- jamboree, n. మహానాడు; తిరుణాలు;
- jack, n. (1) పనస; (2) జాకీ; పేకముక్కలలో ఒకటి; (3) బండి యొక్క ఇరుసును పైకెత్తు సాధనం;
- jack of hearts, ph. ఆఠీను జాకీ;
- jackfruit, n. పనస పండు;
- jackal, n. గుంటనక్క; కొంకనక్క; వరడు;
- jackass, n. మగ గాడిద; మూఢుడు;
- jacket, n. రవిక; చోళకం; చోళీ; తొడుగు; కంచుకం; కంచెల; కుప్పసం; పేరణం; చట్టి;
- jade, n. పచ్చ; see also emerald;
- jagged, adj. రంపపు పళ్ళ వలె ఉన్న;
- jaggery, n. బెల్లం; గుడం; గడోలం; చెరకడం; ద్రుపజం; అమృతరశాజం;
- jaguar, n. దక్షిణ అమెరికాలో నివసించే చిరుతపులి;
- jail, n. ఖైదు; కారాగారం; చెరసాల; జైలు;
- jailer, n. కారాగారపు అధికారి; చెరసాలని నడిపే అధికారి;
- jam, n. (1) తాండ్ర; మురబ్బా; a fruit preserve; Jam is more fruity than jelly and it involves slight crushing or jamming of pieces of fruit; (2) ముంజె, ద్రవమునుగాక గట్టియునుగాక కొంచెము జిగటగానుండు పదార్థము; (note) an Indian word corrupted from Telugu; (ety. ) జిల్లిరాళ్లు = pebbles; see also jelly; (3) ఇరకాటం; నొక్కుడు; దిగ్బంధం;
- traffic jam, ph. ఇరకాటంలో చిక్కుకున్న వాహనాలు;
- jam, v. t. అడ్డగించు; నొక్కు; బంధించు;
- jamboree, n. మహానాడు; పెద్ద సభ; సమారోహం; తిరణాలు;
- janitor, n. ఊడిగాడు; భవనాలని లోపల శుభ్రం చేసే వ్యక్తి;
- jar, n. జాడీ; జారీ; కూజా;
- jargon, n. పరిభాష; ఏదైనా ఒక శాస్త్రంలో ఒక మాటని ఒకే ఒక అర్థంతోనే వాడుకోవాలని నిర్ణయించగా తయారైన భాష;
- jasmine, n. మల్లె;
- jasper, n. సూర్యకాంతం; పచ్చరాయి; క్వార్జ్ జాతి పొడి;
- jaundice, n. పచ్చకామెర్లు;
- javelin, n. శలాకం; బల్లెకోల; ఈటె;
- jaw, n. దవుడ;
- jawbreaker, n. (1) నమలడానికి కష్టమైన పదార్థం; (2) ఉచ్చరించడానికి కఠినమైన మాట;
- jay, n. పాలపిట్ట;
- jealous, adj. ఈర్ష్యపడే; అసూయపడే;
---Usage Note: jealous, envious
- ---If someone is jealous, s/he feels angry or unhappy because s/he cannot have something that others have: Kavitha is jealous of her sister's success. If someone is envious, s/he wants to have qualities or things that someone has: Linda was envious of Radha's new home; envy is an active expression of jealousy;
|
- jealousy, n. ఈర్ష్య; అసూయ; మాత్సర్యం; ఓర్వలేనితనం; ఎరుసు; కాంతాళం;
- jeer, v. t. వెక్కిరించు; కూతలు కూస్తూ వెక్కిరించు;
- jelly, n. జిల్లిక; జిగిలి; జల్లిక; జల్లి; తాండ్ర; శ్లేషి; పాకం పట్టిన పండ్లరసం; jelly is smooth in texture; the elastic or gel like consistency is how the name is derived from;
- jellyfish, n. నీటికాయ; ఒక రకం జలచరం;
- jeopardy, n. అపాయం; ప్రమాదం;
- jerk, v. t. కుదుపు; తటాలున ఈడ్చు;
- jest, v. i. నవ్వులాటలాడు; సరదాకి కొంటె పని చేయు; ఆగడం చేయు;
- jest, n. ఆగడం;
- jester, n. విదూషకుడు; హాస్యగాడు;
- jet, adj. (1) ధారా; ధారగా; (2) నల్లటి;
- jet black, ph. నల్లటి నలుపు; కారు నలుపు;
- jet propulsion, ph. ధారా చాలనం; ఇంధనం మంటతో బాగా వ్యాకోచం చెందిన గాలిని వెనకకి తోస్తూ బండిని ముందుకు నడిపే పద్ధతి;
- jet, n. ధార;
- jewel, n. నగ; ఆభరణం; మణి; రత్నం;
- jeweler, n. (1) నగలు అమ్మే వ్యక్తి; జవాహర్ వాలా; (2) కంసాలి; అగసాలె; బంగారం పని చేసే కంసాలి;
- jewelry, jewellery (Br.) n. నగలు; జవాహరీ;
- jewelry store, ph. నగల కొట్టు; జవాహర్ ఖానా;
- jihad, n. (జిహాద్) విశ్వాసులు అవిశ్వాసులపై జరిపే మత యుద్ధాన్ని అరబ్బీ భాషలో 'జిహాద్ ' అంటారు. ఈ యుద్ధంలో పాల్గొనే యోధుడిని 'ముజాహిద్' అంటారు; మౌలిక ముస్లింలలో మతం కోసం ఏంచేసినా తప్పులేదనే అభిప్రాయం ఉంది. మతేతరులంతా ముస్లిం మౌలికవాదుల దృష్టిలో కాఫిర్లు. సాతాను ప్రభావంలో ఉన్న తమ మతస్థులను కాపాడుకోవడం మాత్రమేకాదు. సాతాను ప్రభావంలో ఉన్న మతేతరులను నిర్మూలించడం ఇస్లాం మౌలికవాదులు తమ పవిత్ర కర్తవ్యంగా భావించి అందుకు మతయుద్ధం చేయడం తప్పనిసరి అని భావిస్తారు. అందుకే వారు మతం విషయంలో సహనం తక్కువగా ఉన్న వారిగా పేరొందారు;
- jinx, n. అచ్చిరాని మనిషి లేక వస్తువు; అపశకునం; అపశకునపక్షి;
- job, n. (1) ఉద్యోగం; (2) పని;
---Usage Note: job, work, occupation, profession, trade, career, position
- ---Use work as a general word to talk about what you do every day in order to earn money: I have to go to work. Your job is the particular type of work that you do: Lila got a job as a stewardess. Occupation is a formal word for job. Position is the formal word used when a job is advertised. A trade is a skilled job you do with your hands. A career is a professional job that you do for most of your life. A profession is a career for which you need a lot of training.
|
- jog, v. i. వ్యాయామం కొరకు నెమ్మదిగా పరుగెత్తు;
- join, v. i. చేరు; అంటుకొను; కలుసుకొను; కూడు; జతగూడు; కవయు; కవగొను;
- join, v. t. చేర్చు; కలుపు; లకించు; తగిలించు; జోడించు; జతగూర్చు; సంధించు; అంటించు; జమిలించు; జమాయించు;
- joining, n. చేరడం; సంధానం;
- joint, adj. ఉమ్మడి; పొత్తు; సంయుక్త; సమష్టి; తొల్లుగడ;
- joint business, ph. ఉమ్మడి వ్యాపారం;
- joint cultivation, ph. పొత్తు సేద్యం;
- joint family, ph. సమష్టి కుటుంబం; ఉమ్మడి కుటుంబం:
- joint, n. (1) కీలు; అస్థి సంధి; బంధు; సంధికర్మ; గణుపు; (2) స్థలం; ప్రదేశం;
- ball and socket joint, ph. బంతిగిన్నె కీలు; ఉలూఖల సంధి;
- carpenter's joint, ph. బందు; సంధికర్మ;
- folding joint, ph. మడతబందు కీలు;
- gliding joint, ph. జారెడి కీలు;
- hinged joint, ph. మడతబందు కీలు;
- pivot joint, ph. బొంగరపు కీలు;
- jointly, adv. జతగా; కలసి;
- joints, n. కీళ్లు; సంధులు;
- maxillary joints, ph. అంకీళ్ళు; అంగిలి కీళ్ళు;
- joist, n. దూలం;
- joke, n. హాస్యోక్తి; సయ్యాట; వేళాకోళం; పరిహాసం; పరాచకం; ఛలోక్తి; చమత్కారం; చమత్కార బాణం; ఆగడం; ఉపహాసం; ఉక్కిదం; హాస్యవాదం;
- practical joke, ph. క్రియాత్మక పరిహాసం;
- joke, v. t. సయ్యాటించు; పరిహసించు;
- jokes and riddles, ph. పరిహాసాలు, పొడుపు కథలు;
- jolt, n. కుదుపు; ఘాతం;
- jolt of electricity, ph. విద్యుత్ ఘాతం;
- journal, n. (1) పత్రిక; (2) చిట్టా; (3) దినచర్య రాసిన పుస్తకం;
- journalist, n. పత్రికా రచయిత; పత్రికా విలేఖరి; m. పాత్రికేయుడు;
- journalists, n. పాత్రికేయులు; పత్రికా రచయితలు; పత్రికా విలేఖరులు;
- journey, n. ప్రయాణం; పయనం; పైనం; యాత్ర; యానం; ప్రస్థానం;
- great journey, ph. మహాప్రస్థానం;
- return journey, ph. తిరుగు ప్రయాణం; ప్రతియానం;
- joy, n. ఆనందం; సంతోషం;
- jubilant, adj. ప్రఫుల్ల; ఉల్లాసప్రద; అత్యధిక సంతోషమును చూపే మనోస్థితితో;
- jubilee, n. వార్షికోత్సవం; ఉత్సవం;
- golden jubilee, ph. 50వ వార్షికోత్సవం; సువర్ణోత్సవం;
- silver jubilee, ph. 25వ వార్షికోత్సవం; రజతోత్సవం;
- judge, n. న్యాయమూర్తి; నిర్ణేత; న్యాయనిర్ణేత; తగవరి; తీర్పరి; జడ్జి; see also arbitrator;
- judge, v. t. న్యాయవిచారణచేయు; తీర్పుచెప్పు;
- judgment, judgement (Br.), n. తీర్పు; తీర్మానం; అభిప్రాయం; జడ్జిమెంటు;
- judicious, adj. తగిన; వివేకవంతమైన;
- jug, n. కూజా; ద్రవ పదార్ధాలు పోసుకుందుకి చిన్న మూతి, చేత్తో పట్టుకుందుకి హస్తకం ఉన్న లోతైన బిందె వంటి పాత్ర;
- juggler, n. గారడీవాడు; దొమ్మరి;
- jugglery, n. గారడీ; ఇంద్రజాలం; కనుకట్టు;
- jugular, adj. మెడకి సంబంధించిన;
- jugular artery, ph. గళ ధమని;
- jugular vein, ph. గళ సిర;
- juice, n. రసం; ద్రవం; పసరు; సారం;
- juice of fruits, ph. రసం;
- juice of leaves, ph. పసరు; అసరు;
- intestinal juice, క్లోమరసం; స్వాదురసం;
- salivary juice, లాలాజలం;
- juicy, adj. పసందైన; రసవంతమైన;
- julep, n. పానకం;
- julienne, adj. సన్నగా, కోలగా తరగబడ్డ;
- jumbo, adj. బృహత్; మహాత్; పెద్ద; చాలా పెద్ద; ఏనుగంత పెద్ద;
- jumbo, n. (1) ఏనుగు; (2) పెద్దది;
- jumble, v. t. కలగాపులగం చేయు;
- jumbled, adj. జమిలి; కలగాపులగం చేయబడ్డ;
- jumbled, n. కారాకూరం;
- jump, v. i. ఉరుకు; దుముకు; దూకు; దాటు; గెంతు; కుప్పించు; జవుకళించు;
- jump down, ph. దూకు;
- jump up, ph. ఎగురు;
- jumping from topic to topic, ph. శాఖాచంక్రమణం;
- junction, n. మొగ; సంధి; కూడలి; సంగమం; సంగం;
- juncture, n. సందర్భం; అవకాశం;
- jungle, n. అడవి; జాంగలం;
- junior, adj. చిన్న; కింద;
- junior wife, ph. చిన్న భార్య;
- junior officer, ph. కింద ఉద్యోగి; చిన్న ఉద్యోగి;
- junior, n. (1) తండ్రి పేరు పెట్టుకున్న కొడుకు; (2) నాలుగేళ్లపాటు కొనసాగే విద్యార్థి దశలో మూడవ ఏటి విద్యార్థి;
- junk, n. పనికిరాని వస్తువులు; చెత్త;
- junk food, ph. చెత్త తిండి; పోషక విలువ లేని తిండి;
- junk yard, ph. చెత్తల దొడ్డి;
- Jupiter, n. (1) శుక్రగ్రహం; రోమనుల పురాణాలలో రాజు; (2) గురుడు; బృహస్పతి; ఈ రెండు మాటలకీ ఎంతో పెద్ద అనే వాచ్యార్థం;
- jurisdiction, n. పరిధి; అధికార పరిధి; ఇలాకా; చట్టసమ్మతమైన పరిధి; అధికార మండలం; అజమాయిషీ; హయాం;
- jurisprudence, n. న్యాయశాస్త్రం; న్యాయశీలం; న్యాయశీలత; ధర్మశాస్త్రం; న్యాయమీమాంస;
- jury, n. ప్రమాణగణం; జూరీ;
- just, adj. (1) సమర్ధించదగిన; న్యాయమైన; (2) సరియైన;
- just about, ph. సుమారుగా;
- just this, ph. ఇదొక్కటే;
---Usage Note: just, already, yet
- ---In formal or written English, you must use these words with the present perfect tense: I have already seen him; The bell has just rung; Have you eaten yet? However, in informal speech, we often use them with simple past tense: I already saw him; the bell just rang; did you eat yet?
|
- justice, n. (1) న్యాయం; ధర్మం; ధర్మబలం; పాడి; (2) న్యాయమూర్తి;
- justifiable, adj. సమర్ధనీయ;
- justification, n. సమర్ధన;
- justify, v. t. సమర్ధించు;
- jut, v. i. ముందుకి పొడుచుకొని వచ్చు;
- jute, n. జనుము; ఈ మాట జట అనే సంస్కృత పదం నుండి పుట్టింది; (ety.) this word is derived from the Sanskrit word Jata which means a braid of hair. The Hindu word Juta, which means shoes, probably has the same root suggesting that the earliest shoes were nothing but hairy skins of animals;
- jute fiber, ph. జనుప నార;
- juvenile, adj. తరుణ; బాల;
- juvenile offenders, ph. తరుణాపరాధులు; నేరము చేసిన పిల్లలు; బాల నేరస్థులు;
- juxtapose, v. t. పక్కపక్కని పెట్టు;
|
|