This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
This dictionary uses American spelling for the primary entry. Equivalent British spellings are also shown as n added feature.
You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
19 Aug 2015.
Part 1: Ma-Me
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
macaw, n. మాకా; రామ చిలుకని పోలిన పెద్ద చిలుక; దీని తొట్టతొలి జన్మస్థలం దక్షిణ అమెరికా ఖండం; [bio.] Ara ararauna of the Psittacidae family;
mace, n. (1) గద; (2) జాపత్రి; జాజికాయ లోపల ఉన్న గింజ చుట్టూ వలలా ఉన్న కవచమే జాపత్రి; జాజికాయ ని nutmeg అనిన్నీ, జాపత్రిని mace అనిన్నీ అంటారు;
machination, n. పథకం; కుట్ర;
machine, n. యంత్రం; మర; జంత్రం; మిషను;
sewing machine, ph. కుట్టు మిషను;
machine learning, ph. యాంత్రికాభ్యాసం; యాంత్రిక అభ్యాసం; యంత్రాలకి స్వయం ప్రతిభతో పనులు చెయ్యడం ఎలాగో నేర్పే శాస్త్రం;
---Machine is a generic word for a piece of equipment that needs electricity or another type of power. An appliance is a large machine that is used in the home.
machinery, n. యంత్రాంగం; యంత్రసముదాయం;
Machiavellian, n. మేకీవిల్లియం; కౌటిల్యం; కుటిల రాజనీతి;
macro, adj. స్థూలమైన; పేద్ద; మహా;
macrocosm, n. స్థూలప్రపంచం; విశ్వం; ప్రపంచం;
macrophage, n. మహాబక్షణి; కణబక్షక కణాలలో కల్లా పెద్దగా తినమరిగిన కణం; ఈ కణాలు పైనుండి చొరబడ్డ సూక్ష్మజీవుల వంటి లాతి జీవులని, చచ్చిపోయిన స్వంత కణజాలన్నీ కబళించెస్తాయి;
mad, n. పిచ్చి; వెర్రి; ఉన్మత్తత;
madam, n. స్త్రీ;
mademoiselle, n. (మేమ్యుజెల్) కుమారి; అవివాహిత;
made, pt. & pp. make;
madness, n. పిచ్చితనం; వెర్రితనం; ఉన్మత్తత;
maelstrom, n. (1) సుడిగుండం; (2) గందరగోళమైన పరిస్థితి;
mafia, n. ముష్కరమూక; చట్టవ్యతిరేకమైన పనులు చేసే రహస్య ముఠా;
magnet, n. సూదంటురాయి; అయస్కాంతం; స్కాంతం; లోహకాంతం; చుంబకం;
bar magnet, ph. అయస్కాంతపు కడ్డీ; అయస్కాంత దండం; దండాయస్కాంతం;
iron magnet, ph. అయస్కాంతం;
magnetic, adj. అయస్కాంత తత్వం; చుంబక; చుంబకీయ;
magnetic field, ph. అయస్కాంత క్షేత్రం;
magnetic pole, ph. అయస్కాంత ధ్రువం;
magnetism, n. (1) అయస్కాంత తత్వం; లోహచుంబకత్వం; (2) ఆకర్షణ;
magnetite, n. కాకిరాయి; ఇనుము యొక్క ముడి పదార్థం; Fe3O4;
magnetization, n. అయస్కాంతీకరణం; స్కాంతీకరణం; ఒక వస్తువుకి అయస్కాంతపు లక్షణాలు వచ్చేలా చెయ్యడం;
magnetized, adj. అయస్కాంతీకృత;
magnetosphere, n. అయస్కాంతావరణం; భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రం;
magnification, n. ఆవర్ధనం; పెద్దగా చెయ్యడం;
magnitude, n. పరిమాణం; పరిమేయత; స్థూలత్వం; కాయస్తం; మహత్వం; ప్రాముఖ్యం; తరగతి;
---Usage Note: magnitude, brightness, absolute and apparent of stars
---నక్షత్రం నిజంగా ఎంత వెలుగుని వెలిగక్కుతున్నాదో చెప్పడం కష్టం; ఒక నక్షత్రం తన ఉపరితలం నుండి ఎంత కాంతిని వెదజల్లుతున్నాదో (దీనినే తేజస్సు లేదా luminosity అంటారు) ఆ నక్షత్రం ఉపరితలం దగ్గరకి వెళ్లి కొలవలేము కదా! కనుక ఆ నక్షత్రాన్ని ఒక ప్రామాణికమైన దూరంలో (అనగా 10 పార్సెక్కుల దూరంలో) నిలిపి చూసినప్పుడు కంటికి కనిపించే దీప్తి ఎంతుంటుందో అంచనా వేస్తాం. ఈ అంచనాని absolute magnitude of a star అని అంటారు; it is the brightness with which a star would appear if placed at a standard distance of 10 parsecs or 32.6 light-years; దీనిని మనం శుద్ధ దీప్తి (absolute brightness) అని కాని శుద్ధ శ్రేణి (absolute magnitude) అని కాని అందాం. ఆ నక్షత్రం తన నిజ స్థానంలో ఉన్నప్పుడు మన కంటికి కనిపించేది దృశ్య దీప్తి (apparent brightness) లేదా దృశ్య శ్రేణి (apparent magnitude).
ఉదాహరణకి మృగవ్యాధుడు-ఎ భూమికి 8.6 జ్యోతిర్వషాల (light-years) దూరంలోఉన్నాడు. భూమి నుండి చూసినప్పుడు ఈ తార దృశ్య దీప్తి -1.46. ఇదే తారని 10 పార్సెక్కుల (= 32.6 జ్యోతిర్-వర్షాల) ప్రామాణిక దూరంలో నిలిపి చూస్తే కనిపించే శుద్ధ దీప్తి +1.4. మన సూర్యుడు భూమికి 8.0 జ్యోతిర్-నిమిషాల దూరంలో ఉన్నాడు. భూమి నుండి చూసినప్పుడు సూర్యుడి దృశ్య దీప్తి - 26.74. సూర్యుడిని 10 పార్సెక్కుల (= 32.6 జ్యోతిర్-వర్షాల) ప్రామాణిక దూరంలో నిలిపి చూస్తే కనిపించే శుద్ధ దీప్తి +4.83. కనుక సూర్యుడి కంటే మృగవ్యాధుడు స్వతహాగా చాలా ఎక్కువ దీప్తి అయిన నక్షత్రం; ఎంతో దూరంగా ఉండబట్టి మినుక్కు, మినుక్కు మంటూ కనబడుతోంది!
star of the first magnitude, ph. మొదటి తరగతి తార; మొదటి తరగతి తార ఆరవ తరగతి తార కంటె 100 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది; మొదటి తరగతి తార రెండవ తరగతి తార కంటె 2.5 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది; రెండవ తరగతి తార మూడవ తరగతి తార కంటె 2.5 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది; ఒక తరగతి తేడా ఉంటే వాటి ప్రకాశత్వంలో ఉరమరగా 100 కి పంచ-మూలం (fifth-root of 100) అంత తేడా ఉంటుంది. ఉదాహరణకి సిరియస్ నక్షత్రం ప్రకాశత్వం -1.47. అక్కడ నుండి 40 డిగ్రీలు ఈశాన్యంగా కనిపించే వసాత్ నక్షత్రం ప్రకాశత్వం 3.53. కనుక వసాత్ అయిదవ తరగతి నక్షత్రం అవుతుంది కనుక వసాత్ కంటె సిరియస్ ప్రకాశత్వం 100 రెట్లు ఎక్కువ!
star of the fourth magnitude, ph. నాల్గవ తరగతి తార;
magnitude of a star (absolute), ph. శుద్ధ శ్రేణి; శుద్ధ దీప్తి; పరమ ప్రకాశత్వం; నక్షత్రాన్ని 10 పార్సెక్ లు = 36.6 జోతిర్వషాల దూరంలో ఉంచితే ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తుందో అదే ఆ నక్షత్రం యొక్క పరమ ప్రకాశత్వం;
magnitude of a star (apparent), ph. దృష్ట ప్రకాశత్వం; మామూలుగా నక్షత్రాన్ని కంటితో చూసినప్పుడు కనిపించే ప్రకాశత్వం; ఇది ఆ నక్షత్రం యొక్క స్వయం ప్రకాశత్వం మీదా, ఆ నక్షత్రానికీ, ప్రేక్షకునికీ మధ్య ఉండే దూరం మీదా ఆధారపడి ఉంటుంది; దీనిని బట్టే నక్షత్రం యొక్క తరగతి నిర్ణయిస్తారు;
magnify, v. t. పెద్దదిగా చేయు;
magnifying glass, ph. భూతద్దం;
maid, n. (1) కన్య; వివాహము కాని బాలిక; (2) ఇంట్లో చిల్లరపనులు చేసే పనిమనిషి;
maid servant, ph. దాసి; పనిమనిషి; ఇంట్లో చిల్లరపనులు చేసే పనిమనిషి;
maiden, n. కన్య; పెళ్లి కాని పిల్ల;
maiden, adj. ప్రప్రథమమైన;
maim, v. t. గాయపరచు; అంగవైకల్యం చేయు; అవిటిగా చేయు;
main, adj. ప్రధాన; ముఖ్య;
main points, ph. ముఖ్యాంశాలు;
mainstay, n. ఆధారం;
maintain, v. t. (1) కాపాడు; రక్షించు; పోషించు; (2) నడిపించు;
mangrove, n. మడ; మడచెట్టు; నల్లమడ; సముద్రపు ఉప్పునీటి వాతావరణంలో పెరిగే నీటి చెట్లు;
forest mangrove, ph. మడాడవి; మడారణ్యం;
mania, n. వెర్రి; వేలంవెర్రి; వ్యామోహం; ఉన్మాదం; మేనియా; మేనియా అంటే డిప్రెషన్ కి వ్యతిరేకంగా ఉండే ఒక వింత మానసిక పరిస్థితి. మేనియాతో కూడిన డిప్రెషన్ ని బైపోలార్ డిజార్డర్ (Bipolar Disorder) అంటారు. బైపోలార్ డిజార్డర్ సంక్లిష్టమైనది,ప్రమాదమైనది; మేనియా లక్షణాలు కొన్ని: (1) అత్యుత్సాహం, అతిశక్తి, అతిసంతోషం (ఒకోసారి మనసులో చెప్పుకోలేని బాధ dysphoria); (2) నిద్ర లేమి (నిద్ర లేకపోయినా శక్తి తగ్గదు); (3) నిర్లక్ష్యం (అప్పులు చేయటం, జూదమాడటం, నగలు కొనెయ్యటం, వివాహేతర సంబంధాలు కలిగించుకోవటం);
(4) చాలా గొప్పవాడిని/దానిని అని భ్రమించడం (Delusions of grandeur); (5) ఆలోచనల పరంపరలు (Flight of ideas), ఒక ఆలోచన పూర్తికాకముందే మరొక ఆలోచన, ఏకాగ్రత లోపించడం;
maniac, n. వెర్రివాడు; అదుపులో లేని బుద్ధులు కలవాడు; ఉన్మాది;
kleptomaniac, ph. అసంకల్పచోరుడు; చౌర్యోన్మాది;
nymphomaniac, ph. రిరంసువు; విపరీతమైన లైంగిక వాంఛగల స్త్రీ; see also succubus and incubus;
manifestation, n. సాక్షాత్కారం; వ్యంజితం; వివర్తం; వ్యాకృతం; ఆవిర్భావం; వ్యక్తి;
manifested, n. వ్యక్తము; వ్యంజితం;
manifesto, n. ఆదర్శ తరంగిణి; ఆదర్శాలు రాసిన ప్రచురణ; ప్రణాళిక;
communist manifesto, ph. కమ్యూనిష్టు వారి ఆదర్శాలు రాసిన ప్రచురణ;
election manifesto, ph. ఎన్నికల ప్రణాళిక;
manifold, n. (1) కారు ఇంజనులో ఒక భాగం; లోపల నుండి బయటకి రెండు, మూడు రంధ్రాలు ఉన్న గది; (2) [math.] a curved surface in a higher-dimensional space; a topologically closed surface or an analog of this in three or more dimensions; a flat surface in a higher-dimensional space is called a hyperplane;
Manila envelope, ph. టపా చెయ్యడానికి అనుకూలమైన గోధుమ రంగు కాగితపు సంచి;
mantis, n. గొల్లభామ; large, usually green, insects distributed worldwide in temperate and tropical habitats. They have triangular heads with bulging eyes supported on flexible necks. They feed on other insects and clasp their prey in forelimbs held up as if in prayer;
mantle, n. (1) ముసుగు; కప్పు; వల్కలం; ఆచ్ఛాదనం; (2) ఒక రకం దీపపు వత్తి;
manufacture, n. తయారీ; ఉత్పత్తి;
manufacturers, n. ఉత్పత్తిదారులు; తయారీదారులు;
manure, n. ఎరువు; గత్త; గొబ్బరం; పాంశువు;
leaf manure, ph. ఆకెరువు;
cow manure, ph. పేడెరువు; సస్యార్ధసంచిత గోమయం;
manuscript, n. చేతితో రాసినది; చేతితో రాసిన గ్రంథం; (rel.) typescript;
many, adj. చాల; ఎన్నో; పెక్కు; పలు; అనేక;
many people, ph. ఎంతోమంది; పెక్కురు; పలువురు; అనేకులు;
map, n. దేశపటం; నక్ష; మానచిత్రం; మేరతేనం; మేపు;
mar, v. t. పాడుచేయు; చెడగొట్టు;
maraud, v. i. కొల్లగొట్టు;
marble, n. (1) పాలరాయి; చలువరాయి; సున్నపురాయి; సంగమల; (2) గోలీకాయ; అల్లికాయ;
march, v. i. నడుచు; పోవు;
march, v. t. నడిపించు;
mare, n. (1) ఆడగుర్రం; ఘోటిక; గోడిగ; బడబ; (2) ఆడ గాడిద;
marginalization, n. ఉపాంతీకరణ; ఒక సమూహంలో కొందరిని తక్కువ ప్రాముఖ్యత లేదా ద్వితీయ స్థానానికి బదిలీ చేసే ప్రక్రియ;
marginalize, n. ఉపాంతరీకరించు; ఉపాంతీకరించు;
margosa, n. వేప; same as neem;
Mariana trench, n. మరియానా కందకం;
marigold, n. బంతి; బంతిపువ్వు;
marinate, v. t. ఊరబెట్టు;
marine, adj. సాగర;
mariner, n. నావికుడు;
marital, adj. వైవాహిక; దాంపత్యపు;
marital problems, ph. దాంపత్యపు స్పర్ధలు;
marjoram, n. (1) మరువం; (2) పాశ్చాత్యదేశాల వంటలలో వాడే ఒక సుగంధ పత్రి; [bot.] Origanum marjorana; ok
marijuana, n. గంజాయి; మేరువానా; [bot.] Cannabis sativa; గంజాయి మొక్క నుండి వచ్చిన మొగ్గలు, పువ్వులు, ఆకులు, వగైరా ని ఎండబెట్టి. చుట్టల మాదిరి చుట్టి కాల్చుతారు; (rel.) హషీష్ అన్నది గంజాయి మొక్క నుండి స్రవించే పాలని ముద్దలా చేసి అమ్ముతారు; దీనిని కూడా చుట్టల మాదిరి చుట్టి కాల్చుతారు;
black money, ph. అక్రమ సంపాదనలో వచ్చిన డబ్బుని నల్ల డబ్బు అంటారు; నల్ల డబ్బును ఆదాయ వనరులలో చూపకుండా దాచిపెట్టు విధానము
మనీ లాండరింగ్ అంటారు; మన దేశమున దీనిని హవాలా కార్య కలాపాలు అని కూడా పిలుస్తారు;
fish market, ph. మైలసంత; చేపల బజారు;
meat market, ph. మైలసంత;
vegetable market, ph. మడిసంత;
market street, ph. విపణి వీధి; అంగడి వాడ;
marketable, adj. అమ్ముడు పోగల;
marketing, n. విక్రయం; వ్యాపారప్రచారం; క్రయవిక్రయాదులు;
marking nut, n. నల్ల జీడిపిక్క;
marks, n. గుణాంకాలు; అంకాలు; పరీక్షలో వచ్చే “మార్కులు”;
maroon, n. ముదరెఱుపు రంగు;
marriage, n. వివాహం; పెండ్లి; పెళ్ళి; దాంపత్యం; (rel.) wedding;
hypergamous marriage, ph. అనులోమ వివాహం;
hypogamous marriage, ph. ప్రతిలోమ వివాహం;
marrow, n. (1) మజ్జ; మూలుగు; మేద; మేదస్సు; కుల్యిక; అస్థిసారం; ఎముక సొన; ఎముకల లోపల ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం; (2) దవ్వ;
marry, v. i. వివాహమాడు; చేపట్టు; పెండ్లి చేసుకొను; పెండ్లాడు; చేసుకొను;
marry, v. t. వివాహం చేయు; పెండ్లి చేయు;
Mars, n. అంగారకుడు; అంగారక గ్రహం; మంగళ గ్రహం; కుజుడు;
marsh, n. చిత్తడినేల; పంకభూమి; మురుగునేల; ఉబ్బనేల; పర్ర; కరవాక;
salt marsh, ph. కరవాక;
marsh gas, ph. చిత్తడి వాయువు; పంక వాయువు;
marshalling yard, n. మారుగుళ్ల దొడ్డి; రైలు పెట్టలని ఒక వరసలో అమర్చడానికి వాడే ప్రదేశం;
mart, n. వ్యాపారస్థలం; కొట్టు; షాపు;
martin, n. ఏట్రింత పిట్ట;
martynia, n. తేలుకొండి కాయ;
martyr, n. త్యాగాళువు; త్యాగి; తన లక్ష్యసిద్ధికి ప్రాణాన్ని త్యాగం చేసిన వ్యక్తి;
marvel, n. వింత; విడ్డూరం; విచిత్రం; అద్భుతం;
mascara, n. కాటుక; కళ్ళకి పూసుకునే ఒక అలంకారం; అంజనం;
macerated, adj. భావన; నానబెట్టిన; ఊరబెట్టిన;
macerated ginger, ph. భావన అల్లం; పంచదారలో ఊరబెట్టిన అల్లం;
masculine, adj. మగ; పుంభావ; పుం;
masculine gender, ph. పుంలింగం;
masculinity, adj. మగతనం; మగటిమి; పుంభావం;
mashed, adj. ఎనిపిన; ముద్ద చేసిన;
mask, n. ముసుగు; ప్రచ్ఛాదకి; బురఖా;
mask, v. t. ముసుగు వేయు; కప్పు; ప్రచ్చాదించు;
masochism, n. ఆత్మ హనన కారుణ్యం; మజోకిస్టులా ప్రవర్తించే తత్వం; తన శరీరానికి బాధ కలిగించే పనులు జరిగితేనే కాని రతి క్రీడలో ఆనందం పొందలేని వింత మానసిక తత్వం; తనకు హాని జరిగే విధంగా ప్రవర్తించే తత్వం; see also sadism;
masochist, n. మజోకిస్టు; శరీరానికి బాధ కలిగించే పనులు జరిగితేనే కాని రతి క్రీడను ఆనందించలేని వ్యక్తి; తనకే హాని జరిగే విధంగా ప్రవర్తించే వ్యక్తి;
mason, n. తాపీ పనివాడు; కాసీదు; కాసే పనివాడు; రాతి పనివాడు; ఇటిక పనివాడు; కుడ్యకారుడు;
mason's level, n. మూలమట్టం;
masonry, n. కట్టడం; రాతి కట్టడం; ఇటిక కట్టడం;
brick masonry, ph. ఇటిక కట్టడం;
stone masonry, ph. రాతి కట్టడం;
mass, adj. తండ; సామూహిక; మూకుమ్మడి;
mass action, ph. తండ చర్య;
mass arrests, ph. మూకుమ్మడి నిర్భంధాలు; మూకుమ్మడి ఆపుదలలు;
mass burial, ph. సామూహిక ఖననం; తండ ఖననం;
mass number, ph. గరిమ సంఖ్య; ఒక మూలకపు అణుగర్భంలో ఉండే ప్రోటానులు, నూట్రానుల మొత్తపు సంఖ్య; ఉదాహరణకి సాధారణ కర్బనంలో 8 ప్రోటానులు, 4 నూట్రానులు ఉంటాయి కనుక కర్బనం గరిమ సంఖ్య 12; ఒక మూలకానికి సమభాగులు ఉన్నయెడల ప్రోటానులని, నూట్రానుల సగటు విలువని కలపగా వచ్చిన సంఖ్య;
mathematics, n. గణితం; లెక్కలు; గణిత శాస్త్రం; అంకశాస్త్రం; అంకవిద్య; అంకతంత్రము; ధూలికర్మ;
mathematician, n. గణిత శావేత్త; గణితాచారి;
matinee, n. పగటాట;
matriarch, n. f. మూలమగువ; కుటుంబానికి అధిపతిగా ఉన్న స్త్రీ;
matriarchal, n. మాతృస్వామ్య; మాతృతంత్ర; మాతృయజమాన;
matriarchy, n. మాతృస్వామ్యం; మాతృతంత్రం; మాతృ అధికారం;
matricide, n. మాతృ హత్య; మాతృఘాతం;
matrix, n. (1) అచ్చు; మూస; వరుధారణి; ప్రస్థారం; (2) చిక్కు; అల్లుడు; పడుగు, పేకలతో అల్లబడ్డది; (3) మాతృక; అడ్డు వరుసలు, నిలువు వరుసలు ఉన్న ఒక గణిత విన్యాసం; (ety.) an arrangement of ites with rows and columns; (4) ఖనిజ నిక్షేపాలతోపాటు కనిపించే శిలామయ, మృత్తికామయ నేపథ్య పదార్థం;
maturity, n. ఈడు; పరిపక్వత; పరిపాకం; ప్రౌఢిమ; ప్రౌఢత్వం;
maul, v. t. చీల్చి చెండాడు;
mausoleum, n. మసోలీ; అద్భుతమైన గోరీ; సమాధి;
maw worm, n. నులి పురుగు;
maxilla, n. దవడలు;
maxi, pref. పెను; పెద్ద;
maxim, n. సూక్తి; నీతివాక్యం; పన్నా; నిజం అని అందరూ ఒప్పుకున్న సూత్రం; see also paradox;
maximization, n. గరిష్టీకరణం;
maximum, n. అత్యధికం; గరిష్ఠం; పరమం; మహత్తమం; ఊర్ధ్వతమం;
maximum limit, ph. గరిష్ఠ పరిమితి;
maze, n. చిక్కు; వ్యూహం;
meadow, n. మైదానం; పచ్చిక బయలు; క్షేత్రం; బీడు;
meager, n. చాలీచాలని; బహుకొద్దిగా;
meal, n. (1) భోజనం; బోనం; భుక్తి; కూడు; ప్రాశనం; ఒక నిర్ధిష్టమైన వేళకి తినే తిండి; (2) పిండి;
corn meal, ph. మొక్కజొన్న పిండి;
meals, n. భోజనాలు; బోనాలు;
mealtime, n. భోజనాల వేళ;
---Usage note: mealtime
---The first meal of the day is breakfast, which is eaten after getting up. Lunch is the meal that is eaten around 12.00 p.m. In most western countries, dinner, which is eaten around 6.00 p.m., is the main meal of the day. Supper is an informal or light evening meal. Brunch, a hybrid between breakfast and lunch, is eaten fairly late in the morning.
mean, adj. నీచ; అల్పబుద్ధిగల;
mean fellow, ph. నీచుడు; లుచ్ఛా;
mean, n. సగటు; సరాసరి;
meander, v. i. మెలికలు తిరుగు;
meandering river, n. తిరుగుళ్ల గంగ;
meaning, n. అర్థం; ఉద్దేశం; భావం; తెల్లం;
figurative meaning, ph. గౌణార్థం; ఉద్దిష్టార్థం;
literal meaning, ph. వాచ్యార్థం; శాబ్దికార్థం;
precise meaning, ph. రూఢ్యర్థం;
special meaning, ph. విశిష్టార్థం;
word by word meaning, ph. ముక్కస్య ముక్కార్థం;
meaningful, adj. సార్థక; అర్థవంత; అర్థయుక్త;
meaningfulness, n. సార్థక్యం; అర్థవంతం; అర్థయుక్తం;
--- The meats of some animals have special names: The meat from a cow (or bull or ox) is beef. The meat from a calf is veal. The meat from a pig is pork or ham. The meat from a goat is mutton. The meat from a deer is venison. Usually the meat from birds is same as the bird’s name: chicken, duck, etc.
meatless, adj. ఆమిష శూన్య;
mechanic, n. యంత్రసూరి;
mechanical, adj. యంత్ర; యాంత్రిక; కీలు;
mechanical advantage, ph. యంత్రలాభం;
mechanical behavior, ph. యాంత్రిక ప్రవర్తన;
mechanical doll, ph. కీలు బొమ్మ; మర బొమ్మ;
mechanical energy, ph. యాంత్రిక శక్తి;
mechanical horse, ph. కీలు గుర్రం;
mechanic, n. యంత్ర సూరి; యంత్రములని మరమ్మత్తు చేసే వ్యక్తి;
mechanics, n. యాంత్రిక శాస్త్రం; యంత్ర శాస్త్రం; యంత్రగతి శాస్త్రం; ప్రయోగించిన బలాన్ని, దానివల్ల కలిగే కదలికనీ అధ్యయనం చేసే శాస్త్రం; (note) mechanics is that area of science concerned with the behaviour of physical bodies when subjected to forces or displacements;
celestial mechanics, ph. ఖగోళ యంత్రగతి శాస్త్రం; ఖగోళ యంత్రశాస్త్రం; నక్షత్రాలు, గ్రహాలు, ఇతర ఖగోళ శాల్తీల కదలికలకి సంబంధించిన శాస్త్రం
relativistic mechanics, ph. సాపేక్ష యంత్రగతి శాస్త్రం; సాపేక్ష యంత్రశాస్త్రం; కాంతి వేగం దరిదాపుల్లో ప్రయాణించే రేణువుల కదలికలకి సంబంధించిన శాస్త్రం
statistical mechanics, ph. సాంఖ్యక యంత్రశాస్త్రం; పదార్థాల సమూహ ఉష్ణగతి లక్షణాల గురించి వివరించే శాస్త్రం;
---Usage Note: Difference between Newtonian and Lagrangian mechanics
--- Newtonian mechanics starts with the three laws, but mathematically, the important one is 𝐹 = 𝑚𝑥¨. When Newton discovered the laws of motion, he had no idea about Lagrangian mechanics (in fact, Lagrange came almost 50 years after his death), so at the time, the laws were essentially empirical laws. So when you first learn about them, you’re usually just told, F = ma is just true.
--- Lagrangian mechanics start from a deeper principle and through which, you can derive Newton’s laws. We start with a scalar function of position and velocity (as a function of position) which basically encodes possible paths in space (so you also need to add in a "start" point and an "end" point). Lagrangian mechanics then asks: “I have all these possible paths in space, how do I select a path that is physically correct?”
mechanism, n. యంత్రాంగం;
balance mechanism, ph. సంతులన యంత్రాంగం;
mechanized, adj. యంత్రసజ్జిత;
medal, n. పతకం; బిరుదుబిళ్ళ; మెడలు;
media, n. pl. [phys.] (1) యానకాలు; (2) మాధ్యమాలు; ప్రసార మాధ్యమాలు; (sing.) medium;
multimedia, ph. బహుళ మాధ్యమాలు;
yellow media, ph. పచ్చ మాధ్యమాలు; ప్రజలని ఉద్రేకపరచడానికి నిజంతో నిమిత్తం లేకుండా రంగురంగుల బొమ్మలతోటీ, పతాక శీర్షికలతోటీ వార్తలని ప్రసారం చెయ్యడం;
median, n. నడిమి; మధ్య రేఖ;
median strip, ph. రహదారి యొక్క ఇరువైపుల బాటలకీ మధ్యనున్న జాగా;
mediation, n. మాధ్యస్థం; మధ్యవర్తిత్వం;
mediator, n. మధ్యవర్తి; మాధ్యస్థుడు;
medical, adj. వైద్యసంబంధమైన; ఆరోగ్య సంబంధమైన;
medical treatment, ph. చికిత్స;
medicated, adj. ఔషధీకృత;
medicine, n. (1) (మెడ్సిన్) మందు; ఔషధం; ఆయుర్‌ద్రవ్యం; (2)(మెడిసిన్) వైద్యశాస్త్రం; వైద్య విద్య;
communication medium, ph. ప్రసార మాధ్యమం; ప్రసార యానకం;
organic medium, ph. కర్బన మాధ్యమం;
reaction medium, ph. చర్యా మాధ్యమం;
Telugu medium, ph. తెలుగు మాధ్యమం;
Mediterranean sea, n. మధ్యధరా సముద్రం; నడిపుడమి కడలి;
Medulla, n. దవ్వ; దూట; ఏ శరీరాంగానికి అయినా అంతర్భాగంలో ఉండే కట్టడం;
Medulla oblongata, ph. మజ్జా ముఖం; మెదడు వెనక ఉండి మన శ్వాసని నియంత్రించే ఒక కట్టడం;
medulloblastoma, n. చిన్న పిల్లలకి మెదడులో వచ్చే ఒక రకమైన కేన్‌సరు కంతి;
meet, v. t కలుసుకొను; తగులు;
meeting, n. సభ; సమావేశం; కలయిక; మీటింగు;
closed-door meeting, ph. జనాంతిక సమావేశం;
orientation meeting, ph. దృగ్విన్యాస సమావేశం;
summit meeting, ph. శిఖరాగ్ర సమావేశం;
mega, adj. మహత్; బృహత్; స్థూల; మెగా;
Mega, pref. (1) మిలియను; 1,000,000; (2) కంప్యూటరు రంగంలో మెగా అంటే 1,048,576=220;
Megabits, n. మిలియను ద్వింకములు; కంప్యూటరు రంగంలో మాత్రం 1,048,576=220 ద్వింకములు; మెగా బిట్లు;
Megrez, n. అత్రి నక్షత్రం; సప్తర్షి మండలం (Big Dipper) లో కాంటివిహీనమైన తార;
melanosis, n. శరీరపు రంగు నల్లగా మారటం; మెలనిన్ తయారీ ఓపం వల్ల వచ్చే లక్షణం;
melee, n. (మేలే) తొక్కిసలాట;
mellifluous, adj. తేనెవలె తియ్యనైన;
melodrama, n. మోతాదు మించిన ఉద్వేగంతో, సాధారణంగా సుఖాంతం అయే నాటకం కాని, సినిమా కాని; నాటకీయత ఎక్కువ, పాత్ర పోషణ తక్కువ ఉన్న నాటకం కాని, సినిమా కాని; ఎత్తిపొడవడానికి వాడే మాట; A melodrama is a story or play in which there are a lot of exciting or sad events and in which people's emotions are very exaggerated. Key constitutive factors: pathos, overwrought or heightened emotion, moral polarization (good vs. evil), non-classical narrative structure (e.g., use of extreme coincidences);
melody, n. శ్రావ్యత; రక్తి; మాధుర్యము; స్వర మాధుర్యం; a sweet and agreeable relation between successive notes; [see also] harmony;
melon, n. కర్బూజా; పుచ్చపండు; తర్బూజా;
muskmelon, ph. కర్బూజా; పుచ్చపండు;
watermelon, ph. పుచ్చపండు;
melt, v. i. కరుగు; v. t. కరగించు; చలించు;
melting point, ph. కరుగు స్థానం; ద్రవీభవన స్థానం; కరిగే ఉష్ణోగ్రత;
member, n. సభ్యుడు; సభ్యురాలు; కూటరి; మెంబరు;
membrane, n. పొర; త్వచం; త్వక్కు; పటలం; కుబుసం; జిలి;
cell membrane, ph. కణ త్వచం; కణ పటలం;
meme, n. అనుకరణ; హాస్యానుకరణ; అంతర్జాలంలో ఒకరిని చూసి మరొకరు అనుకరించడం; an image, video, piece of text, etc., typically humorous in nature, that is copied and spread rapidly by internet users, often with slight variations; a word coined by Richard Dawkins, the evolutionary biologist, to represent a unit of "social gossip" (that rhymes with gene) that gets mutated and transmitted in social circles;
mermaid, n. మత్స్య కన్య; సగం స్త్రీ, సగం చేప అయిన వింత కల్పిత జీవి; see also echidna;
merry-go-round, n. రంగులరాట్నం; మెర్రీగుర్రం;
mesa, n. నెత్తం; కొండనెత్తము; పీఠభూమి; సానువు; కోన; కొండ మీద చదునైన ప్రదేశం;
mesh, n. వలయం; జల్లి; జాలీ; see also grid;
mesh, v. i. సరితూగు; అమురు; జతపడు;
mesmerism, n. మెస్మరీయం; మెస్మరిజం; ఒక వ్యక్తికి ఒక విధమైన మైకం కల్పించి ఆ వ్యక్తిచేత చెప్పిన విధంగా ప్రవర్తింపజేసే పద్ధతి;
meso, pref. మధ్య;
mesoblast, n. మధ్యాస్తరం; అంతశ్చర్మానికి, బహిశ్చర్మానికి మధ్యనున్న పొర; mesoderm;
mesosphere, n. మధ్యావరణం; ఆస్తరావరణము పైన 85కి మీ వరకు విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఎత్తు పెరిగే కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇదే భూ వాతావరణంలోో చల్లని పొర. ఇక్కడే వాతావరణంలో ప్రవేశించిన ఉల్కలు కాలి మండిపోయేది;
mesozoic era, n. మధ్య జీవయుగం;
mess, n. (1) భోజనశాల; పాకశాల; మెస్సు; (2) చాలా చిందరవందరగా ఉన్న స్థితి;
messenger, n. వార్తాహరుడు; దూత; వార్తికుడు; చారుడు; pl. హర్కారాలు అనగా వార్తాహరులు;
messenger RNA, ph. దూతిక రైకామ్లం; the form of RNA in which genetic information transcribed from DNA as a sequence of bases is transferred to a ribosome;
metamorphosis, n. మార్పు; పరిపూర్ణమైన మార్పు; రూపవిక్రియ; రూపపరిణామం;
metaphor, n. రూపకాలంకారం; అధ్యారోపం;
metaphysics, n. అధిభౌతిక శాస్త్రం; పారలౌకిక శాస్త్రం; ఆధ్యాత్మిక విద్య; ఇది తత్వశాస్త్రం (ఫిలాసఫీ)లో ఒక విభాగం. మనకు తెలిసిన వాస్తవ ప్రపంచాన్ని అన్ని రకాలుగా అధ్యయనం చేసేదే అధిభౌతిక శాస్త్రం. దీనికి ఊహాప్రపంచంతో సంబంధం లేదు. Metaphysics is the branch of philosophy that examines the fundamental nature of reality, including the relationship between mind and matter, between substance and attribute, and between potentiality and actuality; meta = beyond or above; metaphysics deals with things beyond physical experience;
metathesis, n. [ling.] వర్ణవ్యత్యయం; శబ్ద ఉచ్చారణలో అక్షరాల వరస మారుగుళ్లు అవడం; ఉదా: ఇంగ్లీషులో రెండు హల్లులని వరస తప్పించి ఉచ్చరించడం (ask ని aks అని ఉచ్చరించడం);
metempsychosis, n. పరకాయప్రవేశం;
meteor, n. ఉల్క; వాతావరణం లోనికి ప్రవేశించిన తల తెగిన తోకచుక్క; అంతరిక్షం నుండి వాతావరణం గుండా కిందకి పడే ఒక ఘన పదార్థం;
meteor shower, ph. ఉల్కాపాతం;
meteorite, n. ఉల్కాశిల; భూపతనమైన ఉల్క; కింద పడ్డ ఉల్క;
meteoroid, n. తల తెగిన తోకచుక్క; శిధిలమైన తోకచుక్క; సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూన్న రాయి వంటి ఘనపదార్థం; సౌర కుటుంబంలో ఇటువంటివి చాలా ఉన్నాయి; ఇవి భూమి వాతావరణంలో ప్రవేశించి భూపతనమైతే అప్పుడు వాటిని ఉల్కలు అంటారు;
meteorology, n. వాతావరణ శాస్త్రం; [Gr. meteoron = గాలిలో ఉండేది];
meter, metre [Br.] n. (1) మీటరు; మాపకం; కొలమానం; మితి; (2) పద్యపాదంలో ఉన్న గణాల సమాఖ్య;
barometer, n. భారమితి; వాతావరణంలోని గాలి బరువుని కొలిచేది;
thermometer, n. ఉష్ణమితి; ఉష్ణంపుల్ల; వేడిని కొలిచేది; థర్మామీటరు;
methanal, n. పాడాల్; కాష్టాల్; మెతనాలు; ఫార్మాల్డిహైడు; CH2O;
methane, n. ఏకేను; పాడేను; మెతేను; చిత్తడి వాయువు; పంక వాయువు; CH4;
methanoic acid, n. పాడోయిక్ ఆమ్లం; పిపీలికామ్లం; ఫార్మిక్ ఆమ్లం; HCOOH;
methanol, n. పాడోల్; కాష్టోల్; మెతనోలు; మెతల్ ఆల్కహాలు; CH3OH;
method, n. పద్ధతి; మార్గం; విధి; విధానం;
common sense method, ph. లౌకిక పద్ధతి;
historical method, ph. చారిత్రక పద్ధతి;
systematic method, ph. క్రమ పద్ధతి;
methyl alcohol, n. కాష్టోల్; పాడోల్; కర్రసారా; మెతనోలు; మెతల్ ఆల్కహాలు;
methyl group, n. మెతల్ గుంపు;
methyl radical, n. మెతల్ రాసి;
meticulously, adv. అతి జాగ్రత్తగా;
metonymy, n. ఇంగ్లీషు భాషలో ఒక అలంకారం; ఒక మాటకి బదులు దానికి దగ్గర సంబంధం ఉన్న మరొక మాటని వాడడం; ఉ. సనాతన ధర్మం నశించి పోతోందని శృంగేరీ మఠం ఆక్రోశించింది అన్నప్పుడు శృంగేరీ మఠాధిపతి సంతాపం వెలిబుచ్చేరని అర్థం చెప్పుకోవాలి;
metre, n. మీటరు; (note) మెట్రిక్ పద్ధతిలో ఈ వర్ణక్రమాన్నే వాడాలి;
microprocessor, n. సూక్ష్మసంకలిని; మైక్రోప్రాసెసర్; వేలి గోరు ప్రమాణంలో ఉన్న అర్ధవాహిని చితుకు మీద నిర్మించిన కలన యంత్రం;
microscope, n. సూక్ష్మదర్శిని; కంటికి కనబడనంత చిన్నగా ఉన్న వస్తువులని చూడడానికి వాడే పరికరం;
microsome, n. సూక్ష్మకాయం; (lit.) small body;
mid, adj. మధ్య; నడు; అర్ధ;
middle, adj. మధ్య; నడుమ; అంతరాళ;
middle man, ph. మధ్యవర్తి; దళారి;
middle point, ph. అంతరాళం;
midnight, n. అర్ధరాత్రి; నడురేయి; నడిరేయి;
midrib, మధ్యశిర; ఈనె;
midwife, n. మంత్రసాని;
migrain, n. అనంతావర్తం; పార్శ్వపు నొప్పి; ఒక రకమైన విపరీతమైన తలనొప్పి; ఉదయం మొదలై రోజంతా ఉంటుంది. వెలుగు, ధ్వనులు నొప్పిని అధికం చెయ్యొచ్చు. ఒక్కోసారి నొప్పి రావడానికి ముందు వాంతిరావడం, కడుపులో తిప్పినట్లుంటుంది.
migrant, n. ప్రవాసి; వలస పోయిన వ్యక్తి;
migration, n. వలస;
migration routes, ph. వలస వీధులు;
mil, n. సహస్రాంశము; వెయ్యవ భాగం;
mild, adj. సన్న; మంద; మేదక;
mild breeze, ph. మందమారుతం;
mildew, n. బూడిద తెగులు; మజ్జిగ తెగులు;
mile, n. మైలు; (note) 8 కిలోమీటర్లు 5 మైళ్లకి సమానం; దూరాన్ని కొలిచే ఒక కొలమానం;
nautical mile, ph. Nautical miles are used to measure the distance traveled through the water. A nautical mile is slightly longer than a mile on land, equaling 1.1508 land-measured (or statute) miles. The nautical mile is based on the Earth’s longitude and latitude coordinates, with one nautical mile equaling one minute of latitude;
milestone, n. మైలురాయి;
milieu, n. సంగతి, సందర్భం; సామాజిక వాతావరణం;
military, n. సైన్యం; మిలిటరీ;
militia, n. పౌరసేన;
milk, adj. పాల; క్షీరం; గొల్ల;
milk, n. పాలు; క్షీరం; దుగ్ధం; పయస్సు;
breast milk, ph. చనుబాలు; స్తన్యం;
condensed milk, ph. చిలువాలు;
homogenized milk, ph. పాలని అతి సన్నటి బెజ్జాలు ఉన్న జల్లెడ గుండా ఎక్కువ పీడనంతో పోనిచ్చి, వెన్నని అతి సూక్ష్మ కణాలుగా విభజించి, పాలు, వెన్న విడిపోకుండా చేసే పధ్ధతి;
Pastuerized milk, ph. పాలని వేడి చేసి పాలల్లోని సూక్ష్మజీవులని చంపగా మిగిలిన ఆరోగ్యకరమైన పాలు;
milkshake, పాలసుగంధి; పాలల్లో ఐస్‌క్రీమ్ కలిపి రంగరించగా వచ్చినది;
milk teeth, n. పాలపండ్లు;
Milky Way, n. పాలపుంత; పాలవెల్లి; పాలకడలి; ఆకాశ గంగ; సోమధార; దివిజ గంగ; మన క్షీరసాగరం (గేలక్సీ) పేరు;
thicker Milky Way, ph. పాలకడలి;
thinner Milky Way, ph. ఆకాశ గంగ; దివిజ గంగ;
mill, n. మర; గానుగ; తిరుగలి; మిల్లు;
flour mill, ph. పిండి మర;
rice mill, ph. ధాన్యం మర; జిన్ను;
mill, v. t. మరపట్టు; ఆడించు; మరపట్టించు; ఆడు; ఆడించు;
milled, adj. మరపట్టిన; మరాడించిన;
millennials, n. pl. జనాభాలో సా. శ. 1980 - 2000 మధ్యలో పుట్టినవారు;
millennium, n. సహస్రాబ్దం; వెయ్యి సంవత్సరముల కాలం;
millets, n. (1) చిరు ధాన్యాలు; సిరి ధాన్యాలు; జొన్నలు, సజ్జ, రాగి, మొదలగునవి; (ety.) చిరు ధాన్యాలు because of smaller seeds compared to rice, wheat, corn, and other larger ones; సిరి ధాన్యాలు is a more recent coinage to promote their use;
barnyard millets, ph. ఊదలు; ఊదర్లు;
brown-top millets, ph. అండు కొర్రలు;
finger millets, ph. రాగి; రాగులు;
foxtail millets, ph. కొర్ర; కొర్రలు;
great millets, ph. జొన్న; జొన్నలు;
Italian millets, ph. కొర్ర; కొర్రలు;
Kodo millets, ph. ఊద; ఊదలు; అరికె; అరికెలు;
little millets, ph. సామ; సామలు;
spiked millets, ph. సజ్జ; సజ్జలు;
million, n. పది లక్షలు; మిలియను;
millipede, n. రోకలిబండ; గాజుపురుగు; సహస్ర పాది; ఎన్నో కాళ్లుగల ఒక క్రిమి; (lit.) వెయ్యి పాదములు కలది; నిజానికి సహస్రపాదికి 200-400 కాళ్లే ఉంటాయి; ప్రతి శరీర ఖండానికి (body segment) రెండు జతల కాళ్ళు ఉండటం వీటి లక్షణం;
millstone, n. తిరగలి; తిరుగలి; తిరుగలి రాయి;
mime, n. మూకాభినయం;
mimesis, n. అనుకరణ;
mimic, v. t. అనుకరించు;
mimicry, n. పరిహాసానుకరణ; స్వరవంచన; ధ్వన్యనుకరణ;
mince, v. t. పొట్టుచేయు; చిన్న ముక్కలుగా తరుగు;
minced jackfruit, ph. పనస పొట్టు;
mind, n. మనస్సు; మది; అంతఃకరణం; అంతరంగం; ఉల్లము; డెందము; ఎద; ఎడద; చేతనం; చేతస్సు; చిత్తము; భౌతికమైన మెదడులో, కంటికి కనపడని విధంగా, భౌతికమైన ఉనికి లేని మనస్సు ఉంటుందనే భావం ఒకటి ఉంది; ఈ మెదడుకి, మనస్సుకీ మధ్య ఉండే లంకెనే ఆత్మ అంటారని తాత్వికుడు రెనే డెకార్ట్ అంటారు; ఇంగ్లీషులో mind అనే మాటలో వేదాంతం నాలుగు స్థాయిలను గుర్తిస్తుంది: (1) మనస్సు - ఆలోచనలకు మూలం. (2) బుద్ధి అంటే వివేకము. అనగా, ఈ ఆలోచన మంచిది, ఆ వాక్యము సత్యము అనుకునే తెలివితేటలు. (3) చిత్తము. ఇంగ్లీషు అనువాదం consciousness. Krishna consciousness అంటే చిత్తములో కృష్ణునికి తప్ప ఎవరికీ స్థానం ఉండకపోవడం. అందుకే ఆయన చిత్తచోరుడు. (4) అహంకారము. అహం అంటే నేను. మమ అంటే నాది. నేను చాలాగొప్పవాణ్ణి అనుకోవడం అహంకారం. అన్నీ నావి అనుకోవడం మమకారము.
frame of mind, ph. చిత్తవృత్తి;
peace of mind, ph. మనశ్శాంతి;
presence of mind, ph. సద్యస్ఫూర్తి;
state of mind, ph. చిత్తవృత్తి;
subconscious mind, ph. ఉపచేతనం;
mind-body system, ph. దేహేంద్రియ మనస్సంఘాతము;
mine, n. (1) గని; ఖని; (2) ఆకరం; (3) మందుపాతర;
mine, poss. pron. నాది; నావి; అస్మదీయం;
miner, n. m. ఖనకుడు;
mineral, n. ఖనిజం;
mineral salt, ph. ఖనిజ లవణం;
mineral oil, ph. ఖనిజ తైలము; ఖనిజపు చమురు;
mineral pitch, ph. గంజిత్తు; గని+జిత్తు; శిలాజిత్; a dark, semisolid, bituminous substance that is used in India and Nepal to treat a variety of ailments, including inflammation, weakness, bone fractures, bleeding, and wounds;
mineral spring, ph. గనిజబ్బుగ్గ;
mineralogy, n. ఖనిజ శాస్త్రం;
mini, pref. పిట్ట; పిల్ల; చిన్న;
miniature, adj. చిట్టి; బుల్లి; లఘు;
minimal, adj. అల్పిష్ఠ; కనిష్ఠ; కనీస;
minimization, n. కనిష్ఠీకరణం;
minimize, v. t. అత్యల్పించు; కనిష్ఠీకరించు;
minimum, n. అత్యల్పం; కనిష్ఠం; కనీసం; అధమం;
at the minimum, ph. హీనపక్షం;
minister, n. (1) మంత్రి; అమాత్యుడు; సచివుడు; (2) క్రైస్తవ మత గురువు; చర్చిలో ఒక మతాధికారి;
ministry, n. (1) మంత్రివర్గం; అమాత్య కూటమి; (2) మంత్రిత్వం;
minor, adj. చిరుత; చిన్న; లఘు; మంద;
minor axis, ph. లఘు అక్షం;
minor crime, ph. ఉపపాపం; చిన్నతప్పు;
minor offense, ph. స్వల్పనేరం; మందాపరాధం;
minor, n. చిరుత; అయుక్తుడు; బాలుడు; బాలిక; 18 సంవత్సరముల వయస్సు నిండని వ్యక్తి; మైనరు;
minorities, n. బడుగు వర్గాలు; అల్పసంఖ్యాక వర్గాలు;
minutes, n. pl. (మినిట్స్) సభలలో జరిగే వ్యవహార సంగ్రహం;
miracle, n. మహాత్మ్యం; మహాద్భుతం;
mirage, n. ఎండమావి; మృగతృష్ణ; మరీచిక; మంచి ఎండలో కళ్ళకు దూరంలో నీళ్ళు ఉన్నట్టు గోచరించడాన్ని ఎండమావులు అంటారు. ఎడారుల్లో ఈ స్థితి ఏర్పడుతుంది. తృష్ణ అంటే దప్పిక. మృగతృష్ణ అంటే జంతువులకు దప్పిక కలిగించేది;
mischievousness, n. పెంకితనం; రాలుగాయితనం; ఆకతాయితనం; తుంటరితనం; దుడుకుతనం;
misconception, n. అపోహ; భ్రమ, తప్పుభావము; అపార్థము; దురూహ;
misconduct, n. దుష్‌ప్రవర్తన; దుర్నడత;
misdeed, n. పొరపాటు; చెడ్డపని; దుష్కృత్యం; కాకృత్యం;
misdemeanor, n. కపటచేష్ట; చెడ్డపని; కీలు; అకృత్యం; దుష్‌కృతం; దుష్‌ప్రవర్తన; దురాకృతం; దుశ్చేష్ట; వికర్మ; ఉన్మార్గం; చెడు దారి; చట్టవిరుద్ధమైన పని;
miser, n. లోభి; పిసినిగొట్టు; పిసినారి; పీనాసి; కింపచానుఁడు; అడియరి; టక్కుఁడు;
extreme miser, ph. పరమ లోభి;
miserliness, n. లోభం; లోభత్వం; కాపీనం; పిసినారితనం; పిసినిగొట్టుతనం;
misfortune, n. దురదృష్టం; ఓగు;
misgiving, n. సందేహం; సంశయం;
mishap, n. దుర్ఘటన; విపత్తు; అశ్రి;
misinformation, n. అపసమాచారం;
misinterpretation, n. వక్రీకరణం; తప్పు అర్థం చెప్పడం; దురర్థం చెప్పడం;
mislead, v. t. తప్పుదారిలో పెట్టు; మభ్యపరచు;
misleading statement, ph. విప్రలంభం;
mismatch, n. విజ్జోడు; జత కలవకపోవడం;
mismatched pair, ph. విజ్జోడు;
misnomer, n. దుర్నామం; లక్షణాలకి సరిపడని పేరు;
misogynist, n. ఆడవారంటే చులకన భావం కల వ్యక్తి; పురుషాహంకారి; ఆడ జాతి యెడల వివక్ష చూపే వ్యక్తి;
misprint, n. అచ్చుతప్పు; ముద్రారాక్షసం;
misrepresentation, n. మభ్యపరచుట; అసత్యకథనం; తప్పుగా వర్ణించడం;
missile, n. కంపణము; అవాయి; క్షిపణి;
guided missile, ph. మార్గణ క్షిపణి; మార్గణం;
heat-seeking missile, ph, ఉష్ణ మార్గణం;
miss, v. i. ఏమారు;
how did I miss this, ph. నేను ఎట్లు ఏమారితిని?
missing, adj. తొస్సి;
missing tooth, ph. తొస్సి పన్ను;
missing syllable, ph. తొస్సి మాట;
mission, n. (1) మఠం; (2) ప్రచారక వర్గం; (3) బృహత్కార్యం;
missionaries, n. మతబోధకులు; మతప్రచారకులు; మిషనరీలు;
mist, n. కుహేళి; తుషారం; సూక్ష్మమైన బిందువులు గాలిలో తేలియాడిన పరిస్థితి;
mistake, n. పొరపాటు; తప్పు; కైతప్పు;
printing mistake, ph. అచ్చుతప్పు; ముద్రారాక్షసం;
mistrust, n. అపనమ్మకం;
mistletoe, n. బదనిక; పరభుక్కి అయిన ఒక జాతి మొక్క;
mistress, n. ఉపపత్ని; ఉంపుడుకత్తె; దయిత; ధర్మకార్యాలకు పీటల మీద భర్త ప్రక్కన కూర్చునే అర్హత గల వాళ్లనే ధర్మపత్నులంటారు.
మిగిలిన వాళ్లందరూ వల్లభలు, దయితలు;
misunderstanding, n. అపార్థం; అపావబోధము;
misuse, n. దుర్వినియోగం;
mite, n. తవుటి పురుగు;
mitigation, n. ఉపశాంతి;
mix, v. t. కలుపు; రంగరించు; కలబోయు; మిళాయించు; మేళవించు;
mix, n. మాదక ద్రవ్యాలలో కలిపే పళ్లరసం వంటి పానీయం;
mixed, adj. కలగలసిన; కలగలుపు; కదంబ; మిళిత; చంపూ;
mixture, n. మిశ్రమం; కలగలుపు; కరంబం; కదంబకం; మిళితం;
mix-up, n. తారుమారు; గందరగోళం; తికమక;
Mizar, n. వసిష్ట నక్షత్రం; Mizar and Alcor are two stars forming a naked eye double in the handle of the Big Dipper (or Plough) asterism in the constellation of Ursa Major. Mizar is the second star from the end of the Big Dipper's handle, and Alcor, its fainter companion. Mizar is really four stars, and Alcor is really two stars. So what we see as two stars are really six in one!
mnemonics, n. pl. స్పోరకములు; జ్ఞాపకార్థం ఉంచుకొనే గుర్తులు;
moan, n. మూలుగు; నిట్టూర్పు;
moat, n. కందకం; ఆగడ్త; పరిఖ; దవంత్రి;
mob, n. మూక; దండు; తొంబ; మూకప్రజ; గుంపు, అల్లరిమూక; క్రమశిక్షణ పాటించని జన సమూహం;
modernization, n. నవీకరణ; అధునీకరణం; ఆధునికీకరణ; ఇందీవలింపు;
modest, adj. వినీత;
modest person, ph. వినీతుడు; సొంత డబ్బా కొట్టుకోని మనిషి;
modesty, n. వినయం; నమ్రత; అణకువ;
modicum, n. మోతాదు;
modification, n. మార్పు; సవరింపు;
modular, adj. గుళిక; ఘడీ;
modular arithmetic, ph. గుళిక గణితం; ఘడీ గణితం;
modular form, ph. ఘడీ స్వరూపం;
module, n. గుళిక;
Modus operandi, ph. A Latin phrase meaning, "a distinct pattern or method of operation especially that indicates or suggests the work of a single criminal in more than one crime."
Modus ponens, ph. A Latin phrase meaning, "a form of deductive argument and a rule of logical inference that involves reasoning from a hypothetical proposition. If the antecedent is true, then the consequent must also be true. For example, "If A is true, B is true; but A is true; therefore, B is true;"
Modus tollens, ph. A deductive argument form in propositional logic that involves denying the consequent of an "if-then statement;" For example, if you know that it's not raining and you also know that "If it rains, then the streets are wet", you can conclude that the streets are not wet;
Modus vivendi, ph. A Latin phrase meaning, "an agreement or arrangement that allows conflicting parties to coexist peacefully. For example, "Our two countries must put aside the memory of war and seek a modus vivendi."
molars, n. pl. దంతములు; చర్వణకములు; బుగ్గవైపు పళ్లు; మానవులలో ఇవి మూడు జతలు ఉంటాయి; వీటిలో మూడవ జతని జ్ఞానదంతాలు అంటారు.
molasses, n. ఇక్షుసారం; మొలాసిస్;
mold, [Br.] mould, n. (1) బూజు; బూడిద తెగులు; చెమ్మగానున్న ఆహారపదార్థాలపై మొలిచే బూజు; ఒక రకం శిలీంధ్రం; (2) అచ్చు; మూస;
slime mold, ph. జిగురు బూజు;
mold, [Br.] mould, v. t. తీర్చిదిద్దు; మలుచు;
mole, n. (1) పుట్టుమచ్చ; (2) భూమిలో బొరియ చేసికొని బతికే ఒక ఎలుక జాతి చిన్న జంతువు; (3) మన మధ్యలో చేరిన శత్రుపక్షం వారి గూఢచారి; (4) ఒక బణువులో పదార్థం ఎంతుందో చెప్పే ఒక కొలమానం;
molecule, n. బణువు; (ety.) బహుళంగా, అంటే మెండుగా, ఉన్న అణు సముదాయం;
molecular formula, ph. బణు సాంఖ్యక్రమం; ఒకొక్క బణువులో ఎన్నెన్ని అణువులు ఉన్నాయో సూచించే పద్ధతి; ఉదా. నీరు = H2O, పంచదార = C6H12O6;
molecular weight, ph. బణుభారం;
molt, n. పాము కుబుసం; పాము పొర; నిర్మోకం;
molten, adj. కరిగించిన; కరగబెట్టిన;
molting, v. i. కుబుసం విడవడం; పొర విడవడం; ecdysis;
Molybdenum, n. మోలిబ్డినం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 42, సంక్షిప్త నామం; Mo) [Gr. molybdos = lead];
Mom, n. అమ్మ;
moment, n. (1) క్షణం; సమయం; (2) ఘాతిక; భ్రామకం;
dipole moment, ph. ద్విధ్రువ భ్రామకం;
every moment, ph. క్షణక్షణం; అనుక్షణం;
moment of inertia, ph. జడత్వ భ్రామకం;
momentum, n. (1) [Phy.] భారగతి; (exp.) భారం అంటే weight, గతి అంటే motion అనీ అనుకోవాలి; రయజాతం; (exp.) రయం అంటే velocity కనుక రయం నుండి పుట్టినది రయజాతం; ద్రవ్యవేగం; (exp.) ద్రవ్యం అంటే mass, వేగం అంటే velocity అనీ అనుకుంటే దీని అర్థం అవగతం అవుతుంది; momentum = mv = mass x velocity; (2) ఊపు; ఉద్వేగం; ఆవేగం;
orbital angular momentum, ph. గతి కోణీయ ఉద్వేగం; ప్రదక్షణం చెయ్యడం వల్ల కలిగే కోణీయ ఉద్వేగం;
spin angular momentum, ph. భ్రమణ కోణీయ ఉద్వేగం; ఆత్మభ్రమణం వల్ల కలిగే కోణీయ ఉద్వేగం;
monad, n. సూక్ష్మాత్మ;
finite monad, ph. ప్రత్యగాత్మ;
monarch, n. m. ఏకరాజు; సార్వభౌముడు; చక్రవర్తి;
monarchy, n. సార్వభౌమత్వం; రాచరికం; ఏకరాజాధిపత్యము; government by a monarch or single sovereign ruler;
monastery, n. విహారం; సాధువులు, భిక్కులు, మొదలైన మత నిష్ఠాపరులు నివసించే చోటు;
Monday, n. సోమవారం; ఇందువారం;
mondegreen, n. ఒక పాటలో కానీ, పద్యంలో కానీ అసలు మాటలకి బదులు మరేవో మాటలు వాడడం; (1) A word or phrase inspired by misheard language; (2) A made-up lyric or line that replaces a song's real words;
monetary, adj. ద్రవ్యసంబంధ; డబ్బు సరఫరా, ప్రసరణలకి సంబంధించిన; (rel.) fiscal;
monosodium glutamate, n. చైనా ఉప్పు; గ్లూటామిక్ ఆమ్లంతో సోడియం కలవగా వచ్చే లవణం; చైనా, జపాను వంటలలో ఈ ఉప్పుని విరివిగా వాడతారు; MSG; C5H8NNaO4;
monotheism, n. ఏకేశ్వరోపాసన; ఏకేశ్వరవాదం; ఒకడే దేవుడు ఉన్నాడు అనే నమ్మకం;
monotone, n.ఏకదిష్టం; ఏకశృతం;
monotonic, adj. ఏకదిష్ట; ఏకశృత;
monotonic function, ph. ఏకదిష్ట ప్రమేయం;
monotonous, adj. ఏకస్వన; ఏకరూప; ఒకే విధంగా ఉండడం వల్ల విసుగు పుట్టించెడు;
monotony, n. ఏకరూపత; ఏకస్వరత; విసుగు;
monotype, n. అక్షరాల కూర్పు; పాత రోజులలో అచ్చు వేసే పద్ధతి; (rel.) linotype;
monsoon, n. (1) వర్షాకాలం; వర్షరుతువు; (2) రుతుపవనాలు;
monsoon winds, ph. రుతుపవనాలు;
month, n. నెల; మాసం;
anomalistic month, ph. 27.55455 రోజులు; చంద్రుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చేస్తూన్నపుడు ఒక సమీప బిందువు నుండి, అదే సమీప బిందువుకి చేరుకోవడానికి పట్టే కాలం;
draconic month, ph. 27.21200 రోజులు;
excalary month, ph. లుప్తమాసం; క్షయమాసం;
intercalary month, ph. అధికమాసం;
last month, ph. పోయిన నెల; గత మాసం;
nodical month, ph. 27.21200 రోజులు;
per month, ph. నెలకి; నెలసరి; నెల ఒక్కంటికి; మాసానికి;
sidereal month, 27.32166 రోజులు; దూరంగా ఉన్న నక్షత్రాల నేపథ్యంలో చంద్రుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడానికి పట్టే కాలం;
supernumerary month, ph. అధిక మాసం,
synodic month, ph. 29.530588 రోజులు; అమావాస్యనుండి అమావాస్య వరకు ఉన్న కాలం;
month by month, ph. నెల నెలా;
monthly, adj. నెలవారీ; నెలసరి; నెల ఒక్కంటికి;
monthly, n. మాసపత్రిక;
monument, n. స్మారకం; స్మారక భవంతి; స్మారక కట్టడం;
mood, n. మనస్సు; మనస్థితి; మనోభావం; మనోదశ; మానసికావస్థ; భావావేశం;
blue moon, ph. రాకా చంద్రుడు; చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష్యలో ఒక్కోసారి ఒకే నెలలో రెండు పూర్ణిమలు వస్తాయి. అందులో రెండవదానిని "రాకా పూర్ణిమ" అంటారు;
full moon, ph. పూర్ణచంద్రుడు; రాకాచంద్రుడు; నిండు చంద్రుడు;
half moon, ph. అర్థచంద్రుడు;
new moon, ph. అమావాస్య; అమావాస్య తిధిలో చంద్రుడు పూర్తిగా సూర్యమండలాన్వర్తియై - అనగా ఆసాంతము సూర్యుని పరిధిలోనికి వెళ్లకుండా - ఒక దారపుపోగంత చంద్రకళ సూర్యోదయాని కంటే ముందుగా కన్పడినపుడు దానినే "సినీవాలీ " అమావాస్య అంటారు; సిద్ధాంత పరంగా నైతే కృష్ణ చతుర్దశి తో కూడిన అమావాస్యే "సినీవాలీ" అమావాస్య;
once in a blue moon, ph. ఏటికో, కోటికో, యుగానికో ఒకసారి;
morbidity, n. అనారోగ్యం; రోగగ్రస్తం; అనారోగ్యానికి కారణం;
more, adj. మరిన్ని; మరికొంచెం; ఇంకా; హెచ్చుగా;
more or less ph. ఇంచుమించుగా; దాదాపు; ఉరమరగా; దరిదాపుగా;
mordant, n. వర్ణబంధకి; వర్ణలగ్ని; వర్ణస్థాపకి; color binder;
moreover, adv. పైపెచ్చు; పైగా; అంతే కాకుండా;
morning, n. ఉదయం; ప్రొద్దు; ప్రభాతం; వరువాత; వేఁకువ; ప్రాతఃకాలం; దివాది;
early morning, ph. వేఁకువ; ప్రభాతం; తెల్లవారుజాము;
good morning, ph. శుభోదయం; సుప్రభాతం;
morning sickness, ph. వేవిళ్లు;
moron, n. మొద్దు; మొద్దావతారం; పశుప్రాయుడు;
morph, n. రూపం; పదాంశం;
morphemes, n. pl. [ling.] పదాంశాలు; ఒక్క మాటలో అర్థవంతమైన కనిష్ఠాంశాలు; ఉ. చురుకుతనం అనే మాటలో "చురుకు" "తనం" అనే రెండు పదాంశాలు ఉన్నాయి;
bound morpheme, ph. నిబద్ధ రూపం; విసంధి లేని మాటలు; ఉదా. ఇంగ్లీషులో inept ని in, ept అని విడదీసి అర్థాలు చెప్పలేము; తెలుగులో చెలులు అన్న మాటని చెలు, లు అని విడదీయలేము;
morphine, n. అభిని; నొప్పిని తగ్గించే ఒక బలమైన మందు;
morphology, n. రూపనిర్మాణ శాస్త్రం; రూపనిర్మాణం; స్వరూప శాస్త్రం;
mortal, adj. మరణించేది; మరణం కలిగించేది;
mortal, n. మర్త్యుడు; మరణించే స్వభావం కలవాళ్ళు అని వ్యుత్పత్తి;
mortgage loan, ph. ఆయకం; గృహార్ణ; ఇల్లు కొనడానికి చేసే అప్పు;
mortician, n. శవసంరక్షకుడు; కాటికాపరి;
mortise, n. కుసి బెజ్జం; వడ్రంగంలో రెండు కర్రలని అతకడానికి ఒక కర్రలో పెట్టే బెజ్జం; రెండవ కర్రకి ఉండే ముక్కుని కుసి అంటారు;
morsel, n. ముద్ద; కబళం; కరుడు; పిడచ;
mosque, n. మసీదు;
mosquito, n. దోమ; చీకటీగ; దంశము; మశకము;
mosquito net, ph. దోమతెర;
most, adj. గరిష్థ;
moss, n. నాచు; పాకుడు; పాచి; శైవాలం; green slime floating in dirty water;
mote, n. నలుసు; త్రసరేణువు; చూరు చోంచి వచ్చే కిరణవారంలో తేలియాడుతూ కనిపించే దుమ్ము రేణువు;
motel, n. (మొటేల్) కార్లలో ప్రయాణం చేసే ప్రయాణీకుల సౌకర్యం కొరకు కట్టిన హొటేల్; motor + hotel;
moth, n. చిమ్మెట; చిల్లక; శలభం; వడ్లచిలుక; బట్టలను తినే పురుగు; ఇవి రాత్రించరులు; Lepidoptera జాతికి చెందిన పరుపు రెక్కల పురుగు; see also butterfly;
hawk moths, ph. ఆరు అంగుళాల వరకు పరిమాణం కలిగి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఎగురగలవు. పూదేనియ కోసం మూగే హమ్మింగ్ బర్డ్స్ (Hummingbirds) లాగే ఈ హాక్ మాత్స్ కూడా తరచుగా పూలచెట్ల వద్దనే కనిపిస్తాయి;
vampire moth, ph. మరో రకం వడ్లచిలుకలు తమ ముల్లువంటి పదునైన తొండాన్ని మనుషులు, పశువుల చర్మం మీద గుచ్చి రక్తం తాగుతాయి. ఈ రక్తపిపాసి మాత్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి;
mother, adj. తల్లి; మాతృ;
mother board, ph. మాతృ ఫలకం; కంప్యూటర్ లోపల ఉండే ప్రాథమిక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్; మదర్‌బోర్డులు చిప్స్, మెమరీ స్లాట్‌లు, ఫర్మ్‌వేర్ చిప్స్ మరియు పవర్ కనెక్టర్ కోసం సాకెట్‌లను కలిగి ఉంటాయి.
mother cell, ph. తల్లి మాతృ;
mother planet, ph. మాతృగోళం; మాతృగ్రహం;
mother tongue, ph. మాతృభాష; తల్లిబాస;
mother, n. అమ్మ; అంబ; తల్లి; మాత; జనని; జనయిత్రి; ధాత్రి; తాయి;
adoptive mother, ph. పెంపుడు తల్లి; పెంచుకున్న తల్లి;
birth mother, ph. జనక తల్లి; కన్న తల్లి;
step mother, ph. సవతి తల్లి; మారటి తల్లి;
mother-in-law, n. అత్తగారు; భార్య తల్లి; భర్త తల్లి;
mother-of-pearl, n. ముత్యపు చిప్ప; ఆలిచిప్ప; ముత్యపు చిప్పలో ఉండే పొర;
mothers-in-law, n. pl. అత్తలు;
motherhood, n. మాతృత్వం;
motherland, n. మాతృభూమి;
motif, n. పదే పదే ప్రత్యక్షమయే ప్రసక్తి; కళాత్మక రచనలో ప్రధాన ఆంశం;
retrograde motion, ph. వక్రగతి; పశ్చగమనం; గ్రహచేష్ట; గ్రహం వెనక్కి నడచినట్లు కనబడడం;
motion picture, ph. చలన చిత్రం; సినిమా;
motionless, adj. నిశ్చల;
motivate, v. i. అభిముఖీకరించు; అంగీకరించునట్లు చేయు; ప్రేరేపించు;
motivation, n. ప్రచోదనం; ప్రేరణ; ప్రేరణకారణం;
motive, n. ప్రేరణ; ప్రేరణకారణం; ఉద్దేశము; నిమిత్తము;
motor, adj. చలన; చాలక; గతివాహక; జంగమ;
motor nerves, ph. చలన నాడులు; చాలక నాడులు;
motor strip, ph. చలనచార; మెదడులో ఈ చెవి వద్దనుండి ఆ చెవి వరకు ఉన్న మేర;
motor, n. చాలకం;
electrical motor, ph. విద్యుచ్చాలకం; విద్యుత్ చాలకం;
mechanical or manual motor, ph. చేచాలకం; కైచాలకం; మానవచాలకం;
hydro motor, ph. జలచాలకం; వాశ్చాలకం;
mottle, n. డాగు; మచ్చ; మరక;
mount, n. (1) శిఖరం; (2) వాహనం;
mound, n. తిప్ప; దిబ్బ; గుట్ట;
mount, n. వాహనం; తత్తడి; సవారీ చెయ్యడానికి అనువైన సాధనం;
mount, v. t. (1) ఎక్కు; సవారీ చేయు; (2) తొక్కు; పొర్లు;
mountain, n. పర్వతం; నగం; గిరి; అద్రి; కొండ; చట్టు; traditionally a hill is not considered to be a mountain if the summit is under 1,000 feet; If a hill eventually becomes tall enough to be generally classified as a mountain, it must be located on shifting fault lines that cause an increase in size. For example, the Himalayas once used to be small hills that grew — over millions of years — into the tallest mountain range on Earth, thanks to ongoing collisions between two large tectonic plates. Conversely, mountains can become hills after millions of years of erosion causing them to shrink.
Mountain peak, ph. పర్వత శిఖరం; నగ శృంగం;
mourn, v. i. దురపిల్లు;
mouse, n. చుంచు; చుంచెలుక; చిట్టెలుక; అంజలిక; గిరిక; ఆఖువు;
field mouse, ph. కల్లెలుక;
mouth, n. నోరు; మూతి; వాయి;
movable, adj. చర; జంగమాత్మక;
movable property, ph. చరాస్తి;
move, n. (1) ఎత్తు; ఆటలో ఒక ఎత్తు; (2) బదిలీ;
move, v. i. (1) జరుగు; (2) కదులు; మెదులు; అదురు; చలించు; (3) తిరుగు; మసలు; చెరలాడు; త్రిమ్మరు; క్రుమ్మరు;
women's liberation movement, ph. స్త్రీ విమోచన ఉద్యమం;
movie, n. చలనచిత్రం; తెరాట;
moving, adj. కదులుచున్న; ఉచ్చల;
mrigal, n. ఎర్రమీసు; ఎరమీను; ఒక రకం చేప;
mowing, n. లవనము; గడ్డిని కోయడం;
mucilage, n. తెమడ; క్లేదము; జిగురు;
mucus, n. అమత్వక్కు నుండి స్రవించే ద్రవం; ఇది శ్లేష్మం, కఫం, కళ్లె, చీమిడి, ఏదయినా కావచ్చు; see also phlegm;
mucus membrane, ph. అమత్వక్కు;
mud, n. బురద; బెందడి; పంకము; అడుసు; ఉబ్బలి;
muddy, adj. బురద; పంకిలము;
muddy-up, adj. కెలుకు; బురద చేయు; పంకిల పరచు;
mud minnow, n. మట్టగిడస; ఒక జాతి చేప;
muffle, v. t. నొక్కు; అణచివేయు;
mug, v. t. మీదపడి కొట్టు;
mug, n. పాన పాత్ర; చేతితో పట్టుకోడానికి చెవి ఉన్న పాత్ర; ఒక రకం కప్పు;
muggy, adj. ఉక్కగా ఉన్న; ఉమ్మదముగా ఉన్న; వాతావరణంలో వేడి, చెమ్మదనం ఉన్నప్పుడు అసౌకర్యంగా ఉండే అనుభూతి;
mujahideen, n. (ముజహిదీన్) విశ్వాసులు అవిశ్వాసులపై జరిపే మత యుద్ధాన్ని అరబ్బీ భాషలో 'జిహాద్ ' అంటారు. ఈ యుద్ధంలో పాల్గొనే యోధుడిని 'ముజాహిద్' అంటారు; బహువచనంలో ముజహిదీన్;
mule, n. కంచర గాడిద; వేసడం; వేష్ట్రం;
Mulligatawny, n. మిరియాల చారు; మిలగు రసం; (ety.) మిళగు = మిరియాలు, తన్నీ = నీరు; This is the name given by the British;
multi, pref. బహు;
multidimensional, adj. బహుప్రమాణ;
multifaceted, adj. విశ్వతోముఖ; బహుముఖ; బహుముఖీన;
multilingual, adj. బహుభాషా;
multilingual center, ph. బహుభాషా కేంద్రం;
multilingualism, n. బహుభాషితం;
multimedia, n. pl. బహుళ మాధ్యమాలు;
multinationals, n. pl. బహుళజాతి కంపెనీలు;
multiple choice, adj. ph. బహూత్తర; బహుళైచ్చిక;
multiplex, adj. బహుముఖ;
multiplexer, n. బహుముఖి; ఒక వాకేతాన్ని అనేక దిశలలో పంపిణీ చేసే యంత్ర సాధనం;
musical notes, ph. స్వరములు; భారతీయ సంగీతంలో స, రి, గ, మ, ప, ద, ని అనే 7 స్వరములు వాడతారు. పాశ్చాత్య సంగీతంలో అదే వ్యవధిలో 12 స్వరములు వాడతారు; స, రి, రి, గ, గ, మ, ప, ప, ద, ద, ని, ని అని వాడతారు;
musical instruments, ph. వాద్యములు;
musical score, ph. స్వరకల్పన;
musical, n. సంగీత నాటకం; యక్షగానం;
musician, n. పాటకుడు; గాయకుడు, గాయని, సంగీత వేత్త/శాస్త్రజ్ఞుడు; భాగవతార్;
musings, n. ఊహాగానాలు;
musk, n. కస్తూరి; మృగనాభి; కురంగనాభం; ఇఱ్ఱి గోరజం; హరిణమదం; ఒక జాతి లేడి పొట్ట దగ్గర ఉండే తిత్తులలో దొరికే ఎరుపు రంగు బంక లాంటి పదార్థం; దీన్ని సుగంధ అత్తరుల తయారీలో వాడతారు;
musk deer, n. కస్తూరి మృగం; కుచ్చుల మెకం; కస్తూరి కురంగం; ఇఱ్ఱి;
muskrat, n. కంపెలుక; చుచ్చుందరం;
muslin, adj. ఉలిపిరి;
muslin cloth, ph. ఉలిపిరి బట్ట; పలుచని బట్ట;
mustache, n. మీసం; శ్మశ్రువు;
wearing a mustache, ph. మీస ధారణ;
mustard, n. ఆవాలు;
black mustard, ph. నల్ల ఆవాలు; [bot.] Brassica nigra;
Indian mustard, ph. ఎర్ర ఆవాలు; [bot.] Brassica juncea;
white mustard, ph. తెల్ల ఆవాలు; కదంబకం; [bot.] Brassica alba;
muster, n. పనివాళ్ల పేర్ల జాబితా;
musty, adj. గవులు కంపు; ముక్క వాసన; గుహల వాసన;
mutability, n. మార్పు; మారే తత్త్వం;
mutatis mutandis, ph. వివరములలో తగిన మార్పులతో; ఉదా: "what is true of undergraduate teaching in England is equally true, mutatis mutandis, of American graduate schools"
mutagen, n. ఉత్పరివర్తకం;
mutation, n. ఉత్పరివర్తన; యాధృచ్ఛిక పరివర్తన; మార్పు;
dominant mutation, ph. ప్రబల ఉత్పరివర్తన;
recessive mutation, ph. మసక ఉత్పరివర్తన;
mutilation, n. వైకల్యం; వికలత్వం; వికలత;
mutiny, n. తిరుగుబాటు;
muttering, n. గొణుగుడు; సణుగుడు;
mutton, n. మేకమాంసం; గొర్రె మాంసం;
mutual, adj. పరస్పర; పారస్పర్య; అన్యోన్య; ఉభయ;
mutual agreement, ph. పరస్పర అంగీకారం; ఒకరితో మరొకరు అంగీకరించడం;
mystic, n. m. తాంత్రికుడు; ఆధ్యాత్మికుడు; మార్మికుడు;
mystique, n. (మిస్టీక్)(1) కొందరి వ్యక్తుల చుట్టూ ఉండే భయ-భక్త వాతావరణం; (2) కొన్ని కార్యక్రమాలచుట్టూ ఉండే రహశ్య వాతావరణం;
mystical, adj. ఆధ్యాత్మిక; తాంత్రిక; దురవగాహమైన; సులభంగా ఆకళింకు లొంగని;
myth, n. (1) సత్యదూరం; బూటకం; కల్పిత గాథ; పుక్కిటి పురాణం; (2) పురాణము; పురాణ కథ; నిజంగా జరిగేయా, లేదా అనే వివేచన లేకుండా తరతరాలుగా చెల్లుబాటు అవుతూ వస్తూన్న వీర గాథలు; ఇటువంటి కథలలో మానవులు, దేవుళ్ళు, వింత జంతువులు కూడ కనబడుతూ ఉంటాయి;
mythological, adj. పౌరాణిక;
mythology, n. పౌరాణిక కథ; పురాణ గాథా సర్వస్వం; పురాణం;
మూలం
V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2