె ఎముక; రికాబు; మధ్య చెవిలో ఒక ఎముక; ఇదే మానవ శరీరంలో అతి చిన్నదైన ఎముక;
  • staple, adj. ముఖ్యమైన; ప్రధానమైన;
    • staple food, ph. ముఖ్యమైన ఆహారం;
  • staple, n. (1) నాగవాసం; మడతపిన్ను; కాగితాలని కట్టడానికి వాడే పిన్నులాంటి ఉపకరణం; (2) పింజ; పత్తి గింజల పరిమాణాన్ని తెలిపే ఒక కొలత;
    • long staple, ph. పొడుగు పింజ; పొడుగు గింజ;
    • long staple cotton, ph. పొడుగు పింజ పత్తి;
  • stapler, n. నాగవాసిని;
  • star, n. నక్షత్రం; తార; తారక; చుక్క;
    • cinema star, ph. సినిమాతార; తెర తార;
    • collapsed star, ph. కూలిన తార; నల్ల నక్షత్రం;
    • evening star, ph. పగటిచుక్క;
    • morning star, ph. పగటిచుక్క;
    • star cluster, ph. నక్షత్రరాశి;
    • starboard side, ph. వెలపల; బోడిద; బండికి కుడి వైపు; right side of a boat, ship, aircraft or any vehicle;
  • starch, n. పిండి; పిండి పదార్థం; గంజి; మండము;
  • starch, v. t. గంజిపెట్టుట;
  • star gooseberry, n. రాచ ఉసిరిక; రాచ ఉసిరి; [bot.] Averrhoa acida of the Oxalidaceae family;
  • star fruit, n. కరంబోలా; కమారంగా; [bot.] Averrhoa carambola of the Oxalidaceae family;
  • start, v. i. (1) ఉలిక్కిపడు; తుళ్లిపడు; భయపడు; (2) బయలుదేరు;
  • start, v. t. (1) మొదలుపెట్టు; ఆరంభించు; ఉపక్రమించు; ప్రారంభించు; కానివ్వు; (2) నడపడం మొదలు పెట్టు;

---Usage Note: start, begin

  • ---Usually these words mean the same thing. However, start has some special meanings. Use start to talk about making a machine work: start your car! You could also use start to talk about making something begin to exist: He started a new business.
  • startle, v. i. ఉలికిపడు; తుళ్లిపడు; అదరిపడు; భయపడు;
  • startle, v. t. భయపెట్టు;
  • startup, n. అంకుర సంస్థ; అంకుర వ్యాపారం; అభినవోద్భిజ సంస్థ; మొలక పొత్తు; మొలక కూటమి;
  • starve, v. i. పస్తు ఉండు; తిండి లేకుండా ఉండు;
  • starve, v. t. పస్తు పెట్టు; తిండి లేకుండా మాడబెట్టు;
  • starveling, n. అక్కుపక్షి; ఆకలికి బక్కచిక్కిన జీవి;
  • state, n. (1) స్థితి; సంస్థితి; పరిస్థితి; దశ; స్థాయి; అవస్థ; (2) రాజ్యం; రాష్ట్రం;
    • drunken state, ph. మందుపట్టు మీద ఉన్న స్థితి;
    • equilibrium state, ph. సమతా స్థితి;
    • excited state, ph. ఉద్రిక్త స్థాయి; ఉద్రిక్త స్థితి;
    • ground state, ph. భూ స్థాయి; భూస్థితి;
    • welfare state, ph. శ్రేయోరాజ్యం;
  • state, v. t. చెప్పు; నుడువు; వక్కాణించు;
  • statement, n. (1) ప్రవచనం; సూక్తం; కంఠోక్తి; (2) వాంగ్మూలం; (3) యాదాస్తు; హిస్సాబు; memorandum;
    • deathbed statement, ph. మరణ వాంగ్మూలం;
    • oral statement, ph. వాంగ్మూలం;
    • written statement, ph. కైఫీయతు;
  • statesman, n. రాజ్యతంత్రి; రాజ్యాంగవేత్త;
  • statesmanship, n. రాజ్యతంత్ర చతురత; రాజనీతిజ్ఞత; రాజకీయ కుశలత;
  • static, adj. స్థిర; నిశ్చల;
    • static electricity, ph. స్థిర విద్యుత్తు; a stationary electric charge, typically produced by friction, which causes sparks or crackling or the attraction of dust or hair;
  • static, n. (1) స్థిర విద్యుత్తు; (2) రొద;
  • statics, n. స్థితి శాస్త్రం; సమతౌల్యం యొక్క లక్షణాల అధ్యయనం; వస్తువులపై బలములు ప్రసరించినప్పుడు అవి సమతౌల్యం మీద చూపే ప్రభావాన్ని గురించి విచారించే శాస్త్రం;
    • hydrostatics, ph. జలస్థితి శాస్త్రం;
  • station, n. తావు; నిలయం; ఆగాణం; స్థలం; ప్రదేశం; స్థావరం; ఇరవు; చావడి; వ్రజం; ఠాణా; స్టేషను;
    • ground station, ph. భూస్థావరం;
    • police station, ph. కొత్వాలు చావడి; పొలీసు ఠాణా: ప్రోపోరు ఆగాణం;
  • stationary, adj. స్థావర; స్థిర; స్థాన్ను; స్తంభ; స్తబ్ధ; ప్రతిష్ఠిత; అచల; నిష్పంద; నియత; నిలకడ అయిన; చలనం లేని; ప్రచలిత;
  • stationary, n. అచలనం; స్థావరం; స్థిరం; నియతం; స్తబ్ధం; ప్రచలితం;
  • stationery, adj. రాతకి సంబంధించిన;
    • stationery store, ph. కాగితాలు; కలాలు; మొదలైన రాత పనిముట్లు దొరికే కొట్టు;
  • statistical, adj. సాంఖ్య; గణాంక;
    • statistical profile, ph. గణాంక వైఖరి;
  • Statistics, n. (1) సంఖ్యాశాస్త్రం; గణాంక శాస్త్రం; మచ్చుకి ఆధారంగా చేసుకుని అసలు నిజస్వరూపం నిర్ధారించే శాస్త్రం; Statistics is the science of gathering, describing, and analyzing data; (2) గణాంకాలు; సంఖ్యాక్రమాలు; Statistics are the actual numerical descriptions of sampled data such as mean, variance, median, etc.;
    • Bayesian statistics, ph. బేస్ గణాంకశాస్త్రం;
    • official statistics, ph. అధికార గణాంకాలు;
  • statue, n. ప్రతిమ; విగ్రహం; మూర్తి;
  • status, n. అంతస్తు; హోదా; పరపతి; స్థితి; పదవి; ప్రతిపత్తి;
    • independent status, ph. స్వతంత్ర ప్రతిపత్తి;
    • special status, ph. ప్రత్యేక ప్రతిపత్తి; ప్రత్యేక హోదా:
    • status quo ante, ph. యథాతథస్థితి;
  • statute, n. చట్టం;
  • statutory, adj. విధ్యుక్త; చట్టబద్ధ; చట్టసమ్మత; శాసనాత్మక; శాసనప్రోక్త; శాసన విహిత;
  • stay, v. i. ఉండు; ఉండండి;
    • stay on the line, ph. టెలిఫోను మీద ఉండండి;
  • steadfastness, n. స్థైర్యం; తితీక్ష;
  • steady, adj. నిదానమైన; స్థిమితమైన; అచ్యుతమైన;
  • steadily, adv. నిలకడగా; నిదానంగా; స్థిమితంగా; నెమ్మదిగా;
  • steadiness n. నిలకడ; కుదిరిక; స్థైర్యం;
  • steady state, adj. కూటస్థ; సర్వకాలములలో ఒకేలా ఉండునది;
  • Steady State Theory, ph. కూటస్థ వాదం; యథాస్థితి వాదం; అచ్యుత వాదం;
  • steal, v. t. దొంగిలించు; ఎత్తుకెళ్ళు; తస్కరించు; అపహరించు;
  • stealing, n. దొంగిలించడం; తస్కరించడం; అపహరణం; హరణం;
  • stealthy, adv. దొంగచాటుగా; గుప్తంగా; గూఢంగా; నక్కినట్లు; అదృశ్యమానంగా; మరొకరి కంట పడకుండా;
  • steam, n. ఆవిరి; నీటి ఆవిరి; ఊష్మం;
    • steam engine, ph. ఆవిరి యంత్రం;
  • steamer, n. (1) ఆవిరిని పుట్టించే పాత్ర; (2) పొగ ఓడ; ఆవిరి యంత్రంతో నడిచే ఓడ;
  • stereotype, n. మూసధోరణి;
  • stearic acid, n. ఘృతికామ్లం;
  • steel, n. ఉక్కు;
    • mild steel, ph. మేదక ఉక్కు;
  • steep, adj. ఎక్కువ వాలుగా ఉన్న;
  • steep, v. t. నానబెట్టు; తడుపు;
  • steeped, adj. భావన; నానబెట్టిన; తడిప్పేట్టిన;
    • steeped ginger, ph. భావన అల్లం;
  • steerability, n. చోదనార్హత; చోదకశక్తి; చోదకత్వం;
stele=శిల్పాక్షరాలు ఉన్న పొడుగాటి శిల
  • stele, n. ప్రసరణ స్తంబం; పొడుగాటి రాయి
  • stellar, adj. నాక్షత్ర; నక్షత్రాలకి సంబంధించిన;
  • stellate, adj. నక్షత్రాకార; తారాకార;
  • stem, n. (1) కాడ; కాండం; బోదె; (2) వంశమూలం; అంకురం;
    • stem cells, ph. అంకుర కణాలు; మూల కణాలు;
  • stem, v. t. (1) అదుపులో పెట్టు; ఆపు; నిరోధించు; (2) పుట్టు; ఉద్భవించు; (note) విరుద్ధార్థములతో ఉన్న మాట;
  • stench, n. కుళ్లుకంపు; దుర్వాసన; కంపు;
  • stenosis, n. రక్తనాళపు ద్వారం సన్నబడుట; నాళపు ద్వారం సన్నబడుట;
  • step, n. (1) మెట్టు; పర్వం; (2) అడుగు;
    • step forward, ph. ముందంజ వేయు; ముందుకి వచ్చు; ముందడుగు వేయు;
  • stepfather, n. సవితి తండ్రి; మారటి తండ్రి;
  • stepmother, n. సవితి తల్లి; మారటి తల్లి;
  • steps, n. (1) మెట్లు; సోపానాలు; పావంచాలు; (2) అడుగులు;
    • hasty and rash steps, ph. దుందుడుకు అడుగులు;
  • stereotype, n. గతానుగతికం; మార్పులేనిది;
  • stereotypically, adv. గతానుగతికంగా;
  • sterile, adj. బంజరు; గొడ్డుపోయిన; వంధ్య;
  • sterility, n. వంధ్యత్వం;
  • sterilization, n. బంజరు చెయ్యడం; వంధ్యీంచడం; సంతాన నిరోధక చికిత్స;
  • stern, n. పడవ వెనుకభాగం;
  • sternum, n. ఉరస్థి; రొమ్ము ఎముక; బోర ఎముక;
  • sternutation, n. తుమ్ము;
  • steroid, n. ఘృతార్ధం; నెయ్యివంటి పదార్థం;
    • steroid hydrocarbon, ph. ఘృతార్థ ఉదకర్బనం;
  • sterol, n. [chem.] ఘృతాల్;
  • stethoscope, n. పరిశ్రావకము; గుండె, ఊపిరితిత్తులు, పొట్త, మొదలైన అంతర్గత అంగధ్వనులని వినడానికి వైద్యులు ఉపయోగించు శ్రవణ పరికరము;
  • steward, n. m. సారథి; కార్యదక్షుడు;
  • stewardess, n. . సారథి; ఆకాశకన్య;
  • stewardship, n. సారథ్యం;
  • stick, n. (1) పుల్ల; దండం; కర్ర; (2) వత్తి;
  • incense stick, ph. అగరువత్తి;
  • stick, v. i. అంటుకొను;
  • stick, v. t. అంటించు;
  • sticklac, n. ముడి లక్క;
  • stiff, adv. బింకంగా; బటువుగా;
  • stiffness, n. ధార్‌ష్ట్యము; బింకం; ధారుడ్యం; బటుత్వం;
  • stigma, n. (1)[bot.] కీలాగ్రం; పుషె్పూని; (2) మచ్చ; నింద; కళంకం;
  • still, adj. నిలకడ;
  • still, n. బట్టీ; దిగమరిగించే సాధనం; బీరు ని బట్టీ పట్టగా విస్కీ వస్తుంది;

USAGE NOTE: still and yet

  • Use still to talk about a situation that continues to exist at the present time. Still is usually used before the verb: I still see Karthik from time to time. If the verb is “be”, still comes after it: I hope this food is still good. Usually, yet is used at the end of a sentence: Is Radha back from school yet?
  • still, adv. ఇంకా;
  • still more, ph. ఇంకొంచెం; మరికొంచెం;
  • stills, n. [cinema] నిశ్చల చిత్రాలు; నిశ్చలన చిత్రాలు;
  • stimulants, n. ఉత్తేజకాలు; ప్రచోదనాలు; ఉద్దీపకాలు; many of the caffeine-containing foods such as coffee, cocoa, and chocolate contain mild doses of the stimulant at relatively harmless levels; the stimulant arecoline found in betel nuts is also relatively mild; examples of more potent and dangerous stimulant drugs are nicotine and cocaine;
  • stimulus, n. ఉద్దీపకం;
  • sting, n. కుట్టు; కాటు;
    • bee sting, ph. తేనెటీగ కుట్టు; తేనెటీగ కాటు;
    • mosquito sting, ph. దోమ కుట్టు; దోమకాటు;
  • stingy person, n. లోభి; అల్పంపచుడు;
  • stink, n. కంపు;
  • stinking, adj. కంపూయమైన; కంపుగొట్టేటి;
  • stink, v. i. కంపుకొట్టు;
  • stipend, n. వేతనం; భరణం; వరుమానం;
  • stipulated, adj. విహిత; నిర్ణీత; నిర్దేశించిన; విధించబడ్డ; శాస్త్రోక్తంగా చెప్పబడ్డ;
    • stipulated functions, ph. విహిత కర్మలు; విధించబడ్డ పనులు;
  • stipulated, n. విహితము;
  • stir, v. i. కదులు; కదలాడు;
  • stir, v. t. కదుపు; కదుల్చు; తిప్పు;
  • stirrer, n. తిప్పుడు పుడక; గరిటె; కలువరి; కల్వరి; కలివెన;
  • stirrup, n. రికాబు; అంకెము; అంకవన్నె;
  • stitches, n. pl. కుట్లు; టాకీలు;
  • stochastic, adj. యాదృచ్ఛిక; same as random;
    • stochastic process, ph. యాదృచ్ఛిక ప్రక్రియ;
  • stock, n. (1) నిల్వ; నిలువ; సరకు; (2) కంపెనీలో వాటా;
  • stockings, n. pl. మేజోళ్లు; కాల్తిత్తులు; sox;
  • stoic, n. విరాగి; స్థితప్రజ్ఞ;
  • stoicism, n. వైరాగ్యం; విరాగం; స్థితప్రజ్ఞతావాదం;
  • stolen, adj. దొంగ;
  • stomach, n. (1) కడుపు; పొట్ట; డొక్క; కుక్షి; ఉదరం; గర్భం; (2) జీర్ణాశయం; జీర్ణకోశం; జఠరం; ఆమాశయం;
    • stomach juices, ph. జఠర రసాలు;
  • stomata, n. పత్రరంధ్రములు; ఆకుబెజ్జములు;
  • stomatitis, n. నోటిపూత; అస్యపాకం;
  • stone, n. (1) రాయి; శిల; అశ్మము; పాషాణం; ప్రస్తరం; పత్తర్; కాంతం; (2) రత్నం;
    • etched in stone, ph. శిలాక్షరములు;
    • lodestone, ph. అయస్కాంతం;
    • moonstone, ph. చంద్రకాంతం;
    • precious stone, ph. రత్నం;
    • semi-precious stone, ph. ఉప రత్నం;
    • sunstone, ph. సూర్యకాంతం; ఒక రకం పొడి;
    • stone age, ph. రాతియుగం; శిలాయుగం; అశ్మయుగం; (3) టెంక;
    • stone mortar, ph. రుబ్బుఱోలు;
    • stone smith, ph. వడ్డెరవాడు; ఱాతి కార్మారుఁడు;
  • stones, n. pl. రాళ్లు;
  • stool, n. (1) మలము; పురీషము (2) కుర్చీపీట;
  • stop, inter. ఆగు;
  • stop, n. (1) ఆగే చోటు; మజిలీ; విరామం; (2) [ling.] స్పర్శము; కంఠనాళంలో నుండి బయటకు వచ్చే గాలిని రెండు ఉచ్చారణాంగాల సహాయంతో ఆపడం;
    • bilabial stop, ph. [phoen.] ఉభయోష్ట్య స్పర్శము; In phonetics and phonology, a bilabial stop is a type of consonantal sound, made with both lips (hence bilabial), held tightly enough to block the passage of air (hence a stop consonant). The most common sounds are the stops [p] and [b], as in English pit and bit;
    • bus stop, ph. బస్సులు ఆగేచోటు;
    • full stop, ph. పూర్ణ విరామం; రాతలో వాక్యాన్ని పూర్తి చేసినప్పుడు వాడే గుర్తు;
    • velar stop, ph. [phoen.] హనుమూలీయ స్పర్శము; In phonetics and phonology, a velar stop is a type of consonantal sound, made with the back of the tongue in contact with the soft palate (also known as the velum, hence velar), held tightly enough to block the passage of air (hence a stop consonant). The most common sounds are the stops [k] and [ɡ], as in English cut and gut;
  • stop, v. i. ఆగు; మజిలీ చేయు;
  • stop, v. t. ఆపు; అరికట్టు; కట్టిపెట్టు; మాను; చాలించు; నిలుపు; నిలువరించు; అడ్డగించు;
  • stop and go, adj. నివర్తన; ఉండీ ఉడిగి;
  • stopcock, n. నిరోధిని; బిరడా;
  • stopover, n. మజిలీ; మకాం; ప్రయాణంలో ఆగేచోటు;
  • stopper, n. బిరడా; మూత; వారిణి; ఆపేది;
  • storage, adj. సంచాయక;
  • store, n. (1) కొట్టు; కొట్టుగది; లిబ్బి; కోఠీ; కోష్ఠాగారం; ఖానా; భాండాగారం; గరిస; (2) ఉగ్రాణం; అంగడి; సినం;
    • data store, ph. దత్తాలయం; దత్తాఖానా; దత్తాకోఠీ; గరిస;
    • drug store, ph. దవాఖానా; మందులకొట్టు;
    • provisional store, ph. సినకొట్టు; సినాంగడి;
  • store, v. t. దాచు; భద్రపరచు; నిల్వ చేయు;
  • stork, n. గూడకొంగ; పెనుకొంగ; పెద్దకొంగ;
  • storm, n. తుపాను; గాలివాన;
    • dust storm, ph. దుమారం;
    • stormy wind, n. ఈదర గాలి;
  • story, storey, n. అంతస్తు;
  • story, n. (1) కథ; కత; వృత్తాంతం; ఉపాఖ్యానం; ఆఖ్యాయిక; ఆఖ్యానం; గాధ; ఇతిహాసం; నారాశంశ; తిత్తివ; (see also) tale; legend; epic; myth; fable; fiction; parable; allegory; (2) అంతస్తు; భవనంలో ఒక మట్టం;
    • ancient story, ph. ఇతిహాసం;
    • epic story, ph. పురాణగాధ; పెద్ద కథ;
    • mini story, ph. పరికథ;
    • prose story, ph. ఆఖ్యాయిక;
    • real story, ph. నిజంగా జరిగిన కథ; ఆఖ్యాయిక;
    • serialized story, ph. ఖండకథ; స్రవంతి;
    • short story, ph. కథానిక; ఆఖ్యానకం;
    • topic of story, ph. కథావస్తువు;
    • true story, ph. ఆఖ్యాయిక;
    • story within a story, ph. పిట్ట కథ; ఉపాఖ్యానం;
  • stout, adj. లావైన; బొద్దు; స్థూల;
    • stout rope, ph. మోకు;
  • stoutness, n. లావుతనం; స్థౌల్యం; స్థాలిత్యం;
  • stove, n. కుంపటి; see also range; oven;
  • strabilis, n. వాతం;
  • straight, adj. తిన్ననైన; సరళ; రుజు; నేరు; నిటారైన; సీదా; సూటి;
    • straight carbon chain, ph. సరళ కర్బన శృంఖలం;
    • straight line, ph. సరళ రేఖ; ఋజు రేఖ; ఋజు పంక్తి;
  • straightforward, adj. సూటి; తిన్న; నికార్సు;
  • strain, n. (1) ప్రయాస; శ్రమ; (2) [biol.] జాతి; వంగసం; వంగడం;
    • strain of bacteria, ph. సూక్ష్మజీవుల జాతి;
  • strainer, n. (1) చిల్లుల సిబ్బి; సిబ్బితట్ట; జల్లిమూకుడు; కర్కరి; చాలని; (2) వడపోత గుడ్డ; వడపోత కాగితం;
  • straits, n. s. జలసంధి; రెండు సముద్రాలని కలిపే సన్నటి జలమార్గం;
  • strand, n. (1) కోవ; పేట; పాయ; పోచ; సరము; తంతువు; యష్టి; (2) ఇసక మేట;
    • single strand, ph. ఏక యష్టి; ఏకావళి;
  • strand, v. i. దిగబడు; చిక్కుపడు; నట్టడు;
  • strange, adj. విచిత్రపు; వింత; పరిచయము లేని; అపరిచిత;
    • strange particle, ph. వింత రేణువు;
  • strangeness, n. విచిత్రం; వైచిత్రి; వింత; ఎల్లిదం;
  • stranger, n. అపరిచితుడు;
  • stratagem, n. s. తంత్రం; పన్నాగం; పన్నుగడ; ఎత్తుగడ; దూరదృష్టితో చేసే తంత్రం; see also tactic;
  • strategically, adv. వ్యూహాత్మకంగా;
  • strategy, n. pl. పన్నాగాలు; ఎత్తుగడలు; వ్యూహాలు; స్ట్రాటజీ అనేది అంతిమ లక్ష్యాన్ని ఛేదించటానికి ఉండాల్సిన కార్యాచరణ ప్రణాళిక; స్ట్రాటజీ ప్లానింగ్ కి సంబంధించినది. అంటే స్ట్రాటజీ అనేది "ఎందుకు" అనే ప్రశ్న మీద ఆధారపడి "ఎందుకు" చేస్తున్నాం అనేది బయటకు కనిపించదు, నాయకుడికి తప్ప మరొకరికి తెలిసే అవకాశం ఉండదు. see also tactics;
  • stratification, n. పొరపొచ్చం; స్థలీకరణం;
  • stratified, adj. స్తరిత;
  • stratosphere, n. ఆస్తరావరణం; చైతన్యావరణము పైన 51 కిమీ వరకు విస్తరించి ఉంటుంది. ఎత్తు పెరిగే కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది, అందుకనే ఇక్కడ కల్లోల స్థితి తక్కువ. ఇక్కడే వాణిజ్య విమానాలు తిరిగేది. ఓజోన్ పొర కూడా ఇక్కడే ఉంటుంది;
  • stratum, n. పొర; ఆస్తరం; స్తరం;
  • straw, n. (1) గడ్డి; ఎండుగడ్డి; (2) పోచ;
    • paddy straw, ph. వరి గడ్డి;
  • streak, n. చార; చారిక;
  • stream, n. వాహిని; నది; అర్ణం; ఏఱు; ధుని; జంబాలిని; ప్రవాహిక;
  • streamers, n. pl. తలాటాలు; అలంకారానికి వాడే సన్నటి రంగురంగుల నగిషీ కాగితాలు; గుర్రాల తలలపై ఎగెరే అలంకారాలు;
  • street, n. వీథి; వాటిక; వాడ; రోడ్డు;
    • main street, ph. రాజవీధి; మెయిన్ రోడ్డు;

---USAGE NOTE: street, boulevard, and road

  • ---Usually, a street is within a town or city. A boulevard is a wide road, often with a median separator between opposing lanes of traffic. A road is usually in the country. However, the word road is used in the names of streets, especially wide ones, as in “Mount Road.”
  • strength, n. బలం; బలీయత; సత్వం; సత్తువ; పటిమ; పటుత్వం; పటిష్టత; ఓపిక; త్రాణ; శక్తి; (rel.) energy, power, stamina;
    • financial strength, ph. అర్థబలం;
    • physical strength, ph. శారీరక బలం; అంగబలం; కండ బలం;
  • strengthen, v. t. శక్తివంతం చేయు; పటిష్టపరచు; దిట్టం చేయు; బలపరచు; నిబిడీకరించు;
  • stress, n. (1) ఒత్తిడి; రాపాటు; (2) మానసిక ఒత్తిడి; (3) ఊనిక; ఊత;
  • stress, v. t. నొక్కి వక్కాణించు; మరీ మరీ చెప్పు; ఒత్తిడి చేయు;
  • stretch, v. i. సాగు; జాపు; చాపు;
  • stretch, v. t. సాగదీయు; పొడిగించు;
  • striate, adj. చారికలు గల;
  • striation, n. గాడి; చార;
  • strict, adj. నిక్కచ్చి; కరాకట్టు;
  • strictly, adv. నిక్కచ్చిగా; కరాకట్టుగా;
  • stride, n. అంగ;
  • strife, n. కలహం; తగవు;
  • strike, n. సమ్మె; హర్తాళ్;
  • strike, v. i. తట్టు; అనిపించు; స్పురించు;
  • strike, v. t. బాదు; కొట్టు; మోదు;
  • strike out, ph. కొట్టివేయు; అడ్డుగా గీత గీయు;
  • string, n. (1) దారం; తాడు; (2) తంతి; తీగె; సారె; కమ్మ;
  • string, v. t. దారముతో దండగా గుచ్చు; మాల కట్టు;
  • stringed instrument, n. తంతి వాద్యం;
  • strip, n. బద్ద; పేలిక; పట్టీ;
  • strip, v. t. ఒలచివేయు;
  • striped, adj. చారల;
  • strive, v. i. ప్రయత్నించు; కడంగు;
  • stroke, n (1) దెబ్బ; గాతం; ఆఘాతం; ఆహతి; ఉపహతి; కిల్ల; (2) మస్తిగాతం; మెదడులో రక్తనాళం పూడుకుపోవడం వల్ల కలిగే పరిస్థితి; (3) రుద్రవాతం; మస్తకఘాతం; మెదడులో రక్తస్రావం జరగడం వల్ల కలిగే పరిస్థితి;
    • heat stroke, ph. వడ దెబ్బ; ఉష్ణ ఘాతం; ఆతప ఆహతి;
  • stroke, v. t. నిమురు; దువ్వు;
  • strong, adj. బలమైన; బలిష్టమైన; పటిష్టమైన; దృఢ; శక్తివంతమైన; త్రాణ కలిగిన; త్రాణిక; తీక్షణమైన; ప్రబలమైన; ప్రగాఢ; నిబిడమైన;
    • strong acid, ph. త్రాణికామ్లం;
  • Strontium, n. రేడియో ధార్మికశక్తి ఉన్న ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 38, సంక్షిప్త నామం, Sr);
  • structure, n. కట్టడం; కట్టడి; నిర్మాణం; రచన; ఆకారం; ఆకృతి;
    • atomic structure, ph. అణువుల నిర్మాణం; అణురచన;
    • crystal structure, ph. స్ఫటిక నిర్మాణం; స్ఫటిక రచన;
    • molecular structure, ph. బణువుల నిర్మాణం; బణురచన;
    • subatomic structure, ph. పరమాణువుల నిర్మాణం; పరమాణు రచన;
    • structural formula, ph. నిర్మాణ క్రమం; ఒక బణువులో అణువులు ఎలా అమర్చబడి ఉన్నాయో చూపే బొమ్మ;
    • structural universals, ph. నిర్మాణాత్మక సార్వత్రికలు;
  • structuralism, n. నిర్మాణక్రమవాదం; ఒక రకం సాహిత్య విమర్శ;
  • struggle, v. i. గింజుకొను;
  • struggle, n. (1) పెనుగులాట; ఘర్షణ; (2) పోరాటం;
    • struggle for existence, ph. జీవన పోరాటం; జీవన సమరం;
    • struggle for independence, ph. స్వతంత్ర పోరాటం;
  • strychnine, n. ముషిణి; ఒక విషపదార్థం; నక్స్ వామికా గింజలలో ఉండే విషం;
  • stubble, n. (1) దుబ్బు; కొయ్యగా మిగిలినది; (2) కొద్దిగా పెరిగిన గెడ్డం;
  • stubborn, adj. మొండి;
  • stubbornness, n. మొండితనం; పంతం; పెంకితనం;
  • stud, n. మగ గుర్రం; గుండు;
  • student, n. అధ్యేత; అభ్యాసి; అంతేవాసి; m. విద్యార్థి; f. విద్యార్థిని;
    • student's student, ph. ప్రశిష్యుడు; (note) similar to ప్రాచార్యుడు, ప్రపితామహుడు;
  • studies, n. విద్య; చదువు సంధ్యలు;
    • higher studies, ph. ఉన్నత విద్య; పై చదువులు;
  • studio, n. చిత్రశాల;
  • study, n. (1) చదువుకొనే గది; (2) పఠన; చదువు; అధ్యయనం;
  • study, v. i. చదువు; పఠించు; నేర్చుకొను; అభ్యసించు; అధ్యయనం చేయు; అవగాహించు; గరచు; గ్రహించు; ప్రాపించు;
  • stuff, n. సరుకు;
  • stuff, v. i. మెక్కు;
  • stuff, v. t. కుక్కు; దట్టించు;
  • stuffing, n. కూరు; తోపు; పూర్ణం;
  • stump, n. శంకువు;
  • stun, v. i. నివ్వెరపడు; మ్రాన్పడు; రిచ్చపడు; స్తంభించు; నిర్ఘాంత పోవు;
  • stunted, adj. . గిడసబారిన; ఎదగని;
  • stunted, adj. గిడస; గిడసబారిన; ఎదగని;
  • stupefaction, n. నిర్విణ్ణత; స్తబ్ధత;
  • stupefy, v. t. నిర్విణ్ణుని చేయు; స్తబ్ధుని చేయు;
  • stupid, adj. మొద్దు; జడ్డు; తెర్ర;
  • stupid, n. శుంఠ; మొద్దు; జడ్డి; మూఢమతి; m. మూర్ఖుడు; బుద్ధిహీనుడు; వివేకహీనుడు;
    • extremely stupid, ph. వజ్రశుంఠుడు; శుద్ధ మొద్దావతారం;
  • stupidity, n. అవివేకం; బుద్ధిహీనత; తెలివితక్కువతనం; మూర్ఖత్వం; జడ్డితనం; ఎడ్డమి;
  • stupor, n. మూర్చ; మత్తు; మైకం; జడత్వం; స్తబ్దత;
  • stupor, n. మూర్చ; మత్తు; మైకం; జడత్వం; స్థబ్దత; లాహిరి; ఇంచుమించు స్పృహ లేని స్థితి;
  • stutter, n. నత్తి;
  • style, n. (1) వాటం; వైఖరి; తీరు; పద్ధతి; రీతి; పగిది; చందం; బాణీ; ఫక్కి; పంథా; హావభావాలు; ధోరణి; తరహా; లక్షణం; ఫణితి; శైలి; (2) కీలం; పువ్వుల అండాశయంలో ఉన్న కాడ;
    • speaking style, ph. ఫణితి;
    • writing style, ph. శైలి;
    • style manual, n. లక్షణ గ్రంథం;
    • style sheet, n. శైలీ పత్రం;
  • stylist, n. లాక్షణికుడు;
  • stylus, n. గంటం; కలం ఆకారంలో ఉండే ఒక లోహపు పనిముట్టు;
  • suave, adj. సారస్యము; సరసత; లోలోపల ఎలా ఉన్నా పైకి మాత్రం తేలిపోకుండా మాట మంచితో ఉండే ప్రవర్తనతో కూడిన;
  • sub, pref. ఉప; క్రీ; కింది;
  • subaltern, adj. అధీన; పరాధీన; వలస రాజ్యాలలో బ్రిటిష్‍ మిలటరీ వారు తరచుగా వాడిన పదం;
    • subaltern perspective, ph. అధీన దృక్కోణం; పరాధీన దృక్కోణం;
  • subatomic, adj. పరమాణు; పరమాణీయ;
  • subcommittee, n. ఉపసంఘం;
  • subconscious, adj. వ్యక్తావ్యక్తమైన; సుప్తచేతనమైన; ఉపచేతన;
    • subconscious mind, ph. ఉపచేతనం;
  • subconsciousness, n. సుప్తచేతనం;
  • subcontinent, n. ఉపఖండం; ఖండంలోని మిగిలిన ప్రాంతం నుంచి ఏదోక భౌగోళిక అడ్డంకుల కారణంగా (గొప్ప పర్వత శ్రేణులో, మహా నదులో, ఎడారులో) విడిపోయినట్టుగా ఉండే భారీ ద్వీపకల్పాలను ఉపఖండాలు అంటారు. ఇలా భౌగోళికంగా మిగిలిన ఖండం నుంచి విడిగా ఉంటూ, ఆ ప్రాంతం అంతా కలిసి ఉండడమే ఆ ప్రాంతానికి ప్రత్యేక సంస్కృతినీ, ఉమ్మడి చరిత్రనీ ఇస్తుంది;
  • subdue, v. t. అణచు; లోబరచుకొను; వశపరచుకొను; జయించు;
  • subject, n. (1) కర్త; వాక్యమందలి కర్త; (2) విషయం; కథావిషయము; (3) విశేష్యం; వ్యాప్యము; (4) అంశం; పాఠ్యాంశం; (5) వ్యవహర్త; పాలితుడు;
  • subjective, adj. ఆత్మగత; ఆత్మాశ్రయ; స్వీయాత్మక; వ్యక్తినిష్ట; వ్యక్తిగత; ఆధ్యాత్మిక; ప్రాతీతిక;
    • subjective idealism, ph. స్వీయాత్మక భావవాదం; ఆత్మాశ్రయ భావవాదం;
    • subjective knowledge, ph. ఆత్మగత జ్ఞానం;
    • subjective viewpoint, ph. ఆత్మగత దృక్పథం;
  • subjectivism, n. ఆత్మాశ్రయవాదం;
  • subjectivity, n. స్వీయాత్మకం; ఆత్మాశ్రయత్వం; వ్యక్తినిష్టత;
  • subjugation, n. దమనం; దమననీతి;
  • sublimation, n. ఋష్వం; ఉత్పాదం; ఉత్పతనం; ఘనరూపం నుండి నేరుగా వాయురూపంలోకి మారే భౌతిక ప్రక్రియ;
  • sublingual, adj. నాలుక కింద; జిహ్వధర;
  • submarine, n. నిమజ్జిత నావ; దొంగోడ; జలాంతర్గామి;
  • submarine fire, n. బడబాగ్ని; బడబానలం; ఔర్వాగ్ని; అవ్వాగ్గి;
  • submerged, adj. నిమజ్జిత;
  • submission, n. దాఖలు; ఒప్పగం;
  • submit, v. t. దాఖలు చేయు; దఖలు పరచు; ఒప్పగించు;
  • subordinate, n. తాబేదారుడు;
  • subpoena, n. (సపీనా) సాక్షి సమను; శిక్షా నిర్ణయముతో సాక్షిని రమ్మని పంపు ఉత్తరువు; (rel.) summons;
  • subroutine, n. ఉపక్రమణిక;
  • subscribe, v. i. చందాకట్టు;
  • subscriber, n. చందాదారుడు;
  • subscript, n. పాదాక్షరం; పాదిక; పాదాంకం; అంత్య ప్రత్యయం;
  • subscription, n. చందా; ఉపహారం;
    • annual subscription, ph. సాలు చందా;
  • subsequently, adv. తదుపరి; పిదప; అనంతరం; తర్వాత; కడపట; దరిమిలాను;
  • subservience, n. అణకువ; విధేయత;
  • subside, v. i. తగ్గు; మాటు పడు; సమసిపోవు;
  • subsidy, n. ప్రభుత్వం ప్రసాదించే సహాయం;
  • subsidiary, adj. గౌణ;
  • subsistence, n. ఉపాధి; కనిష్ఠ జీవనాధారం; జీవక; భృతి;
  • subsoil, n. ఉపమృత్తిక;
  • subspecies, n. ఉపజాతి; ఉపగణం;
  • substance, n. పదార్థం; ద్రవ్యం;
    • gaseous substance, ph. వాయు పదార్థం;
    • liquid substance, ph. ద్రవ పదార్థం;
    • solid substance, ph. ఘన పదార్థం;
  • substandard, n. న్యూన ప్రామాణికం;
  • substantial, adj. మోతుబరు;
  • substitute, n. బదులు;
  • substitute, v. t. ప్రతిక్షేపించు; బదలాయించు; ఆదేశించు;
  • substitution, n. ప్రతిక్షేపణ; ఆదేశం; అనుకల్పం; బదిలీ చర్య; మార్పిడి;
  • substratum, n. అధస్తరం; దిగువనున్న పొర;
  • subsystem, n. ఉపవ్యవస్థ;
  • subtext, n. అంతరార్థం; గూఢార్థం; అన్యాపదేశం;
    • metaphorical subtext, ph. ఉపమాత్మక అంతరార్థం;
  • subtle, adj. (సటుల్) సూక్ష్మ; పట్టుకు దొరకనిది;
    • subtle body, ph. సూక్ష్మ శరీరం;
    • subtle differences, ph. సూక్ష్మ భేదాలు;
    • subtle relationship, ph. సూక్ష్మ సంబంధం;
  • subtle, n. సూక్ష్మం; వైదగ్ధ్యం;
  • subtlety, n. సూక్ష్మం;
    • subtlety of law, ph. ధర్మసూక్ష్మం;
  • subtract, v. t. తీసివేయు; కొట్టివేయు; వ్యవకలించు;
  • subtraction, n. తీసివేత; కొట్టివేత; వ్యవకలనం;
  • subtrahend, n. వ్యవకలితం; శోధకము; తీసివేయబడే సంఖ్య; see also minuend;
  • suburb, n. శాఖాగ్రామం; మదురువాడ; శాఖానగరం; pl. శివార్లు;
  • succeed, n. జయించు; గెలుచు; నెగ్గు;
  • success, n. జయం; విజయం; ఉత్తీర్ణం; సఫలం; కృతార్ధత;
  • successful, n. సఫలం; జయప్రదం;
  • successfully, adj. సఫలీకృతంగా; జయప్రదంగా;
  • succession, n. (1) వంశపారంపర్యం; దాయాధికారం; వారసత్వం; ఉత్తరాధికారం; (2) పరంపరాక్రమం;
  • successive, adj. ఉత్తరోత్తర్యా; పరంపరానుగత; అనుక్రమ;
  • succinct, (సక్సింట్‍) adv. ముక్తసరిగా; సంగ్రహంగా; టూకీగా;
  • succubus, n. కామినీ; మగవాడితో రతిని కాంక్షించే ఆడ దయ్యం; (ant.) incubus;
  • succulent, adj. రసభరిత; రుచికర;
  • such, adj. అటువంటి;
    • such and such, adj. ఫలానా;
  • suck, v. i. (1) చీకు; చప్పరించు; (2) పీల్చు;
    • suck the breast, ph. పాలు తాగు;
  • sucrose, n. ఇక్షోజు; పంచదారలో ఉండే చక్కెర;
  • suction, n. చూషణం;
  • sudden, adj. అకస్మిక; ఆకస్మిక;
  • suddenly, adv. అకస్మాత్తుగా; ఆకస్మికంగా; అమాంతంగా; అనుకోకుండా; హఠాత్తుగా; ఉన్నపాటున; ఉన్నట్టుండి; గభీమని; గభాలున; పుసుక్కున; చివాలున; చటుక్కున; చట్టున; తటాలున; తటుక్కున; చటాలున; ఠక్కున; దిగ్గున; గ్రక్కున; చివ్వున; జివ్వున; కాదాచిత్కంగా; గుప్పున; గుబుక్కున; గబుక్కున;
  • sudorific, n. ఘర్మకారి; చెమటని పుట్టించే పదార్థం;
  • suds, n. నురుగ; నురగ; సబ్బు నురగ;
  • sue, v. t. దావా వేయు; నష్టపరిహారం కోసం కోర్టులో దావా వేయు;
  • suffer, v. i. బాధపడు; తల్లడిల్లు;
  • suffering, n. బాధ; వ్యధ; వెత; వేదన; దుఃఖం; వగపాటు;
  • sufficient, adj. చాలినన్ని; సరిపడినన్ని; సరిపడా; పర్యాప్తమైన;
  • sufficient, n. చాలు; సరిపోయింది; పర్యాప్తం;
    • barely sufficient, ph. బొటాబొటీ;
    • sufficient conditions, ph. పర్యాప్త నిబంధనలు; పర్యాప్త నియమాలు;
  • suffix, n. ఉపప్రత్యయం; పరప్రత్యయం; ఉత్తరపదం; అపదం; అంతాంగమమం; తోకమాట; వాలం; వెలపలి తోక;
    • causative suffix, ph. ప్రేరణ ప్రత్యయం;
  • suffocate, v. i. ఉక్కిరిబిక్కిరి అవు;
  • suffocate, v. t. ఉక్కిరిబిక్కిరి చేయు;
  • suffocation, n. శ్వాసావరోధన;
  • suffrage, n. ఓటు హక్కు; ఎన్నిక హక్కు;
  • sugar, n. పంచదార; చక్కెర; శర్కర; తీరవ్వ;
    • blood sugar, ph. రక్త శర్కర; రక్తంలో గ్లూకోజ్ మట్టం;
    • brown sugar, ph. శుద్ధి చేసిన తెల్ల చక్కెరకి కపిల వర్ణపు రంగు, షాడబం కొరకు మొలేసస్‍ కలపగా వచ్చినది;
    • hexose sugar, ph. షడ్ చక్కెర; షడోజు;
    • invert sugar, ph. త్రిశంకు చక్కెర;
    • raw sugar, ph. బూరా చక్కెర; బూరా పంచదార; ముడి చక్కెర;
    • synthetic sugar, ph. సంధాన చక్కెర;
    • sugar candy, ph. పటికబెల్లం; పటికపంచదార; కలకండ;
  • sugarcane, n. చెరుకు; చెరుకు గడ; ఇక్షువు;
    • sugarcane juice, ph. చెరుకు రసం; ఇక్షు రసం;
  • sugar cubes, n. కండ చక్కెర;
  • sugar-phosphate, n. భాస్వరదార;
  • suggestion, n. సలహా; సూచన;
  • suicidal, adj. ఆత్మఘాతుక;
  • suicide, n. ఆత్మహత్య; ప్రాణత్యాగం;
  • suit, n. అభియోగం; దావా; వాజ్యం;
  • suit, v. i. కుదురు; వీలగు; నప్పు;
  • suitability, n. అనువు; ఉరవు; అవుచిత్యం; ఔచిత్యం; ఉచితం; ఒనరిక;
  • suitable, n. అనువు; ఉరవు;
  • suitable, adj. తగిన; ఉచితమైన; యుక్తియుక్త;
  • suite, (స్వీట్) n. (1) హొటేళ్లలో కాని, కచేరీ భవనాలలో కాని రెండు మూడు గదులతో కూడిన వాటా; (2) సంగీతంలో రెండు, మూడు రాగాలతో కూడిన పాట; (3) కంప్యూటర్లలలో రెండు, మూడు అనువర్తన క్రమణికలని గంపగుత్తంగా అందించడం; మైక్రోసాఫ్ట్ ఆఫీస్‍ లో వర్డ్, పవర్ పోయింట్, ఎక్సెల్‍ అనే అనువర్తన క్రమణికలు గంపగుత్తంగా ఉంటాయి.
  • sulfate, sulphate (Br.) n. గంధకితం; బహు జాతిఅణువులతో కూడిన అయాను; ఈ అయాను బాహుబలం 2, సాంఖ్యక్రమం SO4;
  • sulfide, sulphide (Br.) n. గంధకిదం; ఏక జాతి అణువులతో కూడిన అయాను; ఈ అయాను బాహుబలం 1, సాంఖ్యక్రమం S2;
  • Sulfur, sulphur (Br.) n. గంధకం; మణిశిల; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 16, సంక్షిప్త నామం, S); [Sans.] sulvere
  • sulfuric acid, sulphuric acid (Br.) n. గంధకామ్లం; గంధక ధృతి; H2SO4;
  • sulk, v. i. గునుసు; చిటపటలాడు; అలుగు; ముఖము మాడ్చుకొను; కోపముగానుండు;
  • sultriness, n. ఉక్క; గుబులు; ఉబ్బ;
  • sum, v. t. కూడు; కలుపు;
  • sum, n. మొత్తం; కలయిక; కూడిక;
    • partial sum, ph. అర్ధాంతర మొత్తం;
  • summarize, v. t. క్రోడీకరించు; సంగ్రహించు; టూకించు; ముక్తాయించు; ఉటంకించు;
  • summary, n. సారాంశం; సంగ్రహం; క్రోడిక; సంక్షిప్తం; ఉటంకం; టూకీ; ముక్తసరు; ముక్తాయింపు;
    • executive summary, ph. నిర్వహణ సంగ్రహం; నిరవాక సంగ్రహం;
  • summation, n. సంకలనం; కూడిక;
  • summer, n. (1) వేసంగి; వేసవి కాలం; ఎండాకాలం; యాసంగి; ఊష్మకం; (2) సంకలని; కూడేది;
    • summer crop, ph. యాసంగి పంట; పునాస పంట; ఖరీఫ్; రబీ;
    • summer solstice, ph. ఉత్తరాయనాంతం;
  • summing, n. సమసనం; కలపడం;
  • summit, n. శిఖరాగ్రం; నగాగ్రం; శృంగం;
  • summon, v. t. పిలుచు; పిలిపించు; రమ్మని కబురు పెట్టు; కేకేయు; ఆకరితం;
  • summons, n. పిలుపు; తాకీదు; ఫర్మానా; సమను; కోర్టులో హాజరు కమ్మని పంపిన అధికార పత్రం; (rel.) subpoena;
  • sump, n. కూపం; గొయ్యి;
    • sump pump, ph. కూప తోడిక; ఒక గోతి (కూపం) లోకి చేరుకున్న మురికి నీటిని బయటకు తోడే సాధనం;
  • sun, n. (1) సూర్యుడు; పొద్దు; మిత్ర; రవి; భాను; భగ; పుష; హిరణ్యగర్భ; నరీచి; ఆదిత్య; సవిత్ర; అర్క; భాస్కర; తరణి; ఖద్యోతుడు; మార్తాండుడు; గ్రహపతి; ప్రభాకరుడు; ద్యుమణి; దినకరుడు; పగటివేల్పు (పగలు + వేల్పు = Day God); ఇరులగొంగ (ఇరులు + గొంగ = Enemy of Darkness); కాకవెలుగు (Light of Heat); మింటితెరువరి (మిన్ను + తెరువరి = Sky Traveller); (2) ఎండ;
    • the sun rose, ph. పొద్దు పొడిచింది;
    • the sun sank, ph. పొద్దు వాలింది; పొద్దు వాటారింది; పొద్దు గ్రుంకింది;
  • sunbath, n. ఆతపస్నానము;
  • sunbird, n. తేనెపిట్ట;
  • Sunday, n. ఆదివారం; రవివారం; భానువారం; భట్టారక వారం; సూర్యవారం;
  • sun-dried, adj. ఎండబెట్టిన; ఎండిన;
  • sundry, n. అమాంబాపతులు;
  • sunflower, n. సూర్యకాంతం; ప్రొద్దుతిరుగుడు పూవు;
  • sunlight, n. ఎండ; సూర్యరశ్మి; రవిరశ్మి; ఆతపం;
    • beam of sunlight, ph. తరణి కిరణ వారం;
  • sunset, n. సూర్యాస్తమయం;
  • sunshade, n. ఆతపత్రం; నీడ;
  • sunshine, n. ఎండ; ఆతపము; సూర్యరశ్మి;
  • mild sunshine, ph. నీరెండ;
  • sunstroke, n. ఎండదెబ్బ; వడదెబ్బ; వడతాకు; వేడిదెబ్బ;
  • sunstroke, n. ఎండదెబ్బ; వడదెబ్బ; వడతాకు;
  • suo moto, n. [legal] తనంత తానుగా; [ety.) A Latin legal term which means “on its own motion” and implies that an action was taken by a group or person on their own;
  • super, pref. గువ; పై; పెద్ద; ఉత్తమ; అతీత; ఉపరి; అత్యంత;
  • superconductivity, n. అతీతవాహకత్వం;
  • superconductor, n. అతీతవాహకి;
  • superficial, adj. (1) బాహ్య; పైపైని; ఉపరితలానికి సంబంధించిన; (2)సారం లేని;
  • superfluous, adj. అపేక్షాధిక; అవసరానికి మించిన;
  • super-food, n. భృహదాహారం; భృహదాన్నం; ఎక్కువ పోషకశక్తి గల ఆహార పదార్థం;
  • superhuman, adj. మానవాతీత; అతిమానుష;
  • superimposition, n. అధ్యాసం; అధ్యారోపం;
  • superintendent, n. అవేక్షకుడు;
  • superior, adj. ఊర్ధ్వ; ఉన్నత; ఉత్తమ; పరమ; మిన్న;
  • superiority, n. అధికత;
  • superlative, adj. సర్వోత్తమ; అత్యుత్తమ;
  • supernatural, adj. సహజాతీతమైన; ఆధిదైవిక;
  • supernova, n. బృహన్నవ్యతార;
  • supernumerary, adj. అధికమాసం; అధిక; లెక్కకు మించి; అనుకున్నదానుకంటె ఎక్కువ;
    • supernumerary month, ph. అధికమాసం;
  • superposition, n. అధ్యారోపితం; ఆచ్ఛాదనం; ఉపరిస్థాపకం; అధిస్థాపనం; ఒకే స్థానంలో, ఒకటి కంటె ఎక్కువ స్థితులు ఆక్రమించి ఉండడం;
    • principle of superposition, ph. ఆచ్ఛాదన సూత్రం; ఉపరిస్థాపక సూత్రం; అధ్యారోపనం; అధ్యాస;
  • superscript, n. శీర్షిక;
  • supersonic, adj. అతిధ్వానిక;
  • superstition, n. పిచ్చి నమ్మకం; మూఢ నమ్మకం; గుడ్డి గురి; అంధ విశ్వాసం;
  • supervisor, n. పర్యవేక్షకుడు; ఉపద్రష్ట;
  • supervision, n. పర్యవేక్షణ; అజ్మాయిషీ;
  • supine, adj. వెల్లకిలా;
  • supplicate, v. t. బ్రతిమాలుకొను; అర్థించు;
  • supplies, n. pl. రస్తు; సంబారాలు;
  • support, n. ఆదరువు; ఊత; సమర్ధన; ఆనురాట;
  • support, v. t. సమర్ధించు; ఊతనిచ్చు;
  • supplicate, v. i. బతిమాలుకొను;
  • supplier, n. సరఫరాదారు;
  • supplies, n. pl. సరుకులు; దినుసులు; సరంజామా:
  • supply, n. సరఫరా; opp of demand;
    • excessive supply, ph. ఉల్బణం;
    • excessive supply of money, ph. ద్రవ్యోల్బణం; inflation;
    • water supply, ph. నీటి సరఫరా;
  • supply, v. t. సరఫరా చేయు; సమకూర్చు; అందించు; పోషించు;
    • supply chain, ph. ??
  • supply side, ph. ??
  • support, n. అండ; దన్ను; ఊత; ఊతం; ఊనిక; ఆసరా; ఆనిక; ఊనిక; ఊత; ఆకరం: ప్రాపకం; ప్రాపు; ఆధారం; ఆస్కారం; దిక్కు; ఆలంబనం; బాసట; ఉద్ధరణ; కాపు; తోడు; మద్దత్తు; జీవగర్ర;
    • manual support, ph. చేఁదోడు;
    • verbal support, ph. వాఁదోడు;
  • supporter, n. దన్నుదారు; మద్దతుదారు;
  • supporters, n. pl. బలగం; మద్దతుదార్లు;
  • supposition, n. కల్పన; అంచనా; ఊహ;
  • suppress, v. t. రేకుమడచు; అణగదొక్కు; అణచు;
  • suppressed, adj. (1) అణగఁద్రొక్కబడిన; అణచబడిన; దళిత; వినతములైన; (2) అణగారియున్న;
  • suppression, n. అణచివేత; దమనం;
  • suppressor, n. దమనకారి; దమనకి;
  • suppuration, n. చీము పట్టడం;
  • supra, pref. అధి;
  • supramental, adj. అపౌరుషేయ; మేధాతీతమైన;
  • supreme, adj. ఉన్నతమైన;
    • supreme knowledge, ph. బ్రహ్మవిద్య;
  • surd, n. కరణి; ఒక సంఖ్య లోని వర్గ మూలాన్ని కాని, ఘన మూలాన్నికాని నిర్మూలించలేకపోతే ఆ సంఖ్యని కరణి అంటారు; (ety.) short for absurd; తెలుగులో కరణి అన్న మాట ఎలా వచ్చిందో తెలియదు; if any number can be written as a+√b, where a, b are integers then that number is called a surd;
  • surety, n. జామీను;
  • surf, n. ఫేనం; నురుగు;
  • surface, adj. ఉపరితల; తల; భూతల;
    • surface area, ph. ఉపరితల వైశాల్యం;
    • surface water, ph. భూతల జలం; ఉపరితల జలం;
    • surface of the Earth, ph. భూతలం; ధరాతలం;
    • surface tension, ph. తలతన్యత;
  • surface, n. ఉపరితలం; ఉపరిభాగం; తలం;
    • curved surface, ph. వట్రుతలం;
  • surfboard, n. ఫేనపు చెక్క; సముద్రపు కెరటాల మీద సవారీ చెయ్యడానికి వాడే బల్ల;
  • surge, n. తరగ;
    • surge tank, ph. తరగ కుండీ; జలవిద్యుత్ కేంద్రాలలో నీటిని ఉత్పాదక యంత్రాల మీదకి మళ్ళించే దారిలో ఉండే ఒక కుండీ;
  • surgery, n. శచికిత్స; శల్యక్రియ; శల్యశాస్త్రం;
    • surgical operation, ph. శస్త్ర క్రియ; శల్యక్రియ;
  • surmount, v. t. అధిగమించు; గట్టెక్కు;
  • surname, n. ఇంటిపేరు;
  • surpass, v. t. తలదన్ను;
  • surplus, n. మిగులు; అధికాదాయం; అతి;
  • surprise, n. ఆశ్చర్యం; అచ్చెరువు; నివ్వెర; విస్మయం; అక్కజము;
  • surreal, adj. అధివాస్తవిక; కాలాతీత; నమ్మశక్యం కాని; కలో నిజమో తెలియరాని;
  • surrealism, n. అధివాస్తవికత; అచేతనమైన మనస్సు ఎలా పని చేస్తున్నాదో వ్యాఖ్యానించడం; కథా వస్తువుని కలలో మాదిరి అసంబద్ధ ధోరణిలో వర్ణించడం;
  • surrender, adj. విడత;
  • surrender value, ph. విడత కిమ్మత్తు; విడత విలువ;
  • surrender, v. t. లొంగిపోవు;
  • surrogate, n. ఒకరి స్థానంలో మరొకరు నిలవడం;
    • surrogate mother, n. ప్రతినిధి మాత; ఒక స్త్రీ పిల్లని కనలేని పరిస్థితిలో ఆమె తరఫున ఆ బిడ్డని మోసిన కన్నతల్లి;
  • surround, v. i. మూగుకొను; ముసురుకొను; ఆవరించుకొను;
  • surround, v. t. (1) మూగు; ముసురు; గుమిగూడు; ఆవరించు; పరివేష్ఠించు; పరిక్షేపించు; (2) ముట్టడించు; చుట్టుముట్టు;
  • surrounded, n. నివృతం; సమావృతం; పరివేష్ఠితం;
  • surroundings, n. పరిసరములు;
  • surveillance, n. నిఘా; కాపలా; కాపు; కావలి;
  • survey, n. అవలోకన; అవలోడన; పైమాయిషీ; సర్వేక్షణం;
    • land survey, ph. పైమాయిషీ; భూమికొలత;
  • surveyor, n. కొలగాడు;
  • survival, n. బతుకు; మనుగడ; జీవిక;
    • means of survival, ph. బతుకు తెరువు;
  • survive, v. i. బతికి ఉండు;
  • survivors, n. pl. హతశేషులు;
  • susceptibility, n. గ్రహణశీలత; మార్పుకి వీలు కల్పించడం; వివశత;
    • magnetic susceptibility, ph. అయస్కాంత గ్రహణశీలత;
  • suspect, v. t. శంకించు; అనుమానించు; భావించు;
  • suspend, v. t. లంబించు; ప్రలంబించు; వేలాడదీయు;
  • suspended, n. లంబితం; లంబించబడినది; ప్రలంబితం; వేలాడదీయబడినది; విలంబితం;
  • suspense, n. ఉత్కంఠ; తహతహ; ఔత్కంఠ్యము;
  • suspenseful, adj. ఉత్కంఠితమైన; ఉత్కంఠభరితమైన;
  • suspension, n. ఆపుదల; నిలుపుదల; వ్యాక్షేపం;
    • suspension spring, ph. కమానుకట్ట;
  • suspicion, n. అనుమానం; శంక; అరగలి;
    • mutual suspicion, ph. అరమరిక;
  • sustain, v. i. భరించు; మోయు; ఆదుకొను;
  • sustainable, adj. పాలనీయ, భరణీయ, నిర్వహణీయ, ధారణీయ, సహనీయ, రక్షణీయ;
    • sustainable agriculture, ph. సహనీయ సేద్యం; నిర్వహణియ వ్యవసాయం; ధారణీయ వ్యవసాయం;
    • sustainable development, ph. ధారణీయ అభివృద్ధి;
  • sustenance, n. జీవనోపాధి;
  • suture, n. సీమంతిక; సీవని; సంధి; కుట్టు; స్యూతము;
    • continuous suture, ph. అఖండ సీవని;
    • cranial suture, ph. మస్తక సీవని;
    • dorsal suture, ph. పశ్చాత్ సీవని;
    • the sagittal suture, ph. బ్రహ్మరంధ్రం; పసికందుల నడినెత్తిమీద ఉండే మెత్తటి ప్రదేశం;
    • ventral suture, ph. పురః సీవని;
  • sutures, n. స్యూతులు; కుట్లు; సీమంతికలు;
  • suzerainty, n. సర్వసహాధీశత్వం; విదేశాంగ వ్యవహార్రాలలో ఒక రాజ్యం పై అదికారం;
  • swaggering swordsman, ph. అడిబీరపు యోధుడు;
  • swallow, n. వానకోయిల; ఒక రకం పక్షి;
  • swallow, v. t. మింగు; కబళించు; గుటుక్కుమనిపించు; గుటకాయిస్వాహా చేయు;
  • swamp, n. చిత్తడినేల; రొంపి;
  • swamp, v. i. రొంపిలో దిగబడు; తలమునకగు; ఊపిరాడనంత పనిలో పడు;
  • swan, n. హంస; మరాళం; అంచ;
  • swap, v. t. మార్చు; తారుమారు చేయు; ఇచ్చిపుచ్చుకొను;
  • swarm, n. దండు; మూక;
    • swarm of locusts, ph. మిడతల దండు;
    • swarm of monkeys, ph. కోతిమూక;
  • swarthy, adj. చామనచాయ; ఎండకి నల్లబడ్డ శరీర చాయ;
    • swarthy complexion, n. చామనచాయ;
  • sway, v. i. ఊగు; ఆడు; ఊగిసలాడు;
  • sweat, n. చెమట; ఘర్మజలం; శ్వేదనజలం; శ్వేదం;
    • sweat duct, ph. స్వేదనాళిక; స్వేదనాళం;
    • sweat glands, ph. స్వేదగ్రంథులు; చెమటబొడిపెలు; చెమటకంతులు;
  • sweat, v. i. చెమట పట్టు; చెమరు; చెమర్చు; చెమరించు;
  • sweater, n. ఉన్నిలం; శాముల్యం;
  • sweep, v. t. తుడుచు; ఊడ్చు;
  • sweeper, n. m. ఊడ్పుకాడు; f. ఊడ్పుగత్తె; ఝాడమాలిని; (ety. ఝాడూ = చీపురు)
  • sweeping, adj. విస్తృత; వ్యాపక;
  • sweepings, n. ఊడ్చిన పెంట; చెత్త; చెదారం;
  • sweet, adj. తీయనైన; తియ్యనైన; తియ్యని; మధురమైన; మధురం;
    • sweet basil seeds, ph. సబ్జాగింజలు;
    • sweet flag, ph. వస;
    • sweet marjoram, ph. మరువం; ప్రస్థపుష్పకం;
    • sweet negro coffee, ph. కమ్మకసింద;
    • sweet potato, ph. తియ్యదుంప; చిలగడదుంప; గెనుసుగడ్డ; రత్నపురిగడ్డ; తన జన్మ స్థానమైన దక్షిణ అమెరికా నుండి ఇది ప్రపంచం అంతా వ్యాపించింది;[bot.] Ipomoea batatas; a sweet potato and a yam are not the same thing; Sweet potatoes are in the morning glory family, while yams belong to the lily family;
  • sweetmeat, n. తీపితిండి; తీపి తినుబండారం; మిఠాయి;
  • sweetness, n. తియ్యదనం; తీపి; మధురిమ;
  • sweets, n. మిఠాయిలు; మోదకాలు; తీపి సరుకులు; బిళ్లలు;
  • swell, n. పొంగు; బూరటి కెరటం; ఉల్భణం;
  • swell, v. i. వాచు; పొంగు; ఉప్పొంగు; ఉబుకు; ఉబ్బు; ఉబ్బరించు; ఉబ్బరిల్లు; బూరటిల్లు;
  • swelling, n. వాపు; పొంగు; కదుము; ఉబ్బకం; ఉబ్బరింత;
  • swiftness, n. జోరు; వడితనం; ఉరవడి;
  • swig, n. గుక్కెడు;
  • swim, v. i. ఈదు; ఈఁతకొట్టు;
  • swimming pool, n. ఈఁతకొలను; కేళాకూళి;
  • swindler, n. మోసగాఁడు; వంచకుఁడు;
  • swine, n. పంది;
    • swine flu, ph. ఒక రకం ఇన్‍ప్లుయెంజా పేరు; ఇది H1N1/09 అనే పేరుగల విషాణువు వల్ల వచ్చే జబ్బు; ఇది 2009 లో మొదటిసారి ప్రజలలో కనిపించింది;
  • swing, n. ఊయల; జోల; ఉయ్యాల;
  • swing, v. t. ఊపు; v. i. ఊగు;
  • switch, n. మీట; లాతం; పరీరంభకం;
    • electrical switch, ph. విద్యుత్ మీట; విద్యుత్ పరీరంభకం;
  • switch, v. t. మార్చు; మారుగుళ్లు చేయు; తారుమారు చేయు; v. i. మారు;
  • switches, n. మీఁటలు;
    • bank of switches, ph. మీఁటలమాల; see also keyboard
    • switching yard, n. మారుగుళ్ల దొడ్డి; రైలు బండిలో పెట్టెల స్థానాలని మారుగుళ్లు చేసే స్థలం;
  • swoon, n. మూర్చ;
  • swoon, v. i. మూర్చిల్లు; సొమ్మసిల్లు;
  • sword, n. కత్తి; ఖడ్గము; బాకు; అడిదం;
    • long sword, ph. అఘాయువు; అసితాంగము; అసిధేనుక; అసిపుత్రి; కఠారము;
    • medium sword, ph. కరవాలము; కర్కశము;
  • sycophant, n. (సైకఫేంట్) భట్రాజు; భజనదాసు; చెంచారాయుడు; ముఖస్తుతిచేసి లాభం పొందేవాడు;
  • syllable, n. శబ్దగణం; మాత్ర; మాత్రకం; కారం; అక్షరం;
    • accented syllable, ph. ఉదాత్త మాత్రకం; ఉదాత్త అక్షరం;
    • Aum syllable, ph. ఓం కారం;
    • long syllable, ph. గురువు;
    • short syllable, ph. లఘువు;
  • syllabus, n. ప్రణాళిక; పాఠ్య ప్రణాళిక; సంగ్రహం; సంక్షేపం;
  • syllogism, n. త్రియాంశతర్కం; పంచావయవం; ఉదా. మానవులకి మృతి ఉంది. భారతీయులు మానవులు. కనుక భారతోయులకి మృతి ఉంది, అని తర్కించడం.
  • sylvan. adj. మొక్కలతో నిండిన; వన సంబంధమైన;
  • symbiont, n. సహజీవి;
  • symbiosis, n. సహజీవనం; పరస్పరసేవ; అంధపంగున్యాయం;
  • symbol, n. గుర్తు; ప్రతీక; చిహ్నం; సంకేతం;
    • graphic symbol, ph. రేఖాత్మక చిహ్నం; రేఖాత్మక సంకేతం;
  • symbolic, adj. సాంకేతిక; లాక్షణిక; ప్రతీక; ప్రతీకాత్మక;
    • symbolic logic, ph. లాక్షణిక తర్కం; ప్రతీక తర్కం; ప్రతీకాత్మక తర్కం; Symbolic logic is the study of symbolic abstractions that capture the formal features of logical inference, often divided into two main branches: propositional logic and predicate logic. Example: A = all mammals feed their babies milk from the mother. B = all cats feed their baby's mother's milk. C = All cats are mammals(C). Then A and B imply C or in symbols, A ^ B ==> C.
  • symbolical, n. సాంకేతికం; ప్రతీకాత్మకం;
  • symbolism, n. ప్రతీకాత్మకత; ప్రతీకాత్మకం; ప్రతీక వాదం; భావ ప్రకటన గాక భావ సూచనేు ప్రధానమైన పద్ధతి;
  • symmetric, adj. అనురూప; సౌష్ఠవ;
  • symmetrical, adj. అనురూప;
  • symmetry, n. సౌష్ఠత; సౌష్ఠవం; సొంపు;
    • axial symmetry, ph. అక్ష సౌష్ఠత;
    • cyclic symmetry, ph. చక్రీయ సౌష్ఠత;
    • lateral symmetry, ph. పార్శ్వ సౌష్ఠత;
  • sympathetic, adj. సహవేదన; సహానుభూత;
    • sympathetic nerves, ph. సహవేదన నాడులు;
    • sympathetic nervous system, ph. సహవేదన నాడీ మండలం;(
    • sympathetic vibrations, ph. సహవేదన ప్రకంపనలు;
    • parasympathetic, ph. పార్స్వసహవేదన; పార్స్వసహానుభూత;
  • sympathy, n. సానుభూతి; అనుతాపం; పరితాపం; కనికరం; దయ;
  • symphony, n. స్వరసమ్మేళనం;
  • symptom, n. లక్షణం; సూచకం; గురుతు; గుర్తు;
  • symptom of a disease, ph. రోగ లక్షణం;
  • synandry, n. సంయుక్త కేసరావళి;
  • synchronization, n. సమకాలీకరణం;
  • synchronous, adj. ఏకకాలిక; సమకాలిక; ఒకే సమయంలో జరిగే;
    • synchronous motion, ph. ఏకకాలిక చలనం; సమకాలిక చలనం;
  • syncope, n. స్పృహ పోవుట; శోషిల్లుట; సొమ్మసిల్లుట; కండరములలో శక్తి పోవడం వల్ల స్పృహ పోవుట;
    • heat syncope, వడ సొమ్ము;
  • syndrome, n. లక్షణగుచ్ఛం; కొన్ని రోగ లక్షణాల సముదాయం;
  • synecdoche, n. అజగర్లక్షణం వంటి అలంకారం; అంతా చెప్పడానికి బదులు కొంచెమే చెప్పడం కాని, కొంచెం చెప్పడానికి బదులు అంతా చెప్పడం కాని ఈ అలంకారం లక్షణం; ఉ. నలుగురితోటీ చెప్పి చూడు అన్నప్పుడు, నలుగురు మనుష్యులతోటే చెప్పమని కాదు, పలువురితో సంప్రదించమని. ఇది అజహర్లలక్షణం. ఉ. రంజి ట్రోఫీ ఆంధ్రా గెలిచిందంటే, ఆంధ్రులంతా అని కాదు, ఆంధ్రా జట్టు అని మాత్రమే అర్థం; ఈ రెండింటినీ ఇంగ్లీషులో సినక్‌డకీ అనే అంటారు. తెలుగులో మాత్రం మొదటిదానినే అజహర్లక్షణం అంటారు;
  • synonym, n. పర్యాయపదం; సమానార్థకం; ప్రతిపదం; రూపాంతరం;
  • synopsis, n. సారసంగ్రహం;
  • syntactic, adj. క్రమబద్ధ; వాక్యనిర్మాణ; భాషానిర్మాణ;
    • syntactic analysis, ph. క్రమబద్ధ విశ్లేషణ; వాక్య విశ్లేషణ;
  • syntax, n. వాక్యనిర్మాణం; భాషానిర్మాణ సిద్ధాంతం;
  • synthesis, n. సంధానం; సంశ్లేషణ; సంయోగం; సమన్వయం; (ant.)విశ్లేషణ;
  • synthesizer, n. యోక్త; సంయోక్త;
    • music synthesizer, ph. సంగీత సంయోక్త;
  • synthetic, adj. పౌరుష; సంధాన; సంశ్లేష; సంయోజిత;
    • synthetic chemistry, ph. పౌరుష రసాయనం; సంధాన రసాయనం; సంశ్లేష రసాయనం;
    • synthetic drug, ph. సంయోజిత ఔషధం;
    • synthetic fibers, ph. పౌరుష తంతులు; సంధాన తంతులు; సంశ్లేష తంతులు;
  • synonym, n. పర్యాయపదం; ప్రతిపదం; నానాఅర్థం;
  • synonymous, adj. సమానార్థక;
  • syphilis, n. కొరుకు సవాయి; ఉపదంశ రోగం; ఫిరంగి రోగం; సవాయి;
  • syphilitic ulcers, n. సవాయి పుండ్లు; ఉపదంశం;
  • syringe, n. పిచికారి; వస్తి;
  • syrup, n. షర్బత్;
  • system, n. వ్యవస్థ; పద్ధతి; క్రమం; విధం; సరణి; తంత్రం; మండలం; శరీరం;
    • nervous system, ph. నాడీ వ్యవస్థ; నాడీ మండలం;
    • planetary system, ph. గ్రహ మండలం;
    • political system, ph. రాజకీయ వ్యవస్థ;
    • social system, ph. సాంఘిక వ్యవస్థ;
    • societal system, ph. సామాజిక వ్యవస్థ;
  • systematically, adv. లాంఛనంగా; క్రమపద్ధతిలో; పద్దతి ప్రకారం;
  • systematized, n. వ్యవస్థితం;
  • systemic, adj. దైహిక; దేహం అంతటికి సంబంధించిన;
  • systole, n. ముకుళింత; హృత్సంకోచం; గుండె ముకుళించుకోవడం;
  • systolic, adj. ముకుళిత; స్పందన;
  • syzygy, n. (సిజిజీ) పర్వస్థానం; సూర్యచంద్రులు ఎదురెదురుగా కాని, ఒకే వైపు కాని ఉన్నప్పటి స్థానాలు;

మూలాలు

  • V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2