This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
This dictionary uses American spelling for the primary entry. Equivalent British spellings are also shown as an added feature.
You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
19 Aug 2015.
Part 1: Q
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Q, n. గణితంలో భిన్న సంఖ్యలు (-1/3, 0, 1/2, 2/9, 3/60, వగైరా) యొక్క సమితి; the set of quotinet numbers; అనగా లవము, హారము ఉన్న భిన్నాలు;
quack, n. కపటవైద్యుడు; తరిఫీదు లేకుండా వైద్యం చేసే వ్యక్తి;
quackery, n. విద్య నేర్వని వ్యక్తి చేసే వైద్యం;
quad, n. చతుశ్శాల; నాలుగిళ్ళ వాకలి; చౌకి; ముంగిలి; చత్వరం; పాఠశాలలో నాలుగు భవనాల మధ్య ఉండే ప్రదేశం;
quadrangle, n. చతుర్కోణి; చతుర్భుజం; నాలుగు కోణాలు గల రేఖాగణిత చిత్రం;
quadrant, n. (1) పాదం; పాదుక; చరణం; వృత్త చరణం; వృత్తంలో నాల్గవ భాగం; (2) కాష్ఠ; ఒక చదునైన ప్రదేశంలో రెండు పరస్పర లంబ రేఖలు గీయగా ఏర్పడే నాల్గవ భాగం; (3) తురీయం; నభోమూర్తుల కోణాలు కొలవటానికి వాడే పరికరం;
quadratic, adj. వర్గ; ద్విఘాత;
quadratic equation, ph. వర్గ సమీకరణం; ద్విఘాత సమీకరణం;
quadratic surd, ph. వర్గ కరణి; ఒక పూర్ణాంకపు వర్గ, ఘన మూలాదులని నిష్ప సంఖ్యల వలె రాయలేనప్పుడు వాటిని కరణీయ సంఖ్యలు అనేవారు కాని ఇటీవల ఈ మాట వాడుకలో లేదు;
quadrature, n. వర్గీకరణం; వైశాల్యం కట్టడం;
quadrifoliate, quadrifoliolate, adj. చతుర్ధళ; నాలుగు ఆకుల గుత్తులు కల;
quadrilateral, n. చతుర్భుజం; చతుర్కోణి; నాలుగు భుజాలు గల రేఖాగణిత చిత్రం; (rel.) square;
quadrillion, n. (అమెరికాలో) మహాపద్మం; ఒకటి తర్వాత పదిహేను సున్నలు వెయ్యగా వచ్చే సంఖ్య; 1015
quadruped, n. చతుష్పాది; నాలుగు కాళ్లు కలది;
quadruple, adj. నాలుగింతలు;
quadriplegic, n. రెండు కాళ్లు, రెండు చేతులు పనికిరాకుండా పోయిన వ్యక్తి;
quadruplets, n. pl. చతుష్కులు; జంట కవలలు; ఒకే కాన్పులో పుట్టిన నలుగురు పిల్లలు;
quadruplex, adj. నాలుగు పేటల; నాలుగు వాకేతాలని ఒకే తీగ మీద కాని, ఒకే రేడియో చానల్ మీద కాని పంపేటప్పుడు వాడే ఒక నియమం;
quadruplex, n. ఒకే చూరు కింద నాలుగు వాటాలు కలసి ఉన్న ఇల్లు;
quadruplication, n. నాలుగింతలు చెయ్యడం;
quagmire, n. ఊబి; చిత్తడి నేల;
quail, n. గిన్నెకోడి; పూరీడు పిట్ట;
quaint, adj. వింతైన; అపురూపమైన; ముచ్చటైన; కొంచెం వింతగా, కొంచెం ఆకర్షణీయంగా పాత కాలపు పద్ధతిలో ఉన్న;
quaint, adj. వింతయైన; అపురూపమైన;
quake, n. కంపం; వణకు;
earthquake, n. భూకంపం;
moonquake, n. చంద్రకంపం;
qualification, n. అర్హత; తాహతు; యోగ్యత;
qualified, adj. (1) అర్హతలు కల; (2) పరిమితం చేసే; (note) విరుద్ధార్థములు కల మాట;
qualifier, n. ఒక మాట యొక్క అర్థాన్ని పరిమితం చేసే విశేషణం;
qualitative, adj. గుణాత్మక; గుణప్రధాన;
qualitative analysis, ph. గుణాత్మక విశ్లేషణ;
qualitative laws, ph. గుణాత్మక నియమాలు;
quality, n. (1) గుణం; లక్షణం; స్వభావం; (2) నాణ్యత; శ్రేష్టత; వాసి;
quasi stellar object, ph. నక్షత్రాన్ని పోలిన శాల్తీ; నక్షత్రాన్ని పోలిన నభోమూర్తి; a massive and extremely remote celestial object, emitting exceptionally large amounts of energy, and typically having a starlike image in a telescope. It has been suggested that quasars contain massive black holes and may represent a stage in the evolution of some galaxies;
quay, n. (కీ), నావికా ఘట్టం; రేవు;
queen, n. (1) రాణి; పట్టపుదేవి; (2) [in chess] మంత్రి;
quid-pro-quo, ph. పరస్పర వీపుగోకుడు; నువ్వు నా వీపు గోకు, నేను నీ వీపు గోకుతాను అనే బేరం; ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకున్నమ్మ వాయినం;
quiescent, adj. నిశ్చల; నిలకడ;
quiet, n. స్థిమితం; ప్రశాంతం;
quietly, adj. చడీచప్పుడు కాకుండా; పెద్ద హడావిడి చెయ్యకుండా;
quill, n. ఈక;
quilt, n. బొంత; జమిలి దుప్పటి;
quilting, n. బొంతకుట్టు;
quince, n. సీమదానిమ్మ;
quinine, n. క్వినైను; క్వైనా;
quinoa, n. కినోవా; దక్షిణ అమెరికాలో పెరిగే, జొన్న గింజల వంటి, మెట్ట పంట; బలవర్ధకమైన పోషక పదార్ధాలు కల ఈ గింజలని భృహదాహార పదార్థమని కొనియాడుతూ బియ్యము, గోధుమ వలె వాడుతున్నారు;
quintessence, n. సారాంశం; (lit.) the fifth essence; the fifth element;
quintic, adj. పంచఘాత;
quintic equation, ph. పంచఘాత సమీకరణం; ఉ: :
quintic function, ph. పంచఘాత ప్రమేయం; ఉ: :
quintillion, n. శంఖం; అమెరికాలో ఒకటి తర్వాత18 సున్నలు వెయ్యగా వచ్చే సంఖ్య; 1018; బ్రిటన్ లో ఒకటి తర్వాత 30 సున్నలు వెయ్యగా వచ్చే సంఖ్య; 1030;
quintuplets, n. pl. పంచకులు; పంచకం; ఒకే కాన్పులో పుట్టిన అయిదుగురు పిల్లలు;
quip, n. ఛెణుకు; ఛలోక్తి; ద్వర్థి; వాక్బలం; చమత్కారపు మాట;
quire, n. దస్తా; ఇరవై నాలుగు ఠావు కాగితాల లెక్క;
quisling, n. దేశద్రోహి; పంచమాంగదళ సభ్యుడు;
quit, v. i. విరమించు;
quit, v. t. వదలిపెట్టు;
quiver, n. అమ్ముల పొది; పొది;
quiver, v. i. కంపించు; వణుకు;
quixotic, adj. (క్విహాటిక్) వెర్రి ప్రయత్నం చేసెడు;
quiz, n. చిన్న పరీక్ష;
quorum, n. కోరం; కనీస సభ్యుల సంఖ్య;
quota, n. వాటా; భాగం; వంతు; హిస్సా; కోటా;
quotation, n. (1) అమ్మదలుచుకున్న ధర; ఇచ్చే ధర; (2) ఉల్లేఖనం; సంవాదాంశం;
quotation marks, n. ఉల్లేఖన చిహ్నాలు;
quote, n. ఉల్లేఖన;
quote, v. t. (1) ధరలు తెలియబరచు; (2) మరొకరి మాటలని దృష్టాంతంగా ఎత్తి చూపు; ఉల్లేఖించు;
quotient, n. విభక్తం; భాగలబ్దం; భాగహార లబ్దం; భాగించగా లభించిన సంఖ్య;
intelligence quotient, ph. వివేక విభక్తం; వివేక లబ్ధం; మానసిక వయస్సుని భౌతిక వయస్సుతో భాగించగా వచ్చిన లబ్దం;
Part 2: R
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
R, n. గణితంలో నిజ సంఖ్యలు యొక్క సమితి; the set of all real numbers;
rabbit, n. సీమచెవులపిల్లి; సీమకుందేలు; [see also] hare; Generally speaking, hares are bigger than rabbits; Rabbits and hares also have different diets, with rabbits preferring grasses and vegetables with leafy tops, such as carrots, and hares enjoying harder substances like plant shoots, twigs and bark; Baby rabbits are called kits and baby hares are called leverets;
rabid, adj. వెర్రి; పిచ్చిపట్టిన; హింసాత్మకమైన;
rabid dog, ph. పిచ్చి కుక్క;
rabies, n. కుక్కవెర్రి; పిచ్చికుక్క వ్యాధి; జలభీతి వ్యాధి; రభస వ్యాధి; మాంసం తినే జంతువులకి వచ్చే ఒక రకమైన వైరస్ వ్యాధి; ఈ విధంగా వ్యాధిగ్రస్తులైన జంతువులు కరిచినప్పుడు ఈ వ్యాధి మనుష్యులకి సోకుతుంది; వెనువెంటనే చికిత్స చేయించకపోతే ప్రాణహాని కలుగుతుంది; ఒకసారి రేబిస్ బారినపడితే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం. కాబట్టి రేబిస్ రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అదృష్టవశాత్తూ ఈ ఒక్క వ్యాధి విషయంలోనే... వైరస్ మన శరీరంలో ప్రవేశించిన తర్వాత కూడా వాటిని సమర్థంగా అడ్డుకునే టీకాలున్నాయి. కాబట్టి సకాలంలో స్పందిస్తే రేబిస్ రాకుండా చూసుకోవటం సాధ్యమేనన్న విషయం మర్చిపోకూడదు. ఇది ఒకరినుండి మరొకరికి సులభంగా అంటుకునే రోగం కాదు; see also hydrophobia;
radical leaf, ph. వేరు నుండి మొలిచే ఆకు; సామూల్య పత్రం;
radical surgery, ph. సామూల్య శస్త్రచికిత్స;
radical, n. (1) [chem.] రాశి; అణు సమూహం; ముఖ్యంగా ఒక ఎలక్‍ట్రాను తక్కువైన అణుసమూహం; (2) మౌలికం; మూలానికి సంబంధించినది; (3) [math.] మూలానికి (root కి) సంబంధించినది; వర్గమూలానికి గుర్తు; (4) సంప్రదాయానికి విరుద్ధమైనది; (4) ప్రజాదరణ లేని విపరీత రాజకీయ భావం కల వ్యక్తి;
free radical, ph. విడి రాశి; స్వేచ్ఛా రాశి; విశృంఖల రాశి;
radio, adj. (1) రేడియోకి సంబంధించిన; (2) రేడియం అనే మూలకానికి సంబంధించిన; కిరణ ప్రసార శక్తి గల; ఉత్తేజిత;
radio carbon, ph. ఉత్తేజిత జకర్బనం; (short for radioactive carbon)
radio, n. (1) రేడియో; గగనవాణి; ఆకాశవాణి; (2) నిస్తంతి;
radio receiver, ph. రేడియో; రేడియో తరంగ గ్రాహకి; కిరణగ్రాహకి;
radioactive, adj. రేడియోధార్మిక; వికిరణ ఉత్తేజిత; వికీర్ణ ఉత్తేజిత; అకస్మాత్తుగా, బాహ్య శక్తుల ప్రేరేపణ లేకుండా అణుగర్భం విచ్ఛిన్నమయే లక్షణ గల;
radioactivity, n. రేడియోధార్మికత్వం; వికిరణ ఉత్తేజం; వికీర్ణ ఉత్తేజితం; కిరణ విసర్జనం; అకస్మాత్తుగా అణుగర్భం విచ్ఛిన్నమయే లక్షణం; ఈ లక్షణం రేడియం అనే మూలకంలో చూడడం తటస్థించింది కనుక దీనికి పేరు వచ్చింది. కానీ, వార్తలు వచ్చే రేడియోకీ, ఈ మాటలోని రేడియోకీ ఏమీ సంబంధం లేదు.
radish, n. ముల్లంగి;
Radium, n. రేడియం; రదం; కిరణం; ఒక రసాయన మూలకం; (అణు సంఖ్య 88, సంక్షిప్త నామం, Ra); [Lat. radius = ray];
radius, n. (1) వ్యాసార్థం; కర్కటం; (2) రత్ని; బాహ్య ప్రకోష్టిక; త్రిజ్య; ముంజేతిలో ఒక ఎముక;
radius vector, ph. సృతి; కేంద్రం నుండి పరిధి వైపు గీసిన గీత; కిరణరేఖ;
radix, n. [math.] అంశ; మూలం; base;
radix point, ph. అంశ బిందువు; మూల బిందువు;
radix eight, ph. అష్టాంశ;
radix sixteen, ph. షోడశాంశ;
radix ten, ph. దశాంశ;
radix two, ph. ద్వియాంశ;
Radon, n. రాడాన్; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 86, సంక్షిప్త నామం, Rn);
raft, n. బల్లకట్టు; కట్టుమాను; తెప్ప; దోనె; తారకం;
raft made of skin, ph. అరిగోలు; హరిగోలు; పుట్టి;
rafter, n. (1) వాసం; సరంబి; త్రావి; కప్పుకి వేసే దూలం; (2) దంతె; అడ్డుగా వేసే పట్టె;
rag, n. చింకి గుడ్డ; గుడ్డ పేలిక;
raga, n. రాగం; సప్త స్వరముల సమ్మేళనం; స్వరములు ఏడే అయినా వాటి నుండి పుట్టే రాగాలు ఎన్నో ఉన్నాయి; స, రి, గ, మ, ప, ద, ని, స అనే స్వరములని ఎన్నో విధాలుగా సమ్మిశ్రమం చేసి రాగాలు పుట్టించవచ్చు; 5 స్వరాలు, 6 స్వరాలు, 7 స్వరాలు మాత్రమే వాడి రాగాలు పుట్టించవచ్చు; ఆరోహణంలో కొన్ని స్వరాలని, అవరోహణంలో మరికొన్ని స్వరాలని కూడ వాడవచ్చు; సర్వసాధారణంగా ఒక రాగంలో కనీసం 5 స్వరాలైనా ఉంటాయి; ప్రతి రాగంలోను స ఉండి తీరుతుంది. ప్రతి రాగంలో కనీసం మ కాని ప కాని ఉండాలి; రెండూ ఉండవచ్చు;
rage, n. కోపోద్రేకం; ఆగ్రహం; ఉగ్రత;
ragi, n. pl. రాగులు; చోళ్లు, [bot.] Eleusine coracana;
rags, n. చిరిగిన బట్టలు; చింపిరి బట్టలు; జీర్ణవములు; గుడ్డ పేలికలు;
raid, n. దాడి;
raid, v. t. దాడిచేయు; దండెత్తు; మోహరించు;
rail, n. (1) పట్టా; కమ్మి; గ్రాది; (2) రైలు; రైలు బండి; కమ్మిబండి;
rainbow, n. ఇంద్రధనుస్సు; అరివిల్లు; వానవెల్లి; సురచాపం; హరిచాపం; (ety.) అరి అంటే చివర అని అర్థం. అరివిల్లు అంటే ఆకాశం చివర కనిపించేది అని కాని వాన చివర కనిపించేదని కాని అర్థం;
rainfall, n. వర్షపాతం; వానౙల్లు;
rainforest, n. వర్షారణ్యం;
tropical rainforest, ph. ఉష్ణమండల వర్షారణ్యం;
rainstorm, n. గాలివాన; ఝంఝం;
raise, n. పెరుగుదల; పెంపు; జీతంలో పెరుగుదల;
raise, v. t. (1) ఎత్తు; లేపు; లేవనెత్తు; పైకి ఎత్తు; (2) పెంచు; వర్థిల్లజేయు;
raisins, n. కిస్‌మిస్ పళ్లు; గింజలులేని ఎండిన ద్రాక్షపళ్లు; సా. శ. పూ 2000 నుండీ ఈ పండ్ల గురించి మానవులకి తెలుసు;
raising, n. పెంపకం;
rake, n. (1) దంతెన; పళ్ళకర్ర; పండ్లకోల; గడ్డిని కాని మట్టిని కాని తిరగెయ్యడానికి వాడే పళ్ళకర్ర; (2) మలారం; వీధులని తుడవడానికి, ఆకులని కుప్పలా వెయ్యడానికి వాడే పళ్ళ చీపురు;
rally, n. (1) బహిరంగ సమావేశం; (2) కారులతో వీథుల మీద వేసే పరుగు పందెం;
rally, v. i. పుంజుకొను;
rally, v. t. సమావేసపరచు;
ram, n. పొట్టేలు; గొర్రెపోతు; తగరు; హుడు; ఉరణం;
ram, v. t. గుద్దు; బలంగా పొడుచు;
rambunctious, adj. పెంకి; అల్లరి;
ramp, n. తొంగలి; నతిగతి; తటం; వాలుబల్ల; వాలువీధి;
rampart, n. ప్రాకారం; కోట బురుజు; కొత్తళం; అలంగము;
rancid, adj. కుళ్లిన; కంపుకొట్టే; కొవ్వు పదార్థాలు నిలవ ఉంచడం వలన వచ్చే చెడ్డ వాసనతో కూడిన;
rank and file, ph. పిన్న, పెద్ద; అధికారులుకాని సిబ్బంది; పనివారు;
rank, v. t. శ్రేణీకరించు; వరుసక్రమంలో పెట్టు;
ranking, n. శ్రేణీకరణ;
ransack, v. t. గాలించి వెదకు; మూలమూలలా వెదకు; చిందరవందర చేయు;
ransom, n. బంధవిమోచన ధనం; విడుదల కొరకు చెల్లించే డబ్బు;
rant, v. t. తిట్టు; నిందించు; కూతలు కూయు;
rants and raves, ph. నిందలు, అభినందనలు;
rap, v. t. దబదబా కొట్టు; తలుపు దబదబా కొట్టు; తలుపుని టకటకా కొట్టు;
rape, n. మానభంగం;
rape, v. t. మానభంగం చేయు; చెరుచు;
rapeseed, n. సరసు; కనోలా; [bot.] Brassica napus;
rapid, adj. తొందరగా; త్వరగా; వేగం; అవిలంబన; ఆశు;
rapid poetry, ph. ఆశు కవిత్వం;
rapid, n. ఝరి; ఉరకలు వేసే కొండ కాలువ;
raptor, n. వేటాడే పక్షి; ఉదాహరణకి గద్ద, డేగ, సాళువ, గూళి, మొదలైనవి.
rapture, n. (1) మహదానందం; ఆనందం; తన్మయత్వం; (2) నిర్వాణం;
rapport, n. (రపోర్) సన్నిహితత్వం; సామరస్యం; సౌహార్దత; a relationship characterized by agreement, mutual understanding, or empathy that makes communication possible or easy;
rare, adj. (1) అపురూపమైన; విలువైన; (2) అరుదైన; సామాన్యంగా దొరకని; విరళ; దుర్లభం; సకృత్తు; (3) పూర్తిగా పచనం కాని; బాగా కాలని; పచ్చి పచ్చి;
Use rare to talk about something that is valuable but is not in abundance: Stamps and coins of the British era are rare. Use scarce to talk about something that is not available in abundance at a particular time: In 2002 water became very scarce throughout Southern India.
rare-earth elements, ph. విరళ మృత్తిక మూలకాలు; అణు సంఖ్య 57 లగాయతు 71 వరకు గల రసాయన మూలకాలు; ఇవి అరుదైన (విరళ) మూలకాలు కాదు కాని ఆ పేరు అలా స్థిరపడిపోయింది;
rationale, n. (రేషనేల్) సోపపత్తిక వివరణం; కారణ వివరణం; సమర్ధించదగ్గ కారణం;
rationalism, n. హేతువాదం; రెనే డెకా, స్పినోజా, గలెలియా మొదలైన వారి సిద్ధాంతాలకి పునాదిగా అలరారిన వాదం;
rattan, n. పేపబెత్తం; పేము;
rattle, n. (1) గిలక; పసిపిల్లలు ఆడుకొనే ఒక ఆటవస్తువు; (2) ఆఘాటం;
rattle, v. ఆఘాటించు;
rattlesnake, n. గిలకపాము; ఆఘాట సర్పం; ఉత్తర అమెరికా నైరుతి ఎడారులలో విరివిగా కనిపించే ఒక విషసర్పం; ఈ పాము తోక గిలకలా చప్పుడు చేస్తుంది;
Rauwolfia serpentina, n. సర్పగంధి;
rave, v. t. పొగుడు; అభినందించు;
raven, n. కృష్ణశకుని; ద్రోణకాకం; అసురకాకోలం; ఇది ఎక్కువ ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరోపు, అమెరికా దేశాల్లో కనపడుతుంది. భారతదేశంలో హిమాలయాల్లో కూడా ఉంది. పరిమాణంలో పెద్దది. దీని శరీరం అంతా నల్లటి నలుపే; పెద్ద రెక్కలు ఉండటం, పరిమాణంలో కుడా పెద్దది అవటం మూలాన గుర్తు పట్టడం సులభం; [bio.] corvus corax; (see also) మాలకాకి; బొంతకాకి;
ray, n. (1) కిరణం; అంశువు; మయూఖం; (2) ఒక జాతి చేప; టెంకి చేప; టెంకి;
ray of light, ph. కాంతి కిరణం; మరీచి; అంశువు; త్విట్టు;
ray of sunlight, ph. తరణి కిరణ వారం;
rays, n. కిరణాలు;
collection of rays, ph. కిరణజాలం; అంశుజాలం;
pencil of rays, ph. కిరణపుంజం; కిరణశలాకం;
raze, v. t. నేలమట్టం చేయు;
razor, n. అసి; మంగలి కత్తి; క్షురిక;
razor blade, n. క్షురిక;
razor's edge, n. అసిధార;
reach, v. i. చేరు; పొందు; అందుకొను;
react, v. t. ప్రతిస్పందించు;
reaction, n. (1) ప్రతిస్పందన; ప్రతిచర్య; చర్య; ప్రతీకార శక్తి; ఇది ప్రతీకారాన్ని పోలి ఉంటుంది. ఒకరు మనకు నచ్చని మాటంటే వెంటనే మాటకు మాట సమాధానం ఇవ్వడం రియాక్ట్ అవటం.(2) ప్రక్రియ; అభిక్రియ;
real variable, ph. [math.] నిజ చలనరాసి; వాస్తవ చలరాసి;
realism, n. స్వభావోక్తి; వాస్తవికత; వాస్తవికతావాదం; వాస్తవవాదం; ఇంద్రియములకు గోచరమైనదే వాస్తవమైనది అను మతము; అనగా, స్థావరజంగమాత్మకమైన భౌతిక ప్రపంచం యొక్క ఉనికికి పరిశీలనశీలి (observer) తో నిమిత్తం లేదు. అనగా, బల్ల మీద పెట్టిన పండు మనం చూసినా, చూడకపోయినా అక్కడ బల్ల మీదనే ఉంటుంది. అడవిలో చెట్టు కూలినప్పుడు అక్కడ వినడానికి ఒక జీవి ఉన్నా, లేకపోయినా పడుతూన్న చెట్టు చప్పుడు చేస్తుంది. the doctrine that the objects perceived are real; Realism is the view that a "reality" of material objects, and possibly of abstract concepts, exists in an external world independently of our minds and perceptions; see also idealism;
reasoning, n. వాదం; వాదసరళి; హేతువాదం; అనుమానం; అవమర్షం; తర్కించడం;
rebate, n. ముజారా; ముదరా; ధరలో తగ్గింపు; వస్తువు కొన్న తర్వాత వ్యాపారి తిరిగి ఇచ్చే పైకం;
rebel, n. తిరుగుబాటుదారు;
rebellion, n. తిరుగుబాటు; పితూరీ;
rebuke, n. తిట్టు; నిందావాచకం;
rebuke, v. t. తిట్టు; చివాట్లుపెట్టు; కోప్పడు;
rebut, v. t. పూర్వపక్షం చేయు;
recalcitrant, adj. మొండి;
recall, v. t. (1) వెనుకకు పిలచు; అమ్మకానికి పెట్టిన సరకులని వెనుకకు పిలచు; రద్దు చేయు; (2) జ్ఞాపకం తెచ్చుకొను;
recapitulate, v. t. పునశ్చరణ చేయు; జ్ఞప్తికి తెచ్చు; క్రోడీకరించు;
receipt, n. రసీదు; చెల్లుపత్రం; చలానా;
receipt of payment to the treasury, ph. చలానా;
receivables, n. రావలసినవి; రాబడులు;
receive, v. t. అందుకొను; గ్రహించు; పుచ్చుకొను;
receive into custody, ph. అందుకొను; కైవశం చేసుకొను;
receiver, n. గ్రాహకం; గ్రాహకి; గ్రహీత; గ్రాహకుడు; గ్రాహి;
recension, n. శాఖ; పరిష్కృత గ్రంథం; పాఠాంతరం;
recent, adj.ఇటీవలి; అర్వాచీన; ఆధునిక; తాజా;
recently, adv. ఈమధ్య; మొన్నమొన్న;
very recently, ph. మొన్ననీమధ్య; మొన్నమొన్న; ఇటీవల;
receptacle, n. గ్రాహకి; మరొక వస్తువుని తనలోకి తీసుకొనేది;
reception, n. ఎదురు సన్నాహం; స్వాగతం; సన్మానం; ఉద్గ్రాహం
receptor, n. గ్రాహకి;
recess, n. (1) మారుమూల; వెనకకి జరిగి ఉన్న; గూడు; (2) పాఠశాలకి వచ్చు శలవు కాలం;
recessive, adj. తిరోగమన; అంతర్గత;
recession, n. వాణిజ్యమాంద్యం; ఆర్ధికమాంద్యం; తగ్గుదల; a recession is a general decline in a country’s production of goods and services, measured usually as two consecutive quarters of shrinking growth; see also depression, bear market;
reductio ad absurdum, ph. అనిష్టాపత్తి; అభిషవ శశవిషాణం; అభిషవం అంటే మరగ బెట్టడం. శశవిషాణం అంటే కుందేటి కొమ్ము. కనుక దిగమరిగించి కుందేటి కొమ్ముని సాధించడం అన్నమాట. తర్కశాస్త్రంలో ఒక ప్రవచనాన్ని రుజువు చెయ్యవలసి వచ్చినప్పుడు, సదరు ప్రవచనానికి విరుద్ధమైన ప్రవచనంతో మొదలుపెట్టి, దానిని మర్ధించి, మర్ధించి చివరికి ఆ విరుద్ధ ప్రవచనం అసాధ్యం అని రుజువు చెయ్యడం; తార్కిక గణితంలో ఈ రుజువు పద్ధతి ఎక్కువ ప్రచారంలో ఉన్న పద్ధతులలో ఒకటి; అర్ధప్రసంగం;
relativity, n. సాపేక్షత్వం; పరస్పరత్వం; పరస్పర సంబంధం;
theory of relativity, ph. సాపేక్ష వాదం; సాపేక్షత్వ సిద్ధాంతం;
relax, v. t. సడలించు;
relaxation, n. సడలింపు;
release, n. విడుదల; విడత; విమోచన;
release from sin, ph. పాప విమోచన;
released, adj. విడుదల చేయబడ్డ; ప్రోత్సారిత;
relevance, n. సుసంగతం; సుసంగత్వం; ప్రాసంగికత;
relevant, adj. సుసంగత;
release, v. t. విడుదల చేయు; విడుచు; విమోచన చేయు;
reliability, n. విశ్వసనీయత;
reliable, adj. విశ్వసనీయ;
relied upon, ph. ఉపాశ్రిత;
relief, n. తెరిపి; ఉపశమనం;
relic, n. అవశిష్టం;
religion, n. మతం; (lit.) linking back the phenomenal to its source;
religious, adj. మత సంబంధమైన;
Religious endowment, ph. దేవాదాయం;
relinquish, v. i. వర్జించు; త్యజించు;
relish, n. ఉపదంశం; నంచుకోడానికి వీలయిన పచ్చడి వంటి పదార్థం;
remainder, n. శేషం; శిష్టపదం; బాకీ; మిగిలినది;
Remainder Theorem, n. శేష సిద్ధాంతం; The remainder theorem states that when a polynomial, f(x), is divided by a linear polynomial, x - a, the remainder of that division will be equivalent to f(a). ... It should be noted that the remainder theorem only works when a function is divided by a linear polynomial, which is of the form x + number or x - number;
remission, n. తగ్గుదల; తగ్గించుట; తగ్గింపు; తగ్గుముఖం;
remit, v. t. కట్టు; ఇరసాలు;
remittance, n. ఇరసాలు;
remission, n. సడలింపు; తగ్గుదల; ఉపశమనం;
remonstrate, v. t. మందలించు;
remorse, n. పశ్చాత్తాపం; శోకం; అనుతాపం; ఖేదం;
remote, adj. విదూర; సుదూర; దవిష్ఠ;
remote control, ph. విదూర నియంత్రణ;
removal, n. తొలగింపు; నివారణ; హరణ;
remove, v. t. తొలగించు; వదలించు; ఊడ్చు; విఘటన చేయు; హరించు;
remuneration, n. ప్రతిఫలం; ప్రత్యుపకారం; చెల్లింపు; ముట్టింపు;
renaissance, n. (రినసాన్స్) పునరుద్ధరణ; పునరుజ్జీవనం; కొత్త జన్మ; కొత్త జీవితం; నవజాగృతి;
rendering, n. వర్ణన; వ్యాఖ్య; పాటని పాడడం; బొమ్మని గియ్యడం; భాషాంతరీకరణం చెయ్యడం;
rendezvous, n. (రాండెవూ) ముఖాముఖీ; కలిసే స్థానం; సంకేత ప్రదేశంలో కలుసుకోవడం;
renegade, n. మతభ్రష్టుడు;
rent, n. అద్దె; అద్దియ; బాడుగ; బేడిగ; భాటకము; కిరాయి; మక్తా; శిస్తు;
renter, n. అద్దెకున్నవాడు; మక్తేదారు; ముస్తాజరు; భాటకుడు;
renounce, v. t. త్యజించు; పరిత్యజించు; ఒదలిపెట్టు;
renovation, n. జీర్ణోద్ధరణ; మేల్కటం;
renown, n. పేరు; కీర్తి; ఖ్యాతి;
reorganization, n. పునర్వ్యవస్థీకరణ;
repairs, n. pl. మరమ్మత్తులు;
reparation, n. పరిహారం;
repartee, n. ఎదురుదెబ్బ; చతురోక్తి; బ్రహాణకం;
repeal, v. t. రద్దుచేయు; నిషేధించు;
repeat, v. t. ఆమ్‌రేడించు; మామరించు;
repeated, adj. పునరుక్త; జప;
repeatedly, adv. మళ్ళీ మళ్ళీ; మాటిమాటికీ; పునరుక్తంగా;
repentance, n. పశ్చాత్తాపం; నొచ్చుకోలు;
repertoire, n. సంగీత కచేరీలు; నాటకాలు, మొదలైన కళాఖండాలకి కాణాచి అయిన వ్యాపార బృందం; (see also) repertory
repertory, n. సముదాయ మంజరి; నిధి; ప్రాప్తిస్థానం; all the things that someone can do, all the methods that someone can use, etc.; (see also) repository; repertoire;
repetition, n. పునరుక్తి; వల్లె; జపం; చర్వితచర్వణం; ద్విరుక్తం; పర్యాయోక్తి; అనుప్రాస;
futility of repetition, ph. పునరుక్తి దోషం;
replacement, n. స్థానచ్యుతి;
replication, n. ప్రతిసృజన; తనని తాను తనంతగా సృష్టించుకోగలిగె సత్తా;
reply, n. సమాధానం; జవాబు; బదులు; ప్రత్యుత్తరం; ప్రతివచనం; ప్రతివాదం; మాటకి తిరుగు మాట చెప్పడం;
report, n. (1) నివేదిక; నివేదన; (2) శబ్దం;
preliminary report, ph. ప్రథమ నివేదిక;
press report, ph. పత్రికా నివేదిక;
progress report, ph. పురోగమన నివేదిక;
reporter, n. విలేకరి; అనుకర్త, anukarta, అనువక్త, anuvakta
press reporter, ph. పత్రికా విలేకరి;
repose, n. విశ్రమం;
angle of repose, ph. విశ్రమ కోణం; The angle at which a pile of rocks, sand, or dirt settles after a while;
position of repose, ph. విశ్రమ స్థానం;
repose, v. i. నడ్డి వాల్చు; విశ్రాంతికై జేరగిలబడు;
repository, n. అగారం; భాండాగారం; కాణాచి;
reprehend, v. t. కోపించు; నిందించు; అభిశంసించు;
represent, v. t. (1) ప్రాతినిధ్యం వహించు; (2) వర్ణించు; నివేదించు; సంకేతించు;
resin, n. సర్జరసం; సర్జం; సజ్జం; రాల; రాళ; అరపూస; లాక్ష; గుగ్గిలం; Material science and polymer chemistry define resin as a highly viscous and solid substances obtained from plants or synthetically produced; It itself is the mixture of several organic compounds namely terpenes. It is produced by most of the woody plants when these plants get an injury in the form of cut.
resist, v. i. ఎదిరించు; ప్రతిఘటించు; నిరోధించు; మొరాయించు;
resistance, n. (1) అవరోధం; ప్రతిఘటన; నిరోధం; అడ్డగింత; (2) భౌతిక చలనంలో ఎలా ఐతే ఘర్షణ చలనాన్ని నిరోధిస్తుందో, అలాగే పదార్థములందు ఎలక్ట్రాన్ల చలనాన్ని కూడా నిరోధించే గుణాన్ని రెసిస్టెన్స్ అంటారు;
resistivity, n. అవరోధకత్వం; నిరోధకత్వం; ఒక ధాతువు ఎంత మేరకు కరెంటు పంపగలదు (పంపలేదు) అన్నదానికి కొలమానం ఈ రెసిస్టివిటీ;
review, v. t. (1) సమీక్షించు; (2) పునర్విచారణ చేయు; చింతన చేయు;
revise, v. t. సవరించు; సంస్కరించు;
revision, n. సవరింపు; సవరణ; సంస్కరింపు; సంస్కరణ;
revive, v. i. పుంజుకొను; తేరుకొను;
revival, n. పునరుజ్జీవనం;
revolt, n. విప్లవం; తిరుగుబాటు; పితూరి;
revolt, v. i. తిరుగబడు;
revolution, n. (1) విప్లవము; తిరుగుబాటు; (2) పరిభ్రమణం; చుట్టుతిరగడం;
clockwise revolution, ph. ప్రదక్షిణం; గడియారపు ముల్లు తిరిగే దిశలో చుట్టి రావడం; గుడుల చుట్టూ గానీ, అగ్ని హోత్రుని చుట్టూగానీ, మహనీయుల చుట్టూగానీ కుడివైపుగా తిరగడం;
counter clockwise revolution, ph. అప్రదక్షిణం; గడియారపు ముల్లు తిరిగే దిశకి ఎదురు దిశలో చుట్టి రావడం;
green revolution, ph. హరిత విప్లవం;
industrial revolution, ph. పారిశ్రామిక విప్లవం;
revolve, v. t. చుట్టుతిరుగు; ప్రదక్షిణచేయు;
revolver, n. తిరుగుడు పిస్తోలు; ప్రయత్నం లేకుండా తూటాలను ప్రక్షేపణ స్థానానికి సరఫరా చేసే పిస్తోలు;
revulsion, n. ఏహ్యభావం; అసహ్యం; ఏవగింపు;
reward, v. t. అనుగ్రహించు; బహూకరించు;
reward, n. (1) ప్రతిఫలం; ఫలం; (2) పారితోషికం; పసదనం;
Rh-factor, n. రీసస్ కారణాంశం; రక్తంలోని ఎర్ర కణాల మీద కనిపించే ఒక రకం ప్రాణ్యపు బణువు (protein molecule); ఈ రకం ప్రాణ్యపు బణువు రీసస్ జాతి కోతులలో కనిపించింది కనుక ఈ పేరు పెట్టేరు;
rhapsody, n. అసంగతకావ్యం; తల తోకలేని కావ్యం;
rheumatism, n. కీళ్లవాతం;
rhetoric, n. భాషాలంకార శాస్త్రం; అలంకార శాస్త్రం; సలక్షణ పదాల ఎంపిక, చాతుర్యయుక్తమైన వాక్య నిర్మాణం, గుణ-రసాదులు సాహిత్యంలో ఉండేలా చూడడమంటే ఆ వ్రాతను సాహిత్య ఆభరణాలతో అలంకరించడమే! అందుకే ఈ శాస్త్రాన్ని 'అలంకార శాస్త్రం' అంటారు;
rhetorical, adv. అలంకారయుక్తంగా; భాషాభేషజం తప్ప భావశూన్యంగా ఉండడం; కేవలం తన వాదనని బలపరచడానికి మాత్రమే వాడబడిన భాషావిశేషాలతో కూడి ఉండిన;
rhino, adj. ముక్కుకి సంబంధించిన;
rhinoceros, n. ఖడ్గమృగం; గండ మృగం; ముక్కొమ్మమెకము; ఏకశృంగం; శ్వేతవరాహం;
rhizoid, n. దుంప; నులివేరు; మూల తంతువు;
rhizome, n. భూగర్భకాండం; కొమ్ము;
rhombus, n. రాంబస్; సమాంతర చతుర్భుజం; ఎదురెదురు భుజాలు సమాంతరంగాను, సమంగానూ ఉన్న చతుర్భుజం;
rhombohedral, adj. సమాంతరచతుర్ముఖ; ఎదురెదురు ముఖాలు సమాంతరంగాను, సమంగానూ ఉన్న చతుర్భుఖం;
--USAGE NOTE: rhombohedron
In solid geometry, a rhombohedron is a three-dimensional figure like a cube, except that its faces are not squares but rhombi. It is a special case of a parallelepiped where all edges are the same length. Trigonal trapezohedron, Right rhombic prism, and oblique rhombic prism are special shapes that lie between a cube and a rhombohedron.
rhubarb, n. రేవలచిన్ని; రేవల్చిన్ని; తోటకూర వంటి ఈ ఆకుకూర కాడలు వండుకు తినవచ్చు కానీ, ఆకులు తినకూడదు; ఆకులలో ఆగ్జాలిక్ ఆమ్లం అత్యధికంగా ఉండడం వల్ల అవి విష తుల్యం;
rhyme, n.అంత్యప్రాస; అంత్యానుప్రాస;
rhythm, n. లయ; తాళగతి;
rhythmic cycle, ph. తాళం;
rib, n. పక్క ఎముక; పర్శుక; పార్శ్వాస్తి; డొక్క;
rib cage, ph. పర్శుక పంజరం;
ribbon, n. కంగోరు; నాడా; రిబ్బను;
ribosome, n. రైబోకాయం; (ety.) composite of ribonucleic acid (RNA) and microsome;
right ascension, ph. [astronomy] విష్ణువాంశ; ఆకాశగోళం మీద రేఖాంశం వంటిది; the longitude on the celestial sphere; the east-west coordinate by which the position of a celestial body is ordinarily measured; more precisely, the angular distance of a particular point measured eastward along the celestial equator from the Sun at the March equinox to the point in the question above the earth; [see also] declination;
right hand, ph. కుడిచేయి; వల కేలు; దక్షిణ హస్తం;
right-handed, ph. కుడిచేతి వాటం; దక్షిణ కర;
right side, ph. వలపల;
right triangle, ph. లంబకోణ త్రిభుజం;
right-wing, ph. దాక్షిణ్య భావాలున్న పక్షం;
righteous, adj. ధార్మిక;
rights, n.హక్కులు; స్వామ్యములు;
rigid, adj. కక్కస;
rigmarole, n. సోది; గొడవ; తల, తోక లేని వాక్ ప్రవాహం;
rigor mortis, n. మరణావష్టంబనం; శవం కొయ్యబారడం;
rim, n. (1) అంచు; (2) నేమి; టైరు అతికించడానికి వాడే చట్రం; (3) కప్పీ;
rind, n. పండ్లయొక్క తొక్క;
rinderpest, n. కింక;
ring, n. (1) వలయం; వర్తులం; (2) ఉంగరం; అంగుళి; అంగుళీయకం; (3) శబ్దం; (4) [Math.] చక్రం; గణితంలో వచ్చే ఒక ఊహనం; ఉదాహరణకి పూర్ణాంకముల సమితి (అనగా, ... -3, -2, -1, 0, 1, 2, 3,...) ని చక్రం అంటారు. మరొక విధంగా చెప్పాలంటే ఒక సమితిలోని సభ్యులతో కూడికలు, గుణకారాలు చెయ్యగా వచ్చే సమాధానం కూడ ఆ సమితిలోనే ఉంటే ఆ సమితిని "చక్రం" అంటారు; ఉదాహరణకి పైన చూపిన సమితిలో ఏ రెండు సభ్యులని తీసుకుని కలిపినా, గుణించినా వచ్చే సమాధానం ఆ సమితిలోనే దొరుకుతుంది;
ring, v. i. మోగు;
ring, v. t. మోగించు; కొట్టు;
ringer, n. నాగవాసం; ఘంటా ప్రతీకం; గంటలో మధ్య వేలాడే కాడవంటి లోహ విశేషం; (2) ముమ్మూర్తులా మరొక వ్యక్తి రూపంలో ఉన్న మనిషి;
ringing, n. హోరు; గింగురుమను శబ్దం; మారుమోత;
ringworm, n. తామర; ఒక చర్మరోగం;
rinse, v. t. జాడించు; తొలుచు; ప్రక్షాళించు; పుక్కిలించు; గండూషించు;
romanticism, n. కాల్పనికవాదం; కాల్పనికోద్యమం; భావుకత ఉద్యమం; ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి, ఆనందించే ఉద్యమం;
rome, n. రోమా నగరి; ఇటలీదేశ రాజధాని నగరం;
--USAGE NOTE: Roman, romance
..."The group of words with the root "roman" in the various European languages, such as "romance" and "Romanesque", has a complicated history, but by the middle of the 18th century "romantic" in English and "romantique" in French were both in common use as adjectives of praise for natural phenomena such as views and sunsets, in a sense close to modern English usage but without the amorous connotation. The application of the term to literature first became common in Germany, where the circle around the Schlegel brothers, critics August and Friedrich, began to speak of "romantische Poesie" ("romantic poetry") in the 1790s, contrasting it with "classic" but in terms of spirit rather than merely dating. In Telugu, someone with better sense, instead of a literal translation, came up with a nice term (భావ, భావుకత) that reflects the spirit of this movement!" (Dr. Suresh Kolichala)
... "Romantic poetry in English is essentially a rebellion against the classical or neoclassical norms of literature. ‘Romantic’ has the connotation of giving prime importance to imagination/emotions of the poet/writer. W. Wordsworth, ST Coleridge, and William Blake are the first generation poets. Byron, Shelley, and Keats are second-generation poets. These poets, of course, have their own uniqueness, they didn’t follow a manifesto. The rebellion is a two-pronged attack on classicism: both in content and form. In essence, subjectivity gained currency over objectivity. One consequence: English drama almost disappeared. Common people and their language got accepted as worthy of literature. The background is the French Revolution." - Mani Sarma
roof, n. (1) కొప్పు; కప్పు; ఇంటి కప్పు; నీధ్రం; (2) మిద్దె;
roof garden, ph. మిద్దె తోట;
roof overhang, ph. చూరు;
rook, n. (1) చదరంగంలో ఒక పిక్క (ఏనుగు); (2) సితనీల చంచు కాకం; తెలుపు, నలుపు కలిసిన చంచువు (ముక్కు) కల ఒక రకం కాకి; [biol] Corvus frugilegus;
rovibronic, adj. [phys.] భ్రమణకంపన; ఎలక్ట్రానిక్ స్థితి లోని కంపన మట్టంలో భ్రమణ ఉపమట్టం; రెండు బంతులని ఒక రబ్బరు తాడుతో కట్టి వాటిని గిరగిర తిప్పితే ఆ రెండు బంతుల మధ్య భ్రమణం (తిప్పడం వల్ల), కంపనం (రబ్బరు తాడు వల్ల) కలిసిన భ్రమణకంపనం ఉంటుంది; a rotational sublevel of a vibrational level of an electronic state;
rubeola, n. మీజిల్స్; జ్వరం, దగ్గు, రొంప మొదలైన రోగ లక్షణాలు కనిపించేసరికి పదిరోజులు పడుతుంది. తర్వాత కళ్లు పుసి కట్టడం, తర్వాత కళ్లలోనూ, బుగ్గలమీద, చిన్న చిన్న తెల్లని మచ్చలు వస్తాయి. తర్వాత ఒళ్లంతా పేత పేసినట్టు; చిన్న చిన్న పొక్కులు వస్తాయి; see also rubella and roseola;
rubella, n. జర్మన్ మీజిల్స్; గర్భవతులకి ఈ జబ్బు వస్తే పుట్టబోయే పిల్లకి చాలా ప్రమాదం. కనుక రజస్వల అయేలోగానే ఆడపిల్లలు వేక్సినేషన్ చేయించుకోవాలి. see also rubbeola and roseola;
rubbish, n. చెత్తా చెదారం; తుక్కూ దూగరా; చెత్త;
ruby, n. కెంపు; మాణిక్యం; పద్మరాగం; నవరత్నములలో ఒకటి;
rudimentary property, ph. తన్మాత్ర; హిందూ శాస్త్రాల ప్రకారం శబ్ధం ఆకాశం యొక్క, స్పర్శ వాయువు యొక్క, రూపం అగ్ని యొక్క, గంధం పృధ్వి యొక్క, రసం జలం యొక్క తన్మాత్రలు;
rudiments, n. ప్రాథమిక సూత్రాలు; మూల సూత్రాలు; తన్మాత్రలు; బీజాలు;
ruff, v. t. కోయు; కోసు; తురుపు ముక్కతో కోయు;
rug, n. (1) కంబళి; (2) తివాసీ;
ruin, v. t. రూపుమాపు; నాశనం చేయు;
ruins, n. ఉత్సన్నముల; శిధిలములు;
rule, v. t. ఏలు; పాలించు; పరిపాలించు;
rule, n. (1) సూత్రం; నియమం; నియతి; నిబంధన; కట్టడి; అనుశాసనం; విధి; విధాయకం; ఖాయిదా; చౌకట్టు; రూలు; (2) తిన్నని గీత; కాగితం మీద రాత సౌలభ్యానికి గీసిన గీత; పంక్తి;
according to rule, ph. నియమానుసారం; చౌకట్టు ప్రకారం; చౌకట్టును బట్టి;
ruled paper, ph. రూళ్ళ కాగితం; తిన్నని గీతలుతో ఉన్న కాగితం;
ruler, n. (1) ఏలిక; పాలకుడు; పరిపాలకుడు; (2) రూళ్ళకర్ర; (3) కొలబద్ద;
rules, n. విధులు; నియమాలు; నిబంధనలు;
ruling, adj. పాలక;
ruling class, ph. పాలక వర్గం;
ruling party, ph. పాలక పక్షం;
rum, n. శీధు; మైరేయం; చెరకు రసాన్ని పులియబెట్టి చేసే సారా;
ruminant, n. రోమంధము; నెమరువేయు జంతువు;
ruminate, v. t. నెమరువేయు; రోమంధించు; ఒక విషయాన్ని గురించి నిదానంగా ఆలోచించు;